సాక్షి మూడవ సంపుటం/మహాపతివ్రత
28. మహాపతివ్రత
హిమాలయ ప్రాంతాలనుంచి ఒక మహాయోగిని వస్తే-జంఘాలశాస్త్రి తనసాక్షి సంఘసభలో ప్రసంగింపజేశాడు.
ఆమె ఒక మహాపతివ్రత గురించి చెప్పడం సాగించింది.
పువ్వుల్లో గులాబిలాగ, రాళ్లలో వజ్రంలాగ, లోహాల్లో బంగారంలాగ, మగవారిలో శూరుడిలాగ, స్త్రీలలో పతివ్రత పరిగణించబడింది. ఆడది పరమేశ్వరుడి ప్రతినిధి.
ఇలా చెప్పిన ఆమహాయోగిని తాను దూరశ్రవణశక్తి గలదానననీ, ఒకరాత్రి హిమవత్పర్వత కాంచనగంగా శిఖరమునకూర్చుని వుండగా ఇద్దరు విద్యాధర స్త్రీలు చెప్పకొన్నమాటలు విన్నాననీ, వారి సంభాషణలో విష యాలే ఆధారంగా తాను చెపుతున్నాననీ-వివరించింది.
ఆ మహాపతివ్రత కృష్ణా గోదావరీ మండలాల మధ్యప్రదేశంలో చాలా సంపన్న కుటుంబంలో 'పుట్టుసిరి’ లాగ పుట్టింది. ఆమె పుట్టుక, పెరకువ కూడా, ఇంట్లో వారికీ బయటవారికీ కూడా మహాలక్ష్మీసమానంగా అనిపిం చాయి. చిన్నతనం నుంచీ అసాధారణమైన మంచిలక్షణాలను ప్రదర్శించింది.
క్రమక్రమంగా ఇంటి దగ్గరే విద్యాభ్యాసం చేసింది. ఆంగ్లవిద్యకూడా కొంత ఇంటిదగ్గరే నేర్చింది. చదవను, వ్రాయను, తొందరగా నేర్చింది.
ఆమెరూప, శీల, సంపదలకు అనుకూలమైన మరొక సంపన్న కుటుంబంలో కోడలుగా మెట్టింది. ఆయింటి తనమంచితనం, దానశీలం, నిగర్వత, విద్య, వినయం పెంపొందించుకుంటూ భర్త ప్రేమలో పునీతురాలై, ఇరవైయేడేళ్లు కాపురంచేసింది. పాతకాలపు పతివ్రతల్ని మనంచూసి వుండక పోవచ్చుగాని –ఈమె ఈకాలంలో సర్వసాధారణంగా 'గృహిణి' ఎలా ప్రవర్తించాలో తనప్రవర్తనతో నిరూపించింది. పద్దెనిమిది అధ్యాయాలలో భగవంతుడు బోధించిన అనాసక్తి యోగాన్ని ఆచరణలో చూపింది. ఆమె పవిత్రాగ్ని స్పర్శతో దేహంచాలించిందని, విద్యాధర స్త్రీలు మాట్లాడుకోగా విన్నానని మహాయోగిని ప్రశంసాపూర్వకంగా చెప్పింది.
జంఘాలశాస్త్రి యిట్లు పలికెను: హిమాలయప్రాంతమునుండి వచ్చిన యొకమహాయోగిని నేఁడీసభలో నుపన్యసిం చును. సావధానచిత్తులరై వినగోరెదను.
మహాయోగిని యుపన్యాసము
పుష్పములలో గులాబి యెట్లో, ఱాలలో వజ్ర మెట్లో, లోహములందు కాంచన మెట్లో, మగవారిలో శూరుఁ డెట్లో, యాండువారిలోఁ బతివ్రత యుట్ల.
గీ. 'ధరణి నుండు ద్వితీయమౌదైవ మదియె' యని యొకకవి చెప్పినాఁడు. ఆఁడుజన్మ మెత్తితరింపవలయును. అందులోఁ బతివ్రతయై తరింపవలయును. మeటియోుక మార్గము లేదు. బ్రహ్మజ్ఞానసంపత్తిచే బదునాల్గుజన్మములకైనను మగవాఁడు మోకము నొందకపోవచ్చును కాని, నిష్పలాపేకమైనపతిభక్తిచే నాఁడది యొకజన్మములో ముక్తినొందఁ గలదు. పరమేశ్వరుఁడు కేవల ప్రేమమయుఁడే కాక ప్రేమస్వరూపుఁడు కూడను. అందుచే ప్రేమతత్త్వమే సంసారతారక మైనది.
గీ. దంపతులప్రేమవంటి దీధరణి లేదు
వారికేంతు విభన మెప్పటికి నైన
వట్టిబ్రహ్మచారికి మోక్షపదవి సున్న
జ్ఞానియగువాని కద్ది సంశయము సుమ్ము.
ప్రేమలతఁ గోయు మని మన పెద్ద లనిరి
నాకు క్షమియింపు మామాట నచ్చలేదు
జన్మరాహిత్య పరమశాశ్వతసుమంబు
భవ్యతమరాగ లతికోద్భవంబు కాదె?
