ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన!
స్వరూపం
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన! రాగం: భైరవి తాళం: ఆది పల్లవి: ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన! ॥ఉప॥ అను పల్లవి: చపల కోటి నిభాంబరధర! శ్రీ జానకీపతి! దయజేసి నా ॥దుప॥ చరణము(లు) కపట నాటక సూత్ర ధారివై కామిత ఫలము లొసఁగెడు రామ అపరిమిత నవరత్నము ల్బొదిగిన యపరంజి గొడుగు నీకే తగునయ్య ॥ఉప॥ మెరుగు తీగలరీతిని మెరసెడు తఱకు బంగారు కాఁడ లమరిన శరదిందు ద్యుతి సమానమౌ చా మర యుగములు నీకే తగునయ్య ॥ఉప॥ జాజులు సంపంగులు మరువపు విర జాజులు కురువేరు వాసనలను వి రాజ మానమగు వ్యజనము త్యాగ రాజ వినుత! నీకే తగునయ్య ॥ఉప॥