Jump to content

వాసిష్ఠరామాయణము (ద్విపద)/తృతీయప్రకరణము

వికీసోర్స్ నుండి

తృతీయ ప్రకరణము


శ్రీతారకోల్లాస ! - శేషాద్రివాస !
శ్రీతరిగొండ నృ - సింహ! ధూతాంహ!

విన్నవించెద నది - వినుము వాల్మీకి
పన్నుఁగాఁ [1]దెల్పిన - పరతత్త్వ సరణిఁ

దగ విని యాభర - ద్వాజుండు పొసఁగ
మగుడి యి ట్లనియె రా - మక్షితీంద్రునకు

'నవల వసిష్ఠసం - యమి మఱియేమి
వివరించి చెప్పె నో - విమలాత్మ?' యనిన

మెఱసిన దయను వా - ల్మీకి యి ట్లనియె:
'వరగుణయుత! భర - ద్వాజ! రాఘవునిఁ 10

జూచి వసిష్ఠుఁ డ - చ్చుగ నిట్టు లనియె:
ఈ చరాచర విశ్వ - మెల్ల మనంబు

చేతఁ గల్పితమై ప్ర - సిద్ధమౌ సరణి
ఖ్యాతిగా వింటివి - గడ రామచంద్ర!

నలువొప్ప నుపశమ - న ప్రకరణముఁ
దెలిపెద నెట్లన్నఁ - దేటగా వినుము!

జనకోపొఖ్యానము



జనక భూమిభుఁడు - రాజ్యంబు సేయుచును
మనమున మోక్ష ధ - ర్మంబును మఱచి

చరియించు నపుడు వ - సంతకాలంబు
సరసమై రాఁగ, నా - జననాయకుండు 20

ఒకనాఁటి నడిరేయి - నుల్లాస మెసఁగఁ
బ్రకటంబుగా నిజబలములఁ గూడి,

127

తృతీయవ్రకరణము


వనవిహారముఁ జేసి - వచ్చుచుండఁగను,
ఘనతమాల మహీ జ - గణమధ్య మందు

సిద్ధపురుషులు భా - షింపుచుండఁగను
సద్ధర్మరతుఁడైన - జనకుఁ డచ్చటికి

నరుగ, సదృశ్యాంగు - లై వారు తమలొ
పరతత్త్వసారాను - భవవాక్యములను

దలఁచి, ప్రస్తావోచి - తంబులుగాను
పలికిరి: మిఱి యందుఁ - బ్రథమసిద్దుండు 30

'కనఁబడు వస్తువుల్‌ - గనుచున్న వాని
ఘనయోగమున నాత్మ - ఖండంబు గాక,

యమలమై నిశ్చల - మగునట్టి జ్ఞాన
మమర భావింతు మ - దంతరంగమున,

నదియుఁగాక యభీష్ట - మగు పదార్థంబు
విదితమై యబ్బిన - వేళ జనించు

నానంద మరయ బ్రహ్మా - నంద మనుచు,
దాని భజింతు సి - ద్ధంబుగా' ననుచుఁ

దెలివిగాఁ బల్కె: ద్వి - తీయ సిద్ధుండు
'సలలిత ద్రష్టృ ద - ర్శన, దృశ్యములను, 40

దద్వాసనలను సి - ద్ధంబుగాఁ బాసి,
విద్వన్నుతంబునై - విమలంబు నగుచుఁ

తనివి నిచ్చుచు, నాది -దర్శనాభావ
మన నొప్పు నాత్మనే - ననిశంబు దలఁతు:

నడరారఁ గలదు లే - దను పక్షయుగము
నడుమ వసించి, ని - ర్ణయముగా నన్ని

128

వాసిష్ఠరామాయణము


చెదరక పాడగానఁ -జేయుచునుండు
నది యెద్ది, దాని నే - నాత్మ భావింతు;

సాకార మనియు, ని - రాకార మనియు,
నాకట శూన్యంబు - నని నిశ్చయించు 50

జన మతంబులను ని - శ్చయముగా విడిచి,
యనఘ నద్రూప చి - దాకాశ మెద్ది?

దాని నే నని చూతుఁ - దప్పక' యనుచు
నానిర్మలుఁడు పల్కె; - నవలఁ దృతీయ

సిద్ధుండు తనలోనఁ - జింతించి 'వరమ
సిద్ధాంత మైనట్టి - చిద్వస్తు వొకటి

వెలుఁగు, నవ్వెలుంగులో - వెలుఁగు కన్ వెలుఁగు
నలరి నేను దలంతు - నంతరంగమున

నడరార' నని పల్కె; - నావల మఱియుఁ
దొడరి చతుర్ధ సి - ద్ధుండు పరమాత్మ 60

తనువులయందీ వి - ధంబుగా నిలిచి
కనిపింపుచుండఁగాఁ - గానక వేఱె

దేవుళ్ల వెదకుచుఁ - దిరిగెడి మనుజు
లే విధంబునఁ దరి - యింతురో?' యనుచుఁ

బలికె; నీనలుగురి - పలుకు లాలించి
కలఁక నొందుచు జన - కక్షితీశ్వరుఁడు

తనమదిలోఁ దానె - తలఁచె ని ట్లనుచు
'ఘనతర మోక్షమా - ర్గంబును మఱచి

యుంటి; నిక్కడ సిద్ధు - లుపదేశ మిచ్చి
రొంటిగా నొకనన్తు - వున్నది యనుచు, 70

129

తృతీయప్రకరణము


నా వన్తు నేను మ - దంతరంగమున
భావించి నిర్వాణ - పదము నొందెదను.

అక్కట! దేహేంద్రి - యాది ప్రపంచ
మెక్కడ వచ్చె? నా - కిది యేల నింక?'

నని యాత్మయందె మ - హావిరాగంబు
పెనఁగొనుచుండఁగా - భేదంబు మఱచి,

తాను నందొక కొంత - తడవు సమాధి
గా నుండి, తనుఁ దాను - గని లేచి, మరలఁ

బురిఁ జేరి, సుజ్ఞాన - పూర్ణుఁడై, రాజ్య
మిరవు, నాసక్తి లే - కేలుచు, నన్ని80

పనులందు నిర్లేప - భావుఁడై, దినము
బనువొంద నడిపించు - నాదిత్యు కరణి

నడర నిర్లేపుఁడై - యఖిలకార్యముల
నడిపించుచుండె నా - నరనాయకుండు.

పరువడి నాకాశ - ఫలపాకసరణి,
నెఱుక నొందుచు మిథి - లేంద్రుఁ డెల్లపుడు,

మహిని నహంకార - మమకారములను
సహజంబుగా వీడి - సమచిత్తుఁ డయ్యె;'

నన విని శ్రీరాముఁ - డమ్మునీశ్వరునిఁ
గని యిట్టు లనె 'నహం - కార గుణంబు90

విడుచుట కష్ట మీ - వివిధ దేహములు
పడి నాశ మొందిన - ప్పటి కీయహంత

మొనసూవ కణఁగునేమో కాని, తనువు
లొనరుచుండినయసప్పు - డుండక చనువె?'

130

వాసిష్ఠరామాయణము


యని రాఘవుఁడు సం - శయము నొంది పలుక,
విని మునీంద్రుండు రామ - విభున కి ట్లనియె:

'అనఘాత్మ! విను ధేయ - మన, వేయ మనఁగఁ
దనరారు రెండు వి - ధముల వె ట్లనిన

ఈ పదార్థములు నా - కిష్టంబు లనక,
యా పదార్థంబులం - దాసక్తి విడిచి, 100

తా నూరకే చేయఁ - దగు పను లెల్ల
మానక సేయుచు - మమత వర్జించి,

సమబుద్ధిచే సర్వ - శాంతుఁడై యున్న
నమరు ధేయ త్యాగ - మగు, నవ్విధంబు

నెనవుగా సర్వంబు - నే నను బుద్ధి
జనియింవ సకల వా - సనలు లయించు.

స్వాంతంబుతో దేహ - సంబంధ మెడలు
నంత నావిధము నే - య త్యాగ మగును.

కాయ మే నను నహం - కార వాననల
నే యెడలను పొంద - కిల విసర్జించి, 110

కర్మవాసనలను - కడముట్ట విడిచి,
నిర్మలస్వాంతుఁడై - నిఖిల మే ననుచు

నచలాత్ముఁ డగుట నే - యత్యాగ మగును.
ప్రచుర నేయత్వాగ - భావన నొంది,

సంపూర్ణదృష్టిచే - సర్వ మీ వగుచు
నింపుమీఱ సుఖింపు - మినకులోత్తంన!

వెలికార్యములయందు - వివిధ కర్తృత్వ
ముల వొంది నడువు మి - మ్ముగ రాజ్యపదము,

131

తృతీయప్రకరణము


అనిశ మాంతర్యంబు - నందు గర్తృత్వ
మున నొంద కానంద - మును బొందుచుండు; 120

మెలపుగాఁ గొందఱు - మిత్రు లటంచు,
చలముతోఁ గొందఱు - శత్రులటంచుఁ

దలఁపక, వస్తు స - త్తను విచారించి,
యలరి బంధువు లంద - ఱంచు భావించి,

కలఁత నొందక సదా - ఖండభావమునఁ
జెలఁగుచు, సంతోష - చిత్తుండ వగుము;

తొడరు నహంకృతి - దుఃఖంబు, దాని
విడుచుటే నుఖ, మింక - విను మొక్క సరణి

*పుణ్యపావనోపాఖ్యానము*



ధరణిఁ బూర్వము దీర్ధ - తముఁ డను మౌని
వరసుతుల్‌ పుణ్య, పా - వను లనఁ గలరు; 130

అం దగ్రజుఁడు పుణ్యుఁ - డమల విజ్ఞాని
సందడిం బడక సం - సారంబు విడిచి,

లలితుఁడై విజన స్థ - లమున సమాధి
సలుపుచుండఁగ, వాని - జనకుండు కాల

గతి నొంది పడిపోవఁ - గాఁ బావనుండు
మతిని దుఃఖించి, బ్రా - హ్మణులతో నందుఁ

దనతండ్రి కటఁజేయఁ - దగు క్రియల్‌ చేసి,
జనకున కేడ్చి య - చ్చట నిల్వ కరిగి

యన్నను వెదకుచు - నడవిలోఁ దిరుగు
చున్న, నందొక చోట - నుండి పుణ్యుండు 140

132

వాసిష్ఠరామాయణము


కనఁబడఁగాఁ జూచి, - కనలి పావనుఁడు
తన తండ్రి బేర్కొని - ధరణిపై వ్రాలి,

పొరలి యేడ్వఁగఁ జూచి, - పుణ్యుండు వచ్చి,
కరుణమీఱఁగ రెండు - కరముల వానిఁ

గుదురుగాఁ దా వెత్తి - కూర్చుండఁ బెట్టి
వదనంబు నిమిరి, య - వ్వల నిట్టు లనియె:

'తమ్ముడా! నీ విందుఁ - దండ్రినిఁ దలఁచి,
యిమ్మాడ్కి నేడ్చిన - నిచటికి మరల

వచ్చునే? యమ్మహా - వర తపోధనుఁడు
హెచ్చు బోధస్థితి - నిరవుగాఁ బొందె;150

నతని శరీరంబు - నాత్మలోఁ దలంచి
మతిఁజెడ నీ వేడ్చు - మాత్రమే కాని,

యిందున సుఖము లే - దించు కంతైన,
నెందఱు తలిదండ్రు - లీవఱ దనుకఁ

గలి గేగిరో? వారి - గణుతింపఁదరమె?
తెలివినొం, దేడ్వక - ధీరత్వ మెసఁగ

విను! మహంకృతి చేత - విస్తీర్ణమగుచు
మొనసెడి మోహ - సముద్రంబులోను

సొలయ కెప్పుడు శుభా - శుభ సుఖదుఃఖ
ములు ఫేన బుద్భుదం - బులమాడ్కిఁ బొడము,160

చెదరెడి మరుమరీ - చికయందు ఇలము
కదలుచున్నటు దోఁచి, కడపట మిథ్య

యగునట్టి భ్రాంతి కి - ట్లగపడి నీవు
పొగుల నేటికి? శాంతిఁ - బొందు రక్తాస్థి

కలితమైనట్టి యీ - ఘటపంజరమున
నిలుచుటె? ట్లని, దాని - నిరసించుకొనుచు,

133

తృతీయప్రకరణము


ననిశంబు నీవు నే - నను భేదబుద్ది
వెనయక, యంతట - నెఱుక పూర్ణముగ

నిండియున్నది, యదే - నీ వని తలఁపు
చుండు! వివేకివై - యుపశాంతిఁ బొందు!170

మొదటి యహంకార - మున మమకార
ముదయింపుచుండుఁ గా - వున నవి నీవు

విడువు' మటన్న వి - వేకంబు లేక
యడలుచు నుండఁగా, - ననుజునిఁ జూచి

పలికె నాపుణ్యుఁ'డో పావన! యిపుడు
గలిగి పోయిన తండ్రి - కాయంబుఁ దలఁచి

మొనసి యేడ్చిన రీతి - మును జన్మ జన్మ
మునఁ గని పెంచి నీ - ముచ్చటఁ జూచి

ధర వ్రాలిపోయిన - తల్లిదండ్రులకుఁ
బొరిని నీ వేడ్వు మి - ప్పు డదెట్టు లనిన,180

నొక యద్రిశ్రుంగ మం - దొక సింహమునకుఁ
బ్రకటంబుగా నీవు - ప్రభవించినావు,

పొలుపగు దాశార్ణ - భూతలమందుఁ
దెలివి లే కీవు కోఁ - తికిఁ బుట్టినావు,

సరవిఁ దుషార దే - శమున భూపతికి
నరుదుగాఁ బుత్రుండ - వై పుట్టివావు,

అల పౌండ్రదేశంబునం - దటమీఁద
నలువొప్పఁ గాకంబు - నకుఁ బుట్టినావు,

పొలుపొంద హైహయం - బున మదదంతి
కలరి నీ వేనుఁగు - వై పుట్టినావు,190

134

వాసిష్ఠరామాయణము


కరఁగుచు నవలఁ ద్రి - గర్త దేశమున
నురుఖరగర్భమం - దుదయించినావు,

సురఘుం డనెడు వాని - సుతుఁడవై పుట్టి,
యిరవొంద సాళ్వ భూ - మేలు చుండితివి.

కటకటా! యి ట్లనే - క శరీరములను
పటు వేగమున నీవు - పక్షిచందమున

సంచరించితి వట్టి - జననీజనకుల
నెంచి, నీ వీతండ్రి - కేడ్చినరీతి

వారికి నేడ్వఁగా - వలదె? యజ్ఞాన
మీరీతి విడువలే - వే మందు నిన్ను?200

ధరణిఁ బూరుషునకుఁ - దల్లిదండ్రులును
బొరి ననంతంబులు - పొలసి పోవుదురు,

మురువొప్ప వన పత్ర - ములు రాలిపోవు
కరణి వ్రాలుచునుండుఁ - గాయముల్‌ పెక్కు,

లీ తల్లిదండ్రులు, - నీ బంధు మిత్రు,
లీ తనువులుం జూడ - నెపుడు శాశ్వతమె?