అందుచేత నాడువారిలో నొక్కగృహిణికి తప్ప బ్రహ్మచారిణులకు, యోగినులకు, సన్న్యాసినులకుఁ గూడ ముక్తిలభించు నని ధైర్యముగఁ జెప్ప వీలులేదు. ప్రేమాదిరసములు పుట్టుకతోడనే మనహృదయములం దున్నవి. మనము మనుజులకంటె నధమజంతువులుగా నున్నప్పటి నుండియు నారసములు మనహృదయములం దున్నవి. ప్రియాగమనమున గుళుకు గుళుకు మను గవ్వప్రేమాతిథ్య మెట్టిదో, సతీమణియింటి కేతెంచిన భర్తపాదసేవ సరిగా నట్టిది. వానికి రెంటికిని తత్త్వమున భేద మేమియు లేదు. జ్ఞానము మనుజునకు సహజము కాకపోవచ్చునేమో కాని ప్రేమామత్రము సహజ మని యొప్పకొనక తప్పదు. అట్టి ప్రేమరస మెండ జేసికొనఁ బ్రయత్నించి జ్ఞానముచే దరింపఁబూనుట యతికష్టము. అసహజము. అవసానమున దృశ్యాదృశ్యము కూడను. ప్రేమరస మెప్పటికిని గూడ నెండునది కాదు. ప్రేమ తొలఁగదు. జ్ఞానము కలుగదు. అట్టి సంధ్యవస్థలో మనుజుఁడు చిక్కుకొని యుభయభ్రష్టత నొందుట తగదు. అట్టి ప్రేమాదిరస ములు సత్కార్యములందు, సత్పాత్రములందు, సముచితముగ, సద్వినియోగము చేసికొ నుట చేతనే జన్మసాఫల్యము కలుగును.
అది గాక స్త్రీతత్త్వ సమ్మేళనములో జ్ఞానము పాలుకంటె, భక్తిపాలు హెచ్చు. ఎందుచేత ననఁగా పరమేశ్వరుని చేతిలోన ప్రత్యక్షముగ నున్నసృష్టితంత్ర మంతయు బ్రత్యకముగ స్త్రీచే నిర్వహింపఁబడుచున్నది. ఆడుది పరమేశ్వరుని ప్రతినిధిని యైయున్నది. ప్రేమను ధలచేఁగాని కనుటయుఁ బెంచుటయు నెన్నఁడు సిద్దింపదు. అందులకు జ్ఞానమక్కఱలేదు. ప్రపంచపుటునికికిఁ బ్రేమయే మూలాధారము.
భగవంతుఁడున్నాఁ డని, లేఁడని, యున్నాఁ డనుమాటయే కాని యాతనికి సృష్టితో సంబంధము లేదని, లేనట్లే యున్నాఁ డని, యెన్నితలతిక్కకొసవెఱ్ఱి సన్నిపాతపు దారులైన మగవాఁడు బుద్ధిలేక తొక్కినాఁడు కాని మగువ యాచింత కెన్నఁడైన లోనైనదా? ఆసంశయ మెన్నఁడైనఁ బొందినదా? ప్రేమస్వరూపుఁ డైన పరమేశ్వరుని యందు నిర్లిద్రవిశ్వాసము, నిశ్చలభక్తి తప్ప ఆమె హృదయమున నింక ముఖ్యమైన దేమైన నున్నదా? ప్రేమామృతపూర్ణ మైన యామె హృదయమందు మఱి యొక్కటి యుండుటకుఁ దా వెక్కడిది?
ఒకమహాపతివ్రత వృత్తాంతమును చెప్పదును. దూరయానశక్తి కలదానను. కావున నే నొక్క రాత్రి హిమవత్పర్వతకాంచన గంగాశిఖరమునఁ గూరుచుండి యుండఁగా నిద్దఱు విద్యాధర స్త్రీలు చెప్పకొన్న మాటల వింటని. అందువలన నేను చెప్పఁబోవు మహాపతివ్ర తను గూర్చిన యంశము లనేకములు వారి సంభాషణవలనఁ దెలిసికొంటెని. అవి తరువాత చెప్పదును. ముం దాయుత్తమకాంత యైహిక కథావృత్తమునఁ గర్ణములు పవిత్రములు చేసికొందము.
