అన్యాయము సేయకురా రామ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః


అన్యాయము సేయకురా రామ (రాగం: కాపి) (తాళం : ఆది)


పల్లవి

అన్యాయము సేయకురా రామ! న

న్నన్యునిగ జూడకురా; నాయెడ, రామ! ॥అన్యాయము॥

అనుపల్లవి

ఎన్నో తప్పులు గలవారిని, రా

జన్య! నీవు బ్రోచినావు గనుకను ॥అన్యాయము॥


చరణము

జడభరతుఁడు జింక శిశువునెత్తి బడలిక దీర్చగ లేదా?

కడలిని మునిగిన గిరి కూర్మము గాపాడ లేదా?

పుడమిని పాండవ ద్రోహిని ధర్మ పుత్రుఁడు బ్రోవగ లేదా?

నడమి ప్రాయమున త్యాగరాజనుత! నా పూర్వజు బాధ దీర్ప లేదా? ॥అన్యాయము॥


anyAyamu sEyakurA, rAma (Raagam: kaapi) (Taalam: aadi)


pallavi

anyAyamu sEyakurA, rAma! nanyunigA jUDakurA; nAyeDa, rAma! (anyAyamu)

anupallavi

ennO tappulu galavArini, rAjanya! nIvu brOcinAvu ganukanu (anyAyamu)


caraNam

jaDa bharatuDu jinka ishuvu netti baDalika dIrcaga lEdA?

kaDalini muniginagirinoka kUrmamu kApaDAga lEdA?

puDaminipANDava drOhini dharmaputruDu brOvaga lEdA?

naDimi prAyamuna tyAgarAjanuta nA pUrvaju bAdha dIrpa lEnani (anyAyamu)