నీవు శోకింపకు! - నెమ్మది నొంది
పావన! విను మింక - బరతత్త్య సరణి,

మొనసిన యజ్ఞాన - మునఁ బుట్టు శోక
మును దత్త్వ విజ్ఞాన - మున నివారించు210

మది నహంభావంబు - మానిన, శోక
ముదయింప కణఁగి పో - వుచునుండు, మేను

నే ననునది మాని, - నే నను తెలివి
నే నని భావించి, - నిను నీవు చూడు'

135

తృతీయప్రకరణము


మని పెక్కు విధముల - నాత్మతత్త్వంబుఁ
బనిఁబూని పుణ్యుండు - పట్టి చెప్పినను,

విని, పావనుఁడు తెలి - విని, బొంది, యవలఁ
దనుఁ దాను భావించి - తత్త్వ విజ్ఞాన

కలితుఁడై, సకల దుః - ఖంబుల మఱచి,
యలఘు జీవన్ముక్తుఁ - డయ్యె' నటంచు 220

వరుసగాం బుణ్య పా - వనుల వృత్తాంత
మెఱిఁగించి, క్రమ్మఱ - ని ట్లనె మౌని

“యో రామ! విను ధర - నొక్క రొక్కరికి
సారసత్పుణ్యాతి - శయమున విషయ

వాసన లణఁగు, స - ర్వవిరక్తి గలుగు;

*బలి ఉపాఖ్యానము*



నీ సరణిని మఱి - యితిహాస మొకటి

వనిఁబూని విను! - తొల్లి బలిచక్రవర్తి
పనుపడ ధాత్రినిఁ - బదికోట్ల యేండ్లు

పాలించి, యట పుణ్య - ఫలపరిపాక
కాలంబు రాఁగ భో - గములను రోసి, 230

వరుసగాఁ దనకు భూ - ర్వము తనతండ్రి
యెఱుకకై యుపదేశ - మిచ్చిన వాక్య

సరణిఁ దలంచి, య - చ్చట నుండి పోయి,
సరసాత్ముఁడగు నిజ - జనకుని జేరి,

పాదపద్మములకు - భక్తితో మ్రొక్కి,
వేదాంత సూక్తుల - వినఁగోరి పలికె:

136

వాసిష్ఠరామాయణము


'జనక! యీ సుఖదుఃఖ - జాలముల్‌ పొడమ
ననిశంబు మూలమై - నట్టి దేశంబు

ఏది? యవిద్య, నీ - యీషణ త్రయము
నాదరణము సేయ - కణఁప విశ్రాంతి 240

పుట్టెడిచో టెద్ది? - భూరి సత్కరుణ
నట్టి చందంబు నా - కానతిం'డనిన

విని, విరోచనుఁ డతి - విశ్వాస మొదవఁ
దనసుతు నీక్షించి - తగ నిట్టు లనియెఁ:

'గొడుక! చిదాకాశ - కోణకోటరము.
కడువింత యగుచుఁ బ్ర - కాశింపుచుండు

నందు బ్రహ్మాండ కో - ట్లణఁగి వర్తించు,
నం దెన్న భూతంబు - లైదును లేవు,

అచటఁ దేజోమయుఁ - డాఢ్యుఁ డవ్యయుఁడు,
సుచరిత్రుఁడైన రా - జు వెలుఁగుచుండు, 250

నతనిని యుక్తిచే - నఖిలకార్యముల
హిత మొవ్ఫఁగాఁ బెంప - హెచ్చింపఁ ద్రుంపఁ

గా నేర్చినటువంటి - ఘనమంత్రివరుఁడు
పూని యం దుండ నె - ప్పుడటంచుఁ దెలుప,

నల బలి పల్కె ని - ట్లనుచు 'నో జనక!
కలకాల మలఘు ప్ర - కాశమై మించి,

వెలసి యాధివ్యాధి - విరహితం బగుచు
నలరు దేశం బెద్ది? - యది యెట్టి దరయఁ?

జెచ్చెర నేమిటి - చే నందుఁ బొంద
వచ్చు? నానృపుఁ డెట్టి - వాఁడు? తన్మంత్రి 260

137

తృతీయప్రకరణము


'యనెడు ధీరుం డెవ్వ? - డానతిం'డనఁగ
నెనసి విరోచనుం - డి ట్లని పలికె:

అనఘాత్మ! యొక దేశ - మనుటయే కాని,
ఘనతరంబైన మో - క్షస్థాన మదియె,

భూరిసద్దుణ పరి - పూర్జుఁ డవ్యయుఁడు
నా రా జనఁగఁ బర - మాత్ముఁ, డా ఘనుని

వరమంత్రి చిత్త, మీ - వ్యాపారగతినిఁ
దఱచుగా నింద్రి యా - ర్థములఁ బాలించు,

నరుదుగా నంతటి - కధికారి యగుచు,
నఱిముఱి నెనరి యం - దా పరమాత్మ 270

కడఁజేరనియక మా - ర్గంబున కడ్డ
పడి యావరించి, ప్ర - పంచమం దుండు,

నతని గెల్వక, నప్ప - రాత్మునిఁజేర
సతత మెవ్వరికిని - శక్యంబు గాదుఁ;

గానఁ జిత్తమును త - క్కక గెల్వవలయు,
నానియమం బిప్పు - డమర జెప్పెదను

విను విరాగంబు, వి - వేకంబు, శాంత
మును, బరమజ్ఞాన - మును గల్గెనేని

చిత్త శాత్రవునిఁ ద్రుం - చి పరాత్మచెంత
నత్తఱిఁ జేరుదు - లార్యు, లీయుక్తిఁ 280

దప్ప నేమిటను జి - త్తము గెల్వఁ గూడ,
దిప్పరమరహస్య - మెఱిఁగి వర్తింపు!

బలి! విను ధరణి న - ప్రాజ్ఞుం డనంగ,
నలరు నల్ప ప్రాజ్ఞుఁ - డనఁ, బ్రాజ్ఞఁ డనఁగ

138

వాసిష్ఠరామాయణము


మువ్వురు గల; రందు - మొనసి యప్రాజ్ఞుఁ
డెవ్వేళలను విష - యేంద్రియసుఖము

మరగి వర్తించు, స - న్మార్గంబునందుఁ
జొరక, విరక్తులన్‌ - జూచి హసించుఁ

దలఁపున శాస్త్ర చిం - తన మొకపాలు
గలుగఁగా నంతలో - గర్వింపుచుండు,290

వాని చిత్తము కర్మ - వాసనచేత
నూనదు మోక్షేచ్చ - నొకవేళ నైన,

నమర నల్పప్రాజ్ఞుఁ - డగు వాఁడు ధనము
విమలుఁడై కూర్చుచు - విద్వజ్ఞనులకు

వరుసగా నొసఁగుచు, - వారి సాంగత్య
మిరవుగాఁ జేయుచు, - నింద్రియ విషయ

సరణుల రోయుచు, - సాధు మార్గముల
నెఱుఁగుచు, మోక్షేచ్ఛ - నెనయుచుఁ, గ్రమము

గా తత్త్వ విజ్ఞాన - కలితాత్ముఁడగుచు
నాతత మోక్షార్హు - డగును నానాఁట;300

నతులిత ప్రాజ్ఞుఁడై - నటువంటి పురుషుఁ
డతిశయుఁ డన నొప్పు, - నతఁడు చిత్తమునఁ

దలఁచిన యంతనే - తాను వైరాగ్య
కలితుఁడై సకలభో - గముల వర్జించి,

గొనకొని సద్ధ్యాన - గురుపూజలందు
మొనయుచు వర్తించి - మోక్షంబు నొందు

నని తత్త్వవిజ్ఞాన - మావిరోచనుఁడు
వినిపింపఁగా, బలి - విని సమ్మతించి,

139

తృతీయ ప్రకరణము


యచట నున్నట్టి శు - క్రాచార్యుఁ జూచి,
ప్రచురభ క్తిని మొక్కి - పలికె 'నో గురుఁడ!310

నే నన నెవ్వండు? - నీ వన నెవఁడు?
ఈ నిఖిలం బెట్టి? - దెఱిఁగింపుఁ' డనఁగ

నక్కడ బలికి శు - క్రాచార్యుఁ డనియె:
నెక్కువ మాటల - కిది వేళగాదు,

అతివేగమున దివి - కరుగంగ వలయు,
హితమొప్ప మును పెద్ద - లెల్ల శోధించి

మిక్కుటంబుగఁ గని - మెచ్చుకొన్నట్టి
నిక్కంబు విను రజ - నీ చరాధీశ!

యొక్కయుక్తినిఁ దత్త్య - మున్నంత నీకుఁ
జక్కఁగాఁ జెప్పెద - సర్వంబు నందుఁ 310

జిక్కి చిక్కక యుండుఁ - జిన్మాత్ర మంత
కెక్కువ యగువన్తు - వెక్కడ లేదు;

అధియె నీవును, నేను, - నఖిలవిశ్వంబు.
ఇది యథార్థము సంశ - యింపకు మీవు;

ఇది నిశ్చయింపక - యెల్ల మార్గములఁ
జెదరిపోయిన వాఁడు - చేసిన వెల్ల

విరివిగా బూదిలో - వ్రేల్చు హవిస్సు
కరణినిఁ బడిపోవు, - గతి నియ్య దనఘ!

కదిసిన చిచ్భేద్య - కలితుఁడు బద్ధుఁ,
డది మాని తనుఁ జూచు - నతఁడు ముక్తుండు;320

కావున సతత మ - ఖండ భావమున
నీవు నిన్‌ గనుఁగొంచు - నెమ్మది నుండు!'

140

వాసిష్ఠరామాయణము


మని చెప్సి దివమున - కరిగె శుక్రుండు
దను జేశ్వరుండు త - త్త్వ జ్ఞాన నిష్ఠ

మఱుువక ప్రణవార్థ - మంత్రంబులోని
గురుతరార్థంబు ని - క్కువను దా నెఱిఁగి'

గతకర్ముడై నిర్వి - కార భావమున
జిత చైత్య చేతక - చేతనుం డగుచు,

విలసిత శ్రాంతుఁడై - విశ్రాంతిఁ బొంది,
తలఁపుచుండెడి వానిఁ, - దలఁపును, దలఁపఁ 330

బడువానిఁ దా నెడఁ - బాసి యేకముగఁ
గడలేని నిర్వాణ - గతి నొందె' ననుచు

బలియుపాఖ్యాన మే - ర్పడ రాఘవునకుఁ
జెలువొప్పఁ జెప్పి వ - సిష్థుండు మరలఁ

బలికి నిట్లని యిట్టి - పరమవిజ్ఞాన
మల యీశ్వరాను గ్ర - హంబుచేఁగాని

యెవరికిని లభింప - దీయర్థమందుఁ

*ప్రహ్లాదోపాఖ్యానము*



బ్రవిమలుఁడై నట్టి - ప్రహ్లదుఁ డాత్మఁ

దాను విచారించి, - తనుఁ దాను దెలియు
టేను చెప్పెద నది - యె ట్లన్న వినుము! 340

హరిభక్తుఁడైన ప్ర - హ్లాదుఁ డాచక్రి
నఱలేక సంతత - మర్చింపుచుండి,

'పరమాత్మ విశ్రాంతి - పర్యంతమైన
పరమవిచారంబుఁ - బరముగా వాత్మ

141

తృతీయప్రకరణము


యెనయఁ బ్రకాశించు - నే యెల్ల యెడల,
నని నాకు బోధించె - నంబుజాక్షుండు;

అది యెట్టిదో? నేను - నరయ నెవ్వఁడనొ?
పదవడి సృష్టి - విభ్రమము నెట్టిదియొ?

ఏది యంగీకార? - మెయ్యది కృత్య?
మేది నేఁ దెలియుదు? - నెక్కడఁ బోదు? 350

నడర భావింప నీ - యఖిల భూతములు
జడములే కాని, య - జడములు గావు

కావున నిది యాత్మ - గాదు, నా కన్య
మీ విశ్వ మని మది - నెఱుగంగ వలయుఁ,

బొరి జడం బనిల వి - స్ఫురణ, మనిత్య
మరసి భావించిన - నసదుద్భవంబు

గాన, దేహంబు ని - క్కంబుగా నేను
గాను, నే నెవఁ డనో - గణుతించి చూడఁ?

బసమించునట్టి శ - బ్ద, స్వర్శ, రూప,
రస, గంధ, గుణము లా - రయ వేను గాను, 360

అల మనో బుద్ధి చి - త్తా హంకృతులును
నెలవుగా భావింప - నే నవి గాను;

ఎఱుకయై యన్నిటి - నెఱుఁగుచు నుండు
సురచిర చిత్పూరు - షుండను నేను,

భావింపఁగా సర్వ - పరిపూర్ణ మగుచుఁ
దావలంబుగఁ బర - తత్వంబు నేను,

నాపరతత్త్వ మం - దఖిలేంద్రియములు
దీపింపు జగములు - దీపించుచుండు,

142

వాసిష్ఠరామాయణము


నల పరబ్రహ్మ మే - నైనందు వలన
నలువొప్పఁగా నేను - నా మాననమున390

నాకు మొక్కెదఁ జిదా - నంద సద్రూప!
శ్రీకరానంతాత్మ! - చిరకాలమునకు

నీవు నే నైతిని - నేను నీవైతి,
వీ విధంబున భేద - మించుక లేదు,

గనుక నే నాకు మ్రొ - క్కందగుఁగాన,
మొనసి నాకే నేను - మ్రొక్కెద ననుచుఁ,

దనలోనె భాషించి, - తనుఁ దానె మఱచి,
పనుపడ నిర్విక - ల్ప సమాధియందు.

నచలుఁడై పంచస - హస్ర వత్సరములు
లుచిత వృత్తిని నిల్చి యుండె, నంతటను390

ప్రాకటంబుగ రాజ్య - పరిపాలనంబు
లే కుండినందున, - లేచి చోరకులు

లోఁగక పాతాళ - లోకంబుఁ జెఱుప
సాగిరి, ధర్మంబు - సమసె నానాఁట,

నావిధం బెఱిఁగి మ - హాను భావుండు
శ్రీవిష్ణు దేవుండు - చిరకృప మీఱఁ

బక్షివాహన మెక్కి - ప్రహ్లదు చెంత
కక్షీణతేజోమ - యాంగుఁడై వచ్చి

కదలక మెదలక - ఖండ నమాధి
వదలని ప్రహ్లాదు - వరనిష్ఠఁ జూచి,390

ప్రేమతో జలద గం - భీర భాషలను
వే మా ఱుఁ బిలిచిన, - వినిలేవకున్న,

143

తృతీయప్రకరణము


హరి దిశల ఘూర్జిల్ల - నలఘు శంఖంబు
పొరిఁబొరివరుసగాఁ - బూరింపు చుండె:

సరసమై శ్రీ స్వామి - శంఖారవంబు
విరివిగాఁ బ్రహ్లాదు - వీనులలోనఁ

జొచ్చి మేల్కొల్పఁగా - సూక్ష్మలక్ష్యంబు
నచ్చట విడిచి, ప్ర - హ్లాదుండు చక్రి

చాలఁ బూరించెడి - శంఖారవంబు
మేలిమిగా విని - మేఘనాదంబు400

విని చొక్కు ఘనకేకి - విధమునఁ జొక్కి,
ఘనుఁడైన హరి నర - గన్నులఁ జూచి,

యప్పటికైన దే - హస్మరణంబు
తెప్పున రాకున్నఁ - దెలిసి మాధవుఁడు

తనలోనె నగుచు న - త్తఱినిఁ బ్రహ్లాదు
కనుదోయి నిమురుచుఁ - గరుణ నిట్లనియె:

'ఇదియేమి బాలక? - యేను నిన్నిందుఁ
బదపడి పిలిచినఁ - బలుక కున్నావు'

ననుఁ జూడు ననుఁ జూడు - నాదిక్కుఁ జూడు'
మని బుజ్జగింపఁ, బ్ర - హ్లాదుండు కనులు410

చక్కఁగాఁ దెఱచి యా - స్వామినిఁ జూచి,
మ్రొక్కి, కరంబులు - మొగిచినిల్చినను,

సంతోషమునఁ జూచి - చక్రాయుధుండు
వింతగా నతనిఁ దా - వీక్షించి పలికె:

'దనుజనాయక! నీవు - తనువు నలంపఁ
బనిలేదు, నీ వతి - ప్రజ్ఞ ప్రదీపింపఁ

144

వాసిష్ఠరామాయణము


బట్ట భద్రుండవై - పాతాళ లోక
మిట్టట్టు చెదరిపో - కేలుచునుండు!

గతనేయ హేయ సం - కల్పుఁడ వగుచు
హిత మొప్పు నిన్ను నీ - వెఱిఁగిన వెనుక 420

నీమేను కలిమిలే - మెంత మాత్రంబు?
కామాది శత్రువ - ర్గంబు నణంచి,

నీవు జీవన్ముక్తి- నియతినిఁ దనువు
తో విమలుండవై - తుదముట్టఁగాను

నరమర లేక క - ల్పాంత పర్యంత
మిరవొంద నీ రాజ్య - మేలుచునుండు!

మిను లొక్క మాటు ప - న్నిద్దఱుఁ బొడమ,
రనుపమ శైలంబు - లణఁగ వొక్కటను,

జగము లన్నియు నొక్క - సమయంబునంద
పొగిలి నశింపవు - పుణ్యాత్మ! నీవు 440

ఘటము నింత నలంపఁ - గారణం బేమి?
ఇట మీఁద విషయంబు, - లింద్రియంబులును

జొరఁబడి వేధించు - సుఖదుఃఖములును,
గర మనురాగంబు, - కర్మవాసనలు.

నిరతంబు బొంకించి - ని న్నంటకుండు
వరము లిచ్చితి లెమ్ము - వత్స! నీ వింక,

అళుకుచు మూఢుండ - వని తనుఁ దాను
తెలియక యూరకే - దీనుండ ననుచుఁ

బామరుండగు వాఁడు - బ్రతుకుట కన్న
భూమి మీఁద నణంగి - పోవుట లెస్స; 440

145

తృతీయప్రకరణము


పటుతరాశాపాశ - బద్ధుఁడై చిత్త
మటునిటు నీడ్వఁగా -నలమటంబడుచు

ధర శమం బొందక - తామసుండైన
పురుషుఁ డుండుట - కన్నఁ బోవుట మేలు:

దనుజేంద్ర! సర్వభూత స - ముండు నగుచుఁ
దానివొంద నాత్మబో - ధనిమగ్నుఁ డగుచుఁ

దొడరు నహంకార - దూరుఁడై శాంతి
నెడఁబాయ కెల్లపు - డెఱుకతో నుండు

విమలచిత్తునకు జీవిత మొప్పు నిలను
భ్రమల నెల్ల నణంచి - బ్రహ్మానుభవము 450

సేయుచుండెడి నీకుఁ - జింత యేమిటికిఁ?
బాయక నీ రాజ్య - పదముఁ బాలింపు'

మని యొప్పఁ జెప్పి, ప - ద్మాక్షుండు కృపను
పనిఁ బూని యతనికిఁ - బట్టంబు గట్టి,

యొనరంగ సఖియింపు - చుండు' మటంచు
దనుజారి యవల నం - తరాన మొందె.

అన విని శ్రీరాముఁ - డపుడా వసిష్ఠ
మునిని వీక్షించి యి - మ్ముగ నిట్టు లనియె:

'పనుపడి యత్యంత - పరిణతంబైన
దనుజాధివిభుని చి - త్తము పాంచజన్య 460

ఘనరవం బెసఁగ వే - కరణి మేల్కొనియె?'
నన వసిష్ఠుం డిట్టు - లనె 'రామ! వినుము

ధర నది యెట్లన్న - దగ్ధ బీజంబు
కరణి జన్మాంకుర - కారిణిగాక,

వరయోగి విమల హృ - ద్వనజంబునందు
సరసమై శుద్ధవా - సన గల్గియుండు,

నది పావనియు, నది - యధ్యాత్మవతియుఁ,
బొదుపగు నిత్య ప్ర - బుద్ధయై పొసఁగి,

మొనసి యనేకాబ్ద - ములకై నఁ జెడక,
యెనసి తత్తను వాశ్రయించి, యొక్కొక్క470

కాలంబు నందుఁ బ్ర - కాశించి, బాహ్య
మాలోకనము సేయ - నాకరం బగుచు,

విలసితమైన సం - విత్తత్త్వపటిమ
తెలివిగా వృద్ధిఁ బొం - దింపుచునుండుఁ

గావునఁ జక్రీశం - ఖనినాద మెరిగి,
యావేళ మేల్కాంచె - నసురనాయకుఁడు.

అనఘ! సంసారమా - యకు నవమాన
మనునది లేదు, ని - త్యముగాదు, లేక

కలిగియున్నటు దోఁచుఁ - గావున, దాని
నలరారు చేతో జ - యంబున నణఁప480

వచ్చు, మఱేమిటన్ - వారింపరాదు,
హెచ్చుచునుండు న - దెట్లన్న వినుము!

అరుదుగా లవణు వృ - త్తాంతంబుఁ బూర్వ

గాధి ఉపాఖ్యానము

మరసి చెప్పితి, నిప్పు - డటు వంటి గాధి

చరితంబుఁ జెప్పెదఁ - జక్కఁగాఁ దెలియు;
మురునిష్ఠ నాది దే - వుండైన హరిని

ధ్యానించి గాధి గో - దావరి నీట
పూని యుగ్రతపంబుఁ - బొనఁగఁజేయఁగను,

నతనికిఁ బ్రత్యక్ష - మై చక్రి 'వరము
హితమొప్ప నడుగు నే - నిచ్చెద' ననిన 490

ముఱియుచు నాగాధి - మ్రొక్కి 'నీ మాయ
నెఱిఁగెడి యావరం - బీవె లక్ష్మీశ!'

యన విని హరి గాధి - కా వర మిచ్చి
చనె, నట కొన్ని వా - సరములు జరిగెఁ;

దదనంతరమున గో - దావరి నీట
ముదముతో నా గాధి - మునిఁగి యచ్చోట

నలువొప్ప నఘఘర్ష - ణముఁ జేయు తఱిని
వెలయ గాధికిఁ జిత్త - విస్మృతి పొడమఁ,

దనయింటిలోఁ దన - తనువును వీడి
చని వేగ హూణ దే - శమునఁ జండాల 500

భామ గర్భమునందుఁ - బ్రభవించి పెరిఁగి,
యా మీఁదటను బెండ్లి - యాడి, బిడ్డలను

గని పెంచుచుండఁగాఁ - గాల వేగమునఁ
దన బిడ్డ, లిల్లాలు - తనువుల వీడి

చనినట్టి జాలిచే - సైరింపలేక
కనలుచు, నవల న-క్కడనుండ కరిగి

పోయి, తెప్పునఁ గీర-పురిఁ జేరియుండె;
నా యవనీశ్వరుఁ - డచట దేహంబు

పడవైచి చనఁగ, న-ప్పార్థి వేంద్రునకుఁ
గొడుకు లేకున్నఁ. ద-త్కుల మేలుటకును 510

దగిన వాఁ డెవఁడని - తాము చింతించి,
తెగువ నారాజు మం-త్రి జనంబుఁ గూడి

మొనసి పట్టపుగజ-మును నలంకార
మొనరఁ గావించి, పువ్వులదండఁ దొండ

మున నుంచి విడిచి, రి-మ్ముగ నదిపోయి
తనముందరికి వచ్చు - ధరణీసురులను,

పరరాజకులజుల, - వైశ్యశూద్రులను
దఱుముచుఁ జనిచని - తా నొక్క చోట

నాలుబిడ్డలఁ బాసి - యడలు చున్నట్టి
మాలని మెడఁ బుష్ప-మాలిక నుంచె 520

నపుడు మంత్రులు మొద-లైనట్టి వారు
కపటంబుఁ దెలియక - గజముపై వాని

నెక్కించుకొని చని - యిలఁబ్రోవ నతని
నక్కడ తాము ప-ట్టార్హునిఁ జేసి
కొలిచి యుండఁగ, వాఁడు - కొంకింత లేక
చలితాత్ముఁడై రాజ - సతులను గూడి,

పనిఁ బూని వేడ్క నేఁ బది యేండ్లు రాజ్య
మొనరంగఁ బాలింపు-చుండె నొప్పుగను.

అట హూణ దేశంబు - నందుండి మాలఁ
డట కొక్కఁ డరుదెంచి - యా దొరం గాంచి, 530

తొలఁగక పూర్వ బం-ధుత్వంబు నందుఁ
దెలుపఁగా నెఱిఁగి, మం-త్రి పురోహితాది

మనుజులు దెలిసి, 'యా - మాలనిఁ దెచ్చి
ఘనముగాఁ బట్టంబుఁ గట్టినకతనఁ

బాప మందఱికినిఁ - బ్రాపించెఁ గనుక,
నీ పాపమును నీఁగ - నిందఱ మగ్ని

యందుఁ బ్రవేశింత' - మని నిశ్చయించి,
యందఱు గుమిగూడి - యగ్నిలోఁ బడిరి.

అదిచూచి చండాలు - డైన యా ప్రభువు
'కొదికి యందఱు తన-కొఱ కగ్నిలోనఁ 540

బొలిసి పోయిరి, తాము - భూమిలో నుండ
వలయునే' యనుచుఁ బా-వకునితో వాఁడు

తానును దుమికి య-త్తఱిఁ దెలివొంది,
యానీట నున్న దే-హంబుతో లేచి.

'కటకట! యిటువంటి - కష్ట దుర్దశల
కిటువలె లోనైన - దేమొకో? నాల్గు

గడియలలో నింత - కర్మదుఃఖములఁ
బొడఁగంటి, నిట్టి య-ద్భుత మేమి చెలఁగె!

గహనంబులందు వ్యా-ఘ్రము నిజేచ్ఛలను
విహరింపుచుండెడి - విధమున సకల 550

మానవుల నశక్తి - మాయలోఁ ద్రోసి,
యూని తా భ్రమ పెట్టు-చుండుఁ జిత్తంబు'

అనుచుఁ దలంచి ని-జాశ్రమంబునకుఁ
జని, గాధి చింతించు - సమయంబునందుఁ
బురిని వింతగ గీర - పురి నుండి యొక్క
ధరణీసుతుఁడు గాధి - దగ్గఱఁ జేరె
ఆ విప్రవరుఁ జూచి - యా గాధి పూజఁ
గావించెఁ నటుమీఁద క్రమముగాఁ గీర
పురవాసు లందఱుఁ - బొలిసినవిధము
వరుసగాఁ జెప్పిన - వార్తలన్నియును560
విని గాధి యది తన - వృత్తాంతముగను
మనమున భావించి - మఱునాఁడు పొయి
కరఁగుచుఁ దాఁ గలన్ - గన్నమార్గమున
సరగున హూణదేశముఁ బ్రవేశించి,
యచ్చటఁ దల్లిము - నాలు బిడ్డలును
జచ్చినచోట్లు ని-శ్చయముగాఁ జూచి,
పోయి చెచ్చెరఁ గీర - పురమందుఁ జేరి
యాయెడఁ దనకొఱ - కనలంబులోన
నాపురజనులంద ఱణఁగుట గాంచి,
తాపమొందుచును వి-ధాతచేఁతకును570
గడు వెఱఁగొంది, యక్కడినుండి కదలి,
తడయక క్రమ్మఱ - దావచ్చి యవలఁ
బెలువార పలసిన - సింగంబు రీతి
నలసి, పూర్వాశ్రమ - మందుండ కరిగి,
తక్కక యొక శైల - తటమందు నిలిచి,
యొక్కఁడౌ విష్ణుదేవునిఁ గూర్చి తపము

సలుపుచు నుండఁగా - జలజాక్షుఁడతని
కలరారఁ బ్రత్యక్ష-మయ్యె, నాహరినిఁ

గని లేచి నమ్రుఁడై - గాధి తా మ్రొక్కి
మొనసి కరంబులు - మొగిచి యిట్లనియె: 580

'ఓ నలినాక్ష! నే - నుదకమధ్యమున
నూని స్నానముఁ జేయు-చుండఁగా నాల్గు

గడియలలో బహు కాలదు:ఖముల
చెడి తేర కనుభవిం-చిన కర్మ మేమి?

ఈ చిత్త విభ్రమం - బేల జనించె?
నోచక్రి ! తెలుపవే ! - యున్న దున్నటుల

ననవుడు విని విష్ణుఁ -డా గాధి కనియె:
'వినువిప్ర! నీ వది విశదంబు గాను

నెలమిని భూమ్యాదు - లీ చిత్తమునకు
వెలిగాక యచటనే - విరివిగా నుండు, 590

మనమున నవ్విభ్ర-మస్వప్న గతుల
ననుభవించితివి, నీ - వఖిలకృత్యములఁ

దలఁచి కల్పించు చి-త్తమునకుఁ జూడ
నిలను జండాలత్వ - మెందైనఁ గలదె?

శ్వపచత్వ మొందిన , సరణి నీమదికి
విపరీతముగఁ దోఁచు - విధమున, నతిథి

గనిపించె, మఱియు - నక్కడ హూణ దేశ
మునను చండాలత్వ-మునఁ బొంది నీవు

నగమందుఁ జేరి, నా - నాత్మ విభ్రాంతి
తెగువగా విడిచి, య-దే విచారముగఁ

దప మాచరించి త-త్త్వజ్ఞాని యగుచు
నిపుణతచేఁ బొందె - నిర్వాణపదము.

శ్రీహరి ధ్యానంబు - చెడక భక్తులను
మోహాబ్ది దాఁటించి - ముక్తిఁ బొందించు'

నని, గాధివృత్తాంత - మా వసిష్ఠుండు
మనము రంజిలఁ జెప్పి - మరల నిట్లనియె:

'ధరణీశ ! రామ! చి-త్తజయౌషధంబు
సరసమై సంసార - జాడ్యంబు నణఁచు: 650

వేరె వెరవుచేత - విడువ దారోగ,
మారయ వృద్దియౌ - నటుగాన, నందు

అంటక చిత్తంబు - నణఁచునుపాయ
మొంటిగా నూహింపు - చుండఁగావలయు;

మెలపుగాఁ గ్రిందటి - మీఁదటి కాల
ములఁ గల్గు సుఖదుఃఖ-ములఁ దలంపకయ

మానుచుఁ, దగ వర్త-మాన కాలమునఁ
బూనిక ననుభవం-బునకు వచ్చినది

యనుభవింపుచు బాహ్య- మందు వర్తింపు
చును, నిజాంతర్య భా-సుర లక్ష్యమందుఁ 660

బొంది సూక్ష్మంబైన - బుద్ధియం దమరఁ
జెందినఁ జిత్తంబు - ఉత్పద మొందుఁ:

గ్రమముగా భోగ సం-కల్పముల్ విడిచి,
మమతాహముల మాని, - మది చల్లనైనఁ

జిరతర భావనా - సిద్ధి నీ యాత్మ
నెఱుకకు నెఱుకయై - యింపొందుచుండు;

తొడరెడి చిత్తవృ-త్తులు నశింపకయ
విడువదు సంసార - విభ్రమం బెపుడు.

