పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/దేవాసుర యుద్ధము

వికీసోర్స్ నుండి

దేవాసుర యుద్ధము

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము)
రచయిత: సింగయ


తెభా-6-270-సీ.
రీతిఁ దనయింటి కేతెంచు దేవతా-
తి రాక యా బృహస్పతి యెఱింగి
ధ్యాత్మమాయచే డఁగి యదృశ్యుఁ డై-
పోయె నప్పుడు దేవపుంగవుండు
కలంబుఁ బరికించి జాడఁ గానక గురు-
జింతించి తలపోసి చిన్నపోయెఁ;
బోయిన విధ మెల్ల దాలు రాక్షస-
వీరులు వేగులవారివలనఁ

తెభా-6-270.1-తే.
దెలిసి మిక్కిలి తమలోనఁ దెలివినొంది
యందఱును గూడి భార్గవు నాశ్రయించి
త్కృపాదృష్టిఁ దమశక్తి ట్టమైన
దేవతలమీఁది దాడికిఁ దెరువు పెట్టి.

టీక:- ఈ = ఈ; రీతిన్ = విధముగ; తన = తన యొక్క; ఇల్లు = నివాసమున; కి = కి; ఏతెంచు = వచ్చెడి; దేవతాపతి = ఇంద్రుడు {దేవతా పతి - దేవతల యొక్క పతి (ప్రభువు), ఇంద్రుడు}; రాక = వచ్చుటను; ఆ = ఆ; బృహస్పతి = బృహస్పతి; ఎఱింగి = తెలిసికొని; అధ్యాత్మ = ఆధ్యాత్మిక; మాయ = ప్రభావము; చేన్ = వలన; అడగి = అణగిపోయి; అదృశ్యుడు = మాయమైనవాడు; ఐపోయెను = అయ్యెను; అప్పుడు = అప్పుడు; దేవపుంగవుండు = ఇంద్రుడు {దేవ పుంగవుడు - దేవ (దేవతలలో) పుంగవుడు (శ్రేష్ఠుడు), ఇంద్రుడు}; సకలంబు = సర్వము; పరికించి = వెతికి చూసి; గురున్ = బృహస్పతిని; చింతించి = స్మరించి; తలపోసి = ఆలోచించుకొని; చిన్నపోయెన్ = చిన్నపోయెను; పోయిన = (బృహస్పతి) వెళ్ళిపోవుట; విధము = విధానమును; ఎల్లన్ = సర్వమును; దాయలు = దాయాదులు; రాక్షస = రాక్షసులైనట్టి; వీరులు = శూరులు; వేగులవారి = చారుల; వలన = వలన; తెలిసి = తెలిసికొని;
మిక్కిలి = అధికముగ; తమలోన = తమలో తాము; తెలివిన్ = తెలివిని; ఒంది = పొంది; అందఱునున్ = అందరూ; కూడి = కలిసి; భార్గవున్ = శుక్రాచార్యుని {భార్గవుడు - భర్గుని యొక్క పుత్రుడు, శుక్రుడు}; ఆశ్రయించి = చేరి; తత్ = అతని; కృపా = దయ గల; దృష్టిన్ = చూపులతో; తమ = తమ యొక్క; శక్తి = బలము; దట్టము = పెరిగినది; ఐన = కాగా; దేవతల = దేవతల; మీది = పైకి; దాడి = యుద్ధమున; తెరువు = దారి; పెట్టి = నిశ్చయించి, పట్టి.
భావము:- ఈ విధంగా తన ఇంటికి దేవేంద్రుడు వస్తున్న సంగతి తెలుసుకొని బృహస్పతి ఆధ్యాత్మిక మాయచే అదృశ్యుడైనాడు. ఇంద్రుడు అంతటా వెదకి గురువు జాడ కనుగొనలేక చిన్నబోయాడు. బృహస్పతి వెళ్ళిపోయిన విషయాన్ని దేవతల దాయాదులైన రాక్షస వీరులు గూఢచారుల వలన తెలుసుకొని, తమకు తామే తెలివి తెచ్చుకొని అందరు కలిసి తమ గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించి, అతని దయచేత తమ శక్తిని పెంపొందజేసికొని దేవతల మీదికి దండయాత్రకు మార్గం కనిపెట్టి...

తెభా-6-271-క.
ధూర్తులు సమస్త కిల్బిష
మూర్తులు వర ధర్మ కర్మ మోచిత మార్గా
ర్తులు దుర్ణయ నిర్మిత
కీర్తులు దానవులు చనిరి గీర్వాణులపై.

టీక:- ధూర్తులు = నిందార్హులు; సమస్త = సర్వ; కిల్బిష = పాపముల; మూర్తులు = స్వరూపులు; వర = శ్రేష్ఠమైన; ధర్మ = ధర్మబద్ధమైన; కర్మ = కార్యముల నుండి; మోచిత = విమోచనమైన; మార్గ = దారి యందు; ఆవర్తులు = వర్తించెడివారు; దుర్ణయ = అవినీతిచే; నిర్మిత = నిర్మింపబడిన; కీర్తులు = యశస్సు గలవారు; దానవులు = రాక్షసులు; చనిరి = వెళ్ళిరి; గీర్వాణుల = దేవతల {గీర్వాణులు - మాటయే బాణముగా గలవారు, దేవతలు}; పై = మీదకి.
భావము:- మోసగాళ్ళు, పాపాత్ములు, ధర్మమార్గాన్ని విడిచినవాళ్ళు, అవినీతిపరులన్న చెడుపేరు తెచ్చుకున్నవాళ్ళు అయిన రాక్షసులు దేవతలపై దండెత్తారు.

తెభా-6-272-స్రగ్ద.
దండిం గోదండ కాండోద్ధత రథ హయ వేదండ దండంబుతోడన్
దండెత్తెన్ మెండుగా నద్దనుజనికరముల్ దైవవర్గంబు మీఁదం
జంబ్రహ్మాండ భేదోచ్ఛ్రయ జయరవముల్ ర్వదిక్ క్షోభగా ను
ద్దంప్రఖ్యాత లీలం లపడిరి సురల్ ర్పులై వారితోడన్.

