అళియ రామరాయలు
అళియ రామరాయలు
గ్రంథకర్త
చిలుకూరి వీరభద్రరావుగారు
ప్రకాశకుఁడు
నాళం అప్పలనరశింహము
రాజమహేంద్రవరము.
1931
సర్వస్వామ్య సంకలితము.
పీఠిక.
అళియరామరాయల జీవిత గ్రంథమును వ్రాయుటకు నన్నుఁ బురికొల్పినది "The Aravidu dynasty of Vijianagar" అని వ్రాయబడిన గ్రంథమే. ఈ గ్రంథమును బొంబయినగరములోని సెంటుక్షేవియరు కాలేజీలో చరిత్రోపాధ్యాయులుగానున్న The Rev. Henry Heras, S.J.M.A. గారాంగ్లభాషలో రచించిరి. వీరు పోర్చుగల్ దేశస్థులు. వీరు విజయనగర సామ్రాజ్యమును బరిపాలించిన యీయారవీటి వంశచరిత్రమును విజయనగర సామ్రాజ్యమునకు బ్రతిస్పర్థులుగ నుండెడు దక్కను సుల్తానుల దర్బారులలో నుండెడు విమతస్థులగు చరిత్రకారుల వ్రాతలను, వారలకు సమకాలికులై యాకాలమున వర్తకమునకై యీ దేశమునకు నేతెంచిన పోర్చుగీసు లేఖకుల వ్రాతలను, క్రైస్తవమత గురువుల వ్రాతలను నెక్కువగా నాధారపఱచుకొని రచించి యున్నారు. ఇందునకై యాంధ్రులెల్లరును గృతజ్ఞఉలై యుండవలసినదే కాని వీరు తమ చరిత్రమునందు " అళియరామరాయల " శీలపరిశీలనమున సమకాలికులగు హిందూ గ్రంథకర్తల యొక్కయు, కవులయొక్కయు వ్రాతలయందు విశ్వాసముంచక సమకాలికులుగాని తమ దేశస్థులు తమభాషలో వ్రాసిన లేఖనముల యందును, విజయనగర సామ్రాజ్యము నెడస్పర్థగలట్టియు, రామరాయల నసూయతో జూచునట్టియు విమతస్థులయిన చరిత్రకారుల లేఖనముల యందును నిర్హేతుకముగా విశ్వాసముంచి పెక్కు దురభిప్రాయములను వెలువరించియున్నారు. అళియరామరాయలజేయ పరాక్రమంబునఁ గృష్ణదేవరాయలను, అమేయబుద్ధి కౌశలమున దన్మంత్రి శేఖరుడగు తిమ్మరుసును మించిన ప్రతిభాశాలిగాని సామాన్యుడు గాడు. అట్టి మహనీయుని సచ్చీలమును చదువరులు గర్హించు విధముగా గ్రంథమంతయు వ్రాయబడినది. ఇట్టి సందర్భములందు వీరు వెల్వరించిన యభిప్రాయములు వేఱ్వేఱు ప్రదేశములయందు పరస్పర విరుద్ధములుగ నున్నవి. మరియు సత్యవిరుద్ధములు కూడనై యున్నవి. వీని సత్యమును దెలిసికొనగోరు చదువరుల కుపయోగకరముగా నుండునటుల సహేతుక విమర్శనలతో గూడిన యీ జీవిత విమర్శ గ్రంథమును వ్రాసితిని. సదాశివరాయలను 13 సంవత్సరములు కారాగృహమున నుంచి రామరాయలు పట్టాభిషిక్తుడై విజయనగర సామ్రాజ్యమును బరిపాలించిన స్వార్థపరుడని మోసగాడని తెలిపిన విధానమంతయు వట్టి నిరాధారమైన సిద్ధాంతమని యీచిన్న జీవిత గ్రంథము ఋజువు చేయుచున్నది. ఇంతకన్న నధికముగ వ్రాయుట కిష్టపడక వీని గుణదోషములను గ్రహింప జదువరులకే విడిచిపెట్టుచున్నాడను. నేనస్వస్థగానున్న కాలమున నిట్టి విమర్శ గ్రంథమును వ్రాయుటయు, నచ్చొంత్తించుటయు సంభవించినందునను, అచ్చుప్రతులను స్వయముగా దిద్దుకొనుటకు సాధ్యపడనందునను నందందు నచ్చుతప్పులు పడియున్నవి. వానిని సాధ్యమగునంత వఱకు నేర్చికూర్చి శుద్ధపత్రమున సవరించితిని. ఈ గ్రంథమును వ్రాయుటకు దోడ్పడిన గ్రంథములను పత్రికా లేఖనములను నందందు బొందుపఱచియే యున్నాను. ఏతత్గ్రంథకర్తలకును, వ్యాసలేఖనకర్తలకును నాకృతజ్ఞతావందనములను దెలుపుకొనుచున్నాడను.
- గ్రంథకర్త.
పూర్తి విషయసూచిక
[మార్చు]విషయసూచిక.
1 |
రామరాయల పూర్వులు, వీరహోమ్మాళి రాయడు, తాతపిన్నమరాజు, కొటిగంటి రాఘవరాజు, సోమదేవరాజు, రాఘవరాజు, పిన్నభూపాలుడు, ఆరవీటి బుక్కరాజు, రామరాజు, అవుకు తిమ్మరాజు, ఆదవేని కొండ్రాజు, శ్రీరంగరాజు.
54 |
కృష్ణరాయలు, రామరాయలు, అచ్యుతరాయలు, రామరాయలు, చిన్నవేంకటాద్రి పట్టాభిషేకము, సలకము తిమ్మరాజు, రామరాయలు, సలకము తిమ్మరాజు ద్రోహకృత్యములు, అళియరామరాయల దండయాత్ర, సలకము తిమ్మయ యుద్ధము, సలకము తిమ్మయ మరణము.
93 |
సదాశివరాయల పట్టాభిషేకము, వేంకటాద్రి నవాబరీదుల యుద్ధము, కళ్యాణి కలుబరగి దుర్గముల ముట్టడి, జమ్షాదు కుతుబ్షా మరణము, ఇబ్రహీము పట్టాభిషిక్తుడగుట, కలుబరిగె యుద్ధము, మఱియొక యుద్ధము, అబ్దుల్లాతో యుద్ధము, విజయనగర గోల్కొండ యుద్ధము.
156 |
రాయలగూర్చిన యపనిందలు.
180 |
విఠలుని దక్షిణదేశ దండయాత్ర, సెంటుథోముపై దండయాత్ర.
203 |
రక్షస్థ్సగిడి యుద్ధము.
226 |
రామరాయల ధర్మపరిపాలనము, దేవాలయ పోషకత్వము, విద్వాంసుల పోషకత్వము, సరిహద్దు తగవుల పరిష్కారము.
- ____________
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.