ఈ వరకు జూచినది చాలదా? ఇంక నా రీతియా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

ఈ వరకు జూచినది చాలదా? ఇంక నా రీతియా? 
రాగం: శంకరాభరణం
తాళం: ఆది

పల్లవి:
ఈ వరకు జూచినది చాలదా? ఇంక నా రీతియా? ॥ఈవరకు॥

అను పల్లవి:
పావనము సేయు శక్తి కణగని
పాపము గలదా కరివదన న ॥నీవరకు॥

చరణము(లు)
శ్రీశరణా శుగాశన శయన ప
రేశ నీ పద సుశేశ యార్చనము
నేసేయక దురాశ చే భవపాశ
బద్ధుఁడై గాసి తాళని న ॥న్నీవరకు॥

పరలోక భయ విరహితులై న
నరులు నాదుపై మఱి యసూయల
బఱచిన బాధలు తరముగాక నీ
చరణ యుగములను శరణొందిన న ॥న్నీవరకు॥

నాగాశన సదాగమన ఘృణా
సాగర నిన్ను వినా యెవరు నీ
వే గతియని వేవేగ మొఱలనిడు
త్యాగరాజుని రాగరహిత నీ ॥నీవరకు॥