టీక:- దండిన్ = మెండుగా; కోదండ = విల్లులు; కాండ = బాణముల; ఉద్ధత = చెలరేగుట; రథ = రథములు; హయ = గుఱ్ఱములు; వేదండ = ఏనుగుల; తండంబు = సమూహముల; తోడన్ = తోటి; దండెత్తెన్ = దండెత్తెను; మెండుగా = మిక్కిలిగా; ఆ = ఆ; దనుజ = రాక్షస; నికరముల్ = సమూహములు; దైవ = దేవతల; వర్గంబున్ = గణముల; మీదన్ = పైని; చండ = భయంకరమైన; బ్రహ్మాండ = బ్రహ్మాండమును; భేద = బద్దలు చేయుచున్నట్టి; ఉచ్ఛ్రయ = చెలరేగిన; జయ = జయజయ మనెడి; రవముల్ = శబ్దములు; సర్వ = సమస్తమైన; దిక్ = దిక్కులను; క్షోభగాన్ = సంక్షోభము చెందునట్లుగా; ఉద్దండ = అత్యధికమైన; ప్రఖ్యాత = ప్రసిద్ధమైన; లీలన్ = విధముగా; తలపడిరి = ఒండొరులను తాకిరి; సురల్ = దేవతలు; దర్పులు = గర్వించినవారు; ఐ = అయ్యి; వారి = వారి; తోడన్ = తోటి.
భావము:- గొప్ప ధనుర్బాణాలతో విజృంభించి రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులతో ఎక్కి ఆ రాక్షసుల సమూహం దేవతాగణాలపై దండెత్తింది. దేవతలు తీవ్రంగా బ్రహ్మాండం బ్రద్దలయ్యే వీరాలాపాలతో, జయజయ ధ్వనులతో, దిక్కులన్నీ క్షోభించే విధంగా వీరావేశంతో విజృంభించి వాళ్ళను ఎదిరించారు.

తెభా-6-273-చ.
మున దేవదానవులు చ్చరముల్గడుఁ బిచ్చలింప సం
లను గోరి పోరునెడ భార్గవ మంత్రకళా విశేషులై
యెదురులు వాలి నస్త్రమున నేయ మహాసురు లేచియేచి పెం
గుదులుగఁ గ్రువ్వ దేవతలు కోల్తల కోర్వక వీఁగి రయ్యెడన్.

టీక:- మదమున = మదముతో; దేవ = దేవతలు; దానవులు = రాక్షసులు; మచ్చరముల్ = మాత్యర్యములు; కడు = మిక్కిలి; పిచ్చలింప = చెలరేగగా; సంపదలను = సంపదలను; కోరి = ఆశించి; పోరున్ = యుద్ధము చేయు; ఎడన్ = సమయము నందు; భార్గవ = శుక్రాచార్యుని; మంత్ర = మంత్రాగపు, ఆలోచన; కళ = నేర్పువలన, విద్యల యొక్క; విశేషులు = విశిష్టతలు గలవారు; ఐ = అయ్యి; ఎదురులువాలి = ఎదురుగా నిలబడి; అస్త్రమునన్ = అస్త్రముతో; ఏయ = కొట్టగా; మహా = గొప్ప; అసురులు = రాక్షసులు; ఏచియేచి = విజృంభించి; పెన్ = పెద్దపెద్ద; గుదులుగ = గుత్తులుగ; గువ్వ = చుట్టుముట్టగ; దేవతలు = దేవతలు; కోల్తలు = ముట్టడి, ఎదుట నిలిచి యుద్ధము చేయుట; కు = కు; ఓర్వక = తట్టుకొనలేక; వీగిరి = ఒడిపోయిరి; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు.
భావము:- దేవతలు, రాక్షసులు పెచ్చు పెరిగిన మాత్సర్యంతో సంపదల కోసం పరస్పరం పోరాడసాగారు. రాక్షస వీరులు శుక్రాచార్యుల మంత్రశక్తితో మహాబల సంపన్నులై దేవతలమీద అస్త్రాలను ప్రయోగించగా దేవతలు వారి ముట్టడికి, పరాక్రమానికి తాళలేక పారిపోయారు.

తెభా-6-274-ఆ.
నుజవీరు లేయు దారుణ దివ్యాస్త్ర
ళితదేహు లగుచుఁ లలు వీడ
నోడి పాఱి రద్భుతోపేత బలులైన
త్రిదశవరులు బిట్టు దిట్టినట్లు.

టీక:- దనుజ = రాక్షస; వీరులు = వీరులు; ఏయు = వేసెడి; దారుణ = భయంకరమైన; దివ్య = గొప్ప; అస్త్ర = అస్త్రములవలన; దళిత = దెబ్బతిన్నట్టి; దేహులు = శరీరములు గలవారు; అగుచున్ = అగుచు; తలలు = శిరస్సులు; వీడ = తెగుతుండగ; ఓడి = ఓడిపోయి; పాఱిరి = పాఱిపోయిరి; అద్భుత = అద్భుతమైన; బలులు = బలము గలవారు; ఐన = అయిన; త్రిదశ = దేవతలైన; వరులు = శ్రేష్ఠులు; బిట్టు = మిక్కిలిగా; తిట్టినట్లు = శపింపబడినట్లు.
భావము:- అద్భుత పరాక్రమం కలవారై కూడా దేవతలు శాపం తగిలినట్లు రాక్షసవీరులు వేసే భయంకరమైన దివ్యాస్త్రాలకు తట్టుకోలేక ఛిద్రమైన దేహాలతో తలలు తెగిపడగా ఓడి పారిపోయారు.

తెభా-6-275-క.
మొగము గాక దివిజులు
తిమక గొని వైరులెల్ల ఢీకొనఁ దమ్ముం
బిపిక లై నకనక లై
లులుకఁ బరువెత్తి రోడి లోగొను భీతిన్.

టీక:- ఒకమొగము = ఏకోన్ముఖలు; కాక = కాకుండగ; దివిజులు = దేవతలు {దివిజులు - దివి (స్వర్గమున) జులు (పుట్టినవారు), దేవతలు}; తికమకగొని = తొట్రుపడి; వైరులు = శత్రువులు; ఎల్లన్ = అందరు; ఢీకొనన్ = ఎదుర్కొనగా; తమ్మున్ = తమను; పికపికలు = చెల్లాచెదరు; ఐ = అయ్యి; నకనకలు = గడగడలాడువారు; ఐ = అయ్యి; లుకలుకన్ = తడబడుతూ; పరువెత్తిరి = పరుగెత్తారు; ఓడి = ఓడిపోయి; లోగొను = లొంగదీసుకొను; భీతిన్ = భయముతోటి.
భావము:- శత్రువులు ఢీకొనగా దేవతలంతా చెల్లాచెదరై తొట్రుపాటు పడుతూ వాళ్ళు తమను లొంగదీసుకుంటారేమో అన్న భయంతో గడగడలాడుతూ ఓడి పారిపోయారు.

తెభా-6-276-చ.
నుజుల గర్వరేఖయును దానవవీరుల యంపజోకయున్
నుజవిశేష భోజనుల చ్చరికంబు నిశాటకోటి యే
చి బల శౌర్యముం దమకు సిగ్గును హాని మహాభయంబు ని
ర్గుతను జేయు నుమ్మలికఁ గోల్తల కోర్వక పాఱిరార్తు లై.

