వాసిష్ఠరామాయణము (ద్విపద)
వాసిష్ఠరామాయణము
ద్విపదకావ్యము
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రణీతము
సాధారణ సంపాదకుడు
బి. యస్. రెడ్డి (భూమన్)
సంచాలకులు, తరిగొండ వెంగమాంబ వాఙ్మయప్రాజెక్ట్
"శ్వేత" తి. తి. దే. తిరుపతి
పరిష్కర్త : ఆచార్య కె. జె. కృష్ణమూర్తి
తరిగొండ వెంగమాంబ వాఙ్మయప్రాజెక్ట్
"శ్వేత" తి. తి. దే. తిరుపతి
ప్రచురణ
కార్యనిర్వహణాధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
2008
VĀSIṢṬHARĀMĀYAṆAMU
(DVIPADA KĀVYAMU)
MĀTṚŚRĪ TARIGOṆḌA VEṄGAMĀMBA
Edited by
Prof. K.J.Krishnamoorthy
Tarigoṇḍa Veṅgamāmba Vāṅgmaya Project
"SVETA" T. T. D. TIRUPATI.
T T D Religious Publications Series No. 785
© All Rights Reserved
First Edition: 2008
Copies : 1000
Published by
K.V. RAMANACHARY I. A. S.
Executive Officer,
Tirumala Tirupati Devasthanams,
TIRUPAT1-517507
Printed at
TTD. Press, Tirupati.
ఓం నమో వేంకటేశాయ
* ముందుమాట *
15-07-2008.
భూమన కరుణాకరరెడ్డి
అధ్యక్షులు,
తి. తి. దేవస్థాన పాలకమండలి,
తిరుపతి.
తరిగొండ వెంగమాంబ రచించిన కృతుల్లో చివరిది "వాసిష్ఠరామాయణము". ఇది ద్విపద కావ్యం. ఇందలి విషయం వేదాంతం. రఘువంశీయుల కులగురువయిన వసిష్ఠుడు విశ్వామిత్రుని ప్రేరణచేత శ్రీరామునకు అనేక తాత్త్విక విశేషాలను పెక్కు కథల రూపేణ క్రమంగా, విశదంగా ఉపదేశిస్తాడు. ఇది యిందలి యితివృత్తం.
పరమయోగినియైన ఈ కవయిత్రి వాల్మీకి మహాకవి సంస్కృతంలో రచించిన "వాసిష్ఠ మహారామాయణ" కావ్యంలోని విషయాలను స్వీకరించి, వాటిని స్వానుభవంతో చక్కగా సమన్వయించి ఈ కావ్యాన్ని స్వేచ్ఛగా, సంగ్రహంగా ద్విపదలలో అనువదించింది.
యావద్ భారతీయ వాఙ్మయ మంతటిలోనూ అత్యుత్తమమైన గ్రంథంగా స్వామి రామతీర్థలాంటి మహాశయులచే కొనియాడబడిన ఈ "వాసిష్ఠ మహారామాయణా"నికి తెలుగులో రెండే రెండు అనువాదాలు గోచరిస్తున్నాయి. అందులో ఒకటి క్రీ.శ. 14-15 శతాబ్దుల నడుమ నివసించిన మడికి సింగన రచించిన పద్యానువాదం, రెండవది క్రీ.శ. 18వ శతాబ్ది ఉత్తరార్ధంలో తిరుమలక్షేత్రంలో విలసిల్లిన మహాయోగిని వెంగమాంబలేఖినినుండి వెలువడిన ప్రకృత ద్విపదానువాదం. ఈ యిరువురు సారస్వతమూర్తుల్లో ఒకరు అహోబల లక్ష్మీనృసింహస్వామి భక్తులు కాగా, ఇంకొకరు తరిగొండ లక్ష్మీనృసింహస్వామి భక్తులు. ఈ విధంగా ఈ యిద్దరూ నృసింహోపాసకులే అయివుండటం ఈ సందర్భంలో ఎన్నదగిన అంశం!