కృష్ణగోదావరీమండల మధ్యగత ప్రదేశమున నొక సంపన్నుని కుటుంబమున నామె కొన్ని సంవత్సరముల క్రింద ప్రాచీగర్బమునఁ గాంతి రాశివలెనుదయించెను. ఆమె పుట్టినస్థల మేదియైన మీ కెందులకు? జన్మస్థలమునకు, జన్మకాలమునకుఁ బ్రాముఖ్య మీయఁదగదు. మంచి స్థలమునఁ బుట్టినజీవుఁడు. మంచివాఁ డని యనదగునా? చెడ్డస్టలమునఁ బుట్టి నవాఁడు. చెడ్డవా డనందగునా? జాతకుని స్వరూపస్వభావాదులు జన్మస్థలకాలముల బట్టి లేశము నుండవు. మాలపల్లె యందరుంధతి పుట్టలేదా? బ్రహ్మవంశమున బుట్టినశూర్పణఖ మాట యేమి? దేశ కాలపాత్రాదులు జీవప్రకృతులపైఁ గొంతమార్పు తప్పకుండం గలుగఁ జేయుపని కొందఱు చెప్పదురు. కాని యది సాధారణ ప్రకృతుల వర్తించుమాట కాదు. అసామాన్యప్రకృతులన్నియు దేశకాలపాత్ర బద్దములైనవి కానే కావు. సృష్టిసూత్రమున కవి లొంగునవి కానేకావు. వానిని మినహాయింపుల క్రిందనే మనము చూచి గౌరవింపఁదగును. మనగౌరవము నని యపేక్షించునవి కానే కావు. అట్టి యసాధారణశరీర తేజస్సుతో, నంతకంటె నూఱురెట్లు హెచ్చయిన బుద్దితేజస్సుతో, నంతకంటె నూఱురెట్లు హెచ్చ యిన యోగ్యతాతేజస్సుతో, నంతకంటె నూఱురెట్లు హెచ్చయిన భక్తితేజస్సుతో, నంత కంటె నూఱురెట్లు హెచ్చయిన యాత్మతేజస్సుతో నా తేజస్వినీమణి వేణువులో నాణి ముత్తెము పుట్టినట్టు, పంకమున భగవత్పూజార్హమైనపద్మము పుట్టినట్టు నాగటిచాలున సీతామహాదేవి పుట్టినట్లు, సముద్రమున జగమంతయు శాసించు మహాలక్ష్మి పుట్టిన ట్లాసంపన్నునికుటుంబమున నీప్రభారాశి ప్రభవించెను. ఆకుటుంబమున కెంతో కాంతి వచ్చినది. ఆరాష్ట్రమున కెంతో కాంతి వచ్చినది. భారతదేశమున కంతకుఁ గూడఁ గాంతిఁ దేఁగల కమలాస్వరూపిణియై వెలసెను. ఆమె మహాలక్ష్మి యవతార మని పుణ్యాత్ములైన తల్లిదం డ్రులెఱిఁగి యామెకు మహాలక్ష్మి యని నామముంచిరి. ఈబిడ్డ పుట్టినప్పటినుండియు గన్నవారి కైశ్వర్యము వృద్దికా జొచ్చెను. తెల్లవాలకి లేచి మొదట నీపిల్లమొగము చూడకుండ దైవప్రార్ధనమైనఁ దల్లిదండ్రులు చేసి యెఱుఁగరు. ఈమె మొగము చూచిన నేమిలాభము కలుగునో యని యితరులుగూడ భావించి చూచుచుండెడివారు. ఈమె నెత్తుకొన్న నేమి విశేషమో, యీమెకు పాలిచ్చిన నేమివిశేషమో, తల దువ్విన నేమివిశేషమో యని యా యూరిప్రభుకాంతలు, బ్రాహ్మణకాంతలు తలఁచుచు, సమస్తోపచారము లీపిల్లకుఁ జేయు చుండిరి. ఎవ్వరికైన జబ్బుగా నున్నయెడల నీమెను వారింటికిఁదీసికొనిపోవుచుండుదురు. ఈమెయున్న చోట సుఖము, నారోగ్యము, నైశ్వర్యము, సంపత్తి యుండక తప్ప వని యందఱనమ్మకమైయుండెను.
కాని యీమె బాల్యముననే కొన్నియద్బుత గుణములు వెల్లడించుచుండెను. పిల్లలు సాధారణముగాఁబప్పని, పండ్లని, భక్యములని వలపులాడిపోవుదురు కదా, యీమె యెదుట నెన్నిమధురపదార్ధము లుంచినను వారి నేవియు ముట్టక వ్యాసపీఠమున నున్న భగవద్గీతను చేతఁ బుచ్చుకొని యక్కడఁ గూరుచుండెడిది. బొమ్మలని, గడియారములని, తోపుడుబం డ్డని ఎన్నివింతవస్తువు లెదుట నుంచినను వాని నేవియు స్పృశింపక వీణయొద్దకుఁ బ్రాకి తీగలను గదల్చి కలకల లాడుచుండెడిది. ముత్యాలసరములని, పచ్చలహారము లని, బంగారు కంఠమాలలని-ఎన్నియెన్ని వస్తువు లామెయెదుట నుంచినను వానినిఁ తప్పించు కొని తల్లిగారి దేవతార్చనలోని జపమాల పట్టుకొని ప్రాగి వచ్చుచుండెడిది. ఈగుణమువలన నీమె పరుల కానందము, సుఖము, సంపద కలుగఁజేయువారే కాని స్వలాభము నపేక్షించి యేపనియైనను జేయువారు కారని యప్పడే యంద ఆనుకొనిరి. భక్తురాలగునని కొందఱు, సన్యాసివియగు నని కొందఱు, ఎవరికిఁ దోఁచినట్లు వారను కొనుచుండిరి. జనకమహారాజు చక్రవర్తియు, సన్యాసియు నేక కాలమందే యైనట్లు చక్రవర్తినియు, సన్న్యాసియుగూడ నేకకాల మందే కాగూడదా? యని కొందఱనిరి. ఇంత యసామాన్యప్రకృతు లద్దాయుర్వ్య క్తులే యవియు, ఋణశేషముఁ దీర్చుకొనుటకు వచ్చి తుడిచిపెట్టఁదగినంత తుడిచిపెట్టి, తుఱ్ఱున నెగిరిపోవు ననియు మఱికొంద ఆనిరి. ఎవరినాలుక కద్దేమున్నది? అన్ని స్వాతం త్ర్యము లంతరించినను రాజకీయవిషయే తరతంత్రములందు మన కింక నాలాపస్వాతం త్ర్యము మిగిలియున్నది కాదా?
