సాక్షి మూడవ సంపుటం/భవభూతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

20. భవభూతి


సంస్కృత పండిత విమర్శకుడొకాయన సాక్షి సంఘసభలో ఒక చిన్న విమర్శనం చదువుతానని కోరడం వల్ల జంఘాలశాస్త్రి ఆ శాస్త్రిగారికి అవకాశం ఇచ్చాడు.

ఆ విమర్శనం భవభూతి మహాకవి గురించి.

అతని కవిత్వం ఎంతో మృదువు. లలితం. ఎంత ప్రయోజకుడైనా, సమకాలికుల చేత ఎక్కువ తిట్టు తిన్నవాడు. శబ్దార్థాలకి రెండింటికీ సమాన గౌరవం ఇచ్చేవాడైనా, ఒక్కొక్క సారి శబ్ద వ్యామోహానికి లొంగిపోతాడు. అక్కడక్కడ మానవ ప్రకృతి పరిశీలనంలో తేలిపోతాడు. మాలతీ మాధ వీయం, మహావీర చరిత్రం, ఉత్తరరామచరిత్ర అనే మూడు నాటకాలు వ్రాశాడు. ఈ కవి ఉత్తమ కవుల్లోని వాడే. ఈ కవి గర్వభూయిష్టుడు. తనను ప్రశంసించని వాళ్లని తిట్టే స్వభావం గలవాడు.

ఈ పండితుడు, భవభూతి స్వభావం బయటపడే శ్లోకాలను ఉదాహరించి వివరించాడు. “సర్వధా వ్యవహర్తవమ్" అనే శ్లోకార్ధాన్ని వివరిస్తూ విమర్శకుల్ని తిట్టడానికే అవకాశం భవభూతి ఉపయోగించుకున్నాడని చెప్పాడు. కవిత్వం, చిత్రలేఖనం, ఇవి అభిరుచి ప్రధానమైన కళలు. కవులు గ్రంథాల్ని దేశం మీద విడిచి పెట్టినప్పడే, ప్రజలకి వాటిని విమర్శించే అధికారం వుంది. కవులలో చాలా మంది తమ అభిరుచి ప్రకారం వ్రాశారు. ప్రకృతి సూత్రాల్ని బట్టి వ్రాయలేదు. విమర్శించేవారు తన అభిరుచిని బట్టి విమర్శిస్తాడు. ఈ తగవు పరిష్కారానికి సూత్రాలేమిట? ఆ చింత అక్కడ లేదని ఆ సంస్కృత పండితుడి ఉద్దేశం.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:

నాయనలారా! ఒక సంస్కృత పండితుఁడు విమర్శకుcడు మన సభలో నొక చిన్న విమర్శనము చదివెదనని కోరిన హేతువుచేతనంగీకరించితిని. మీరా విమర్శనమును శ్రద్దతో వినవలయును. అయ్యా శాస్రులుగారూ! మీరిఁకఁ జదువ గోరెదను. అంతనొక శాస్త్రులుగా రుపన్యాసరంగ మెక్కి కంటకి జోడు పెట్టుకొని యిట్లు చదివెను.

