ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా 
రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది

పల్లవి:
ఇది నీకు మేరగాదుర శ్రీరామ! నా - మది తల్లడిల్లెనురా ॥ఇది॥
అను పల్లవి:
పదిలముగఁ గొల్చిన - భావము వేరై యున్నది ॥ఇది॥

చరణము(లు)
గతి లేనివారినిఁ గడతేర్చు దైవమని
పతితపావన! నమ్మితి; శ్రీరామ!
న్నతి వేగమున వేడితి; సంతతము స
మ్మతిని నిన్నే కోరితి; శ్రీరామ! ॥ఇది॥

పరమ దయాళువని, పాలన సేతువని
సరగున, దేవరాయ! గొల్చిన నాపైఁ
గరుణ లేదని కన్నీరాయె, జూచి నీ మనసు
గరఁగ దెందుకురా? ఓ శ్రీరామ! ॥ఇది॥

అన్నిట నిండవే, అద్భుతానందఘన!
మన్నన సేయ రాదా? శ్రీరామ! నీ
కెన్నరాని పుణ్యము రాదా? శ్రీత్యాగరాజ
సన్నుత! నీ వాఁడను గాదా, శ్రీరామ! సీతారామ ॥ఇది॥