ఇంటియొద్దనే యామెకు విద్యాభ్యాస మైనది. అతిశీఘ్రముగ వ్రాయను, చదువను నేర్చుకొనెను. ఆంగ్లేయభాషయుఁగూడఁ గొంత నింటియొద్దనే నేర్చుకొనెను. అట్టియట్టె వయస్సు హెచ్చుచున్న కొలఁది మొగములో లక్ష్మీకళ హెచ్చుచున్నది. శరీరము పుష్టియైన కొలఁదిఁ గంటిలోని శాసనతేజము తీక్షమగుచున్నది. చిత్తమునకు వికాసము కలిగిన కొలఁది నావరించిన పవిత్రత హెచ్చగుచున్నది.
ఒక మహాసంపన్నకుటుంబములోని బాలు డామెస్వరూప స్వభావాదులను విని వరించి, వివాహము చేసికొనెను. ఆమె పుట్టినింటి వారికంటె నత్తింటివారికి హెచ్చుసంపన్నతయు, రాబడియు నుండెను. మహాదృష్టవంతురా లని జనవాక్యము విజృంభించెను. అది వట్టి తెలివితక్కువమాట. ఈమెవలన నామహాసంపన్నుడే మహాదృష్టవంతుఁ డైనాఁడను మాట బుద్దికలిగిన మాట. ఆయన కప్పటికున్న కష్టము విచారము లీమెవలనఁగాని శాంతింప వని భగవంతుడెఱిఁగి యీమెను వారియింట సంరక్షకదేవతగ నుంచినాడు. పూజకొలఁది పురుషుఁ డన్నసామెత యిచ్చట వర్తింపదు. ఆతఁడు చేసికొన్న పూజకొలఁదియే యీపొలతి లభించిన దనియనుకొనుట సరిగా నుండును. ఇక నామహారాజున కేమిలోపము. ఆడినది యాట, పాడినది పాట, పలికినది పలుకు, చేసినది చేఁత, ముట్టినది ముత్యము, పట్టినది బంగారము-ఇట్టు లిరువదియేడు సంవత్సరము లఖండ విజయముతో జరిగినది. ఆమె సంసార మెట్టు జరుపుకొనెనో ప్రతి కాంతయేకాక, ప్రతిపురుషుఁడు గూడ తెలిసికొన వలసినదే. మనుష్య లోకమునకంతకు నాదర్శప్రాయమైన యీమెవర్తనముఁ దెలిసికొనుటవలన దోషశమన మగును. పూర్వమహాపతివ్రతల కథలందువలె నీ మెచరితమునందు దావానలభక ణములు, సూర్యగ్రహనిరోధనములు, మృతసంజీవన శక్తులు మొదలగు నమానుషప్రజ్ఞలు లేవు. ఆకాల పరిస్థితులబట్టి యాసన్నివేశములు సిద్దించినవి. ఈకాలమున నవి యేమియు గలుగవు. ఇప్పడు సర్వసాధారణముగా సర్వసంసారములందు జరుగు సన్నివేశములలోఁ బతివ్రతయైన గృహిణి యెట్టు ప్రవర్తింపవలయునో యాపాఠమును దేశమునకు శాశ్వతముగా నేర్పిన యామహాపతివ్రత కనేక నమస్కారము లర్పించి మఱి చెప్పెదను.
సతికిఁ బ్రథమగణ్యమైన గుణము పత్యనురాగము. ఇదియే పునాదిగ సంసారభవన మంతయు నిర్మింప బడుచున్నది. ఇది యెంత బింకముగా నుండునో భవన మంత నిలుకడ కలదై యుండును. దీనితత్త్వ మెట్టిదో రవంత పరిశీలింతము. భర్త పలికిన పలుకుల బట్టి, యిచ్చిన యీవిని బట్టి, చేసిన చేష్టనుబట్టి, చూపిన గౌరవమును బట్టి భార్యయనురాగ మూసరవెల్లితలవలె గ్రిందికి మీదకి నూగులాడు చుండును. అట్టి హెచ్చుతగ్గులు పత్యను రాగమున నెప్పడు భార్యకుఁ గలిగినవో యది యనురాగము కాదని భావింప వలసియున్నది. భార్యకు బతిని జూచిన మొదటి దినమున నెట్టియనురాగ ముండువో యట్టియను రాగమే విష్ణు దూతను జూచువల్ కుండవలయును. ఇట్టి యనురాగము కేవలము నిశ్చలమైనది. దీనికి హెచ్చుతగ్గులుండుట కవకాశము లేనేలేదు. తనకొఱకుఁ దా నెప్పడు భర్తను బ్రేమించునో యప్ప డాయనురాగ మను రాగము కాదు. భర్తకొజకే భర్తను ప్రేమించు పడతిమాత్రమే పత్యనురాగము కలది. పతివ్రత యని కొనియాడఁదగినది. అనగా నైహిక వాంఛాశూన్యమైన యనురాగము పత్యనురాగము. దేశమందున్న స్త్రీలందఱుఁ గూడ నిట్టియనురాగము నాకు నాభర్తపై నున్నదా యని ప్రశ్నించు కొనఁగ యథార్డ మేదియో తెలియును. నే నెఱిగినంతవఱ కొక్కయినాయిల్లాలి పత్యనురాగమే యట్టు నిశ్చలమైనది. సూర్యకాంతికి హెచ్చుతగ్గు లున్నవి; చంద్రతేజమునకు వృద్దిక్షయము లున్నవి; సముద్ర మునకుఁ బోటుపాటు లున్నవి. కాని, యీమె యనురాగమునకు హెచ్చుతగ్గులు లేవు. మొదటితత్త్వ మైనయూకాశ మెట్టు మార్పు లేనిదో యీమె యనురాగ మట్టిది. నీ కెట్లు తెలియు నందురా-నే నద్బుతశక్తులను సంపాదించిన దానను గాన మీరు విశ్వసింపవల యును. పదునెనిమిదధ్యాయములలో భగవంతుఁడు బోధించినయానసక్తియోగ మీమె సర్వ సౌఖ్యసంపూర్ణమైన సంసారమునఁ బ్రత్యక్షముగ నాచరణ మందుఁ జూపించిరి. స్త్రీ కిదియే మోకమునకు మొదటిమె ట్టని గ్రహింపవలసినది.
ఇంక మఱియొక సుగుణమును గూర్చి చెప్పెదను. పతివ్రతలు సాధారణముగా గర్వభూయిష్ణులై యుందురు. కాని బీదలపాలిటి కల్పవల్లియైన యీమహాలక్ష్మీకి గర్వ మనునది గంధగంధలేశమైన లేదు. ‘‘గీ. వినయ కారుణ్యబుద్ది వివేకలక, గాదిగుణముల కాటపట్టయినవాని" అని ప్రహ్లాదునిఁగూర్చి పోతరాజుగారు చెప్పినారు. సర్వశుభ గుణము లలో వినయ ముత్తమమైనది. అట్టిగుణ మీమెకుఁ గలదు. ఎంతబీదపిల్లలైన సరే, యెంత దరిద్రకాంత లైన సరే, యెంతరోఁతగలుగు స్వరూప స్వభావాదులు గలవారైన సరే యెంతయో దయతో లాలించి, బుజ్జగించి, యాదరించి, ప్రేమించి, బహూకరించి తిరిగి రమ్మని పంపివేయును దారస్వభావ మామె యందుఁ దక్క నే నెక్కడ జూడలేదు. ఈ కాంతాశిరోమణి తనకు బరులకు దత్త్వమున నెంతమాత్రము భేదము లేదని త్రికరణశుద్దిగ నమ్మినయిల్లాలు. అట్టి పరమార్ద దృష్టిచే నామెకుఁ గలిగిన యీవినయ మామెను బరమపూజ్య రాలిగ జేసెను.
గీ. ఇతఁడు నాశత్రు డితని శిక్షింతు ననుచు
నతని నడఁచి త్రోక్కెడునాత డధమతముడు
అందఱకు నేను దాసుడ ననుచు శిరము
నవనతము చేయునాతడే యధికతముడు.
అని బుద్దుడు చెప్పిన నీతి నాచరణమునఁ జూపిన జ్ఞానవతి.
ఇంక గారుణ్యమును గూర్చి చెప్పెదను. దాదాపుఁగా నిరుది యేడు సంవత్సరముల నుండి యెన్ని వందలకుటుంబములకు గుప్తదానము చేసి పోషించెనో యెవరు చెప్పఁగలరు? చడువులకు గొందఱకు, భోజనములకుఁ గొందఱకు పుస్తకములకుఁ గొందఱకు, బట్టలకుఁ గొందఱకు, పత్రికానిర్వహణమునకుఁ గొందఱకుఁ, గవితా ప్రోత్సాహమునకై కొందఱకు, నిత్యభుక్తికై కొందఱకు, నలంకారములకై కొందఱకు, బుద్దిలేక పాడైనవారి కింతటినుండి బుద్ది కలుగుటకై కొందఱకు, పరీక్షాబహుమానములకై కొందఱకు-తెఱపిలేని యీవి, తెంపులేని యీవి, మెప్పకోరని యీవి, త్రికరణశుద్దియైన యీవి, ప్రచ్చన్నమైన యీవి, కృతజ్ఞతాలేశమైన నపేక్షింపయివి, పరమాత్మ ప్రీతికరమైన యీవి మనుష్యస్వరూప దేవతాకాంతయైన యీమెహస్తముననున్నది. ఎవరిమట్టునకు వారు నామీఁత నున్నదయ యామహాలక్ష్మికి మeకి యెవ్వరిమీఁతను లేదని నిశ్చయముగా నమ్మి యామెను బ్రేమించు చుండిరి. ఇట్టిభ్రమను గలిగించు ననురాగవైచిత్ర్యము శ్రీరామచంద్రమూర్తి హృదయమున నుండెను.