టీక:- దనుజుల = రాక్షసుల; గర్వరేఖయును = విజయగర్వాతిశయము; దానవ = రాక్షస; వీరుల = వీరుల; అంప = బాణముల; జోకయున్ = జతపరచుట; మనుజవిశేషభోజనుల = రాక్షసుల {మనుజ విశేష భోజనులు - మానవులను విశేషముగా తినెడివారు, రాక్షసులు}; మచ్చరికంబు = మాత్యర్యములు; నిశాట = రాక్షసుల {నిశాటులు - నిశ (రాత్రి యందు) ఆటులు (చరించెడివారు), రాక్షసులు}; కోటి = సమూహములు; ఏచిన = అతిశయించిన; బల = బలము; శౌర్యమున్ = పరాక్రమము; తమ = తమ; కు = కు; సిగ్గును = లజ్జను; హాని = నష్టము; మహా = గొప్ప; భయంబు = భయము; నిర్గుణతను = నిశ్చేష్టతలను; చేయు = కలుగజేయు; ఉమ్మలికన్ = సంతాపముతో; కోల్తల్ = ఎదుట నిలిచి యుద్ధముచేయుట; కు = కి; ఓర్వక = ఓర్చుకొనలేక; పాఱిరి = పారిపోయిరి; ఆర్తులు = భయపడుతున్నవారు; ఐ = అయ్యి.
భావము:- రాక్షసుల విజయగర్వాతిశయం, వారి శరాఘాతాలు, వారి మాత్సర్యం, వారి వీర విజృంభణం తమకు సిగ్గును, కీడును, భయాన్ని కలుగజేయగా చేష్టలుడిగినవారై దేవతలు యుద్ధంలో నిలువలేక పారిపోయారు.

తెభా-6-277-క.
రులు విసృష్ట దానవ
రులు శరభిన్న దేహ సంతాపగుణ
భ్రరులు దైత్య కిరాతక
రులు కమలజుని కడఁకుఁ నిరి భయార్తిన్.

టీక:- అమరులు = దేవతలు {అమరులు - మరణము లేనివారు, దేవతలు}; విసృష్ట = విడిచినట్టి; దానవ = రాక్షసులతోటి; సమరులు = యుద్ధములు గలవారు; శర = బాణములచే; భిన్న = పగిలిన; దేహ = అవయవముల; సంతాప = బాధపడెడి; గుణ = లక్షణముతో; భ్రమరులు = చలించిపోవుతున్న వారు; దైత్య = రాక్షసు లనెడి {దైత్యులు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; కిరాతక = వేటగాడికి, కిరాతకులకు; చమరులు = చమరీ మృగముల వంటివారు; కమలజుని = బ్రహ్మదేవుని {కమలు జుడు - కమలమునందు జుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; కడ = వద్ద; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; భయ = భయము; ఆర్తిన్ = బాధతోటి.
భావము:- రాక్షసులతో యుద్ధాన్ని వదలిన దేవతలు, బాణాల వల్ల గాయపడిన దేహాలతో, వేటగాడికి బెదరిన చమరీమృగాల వలె, పారిపోయి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు.

తెభా-6-278-ఉ.
ధాకు దేవతా విభవదాతకుఁ బుణ్యజనానురాగ సం
ధాకు సర్వలోకహితదాతకు వైదిక ధర్మమార్గ ని
ర్ణేకు నుల్లసద్విభవ నేతకు సర్వ జగజ్జయాంగజ
భ్రాకుఁ బుణ్యయోగిజన భావవిజేతకు మ్రొక్కిరయ్యెడన్.

టీక:- ధాత = బ్రహ్మదేవుని; కు = కి; దేవతావిభవదాత = బ్రహ్మదేవుని {దేవతా విభవ దాత - దేవత (దేవతల యొక్క) విభవ (వైభవములను) దాత (సమకూర్చెడి వాడు), బ్రహ్మ}; కు = కి; పుణ్యజనానురాగసంధాత = బ్రహ్మదేవుడు {పుణ్యజ నానురాగ సంధాత - పుణ్యజన (పుణ్యాత్ము లైన మానవులకు, దేవతలకు) అనురాగ (ప్రేమను) సంధాత (కలిగించెడివాడు), బ్రహ్మ}; కు = కి; సర్వలోకహితదాత = బ్రహ్మదేవుడు {సర్వ లోక హిత దాత - సర్వ (అఖిల) లోక (లోకముల) హిత (హితమును) దాత (కలిగించెడి వాడు), బ్రహ్మ}; కు = కి; వైదికధర్మమార్గనిర్ణేత = బ్రహ్మదేవుడు {వైదిక ధర్మమార్గ నిర్ణేత - వైదిక (వేదశాస్త్రము లందలి) ధర్మ (ధర్మబద్ధమైన) మార్గ (విధానములను) నిర్ణేత (నిర్దేశించెడివాడు), బ్రహ్మ}; కున్ = కి; ఉల్లసద్విభవనేత = బ్రహ్మదేవుడు {ఉల్లస ద్విభవ నేత - ఉల్లసత్ (వికాసవంత మైన) విభవ (వైభవములు గల) నేత (ప్రభువు), బ్రహ్మ}; కు = కు; సర్వజగజ్జయాంగజభ్రాత = బ్రహ్మదేవుడు {సర్వ జగజ్జయాంగజ భ్రాత - సర్వ (అఖిల) జగత్ (లోకములను) జయ(జయించెడి) అంగజ (మన్మథుని) భ్రాత (సోదరుడు), బ్రహ్మ}; కు = కు; పుణ్యయోగిజనభావవిధాత = బ్రహ్మదేవుడు {పుణ్య యోగి జన భావ విజేత - పుణ్య (పావనమైన) యోగి జనముల భావ (హృదయములను) విజేత (జయించినవాడు), బ్రహ్మ}; కు = కు; మ్రొక్కిరి = నమస్కరించిరి; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు.
భావము:- దేవతలకు వైభవాన్ని సమకూర్చేవాడు, పుణ్యాత్ములను ప్రేమించేవాడు, సర్వలోకాలకు హితం కూర్చేవాడు, వేదధర్మాలను నిర్ణయించేవాడు, గొప్ప వైభవాలకు అధిపతి, లోకా లన్నింటినీ జయించే మన్మథునికి అన్న అయినవాడు, యోగీంద్రుల హృదయాలను లోగొన్నవాడు అయిన బ్రహ్మకు దేవతలు నమస్కరించారు.

తెభా-6-279-క.
ఖండలుండు మొదలుగ
లేఖానీకముల బ్రహ్మ లేనగవున ని
త్యాఖండ సత్కృపారస
శేర వాక్యముల వారి సేదలు దేర్చెన్.

టీక:- ఆఖండలుండు = ఇంద్రుడు; మొదలుగ = మొదలైన; లేఖా = దేవతల; అనీకముల = సమూహములను; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; లేనగవున = లేతనవ్వుతో; నిత్య = నిత్యమైన; అఖండ = ఎడతెగని; సత్కృప = మంచి దయా; రస = రసములలో; శేఖర = ఉత్తమమైన; వాక్యములన్ = మాటలతో; వారిన్ = వారిని; సేదలుదేర్చెన్ = ఓదార్చెను.
భావము:- ఇంద్రుడు మొదలైన దేవతల సమూహాన్ని చిరునవ్వుతో మిక్కిలి దయతో పలకరించి ఓదార్చాడు.

తెభా-6-280-వ.
ఇట్లు బ్రహ్మదేవుండు దేవేంద్రప్రముఖు లయిన దేవతల కనుకంపాతిశయ విభవంబున నభయం బొసంగి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మదేవుండు = చతుర్ముఖబ్రహ్మ; దేవేంద్ర = దేవేంద్రుడు; ప్రముఖులు = మొదలగు గొప్పవారు; అయిన = అయిన; దేవతల్ = దేవతల; కు = కు; అనుకంప = కనికరము; అతిశయ = మిక్కుటమైన, విశేషమైన; విభవంబునన్ = వైభవముతో; అభయంబున్ = అభయము; ఒసంగి = ఇచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలైన దేవతలకు విశేషమైన దయతో అభయమిచ్చి ఇలా అన్నాడు.

తెభా-6-281-ఉ.
"నెట్టన పాపకర్మమున నేరమిఁ జేసితి రేమి చెప్ప; మీ
పుట్టిన నాఁటనుండియును బుద్ధులు జెప్పి జగంబు లేలఁగాఁ
ట్టముఁ గట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళావిధిజ్ఞుఁ జే
ట్టక గుట్టు జాఱి సిరిట్టునఁ దొట్టిన పొట్ట క్రొవ్వునన్.

టీక:- నెట్టన = అనివార్యముగ; పాప = పాపపు; కర్మమున = కార్యమును; నేరమిన్ = తప్పుపనిని; చేసితిరి = చేసిరి; ఏమి = ఏమని; చెప్ప = చెప్పను; మీ = మీరు; పుట్టిన = జన్మించిన; నాట = సమయము; నుండియును = నుండి కూడ; బుద్ధులు = మంచిచెడులు; చెప్పి = విడమరచి చెప్పి; జగంబుల్ = లోకములను; ఏలగాన్ = పరిపాలించుటకు; పట్టముగట్టి = అధికారమును కట్టబెట్టి; పెంచిన = పెంచినట్టి; కృపా = దయకు; నిధి = నిధివంటి వానిని; బ్రహ్మకళా = బ్రహ్మవిద్య; విధిజ్ఞున్ = విధానములు బాగుగా తెలిసినవానిని; చేపట్టక = కైకొనక, గ్రహించక; గుట్టుజాఱి = గుట్టురట్టు చేసుకొని; సిరి = సంపదల; పట్టునన్ = కారణముగ; తొట్టిన = పెరిగిపోయిన; పొట్టకొవ్వునన్ = అతిగర్వముతో.
భావము:- “మీరు చేయకూడని పాపకార్యాన్ని బలవంతంగా చేశారు. మీరు పుట్టినప్పటి నుండి బుద్ధులు చెప్పి లోకాలను పాలించడానికి పట్టంకట్టి పెంచినట్టి దయాసముద్రుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన గురువును దరిజేర్చుకొనకుండా సంపద గర్వంతో మీ గుట్టును రట్టు చేసుకున్నారు.

తెభా-6-282-వ.
బ్రహ్మిష్ఠుం డైన బ్రాహ్మణు నాచార్యుం గైకొనక గురుద్రోహంబు చేసితిరి; తద్దోషం బిపుడు మీఁకుఁ జేసేఁత శత్రుకృతం బై యనుభవింపం జేసె; నతి బలవంతులయిన మిమ్ము నతి క్షీణులైన యారాక్షసులు జయించుట దమ యాచార్యుండైన శుక్రు నారాధించి తన్మంత్ర ప్రభావంబునఁ బునర్లబ్ధ వీర్యు లగుటచేతనే; ఇప్పుడు మదీయంబైన నిలయంబు నాక్రమింపం గలవారై మదోద్రేకంబున నెదురు లేక వర్తిల్లుచున్న రక్షోనాయకులకుం ద్రిదివంబు గొనుట తృణప్రాయంబు; అభేద్య మంత్ర బలంబుగల భార్గవునకు వారు శిష్యులగుటంజేసి విప్ర గోవింద గవేశ్వరానుగ్రహంబు గలవారలకుఁ దక్కం దక్కిన రాజుల కరిష్టంబగుం; గావున మీ రిప్పుడు త్వష్ట యను మను పుత్రుండగు విశ్వరూపుం డను ముని నిశ్చల తపో మహత్త్వ సత్త్వ స్వభావుం డతని నారాధించిన, మీకు నభీష్టార్థంబుల నతండు సంఘటిల్లఁ జేయు; నిట్టి దుర్దశల నతం డడంచు"నని చెప్పిన దిక్పాలకాదులు డెందంబులు డిందుపడి కమలగర్భుని వీడ్కొని విశ్వరూపు కడకుం జని యిట్లనిరి.
టీక:- బ్రహ్మిష్ఠుండు = బహ్మజ్ఞాన స్వరూపుడు; ఐన = అయిన; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుని; ఆచార్యున్ = గురువు; కైకొనక = చేపట్టక; గురుద్రోహంబు = గురువు యెడల చేసిన ద్రోహము; చేసితిరి = చేసిరి; తత్ = ఆ యొక్క; దోషంబు = దోషము; ఇపుడు = ఇప్పుడు; మీరు = మీరు; కున్ = కు; చేసేత = చేజేతుల చేసినది; శత్రు = శత్రువులచే; కృతంబు = చేయబడినది; ఐ = అయ్యి; అనుభవింపన్ = అనుభవించునట్లు; చేసెన్ = చేసెను; అతి = మిక్కిలి; బలవంతులు = శక్తి సామర్థ్యములు గలవారు; అయిన = ఐన; మిమ్మున్ = మిమ్ములను; అతి = మిక్కిలి; క్షీణులు = దుర్బలులు; ఐన = అయిన; ఆ = ఆ; రాక్షసులు = రాక్షసులు; జయించుట = జయించుట; తమ = తమ యొక్క; ఆచార్యుండు = గురువు, పురోహితుడు; ఐన = అయిన; శుక్రున్ = శుక్రుని; ఆరాధించి = సేవించి; తత్ = అతని; మంత్ర = మంత్రాంగపు; ప్రభావంబునన్ = ప్రభావము వలన; పునర్ = మరల; లబ్ధ = లభించిన; వీర్యులు = పరాక్రమము గలవారు; అగుటన్ = అగుట; చేతనే = వలన; ఇప్పుడు = ఇప్పుడు; మదీయంబు = నాది; ఐన = అయినట్టి; నిలయంబున్ = నివాసమును; ఆక్రమింపగలవారు = ఆక్రమించ గలవారు; ఐ = అయ్యి; మద = మదమువలని; ఉద్రేకంబునన్ = ఉద్రేకముతో; ఎదురు = తిరుగు; లేక = లేకుండగ; వర్తిల్లుచున్ = తిరుగుచున్న; రక్షస = రాక్షసుల యొక్క; నాయకుల్ = నాయకుల; కున్ = కు; త్రిదివంబు = స్వర్గమును; కొనుట = తీసుకొనుట; తృణప్రాయంబు = అతి తేలిక {తృణప్రాయము - తృణము (గడ్డిపరక)తో ప్రాయము (సమానము), అతితేలికైన పని}; అభేద్య = జయింపరాని; మంత్ర = మంత్రాంగపు; బలంబు = సామర్థ్యము; కల = కలిగినట్టి; భార్గవున్ = శుక్రుని; కు = కి; వారు = వారు; శిష్యులు = శిష్యులు; అగుటన్ = అగుట; చేసి = వలన; విప్ర = బ్రాహ్మణుని; గోవింద = నారాయణుని; గవ = గోవుని; ఈశ్వర = ఈశ్వరుని; కల = అనుగ్రహం కలిగినట్టి; వారల్ = వారల; కున్ = కు; తక్క = తప్పించి; తక్కిన = ఇతరమైన; రాజుల్ = రాజుల; కున్ = కు; అరిష్టంబు = నష్టదాయక మగునది; అగున్ = అగును; కావున = కనుక; మీరు = మీరు; ఇప్పుడు = ఇప్పుడు; త్వష్ట = త్వష్ట; అను = అనెడి; మను = మనువు యొక్క; పుత్రుండు = కుమారుడు; అగు = అయిన; విశ్వరూపుండు = విశ్వరూపుడు; అను = అనెడి; ముని = ముని; నిశ్చల = చలించని; తపస్ = తపస్సు; మహత్త్వ = మహత్యము; సత్త్వ = సత్త్వగణములు గల; స్వభావుండు = స్వభావము గలవాడు; అతనిన్ = అతనిని; ఆరాధించిన = సేవించిన; మీ = మీ; కున్ = కు; అభీష్టార్థంబులు = వలసిన వాంఛితములను; అతండు = అతడు; సంఘటిల్లన్ = తీరునట్లు; చేయున్ = చేయును; ఇట్టి = ఇటువంటి; దుర్దశలన్ = దురదృష్టములను; అతండు = అతడు; అడంచున్ = అణచివేయును; అని = అని; చెప్పిన = చెప్పగా; దిక్పాలక = దిక్పాలకులు {అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు - తూర్పు దిక్కునకు 2 అగ్ని - ఆగ్నేయ మూలకు 3 యముడు - దక్షిణ దిక్కునకు 4 నిరృతి - నైఋతి మూలకు 5 వరుణుడు - పడమటి దిక్కునకు 6 వాయువు - వాయవ్య మూలకు 7 కుబేరుడు - ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు - ఈశాన్య మూలకు పరిపాలకులు}; ఆదులు = మొదలగువారు; డెందంబులు = మనసులు; డిందుపడి = కుదుటపడి; కమలగర్భుని = బ్రహ్మదేవుని {కమల గర్భుడు - కమలమున గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; వీడ్కొని = సెలవు తీసుకొని; విశ్వరూపు = విశ్వరూపుని; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- బ్రహ్మనిష్ఠుడు, బ్రాహ్మణుడు అయిన ఆచార్యుని గౌరవించకుండా గురుద్రోహం చేశారు. చేతులారా చేసిన ఆ దోషమే ఇప్పుడు మీకు శత్రురూపంలో అనుభవానికి వచ్చింది. మిక్కిలి బలవంతులైన మిమ్ములను బలహీనులైన రాక్షసులు జయించడం వారు తమ గురువైన శుక్రాచార్యుని పూజించి, అతని మంత్రమహిమ వల్ల తిరిగి గొప్ప పరాక్రమవంతులు కావడం వల్లనే సాధ్యమయింది. ఇప్పుడు వారు నా బ్రహ్మపదాన్నైనా అక్రమించ గలవారై గర్వంతో ఎదురులేకుండా ఉన్నారు. అటువంటి వారికి స్వర్గాన్ని ఆక్రమించడం తృణప్రాయమైన పని. భేదింపరాని మంత్రబలం కలిగిన శుక్రాచార్యుని శిష్యులు కనుక బ్రాహ్మణల, గోవుల, నారాయణుల అనుగ్రహం పొందిన వారికి తప్ప మిగిలిన రాజులకు కీడు చేస్తారు. కావున మీరిప్పుడు త్వష్ట అనే మనువు కొడుకు, మహాతపస్వి, సత్త్వగుణ సంపన్నుడు అయిన విశ్వరూపుడు అనే మునిని ఆశ్రయించండి. మీ కోరికలను అతడు తీరుస్తాడు. ఇటువంటి కష్టాలను తొలగింప జేస్తాడు” అని బ్రహ్మ చెప్పగా దిక్పాలకులు మొదలైన దేవతలు బ్రహ్మ వద్ద సెలవు తీసుకొని విశ్వరూపుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు.

తెభా-6-283-తే.
"న్న మేలగు నీకు నిన్నడుగఁ గోరి
చ్చినారము భవదీయ నమునకును;
దండ్రులకు నేఁడు సమయోచితంబు లైన
కోర్కు లొడఁగూడఁ జేసి చేకొనుము యశము

టీక:- అన్న = ఓ యన్నా; మేలు = శుభములు; అగు = కలుగును; నీ = నీ; కున్ = కు; నిన్ను = నిన్ను; అడుగన్ = అడుగుటను; కోరి = కోరి; వచ్చినారము = వచ్చితిమి; భవదీయ = నీ యొక్క; వనమున = ఆశ్రమమున; కునున్ = కు; తండ్రుల్ = తండ్రుల సోదరవర్గము వారమైన మా; కు = కు; నేడు = ఈ దినమున; సమయోచితంబులు = కాలానుగుణములు; ఐన = అయిన; కోర్కులు = కోరికలు; ఒడగూడన్ = తీరునట్లు; చేసి = చేసి; చేకొనుము = కైకొనుము; యశము = కీర్తిని.
భావము:- “అన్నా! నీకు మేలగు గాక! నిన్ను అర్థించడానికి నీ తపోవనానికి వచ్చాము. నీ తండ్రులమైన మా కోరికలను సమయోచితంగా తీర్చి కీర్తిని పొందు.

తెభా-6-284-క.
సుతులకుఁ బితృశుశ్రూషణ
తిపుణ్యము జేయుచుండు నాత్మజులు గుణో
న్నతి బ్రహ్మచారు లైనను
తిలో గురుసేవకన్న ఱియుం గలదే?

టీక:- సుతుల్ = పుత్రుల; కున్ = కు; పితృ = తండ్రులకు; శుశ్రూషణము = సేవజేయుట; అతి = మిక్కిలి; పుణ్యము = పుణ్యకరము; చేయుచుండు = చేస్తూ ఉండును; ఆత్మజులు = పుత్రులు; గుణ = సుగుణముల; ఉన్నతిన్ = అతిశయముతో; బ్రహ్మచారులు = బ్రహ్మచారులు; ఐనను = అయినప్పటికిని; మతిలోన్ = ఆలోచించి చూసినచో; గురుసేవ = పితృసేవ; కన్న = కంటెను; మఱియున్ = ఇంకేమైనను; కలదే = ఉన్నదా ఏమి.
భావము:- తండ్రికి సేవలు చేసే కుమారులకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆ కుమారులు గుణవంతులు, బ్రహ్మచారులు అయితే వారికి గురుసేవను మించినది వేరే ఏముంది?

తెభా-6-285-వ.
అదియునుం గాక
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతేకాక...

తెభా-6-286-సీ.
రయ నాచార్యుండు రతత్త్వరూపంబు-
దండ్రి దలంపఁగ ధాతరూపు;
రూపింప భ్రాత మరుత్పతి రూపంబు-
దెలియంగఁ దల్లి భూదేవిరూపు;
గిని కరుణరూపు; భావంబు ధర్మ స్వ-
రూపంబు దా నర్థిరూపు మొదల
భ్యాగతుఁడు మున్న గ్ని దేవునిరూపు-
ర్వభూతములుఁ గేవుని రూపు;

తెభా-6-286.1-ఆ.
గాన తండ్రి వేగ డు నార్తులగు పితృ
నులమైన మమ్ముఁ ల్లఁ జూచి
భయంబు వాపి నిరుపమం బగు తపో
హిమచేత మెఱసి నుపవయ్య!

టీక:- అరయన్ = తరచి చూసిన; ఆచార్యుండు = గురువు; పరతత్త్వ = పరబ్రహ్మ; రూపంబు = స్వరూపము; తండ్రి = తండ్రి; తలపంగ = తరచి చూసిన; ధాత = బ్రహ్మదేవుడు; రూపు = స్వరూపము; రూపింప = తరచి చూసిన; భ్రాత = సోదరుడు; మరుత్పతి = ఇంద్రుడు {మరుత్పతి - మరుత్ (మరుద్గణములకు) పతి (ప్రభువు), ఇంద్రుడు}; రూపంబు = స్వరూపము; తెలియంగ = తరచి చూసిన; తల్లి = తల్లి; భూదేవి = భూదేవి; రూపు = స్వరూపము; భగిని = సోదరి; కరుణ = దయ యొక్క; రూపు = స్వరూపము; భావంబు = భావము; ధర్మ = ధర్మము యొక్క; స్వరూపంబు = స్వరూపము; తాన్ = తను; అర్థి = వేడువాని; రూపు = స్వరూపము; మొదల = ముఖ్యముగ; అభ్యాగతుడు = అతిథి; మున్న = ముందే; అగ్నిదేవుని = అగ్నిదేవుని; రూపు = స్వరూపము; సర్వ = అఖిలమైన; భూతములు = జీవులు; కేశవుని = నారాయణుని; రూపు = స్వరూపము; కాన = కావున;
తండ్రి = నాయనా; వేగ = శ్రీఘ్రమే; కడున్ = మిక్కిలి; ఆర్తులు = దుఃఖితులు; అగు = అయిన; పితృజనులము = తండ్రి సోదరవర్గము వారము; ఐన = అయిన; మమ్మున్ = మమ్ములను; చల్లన్ = దయతో; చూచి = చూసి; పర = శత్రు; భయంబు = భయమును; పాపి = పోగొట్టి; నిరుపమంబు = సాటిలేనిది; అగు = అయిన; తపస్ = తపస్సు యొక్క; మహిమ = మహత్యము; చేత = వలన; మెఱసి = అతిశయించి; మనుపు = రక్షింపుము; అయ్య = తండ్రి.
భావము:- గురువు పరమాత్మ స్వరూపుడు. తండ్రి బ్రహ్మ స్వరూపుడు. అన్న ఇంద్ర స్వరూపుడు. తల్లి భూదేవి రూపం. సోదరి దయాస్వరూపిణి. భావం ధర్మ స్వరూపం. తాను అర్థి స్వరూపం. అభ్యాగతుడు అగ్నిదేవ స్వరూపం. సర్వ ప్రాణులు విష్ణు స్వరూపం. కాబట్టి తండ్రీ! మిక్కిలి ఆపదలో ఉన్న పితృజనులమైన మమ్ము నీ చల్లని చూపు చూసి, శత్రు భయాన్ని పోగొట్టి, నీ తపోమహిమతో కాపాడు.

తెభా-6-287-వ.
ఇప్పుడు బ్రహ్మనిష్ఠుండ వైన నిన్నాచార్యునింగా వరియించి, భవదీయ తేజోవిశేషంబు చేత వైరివీరులం బరిమార్చెద; మాత్మీయార్థం బైన యవిష్ణ పాదాభివందనంబు నిందితంబు గాదని వేదవాక్యంబు గలదు; గావున నీకు నమస్కరించుచున్న దేవతలం గైకొని పౌరోహిత్యంబు జేయు"మనినఁ బ్రహసితవదనుండై యమ్మునీశ్వరుం డిట్లనియె.
టీక:- ఇప్పుడు = ఇప్పుడు; బ్రహ్మ = బ్రహ్మవిద్య యందు; నిష్ఠుండు = నిష్ఠ గలవాడవు; ఐన = అయిన; నిన్ను = నిన్ను; ఆచార్యునిన్ = గురువు, పురోహితుడు; కాన్ = అగునట్లు; వరియించి = కోరి; భవదీయ = నీ యొక్క; తేజస్ = తేజస్సు యొక్క; విశేషంబు = విశిష్టత; చేత = వలన; వైరి = శత్రు; వీరులన్ = వీరులను; పరిమార్చెదము = సంహరించెదము; ఆత్మీయ = మా యొక్క; అర్థంబు = ప్రయోజనార్థము; ఐన = అయిన; యవిష్ణ = చిన్నవారి; పాద = పాదములకు చేయు; అభివందనంబు = నమస్కారము; నిందితంబు = నిందింపదగినది; కాదు = కాదు; అని = అని; వేద = వేదము లందలి; వాక్యంబు = సూక్తి; కలదు = ఉన్నది; కావున = కనుక; నీ = నీ; కు = కు; నమస్కరించుచున్న = నమస్కారము చేయుచున్న; దేవతలన్ = దేవతలను; కైకొని = స్వీకరించి; పౌరోహిత్యంబు = గురువుగా నుండుట; చేయుము = చేయుము; అనినన్ = అనగా; ప్రహసిత = చక్కగా నవ్వుతున్న వాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; ముని = మునులలో; ఈశ్వరుండు = భగవంతుని వంటి వాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడవైన నిన్ను మా గురువుగా స్వీకరించి, నీ తేజో విశేషంతో శత్రువీరులను సంహరిస్తాము. ఆత్మరక్షణ కోసం చిన్నవాని పాదాలకు వందనం చేయటం దోషం కాదని వేదాలు తెలుపుతున్నవి. కావున నీకు నమస్కరిస్తున్న దేవతలమైన మమ్మల్ని స్వీకరించి మాకు పౌరోహిత్యం చెయ్యవలసింది” అని దేవతలు చెప్పగా ఆ మునీశ్వరుడు నవ్వుతూ ఇలా అన్నాడు.

తెభా-6-288-తే.
"బ్రహ్మతేజంబు పోయెడి ప్రార్థనంబు
ర్మగుణ గర్హితం బని తా నెఱింగి
సొరిది ననుబోఁటి తపసి యీ సురలచేతఁ
బ్రకట మధురోక్తి నేఁటికిఁ లుకఁబడియె.

టీక:- బ్రహ్మతేజంబు = బ్రహ్మతేజస్సు; పోయెడి = నష్టపోయెడి; ప్రార్థనంబు = కోరికలను; ధర్మ = ధర్మబద్ధమైన; గుణ = గుణములచే; గర్హితంబు = తిరస్కరింపబడునది; అని = అని; తాన్ = తను; ఎఱింగి = తెలిసి; సొరిదిన్ = క్రమముగా; నను = నా; పోటి = వంటి; తపసి = తపస్వి; ఈ = ఈ; సురల = దేవతల; చేతన్ = చేత; ప్రకట = ప్రసిద్ధముగ; మధుర = తీయటి; ఉక్తిన్ = మాటలతో; ఏటికి = ఎందులకు; పలుకబడియె = పలుకబడెను.
భావము:- ధర్మవిరుద్ధమైన మీ ప్రార్థనను అంగీకరిస్తే నా బ్రహ్మతేజస్సు నశిస్తుంది. నావంటి తాపసిని మీవంటి పెద్దలు ఇంత తీయని మాటలతో పొగడటం ఎందుకు?

తెభా-6-289-వ.
విశేషించి
టీక:- విశేషించి = ప్రత్యేకించి.
భావము:- ప్రత్యేకించి...

తెభా-6-290-క.
గురుధనముఁ గూర్ప నేటికి
గురుశిక్షం దగిలి మంత్రకోవిదులై స
ద్గురుధర్మ నిరతు లేనిన్
గురువులకును శిష్యవరులె కూర్చిన ధనముల్.

టీక:- గురు = గురువులకు; ధనమున్ = సంపదలను; కూర్చన్ = సంపాదించుట; ఏటికి = ఎందులకు; గురు = గురువు యొక్క; శిక్షన్ = విద్యాభ్యాసము నందు; తగిలి = లగ్నమై; మంత్ర = మంత్రాంగము నందు; కోవిదులు = నిష్ణాతులు; ఐ = అయ్యి; సద్గురు = మంచి గురువుగా; ధర్మ = ధర్మబద్ధత యందు; నిరతులు = మిక్కిలి నేర్పరులు; ఏనిన్ = అయినను; గురువుల = గురువుల; కును = కు; శిష్య = శిష్యులలో; వరులె = ఉత్తములే; కూర్చిన = సంపాదించిన; ధనముల్ = సంపదలు.
భావము:- గురువుకు ప్రత్యేకంగా ధనాన్ని సమకూర్చడం ఎందుకు? గురుశిక్షణకు లోనై మంత్రకోవిదులై ధర్మనిరతులైన శిష్యులే గురువుకు అన్ని ధనాలు.

తెభా-6-291-సీ.
రయ నకించను లై నట్టివారికిఁ-
గు శిలోంఛనవృత్తి నము సుమ్ము;
దానిచే నిర్వర్తిప్రియసాధు స-
త్క్రియ గలవారలై ప్రీతినొందె
రు గాన సద్గర్హితాచారమైన యా-
చార్యత్వ మిపుడు మీ శాసనమునఁ
గైకొంటి; గురువుల కామంబు ప్రాణార్థ-
వంచనములు లేక డి నొనర్తు"

తెభా-6-291.1-ఆ.
నుచు విశ్వరూపుఁ నియెడు ముని ప్రతి
జ్ఞోక్తిఁ బలికె వారి నూఱడించి
హితమైన తత్సమాధిచే గురుభావ
మరఁ జేసె దేవమితి కపుడు.

టీక:- అరయ = తరచి చూసినచో; అకించనులు = నిరుపేదలు; ఐనట్టి = అయినటువంటి; వారి = వారి; కిన్ = కి; తగు = తగిన; శిల = దంచినచోట రాలిన గింజలేరి తినుట; ఉంఛన = పొలములలో రాలిపడెడి గింజలను ఏరుకొని తిని బ్రతికెడి; వృత్తి = వృత్తియే, జీవికయే; ధనము = సంపద; సుమ్ము = సుమా; దాని = దాని; చే = చేత; నిర్వర్తిత = నిర్వహించెడి; ప్రియ = ఇష్టపూర్తిగా; సాధు = సాధుత్వపు; సత్ = మంచి; క్రియ = కార్యములు; కలవారు = చేసెడివారు; ఐ = అయ్యి; ప్రీతిన్ = సంతోషమును; ఒందెదరు = పొందెదరు; కాన = కావున; సత్ = మంచివారిచేత; గర్హిత = నిందింపబడెడి; ఆచారము = వ్యవహారము; ఐన = అయిన; ఆచారత్వమున్ = గురుత్వమునకు; ఇపుడు = ఇప్పుడు; మీ = మీ యొక్క; శాసనమునన్ = ఆజ్ఞ ప్రకారము; కైకొంటిన్ = స్వీకరించితిని; గురువుల = గురువుల నుండి; కామంబు = ఆశింపదగినది; ప్రాణ = ప్రాణముల కైనను; అర్థ = ధనముల కైనను; వంచనములు = మోసములు చేయుట; లేక = లేకుండగ; వడిన్ = శ్రీఘ్రమే; ఒనర్తున్ = చేసెదను; అనుచు = అనుచూ;
విశ్వరూపుడు = విశ్వరూపుడు; అనియెడు = అనెడు; ముని = ముని; ప్రతిజ్ఞ = ప్రతిన; ఉక్తిన్ = చేసి; పలికె = చెప్పెను; వారిన్ = వారిని; ఊఱడించి = ఉపశమింపజేసి; మహితము = గొప్పది; ఐన = అయినట్టి; తత్ = అతని; సమాధి = యోగసమాధి; చే = చేత; గురుభావము = గురుత్వమును; అమరన్ = చక్కగా; చేసె = చేసెను; దేవ = దేవతల; సమితి = సమూహమున; కు = కు; అపుడు = అప్పుడు;
భావము:- ఏమీ లేని దరిద్రులకు కళ్ళంలో రాలిన గింజలను ఏరుకొని తినే జీవితమే ధనం. ఆ వృత్తితో జీవిస్తూ కూడా వారు సత్కార్యాలు చేస్తూ సంతుష్టిని పొందుతారు. అటువంటి సత్పురుషులు తిరస్కరించే గురుత్వాన్ని మీ కోరిక మేరకు స్వీకరిస్తున్నాను. స్వార్థం, వంచన లేకుండా మీ కోరిక నెరవేర్చి మీకు మేలు చేస్తాను” అని ఆ విశ్వరూప మునీంద్రుడు ప్రతిజ్ఞ చేసి వారికి ఓదార్చాడు. సమాధి నిష్ఠుడై దేవతల ఆచార్యత్వాన్ని అంగీకరించాడు.

తెభా-6-292-క.
భార్గవవిద్యా గుప్త
స్వర్గశ్రీ ద్విగుణ దనుజ మధిక సంప
ద్వర్గముల విష్ణుమాయా
ర్గళగతిఁ దెచ్చి యింద్రుకు నిచ్చె నృపా!

టీక:- భార్గవ = శుక్రుని {భార్గవుడు - భర్గుని యొక్క పుత్రుడు, శుక్రుడు}; విద్యా = విద్యవలన; గుప్త = కాపాడబడుతున్న; స్వర్గశ్రీ = స్వర్గసంపదలకు; ద్విగుణ = రెట్టింపుగల; దనుజ = రాక్షసులకంటెను; సమధిక = అత్యధికమైన; సంపద = సంపదలు; వర్గములన్ = సమూహములను; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; మాయ = మాయను; అనర్గళ = అడ్డులేని; గతిన్ = విధముగ; తెచ్చి = తీసుకు వచ్చి; ఇంద్రున్ = ఇంద్రుని; కు = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; నృపా = రాజా.
భావము:- రాజా! శుక్రాచార్యుల మంత్రప్రభావం వల్ల రాక్షసుల సంపదలు దేవతల కంటే రెండింతలైనాయి. అటువంటి రాక్షసుల ఐశ్వర్యానికి మించిన రాజ్యసందను విశ్వరూపుడు విష్ణుమాయ వలన దేవేంద్రునికి సాధించి పెట్టాడు.

తెభా-6-293-క.
విద్యచేత రక్షితుఁ
డై జ్రి దురంబులోన సురలఁ ద్రుంచెన్
భావింప నట్టి విద్యను
శ్రీరమాయామతంబుఁ జెప్పెను హరికిన్. "

టీక:- ఏ = ఏ; విద్య = విద్య; చేతన్ = వలన; రక్షితుడు = రక్షింపబడినవాడు; ఐ = అయ్యి; వజ్రి = ఇంద్రుడు {వజ్రి - వజ్రమ ఆయుధముగా గలవాడు, ఇంద్రుడు}; దురంబులోనన్ = యుద్ధములో; అసురులన్ = రాక్షసులను; త్రుంచెన్ = సంహరించెను; భావింపన్ = తలచుకొనగ; అట్టి = అటువంటి; విద్యన్ = విద్యను; శ్రీవర = విష్ణుమూర్తి యొక్క; మాయా = మాయయొక్క; మతంబున్ = విధానమును; చెప్పెను = చెప్పెను; హరి = ఇంద్రుని; కిన్ = కి.
భావము:- ఏ విద్యచేత ఇంద్రుడు సురక్షితంగా యుద్ధంలో రాక్షసులను ఓడించాడో అటువంటి విష్ణుమాయా తత్త్వం అయిన నారాయణ కవచం అనే విద్యను దేవేంద్రునికి చెప్పాడు”.

తెభా-6-294-ఉ.
నావుడు పాండవాన్వయుఁడు మ్మినభక్తి జగన్నివాసు రా
జీదళాక్షుఁ గృష్ణుఁ దన చిత్తమునన్ భజియించి పల్కె "నో
దేగణార్చితాంఘ్రియుగ! దివ్యమునీశ్వర! విశ్వరూపుఁడ
ప్పానమైన విద్య సురపాలున కే క్రియ నిచ్చెఁ? జెప్పవే.

టీక:- నావుడు = అనగా; పాండవ = పాండవ; అన్వయుడు = వంశస్థుడు; నమ్మిన = నమ్మకము గల; భక్తిన్ = భక్తితో; జగన్నివాసున్ = విష్ణుమూర్తిని; రాజీవదళాక్షున్ = విష్ణుమూర్తిని; కృష్ణున్ = విష్ణుమూర్తిని; తన = తన యొక్క; చిత్తమునన్ = మనసులో; భజియించి = నమస్కరించుకొని; పల్కెన్ = పలికెను; ఓ = ఓ; దేవ = దేవతల; గణ = గణములచే; అర్చిత = పూజింపబడెడి; అంఘ్రి = పాదముల; యుగ = ద్వయము గలవాడ; దివ్య = గొప్ప; ముని = మునులలో; ఈశ్వర = భగవంతుడ; విశ్వరూపుడు = విశ్వరూపుడు; ఆ = ఆ; పావనము = పవిత్రము; ఐన = అయిన; విద్య = విద్యను; సురపాలున్ = ఇంద్రుని {సురపాలుడు - సుర (దేవతలను) పాలుడు (పరిపాలించెడివాడు), ఇంద్రుడు}; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెనో; చెప్పవే = చెప్పుము.
భావము:- అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు సర్వాంతర్యామి, పద్మదళనేత్రుడు అయిన కృష్ణుని తన మనస్సులో స్మరించి ఇలా అన్నాడు “దేవతలు పూజించే పాదాలు కలిగిన ఓ మునీంద్రా! విశ్వరూపుడు ఆ పవిత్రమైన నారాయణ కవచాన్ని ఇంద్రునికి ఏ విధంగా ఇచ్చాడో వివరించు.

తెభా-6-295-ఉ.
ఎందును రక్షితుం డగుచు నింద్రుఁడు లీలయ పోలె వైరి సే
నం దునుమాడి దేవతలు మ్మి సుఖింపఁగ నిష్ఠసంపదం
జెంది సమస్తలోకముల జేకొని యేలె మునీంద్ర! దాని నే
విందు సుఖంబుఁ గందు నిఁక వీనులు సంతస మందఁ బల్కవే.

టీక:- ఎందునున్ = దేనివలన; రక్షితుడు = రక్షింపబడినవాడు; అగుచు = అగుచు; ఇంద్రుడు = ఇంద్రుడు; లీలయ = ఆటను; పోలె = వలె; వైరి = శత్రు; సేనన్ = సేనలను; తునుమాడి = సంహరించి; దేవతలు = దేవతలు; నమ్మి = నమ్మకముగా; సుఖింపగన్ = సుఖించుతుండగా; ఇష్ట = కోరిన; సంపదన్ = సంపదలను; చెంది = పొంది; సమస్త = అఖిలమైన; లోకములన్ = లోకములను; చేకొని = చేపట్టి; ఏలెన్ = పరిపాలించెనో; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివాడ; దానిన్ = దానిని; నేన్ = నేను; విందు = వినెదను; సుఖంబున్ = సుఖములను; కందున్ = చూసెదను; ఇంక = ఇకపైన; వీనులు = చెవులు; సంతసమున్ = సంతోషమును; అందన్ = పొందగా; పల్కవే = చెప్పుము.
భావము:- దేనివల్ల ఇంద్రుడు సురక్షితంగా అవలీలగా శత్రుసైన్యాన్ని నిర్జించి దేవతలు సుఖపడే విధంగా కోరిన సంపదలను పొంది సర్వలోకాలను స్వాధీనం చేసికొని పరిపాలించాడో ఆ విద్యా స్వరూపాన్ని వినగోరుతున్నాను. వీనుల విందుగా వినిపించు.”