అడవి శాంతిశ్రీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Amsumathi by Adavi Bapuraju.pdf

అడివి బాపిరాజు రచనలు

6


♦ అడవి శాంతిశ్రీ

♦ అంశుమతి

* చారిత్రాత్మక నవలలు *
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

విజ్ఞాన భవన్, 4 - 1 - 435, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్ - 01.ADIVI BAPIRAJU RACHANALU vol - 6

ADAVI SANTHISREE, ANSUMATHI (Historical Novel)
 


ప్రచురణ నెం : 2350/255
 


ప్రతులు : 1000
 


ప్రథమ ముద్రణ : ఏప్రిల్, 2010
 


© కె. బాపిరాజు
 


వెల : రూ. 160
 ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
విజ్ఞాన భవన్, అబిడ్స్, హైదరాబాదు - 500 001.
ఫోన్ : 24744580/24735905
E-mail: visalaandhraph@yahoo.com,
www.visalandra.vcomnet.co.in
విశాలాంధ్ర బుక్ హౌస్,
అబిడ్స్ & సుల్తాన్ బజార్ - హైదరాబాదు, విజయవాడ,
అనంతపురం, విశాఖపట్నం, హన్మకొండ, గుంటూరు,
తిరుపతి, కాకినాడ, కరీంనగర్, ఒంగోలు, శ్రీకాకుళం.హెచ్చరిక: ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ, కొంతగానీ కాపీరైట్ హోల్డరు & ప్రచురణకర్తల నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా వాడుకున్నా, కాపీరైట్ చట్టరీత్యా నేరం. - ప్రచురణకర్తలు

ముద్రణ : శ్రీ కళాంజలి గ్రాఫిక్స్, హైదరాబాద్

అడివి బాపిరాజు జీవిత సువర్ణ రేఖలు

అక్టోబరు 8, 1895 : జననం (భీమవరం, ప.గో. జిల్లా)

1903 : ప్రాథమిక విద్య, కొవ్వూరు


జూన్ 5, 1915 : వివాహం, కూల్డ్రేగారి శిష్యత్వం ప్రారంభం

1917 : ఇంటర్

1920 : బి.ఎ., జాతీయ కాంగ్రెస్‌లో సభ్యత్వం

1921 : (సహాయ నిరాకరణోద్యమంలో) అరెస్టు, పుత్ర వియోగం.

1922 : సత్యాగ్రహం, అరెస్టు

1923 : చిత్రకళా విద్యార్థిగా ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రమోదకుమార ఛటోపాధ్యాయ శిష్యత్వం

1924 : "గయా కాంగ్రెస్"లో పాల్గొన్నారు

1931 : బి.ఎల్

1934 : ఆంధ్ర విశ్వకళాపరిషత్ నిర్వహించిన నవలా పోటీలో 'నారాయణరావు' నవలకు శ్రీ విశ్వనాథవారి “వేయి పడగలు”తో పాటు ప్రథమ బహుమతి

1935 : బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ పదవి

1936 : భార్య సుభద్రమ్మ గారికి అనారోగ్యం ప్రథమ పుత్రిక రాధా వసంత, గారికి పోలియో

1949 : కుమార్తెలు రాధా వసంత, ప్రేమకుమారి గార్ల వివాహం.

1950 : కనకాభిషేకం; మద్రాసు తెలుగు భాషా సమితి ఆధ్వర్యాన తయారైన తెలుగు విజ్ఞాన సర్వస్వానికి, సాహిత్యం, భాష, కళలు, విద్య మొదలైన విషయాలకు సంబంధించిన సంపుటం తయారు చేసే ఉపసంఘంలో సభ్యత్వం.

1951 : సింహళంలోని సిగిరియా గుహల్లో గల కుడ్య చిత్రాల ప్రతిరూపాల చిత్రణకై పరిశీలన యాత్ర.


సెప్టెంబరు 22, 1952 : మరణం.

జననం:8-10-1895::మరణం:22-9-1952

అడివి బాపిరాజు సృజనావైజయంతిక


నవలలు :

సాంఘిక : నారాయణరావు (1934), తుపాను (1945), కోనంగి (1946), నరుడు (1946), జాజిమల్లి (1951).

చారిత్రక : హిమబిందు (1944), గోన గన్నారెడ్డి (1945), అడవి శాంతిశ్రీ (1946),అంశుమతి (1951).

అముద్రితాలు : మధురవాణి (పూరణ : దిట్టకవి శ్యామలాదేవి), శిలారథం (అసంపూర్ణం),కైలాసేశ్వరుడు (అసంపూర్ణం).


కథా సంపుటాలు : (వాటిలో కథల సంఖ్య) అంజలి (6), తరంగిణి (7), తూలికా నృత్యం (3), భోగీర లోయ (6), రాగమాలిక (9), వింధ్యాచలం (4).

మొత్తం కథలు 41: (ఆరు సంపుటాల్లో - 35, లభ్యం అయీ అముద్రితం - 1, అసంపుటీకృతం - 1, అసంపూర్ణం - 1, రేడియో కోసం రాసింది - 1, నారాయణరావు నవలలో పాలేరు చెప్పిన కథ - 1, అలభ్యం (పంజరం అనేది) - 1).


కవితా సంపుటాలు : ప్రచురణ అయినవి : తొలకరి (1922), గోధూళి (1938), శశికళ (1954)

ప్రచురణ కానివి : అంజలి (19), చిగురుటాకులు (21), జ్యోతి (32), బాపు (43), ఆంధ్ర (51), దీపమాల (44), శిల్ప బాల (23), సుషమా చంద్రికలు (63), బాపిరాజు వచనాలు (13), గడ్డిపూల పళ్లెము (32), ఇతర గేయాలు (42) జానపద గేయాలు (27), జంగం కథలు (6).


నాటికలు : రేడియో నాటికలు : భోగీర లోయ, నారాయణరావు, శైలబాల, ఉషాసుందరి, పారిజాతం, నవోదయం, దుక్కిటెద్దులు, ఏరువాక.

ఏకాంకికలు : ఆంధ్ర సామ్రాజ్ఞి (1944), కృతి సమర్పణం (1944), బొమ్మలు (1946), గుడ్డిపిల్ల (1954 - మరణానంతర ప్రచురణ).


వ్యాసాలు : ముద్రితాలు - తెలుగు (57), ఇంగ్లీషు (3)

అముద్రితాలు - తెలుగు (8), ఇంగ్లీషు (2).

రేడియో ప్రసంగాలు : 7
పత్రికలు, సంపాదకత్వం : తెలుగు : అభినవాంధ్ర సాహిత్యం (1915 - రాజమండ్రి), మీజాన్ (1944-1947), హైదరాబాదు; ఇంగ్లీషు : త్రివేణి (మచిలీపట్నం - సబ్ ఎడిటర్)
అనువాద గ్రంథం : “నా పడమటి ప్రయాణం”
సాహిత్య లేఖలు : సుమారు 50

చిత్రకళాకేళి :

చలనచిత్ర “కళాదర్శకత్వం” : సతీ అనసూయ - ధ్రువ విజయం (1935), మీరాబాయి (1940), పల్నాటి యుద్ధం (1944).

జలవర్ణ చిత్రాలు (47), తైలవర్ణ చిత్రాలు (2), రేఖా చిత్రాలు : విశ్వనాథ సత్యనారాయణ - కిన్నెరసాని పాటలు - ముఖచిత్రం : లోపలి చిత్రాలు (4), శృంగార వీథి (1), నండూరి సుబ్బారావు - ఎంకి పాటలు (2), పత్రికలలో కథలకు : నాగరాజు (భారతి - జనవరి 1927), అతిథి దేవుడు (భారతి - మే 1927), హిమాలయరశ్మి (భారతి - జనవరి - 1937), నాగలి (భారతి), భోగీర లోయ (భారతి), తూలికానృత్యం (భారతి), పెన్సిల్ స్కెచ్లు : కడలూరు జైలులో ఉన్నప్పుడు వేసినవి, ఫిడేలు నాయుడుగారి కచ్చేరి, రామప్ప గుడిలోని "నాగినీ నృత్యం” చూసి, సాలార్జంగ్ మ్యూజియంలోని “నవాబుల హుక్కా” చూసి (ఇంకా చాలా ఉన్నాయని రాధా వసంత గారు తెలియజేస్తున్నారు).

బాపిరాజు రచనలు విషయంగా పిహెచ్.డి., ఎమ్.ఫిల్. వ్యాసాలు

డా॥ ధనిరెడ్డి విజయలక్ష్మీదేవి (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం) 1980, డా॥ వి. తిరుపతయ్య (ఉస్మానియా విశ్వవిద్యాలయం) 1982, డా॥ మన్నవ సత్యనారాయణ (నాగార్జున విశ్వవిద్యాలయం) 1984, డా॥ వి. సిమ్మన్న (ఆంధ్ర యూనివర్సిటీ) 1985, శ్రీ శెట్టి వెంకట నారాయణ (కాకతీయ విశ్వవిద్యాలయం) 1987, శ్రీమతి వి. వనజ (కాకతీయ విశ్వవిద్యాలయం) 1984, శ్రీమతి రమారాణి (కాకతీయ విశ్వవిద్యాలయం) 1986.

బాపిరాజు సంస్మరణ సంచికలు

1. కులపతి (1954): సంపాదకత్వం - శ్రీ రావులపర్తి భద్రిరాజు, 2. చుక్కాని (1962) : సంపాదకత్వం - శ్రీ కంచి వాసుదేవరావు, 3. నాదబిందు శశికళ (1985) సంపాదకత్వం - డా॥ దిట్టకవి శ్యామలాదేవి, 4. అడివి బాపిరాజు - శతవార్షిక కళా - సాహిత్య ప్రత్యేక సంచిక (1995), సంపాదకత్వం - భ.రా.గో..

* * *

మీరు చదివారా!

అడివి బాపిరాజు గారి రచనలు

7 సంపుటాల్లో...

1. మొదటి సంపుటం : నారాయణరావు (సాంఘిక నవల) రూ. 160
2. రెండవ సంపుటం : హిమబిందు (చారిత్రాత్మక నవల) రూ. 150
3. మూడవ సంపుటం : తుపాను (సాంఘిక నవల) రూ. 150
4. నాల్గవ సంపుటం : గోన గన్నారెడ్డి (చారిత్రాత్మక నవల) రూ.125
5. అయిదవ సంపుటం : కోనంగి (సాంఘిక నవల) రూ. 150
6. ఆరవ సంపుటం : అడవి శాంతిశ్రీ, అంశుమతి(చారిత్రాత్మక నవలలు) రూ.160
7. ఏడవ సంపుటం : నరుడు, జాజిమల్లి (సాంఘిక నవలలు) రూ. 100మనవి : అడివి బాపిరాజు గారి - కథా సంపుటాలు : తరంగిణి, తూలికా నృత్యం, భోగీర లోయ, వింధ్యాచలం, కవితా సంపుటాలు : అంజలి, చిగురుటాకులు, జ్యోతి, బాపు, ఆంధ్ర, దీపమాల, శిల్పబాల, సుషమా చంద్రికలు, గడ్డిపూల పళ్ళెం, గోధూళి, తొలకరి, శశికళ, జంగం కథలు, జానపద గేయాలు - ఇతర గేయాలు మాకు లభించలేదు. కావున వారి మిత్రులు, అభిమానుల వద్ద వుంటే పంపి సహకరించప్రార్ధన.

- ప్రకాశకులు
Amsumathi by Adavi Bapuraju.pdf

విషయసూచిక[మార్చు]

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2020, prior to 1 January 1960) after the death of the author.


This work is also in the public domain in the U.S.A. because it was in the public domain in India in 1996, and no copyright was registered in the U.S.A. (This is the combined effect of India's joining the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.)