విద్య, జ్ఞాపకశక్తి మొదలగువానిఁగూర్చి చెప్పెదను. ఈమెకు మూఁడుభాషలలో నసాధారణపాండిత్య ముండెను. ఆంధ్రసంస్కృత భాషాగ్రంథముల లెక్కయేమి? మహాగ్రం థాలయములం దున్నయన్ని యాంగ్లగ్రంథము లీమె చదివినారు. చదివిన దంతయు జ్ఞప్తిలో నున్నది. ఈమె బుద్ది యేకసంత గ్రాహిత్వము కలది. వీరికుటుంబము పశ్చిమఖండప్రయా ణము చేసినప్ప డీమె యాంగ్లేయ భాషాధోరణి, యాంగ్లేయ భాషాజ్ఞానమును గాంచి యచ్చటి గొప్పగొప్ప విద్యావతులాశ్చర్య మంది యీమెను గౌరవించిరి. ఆంధ్రభాషలో నమ్బత ప్రాయమై, ధారాశుద్ది యైనకవిత్వ మీమె చెప్పఁగలిగియుండెను. ఈమె కవితా చాకచక్య మెట్టిదో విమర్శన ప్రాగల్ప్యమట్టిది. కథాసంవిధానము నుందుగాని పూర్వోత్తరసం దర్భమునందుఁగాని, వాగ్వ్యవహారము లందుఁగాని యవలీలగ దోషము కనిపెట్టిదిద్దగలమ హానైపుణ్య మీమెకున్నది. ఈమె స్త్రీలసభలలో నెన్నిసారులో యుపన్యాసము లిచ్చి యుండెను. శారదాదేవివలె నుపన్యసింపగల విశాదరత యీమెకుఁ గలదు. ఇదికాక వీణావాద నమందు నేర్పరి. తనకుగల్గిన యిద్దఱు మగపిల్లలను, నల్గురాడుపిల్లలను మూడు భాషలందుదనవలెఁ బాండిత్యము గలవారిగను, వీణావాదనమందు శక్తిగలవారిగను జేసి నారు. పిల్లలందరు దైవభక్తి గలవారు. మాతృపితృభక్తిగలవారు. ప్రజాహిత తత్పరులు. వినయవంతులు, వివేకులు, సత్ర్పవర్తనులు, ఇట్టియుత్తమ సంతాను మామె కాంచెను. ఆ కాంతాలలామ చేసికొన్న పూర్వమహా పుణ్యముచేత నిసత్సంతాన మామెకుఁ గలిగినదని చెప్పఁదగదు. పిల్లలు చేసికొన్న పూర్వజన్మ సుకృతముననే వీ రామెగర్భమునఁ బడుట సిద్దించెనని చెప్పఁదగినది.
ఎన్నినెలలు ప్రయాణమైనను సరే యన్నినెలలలోను, నన్ని పట్టణములలోను, నెప్పటి కేవస్తువు కావలయునో యని ముందుగ దెలిసికొని వాని నెచ్చటెచ్చట భద్రపఱుపవ లయునో భద్రపఱచి, యవసరానుసారముగ నుపయోగించి యొక్కవస్తువైనం బోకుండ నన్నియు నింటికిఁ దీసికొని రావలసినదే. ప్రయాణపు బెట్టెల నామెయే సర్దవలయు నని చెప్పదురు. ఎంతదూరదృష్టియో, యెంత వివేకమో, యెంతయవసరజ్ఞానమో, యెంతమేధా శక్తియో, యెంతభద్రప్రవర్తనమో చెప్పటకు నాకు శక్తి చాలదు. కోటలో, బొమ్మల మేడలో, నెడమవైపున, రెండవగదిలో కుడిగోడమీది గుండ్రనిగూటిలో నున్న యావస్తువును భద్ర పఱుపవలసిన దని జ్ఞాపకార్డముగా నిక్కడిదాసులకు రెండువేలమైళ్ల దూరముననుండి వ్రాయుట నెక్కడనైన వనియుండిరా? నేను వినలేదు. లక్షలకొలది రాబడి గల మహాసంసారపు భారమును భర్తకు లేశమైనఁ దగులకుండ నంతయుఁ దాను వహించి యవలీలగ నిర్వహించి పరమసుఖముగ బ్రవర్తించి వ్యవహారపుఁగాగితములు చూచుకొనుట, చదువుకొ నుట, సుఖముగ మిత్రులతో సంభాషించుట మాత్రమే భర్తకు వదలివైచి యాయనను నిర్విచారస్థితి నుంచిన యా యిల్గాలి ఘనతకు, నుదారతకుఁ బ్రేమకు హద్దున్నదా! ఆహా! పరాతత్పరుడా! ఎట్టియాత్మను సృష్టించితివోయి!
ఆమెయొద్ద నున్నసందడి కెన్నడైనఁ దెఱపియున్నదా! సంగీతములవారు, సాహిత్య ములవారు, పురాణములవారు, కవిత్వములవారు, నుపన్యాసములవారు, మంగళపుటూరతు లవారు, హాస్యసంభాషణలవారు, నగరులోఁ దనచుట్టునుండి గౌరవింపఁ బడుచుండ, పహరామీద బట్టలు తెచ్చినవారు, బంగారువస్తువులు చేసి తెచ్చినవారు, చేపలవారు, నడవి పందులవారు, పండ్లగంపలవారు, బట్టలుకుట్టువారు లోపలకిఁ బంపిన దాసులు లోనుండి వార్తలు వస్తువులు మోచికొని పోవుచు వచ్చుచుండ, నోహోహో కన్నులవైకుంఠము కదా! చూచి తీరవలసినదే-ప్రతిదినము పెంట్లియింటవలె నుండెడిదే. నిత్యకల్యాణమును పచ్చతోరణము కనబఱచినదే! దైవవశమునఁ బిల్లల కెప్పడైన జబ్బు చేసినను భర్తకు దెలిసినయెడల నాయన బెంగ పెట్టుకొను నని యెంచి సాధ్యమైనంతవఱకు రహస్యముగ నుంచెడివారు. తనసౌఖ్యము కొఱకు తా నొక్కపనియైనఁ చేసియుండ లేదని కంఠోక్తిగా బలుకఁగలను. Self అను తత్త్వమును బూర్తిగాఁ దుడిచి పాఱవైచినవ్యక్తి నెప్పడైన వింటిరా! ఇప్పడు విని పవిత్రత నొందుఁడు.
ఆమెకు మృతి యనంగ భయము లేశమైన లేదు సరికదా మహానందము కూడను. భర్తప్రోత్సాహముచేతను దొరసానుల తొందరవలనను operation చేయించు కొనవలసివచ్చి నప్పుడు బల్లమీఁదఁ బండుకొని, తన్నుఁ గోయ దెచ్చిన కత్తులవాడిని బరీక్షించి, యిది యెందులకది యెందుల కని యన్నిటి యుపయోగమును దెలిసికొని నవ్వుచు మత్తుమందు తీసికొన్న మానినీశిరోమణికి మరణభయ మున్నదా?-ఏదైన నవ్వుకున్న యెడల దోష మున్నయెడల దేవసన్ని ధానమునకుఁ బోవుటకు జంకుకాని, చంటిపిల్లవంటి నిష్కల్మషహృ దయ యగునామెకు జంకేమి?
ఈమెకంఠరవము మర్దళధ్వనితో సమమైనది. అదియే యీమెకు మహాదృష్ట లక్షణము. ఈమె మామగారిగొంతు మఱియొక విధముగా నుండెడిది. అది మందరధ్వనిలో మహాగంభీరమైనది. మాటలాడుచుండంగా నాయనధ్వని యెంతయో లావుగ నిండుగనున్న ట్టగపడుచుండెడిది. అది యాయన కదృష్టలక్షణము. అట్టికంఠధ్వని యిప్పటి యుత్తరాది మఠస్వాములవారి కున్నది కాని యీయిల్లాలిగొంతువంటిది నేను వినియుండలేదు.
తనకు రాఁబోవుమృతి నాఱుమాసములకుఁ బూర్వమే యీమె కనిపెప్టెను. ఎప్ప డది వచ్చునో జాముజాము గడియగడియా లెక్కపెట్టుకొనుచుఁ బాఠశాలను వదలి బాలిక యింటికిఁ బోవునట్టు మహోత్సాహమున నుండెను. ఆమె కన్యగ్రామములో మృతి సిద్దిం చెను. స్వగ్రామమునుండి వెడల బోవునప్పడామె మామగారి నిల్వువిగ్రహమునకు మోకాళ్ల నమస్కరించి యిట్టు మనవిచేసెను. 'మీవంశమును కొల్చునవకాశము నా కింక లేదు, మీపూర్వులవలన మీవలన వంశమునకుఁ గలిగిన గౌరవమును నేను జెడగొట్టలే దనుటకు నాయంత రాత్మ సాక్షి -మీ నిశ్శరీరాత్మ సాక్షి. పరమాత్మ సాక్షి. నాకు సెలవు. నమస్కా రము." అటుపిమ్మటఁ గొన్ని విష్ణుపటముల యొద్దకుఁ బోయి వానికి నమస్కరించి యిట్టు పలికెను. ‘నాకుఁ బరమేశ్వరునియందు దృష్టి నిలుకడగా నుండుటకు మీరు కొంత సాయము చేసినారు. ఇంక నేను బరమాత్మయొద్దకే పోవుచున్నాను. నాకు సెలవిండు." తరువాత దోట లోనికిఁ బోయి తాను పెంచినపూలచెట్టనన్నింటిని జూచి, స్పృశించి పుష్పముల ద్రుంపకుండ నాఫ్రూణించి "మిమ్మింక జూడను. మీకు నాకు ఋణము తీఱినది" యని పలికి, జయపరమేశ్వరా! యని యుత్సాహమునఁ బోయి తనకుటుంబముతో రైలైక్కెను.
ఆమె యిప్పడు వైకుంఠమున లక్ష్మీసన్నిధానమున నున్నది. అట్టి యత్యుత్తమురా లింతకాలము జీవించియుంటయే దుర్లభము. ఆంధ్రదేశమున నామెకొఱ కీప్పటి కేడ్చుచున్నారు. ఆమెకుఁ బునర్జన్మము లేదు. శాశ్వతమ హానందము నామె రమాసన్నిధి ననుభవించు చున్నది. కొందఱు స్త్రీ లామెను దేవతార్చనలో మహాలక్ష్మితో పాటు పూజచేసి కొనుచున్నారు.
విద్యాధర స్త్రీ లేమో మాటలాడుకొను చున్నారని చెప్పితిని కాదా! ఒకతె రెండవదా నితో నిట్లనెను. 'ఒక మహారాజు ధర్మపత్నియట. అత్యుత్తమురాఁట. మంచి వయస్సులో బవిత్రాగ్ని స్పర్శమువలన దేహము చాలించినదట. ఆమె మహాలక్ష్మీసన్ని ధానమున సావిత్రితో పాటు గౌరవింపఁ బడుచున్నది. హంసయాన మెక్కి యామె యుత్తర ద్వారము నొద్దకు రాగానే యప్పర స్త్రీలామెకు మంగళపుటారతులిచ్చిరి. కల్పవృక్షము జల్లునఁ బూవులామెపై గురిసెను. అమ్మా! అమ్మా! యని కామధేను నానందమున నఱచెను. అరుంధతీదేవి యామెతలపై గరముంచి యేదియో చదివెను. తనలో గలుపుకొనున ట్గామెను మహాలక్ష్మి కౌగిలించుకొనెను. నీ కప్పడు చూచుభాగ్యము లేక పోయెను. ఆమె పూర్వజన్మమున నొక్క మహాతపశ్శాలి యట. మోక్షమునకై తపస్సుచేయఁగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై యిఁక రెండుజన్మము లెత్తినఁ గాని వీలులేదని పలికెను. తపస్సునకు దిరుగ నాతండు కూరుచుండెను. తిరుగ విష్ణువు ప్రత్యక మయ్యెను. ఒక్క జన్మముకంటె నే నెత్తను. నా కప్పటికైన మోక్ష మిమ్మని యాతండు ప్రార్డింపఁగా సరే యాడు జన్మ మెత్తు మని విష్ణుం డానతిచ్చెను. ఆసాధువే యీయిల్లా లై పుట్టైనట. పూర్వను సాధువున కలవాటున్న సూర్యోపాసన యీమె స్త్రీజన్మమునఁ జేసికొనెనట. దేవతార్చన సంబంధ మగు నగ్నిజ్వాలచేఁ జీర యంటుకొన నొడలు కాలిపోయెనట. అపవిత్రాగ్నిచేఁ గాలినది జన్మపరంపర కాని శరీరము కాదట. ఇంక నేమేమో యరుంధతిగా రుపన్యసించినారు. ఆమాటలు నాకు దెలియలేదు. ఈమె మహాలక్ష్మీ సన్నిధానమున శాశ్వతముగా నుండునట." ఇవే నేను విన్న మాటలు. కాంతలారా! మీరు చేయఁ గూడనిపని యొక్కటి యున్నది. అది యేదనంగా, ఆమె యీపాప్రపంచమును వదలిపోయిన దని యెన్నఁడు కంట నీరు పెట్టవలదు. మీరు చేయవలసినపను లున్నవి. అవియేవో చెప్పెదను.
ఆమె పేరు తలంచుకొని కీర్తింపుడు. ఆమె స్వరూపమును దలంచు కొని పూజింపుడు. ఆమె యోగ్యతను దలఁచుకొని యనుకరింపుడు. ఆమె ప్రేమను దలంచుకొని భగవత్ర్పేమ యట్టిదేయ నుకొనుడు. ఆమె స్వార్జహీనతను దలఁచుకొని మహోత్తమజీవులతత్త్వమదియే యనుకొనుడు. అఖండములైన సర్వసౌఖ్యములం దామె యంటిముట్టనట్టుండిన చర్యను దలఁచుకొని మోక్షమున కిదియే ప్రథమలక్షణ మనుకొనుడు. అట్టి దేవతాతేజస్సు లోకసంగ్రహార్టమై యవతరించి యొక్క సారి రప్పమని వెంటనే శాంతించిన దనుకొనుడు. ఆమెకు జయజయ ధ్వానములిండు-జయ మహాలక్ష్మికి జయ-జయ చిన్నమ్మతల్లికి జయ జయ, ఆండాల్మహాదేవికి జయా-జయా-జయా, మహాపతివ్రతతామ తల్లికి జయ (సభలో నొకరు) యోగినమ్మా! మమ్మేడువవలదని చెప్పి మీరే యేడ్చుచున్నారేమి? అమ్మా! నిజమే. ఈమె యుత్తమగుణము లొక్కసారి మనము స్మరించుకొనుటచేతనే మనకింత దుఃఖము కలుగుచుండంగా దాదాపుగా ముప్పదిసంవత్సరము లామెతో సర్వసౌఖ్యము లనుభవించిన యామహాప్రభుఁడు నామెతో నేకప్రాణుడైన మహాప్రభుడు యేకపత్నీవ్రతుడైన మహాప్ర భువు తరుగని దుఃఖములో మునిఁగియున్నాఁ డనుట యాశ్చర్యమేమి? కాంతలారా! నిత్యమామెను స్మరియించుకొనుచు సంసారములఁ జూచుకొనుచు సుఖముండుడు.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః