Jump to content

అళియ రామరాయలు/అనుబంధము

వికీసోర్స్ నుండి

అనుబంధము

రామరాయల బిరుదుగద్యము

జయజయ, స్వస్తి, సమస్తసద్గుణస్తోమభద్ర, రణరంగ రామభద్ర, కళ్యాణమహీపాలభాస్వర, కళ్యాణపురవరాధీశ్వర, కన్యాకుమారీభీమరథీ తటాంతనిక్షేపవిజయస్తంభ, స్తోత్రార్హయశ: ప్రక్రియాపావనచరిత్ర, ఆత్రేయగోత్రక్షత్రియకుల పవిత్ర, మహితకేళికాపారాయణ, మహితచాళుక్య నారాయణ, ధానుష్కచక్రవర్తిబిరుద, నానావర్ణమండలీకరగండ, దైత్యేభరిగండ, హత్తిబ్బరగండ, భాసురభుజాదండ, జయబిరుదురగండ, అసమశూరదగండ, హొసబిరుదురగండ, గండరగండ, ఘనీకృతమదేభకరశరజన్యలంపట, త్రిభువనబిరుదుల వెన్నుసమ్మెట, పట్టెసరాయనిజానిష్ట, ఒడయరాయనిశాభట్టశిష్ట, వర్గరాయఘన ప్రియంకర, అష్టవిగ్రాయమనోభయంకర, విజయచరిత సింహాననాభాస్వర, విజయనగరసింహాసనాధీశ్వర, యుక్తివర్గసద్యోధనపుర, గుత్తిదుర్గనిర్భేదనపుర, వాదిపురతర్కాభరణ, ఆదవేనిదుర్గాపహరణ, ఘనచండవర్గబాధక, పెనుగొండదుర్గసాధక, మంద్రగిరిదుర్గభాస్వర, చంద్రగిరిదుర్గరాజ్యాధీశ్వర, శబ్దపరిశుద్ధపాలక, ఉద్దగిరిరాజ్యపాలక, కాయదుర్గపనయబంధుర, రాయదుర్గావనధురంధర, నందనశీలకిరీటపాదక, కందనవోలుకవాట భేదక, చాటూరుఫణితినిర్వాహక, జూటూరుసమతినిర్వాహక, చండనపాటి ఖడ్గసాయక, కొండవీటి దుర్గనాయక, పుట్టపల్లిసీమాధిష్టిత ధామసాగర, రెట్టహల్లిసీమాప్రతిష్ఠితధామసాగర, సంకాదిమవీర సమాసంగిత, బంకాపురవీర రమాలింగిత, సాంద్రకీర్తినిరంతర, చంద్రగుప్తిధరాంతర, ఆచారరాజ్యా వయవచర్య, రాచూరురాజ్యహరణధుర్య, మదచండవర్గాదిదాయక, ముదుగంటిదుర్గాధినాయక, పరిభల్లుచరణభూషణ, ఓరుగల్లునగరపోషణ, విజయకరాయతసాయక, విజయాపురభయదాయక, వర్ణనాదికరక్షోపకార, సొల్లలాపురసంక్షోభకార, కల్యాదినృపకబాధక, కళ్యాణనగరసాధక, సామదానముఖ్య శీలరంజన, ఆముదానగరసాలభంజన, ధావకరమార్గవిక్రాంతిసార, దేవగిరిదుర్గసమాక్రాంతి ధీర, గౌతమీస్నానపావనాకార, కౌతుకాఖిలభూజనాధార, బలిచాపవిజన్యదాయక, హరిపురచాంచల్యకారక, ఘడితకూటతమసింహసంహనన, బెడదకోటనగరసింహసంహనన, బలికిరికూటపాకలశౌర్య, కలుబరగికోటపాటనధుర్య, నగరసమాక్రమణవిచార, నగరసమాక్రమణధీర, వరచండనిర్గతకింకర, పరచండదుర్గభయంకర, సంసదుర్గకేతుహరణ, హంసదుర్గనిబర్హణ, స్వర్ణాటవర్గ సద్గ్రంథనాసిక, కర్ణాటకబుధధన్యాసిక, జుర్నూరుభయనిర్ణాయక, నిర్నూరుసాముజసముద్రద్రునిష్ఠాదిరాయక, సామగిరిదావక, రామగిరిదుర్గప్రతిష్ఠాపక, మేదినీతలసమగ్ర సంపాదన, యాదగిరిదుర్గభేదన, శీలదండమృదుభాషణ, గోలకొండపురదూషణ, ఆయలకొండవిమత హలాహల, ఆయలకొండహరణకౌతూహల, పానుగల్లుధృతిపరాక్రమ, పానుగల్లుకృతిపరాక్రమ, పానుగంటిదుర్గపాటనధుర్య, భూనుతసాహసధుర్య, వేల్లితచండదుల్లభ, బెల్లముకొండవల్లభ, నిలయలోలగర్జితాకార, మలయకేళిమహిమాధార్య, కామసమాచారణాక్రమణ, సోమపదమానచణా క్రమణ, శావగదుర్గబాధక, మాపురిదుర్గమాధక, ఖండితసమగ్రసందాచరణ, దండితసమస్తశత్రుగణ, అక్ఖారూడరక్షానికర, మక్ఖాకోటదక్షానికర, మక్ఖాకోటశిక్షానికర, అక్ఖారూడశిక్షానికర, ఉల్లీధనిజాస్తికల్లోల జాలక, డిల్లీపురహల్లకల్లోలహాలిక, కేలీసుమందారు గతబృందాయక, గోలేరుసందేరూభయ సందాయక, కలంబవర్గ సంభాసుర, కలంబదుర్గ కంపాసుర, భూగోళరుచిరభూషణ, పైగోవనగరభీషణ, కొండపల్లిహరణ, చండకరనిభప్రతాపభరణ, వినుకొండపాలక, వినూత్నకృతనాగార్జునునికొండ సాలజాలక, అవంతీకలితపూరణ, అవంతీమదవిదారణ, కటకరాజ్యాధివర్తన, కటకరాజ్యఘటితకీర్తన, అజికరేంద్రదారుణ శాసన, రాజమహేంద్రరాజధనుశ్శాసన, బూదలభానుతిక్తాంగహరణ, యేదులభానుగుప్తాంగహరణ, దానమలకగుణసహజాపగాదిచారక, నిదానమలకమానమర్ధన, భృతరిపుదళనబంధుర, కుతుపణమల్క దళసిందుర, కరీశతరుణాకారీశగుణాభరణ, బరీదుబలల్హరణ, భుజకృతరిపుధావనావధాన, గజపతివినుతపరాక్ర మావధాన, కలికర్కశసమగ్ర స్తంభీకృతా రాతివర్గవిశాల, కవివర్గమననిర్గవర తర్కవారాశివవర్గకేళ, గిరిదుర్గ, వనదుర్గ, జలదుర్గ, స్థలదుర్గ, చతురశీతిదుర్గ సమస్తదళవిభాళ, రిపురాజగోపికాగోపాల, గాయ గోవాళ, శ్రీరంగరాజరామభూపాల, విజయీభవ, దిగ్విజయీభవ. (అందుగుల వెంకయ విరచిత నరపతి విజయము.)



సమాప్తము.