భవభూతి భారతీయ మహాకవులలో నొకడు. మాలతీమాధవీయము, మహావీరచరిత్రము, ఉత్తర రామచరిత్రము ననుపేళ్లుగల మూఁడు నాటకము లీతcడు వ్రాసినాఁడు. వానిలో నుత్తర రామచరితము ముత్తమమైనది. ఈకవి యుత్తమ కవులలో నొకcడు. ఆతని కవిత్వ మత్యంతలలితమైనది. మృదుల మృదులతర మృదులతమాధిక శబ్దములను వర్ద్యవిష యానుసారముగా కూర్చి కవిత్వము జెప్పిన మహామహుcడు. శబ్దార్ధములు రెండును సమానగౌరవముతోఁ జాచునుద్దేశము కలవాఁడయ్యును నొక్కొక్కప్పడు శబ్దముల యింద్రధనస్సు రంగులకు వ్యామోహపడి సందర్భమును కొంచె మలక్ష్యము జేయును. అదిగాక నచ్చటచ్చట మనుష్యప్రకృతి పరీక్షయందుc దేలిపోయినట్లు గనcబడుచున్నది. ఈతండెంత ప్రయోజకుఁడయ్యును సమకాలికులచే మిక్కుటముగాఁ దిట్లుదినిన వాడు. సమకాలికులచే దిట్టు తినుటకు ప్రయోజకతాప్రయోజకతాభేదము లేదు. పరోపకారవేశమున ద్యాగమును జేయువారిని కీర్తిభిక్షకులనియును, స్వగౌరవప్రకటకులనియుం బ్రజలు దూషిం చుచున్నారు. ప్రజాసౌఖ్యాభివృద్దికై భాషాగౌరవవృద్దికై పాటుపడు ప్రభువులను బరిపాలక బిరుదవాంఛాలాలసులని ప్రజలు నిందించుచున్నారు. దేవభక్తిచే మహాక్షేత్రములందు దేవాల యములను నిరత్నానశాలలను స్థాపించువారిని పూర్వకృత బ్రహ్మహత్యాదిదోషనివారణకై చేయుచున్నారని జనులు దూషించుచున్నారు. ఏపని యెట్టు జేసినను దిట్టు తప్పవు. చిత్రలేఖకునికిఁ బాంచాలికారచనయందుఁ గల్పన లేదనియు రహస్యముగాఁ దీసికొని దాcయుంచిన ఫొటోలను బెద్దజేసి వ్రాయు దొంగయనియు ప్రజలు తిట్టుచున్నారు. తంత్రజ్ఞనికి గాత్రము లేదనియు, గాత్రజ్ఞానికి దంత్రములేదనియు, రాగకల్పన పూర్తిగా నున్నవానికిఁ బల్లవిజ్ఞానము తక్కువ యనియు, నందఱుకూడ ముండలముఠాదారులనియు గాయకులను దూషింతురు. ఇక గవిబద్రు కెట్టున్నదో చెప్పనా. కవిత్వమల్లిన వాని కొక్క ముసలిదియో, పడుచుదియో, యటునిటు కానిదియో, సువాసినియో, వితంతువో, యటు నిటు కానిదయో యొక్కతె ప్రక్కదాపుగా నుండక తప్పదని జనులనమ్మకము. దేవుడున్నా డను నమ్మకము కంటె జనుల కిది దృఢతరమై యున్నది. దేవీభక్తుఁడగు నమ్మకము కంటె జనుల కిది దృఢతరమై యున్నది. దేవీభక్తుఁడగు కాళిదాసునకుఁ గూడ నీనింద తప్పినది కాదు. కవియనcగా సోమరి, ప్రపంచజ్ఞానశూన్యుడు. తిక్కతత్త్వము గలవాడు, స్వతంత్రమైనవృత్తిచే జీవించువాడు కాడు. ఒకని నీడను దిరిగి బ్రతుకువాడు, అందఱకు దాసుcడు. కాని ఎవడు చెప్పిన మాటనువినువాడు కాడు. అందరిని దిట్టువాడు. కాని ఎవడు చెప్పిన మాటనువినువాడు కాడు. అందఱిని దిట్టువాడు, అందఱిచేత దిట్లు తినువాడు. దరిద్రతలో నింతతెగనీల్గు మఱి యొచ్చటనులేదు. చేతగానితనములో నింతగర్వము మఱియెచ్చటనులేదు. ప్రత్యక్షమందుc జేత రాగికాసు లేకున్నను భావనలోC తలక్రింద మేరుపుగలవాడు. ఆపూట కన్నము లేక చావు. ఆచంద్రార్కముగా శాశ్వతుడనను నమ్మ కము కలవాడు. బ్రహ్మదేవుcడు తన్ను బాగుజేయు యత్నించినను బాగుపడువాఁడు కాcడు. కాని ప్రపంచమునంతను బాగుచేయుటకు బ్రయత్నించువాడు. కవియిట్టివాడు. ఇంతకంటె దిక్కవాఁడు. మఱి యింతకంటె కొనవెఱ్ఱివాఁడు. ఆతని వెఱ్ఱకి ప్రజలే కొంత కారణము. ప్రజలాతని దిట్టి రేఁగఁగొట్టుచున్నారు. రేంగినప్పడు మాత్రము వెర్రికుక్కవలె నాతcడందజc గఆచును. కవిని దిట్ట జాలనంత మొద్దు ప్రపఖచమున లేదు.