మొత్తం మీద, తాత్త్విక విషయాలను సామాన్య జనులకు సుబోధంగా వెల్లడించటానికి పద్యంకన్నా ద్విపద మిగుల అనువయినదనే సూక్ష్మాంశాన్ని ఈ ద్విపద కావ్యం సముచితంగా నిరూపిస్తూ వున్నది.
తిరుమల తిరుపతి దేవస్థానముల “శ్వేత" సంస్థ ఆధ్వర్యంలోని “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు " ఇలాంటి విశిష్ట ప్రచురణలను ఇతో౽ధికంగా చేపట్టి ఈ “కవితాతపస్విని" సృజించిన వాఙ్మయ రాశిని విస్తృతంగా వెలుగులోకి తీసికొనిరాగల రని ఆశిస్తున్నాను. ఆశంసిస్తున్నాను.
సదా శ్రీవారి సేవలో
భూమన కరుణాకరరెడ్డి
శ్రీనివాసో విజయతే
నా మాట
22-07-2008.
కె. వి. రమణాచారి, ఐ. ఏ. ఎస్.,
కార్యనిర్వహణాధికారి,
తి. తి. దేవస్థానములు,
తిరుపతి.
భారతీయ వాఙ్మయంలో విశ్వవిఖ్యాతిగాంచిన మహాకావ్యం “వాసిష్ఠ రామాయణం". వాల్మీకి మహాకవి సంస్కృతంలో రచించిన ఈ గ్రంథానికి “జ్ఞాన వాసిష్ఠం”, “యోగ వాసిష్ఠం", " మహారామాయణం" - ఇత్యాది అనేకనామధేయాలు కాలక్రమేణ ఏర్పడినాయి. ఇవన్నీ ఈ కావ్యప్రశస్తిని చక్కగా చాటుతూవున్నాయి. ఈ కావ్యంలోని ముఖ్య విషయం వేదాంతం. ఇందలి అధ్యాత్మతత్త్వాన్ని ఉపదేశించిన మహానుభావుడు మహర్షు లందరికీ మాన్యుడయిన వసిష్ఠమహాముని, ఆ దివ్యోపదేశాన్ని శ్రద్ధతో స్వీకరించిన శిష్యసత్తముడు అవతారమూర్తీ, రఘువంశ తిలకుడూ - అయిన శ్రీరామచంద్రుడు.
ఇంతటి ఉత్కృష్టగ్రంథానికి ఇటీవలిదాకా తెలుగులో వెలువడిన అనువాదాలు రెండే రెండు. ఆ రెండు అనువాదాల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ద్విపదలో రచించిన ఈ "వాసిష్ఠ రామాయణం" ఒకటై వుండటం విశేషం! ఈ కావ్యం తాత్త్విక కవయిత్రి వెంగమాంబ రచించిన మొత్తం రచన లన్నింటిలోనూ చిట్టచివరిదై వుండటం ఇంకొక విశేషం!
అపూర్వములయిన అనేక కథలను ఆధారం చేసికొని ఆత్మతత్త్వాన్ని ఉపదేశించటం వాల్మీకి కావ్యంలోని రచనా ప్రణాళిక. ఈ ఆధ్యాత్మిక కవయిత్రి ఆ ప్రణాళికను పుణికిపుచ్చుకొని, స్వతంత్రంగా, సంగ్రహంగా, తెనుగు జాతీయచ్ఛందమైన ద్విపదలో సులభశైలిలో ఈ కమనీయకృతిని వెలయించింది.
పరమయోగులైన ఆళ్వారులవంటి మనఃపరిపక్వత గలిగిన ఈ మహాయోగిని యొక్క రచన లన్నిటిలోనూ సురుచిరమణిహారంలో సువర్ణసూత్రంవలె తత్త్వజ్ఞానం (Philosophy) భాసిస్తూ వుండటం ఈ సందర్భంలో ప్రశంసింపదగిన ప్రత్యేకాంశం!
తి. తి. దే. "శ్వేత" సంస్థ సంచాలకులు, "మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు డైరెక్టరు శ్రీయుతులు "భూమన్"గారి దీక్షాదక్షతలవలన ఈ వాఙ్మయపీఠం అచిరకాలంలో వెంగమాంబగారి తదితరరచనలను, సాహిత్య సదస్సులకు సంబంధించిన వ్యాససంకలనాలను, సంచికలను, తులనాత్మక పరిశీలనలను, శబ్దసూచికలు concordances మొదలైనవాటిని క్రమేణ ప్రచురింపగల దని ఆశిస్తున్నాను, ఆశంసిస్తున్నాను.
సదా శ్రీనివాసుని సేవలో
కె.వి. రమణాచారి
* సాహితీ సౌరభం *
01 -07 -2008.
"భూమన్"
సంచాలకులు,
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు,
"శ్వేత", తి. తి. దేవస్థానములు, తిరుపతి.
మహాయోగిని తరిగొండ వెంగమాంబ రచించిన గ్రంథా లన్నింటిలో చిట్టచివరిది "వాసిష్ఠ రామాయణము". ఈ ద్విపదకావ్యం "యోగ వాసిష్ఠం", "జ్ఞాన వాసిష్ఠం” - మున్నగు పేర్లతో ప్రసిద్ధి గాంచిన సంస్కృత గ్రంథానికి అనువాదం. అనువాదమయినా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా సాగిన రచన!
వాల్మీకి రచించిన సంస్కృత మూలంలోని సారాన్ని స్వీకరించి, స్వానుభవంతో జోడించి, కవయిత్రి ఈ మహాకావ్యాన్ని సంగ్రహంగా, సామాన్యులకు సైతం సులభగ్రాహ్యంగా ఉండేటట్టు రచించింది. ఈ హేతువుచే ఈ గ్రంథంయొక్క వైశిష్ట్యం ఇనుమడించింది.
తేట తెలుగు పదాలతో తాత్విక విషయాలను బోధించటం వెంగమాంబకు వెన్నతో పెట్టిన విద్య - అనే విషయాన్ని 'తరిగొండ నృసింహ శతకం' మొదలుకొని, ఈ యోగేశ్వరి కృతులు అన్ని నిరూపిస్తూ వున్నాయి, ఆ అన్నింటిలోనూ ఈ కావ్యం అగ్రగణ్యంగా అలరారుతూవుందనేది సత్యం!
గడచిన శతాబ్ది ఆరంభంలో గుజిలీప్రతిగా మద్రాసులో ముద్రితమైన ఈ తాత్విక కావ్యం తి.తి.దే. మాతృశ్రీ తరిగొండ వాఙ్మయ ప్రాజెక్టు పక్షాన వ్రాతప్రతుల సాహాయ్యంతో చక్కగా పరిష్కృతమై ఇప్పుడు పునర్ముద్రణ పొందుతుండటం చాలా సంతోషించవలసిన విషయం.. తి. తి. దే. “శ్వేత" సంస్థలోని. “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు" ఈ కవయిత్రి యొక్క తదితర రచనలను - శ్రీ భాగవతము (ద్విపద), శివనాటకము (యక్షగానము) - మున్నగు వాటి నన్నిటినీ అతి త్వరలో ప్రచురించే ప్రణాళికను సిద్ధపరుస్తున్న దని తెలియజేటానికి సంతోషిస్తున్నాను.
ఈ ప్రచురణలతోపాటు, ఆంధ్రావనిలో గల ఆ యా పట్టణాల్లో సాహిత్య సదస్సులు, సంగీత ప్రదర్శనలు, హరికథలు, బుర్రకథలు - మొదలయిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటంద్వారా ఈ మహాకవయిత్రి సారస్వతం యొక్క ప్రశస్తిని ప్రబోధించే ఉద్యమాన్ని తి. తి. దే. ఈ వాఙ్మయ ప్రాజెక్టు ద్వారా కొనసాగిస్తూవున్న దని తెలుపటానికి మిగుల ఆనందిస్తున్నాను.
శ్రీ. కె. జె. కృష్ణమూర్తిగారు సుప్రసిద్ధ పరిశోధకులు. ఎంతో ఓర్పు, నేర్పు ప్రదర్శించి ఈ కృతిని పరిష్కరించినందున వారిని మనస్స్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
భూమన్
xxix కృతజ్ఞతాంజలి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ పరిష్కరణ ప్రాజెక్టును నెలకొల్పటంలోనూ, దానికి శాశ్వత స్థితిని ప్రసాదించటంలోనూ ఆదినుండీ మూలవిరాట్టుగా విలసిల్లుతూవున్న శ్రీవారి ప్రతినిధులు, సహృదయ పతంసులు, సుగృహీత నామధేయులు, పరిపాలనా దక్షులు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి అధ్యక్షవర్యులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి మహెూదయులకు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యు లెల్లరకు నా అనేక ధన్యవాదములు. శ్రీవారి ప్రతినిధులు స్మితపూర్వభాషులు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పాజ్మయ పరిష్కరణ ప్రాజెక్టుకు చిరస్థాయి యయిన అభ్యుదయాన్ని, సమగ్రతను ప్రసాదిస్తూవున్న సహృదయతంసులు తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారివర్యులు, పరిపాలనాదక్షులు, నుగృహీత నామధేయులు శ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఏ. యస్., మసూదయులకు నా అనేక ధన్యవాదములు. తి.తి.దే. సంయుక్త కార్యనిర్వహణాధికారి, సౌజన్యహృదయులు శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి గారికి నా అనేక ధన్యవాదములు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ పరిష్కరణ ప్రాజెక్టు యొక్క పర్వతోముఖమైన వికాసానికి తమ వ్యక్తిత్వ లక్షణమైన ఉద్యమస్ఫూర్తిని సమన్వయించి ఉత్సాహ. ప్రభు, మంత్రశక్తి పూరితమైన దక్షతతో ముందుకు నడిపిస్తూ వున్న తి.తి.దే. “శ్వేత" సంచాలకులు, "భూమన్' గా సుగృహీతనామధేయులైన శ్రీ భూమన్ నుబ్రహ్మణ్యం రెడ్డి మహెూదయులకు నా అనేక హృదయపూర్వక ధన్యవాదములు. తి.తి.దే. పౌరసంబంధాధికారివర్యులు, సరసహృదయులు శ్రీయుతులు కె. రామ పుల్లారెడ్డిగారికి నా అనేక కృతజ్ఞతాభివాదములు. సహృదయులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ పాజెక్టు సమన్వయకర్త ఇన్‌ఛార్జ్ విద్యాస్ డా! పమిడికాల్వ చెంచుసుబ్బయ్య గారికి హరమైన నా కృతజ్ఞతాభినందనములు. 'శ్వేత కేంద్ర గ్రంథాలయం లైబ్రేరియన్ సోదరీమణి శ్రీమతి ఎన్. లీలావతి గారికి, వారి సహాయోద్యోగులయిన మిత్రబృంద మందరికీ 'శ్వేత' సంస్థ కార్యాలయం సూపరిండెండెంట్ శ్రీ వి. దామోదరంగారికి, శ్రీ దీనదయాళ్ (యు.డి.సి.)గారికి వారి సహోద్యోగబృందముందరికీ, నా అనేక కృతజ్ఞతాభినందనములు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆచార్య వి. వేంకటకమణారెడ్డి గారికి, వారి సమీబ్యోగులకు అనేక హార కృతజ్ఞుతాభినందనములు, ఈ పుస్తకమును ముచ్చటగా ముద్రించిన తిరుమల తీరుపతి దేవస్థాన ముద్రణాలయ అధికారులకు నా కృతజ్ఞతాభినందనములు. సూతృశ్రీ తరిగొండ వెంగమాంబా మహాకవయిత్రి యొక్క ఆరాధ్యదైవమయిన "శ్రీ తరిగొండ శేషకుధరాధ్యక్షు"నకు నా భక్తి పూర్వక ప్రసూనాంబలి.
6. జి. కృష్ణమూర్తి వాసిష్ఠ రామాయణము
విషయసూచిక
1 |
1 |
1 |
1 |
1 |
1 |
1 |
1 |
1 |
1 |
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.