ఉద్దాలకోపాఖ్యానము



తన రారఁ బూర్వ ము-ద్దాలకుం డనెడు
మునిపుంగవుఁడు చిత్త-మును గనిపట్టి, 670

పనిఁ బూని శిక్షించి - పరమందు జెందె;
ననిన శ్రీరాముఁ డి ట్లనె మునినాథ!

గొనకొని యుద్ధాల-కుఁడు నిజచిత్త
మును గెల్చి సంతోష-మున ముక్తుఁడైన

తెఱఁగు నా కతికృపఁ - దెలుపవే! యనినఁ
జిఱునవ్వు నవ్వి వ-సిష్ఠుఁ డిట్లనియె:

'అనఘాత్మ! యుద్దాల - కాఖ్యచే నొప్పు
ముని గంధమాధన-మున కేఁగి, యచట


ఘనతరంబుగ వివే-క స్వాంతుఁ డగుచుఁ
దనలోనఁ దా నిట్లు - దలఁచె నంతటికిఁ 680

బరమ ప్రధానమై - ప్రాప్తమైనట్టి
సరసప్రకాశ మె-చ్చట నుండి చూతు?

నే నెన్నటి కి దుఃఖ నీరధిఁ గడచి.
యానంద మొందుదు? ననుచుఁ జింతించి,

గ్రక్కున సకల సం కల్పముల్ విడిచి,
యక్కడఁ బద్మాస - నాసీనుఁ డగుచు

హరినిఁ గుఱించి మ-హా నిష్ఠమీఱఁ
జిరతర తప మొప్పఁ-జేయుచు నుండె:

నప్పు డతని చిత్త - మాధ్యానపటిమ
నెప్పుడో విడిచి తా-నేమేమొ తలఁచి, 690

క్రోఁతికైవడిఁ దిరు-గుచునుండు టెఱిఁగి,
యా తాపసుఁడు రోష - మగ్గలింపఁగను

ఆ చిత్తమును బట్టి-యంతరంగమున
నా చక్రధరుని పా-దాబ్జంబులందు

నిలిపి బంధించిన, - నిగుడి చిత్తంబు
తలఁపు లేమో తాను - దలఁపుచు, విషయ

వాసనలను గూడి - వర్తించి మరల
నా సంయమీశ్వరు - నచట వంచించి,

తక్కక పక్షి చం-దమున బాహ్యమున
దిక్కుల నెగురుచుం - దిరుగుచు మించి, 700

యొకవేళ నభమునం - దుదయార్కు పగిదిఁ
గకపెకఁ జేయుచుఁ - గనిపించుచుండు;

నొకవేళ గగన మ -ట్లూరక యుండు,
నొకవేళ శూన్యమౌ, - నొకవేళ నుఱుకు:

నొకవేళ స్థిరముగా - నుండిన ట్లుండు;
నొకవేళ యోజన - లూరకె చేయు;

నీవిధంబున నిల్వ - కెగురు చిత్తమును
భావించి, యచ్చోటుఁ - బాసి యాతపసి

భూమిఁ బరిభ్రమిం - పుచును జరించి,
యా మీఁద నొక్క నాఁ - డందొక దిక్కు710

తెరలు చిత్తంబు ను-ద్దేశించి తాను
పరుఁడై వివేకించి - పలికె ని ట్లనుచు:

'అక్కట చిత్తమా ! - హరియందు నిలువ
కెక్క. డికో తేర - కేగుచున్నావు.

ధరను మాయా సంప-దల విచారించి,
కరఁగి నీవేమి సౌ-ఖ్యముల నొందెదవు?

కామంబు లతిదుఃఖ-కరము లటంచు
ధీమంతులగువారు - తెలిసిన వేళ

నీ ప్రయత్నంబులు - నిరసింతు, రప్పు
డీ ప్రపంచముతోడ - నేఁగెద వీవు, 720

ఇంతలోన నిట్టి - హింసలఁ బెట్టి
నంతట నీ కేమి - యబ్బె సౌఖ్యంబు?

శాంతామృతముఁ గ్రోలి - సంతసింపకను
వింత వింతలు చూపు - విషయసౌఖ్యముల

మరగి నీ వరుగు టి-మ్మహిని సంతాన
తరు వాశ్రయింప, కా - తపకాలమందు

మరుభూమిలోఁ జైత్ర - మధ్యాహ్నమునను
చరియింపు చుండెడి - చందంబుగాదె?

మురియుచుఁ బాతాళ-మున నుండు, మింటఁ
దిరుగుచు నుండు మే-తెఱఁగున నైనఁ 730

దఱుదైన శమనామృ-తంబు గ్రోలకను
దొరకదు నీకు సం - తోష మెందునను,

మొనసిన కల్మిలే-ములు దలంపుచును
పనిఁబూని సుఖదుఃఖ - పరవశత్వమునఁ

జొక్కి స్రుక్కుట మాని - సుస్థిరజ్ఞాన
మొక్కటి సంతోష - మొసఁగు నటంచుఁ

దెలియలే వైతి వింద్రియములకెపుడు
వలనుగా దాసుని - వలె మెలంగుచును,

పరువడిగా శ్రోత్ర - భావంబు నొంది,
మురిసి ఘంటా నాద-మును విని చొక్కి 740

యుడుగక వేఁటకా - డొడ్డిన వలను
బడు జింక గతిని లోఁ-బడకువే మనస!

చర్మభావము నొంది - సంస్పర్శ సుఖము
సర్మిలిఁ గోరి మ-హా గజేంద్రుండు

కరణితో నెరయ న-క్కడఁ బర్వుఁ బాఱి
యరిగి యచ్చటి యోద-మందుఁ దాఁగూలు

కరిణిని సంసార - గహన కూపమునఁ
బరువడి నెఱిదప్పి - పడకువే మనస!

వదలక రసనభా-వము నొంది యెఱ్ఱ
నదిమి మ్రింగెద నంచు - నరిగిఁ గాలమును

మ్రింగి చచ్చినయట్టి - మీనంబు పగిది!
బొంగుచు రుచిఁ గోరి - పొలయకే మనస! 750

నేత్రభావము నొంది - నీగుడుచు మీన
నేత్రలు మొదలుగా - నెఱయు దృశ్యముల

యం దాసపడి యగ్ని - నణఁగిన మిడుత
చందంబుగా నీవు - చావకే మనస!

పనుపడి నాసికా-భావంబు నొంది,
ఘన సుగంధముఁ గోరి-కమలమధ్యమున

జెఱయున్న భృంగంబు - చెలువునఁ గర్మ
చిరవాసనలయందుఁ జిక్కడే మనస!

మెఱయు జింకయుఁ, గరి, మిడుత, మీనంబు,
నరయఁగా భృంగ మి-ట్లాశలఁ బొంది, 760

యొక్క టొక్కటిచేత - నొకటొక టణఁగు
నక్కట! యిటువంటి - యైదింద్రియముల

నెనసియుండంగ నీ-వెటు తరించెదవు?
చెనఁటుల పొందు వ-ర్జింపవే మనస!

అటువంటి వాసన-లన్ని బంధకము,
లిటువంటి రీతుల - నెఱిఁగి, వైరాగ్య

చింతన సతతంబుఁ జేసిన నీవు
శాంతిఁ బొందెదవు ని-శ్చయముగా మనస!

ఈ వఱ కేను ని-న్నెఱుఁగక భ్రమసి,
నీవె నే ననుకొని - నీవు గావించు 770

పనులు నేఁ జేసిన-పను లంచుఁ దలఁచి,
నిను వేఱుఁగాఁ జూడ-నేరకుండితిని;

సతతమందున నీవు-శాంతిఁ బొందకను
హితశత్రు పగుచు న-న్నేఁచుచుండితివి.

పరమాత్మ నంతట భావించి చూచి,
నిరుపమ ప్రజ్ఞతో నిన్ను మ్రింగెదను;

మఱి కరి మ్రింగిన - మారేడు పండు
కరణి నాలో నీవు - కరఁగి పోయెదవు.

కావున నీవు సం-కల్పముల్ విడిచి,
శ్రీవిష్ణురూపంబుఁ - జెందక మించి, 780

యవయవకలిత దే-హము నాశ్రయించి,
యవిరళంబుగ నాత్మ-యందున్న నిన్నుఁ

గని పట్ట శక్యంబు-గా దెవరికైన,
నని నిక్కుచుంటివా? - హరికటాక్షమునఁ

జిక్కితి విపుడు నా చేత, బొంకించి,
యెక్కడఁ బోయెద - వింక మీఁదటను?

సకలప్రపంచంబు - సత్తాస్వరూప,
మకలంక, మద్వయ - మని నిశ్చయించి,

యా యాత్మ నే నైన - యప్పుడు వేఱె
నీ యత్నములు సాగు - నే వెఱ్ఱిమనస! 790

అలరుచు దేహేంద్రి-యములు నే ననుచుఁ
దెలియుచుండెడి తెల్వి - తేటయై తుదను

అ పరబ్రహ్మమై - యంతట నిండి,
దీపించు నారీతి - తెలియనీయకను

అజ్ఞానవైరి ని-న్నలమటఁ బెట్టెఁ;
బ్రజ్ఞచే నటువంటి - పాపాత్ముఁ బట్టి,

తునుమాడి యధిక సం-తోషంబు నొంది,
యనిశంబు నీ వాత్మ-యందుండు మనస!

నిన్ను నే నెఱుఁగుదు - నిశ్చయంబుగను,
నన్ను నీ వెఱిఁగిన - నాత్మ విభ్రాంతి 800

విడువు, మటంచు వి-వేకంబు మదికిఁ
బొడకట్టి, బహువిధం-బుల బోధసేసి,

విడువక, యటమీఁద - విషయేంద్రియముల
కెడము తానై ప్రేమ - ని ట్లని పలికె

'నెలవుగాఁ దనకుఁ దా-నే బంధకంబుఁ
గలిగించుకొని, యందుఁ- గడపటఁ జిక్కి,

కరఁగిచచ్చు పసిండి - కాయలోఁ బురుగు
కరణి నాశాపాశ - కలితదుఃఖముల

ననుభవించితి రింద్రి-యములార! మేలు
వినుఁడు ! నేఁ జెప్పెద - విషయవాసనలఁ 810

బొందక, వైరాగ్య - బుద్ధితోఁ గూడుఁ
డందున్న సుఖము మీ - కబ్బు నిక్కముగ'

ననుచు నింద్రియముల - కాప్తవాక్యముల
వినిపించి, యటమీఁద - విషయవాసనలఁ

గని యిట్టు లనె నింకఁ - గరణంబులందుఁ
జుణుఁగుచు మీరింకఁ - జొచ్చి వేధింప

వలవదు, దృఢముగా - వైరాగ్య బుద్ధి
నిలఁగూడి వర్తింపుఁ - డిందున మీకుఁ

గలుగు సౌఖ్యం బని - గట్టిగాఁ జెప్పి,
తొలఁగని యజ్ఞాన - ధూర్తు నీక్షించి 820

పలికె ని ట్లని త్రాటఁ - బా మున్నకరణి
నలఘు పరబ్రహ్మ - మం దుండి నీవు

విపరీతములు చూపి - వెఱపింపుచుంటి,
విపుడు నీ మూలంబు - నెఱిఁగితి: నిన్ను

గావను, సుజ్ఞాన - ఖడ్గంబు నెత్తి
యీ వేళ నినుఁ ద్రుంచి - యిలపై నణంతు'

నని ప్రతాపింపుచు - నజ్ఞానధూర్తు
ననఘుఁడై ఖండించి,-యచలాత్ముఁ డగుచు

నట శుచి స్థలినిఁ బ-ద్మాసనమందు
ఘటికుఁడై కూర్చుండి - కనుఁగవ మోడ్చి, 830

ధారాళముగ మారు-తమును రేచించి,
పూరించి కుంభకం-బున నిల్పి, మదిని

నెఱిఁగి ప్రాణములతో - నింపొందఁ గూర్చి,
పరఁగ హృదగ్నినిఁ - బ్రబలింపఁ జేసి,

కాయ మా యగ్ని క-క్కడ సమర్పించి,
మాయ నడంచి ని-ర్మల భావుఁ డగుచు,

సరవి నాధారాది - చక్రషట్కంబుఁ
గర మొప్ప దాఁటి, శృం-గాటకమందుఁ

గదలక నాసికా - గ్రంబు పై దృష్టిఁ
గదియించి నడిమి మా-ర్గంబునఁ బోయి, 840

కర మర్థితో దీర్ఘ - ఘంటారవంబు
మొఱయు సహస్రార - మునఁ జేరి, యవల

చలమున నూరక - శ్రమ నొందు ప్రాణ
ములు చేతనామృత-మున శాంతికొఱకుఁ

బొంది, తదాకాశ-మున దోఁగి చాల
నందు సంపన్నంబు - లయ్యె నయ్యెడను;

మనము నంతర్బాహ్య - మధ్యంబులందు
ననఘమై, పరిపూర్ణ-మై నిండియున్నఁ

బరతత్త్వమునఁ బొంది - పరమసంతోష
భరితమై వెలి చలిం-పక నిల్చియుండె. 850

తపసియు హృదయాగ్ని - దగ్ధ దేహంబు
నపుడు బోధామృత - మం దుంచి, శాంతిఁ

బొందించి, చక్రిరూ-పు ధరించి, శమము
నొంది. కొన్నాళ్లట్ల - యుండి, పిమ్మటను

గ్రమ మొప్పఁగా నిర్వి-కల్పసమాధి
నమరఁగా సాధింప, నంతరంగమునఁ

బరఁగఁ దోఁచిన ప్రతి - భాసల నాత్మ
కరవాలమున వేగ - ఖండించి వైచి,

భ్రమ పెట్టు తద్వి క-ల్పనముల నెల్లఁ
బ్రమదంబుతో నెడఁ బాసి, యామీఁద 860

నమలమై నట్టి హృదాకాశమందుఁ
గమలాప్త చంద్ర ప్ర-కాశముల్ గప్ప

నమరు నజ్ఞాన గాఢాంధకారమును
సమయించి, మీఁది తే-జంబును గాంచి.

ఘనతరమైనట్టి - కమలాకరమున
మొనసి చొచ్చిన గజం-బు విధంబుగాను

మొనసూపు తత్తేజ-మును దునుమాడి.
యను వొందఁ దేజో, మ-హాంధకారంబు

లను మోహ, నిద్రల-నటు దాఁటి, యోగి
వినుత మైనటువంటి - విశ్రాంతి! బొంది. 870

సరసత ధ్యానాను - సంధానపటిమ
నఱిముఱి ధన్యమై, - యచలమై. మఱియు

విమలమై, యాత్మ సం-విత్పరిస్పంద
నముచేతఁ గనకంబు-నవ్యభూషణము

తానై వెలుంగు చం - దంబున విశ్వ
మై, నిరుపమ చిన్మ - యత్వంబు దాల్చి,

తడయక యాత్మ చి - త్తమున నైల్యంబు
విడిచి, చిత్తంబును - విడనాడి, శుద్ధ

చిత్తస్వభావ మం-చితముగాఁబొందె:
నత్తాపసుండు బో-ధానురక్తినను 880

వలనుగా వాసనా - వర్ణితుఁ డగుచు
నల చిదంబర రూప-మై ప్రకాశించి,

యనుపమపరమామృ - తార్ణవ మందు
మునిఁగి, తద్రూప మి - మ్ముగ విడనాడి,

యరుదుగా నిదమిత్థ - మనరానిచోట
మఱియును సత్తా స - మానత నొంది.

వరపరమానంద వార్థి తా నగుచుఁ,
బరఁగ నిర్వాత దీ-పము భంగి నిలిచి.

భాసురచిత్ర రూపము మాడ్కిఁ జేష్ట
బాసి, చలింపక - బ్రాహ్మణోత్తముఁడు 890

అట ఘనానంద ప-ద్మాకరమందె
యలఘుచిన్మయ హంస-మై యొప్పుచుండె.

అ రీతిఁ జిరకాల - మందున్నఁ జూచి,
యోరుపు చాలక - యురువిచిత్రములఁ

దొడరి చూపుచు దేవ దూతలు మించి,
కడువడి యోగ వి-ఘ్నములు సేయఁగను,

నా యతిశాంతుఁడై-యచ్చోటు విడిచి,
పోయి యొక్కకదినం-బొక్కొక చోట,

నొకచోట నొకమాస, - మొకవత్సరంబు,
నొకచోటఁ బెక్కేండ్లు - నుండి పోవుచును, 900

శాంతుఁడై తాపసా-శ్రమములయందు
వింత వింతల నొప్పు - విపినంబులందు

వలనొప్ప విమలజీ - వన్ముక్తుఁ డగుచు,
నలుఁగక యిచ్ఛావి-హారియై తిరిగి,

అలఘు చిత్తత్వ ఘ-నా భ్యాసములను
బొలుచు నా చిత్తును - బొంది యా మీఁదఁ

జెలఁగు చిత్సామాన్య - చిదనుభవంబు
వలన నుద్దాలక - వరయోగివరుఁడు

నలిని సత్తాసమా-నతఁ బొందె ననఁగ
నలరి రాఘవుఁ డిట్టు -లనియెఁ గ్రమ్మఱను 910

'మౌనీంద్ర! సత్తాస-మానత యెట్టి ?
దానతీయు 'డటన్న నమ్ముని పలికె.

అనఘాత్మ! తన కన్య - మైనది మిథ్య
యనుభావనను జిత్త - మణఁగఁగా నపుడు

సహజమైనట్టి చి - త్సామాన్యమునకు
మహనీయ సత్తా స-మానత గలుగు,

మొదటి సంశయ భయం-బు లణంగునట్టి
పదమందుఁ జెంది ప్ర-పంచగేహమున

లలితుఁడై కొంతకా-లంబు వర్తించి,
యలఘు శాంతినిఁ - బొంది. యచలసమాధి 920

యందుండి, తద్దేహ - మట విసర్జించి,
యెందులఁ గొదువ లే-కిరవైన బ్రహ్మ

పదమందుఁ బొందె నా-బ్రాహ్మణోత్తముఁడు;
కొదుక కీ యుద్దాల - కుని చరిత్రంబు

వినిన మానవు లతి - విమలాత్ము లగుచు
ఘనముక్తి మార్గంబుఁ-గని సుఖింపుదురు.

ధరణీశ! నీవు ను-ద్దాలక మౌని
కరణి నిన్నే నీవు - గనుచు, విశ్రాంతి

నొంది, యుత్తమమైన యున్నతపదము
నందు వర్తింపుచు నానంద మొందు'

మనిన మౌనికి మ్రొక్కి, యా రాఘవుండు
మనమున నూహించి - మరల నిట్లనియె:

మునినాథ సంసార - మున నుండి యొక్కఁ
వసఘు(జై సుజ్ఞాని - యగుచు విశ్రాంతిః

బొంది సంసార మొప్పుగఁ జేయుచుండు,
మందతన్ విడచి స - మాధిఁ గావించు;

నటుగాక మఱి యొక్కఁ డారణ్యములను
పటువిరాగమునఁ బ్ర పంచధర్మముల

మణచి యే వేళ సమాధిఁ గావించు:
నకడు నయ్యిచఱి-యం దధికుండు

ఎవఁ? డన్న నవ్వి ము-నీంద్రుఁ డిట్లనియె:
'అవనీశ! చెప్పెద - నా రెండు గతుల

విను మెట్టు లనిన వివేకాత్ముఁ డగుచు
గొన మొదల్ గని, సర్వ గుణ సముహంబు

జడమంచు, నాత్మ య బడమంచుఁ దెలిసి,
యడరఁ దదాత్మ తా నని నిశ్చయించి,

యాంతరంగిక దృష్టి ననవరతంబు
శాంతుఁడై చిత్త విశ్రాంతి వహించి,

పనుపడు దృశ్య ప్ర-పంచంబు మిథ్య
యని తాను ధ్యానించు-నటువంటివాఁడు

హాయిగా సంసారి - యై యున్న నేమి?
పోయి తపోవనం-బున నున్ననేమి? 950

కొఱఁత లే, దతఁడు ము-క్తుం డెచ్చ టున్న,
నరుదుగా సంసారి యగు యోగి కెపుడు

ధర నిరుపాధి చే-తశ్శీతలత్వ
మిరవగుటం జేసి యేపు డరణ్యమున

ఘనతరవైరాగ్య - కలితుఁడై, యోగ
మొనరించి, విమలుఁడై-యుపశాంతుఁడైన

యతనికి, నతనికి - నరసి చూచినను
గతియొక్కటే, రెండు - గతులు గా వనఘ!

లలినిఁ జేతశ్శీత - లత్వంబు మదిని
నిలువక చలియించె - నేని, యేమఱక 960

మఱి హఠయోగ స-మాధిఁ గావించి,
పొరినిఁ దచ్ఛాంతినే - పొందఁగావలయు,

నమరి యనంతుబు-లగు చిత్తతాండ
వము లెల్ల నుపశాంతి - వలననే కాని,

మఱి వేఱె గతి నవి - మాన్పఁగా రాదు,
సరవి నందున శాంతి - సాధింపవలయుఁ;

తరమిడినట్టి శాం తగుణంబు చేత
మఱి మఱి చిత్త స-మాధాన మొదవు.

అంతటి యోగికి - నఖిలవాసనలు
శాంతంబులగు; సర్వ - సముఁ డగు నతని 970

మది బాహ్య మందే క్ర-మంబున నున్న
నది చిన్మయంబై స-దానంద మొందు.

సందేహరహితుఁడై, - శాంతుఁడై, మమత
యందంటి, యంటక - యచలాత్ముఁడైన

ఘనుఁ డింటిలో నున్న - గహనమందున్నఁ
గనుఁగొన నా రెండు గతు లొక్క సమమెఁ:

వలనుగా నిట్టి స-ద్వాసన నొంది.
చెలఁగు చిత్తం బేమి - చేసినఁ గాని,

సేయనిదే యగు. - సిద్ధ మీవాక్య:
మీ యర్థమున సంశ-యింపకు మీవు, 980

ఆసల రోసి ని-రాసక్తి నొందు
భాసురజ్ఞానాను-భవముచే స్వల్ప

వాసనఁ గలిగిన - వరచిత్త మన్ని
చేసి, చేయనిదియై చిత్తులో నణఁగు:

అల మానసము దూర - మరిగి యం దొకటి
నలరఁగా ధ్యానించు-నట్టి కాలమునఁ

దనువందు వెల్గు నా-త్మసుఖంబు, దు:ఖ
మొనర నెఱుంగక - యూరక యుండుఁ

గావున, సకలవి కారముల్ మదిని
నా విమల చిదాత్మ- కంట దెద్దియును; 990

నావిధ మెట్లన్న - నమర స్వప్నమున
బావిలోఁబడి లేచి , బాగ మేల్కొనిన

వాని యంగములకు - వచ్చునే హాని?
మానవేశ్వర! దాని - మర్మ మె ట్లనిన

మనమున నెద్ది స-మ్మతముగాఁ జేయ
కునికి సమాధాన - మూహించి చూడఁ

జెలువొప్ప నిరతంబు - చిత్తశాంతంబు
గలుగు ధన్యునకు జ-గంబు భావింప

సతతంబు చల్లనౌ, - శాంతంబు లేని
యతనికి దావాగ్ని-యై తోఁచు జగము; 100

కావున శాంతమే - గావలె నరున,
కే విధంబుననైన- నిది నిశ్చయంబు.

ఇయ్యర్థమున నిపు - డితిహాస మొకటి
నెయ్యంబుతో విను - నేను చెప్పెదను.

సురఘూపాఖ్యానము



సురఘుల డనెడు రాజు - సుస్థిరుం డగుచు
నఱిముఱిఁ దగు నిగ్ర - హానుగ్రహముల

ధరణి నేలుచు రాజ్య - తంత్రంబు నడుప,
మురువొప్ప సుఖదుఃఖ-ములను జిత్తంబు

పరిభూతమైన స-ప్పార్థివేశ్వరుఁడు
తరమిడి తనలోనె - తానొక్కనాఁడు 1010

తలఁచెనిట్లనుచు మో దంబు, ఖేదంబు
వలయు, నక్కఱలు నా -వలె భూజనులకుఁ

గలుగుట తెలియ కా-గ్రహము చూపుచును
తిలలఁ బీడించెడి - తిలయంత్ర మట్ల

పీడించుచుంటిని పేదల నెల్ల,
నేఁడాదిగా శాంతి - నేఁ బొందవలయు:

నాకట్టి శాంత మె-న్నటికి లభించు?
నే కరణిఁ దరియింతు - నేను?' నటంచుఁ

దనలోనె తాను వి - తర్కించి, రాజ్య
మొనరఁ బాలింపక, - యురుచింత నెనసి 1020

యుండగా, నంతలో - నొక్కనాఁ డటకు
మాండవ్యుఁ డనియెడు - మౌనిపుంగవుఁడు

వచ్చిన, నమ్మౌని - వరుసకు మ్రొక్కి,
హెచ్చుగాఁ బూజించి - యెంతో నుతించి,

తనమదిలోఁ జింత -దాఁచ కంతయును
వినిపింప. నమ్మౌని - విభుఁ డిట్టు లనియె:

'ధరణీశ! విను మహం-తను. కామములను.
మురువొప్ప మమకార - మును విసర్జించి,

నీయాత్మ నీవెయై - నిఖిలరాజ్యంబు
సేయుచు నుండు మీ-చింత యేమిటికిఁ? 1030

దన యుపాయమున. య-త్నమున నీహార
మున నుండు లతచంద-మున మానసంబు

తన వెలాపము వీడి - తనియుచు నుండుఁ
దనవిచారమున సం-తర్మనోమలిన

మును దన్నుఁ బొందక - ముఱిగి నశించు:
జననంబు నొందుచుఁ - జచ్చుచు మరలఁ

బుట్టుచు గిట్టుచు - భూరిదుఃఖముల
నట్టిట్టు జుణుఁగుచు - ననుభవింపుచును.

కడతేరలేక, దుః-ఖసుఖాబ్ధులందుఁ
బడి పొరలుచునుండు - ప్రజలను జూచి, 1040

భయము నొందుచు - వారిపంథలఁ బోక,
జయ మొంద నిలుచు భా-స్వరవస్తువందు

మదిని నిల్పు, మహంత - మమత ని న్విడుచుఁ;
జెదరక యుపశాంతిఁ -జెందుచు, జనులఁ

బాలింపు చుండు ని-ర్భరముగాఁ, జింత
యే?' లని చెప్పి మ- నీశ్వరుం డరిగె.

సురఘుఁ డావల నతి - సూక్ష్మభావమున
నెఱుక తా ననుచు. - దేహేంద్రియవిషయ

తతి జడం బగునది-తానుగా ననుచు,
నతిశయ బ్రహ్మరు - ద్రాది దేహముల 1050

యం దనేకంబు లై-నట్టి రత్నముల
యందొక సూత్ర ము న్నట్టి చందమున

వెలుఁగుచుండు చిదాత్మ - వేఱుగా దనుచుఁ
దలఁచి యన్నిటికినిఁ దా పరుం డగుచు.

నల సుఖ దుఃఖ ద్వ-యాతీతుఁ డగుచు,
నెలమిఁ గుటుంబియై-యే కాకి యగుచు,

నెఱి దయాకరుఁడు నై-నిర్దయుం డగుచుఁ,
జిరతరంబుగ యోగ - సిద్ధినిఁ బొంది,

తొడరి నిరాసక్తి-తో రాజ్యపదము
నుడుగక పాలింపు - చుండఁగా, నటకుఁ 1060

బరిఘుం డనెడు మహీ - పతి రాఁగ, సురఘుఁ
డరుదుగాఁ బూజించె - సా పరిఘుండు

అతనిచే సత్కృతుఁడై యటమీఁద
హితము రెట్టింపఁగా - ని ట్లని పలికె:

ధరణీశ! నీకుఁ ద-త్త్వజ్ఞానసరణి
తిరముగాఁ గుదిరిన-దే మానసమునఁ?

దలఁపున నిస్పృహ-త్వము నొంది ధరను
నలినిఁ బాలింపు చు-న్నాఁడవే నీవు?

పటుతర నిర్విక-ల్పసమాధినిష్ఠ
యెటువంటి? దాచంద - మెఱిఁగింపు' మనిన 1070

నా వేళ సురఘుఁ డి-ట్లనె 'నో మహాత్మ!
పాపననిర్విక-ల్పసమాధి నిష్ఠ

చంద మెట్లనినను - సర్వభోగముల
యం దనాసక్తుఁడై - యచలాత్ముఁ డగుచు

నలరుచుఁ, గాల క-ర్మానుసారముగ
వలనుగాఁ దాఁ జేయ - వలయు కార్యముల

నాసక్తి లేక బా-హ్యమునందుఁ దాను
జేసి. తొ నొక్కటి - చేయలే దనుచు

నంతరంగంబునం- దతినిస్పృహతను
శాంతరసము నించి - సంతోషి యగుచు, 1080

మఱియు నహంకార - మమకారములను
బొరయ, కంతట పరి-పూర్ణమై నిండి

యున్న చిద్వస్తువు - నూహించి కాంచి,
యన్నిటికి నతీత - మైన చిద్వస్తు

సత్త తానై శీత - శైలంబు మాడ్కిఁ
జిత్త విశ్రాంతనిఁ -జెంది యున్నదియె

పట్టెన నిర్విక-ల్ప సమాధి యగును.
నెట్టన నటుచేయ నేరనివాఁడు

క్రమముగా సకల యో-గములు చేసియును
శమ మొందకున్న మో-క్షసుఖంబు లేదు.' 1090

అనుచు 'జీవన్ముక్తి - యను శబ్దమునకుఁ,
దనివిఁ బుట్టించు 'సం-తశ్శీతలత'కుఁ

గలిగిన యర్థముల్ - క్రమముగా నపుడు
విలసితసూక్తుల - వినిపింపఁగాను,

విని పరిఘుఁడు చిత్త వి-శ్రాంతి నొంది,
గొనకొని యతని వీ-డ్కొని చనె; నంత

సురఘుండు తనుఁ దాను - చూచుచు, రాజ్య
మిరవుగా బహుకాల - మేలుచునుండి,

కొనకు విదేహము - క్తుం డయ్యె; నిట్లు
ఘనుఁడైన సురఘుని - కథ విన్నవారు 1100

పరమవిజ్ఞాన సం-పన్నులై, ముక్తి
నఱలేక పొందుదు' - రని వసిష్ఠుండు

ఘనముగా విజయరా - ఘవునకుఁ జెప్పి.
మనము రంజిల్లఁగా - మఱల ని ట్లనియె:

'రక్తిచే జిత్తవి - శ్రాంతి లేకున్న
ముక్తిఁ బొందుట కష్ట-ము తలంచి చూడ'

హింసాస్పదంబును - హేయమౌ దేహ
సంసారమును వీడ - శక్యంబు గాదు:

ఇనకులోత్తమ! రామ! - యీ యర్థమందు
వినిపింతు నొక కథ - విను మ దెట్లనిన 1110

హాస, విలాసోపాఖ్యానము

లలితులు హాస. వి-లాసు లిద్ద ఱనఁ
గల రన్నదమ్ము-లగ్రజుఁడు హాసుండు.

అనుజుఁ డొప్పు విలాసుఁ డతఁ డొక్కనాఁడు
ఘనుఁడైన హాసునిఁ - గాంచి యిట్లనియె:

'ఓ యన్న! యెఱుఁగంగ-నుచితమైనట్టి
నీ యాత్మ తత్త్వంబు - నీ వెఱింగితివె?

తక్కక పరమబో-ధము జనించినదె?
చక్కఁగా బుద్ధి విశ్రాంతి నొందితివె?

గురునిష్ఠ గల నీకుఁ-గుశలమే?' యనుచు
నరమరలేక యి -ట్లడుగ, హాసుండు 1120

విని యిట్టు లని పల్కె - 'విపినంబులందుఁ
బనిఁబూని విపుల త - పముఁ జేయు నిన్ను

మొనసిన నాపుణ్య-మున నేఁడు గంటి
ననఘ! సంసారమం-దలమటంబడుచు

వారక వర్తించు - వారికిఁ గుశల
మే రీతిఁ గలుగు? న-దెట్లన్న వినుము!

ఎందాఁకఁ బరమాత్మ - నెఱుఁగక యుండు
నందాఁక జిత్త ల- యంబు గాకుండు,

నెందాఁక సంసార - మెనయుచునుండు
నందాఁక నీ యాశ-యణఁగి పోకుండు, 1130

నెందాఁక సమబుద్ధి - యిరవుగాకుండు
నందాఁక సుదయింప - దాత్మ సద్బోధ,

కావునఁ గుశల మె-క్కడ గల్గు? పరమ
పావనజ్ఞానసం-ప్రాప్తి లేకున్న?

మనుజులు సుఖదుఃఖ - మగ్నులై పుట్టు
చును, గిట్టు చుందు రె-చ్చోటులనైన,

నిలుకడఁ గానరు, - నీచసంసార
కలితులై యుందు; - రొకానొకఁ డాత్మ

తత్త్వంబుఁ గని, విర-క్త స్వాంతుఁ డగుచు
సాత్త్వికుండై ఘోర - సంసారజలధిఁ 1140

దన వివేకంబుచే -దాఁటి సుఖించు.'
ననుచు వేదాంత ర-హస్యవాక్యముల

వివరించి తెల్పఁగా, - విని విలాసుండు
నవిరళ భక్తితో - నన్నకు మ్రొక్కి.

పరమవిజ్ఞాన సం-పన్నుడై, ముక్తి
సురుచిర మతి విలా సుఁడు పొందె' ననుచు

శ్రీరాఘవునకు వ-సిష్ఠుండు కరుణ
నారసి వినిపించి, - యవల ని ట్లనియె:

'అనఘాత్మ దేనియం - దభిలాష లేక
మనము వైరాగ్య ని - ర్మగ్నమై యున్న 1150

వలనుగాఁ బ్రారబ్ధ- వశమునఁ గూడి
చలన మొందించు సం - సారమందున్న

స్వాంత మా బంధ సం-శ్రయముగా కెపుడు
శాంతిఁ బొంది సుఖించు - సద్వస్తువందుఁ

బనిఁబూని యు-గ్ర తపంబుఁ జేయుచును
వనమునం దుండిన - వానిచిత్తంబు

ఇరవొంద నాసక్తి - నెనసి యుండినను
కర మర్థి నది బంధ - కంబగుచుండు:

నెఱి నిది దేహంబు-నే దేహి ననెడి
యెఱుక లేకయ దేహ-మే నంచు భ్రమయు 1160

జనునకు సంసార - సంగంబు బంధ
మని చెప్ప నొప్పు నో-యవనీశచంద్ర!

శారీరసుఖదుఃఖ - సరణులు రెండు
నారయఁ బరమాత్మ - యందు వింతలుగఁ

దనరార నారోపి - తంబులై యెప్పుడు
తనియని చిత్తబం -ధకములై యుండు;

సర్వపూర్ణంబైన - సత్యాత్మదృష్టి
సర్వకాలము మాన - సమునందు నిలిచి

యున్నను బంధంబు - లూడుఁ, జిత్తంబు
పన్నుగ నాపర - బ్రహ్మమం దణఁగు. 1170

కావున నీవు న-ఖండాత్మసుఖము
భావింపు మొకటిగాఁ - బార్దివాధీశ!

వలనొప్ప సంసక్తి - వంధ్య యనంగ,
నలరారఁగా నవం-ధ్య యనంగఁ గలరు,

అందు వంధ్య యనంగ - నమరు. నాసక్తి
పొందుగా సంసార-ము జనింపఁ జేసి

భావింపఁ దాను ని-ష్ఫలయై మెలంగుఁ,
దావలమగు నవం - ధ్యాసక్తి ముక్తి

దాయినియై, మహా-ధన్యత నిచ్చు.
నా యాత్మ విజ్ఞాన - మందనేరకను 1180

అఖిలవస్తుజము తా- నై వంధ్య సక్తి
సుఖము నీయక మను-జుల రౌరవాది

నరకంబులను ముంచు - నానావిధముల,
సరవి నవంధ్య భా-స్వరవివేకాది

సద్గుణ సమితిచే శాంతి వహించి,
చిద్గగనము నందుఁ - జెంది వర్తించు:

నట్టి శక్తినిఁ బంక - జాక్షుండు చెలఁగి
పట్టుగా జగములఁ - బాలింపుచుండు.

అదిగాక బ్రహ్మరు-ద్రాదు లందఱును
వదలక తచ్ఛక్తి వశులైరి: మఱియు 1190

మొనసిన భవపాశ - ములఁ ద్రెంచివైచి,
మనమున దేహాభి-మానంబు మఱచి,

స్థిరబుద్ధిగల వాఁడు - చిత్రసమందు
కరఁగి జలంబులోఁ - గలిసిన యుప్పు

పగిదినిఁ గలియు నో-భానుకులేశ!
జగతి నెన్నఁగ జడా - జడముల నడుమ

సరసమై వెలుఁగు ద-క్సంధి మధ్యమున
నరయఁగాఁ బరమాత్మ యైయుండు నెద్ది, 1200

యరయఁగా విమలప రాత్మ యటంచు
నిరతంబు కాండోప - నిషదర్ధ మమరఁ

దెలియు తత్త్వజ్ఞులా - తెఱఁగు తేటగను
దెలుపుచు నుందురు - ధీయుక్తి మెఱయ:

సరసమై దృఢదర్శ - సంయుక్త మగుచు,
నరయఁగా ననుభూత - మగుచును మఱియుఁ

దెలియఁగాఁ బారమా-ర్థికసుఖం బెద్ది
యలరార నది బ్రహ్మ - మన నొప్పుఁగాని,

వేఱె బ్రహ్మం బెద్ది - వెదకి చూచుటకు?
నా రవిబింబంబు - నాక్రమించుకొని 1210

వనదంబు దట్టమై - వనజాప్తుకళను
గనఁబడనీయని - కరణిఁ జిత్తంబు

ఆ నిర్మల బ్రహ్మ - కడ్డమై నిలిచి
తా నుండుకొని పరా-త్మను గననియదు:

గానఁ దోఁచదు. సదా - ఖండాత్మవస్తు,
వా నీచచిత్తంబు - నదిమి పట్టుకొని,

యా యఖండ బ్రహ్మ - మందు లయంబు
జేయుటే మోక్షంబుఁ - జెందుటగాని.

మోక్షంబు పాతాళ - మున, మింట. దిశల,
నీ క్షోణిమీఁద లే-దిది. నిశ్చయంబు. 1220

అస లన్నియు లయ - మైనదే ముక్తి :
యీ సత్తఁ గనిన యో-గీశ్వరుం డిలను

జారపురుషునిపై - స్వాంత ముంచుకొని,
భూరియాశను నిజ-పురుషుని మైత్రి

వదలక హావభా-వవిలాసములను
బదపడి తాఁ జూపు - పగిది వాఘనుఁడు

అనలు గల వాని - యటువలెఁ బనులు
చేసి, వాటిని నిర - సింపుచు, నంత

రంగంబునందుఁ బ-రాత్మ సౌఖ్యమును
పొంగుచు ననుభవిం-పుచు నుండు నెపుడు;


ప్రారబ్ధ మనుభవిం-పఁ దలంచి యతఁడు
వారక సంసారి-వలె నటించినను,1230

నలఘు సూర్యుఁడు చల్ల - నైననుగాని,
యలఁ జందురుం డుష్ణు - డైననుగాని,

మొగి నగ్నిశిఖ లధో - ముఖములు గాని,
యగణితాత్మ సుఖంబు - నంటిన యోగి

పొలుపారి విస్మృతిఁ - బొందఁ డటంచు
బలికిన విని రామ-భద్రుఁ డిట్లనియె:

'ఓ మునీశ్వర ! యూర - కుండక చిత్త
మేమిటఁ జలియించు? - నేమిట నిలుచుఁ?

గరుణ నాచిత్తరో-గమ్ము హరించు
పరమౌషధంబుఁ జె-ప్పందగు' ననిన1240

విని వసిష్ఠుఁడు పల్కె - 'విను రామచంద్ర!
ఘనమైన చిత్తరో-గమునకు రెండు

గల వౌషధములు: యో-గమనంగ నొకటి,
యలఘు తత్త్వజ్ఞాన - మన్నది యొకటి

యున్నది విను యోగ - ముఱుకు చిత్తమును
పన్నుఁగాఁ బిగఁబట్టి - బంధింపనోపు:

పరమ విజ్ఞాన మా పరమవస్తువును
సురచిరప్రజ్ఞచేఁ - జూపఁగా నోపు.

నది యెట్టు లనినఁ బ్రా-ణాపానయుగళ
ముదయించి చరియింపు-చున్న చిత్తంబు1250

చలి యింపుచుండు, ను చ్ఛ్వాస, నిశ్వాస
ములను నిల్పినఁ జిత్త - మును నిల్చుఁ జిత్త

చలనం బణంగిన - సంసార ముడుగు;
నల పూరకము మొద-లైనట్టి పవన

ధారణ సేయఁ జి-త్తంబు నిరుద్ధ
మై, రయంబున నిల్చు - నంతరంగమునఁ

దనచిత్త ధారణ-ధ్యాన సమాధి
పనుపడినప్పు డా ప్రాణవాయువులు

కదలక యంతరం-గమున నెమ్మదినిఁ
గుదురుచునుండు యో - గులకు, వెండియును1260

ప్రణవశబ్దార్ధంబు - భావించి, దాని
గణుతించుకొనుచు నే-కాంతంబునందు

సురుచిర జ్ఞాన సు-షుప్తి నొందినను
జరిగిపోయెడి మది- చలనం బణంగు .

మఱియు నీ విఁక నొక్క - మర్మంబు వినుము !
మురువొప్పఁగాఁ దాలు - మూలాంత మగుచు

గురుతరంబుగఁ గంఠ - కోట రాగ్రమున
కరుదుగా స్థూల జి-హ్వాగ్రమున్ జొనిపి,

యదనుగా సూక్ష్మజి - హ్వాగ్రంబుతోను
కదియించి మధ్య మా-ర్గంబు నందున్న1270

తనుతర విమల రం-ధ్రమునఁ బ్రాణముల
నొనరంగ నడిపింపు - చుండినఁ బ్రాణ

చలనం బణఁగుఁ, జిత్త-సంచార ముడుగు,
నలఘు యోగానంద -మబ్బుచు నుండు,

నిది యోగ మనఁబడు - నిదియునుగాక
సదమలమైన వి-జ్ఞానయోగంబు

వినిపింతు విను జగ - ద్వితతియుఁ, జిత్త
మును, దద్వికల్పన-ములు లయంబైన

తఱి నవశిష్టమై - తా నెద్ది నిలుచు
నరయ నదే జ్ఞాన -మని చెప్పు నొప్పు:1280

జనవర! యటుగాన - సర్వంబు బ్రహ్మ
మనియెడి యెఱుక ప-దార్థదర్శిత్వ

మగు యోగమునకు, బ్ర-హ్మజ్ఞానమునకుఁ
దగు నిదర్శనము సి-ద్ధముగఁ జెప్పెదను.

వీతహవ్యోపాఖ్యానము



విను వీతహవ్యుఁడన్ - విప్రపుంగవుఁడు
ఘనతర వైరాగ్య కలితుఁడై, విపిన

భూమిఁని జేరి , య - ద్భుతనిష్ఠఁబూని,
యేమఱక సుశాంతి - నెనసి, తామసము

విడిచి, యంతర్భాహ్య - విషయకృత్యముల
నడఁచి, నిర్మలమైన - యంతరంగమునఁ1290

దలఁచె నిట్లనుచు బ్ర-త్యాహార మెంత
సలుపు చుండినఁ -జిత్తచలనం బణంగి

పోక, లొలోఁ జలిం-పుచు నున్న దిపుడు,
నేకరణీ నణంతు- నింకఁ జిత్తమును?'

అని విచారింపుచు - నప్పుడా చిత్త
మును బిగఁబట్టి, యి-మ్ముగ దాని కనియె:

చిత్తమా! చలనంబుఁ - జెందక నీవు
సత్తా స్వరూపమై, - సర్వమై, సర్వ

సాక్షియై, యచలమై, - సంపూర్ణమైన
యక్షీణ పరమాత్మ - యందు సంతతము1300

నిలిచి యుండితివైన - నీకు సుఖంబు
గలుగు, జడములైన - కరణజాలములఁ

గూడి న న్నింకఁ జి-క్కులఁ బెట్టనేల?
వీడు మయ్యింద్రియ - విషయసఖ్యమును,

అరయ నతీంద్రియం -బై ,పూర్ణమైన
పరమాత్మతత్త్వంబు - భావింపుచుండు'

మని బుద్ధిఁ జెప్పుచు - నప్పుడు చిత్తమును
గని పట్టి హృదయ పం-కజమందు నిలిపి,

గురువింధ్య పర్వత - గుహఁ జేరి, యచట
నఱి ముఱి సిద్ధాస-నా సీనుఁ డగుచుఁ,1310

గనుదృష్టి నాసికా - గ్రంబుపై నుంచి,
తనువును నిక్కించి, - తలఁపుల నెల్ల

మఱచుచు, నచల స మాధి యందున్న
తఱి వీతహవ్యుని - తనుమధ్యమందుఁ

జరియించు ప్రాణముల్ - శమ మొందె. నిట్లు
పరమైన నిర్వి క - ల్ప సమాధి నొంది

యున్న, నందొక్క ము - హూర్తంబు కరణి
నెన్న మున్నూ ఱేండ్లు - నిలమీఁదఁ జఱిగె:

ఘనమైన భూమిపం-కంబులో నతని
తను పణంగక యున్న- తా నేర్పఱించి...1320

కనఁ గూడకుండ నీ - కరణిఁ దపంబు
నెనసి, యాధన్యుఁడం- దిరవుగా నుండి,


మొనసి మున్నూ ఱబ్ద - ముల మీఁద మేలు
కొని, పూర్వజన్మ స-త్క ర్మవాసనలు

బలములై యతనికిఁ - బ్రత్యక్షరూప
ములుగాను మానస - మునఁ గ్రమంబునను

దోఁచుచు నుండఁగాఁ - దొలఁగక యతఁడు
నా చోట నన్నిటి - నానందముగను

మొనసి మనోరాజ్య - మున సర్వమొనర
ననుభవింపుచునుండె - నది యెట్లయనినఁ1330

గనులందుఁ బొడము జా - గ్రత్స్వప్నయుగళ
మును, నమ్మనోరాజ్య -మును నను మూఁడు

గలుగుచునుండు నె - క్కడనైన, మాన
వుల యా క్రమము లిప్పు - డూహింపు మీవు,

తెలివితో నన్నిటిన్ - దెలిసి, కాఁపురము
సలుపుచు నుండుటే - జాగ్రదవస్థ:

నెఱయు నింద్రియములు - నిదురలో నణఁగ,
నరసి యాంతర విష - యములలోఁ దగిలి

పొలుచుఁ జిత్తము రమిం - పుచు నుండురీతి
యలరు స్వప్నావస్థ - యనఁబడుచుండు:1340

నెఱుక గల్గియు, బాహ్య - మెఱుఁగక మఱచి,
మురిసి పురోభూత - ములు గాకయున్న

గురువస్తు వితతులఁ - గూడి మానసము
పురిని లోలో సుఖిం - పుచునుండురీతి

నరయ మనోరాజ్య - మనఁబడుఁగాని ,
విరివి రెట్టింప నా - వీతహవ్యుండు

హృదయగతంబున - నింపు సొంపెసఁగఁ
గదలక రజతన - గ ప్రాంతమందుఁ

బ్రకటితమగు కదం బక తరుచ్ఛాయ
నకలంకుఁడై నిల్చి - యచట నూఱేండ్లు

తప మాచరించి, యింద్రపదంబు నాత్మ
నపుడు కామించి. విద్యాధరుం డగుచు

శతవత్సరంబులు - చరియింపుచుండి,
హితమొప్ప నేనుమా-ర్లింపుసొంపెసఁగఁ

గాలుఁడై, యవల నా ఖండలపదముఁ
బాలింపుచును భోగ-భాగ్యసౌఖ్యముల

ననుభవింపుచు నుండి, - యావల నరిగి,
పనిఁబూని శివుచెంతఁ - బ్రమథుఁడై యుండె.

వారక ప్రతిబాస వలన నీరీతి
సారెసారెకు బహు - జన్మసౌఖ్యములఁ

బొరిఁబొరి ననుభవిం పుచు వేడ్క నుండి,
మరలఁ దత్పూర్వ జ - న్మమును దలంచి,

కలఁగాంచి మేల్కొన్న - కైవడి గాను
తెలివొంది యతడు మదిన్ వెఱఁగొంది,

యలరుచు వీతహ - వ్యాభిధానంబు
కలిగిన తను వింత - కాలంబునకును

సమయక యిచ్చోట - శాశ్వతం బగుచు
నమరి యున్నది గదా! యని సంతసించి,

పంకంబులోఁ బూడి - పడియున్న మేను
నింక నైనను మీఁది - కెత్తెద ననుచుఁ

దాఁ బ్రయత్నముఁ జేసి-తనువు పైకెత్తఁ
గాఁ బ్రయా సై తోఁపఁ-గా, దాని విడిచి,

అతఁ డంతఁ బుర్యష్ట - కాంగంబుతోడఁ
బ్రతిభ మీఱఁగ లేచి, - పవనుఁడై సూర్య

నారాయణునిఁ జేరి -ననుఁ బింగళాఖ్య
నారూఢుఁ డగు దూత - నబ్జబాంధవుఁడు

పనుపఁగాఁ జని నేలఁ-బంకమధ్యమున
మునిఁగి యున్నట్టి య-మ్ముని శరీరమును

గుదురుగాఁ బెకలించి - కొని చని చాల
ముదముతో సూర్యుని - ముందర నిడఁగ,1380

నాదిత్యుఁ డా వీత- హవ్వు నీక్షించి,
'ఏ దేహమున నీవు- నిలువు' మటంచు

నానతిచ్చిన వీత - హవ్యుఁ డా మేను
నూని ప్రవేశించి, - యున్నతుఁ డగుచు

ముదమంది సంగని-ర్ముక్తుఁడై,మమత
వదలించి విడిచి. జీ -వన్ముక్తుఁ డగుచు

స్వచ్ఛ మనస్కుఁడై, - సర్వస్థలముల
నిచ్ఛా విహరుఁడై - యెఱుక నేమఱక,

యనఘుఁడై దశసహ - స్రాబ్ధముల్ గడపి,
కినిసి విదేహము-క్తినిఁ బొందఁ దలఁచి,1390

లలితుఁ డేకాంత - స్థలమందుఁ జేరి,
చెలఁగి శుద్ధాసనా-సీనుఁడై యుండి,

తనలోనె తాను వి- తర్కించి, రాగ
మును, ద్వేషమును జూచి - మొనసి యిట్లనియె:

రాగమా! ద్వేషమా! - రాతిరి, పగలు
నీ గతి మున్ను న - న్నెనసి మద్విపుల

వైరాగ్యవహ్నిచే - వాఁడిపోయితిరి;
మీ రిఁక నైన న - మ్మిన చోటులందుఁ

జేరి సుఖింపుఁడు! - చింతచే నన్ను
గాఱింప నేల? శీ - ఘ్రంబుగాఁ జనుఁడు!1400

అంచిత పంచేంద్రి - యములార! నేను
పంచినగతినిఁ ద - ప్పక సంచరించి,

యలసితి రింక, మీ - రనువైన యెడల
నలుగక చనుఁడి! నె - య్యమున న న్విడిచి,

పరువు లెత్తుచు నీవు - పరమాత్మసుఖము
మఱపించి నాకు నీ - మాయలఁ జూపి,

విషమగతులయందు - విడువక త్రిప్పు
విషయ సౌఖ్యమ!నన్ను - విడిచి పొమ్మిఁకను:

నెఱసిన దు:ఖమా! - నీ చేతఁ జిక్కి,
పరితాపమునఁ బొంది, - పాపసంసార1410

నిరసనం బొనరించి, - నీదయవలనఁ
జరమైన నిర్వాణ - పద మేను గంటి:

నా కుపకారమా - నాఁడు చేసితివి,
నీకు మ్రొక్కెదను నీ నెలవున కేఁగు!

నే నిన్ను విడిచిన - నీ వొంటిగాను
బోనేరనని యింక - బొగుల నేమిటికి(?

జక్కఁగానేగీ సం - సారుల చెంత
మక్కువ నుండు! నా - మాలిమి విడువు!


దండంబు నీకు, నా - దగ్గఱ నిలిచి
యుండక చను మింక-నో తల్లి! తృష్ణ !!1420

యనుచు నంతఃకర-ణాది గుణాళి
నొనర వీడ్కొల్పి, తా-నుపశాంతిఁ బొంది,

యున్నతుఁడై ప్రణ - వోచ్చారణంబుఁ
బన్నుగాఁ జేయుచుఁ, - బై జ్యోతి నాత్మఁ

గనుచు, సంకల్ప వి-కల్పాది వివిధ
తనుధర్మవితతి నం-తర్బాహ్యములను

బొడమనీయక నిజ - బుద్ధియం దణఁచి,
యడరారఁ బ్రణవాంత-మైన నిశ్శ్వాస'

తంతువుతోఁ గూడి - తన్మాత్ర వితతి
నంతఃకరణమునం - దరసి, యవ్వలను1430

తనివిఁ బొందిన విశ్వ - తైజసావస్థ
లను దాఁటి, మెల్ల మె - ల్లఁగ లోని తిమిర

పటలంబు నణఁగించి, - ప్రాజ్ఞసంబంధ
పటుతర తేజమున్ - భావించి యణఁచి,

సరవినిఁ దమము, తే - జంబు నులేక,
యరుదుగా శూన్య మై - నటువంటిచోటుఁ

గని, దానిఁ బాసి, త - క్కక సూక్ష్మమైన
మనముచే మనము నే- మఱక ఖండించి,

బడలక చిద్వస్తు - పదము నీక్షించి,
తొడరి నిమేష చ - తుర్థ భాగమునఁ1440

బరఁగఁ జంచలతను - బాయు మారుతము
కరణినిఁ జైత్య మ-క్కడ విసర్జించి,


నెనవుగా సతతైక - నిష్ఠితం బగుచుఁ
దనరిన శాంతి ప-దమునందుఁ బొంది,

తుదఁగని మేరుస్థి - తుండై సుషుప్తి
పద మవలంబించి, - పటుతీవ్రగతిని

ఆ వరయోగి తు - ర్యానంద మొందె .
ఈ విధంబున నపు - డిల నిరానంద

పరుఁడు, సదానంద - భరితుండు, స్వచ్ఛ
వీరహితుఁ, డటుగాక - విపులస్వచ్చుఁడును,1450

మఱియుఁ జిన్మయుఁడుఁ, జి - స్మయుఁడునై యిట్లు
నిరవొప్పఁగా నేతి - నేతి వాక్యములఁ

జెలఁగి యుపన్య సిం - చిన వేళఁ దుదను
దెలియ వాజ్మానసా - తీతమై, సర్వ

పరిపూర్ణమగు పర - బ్రహ్మంబునందు
విరివిగాఁ గలిసె నా- వీతహవ్యుండు.

ఆ పరాత్ముని నిశ్చ - యం బది యనుచుఁ
దోఁపక, శూన్య వా-దులు శూన్యమనఁగఁ,

దరమిడి బ్రహ్మవే - త్తలు బ్రహ్మ మనఁగ.
వరుసగా విజ్ఞాన వంతు లందఱును1460

విరిచి నా బ్రహ్మంబు - విజ్ఞాన మనఁగ,
బొరి సాంఖ్య యోగులు - పూరుషుఁ డనఁగ,

నిలసిద్ధ యోగీంద్రు - లీశ్వరుం డనఁగఁ,
జెలఁగి శైవులు సదా - శివుఁ డాత్మ యనఁగ,

లలిఁ గాలవిదులు కా-లమె బ్రహ్మ మనఁగఁ,
దొలఁగ కాత్మార్థవం-తులు చిదాత్మనఁగ,


రహిఁ దాదృశులును నై-రాసతత్త్వ మన,
మహి మాధ్యమికు లెల్ల - మధ్యమం బనఁగ,

ననిశంబు సమచిత్తు - లగువారు సర్వ
మును బ్రహ్మ మనఁగ నా -మూల తత్త్వంబు1470

అగుణమై, సర్వసి-ద్ధాంతసమ్మతము
నగుచు నన్నియును దా-నై వెల్గులకును

వెలుఁగై, యనంతమై, - వేరొండు లేక
యలఘు పరబ్రహ్మ - మంతట నుండు.

విమలుఁడై ముప్పది - వేలేండ్లు యోగ
మమర సల్పిన వీత - హవ్యుండు తుదకు

నా పరమాత్మ తా - నయ్యే నటంచు
భూపాలునకుఁ గృపా - బుద్ది దీపింపఁ

జెప్పి, క్రమ్మఱ నా వ- సిష్ఠుఁ డిట్లనియెఁ:
'దప్పక విను రామ - ధరణీతలేంద్ర!1480

ఆనందముగ వీత - హవ్యుని చరిత
మూని యాలింపుచు - నుండెడివార

లఖిల పాపవిముక్తు - లై, పరమాత్మ
సుఖము నొందుదు రంచు - సూటిగాఁ జెప్పి.

'జనవర! చిత్తోప -శమనవాక్యములు
విను మన్న రామ భూ-విభుఁ డిట్టు లనియె:

'అమర జీవన్ముక్తు - లాత్మార్థ విధులు
నమలాత్ములైన మహాయోగులకును

నరుదైన గగన యా-నాదిక సిద్ధు
లిరవొందఁ గలుగని-దే? మంచు నడుగ,1490

విని, ముని పల్కె నా-విధ మెట్టి దనిన
'విను రాఘవేశ్వర! - విశదంబుగాను

ఘనములై తగు నభో-గమనాది సిద్ధు
లనువొందఁ గలిగిన - నది ముక్తి గాదు,

తనరారు ద్రవ్యమం-త్రక్రియాశక్తు
లొనరంగఁ గల్పింపుచుండు సిద్దులను,

నట్టి సిద్ధులఁ గోరి - నటువంటివాఁడు
పట్టుగాఁ బొందఁడు - పరమైనముక్తి,

ఆత్మజ్ఞు లా సిద్ధు -లం దాస విడిచి,
యాత్మయందు సుఖించి, - యవల మోక్షంబుఁ1500

జెందుచుందురుగాని. - సిద్ధుల డెంద
మందుఁ గోరరు, కొంద-ఱవి గోరుకొంద్రు:

తనరారు ద్రవ్యముల్, - తంత్ర యంత్రములు,
ఘనమంత్రములు. క్రియల్, - కాలశక్తులును

సిద్ధులఁ బుట్టించి - చిత్రముల్ చూపు;
సిద్ధాంతమగు ముక్తిఁ - జెందెడు పనికి

నవి యంతరాయంబు - లగుచుండుగాని,
ప్రవిమలంబగు మోక్ష - పదమందనియవు.

ఆ రీతి యేమన్న - నట్టి సిద్ధులకు
గౌరవంబులు చాలఁ - గలుగుచునుండు,1510

సారె సారకుఁ బ్రజా-సంగంబు గలుగు,
భూరిదురాశలు - పుట్టు నందునను,

నప్పు డహంకార - మతిశయం బగుచు
ముప్పిరి గొనుచుండు, - ముక్తి మార్గంబుఁ

జూడనీయవు గాన, క్షుద్రసిద్ధులను
వేడుకగా నైన - విమలాత్మవిద్య

గలవాడు సిద్ధులఁ - గాంక్షింప రెపుడు,
పొలుపొంద నుపశాంతిఁ - బొందు చుండుదురు.

అన విని రాముఁ డి-ట్లనె మునినాథ!
ఘనయోగు లిల బహు - కాల మంగముల1520

విడువ కుండుదు రట్టి - విధ మెట్టు?' లనినఁ
బుడమి ఱేనికి మౌని - పుంగవుం డనియె:

'లలితాత్మ! విను మని - లంబు సాకెకును
జలియింప నాయువు - సమయు నందునను

బడు శరీరంబులు. - పవనంబు బయలు
వెడలనియ్యక లోన - విసువక నిలుపు

యోగుల కెల్ల నా - యువు వృద్ధిఁ బొందుఁ,
గాఁగ వారి ల బహు - కాల ముండుదురు.

అన విని శ్రీరాముఁ - డమ్మునీశ్వరుని
గని యిట్టు లనియె వో - ఘనపుణ్య చరిత!1530

అలఘు విజ్ఞానో ద - యమునఁ జిత్తంబు
విలయంబు నొందిన - వేళ మైత్య్రాది

సుగుణసమూహ మె - చ్చోట జనించు?
నగణితచరిత! నా - కానతిం డనిన

ముని యిట్టు లనియె ని - మ్ముగ 'రామచంద్ర|
వినుము నీ వారీతి - విశదంబుగాను

అనఘాత్మ! చిత్తల - యమునందు రూప
మనఁగ, నరూపంబు-నన రెండు గలవు;

అందు జీవన్ముక్తి -యగు నరూపంబుఁ
బొందుగాఁ గన్న, రూ-పు విదేహము క్తి;1540

యలఘు జీవన్ముక్తుఁ - డంగంబుతోడ
మెలఁగుచుండుటఁ జేసి - మేలును, కీడుఁ

గలుగఁగా సుఖదు:ఖ - కలితమై మనసు
చలనంబు విడువక - సంసారనామ

భూరివృక్షమునకుఁ - బ్రోదిగా నుండు;
నీరీతి భావింప - నిది చిత్తసత్త,

దీని సంక్షయ మేను - దెల్పెద వినుము!
పూని పర్వతము గా-డ్పునఁ జలింపకను

నిలిచియుండినరీతి - నెఱి సుఖదుఃఖ
ములు గల్గినప్పుడి - మ్ముగ హెచ్చుతగ్గు1550

నొందక, శాంతుఁడై - యుగ్రభావమునఁ
జెంద కున్నది గదా - చిత్తలయంబు!'

'అటువలెఁ జిత్తల - యంబైన వెనుక
నెటు గుణంబులు గల్గు? - వెఱిఁగింపుఁ డనిన

జ్ఞానస్వరూపమై - చలనంబు లేని
మానస మలఘుని-ర్మలబుద్ధి చేతఁ

బూని తద్ జ్ఞాన మొ-ప్పుగ నిశ్చయించు,
మానసమే సత్త్వ - మయ మగుచుండు;

నారీతి యెట్లన్న - నాలించి వినుము!
సారవిహీన రా-జనతామసములు1560

పొలుపు లేక నశించి - పోయినయపుడె
బలమరి చిత్తంబు - పలుచనై తగ్గి,

చలియింపకుండఁగా, - సత్త్వగుణంబు
నిలిచి యచ్చటనుండు - నిర్మలం బగుచు;

నల సత్త్వగుణమునం - దపుడు మైత్య్రాది
లలితగుణంబులె-ల్లను గల్గుచుండు.

జ్ఞానస్వరూపమై - చలియింపకున్న
మానసం బాత్మలో - మగ్నమైయుండి

యందు జీవన్ముక్తుఁ - డగు యోగివరుని
యందు మైత్య్రాది మ - హాసద్గుణముల1570

నూరక పుట్టింపు - చుండు వేడుకను
వారక యట్టి జీ - వన్ముక్తుఁ డవల

మదము నొంది విదేహ - ముక్తుఁ డవల
మది యతిస్వల్పమై - మతితోడఁగూడి,

యా విమలాత్మయం - దపుడు లయించి
పోవుఁ గావున, గుణం - బులు పుట్ట వవల,

నల సరూపమనోల - యంబు భావింప
నెలమి జీవన్ముక్తి - యిది యన నొప్పు,

నదియుఁ గాకను స్వరూ - పాస్పదంలైన
హృదయంబు నాశమై, - యిది యది యనుచుఁ1580

దెలియఁగూడనిది వి - దేహముక్తి యగు;
నల రజంబును, తమం - బను గుణద్వయము

విలయమై పోయిన - వెనుక శేషించి,
తొలఁగక సకల స - ద్గుణ సార మగుచు

స్థిరముగా నున్న సా-త్త్విక విశేషంబు
మురువుమీఱ విదేహ - ముక్తియం దణఁగు:

సారెకు మారుత - స్పందవాసనలు
ప్రేరేపుచున్న నిం-ద్రియముల మీఁది

జ్ఞానంబు రాక ని-శ్చలవృత్తి నున్న
నా నిర్గుణ బ్రహ్మ - మయ్యెద వీవు.1590

వినుము రాఘవ! వేద్య - వేదనోల్బణత
లోనరఁగాఁ బుట్టింపు - చుండుఁ జిత్తంబు

మోసపుచ్చు ననర్ధ - మూలమై లేని
యాసలు పుట్టించు, - నటుగాన దాని

లయముఁ జేసిన మోక్ష - లాభంబు గలుగు;
భయము లణంగు. ని-ర్భయ ముదయించుఁ:

గావునఁ జిత్తవి-కారంబు నణఁచఁ
గావలె నని మున్ను - కమలజాత్మజులు

సనకాదు లాచిత్త - సంరంభ ముడుప
ననిలధారణ సేతు - రది యెట్ల యనిన1600

మొనయు ప్రాణాయామ- మున సదాధ్యాన
మున యుక్తికల్పిత - ముల యోగములను

అనిలనిరుద్ధమౌ-నపుడు లక్ష్యమును
తనయందె నిలుపఁ జి-త్తము శాంతిఁ బొందు,

దాన విజ్ఞాన సు- స్థైర్యంబు గలుగుఁ,
బూని వృత్తి జ్ఞాన - భూతమైనట్టి

యనుభూతి వాసన-నంటి చలింప
కొనరినఁ బ్రకటచి-తోత్పత్తి పదము

వినుము వాసనలచే, విడువంగఁ బడక
మొనయు పూర్వాపర - ముల విచారముల 1610

జననమొందు పదార్థ - సక్తియే వాస
నని చెప్పఁదగుచుండు - నదె యాత్మయందు

నూనికగా నిల్చి - యున్న సంసృతులు
నేనాఁటికైనఁ బో, - విట్టి వాసనలఁ

దగిలిన పురుషుఁ డే - ద్రవ్యంబుఁ గని
మొగి నాత్మ ననిశంబు - మోహింపుచుండుఁ;

బదపడు వాసనా - భ్యాసంబుచేత
నిదియె పుట్టను, గిట్ట - నిల హేతు వగుచుఁ

దెలియఁగా హేయపా -ధేయమై చాల
నలరు జాగ్రద్భావ - మణుమాత్రమైన 1620

దొడరి చిత్తమునందుఁ- దోచని యపుడు
పొడమదు మానసం-బు దలంచి చూడ,

రహిఁ గర్మ వాసనా-రహితమైనప్పుడు
మహి నొప్పు పరమశ-మప్రదంబైన

యల మనోలయమగు-నది యెట్టు లనినఁ
దెలిపెద విను రామ! - తెల్లంబుగాను

బలములై మారుత - స్పందన వాస
నలు గల్గు, నట్టు లె-న్నంగ నా రెండు

మొనయుబీజాంకుర-ములు మానసమున
కనఁగ నొప్పుచునుండు . నమ్మూటి కొనర 1630

జనవర! యీ ప్రపం-చము బీజ మగును;
గనుకఁ దద్వేద్యసం-గతి విసర్జింపు

మటుమీఁద నిర్మూల - మైనట్టి వృక్ష
మటువలె సర్వంబు - నణఁగును రామ!

సంవేద్యమునకు ని - శ్చయము భావింప
సంవిత్తు బీజ మెం - చఁగ నవి రెండు,

కరమొప్ప నూనె లే - కను నూలులేని
కరణి నొండొంటి నే-కడ వీడకుండు

నల విషయ జ్ఞాన - మతి దుఃఖములకు
నిలయంబుగా నుండు - నెఱిని నిర్విషయ 1640

మైనట్టి సుజ్ఞాన - మమలమై యాత్మ
కానంద కారణ - మై వృద్ధిఁబొందు

ననిన శ్రీరాముఁ డి-ట్లనె 'జాడ్య రహితుఁ,
డనఘుండు. నిర్విష - యజ్ఞానియైన

వానికి మఱి జడ - త్వముఁ బొందు టేమి?
యాన తియ్యుఁ డటన్న నమ్ముని పలికె:

అరయ సర్వావస్థ - లందు నిర్వాణ
సరణిని భావించు - శాంతచిత్తుండు

అవనిపై నెన్ని కా - ర్యములయందున్న
నవిరళ నిర్వష - యజ్ఞాని యగును; 1650

ధరణీశ! మఱి సర్వ - ధర్మవాసనలు
పొరిఁ బొరి నశియించి - పోవగా, నతఁడు

బాలుని గతి, మూడు - పగిది, నున్మత్తు
పోలికఁ జిత్సుఖం - బునఁ జొక్కుచుండు;

బలియు సంవిత్తు - కా బ్రహ్మసడంశ
మలఘు బీజము దాని-యం దది వెలుఁగు,

నది యెట్లననఁ దేజమందుఁ బ్రకాశ
ముదయించుకైవడి - వొప్పు సంవిత్తు.

విను విశేషాంతర - విముఖమై, మఱియు
ననుపమసన్మాత్ర-మై యనాదరము 1660

నగుచును, బహురూప-మై, యేకరూప
మగుచు నున్నదియే మ-హా బ్రహ్మసత్త

యై, కల్పనాశూన్య-మై, యాద్య మగుచు
నాకారవిరహిత-మై యనాద్యంబు

నై రమణీయ మై-నట్టి సామాన్య
సారసద్భావ భా-స్వరవస్తుసత్త

యందు బీజంబు లే-దచట సంవిత్తుఁ
బొందితే మఱి రాక పోకలు లేవు,

హేతువులకు నెల్ల - హేతుసార మిది,
హేతువు మఱి దాని , కింక లే దదియె

అదిసారము, దీని - కన్న సారంబు
లేదు గావున నిదే - లెస్స భావింపు,

చలనంబు తా- పౌరుష ప్రయత్నమున
నలఘు బలంబున - నఖిల వాసనల

వడి నణఁగించి త-త్వజ్ఞుండ వగుచు
నడరారఁగా నక్ష-యాత్మ పదంబు 1670

నిరుపమ ప్రజ్ఞతో - నిమిషమాత్రంబు
నఱలేక పొందిన - నది యుత్తమంబు,

వరచిత్తలయమును - వాసనాహరణ,
మరయఁ దత్త్వ జ్ఞాన - మనఁగ నిమ్మూఁడు

కలిగియుండెడిది దు-ష్కరమగు; నైనఁ
దెలిపెద నది నీకుఁ దేటగా నిపుడు

పరఁగ ధీయుక్తినిఁ - బౌరుషస్థితిని,
విరళమౌ భోగేచ్ఛ - విడువు, మిమ్మూఁడు

నీ వభ్యసించిన - నిరుపమంబైన
పావనపూర్ణ చి - త్పదము నొందెదవు. 1680

చెలఁగి యీ మూఁ డభ్య - సింపని మూడుఁ
డళుకుచు జన్మ స-హస్రంబులకును

బామరుఁడగుఁ గాని, - పర మొంద నేరఁ,
డేమని చెప్పుదు? - నెవ్వానికైన

మొదట నేఁ జెప్పిన - మూఁడు సాధనము
లుదయించి యొక కాల - మొప్పుచుండినను.

వాఁడు ముక్తుం డగు- వరుసగా నట్టి
మూఁ డెన్న, నొకజన్మ- మునఁ గల్గ కొకటి,

యొక్కటి జనియింపు - చుండిన ముక్తి
నిక్కంబుఁగా గల్గనేర - దందాఁకఁ 1690

బెదర కభ్యాసంబుఁ - జేయ నొక్కొకటి
తుదగాని తుచ్ఛసి - ద్ధుల నిచ్చుచుండుఁ,

జెలఁగి యిమ్మూఁ డభ్య - సించు ధన్యునకుఁ
గల వాసనామనో - గ్రంథు లణంగుఁ,

దనువు నిత్యం బని-దలఁచుచుండుటను
దనయందుఁ గల పర - తత్త్వభావనను

ననిశంబు నిస్సంగుఁ - డగుచు నుండుటను
జనియించు వాసనల్ - సమయుఁ, జిత్తంబు

శాంతిఁ బొంది యణంగు, - సకలార్థములకు
నంత:కరణమునం-దంటి యున్నట్టి 1700

సంగంబు హేతువు - సకలార్థములకు,
సంగంబు నిలయంబు - సంస్కృతి కెల్ల,

సంగంబు మూల మా-శాలతావళికి,
సంగమే యాపద్ద-శల కెల్ల నెలవు,

సంగవర్జనము మో-క్షము, సంగవిరతి
మంగళ ప్రదము, జ-న్మవినాశకరము.

కలిమిలేములను, సు-ఖము దుఃఖములను
గలుగఁ జేయుచునుండుఁ గలుషమైనట్టి

వాసన యనునది . వసుధాతలేంద్ర!
వాసిగా నిలను జీవ-న్ముక్తులైన 1710

జనులందు హర్ష వి-షాదవిరహిత
యనఁగ నొప్పుచును జ-న్మాంకురహారి

యగు శుద్ధవాసన - యమలమై నిలిచి,
యగణిత మోక్ష సౌ-ఖ్యంబు నొందించు.

200

వాసిష్ఠరామాయణము


అతిమూర్ఖులగు వారి - యందు దట్టముగ
సతతంబు మలినవా - సన నిల్చి, మరలఁ

బుట్టించి గిట్టించి - పొగిలింపుచుండు,
నట్టి వాసన నొంద - రాత్మార్ధ విదులు;

కా దని సుఖము దుః - ఖంబు గల్గినను
మోదఖేదాబ్ధుల - మునుఁగుచుండకను1730

పొలుచు నాశల వృద్ధిఁ - బొందనీయకను
పలుమఱు సంపదా - పదలు వచ్చినను

జగురొత్తు సమబుద్ధి - చే వానియందుఁ
దగులక తగిన ప్రా-ప్త పదార్థములను

ననుభవింపుచు నుంటి -వైనను నీవు
అనఘ!నిస్సంగుఁడ -వై సుఖించెదవు

*ఆకాశగత్యభావాఖ్యానము*



ఆశాశగత్యభావా - ఖ్యానసరణి
నీకుఁ జెప్పితి రామ! - నృపకులోత్తంస!

తెలివొందు, మీయుప - దేశంబున
నలఘుచిత్త మణంగు - నాత్మానుభవము1730

చక్కఁగా నగు, నుప - శమన ప్రకరణ
మెక్కువగాఁ జెప్పి - తిపుడు నీ' కనుచు

జననాయకున కుప - శమన ప్రకరణ
మనువాంద బోధించె - ననుచు వాల్మీకి

తప్పక యాభర - ద్వాజ సంయమికి
నప్పుడు బోధించె - నానందముగను.

201

తృతీయప్రకరణము

*ప్రకరణాంతద్విపద*


ఇది సోఘనాథవి - శ్వేశ్వర స్వామి
పదపద్మ భక్త సు - బ్రహ్మణ్యయోగి

చరణాంబుజాత ష - ట్బరణాయ మాన
పరిపూర్ణ నిత్య స - ద్భావ నిమగ్న1740

మానసాంబుజ వెంగ - మాంబికారచిత
మై, నిత్యమై నత్య - మై ధన్యమైన

సామార్థసారసు - జ్ఞానవాసిష్ఠ
రామాయణం బను - రమ్యసద్ద్విపద

యం దెన్నఁగాఁ దృ - తీయ ప్రకరణము
నందమై విమల మో - క్షాకరం బగుచు

శ్రీతరిగొండ నృ - సింహుం డనంగ
ఖ్యాతిగా వెలయు వేం - కటరాయ! నీదు

పదయుగళికి సమ - ర్పణమయ్యె, దీని
సదమలులై వ్రాసి - చదివిన, వినిన1750

నరులు తాపత్రయార్ణవముఁ దరించి
పరమైన నిర్వాణ - పదము నొందుదురు.

భూచక్రమున నిది - పురుషార్ధ మగుచు
నా చంద్రతారార్క - మై యుండుఁగాత!

-:తృతీయప్రకరణము సమాప్తము:-

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. జెప్పిన - వేం.