సీ. బండిఆయన నెద్దుబండియా పోతుల
బండియా యనెడు మొద్దుండవచ్చు
గుక్కగొడు గనగ గుడ్డదో దాటాకు
దోయని యడుగు మొద్దుండవచ్చు
దాండ్రబెత్తనం దాటితాండ్రయో, మామిడి
దోయని యడుగు మొద్దుండవచ్చు
జాముండి యనగ ముసలిముండ యొుబాల
రండయొు యడుగు మొద్దుండవచ్చు

తే, నుర్వి నెటువంటి మొద్దయిన నుండుగాని
యాధునికకవి కవితయం దన్ని దోష ఉ
ములె యటంచుc బల్కగలేని మొద్దు లేడు
సర్వదేశంబులను సర్వజాతులందు.

పనికిమాలినకవి పస్తుపడుచునైన బద్యమల్లకమానడు. అల్లిన వాఁడు తనలో దాను సంతోషించి యూరకుండునా? ఉహూ! ప్రత్యాసక్తిగ పనికట్టుకొని బండికర్చుపెట్టుకొని బత్తెము మూట గట్టుకొని పోయి పదిమందికి వినిపించినదాఁక కొట్టుకొనునే కాని యితని దిక్కుమాలిన సోదె యెవఁడు వినును.

సీ. తలను గొట్టుకొని మెదడు జింపుకొని యొక్క
గద్యమో పద్యమో కవిత యల్లి
జనులకు వినిపింపఁ గనుబొమ చిట్టించు
నొకc డడ్డముగ మొగ మూcపు నొకcడు "
ఒక్కcడోష్టము విఱుచు నొకcడు వంకగ వవ్వు
నొక్కడు పూర్వగవుల సుబ్బిపొగడు
ఎట్టున్నదండి యం చేడ్వగ సకిలించి
ఊ యున్నదని సాగcదీయు నొకcడు

ఆ.వె. వ్రాయుచుండ బాధ వ్రాయుపిదప దిట్టు,
కడుపుమంటు మిగులు గలుగు కవిగ
బుట్టుకంటె ఘోరజన్మారు
కఠినఫలము లేదుగాదె యకట!

అని ఒక్కకవి కూనురాగమునకు బెద్దయేడ్పునకు నడుమనున్న కంఠమాధుర్యముతో నేడ్చెను.

భవభూతికూడ ను ప్రజలవలనఁ దిట్టు తినినవాఁడే. కోపము పట్టలేక యతcడు ప్రజలC దిరుcగబడి తిట్టినాఁడు.

శ్లో. యేనామ కేచిదిహనః ప్రథయంత్యవజ్ఞం
జానంతు తే కిమపి తాంప్రతి నైషయత్న:
ఉత్పత్స్యతే మమ తు కోపి సమానధర్మః
కాలో హ్యయం నిరవధిర్విపులాచ పృథ్వీ.

