Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/రైవతుని వృత్తాంతము

వికీసోర్స్ నుండి

రైవతుని వృత్తాంతము

తెభా-9-70-సీ.
నర్తునకు రైవతాహ్వయుం డుదయించె-
తఁడు కుశస్థలి ను పురంబు
నీరధిలోపల నిర్మించి; పెంపుతో-
నానర్తముఖ విషయంబులేలె;
నియెఁ గకుద్మి ముఖ్యంబైన నందన-
తము; రైవతుఁడు విశాలయశుడు,
న కూఁతు రేవతి ధాత ముందటఁ బెట్టి-
గు వరు నడిగెడి లఁపుతోడఁ

తెభా-9-70.1-తే.
న్యఁ దోడ్కొని బ్రహ్మలోమున కేగి
చట గంధర్వ కిన్నరు జుని మ్రోల
నాటపాటలు సలుపఁగ, వసరంబు
గాక నిలుచుండె, నతఁ డొక్క క్షణము తడవు.

టీక:- ఆనర్తున్ = ఆనర్తుని; కున్ = కి; రైవత = రైవతుడు యనెడి; ఆహ్వయుండు = పేరుగలవాడు; ఉదయించెన్ = పుట్టెను; అతడు = అతను; కుశస్థలి = కుశస్థలి; అను = అనెడి; పురంబున్ = నగరమును; నీరధి = సముద్రము; లోపల = అందు; నిర్మించి = నిర్మాణముచేసి; పెంపు = అతిశయము; తోన్ = తోటి; ఆనర్త = ఆనర్తము; ముఖ = మున్నగు; విషయంబులున్ = దేశములను; ఏలెన్ = పరిపాలించెను; కనియెన్ = పొందెను; కకుద్మి = కకుద్మి; ముఖ్యంబు = మొదలగువారు; ఐన = అయిన; నందన = పుత్రులను; శతమున్ = నూరుమందిని; రైవతుడు = రైవతుడు; విశాల = గొప్ప; యశుడు = కీర్తిమంతుడు; కూతున్ = కూతురును; రేవతిన్ = రేవతిని; ధాత = బ్రహ్మదేవుని; ముందటన్ = ఎదురుగా; పెట్టి = నిలబెట్టి; తగు = తగినట్టి; వరున్ = పెండ్లికొడుకును; అడిగెడి = అడుగుదామనెడి; తలపు = భావము; తోడన్ = తోటి; కన్యన్ = అవివాహితను; తోడ్కొని = కూడాతీసుకెళ్ళి.
బ్రహ్మలోకమున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; ఏగి = వెళ్ళి; అచటన్ = అక్కడ; గంధర్వ = గంధర్వులను; కిన్నరుల్ = కిన్నరులు; అజుని = బ్రహ్మదేవుని; మ్రోలన్ = ముందు; ఆట = నృత్య; పాటలన్ = సంగీతములను; సలుపగన్ = చేయుచుండెడి; అవసరంబు = చూడ అవకాశము; కాక = కుదరక; నిలుచుండెన్ = ఆగెను; అతడు = అతడు; ఒక్క = ఒక; క్షణము = కొద్ది; తడవు = కాలము.
భావము:- ఆనర్తునికి రైవతుడు పుట్టాడు. అతను కుశస్థలి అనె నగరం సముద్రంలో నిర్మించి, ఆనర్తము మున్నగు దేశములను పరిపాలించాడు. రైవతుడికి కకుద్మి మొదలగు పుత్రులు నూరుమంది, రేవతి అని కూతురుపుట్టారు. ఆ రేవతికి తగిన వరుడు ఎవరో చెప్పమని బ్రహ్మదేవుడిని అడుగుదామని ఆ కన్యకతో బ్రహ్మలోకం వెళ్ళాడు. అప్పుడు అక్కడ బ్రహ్మదేవుని ముందు గంధర్వులు కిన్నరులు నృత్య సంగీతాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. అవకాశం కుదరక ఆయన కొద్ది సమయం ఆగాడు.

తెభా-9-71-వ.
అంత నవసరంబయిన నజునికి నమస్కరించి, రైవతుండు రేవతిం జూపి యిట్లనియె.
టీక:- అంతన్ = అప్పుడు; అవసరంబు = అవకాశము; అయినన్ = కుదరగా; అజున్ = బ్రహ్మదేవుని; కిన్ = కి; నమస్కరించి = మొక్కి; రైవతుండు = రైవతుడు; రేవతిన్ = రేవతిని; చూపి = చూపించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- పిమ్మట అవకాశం చూసుకుని బ్రహ్మదేవునికి మొక్కి రైవతుడు రేవతిని చూపించి ఈ విధముగ పలికాడు.

తెభా-9-72-ఆ.
"చాల ముద్దరాలు, వరాలుఁ గొమరాలు
నీ శుభాత్మురాలి కెవ్వఁ డొక్కొ
గఁడు? చెప్పు" మనిన ది చూచి పకపక
వ్వి భూమిపతికి లువ పలికె.

టీక:- చాల = మిక్కిలి; ముద్దరాలున్ = ముగ్ధ, అమాయకురాలు; జవరాలున్ = యౌవ్వనవతి; కొమరాలున్ = సౌందర్యవతి {కొమరాలు - కొమరు (మనోజ్ఞత) రాలు (కలామె), సుందరి}; ఈ = ఈ; శుభాత్మురాలి = మంచిమనసుగలామె; కిన్ = కు; ఎవ్వడున్ = ఎవరైనా; ఒక్క = ఒక; మగడు = భర్తను; చెప్పుము = తెలుపుము; అనిన్ = అనగా; అది = దానిని; చూచి = చూసి; పకపక = పకపకమని; నవ్వి = నవ్వి; భూమిపతి = రాజున {భూమిపతి - భూమి(రాజ్యాని)కిపతి, రాజు}; కిన్ = కు; నలువ = బ్రహ్మదేవుడు {నలువ - నలు(చతుర్) వ(ముఖుడు), బ్రహ్మ}; పలికె = చెప్పెను.
భావము:- “ముగ్ధ, అమాయకురాలు, యౌవ్వనవతి, సౌందర్యవతి, మంచిమనసుగల ఈ నా కూతురుకు తగిన భర్తను తెలుపుము.” అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు పకపకమని నవ్వి రాజుతో ఇలా చెప్పాడు.

తెభా-9-73-సీ.
"నుజేశ! దీనికై దిలోనఁ దలఁచిన-
వార లెల్లను గాలశతఁ జనిరి;
వారల బిడ్డల, వారల మనుమల-
వారల గోత్రంబు వారినైన
వినము మేదిని మీఁద; వినుము, నీ వచ్చిన-
యీలోన నిరువదియేడు మాఱు
లొండొండ నాలుగు యుగములుఁ జనియె; నీ-
టు గాన ధరణికి రుగు; మిపుడు

తెభా-9-73.1-తే.
దేవదేవుండు హరి, బలదేవుఁ డనఁగ
భూమి భారంబు మాన్పంగఁ బుట్టినాఁడు;
కలభూతాత్మకుఁడు నిజాంశంబుతోడ
యువతిమణి నిమ్ము జనమణి కున్నతాత్మ!"

టీక:- మనుజేశ = రాజ; దీని = ఈమె; కై = కోసము; మది = మనసు; లోనన్ = అందు; తలచిన = భావించిన; వారలు = వారు; ఎల్లన్ = అందరును; కాలవశతన్ = చచ్చి {కాలవశత - కాలమునకు లొంగుట, చావు}; చనిరి = పోయిరి; వారల = వారియొక్క; బిడ్డలన్ = పిల్లలను; వారల = వారియొక్క; మనునలన్ = పిల్లలపిల్లలను; వారల = వారియొక్క; గోత్రంబు = వంశపు; వారిన్ = వారిని; ఐనన్ = అయినప్పటికిని; వినము = ఎవరుచెప్పలేరు; మేదిని = భూమి; మీదన్ = పైన; వినుము = తెలుసుకొనుము; నీవు = నీవు; వచ్చిన = ఇక్కడకొచ్చిన; ఈ = ఈకొద్దికాలము; లోనన్ = అందే; ఇఱువదియేడు = ఇరవైయేడు (27); మాఱులు = ఆవృత్తులు; ఒక్కొక్కటి = ఒక్కోటి; నాలుగు = నాలుగు (4); యుగములున్ = యుగములుచొప్పున; చనియెన్ = గడిచిపోయినవి; నీవు = నీవు; అటుగాన = అందుచేత; ధరణి = భూలోకమున; కిన్ = కు; అరుగుము = వెళ్ళు; ఇపుడు = ఇప్పుడు.
దేవదేవుండు = నారాయణుడు {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; హరి = నారాయణుడు; బలదేవుడు = బలదేవుడు; అనగన్ = అనిపేరుగలవానిగా; భూమి = భూమాతకు; భారంబున్ = భారమును; మాన్పంగన్ = పోగొట్టుటకు; పుట్టినాడు = జన్మించెను; సకల = సమస్తమైన; భూత = జీవులలోను; ఆత్మకుడు = ఉండెడివాడు; నిజ = తన స్వంత; అంశంబు = అంశ; తోడన్ = తోటి; యువతి = స్త్రీ; మణిన్ = రత్నమువంటామెను; ఇమ్ము = భార్యగా ఇయ్యి; జనమణి = పురుషోత్తముని; కిన్ = కి; ఉన్నత = గొప్ప; ఆత్మ = మనసుకలవాడా.
భావము:- “ఓ రాజ! ఈమె కోసం నువ్వు అనుకున్న వారు అందరు చచ్చిపోయిరి. వారి పిల్లలు, వారిపిల్లల పిల్లలు, వారి వంశపు వారిని ఎవరినీ భూలోకంలో ఇప్పుడు ఎవరు చెప్పలేరు. తెలుసుకొనుము. నీవు ఇక్కడకు వచ్చిన ఈ కొద్ది సమయంలో ఇరవైయేడు (27) ఆవృత్తులు ఒక్కోటి నాలుగు యుగాలు చొప్పున గడిచిపోయాయి. అందుచేత, నీవు భూలోకానికి వెళ్ళు. ఇప్పుడు నారాయణుడు తన అంశతో బలదేవుడు అనే పేరుతో భూభారం తొలగించుటకు జన్మించాడు. ఈ స్త్రీరత్నాన్ని ఆయనకు భార్యగా ఇయ్యి.”

తెభా-9-74-వ.
అని యానతిచ్చిన బ్రహ్మకు నమస్కరించి, భూలోమునకుఁ జనుదెంచి, సోదర స్వజన హీనంబగు తన నగరంబున కా రాజు వచ్చి, బలభద్రుం గాంచి, రేవతీకన్య నతని కిచ్చి, నారాయణాశ్రమంబగు బదరికావనంబునకు నియమంబునఁ దపంబు జేయం జనియె.
టీక:- అని = అని; ఆనతిచ్చినన్ = చెప్పిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; నమస్కరించి = మొక్కి; భూలోకమున్ = బూలోకమున; కున్ = కు; చనుదెంచి = వచ్చి; సోదర = తోటివారు; స్వజన = తనవారు; హీనంబు = లేనట్టిది; అగు = ఐన; తన = తనయొక్క; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; ఆ = ఆ; రాజు = క్షత్రియుడు; వచ్చి = చేరి; బలభద్రునిన్ = బలరాముని; కాంచి = చూసి; రేవతీ = రేవతి యనెడి; కన్యన్ = అవివాహితను; అతను = అతని; కిన్ = కి; ఇచ్చి = భార్యగా ఇచ్చి; నారాయణ = నారాయణునికి; ఆశ్రమంబు = నివాసమైనట్టిది; అగు = ఐన; బదరికావనంబున్ = బదరికావనమున; కున్ = కు; నియమంబునన్ = నిష్ఠగా; తపంబున్ = తపస్సు; చేయన్ = చేయుటకు; చనియె = వెళ్ళెను.
భావము:- అలా చెప్పిన బ్రహ్మదేవునికి మొక్కి, భూలోకానికి వచ్చి తనవారు ఎవరు లేని తన పట్టణం చేరి, బలరామునికి రేవతిని భార్యగా ఇచ్చి, బదరికావనానికి తపస్సు చేసుకొనుటకు వెళ్ళాడు.