పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/ధర్మజుడు భీష్ముని కడ కేగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-1-205-క. )[మార్చు]

ని యిట్లు ధర్మసూనుఁడు
మొ సి నిరాహారభావమున దేవనదీ
యుఁడు గూలిన చోటికిఁ
నియెఁ బ్రజాద్రోహ పాప లితాత్ముండై.

(తెభా-1-206-వ. )[మార్చు]

"అయ్యవసరంబునం దక్కిన పాండవులును ఫల్గున సహితుం డైన పద్మలోచనుండును గాంచన సమంచితంబు లయిన రథంబు లెక్కి ధర్మజుం గూడి చనిన నతండు గుహ్యక సహితుం డయిన కుబేరుని భంగి నొప్పె; నిట్లు పాండవులు పరిజనులు గొలువఁ బద్మనాభసహితులై కురుక్షేత్రంబున కేఁగి దివంబున నుండి నేలం గూలిన దేవతతెఱంగున సంగ్రామ రంగపతితుం డైన గంగానందనునకు నమస్కరించి; రంత బృహదశ్వ, భరద్వాజ, పరశురామ, పర్వత, నారద,బాదరాయణ, కశ్యపాంగిరస, కౌశిక, ధౌమ్య, సుదర్శన, శుక, వసిష్ఠాద్యనేక రాజర్షి, బ్రహ్మర్షులు, శిష్య సమేతులై చనుదెంచినం జూచి సంతసించి, దేశకాలవిభాగవేది యైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి.

(తెభా-1-207-క. )[మార్చు]

మా యాంగీకృతదేహుం
డై ఖిలేశ్వరుఁడు మనుజుఁ డైనాఁ డని ప్ర
జ్ఞా త్తచిత్తమున గాం
గే యుఁడు పూజనము సేసెఁ గృష్ణున్ జిష్ణున్.

(తెభా-1-208-వ. )[మార్చు]

మఱియు గంగానందనుండు వినయప్రేమ సుందరు లయిన పాండునందనులం గూర్చుండ నియోగించి మహానురాగ జనిత బాష్పసలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె.

(తెభా-1-209-ఆ. )[మార్చు]

"రణిసురులు, హరియు, ర్మంబు దిక్కుగా
బ్రదుకఁ దలఁచి మీరు హువిధముల
న్నలార! పడితి రాపత్పరంపర
లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదు?

(తెభా-1-210-ఉ. )[మార్చు]

సం స మింత లేదుమృగశాపవశంబునఁ బాండు భూవిభుం
డం ము నొందియుండ మిము ర్భకులం గొనివచ్చి కాంక్షతో
నిం లవారిఁగాఁ బెనిచె నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ
గొం తి యనేక దుఃఖములఁ గుందుచు నుండునుభాగ్య మెట్టిదో?

(తెభా-1-211-ఉ. )[మార్చు]

వా యువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బా యుచు నుండుకైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై
పా యుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదుకాల మన్నియుం
జే యుచుఁ నుండుఁ గాలము విచిత్రముదుస్తర మెట్టివారికిన్.

(తెభా-1-212-ఉ. )[మార్చు]

రా జఁట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవో
ద్వే కమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం
యో కుఁడైన చక్రియఁట, యుగ్రగదాధరుఁడైన భీముఁడ
య్యా జికిఁదోడు వచ్చునఁట, యాపద గల్గు టిదేమి చోద్యమో.

(తెభా-1-213-ఆ. )[మార్చు]

శ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని
కేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు
తనిమాయలకు మహాత్ములు విద్వాంసు
డఁగి మెలగుచుందు రంధు లగుచు.

(తెభా-1-214-వ. )[మార్చు]

కావున దైవతంత్రంబైన పనికి వగవం బని లేదు; రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు, తేజోనిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబుల మోహాతిరేకంబు నొందించు; నతని రహస్యప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుం డెఱుంగు; మఱియు దేవర్షి యగు నారదుండును భగవంతుం డగు కపిలమునియు నెఱుంగుదురు; మీరు కృష్ణుండు దేవకీపుత్త్రుం డగు మాతులేయుం డని తలంచి దూత సచివ సారథి బంధు మిత్ర ప్రయోజనంబుల నియమింతు; రిన్నిటం గొఱంత లేదు; రాగాదిశూన్యుండు నిరహంకారుండు నద్వయుండు సమదర్శనుండు సర్వాత్మకుండు నయిన యీశ్వరునకు నతోన్నతభావ మతివైషమ్యంబు లెక్కడివి లేవు; అయిన భక్తవత్సలుండు గావున నేకాంతభక్తులకు సులభుండై యుండు.

(తెభా-1-215-సీ. )[మార్చు]

తిభక్తి నెవ్వనియందుఁ జిత్తముఁ జేర్చి;
యెవ్వని నామ మూహించి పొగడి
కాయంబు విడచుచుఁ గామ కర్మాది ని;
ర్మూలనుండై యోగి ముక్తి నొందు
ట్టి సర్వేశ్వరుం ఖిలదేవోత్తంసుఁ;
డెవ్వేళఁ బ్రాణంబు లేను విడుతు
నందాఁక నిదె మహార్షుఁడై వికసిత;
దనారవిందుఁడై చ్చె నేఁడు

(తెభా-1-215.1-తే. )[మార్చు]

నాల్గుభుజములుఁ గమలాభ యనయుగము
నొప్పఁ గన్నుల ముంగట నున్నవాఁడు
మానవేశ్వర! నా భాగ్యహిమఁ జూడు
మేమి సేసితినో పుణ్య మితనిఁ గూర్చి."

(తెభా-1-216-వ. )[మార్చు]

అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుం డయిన కురుకుంజరుని వచనంబు లాకర్ణించి మును లందఱు వినుచుండ ధర్మనందనుడు మందాకినీనందనువలన నరజాతిసాధారణంబు లగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును రాగవైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి ధర్మంబులును, దానధర్మంబులును, రాజ ధర్మంబులును, స్త్రీ ధర్మంబులును, శమదమాదికంబులును, హరితోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థకామ మోక్షంబులును, నానావిధోపాఖ్యానేతిహాసంబులును, సంక్షేపవిస్తార రూపంబుల నెఱింగె; నంత రథిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణు లైన యోగీశ్వరులచేత వాంఛితంబగు నుత్తరాయణంబు సనుదెంచిన నది దనకు మరణోచితకాలం బని నిశ్చయించి.

(తెభా-1-217-శా. )[మార్చు]

లాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ
గ్జా లంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని
ర్మూ లీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీ లం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్ శ్రీహరిన్.

21-05-2016: :