ఈకవి గర్వభూయిష్టుడు. తన్ను స్తుతింపని వారిని నిందించు స్వభావము గలవాడు. ప్రజలు కవిదూషణము చేసినప్పడు కవి ప్రజాదూషణ చేసిన తప్పేమున్నది. కవుల కెంతసేపు నాత్మస్తోత్రము, పరహేళనము, వానితోపాటు గర్వము నసూయయు సాధారణ మగు నవగుణములు. కవులకున్న పౌరుషము యుద్దవీరులకు లేదు. వారికున్న యసూయ జారులకు లేదు. వారికున్న స్వస్తోత్ర పరనిందలు పడుచుసానులకు లేవు. తిట్టు తిట్టుటయందు దినుటయందుఁ గూడ మహాఘనులు. తన కవిత్వమును ప్రజలు నిందించు చున్నారని కడుపు మండుటచేత చిత్తము పుండగుటచేత భవభూతి యీశ్లోకమును జెప్పినాఁడు. దానియర్థమిది. 'ఎవ్వరైన మా తిరస్కారము బ్రకటింతురు గాక! వారుగూడ నేదియో కొంచెము తెలిసినవారే యగుదురు. అట్టివారికొఱకు నేనీ గ్రంథమును వ్రాయలేదు. కాల మంతములేని దగుటచేతను, భూమి విశాలమగుటచేతను, నేకాలమందైన నేస్థలమందైన నావంటి బుద్ధిధర్మముగలవాఁడు పుట్టగలండు' కాని దీని యాంతరంగికాభిప్రాయమేమనంగ, 'నా కవిత్వము మిగుల సారవంతమైనది. దానిలో నున్న విశేషమును, రసమును నాస్వాదిం చుట కీకాలపువా రశక్తులై పోయినారు. గుడ్లగూబ తన యక్షిరోగమును నిందించుకొనక యర్కతేజమును నిందించునట్టు లీయసమర్డులు తమ రస గ్రహణషండత్వమును నిందించు కొనక భారతీమండనాయమాన మగు నాకవిత్వమును దూఱుచున్నారు. ఇట్టి రసపీూనా గ్రేస రులను సంతోష పెట్టుటకు నేను గవిత్వము చెప్పినవాఁడనుగాను. నేను నాకవిత్వము నెంత కళాకౌశల విశేషముతోఁ జెప్పితినో యంత కళాకౌశలసామర్థ్యమున్నవాcడు ముందెప్ప డైన నెక్కడనైనఁ బుట్టవచ్చును. వాఁడే నాకవిత్వమును గ్రహించి యానందించుగాక. వానికొఱకే యిప్ప డీ కవిత్వమును జెప్పచున్నాను. అట్టివాఁ డుద్బవింపఁగలC డనుని శ్చయ మేమిగల దందురేమో ధరామండల మత్యంత విశాలమైనది. కాలము పరిమితి శూన్యమైనది. ఎందులకుఁ బుట్టంగూడదు' ఇవి యేమి సాధారణ వాక్యములా? ఎంత యాత్మశక్తి విశ్వాసమున్న వాడిట్టు పలుకవలెను. ఎట్టి పాండిత్య మదమత్తు డిట్టు పలుకవలయును. జనులయం దెంతోరోంతగలవాఁ డిట్టు పలుకవలయును. ఆ మహాకవి యెంత బుద్దిశాలి, యెంత వికతా పటము కలవాcడు. యెంత ప్రాణము విసుగకపోయిన యెడల నింతతేలికగ మాటలాడును. ఎంత రసస్పూర్తి గలవాఁడు, యెంతబాధపడకుండిన నెంత యొడలు చిల్లులుపడకుండిన నింత పేలవముగC బలుకcగలCడు. జనులను సంతోషపెట్టం దలఁచి తా నేడ్చువాఁ డొక్క కవియే. పుణ్యమునకు బోయి బూతులు తినువాఁ డొకకవియే. ప్రజాసేవకుఁ బోయి బడితె బాజా కధీనుఁడగువాఁ డొకకవియే. భవభూతివంటివాని బ్రతుకే కడతేఆనప్ప డిప్పటివారి మాట చెప్పవలయునా? కాళిదాసుఁడు మాత్రము జనులతిట్టగు రికి దాcటిపోఁ గలిగెనా? ఆతని కవిత్వములోఁ బటుత్వము తక్కువయనియు నాతఁడు యమక కవిత్వమున నజ్ఞcడనియు నింకనేమో ప్రజలు నోటికి వచ్చిన ఫైల్ల దూషింపలేదా? కాళిదాసుడు గంభీరుడు. భవభూతి బేలగుండె కలవాcడు. కాళిదాసుఁడు గడుసుకవి. ఈతని వెందఱు తిట్టినను దన శాకుంతల నాందిలో 'శ్లో, ఆపరితోషా ద్విదుషాం న సాధు మన్యే ప్రయోగవిజ్ఞానం, బలవదపి శిక్షితానా మాత్మన్యప్రత్యయం చేతః" అని వ్రాసినాఁడు. ఇది యెంతలౌకికపు వ్రాతయో చూచితిరా? తన్నుఁ దూలనాడుచున్న వారిని విద్వాంసులని శ్లాఘించు చున్నాcడు. వారి శిరఃకంపనమే తనకుఁ గావలసిన దనుచున్నాడు. అది లేనియెడల దన గ్రంథమసాధు వనుచున్నాడు. ఆహా! ఇవి యెంతగడుసుమాటలు! తిట్టువారి నోటికింత కంటె గట్టిమంత్రమేమున్నది? తిట్టు స్తోత్రమువలననే యడంగును గాని తిట్టవలనఁ బోవునా? ఈమాత్రపు బ్రకృతి రహస్యమును గ్రహింపలేక భవభూతి తెగిపడి తిట్ట నారంభించినాఁడు. ఉత్తమ కవుల ప్రాశస్త్యమును సమకాలికులే కాదు. కొంచెము తరువాతి వారు గూడ గ్రహింపలేరు. షేక్సుపియరు యొక్క మహాప్రజ్ఞనాకాలములో గ్రహించినవా రేరి? బ్యాక వంటివాని కనులకే యీమహాకవి కళాకౌశలము కనబడలేదే! ఆతని తరువా తివారగు జాన్సన్ మొదలగువా రీకవికి లేనిదోషములను గల్పించి తూలనాడిరి. జాన్సన్ కంటికి, నాంగ్లేయసారస్వతతిమింగల మని పేరొందిన వానికంటికి పోపు అనువాఁ డెక్కువ కవిగాఁ గనబడినప్పడిక జెప్పవలసి దేమున్నది?

పాపము. భవభూతి యిష్లే ప్రజలతిట్టవలన బాధపడినాఁడు. ఏమి చేయ వచ్చును? కవితా ప్రారబ్దమున్న ప్రతినిర్భాగ్యున కీబాధ తప్పదు. కొందఱు కవులు విని విననట్టం దురు. కొందఱు కవువు వినకుండ నెన్ని ప్రయత్నములైన జేసికొందురు. కొందఱు విని ముసిముసినవ్వులు నవ్వి యూరకుందురు. కాని లోకబాధ పడనివాఁ డొక్కడును లేఁడు. ప్రజలను దిరుగcబడి నోటికసిదీఱ తిట్టుట కవకాశమునకై కొందఱు వేచియుందురు. అట్టి యవకాశము రాకపోయినను గల్పించు కొందురు. భవభూతి ఉత్తర రామచరిత్ర నాందీప్రస్తావ నలో విమర్శకులఁ దిట్టుట కట్టవకాశమును బుద్దిపూర్వకముగఁ గల్పించుకొనినాఁడు. ఎట్లో వినుడు. నటసూత్రధార సంభాషణములలోనిభాగ మిప్పడు మీకు విన్పింతును వినుడు. బ్రహ్మశ్రీ జయింతి రామయ్యపంతులుగారి యాంద్రీకరణ మనుసరింతము.

సూత్ర:- మన కిదియంతము నేల? నిజకులమర్యాదానుసారముగ రాజద్వారమునే సేవింతము రమ్ము.

నటు:– అట్టయిన, రాజుగారియొద్ద బఠించుటకై నిర్దుష్టమైన స్తోత్ర మొకటి రచింపుము.

అంతటితో రవంత యాగుదుము. రాజద్వారమును సేవించుట నిజకులమర్యాదాను సార మైనప్పడు నిజకులమర్యాదాను సారముగ నటుడు రాజుగారియొద్ద మామూలుగాc బఠించుచున్న స్తోత్రములను బఠింపవలయునే గాని యారాత్రి నటునకు ప్రత్యేకముగ నిర్దుష్టమైన స్తోత్ర మెందులకు? ఒకవేళ ప్రతిదినమును నూతన స్తోత్రమును జరుపవలయు నన్న నిర్బంధము నటునకున్నదా? ఉండదు. కాని యున్నదే యనుకొనుcడు. ఉన్నప్ప డందులకై నటుడు మహారాజకవిని గోరవలయును కాని నాటక పాఠములను చెప్పసూత్రధా రుని వేఁడనేల? సూత్రధారుడు మాత్రము కవి కాంగూడదా? ఎక్కడను వినలేదు. సరే. కవి యని యంగీకరింతము. అందుపైన సూత్రధారుఁ డేమనియెనో విందురా.

సూత్ర:- శ్లో. సర్వధా వ్యవహర్తవ్యం కుతో హ్యవచనీయతా యథావాచాం తథా స్త్రీణాం సాధుత్వే దుర్జనోజనాః దీనియర్థ మేమనcగా, జనులు నిందింతురను భీతిని వదలిపెట్టి నిర్దుష్టముగా గవిత్వము చెప్పవలసినది. నిందలేదన్నమాట యెన్నడును లేదు. కవుల వాక్కుల యెడలఁ గాంతలయెడల జనులు తప్పనే తడవుచుందురు. నటుడు నిర్దుష్టమగు స్తోత్రమును కోరినప్పడు సూత్రధారుడిదియంతయు జెప్పనేల? నటుని మాటకు సూత్రధారుని మాట సందర్భమైన ప్రత్యుత్తరముగాఁ గనబడు చున్నదా? ఒకవేళ నటుడు “సూత్రధారా! నేను స్తోత్రము రచియించిన యెడలఁ తప్పలు వచ్చునేమో నీవే నిర్దుష్టముగాఁ జెప్పవలసిన' దని కోరినయెడల సూత్రధారునిపై ప్రత్యుత్తరము కొంత సందర్భముగా నుండునేమో భావికథా సూచనకు నంతకంటె ముఖ్యమైనది విమర్శకులను దిట్టుట కీ యవకాశమును బుద్దిపూర్వకముగఁ గవి కలిగించుకొనినాఁడని నాకుఁ దోఁచుచున్నది.

సోదరులారా! పై శుక్రవారమున నుత్తరరామచరిత చిత్రపటము అను విషయమును విమర్శింతును. అపండితుడవు. ననామకుడ వగు నీవు భవభూతిని విమర్శింతువా? తప్పకాదా? ఊరకుండుమని నన్ను దిట్టుదురా? కవులగ్రంథ సంచయమునకు, కాఫీహోట లునకు, నాకు భేద మగపడలేదు. హోటలునకుఁ బోయి పాకపుగారెలు తినునప్పడు పాకములోఁ దగినంత బెల్లము వేయలేదని యనుటకు నాకధికారము లేదా? నీవు మంచివంటగాడవైనట్టే తెగనీల్గుచున్నావే యని పై వారు కాని, యధికారిగాని నన్నుఁ దిట్టుట ధర్మమా? కవిత్వమేమి, చిత్రలేఖనమేమి, యభిరుచి ప్రధానమైన కళలు. నాయభి రుచి కనుకూలమైనదానిని నేను బాగుగ నున్నదందును. లేనిదానిని బాగుగ లేదందును. అది నా జిహ్వలోని గుణము కావచ్చును. దోషము కావచ్చును. ఆమాత్రమునకుఁ గవులకు నాపై గోప మెందులకు? ప్రజలకు నాపై గోప మెందులకు? నేను బాగుగా లేదన్నది బాగుగానుండcగూడదా? నేను బాగుగానున్నదన్నది యోగుగా నుండఁగూడదా? కవులు గ్రంథములను దేశమున నెప్పడు విడిచిపెట్టినారో యప్పడే ప్రజలు వానిని విమర్శింప నధికారముగల వారైనారు. కళలకైనను గేవల మభిరుచియే ప్రధానమా? మంచిచెడ్డలను బరిశీలించు ప్రకృతిసూత్రము లేవియు నక్కఱలేదా? యని యధిషేపింతురా? ప్రకృతిసూత్ర ములను బట్టి వ్రాసినవా రెందఱు? అట్లు పరిశీలించినవా రెందఱు? నీ రుచి ననుసరించి నీవు వ్రాసినావు. నారుచి ననుసరించి నేను విమర్శించినాను. బొమ్మలో నాయుcడు గారి మొగము సరిగా లేదని నే నంటిని. ఉన్నదని నీ వనుచున్నావు. తగవు పరిష్కారమున కేప్రకృతి సూత్రములు కావలయునో చెప్పఁగలవా? కావున నాచింతవలదు.

"ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః."