పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/వైవస్వతమనువు జన్మంబు

వికీసోర్స్ నుండి

వైవస్వతమనువు జన్మంబు

తెభా-9-8-సీ.
భూమీశ! యమ్మహాపురుషుని నాభిమ-
ధ్యమున బంగారుఁ గెంమ్మి మొలిచె;
నా దమ్మిపూవులో టమీఁదఁ దనయంత,-
నాలుగు మోముల లువ పుట్టె;
నాబ్రహ్మమనమున ట మరీచి జనించెఁ-
శ్యపుం డతనికిఁ లిగెనంత,
నా కశ్యపునికి దక్షాత్మజ యదితికిఁ-
గొమరుఁడై చీఁకటి గొంగ పొడమె;

తెభా-9-8.1-తే.
లజ బంధుని పెండ్లాము సంజ్ఞ యందు
శ్రాద్ధదేవుండు మనువు సంజాతుఁ డయ్యె;
నువునకు శ్రద్ధ యనియెడి గువ యందుఁ
దురు గొడుకులు గలిగిరి ద్రయశులు
.
టీక:- భూమీశ = రాజా {భూమీశుడు - భూమికి ఈశుడు (ప్రభువు), రాజు}; ఆ = ఆ; మహాపురుషుని = గొప్పవాని; నాభి = బొడ్డు; మధ్యమున = మధ్యలో; బంగారు = బంగారపు; కెందమ్మి = ఎఱ్ఱటిపద్మము; మొలచెన్ = పుట్టెను; ఆ = ఆయొక్క; తమ్మిపూవు = పద్మము; లోనన్ = అందు; అటమీద = ఆపైన; తనయంత = తనంతటతనే, స్వయంభువుగా; నాలుగుమోములనలువ = చతుర్ముఖబ్రహ్మ {నాలుగుమోములనలువ - నాలుగు వ, చతుర్ముఖ బ్రహ్మ}; పుట్టెన్ = జన్మించెను; ఆ = ఆయొక్క; బ్రహ్మ = బ్రహ్మదేవుని; మనమున్ = మనసునందు; అట = అక్కడ; మరీచి = మరీచి; జనించెన్ = పుట్టెను; కశ్యపుండు = కశ్యపుడు; అతని = వాని; కిన్ = కి; కలిగెన్ = పుట్టను; అంతన్ = అంతట; ఆ = ఆ; కశ్యపున్ = కశ్యపుడి; కిన్ = కి; దక్ష = దక్షునియొక్క; ఆత్మజ = కుమార్తె {ఆత్మజ - తనకు పుట్టినది, కూతురు}; అదితి = అదితి; కిన్ = కి; కొమరుడు = పుత్రుడు; ఐ = అయ్యి; చీకటిగొంగ = సూర్యుడు {చీకటిగొంగ - చీకటికి గొంగ (శత్రువు), సూర్యుడు}; పొడమె = పుట్టెను.
జలజబంధుని = సూర్యుని, వివస్వంతుని {జలజబంధుడు - జలజము (పద్మము)నకు బంధుడు, సూర్యుడు}; పెండ్లాము = భార్య; సంజ్ఞ = సంధ్యాదేవి; అందు = అందు; శ్రాద్దదేవుండు = వైవత్సుడు యనెడి; మనువు = మనువు; సంజాతుండు = పుట్టినవాడు; అయ్యెన్ = అయ్యెను; మనువున్ = ఆ మనువున; కున్ = కు; శ్రద్ధ = శ్రద్ధ; అనియెడి = అనెడి; మగువ = భార్య; అందున్ = అందు; పదురు = పదిమంది; కొడుకులు = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; భద్ర = పవిత్రమైన; యశులు = కీర్తిగలవారు.
భావము:- రాజా! ఆ మహాత్ముని బొడ్డునందు ఎఱ్ఱటి బంగారపు పద్మము పుట్టింది. ఆ పద్మము పైన తనంతటతనే స్వయంభువుగా చతుర్ముఖబ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుని మనసు నందు మరీచి పుట్టాడు. కశ్యపుడు వానికి పుట్టాడు. ఆ కశ్యపుడికి, దక్షుని కుమార్తె అదితి అందు సూర్యుడు పుట్టాడు. సూర్యునికి భార్య సంధ్యాదేవి అందు శ్రాద్ధదేవుడు అనుపేరు గల వైవస్వత మనువు పుట్టాడు. ఆ మనువునకు భార్య శ్రద్ధ యందు పదిమంది పుత్రులు పుట్టారు.

తెభా-9-9-వ.
వార లిక్ష్వాకుండును, నృగుండును, శర్యాతియు, దిష్టుండును, ధృష్టుండును, గరూశకుండును, నరిష్యంతుడును, బృషద్ధ్రుండును, నభగుండును, గవియు నన నెగడి; రటమున్ను మనువు గొడుకులు లేని వాఁడయి, మిత్రావరుణుల నుద్దేశించి .
టీక:- వారలున్ = వారు; ఇక్వాకుండును = ఇక్ష్వాకుడు; నృగుండును = నృగుడు; శర్యాతియున్ = శర్యాతి; దిష్టుండును = దిష్టుడు; ధృష్టుండును = ధృష్టుడు; కరూశకుండును = కరూశకుడును; నరిష్యంతుడును = నరిష్యంతుడు; పృషద్ధ్రుండు = పృషద్ధ్రుడు; నభగుండు = నభగుడు; కవియున్ = కవి; అనన్ = అనుపేరుగలిగి; నెగడిరి = వర్ధిల్లరి; అటమున్న = అంతకుముందు; మనువు = ఆ మనువు; కొడుకులు = పుత్రులు; లేని = కలుగని; వాడు = వాడు; అయి = అయ్యి; మిత్రావరుణులన్ = ఆదిత్యులను {ద్వాదశాదిత్యులు - 1ఇంద్రుడు 2ధాత 3పర్జన్యుడు 4త్వష్ట 5 పూషుడు 6అర్యముడు 7భగుడు 8వివస్వంతుడు 9విష్ణువు 10 అంశుమంతుడు 11వరుణుడు 12మిత్రుడు}; ఉద్దేశించి = గురించి.
భావము:- వారు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడును, నరిష్యంతుడు, పృషద్రధుడు, నభగుడు, కవి. అంతకు ముందు ఆ మనువు పుత్రులు కలుగలేదని ఆదిత్యులను గురించి యాగం తలపెట్టాడు....