Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/రంతిదేవుని చరిత్రము

వికీసోర్స్ నుండి

రంతిదేవుని చరిత్రము

తెభా-9-642-సీ.
రాజవంశోత్తమ! రంతిదేవుని కీర్తి-
యేల చెప్పఁగ? విను మిందు నందు
నా రాజు దన సంచితార్థంబు లన్నియు-
నెడపక దీనుల కిచ్చియిచ్చి
కుటుంబుఁడై ధైర్యసంయుతుండై పేద-
యై కూడు నీరులే ధమవృత్తి
నెందేని నలువదియెనిమిది దివసముల్-
రియింప నొకదివసంబు రేపు

తెభా-9-642.1-ఆ.
నెయ్యి పాయసంబు నీరును గలిగిన
హుకుటుంబభారయముతోడ
లసి నీరుపట్టు నాకలియును మిక్కి
లొదవఁ జూచి కుడువ నుత్సహించె.

టీక:- రాజవంశ = క్షత్రియులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; రంతిదేవుని = రంతిదేవుని; కీర్తి = యశస్సు; ఏల = ఏమి; చెప్పగన్ = చెప్పగలము; వినుము = వినుము; ఇందున్ = ఇహలోకముల; అందున్ = పరలోకమున; ఆ = ఆ; రాజు = రాజు; తన = తను; సంచిత = కూడబెట్టిన; అర్థంబులు = సంపదలు; అన్నియున్ = సమస్తము; ఎడపక = వదలకుండ; దీనుల్ = బీదల; కున్ = కు; యిచ్చి = దానముచేసి; సకుటుంబుడు = పెళ్ళంపిల్లలతో నున్నవాడు; ఐ = అయ్యి; ధైర్య = ధైర్యము; సంయుతుండు = తోకూడినవాడు; ఐ = అయ్యి; పేద = పేదవాడు; ఐ = అయ్యి; కూడు = తినుటకు తిండి; నీరు = తాగుటకు నీరు; లేక = లేకపోవుటచేత; అధమవృత్తిన్ = భిక్షాటనచే; ఎందేని = ఎక్కడైనా; నలువదియెనిమిది = నలభైఎనిమిది (48); దివసముల్ = రోజులు; చరియింపన్ = గడపగా; ఒక = ఒకానొక; దివసంబు = రోజు; రేపు = ఉదయమున.
నెయ్యి = నెయ్యి; పాయసంబున్ = పరవాన్నము; నీరునున్ = మంచునీరు; కలిగినన్ = లభించగ; బహు = పెద్ద; కుటుంబ = సంసారము; భార = భారమువలని; భయమున్ = భయము; తోడన్ = తోటి; అలసి = అలసిపోయి; నీరుపట్టున్ = దాహము; ఆకలియును = ఆకలి; మిక్కిలి = అధికముగ; ఒదవన్ = కలుగగా; చూచి = కనుగొని; కుడువన్ = తినుటకు; ఉత్సహించె = సిద్ధపడెను.
భావము:- క్షత్రియశ్రేష్ఠుడా! పరీక్షిత్తూ! ఆ సంకృతి కొడుకు రంతిదేవుని యశస్సు ఏమి చెప్పగలం? విను. ఇహపరలోకాలలో ఆ రాజు తను కూడబెట్టిన సంపదలు సమస్తం ఎడతెగకుండా బీదలకు దానం చేసేసాడు. కడు పేదవాడై పెళ్ళం పిల్లలతో అన్నం నీళ్ళుదొరకక భిక్షాటనచేస్తూ నలభైఎనిమిది దినాలుగా గడపుతున్నా ధైర్యం కోల్పోలేదు. ఒకనాడు ఉదయం కొంత నెయ్యి, పరవాన్నం, మంచినీరు లభించాయి. పెద్ద సంసారభారంతో అలసి, ఆకలి దాహాలతో బాధపడుతూ, దొరికినవి తినడానికి సిద్ధపడుతున్నాడు.

తెభా-9-643-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు .
భావము:- అలా కుటుంబం అందరూ ఆకలితో అల్లాడుతున్న ఆ సమయంలో.

తెభా-9-644-సీ.
తిథి భూసురుఁ డొక్కఁ డాహార మడిగినఁ-
డపక ప్రియముతో గారవించి
రిసమర్పణ మంచు న్నంబులో సగ-
మిచ్చిన భుజియించి యేఁగె నాతఁ;
డంతలో నొక శూద్రుఁ శనార్థి యై వచ్చి-
పొడసూప లేదనఁ బోక తనకు
నున్న యన్నములోన నొక భాగమిచ్చిన-
సంతుష్టుఁడై వాఁడు నిన వెనుక

తెభా-9-644.1-ఆ.
కుక్కగమియుఁ దాను నొక్కఁ డేతేర నా
న్న శేష మిచ్చి న్నయంబు
లాడి మ్రొక్కి పంప నోక చండాలుఁ
డొక్క డరుగుదెంచి క్క నిలిచి.


 9-644/1-వ. 
రాజున కి ట్లనియె.

- తంజనగరము తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి



టీక:- అతిథి = అతిథి; భూసురుడు = విప్రుడు; ఒక్కడు = ఒకానొకడు; ఆహారమున్ = అన్నము; అడిగినన్ = అర్థించగా; కడపక = ఇయ్యను అనకుండ; ప్రియము = ప్రీతి; తోన్ = తోటి; గారవించి = ఆదరించి; హరి = నారాయణునికి; సమర్పణము = సమర్పించుతున్నాను; అంచున్ = అనుచు; అన్నంబు = అన్నములో; సగము = అర్థభాగము; ఇచ్చినన్ = పెట్టగా; భుజియించి = తిని; ఏగెన్ = వెళ్ళిపోయెను; ఆతడు = అతడు; అంతలో = ఈలోగా; ఒక = ఒకానొక; శూద్రుడు = నాలవజాతివాడు; అశన = ఆహారమును; అర్థి = అర్థించువాడు; ఐ = అయ్యి; వచ్చి = దగ్గరకువచ్చి; పొడసూపన్ = కనబడగా; లేదు = లేదు; అనబోక = అనకుండగ; తన = తన; కున్ = కు; ఉన్న = ఉన్నట్టి; అన్నము = అన్నము; లోన్ = అందు; ఒక = ఒక; భాగము = పాలు; ఇచ్చినన్ = ఇవ్వగా; సంతుష్టుడు = తృప్తిచెందినవాడు; ఐ = అయ్యి; వాడు = అతను; చనినన్ = వెళ్ళిపోగా; వెనుకన్ = వెంటనే.
కుక్క = కుక్కల; గమియున్ = గుంపు; తానున్ = తను; ఒక్కడు = ఒకానొకడు; ఏతేరన్ = రాగా; ఆ = ఆ; అన్న = అన్నములోని; శేషము = మిగిలినది; ఇచ్చి = ఇచ్చి; సత్ = సత్యమైన; నయంబులున్ = మంచి మాటలు; ఆడి = పలికి; మ్రొక్కి = నమస్కరించి; పంపన్ = పంపించగా; ఓడక = వెనుదీయక; చండాలుడు = పంచముడు; ఒక్కడు = ఒకానొకడు; అరుగుదెంచి = వచ్చి; చక్కన్ = చక్కగ; నిలిచి = నిలబడి.
భావము:- ఒక విప్రుడు అతిథిగా వచ్చి అన్నం అర్థించగా కాదనకుండా ప్రీతిగా ఆదరించి, కృష్ణార్పణం అంటూ అన్నంలో సగభాగం పెట్టాడు. అతను తిని వెళ్ళగానే, ఒక శూద్రుడు ఆకలి అంటూ వచ్చాడు. లేదు అనకుండా తనకు ఉన్న అన్నంలో ఒక పాలు ఇచ్చాడు. అతను వెళ్ళిపోగానే, ఒకడు కుక్కల గుంపుతో రాగా ఆ అన్నంలో మిగిలింది ఇచ్చి చక్కటి మంచిమాటలు పలికి నమస్కరించి పంపించాడు. ఇంతటితో ఆగక ఒక పంచముడు వచ్చి నిలబడి....

తెభా-9-645-క.
"హీనుఁడఁ జండాలుండను
మావకులనాథ! దప్పి మానదు; నవలం
బోనేర; నీకుఁ జిక్కిన
పానీయము నాకుఁ బోసి బ్రతికింపఁగదే."

టీక:- హీనుడన్ = హీనుడను; చండాలుండను = పంచముడను; మానవకులనాథ = రాజా; దప్పి = దాహము; మానదు = తీరుటలేదు; అవలన్ = అవతలకు; పోనేరన్ = వెళ్ళలేకున్నాను; నీ = నీ; కున్ = కు; చిక్కిని = దొరకిన; పానీయము = నీరు; నా = నా; కున్ = కు; పోసి = ఇచ్చి; బ్రతికింపగదే = నా ప్రాణములు నిలబెట్టు.
భావము:- “రాజా! దిక్కుమాలినవాడిని, పంచముడిని, దాహంతో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నీ దగ్గర ఉన్న నీళ్ళు నాకు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టు.”

తెభా-9-646-వ.
అనిన వాని దీనాలాపంబులకుఁ గరుణించి రా జిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; వానిన్ = అతని యొక్క; దీనాలాపముల్ = జాలిమాటల; కున్ = కు; కరుణించి = దయతలచి; రాజు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- అలా జాలిగా అర్థిస్తున్న అతనిపై దయతలచి రాజు ఇలా అన్నాడు.

తెభా-9-647-ఉ.
"న్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రా
న్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్
గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కఁడ చుమ్ము పుల్కసా!"

టీక:- అన్నము = అన్నము; లేదు = లేదు; కొన్ని = కొద్దిగా; మధురాంబువులున్ = మంచినీళ్ళు; ఉన్నవి = ఉన్నాయి; త్రావుము = తాగుము; అన్న = నాయనా; రావు = రా; అన్న = నాయనా; శరీరధారుల్ = జీవుల; కున్ = కు; ఆపద = కష్టము; వచ్చినన్ = కలిగినచో; వారి = వారి యొక్క; ఆపదల్ = కష్టములను; క్రన్ననన్ = వెంటనే; మాన్చి = పోగొట్టి; వారి = వారల; కిన్ = కు; సుఖంబులు = సౌఖ్యములు; చేయుట = చేయుట; కన్నన్ = కంటెను; ఒండు = మరియొక; మేలు = ఉత్తమమైనది; ఉన్నదె = ఉన్నదా, లేదు; నా = నా; కున్ = కు; దిక్కు = అండ; పురుషోత్తముడు = విష్ణువు; ఒక్కడ = మాత్రమే; చుమ్ము = సుమా; పుల్కసా = చండాలుడా.
భావము:- “ఓ యన్నా! అన్నం అయితే లేదు కాని కొద్దిగా మంచినీళ్ళు ఉన్నాయి. తాగు నాయనా! రా నాయనా! తోటి మానవుడికి కష్టం వచ్చినప్పుడు, వాని కష్టాలను వెంటనే పోగొట్టి ఆదుకోవడం కంటె ఉత్తమమైన పని లేదు కద. నాకు అండ దండ శ్రీమహావిష్ణువు మాత్రమే సుమా”

తెభా-9-648-వ.
అని పలికి
టీక:- అని = అని; పలికి = చెప్పి .
భావము:- అని చెప్పి.

తెభా-9-649-మ.
"వంతంబగు నీరుపట్టున నిజప్రాణాంతమై యున్నచో
యం డేమియు; వీని హృజ్వరము నాయాసంబు ఖేదంబు నా
దానంబున నేఁడు మాను" ననుచున్ ర్వేశ్వరాధీనుఁడై
ముం బోసెను రంతిదేవుఁడు దయం జండాలపాత్రంబునన్.

టీక:- బలవంతుంబు = తట్టుకోరానిది; అగు = అయినట్టి; నీరుపట్టునన్ = దాహమువలన; నిజ = తన; ప్రాణ = పాణములు; అంతము = కడముట్టుతున్నవి; ఐ = అయ్యి; ఉన్నచోన్ = ఉండగా; అలయండు = లెక్కజేయడు; ఏమియున్ = ఏమాత్రము; వీనిన్ = ఇతని; హృ = హృదయము నందలి; జ్వరమున్ = బాధ; ఆయాసంబున్ = అలసట; ఖేదంబున్ = చీకాకులు; నా = నా యొక్క; జలదానంబునన్ = జలదానమువలన; నేడు = ఇవాళ; మానున్ = తొలగిపోవును; అనుచున్ = అనుచు; సర్వేశ్వర = భగవంతునికి; అధీనుండు = అంకితమైనవాడు; ఐ = అయ్యి; జలమున్ = నీటిని; పోసెన్ = పోసెను; రంతిదేవుడు = రంతిదేవుడు; దయన్ = కరుణతో; చండాల = చండాలుని; పాత్రంబునన్ = గిన్నెలో.
భావము:- తట్టుకోరాని దాహంతో తన పాణాలు కడగడుతున్నా లెక్కజేయక, “ఇతని హృదయ బాధలు, చీకాకులు అన్నీ ఈ జలదానంతో తీరిపోవు గాక.” అంటూ, రంతిదేవుడు మిక్కిలి దయతో భగవదర్పణంగా చండాలుని గిన్నెలో నీటిని పోసాడు.

తెభా-9-650-వ.
తదనంతరంబ; బ్రహ్మాది దేవతలు సంతోషించి, రంతిదేవునికి మేలుచేయం దలఁచి, నిజాకారంబులతో ముందట నిలువంబడి యా రాజు ధైర్యపరీక్షార్థంబు దమ చేసిన వృషలాది రూపంబులగు విష్ణుమాయ నెఱింగించిన, నా నరేంద్రుం డందఱకు నమస్కరించి.
టీక:- తదనంతరంబ = ఆ తరువాత; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగు; దేవతలు = దేవతలు; సంతోషించి = సంతోషముచెంది; రంతిదేవుని = రంతిదేవుని; కిన్ = కి; మేలు = ఉపకారము; చేయన్ = చేయవలెనని; తలచి = భావించి; నిజ = తమ; ఆకారంబుల్ = స్వరూపముల; తోన్ = తోటి; ముందటన్ = ఎదురుగ; నిలువంబడి = నిలబడి; ఆ = ఆ; రాజ = రాజు యొక్క; ధైర్య = ధైర్యమును; పరీక్షా = పరీక్షించెడి; అర్థంబునన్ = కోసము; తమ = వారు; చేసిన = చేసినట్టి; వృషల = శూద్రుడు; ఆది = మొదలైన; రూపంబులు = వేషములు; అగు = అయినట్టి; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; మాయన్ = మాయను; ఎఱింగించినన్ = తెలుపగా; ఆ = ఆ; నరేంద్రుండు = రాజు; అందఱు = అందరి; కున్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి.
భావము:- అంతట, బ్రహ్మదేవాది దేవతలు సంతోషించి, రంతిదేవునికి మేలు చేయాలి అనుకుని, నిజ స్వరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. ఆ రాజు ధైర్యాన్ని పరీక్షించడం కోసం ఈ రూపాలు అన్నీ మేం కల్పించాం అని చెప్పారు. ఇదంతా విష్ణు మాయ అని తెలిపారు. ఆ రంతిదేవమహారాజు అందరికి నమస్కరించాడు.

తెభా-9-651-క.
వాల నేమియు నడుగక
నారాయణభక్తి దన మనంబున వెలుఁగన్
ధీరుం డాతఁడు మాయా
పాజ్ఞుం డగుచు బరమదముం బొందెన్.

టీక:- వారలన్ = వారిని; ఏమియున్ = ఏమి; అడుగక = అడగకుండ; నారాయణభక్తిన్ = విష్ణుభక్తిని; తన = అతని యొక్క; మనంబునన్ = మనసు నందు; వెలుగన్ = ప్రకాశించుతుండగ; ధీరుండు = ధీరుడు; ఆతడు = అతను; మాయా = మాయ ప్రభావమును; అపారజ్ఞండు = బాగా నెరిగినవాడు; అగుచున్ = అగుచు; పరమపదమును = మోక్షమును; పొందెన్ = పొందెను;
భావము:- ధీరుడైన ఆ రంతిదేవుడు వారిని ఏ వరాలు యాచించ లేదు. విష్ణుభక్తిని మనసులో ప్రకాశిస్తుండగా మాయాప్రభావం గ్రహించినవాడై మోక్షాన్ని పొందాడు.

తెభా-9-652-క.
రాజర్షిని గొలిచిన
వారెల్లఁ దదీయ యోగవైభవమున శ్రీ
నారాయణ చింతనులై
చేరిరి యోగీశులగుచు సిద్దపదంబున్.

టీక:- ఆ = ఆ; రాజర్షినిన్ = రాజులలో ఋషి యైనవాని; కొలిచిన = సేవించిన; వారు = వారు; ఎల్ల = అందరు; తదీయ = అతని; యోగ = యోగ; వైభవమునన్ = మహిమవలన; శ్రీనారాయణ = శ్రీమన్నారాయణ; చింతనులు = చింతన గలవారు; ఐ = అయ్యి; చేరిరి = చేరుకొంటిరి; యోగి = యోగులల్; ఈశులు = శ్రేష్ఠులు; అగుచున్ = అగుచు; సిద్దపదంబున్ = సిద్దలోకమును.
భావము:- ఆ రాజర్షి రంతిదేవుని సేవించిన వారు అందరు. అతని యోగ మహిమ వల్ల, హరిచింతనా పరులు అవుతారు. యోగిశ్రేష్ఠులు అయ్యి సిద్దపదం చేరతారు.

తెభా-9-653-వ.
ఇట్లు రంతిదేవుండు విజ్ఞానగర్భిణి యగు భక్తివలనఁ బరమపదంబునకుం జనియె; నంత గర్గునకు శిని జన్మించె. శినికి గార్గ్యుండు గలిగె; నాతనినుండి బ్రాహ్మణకులంబయ్యె; మహావీర్యునికి నురుక్షయుండును, నురుక్షయునకుఁ ద్రయారుణియుఁ గవియుఁ బుష్కరారుణియు నను మువ్వురు సంభవించిరి; వారును బ్రాహ్మణులయి చనిరి; బ్రహ్మక్షత్రునికి సుహోత్రుండు, సుహోత్రునకు హస్తియు జనించి రా హస్తి దన పేర హస్తినాపురంబు నిర్మించె నా హస్తికి నజమీఢుండును ద్విమీఢుండును బురుమీఢుండును నన మువ్వురు జనియించి; రం దజమీఢుని వంశంబునం బ్రియమేధాదులు గొందరు పుట్టి బ్రాహ్మణులయి చని; రయ్యజమీఢునికి బృహదిషుడు నతని పుత్రుండు బృహద్దనువు, నతనికి బృహత్కాయుండు, నతనికి జయద్రథుండు, నతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు, సేనజిత్తునకు రుచిరాశ్వుండు, దృఢహనువుఁ గాశ్యుండు వత్సుండునన నలువురు జనించి; రందు రుచిరాశ్వునకుఁ బ్రాజ్ఞుండును, నతనికిఁ బృథుసేనుండును, బృథుసేనునికిఁ బారుండును, వానికి నీపుండు, నీపునికి నూర్వురు గొడుకులును బుట్టిరి; మఱియును.
టీక:- ఇట్లు = ఈ విధముగ; రంతిదేవుండు = రంతిదేవుడు; విజ్ఞాన = స్వస్వరూపజ్ఞాన కారణము; అగు = ఐన; భక్తి = భక్తి; వలనన్ = వలన; పరమపదంబున్ = మోక్షమును; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అంతట; గర్గున్ = గర్గున; కున్ = కు; శిని = శిని; జన్మించె = పుట్టెను; శిని = శిని; కిన్ = కి; గార్గ్యుండున్ = గార్గ్యుడు; కలిగెన్ = పుట్టెను; ఆతని = అతని; నుండి = నుండి; బ్రాహ్మణ = బ్రాహ్మణ; కులంబున్ = కులము; అయ్యెన్ = కలిగెను; మహావీర్యుని = మహావీర్యుని; కిన్ = కి; ఉరుక్షయుండును = ఉరుక్షయుడు; ఉరుక్షయున్ = ఉరుక్షయున; కున్ = కు; త్రయారుణియున్ = త్రయారుణి; కవియున్ = కవి; పుష్కరారుణియున్ = పుష్కరారుణి; అను = అనెడి; మువ్వురు = ముగ్గురు; సంభవించిరి = పుట్టిరి; వారునున్ = వారు; బ్రాహ్మణులు = విప్రులు; అయి = అయ్యి; చనిరి = పోయిరి; బ్రహ్మక్షత్రుని = బ్రహ్మక్షత్రుని; కి = కి; సుహోత్రుండున్ = సుహోత్రుడు; సుహోత్రున్ = సుహోత్రున; కున్ = కు; హస్తియున్ = హస్తి; జనించిరి = పుట్టిరి; ఆ = ఆ; హస్తి = హస్తి; తన = తన; పేరన్ = పేరుమీద; హస్తినాపురంబున్ = హస్తినాపురమును; నిర్మించెను = కట్టించెను; ఆ = ఆ; హస్తి = హస్తి; కిన్ = కి; అజమీఢుండును = అజమీఢుడు; ద్విమీఢుండు = ద్విమీఢుడు; పురుమీఢుడునున్ = పురుమీఢుడు; అనన్ = అనెడి; మువ్వురు = ముగ్గురు; జనియించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; అజమీఢుని = అజమీఢుని; వంశంబునన్ = వంశమునందు; ప్రియమేధ = ప్రియమేధుడు; ఆదులున్ = మొదలగువారు; కొందరు = కొంతమంది; పుట్టి = కలిగి; బ్రాహ్మణులు = బ్రాహ్మణులు; అయి = అయ్యి; చనిరి = పోయిరి; ఆ = ఆ; అజమీఢుని = అజమీఢుని; కిన్ = కి; బృహదిషుడున్ = బృహదిషుడు; అతని = అతని; పుత్రుండు = కుమారుడు; బృహద్దనువున్ = బృహద్దనువు; అతని = అతని; కిన్ = కి; బృహత్కాయుండున్ = బృహత్కాయుడు; అతని = అతని; కిన్ = కి; జయద్రథుండున్ = జయద్రథుడు; అతని = అతని; కిన్ = కి; విశ్వజిత్తు = విశ్వజిత్తు; విశ్వజిత్తున్ = విశ్వజిత్తున; కున్ = కు; సేనజిత్తు = సేనజిత్తు; సేనజిత్తున్ = సేనజిత్తున; కున్ = కు; రుచిరాశ్వుండున్ = రుచిరాశ్వుడు; దృఢహనువున్ = దృఢహనువు; కాశ్యుండు = కాశ్యుడు; వత్సుండున్ = వత్సుడు; అనన్ = అనగా; నలువురు = నలుగురు; జనించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; రుచిరాశ్వున్ = రుచిరాశ్వున; కున్ = కున్; ప్రాజ్ఞుండునున్ = ప్రాజ్ఞుడు; అతని = అతని; కిన్ = కి; పృథుసేనుండనున్ = పృథుసేనుడు; పృథుసేనుని = పృథుసేనుని; కిన్ = కి; పారుండును = పారుడు; వాని = అతని; కిన్ = కి; నీపుండునున్ = నీపుడు; నీపుని = నీపుని; కిన్ = కి; నూర్వురు = వందమంది (100); కొడుకులున్ = పుత్రులు; పుట్టిరి = జనించిరి; మఱియును = ఇంకను.
భావము:- ఈ విధంగా రంతిదేవుడు ఆత్మజ్ఞాన కారణమైన భక్తితో మోక్షానికి వెళ్ళాడు. అంతట గర్గునకు శిని పుట్టాడు; శినికి గార్గ్యుడు, అతనికి బ్రాహ్మణ కులం పుట్టాయి. మహావీర్యునికి ఉరుక్షయుడు; ఉరుక్షయునకు త్రయారుణి, కవి, పుష్కరారుణి అని ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు విప్రులైపోయారు. బ్రహ్మక్షత్రునికి సుహోత్రుడు; సుహోత్రునకు హస్తి పుట్టారు. ఆ హస్తి తన పేరుమీద హస్తినాపురం నిర్మించాడు. ఆ హస్తికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అని ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో అజమీఢుని వంశంలో ప్రియమేధుడు మున్నగు కొంతమంది పుట్టి బ్రాహ్మణులు అయిపోయారు. ఆ అజమీఢునికి బృహదిషుడు; అతనికి బృహద్దనువు; అతనికి బృహత్కాయుడు; అతనికి జయద్రథుడు; అతనికి విశ్వజిత్తు; విశ్వజిత్తునకు సేనజిత్తు; సేనజిత్తునకు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనగా నలుగురు కుమారులు పుట్టారు. వారిలో రుచిరాశ్వునికి ప్రాజ్ఞుడు; అతనికి పృథుసేనుడు; పృథుసేనునికి పారుడు; అతనికి నీపుడు; నీపునికి వందమంది పుత్రులు పుట్టారు. ఇంకా....

తెభా-9-654-ఆ.
శుకుని కూఁతురైన సుందరి సత్కృతిఁ
బొంది వేడ్క నీపభూవిభుండు
విమల యోగవిత్తు విజ్ఞానదీపితో
దారచిత్తు బ్రహ్మత్తుఁ గనియె.

టీక:- శుకుని = శుకుని యొక్క; కూతురు = పుత్రిక; ఐన = అయిన; సుందరి = అందగత్తె; సత్కృతిన్ = సత్కృతిని; పొంది = పెళ్ళిచేసుకొని; వేడ్కన్ = కోరి; నీప = నీపుడు అనెడి; భూవిభుండు = రాజు; విమల = స్వచ్ఛమైన; యోగ = యోగవిద్య; విత్తు = తెలిసినవాడు; విజ్ఞాన = విజ్ఞానముచేత; దీపిత = ప్రకాశించెడివాడు; ఉదారచిత్తు = గొప్ప మనసు కలవాడు; బ్రహ్మదత్తున్ = బ్రహ్మదత్తుని; కనియె = పొందెను.
భావము:- శుకుని పుత్రిక అయిన అందగత్తె సత్కృతిని నీపరాజు కోరి పెళ్ళిచేసుకొని, మంచి యోగవిద్య తెలిసి, విజ్ఞానంతో మెరిసే గొప్ప మనసు కలవాడు అయిన బ్రహ్మదత్తుని పొందాడు.

తెభా-9-655-వ.
ఆ బ్రహ్మదత్తుండు జైగిషవ్యోపదేశంబున, యోగతంత్రంబునం జేసి గోదేవియను భార్యవలన విష్వక్సేనుండను కుమారునిం గనియె; విష్వక్సేనునకు నుదక్సేనుండును, దక్యేనునకు భల్లాదుండు గల్గి, వీరలు బార్హదిషవులను రాజులైరి; ద్విమీఢునకు యమీనరుండు, యమీనరునికిఁ గృతిమంతుండు, గృతిమంతునికి సత్యధృతి, సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుండును, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుండు, సన్నతిమంతుని కొడుకు కృతి యనువాఁడు హిరణ్యనాభునివలన యోగమార్గం బెఱింగి, శోకమోహంబులు విడిచి తూర్పుదేశంబున సామసంహిత పఠియించె; నతనికి నుగ్రాయుధుండును, నుగ్రాయుధునకు క్షేమ్యుండు. క్షేమ్యునకు సువీరుండు, సువీరునకుఁ బురంజయుండుఁ, బురంజయునకు బహురథుండు జన్మించిరి; హస్తి కొడుకు పురుమీఢునికి సంతతి లేదయ్యె; నయ్యజమీఢునికి నళిని యను భార్య యందు నీలుండు నీలునికి శాంతియు, శాంతికి సుశాంతియు, సుశాంతికిఁ బురుజుండు, బురుజునికి నర్కుండు, నర్కునికి భర్మ్యాశ్వుండు, భర్మ్యాశ్వునకు ముద్గల యవీనర బృహదిషు కాంపిల్య సృంజయులను వారేరువురుం బుట్టిరి.
టీక:- ఆ = ఆ; బ్రహ్మదత్తుండున్ = బ్రహ్మదత్తుడు; జైగిషవ్య = జైగిషవ్యుని; ఉపదేశంబునన్ = ఉపదేశము పొందుట వలన; యోగతంత్రంబునన్ = యోగతంత్రము; జేసి = వలన; గోదేవి = గోదేవి; అను = అనెడి; భార్య = భార్య; వలనన్ = అందు; విష్వక్సేనుండు = విష్వక్సేనుడు; అను = అనెడి; కుమారునిన్ = పుత్రుని; కనియెన్ = పొందెను; విష్వక్సేనున్ = విష్వక్సేనున; కున్ = కు; ఉదక్సేనుండును = ఉదక్సేనుడు; ఉదక్సేనున్ = ఉదక్సేనున; కున్ = కు; భల్లాదుండున్ = భల్లాదుడు; కల్గి = పుట్టి; వీరలు = వీరు; బార్షదిషువులు = బార్షదిషువులు; అను = అనెడి; రాజులు = రాజులు; ఐరి = అయ్యిరి; ద్విమీఢున్ = ద్విమీఢున్; కున్ = కు; అమీనరుండున్ = అమీనరుండు; అమీనరుని = అమీనరుని; కిన్ = కి; కృతిమంతుడున్ = కృతిమంతుడు; కృతిమంతుని = కృతిమంతుని; కిన్ = కి; సత్యధృతి = సత్యధృతి; సత్యధృతి = సత్యధృతి; కిన్ = కి; దృఢనేమి = దృఢనేమి; దృఢనేమి = దృఢనేమి; కిన్ = కి; సుపార్శ్వకృత్తు = సుపార్శ్వకృత్తు; సుపార్శ్వకృత్తున్ = సుపార్శ్వకృత్తున; కున్ = కు; సుపార్శ్వుండును = సుపార్శ్వుడు; సుపార్శ్వున్ = సుపార్శ్వున; కున్ = కు; సుమతి = సుమతి; సుమతి = సుమతి; కిన్ = కి; సన్నతిమంతుండున్ = సన్నతిమంతుడు; సన్నతిమంతుని = సన్నతిమంతుని; కొడుకు = పుత్రుడు; కృతి = కృతి; అను = అనెడి; వాడు = వాడు; హిరణ్యనాభుని = హిరణ్యనాభుని; వలనన్ = వలన; యోగమార్గంబున్ = యోగమార్గమును; ఎఱింగి = తెలిసికొని; శోకమోహంబులున్ = శోకమోహములను; విడిచి = వదలివేసి; తూర్పు = తూర్పు దిక్కునగల; దేశంబునన్ = దేశములలో; సామసంహిత = సామవేదభాగమును; పఠియించెన్ = చదువుకొనెను; అతని = అతని; కిన్ = కి; ఉగ్రాయుధుండునున్ = ఉగ్రాయుధుడు; ఉగ్రాయుధున్ = ఉగ్రాయుధున; కున్ = కు; క్షేముండున్ = క్షేముండు; క్షేమున్ = క్షేమున; కున్ = కు; సువీరుండు = సువీరుడు; సువీరున్ = సువీరున; కున్ = కు; పురంజయుండున్ = పురంజయుడు; పురంజయున్ = పురంజయున; కున్ = కు; బహురథుండున్ = బహురథుడు; జన్మించిరి = పుట్టిరి; హస్తి = హస్తి యొక్క; కొడుకు = పుత్రుడు; పురుమీఢుని = పురుమీఢుని; కిన్ = కి; సంతతి = సంతతి; లేదు = లేకపోయినది; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అజమీఢుని = అజమీఢుని; కిన్ = కి; నళిని = నళిని; అను = అనెడి; భార్య = పెండ్లాము; అందున్ = వలన; నీలుండున్ = నీలుడు; నీలుని = నీలుని; కిన్ = కి; శాంతియున్ = శాంతి; శాంతి = శాంతి; కిన్ = కి; సుశాంతియున్ = సుశాంతి; సుశాంతి = సుశాంతి; కిన్ = కి; పురుజుండున్ = పురుజుండును; పురుజుని = పురుజుని; కిన్ = కి; అర్కుండున్ = అర్కుడు; అర్కుని = అర్కుని; కిన్ = కి; భర్మ్మాశ్వుండున్ = భర్మ్మాశ్వుడు; భర్మ్యాశ్వున్ = భర్మ్యాశ్వున; కున్ = కు; ముద్గల = ముద్గల; అవీనర = అవీనర; బృహదిషు = బృహదిషుడు; కాంపిల్య = కాంపిల్యుడు; సృంజయులు = సృంజయుడులు; అను = అనెడి; వారు = వారు; ఏవురు = ఐదుగురు (5); పుట్టిరి = జనించిరి.
భావము:- ఆ బ్రహ్మదత్తుడు జైగిషవ్యుని ఉపదేశం పొంది, యోగతంత్రంతో భార్య గోదేవి అందు విష్వక్సేనుడు అనే పుత్రుని పొందాడు. విష్వక్సేనునకు ఉదక్సేనుడు; ఉదక్సేనునకు భల్లాదుడు పుట్టారు. వీరు బార్షదిషువులు అనే రాజులు. ద్విమీఢునకు అమీనరుడు; అమీనరునికి కృతిమంతుడు; కృతిమంతునికి సత్యధృతి; సత్యధృతికి దృఢనేమి; దృఢనేమికి సుపార్శ్వకృత్తు; సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుడు; సుపార్శ్వునకు సుమతి; సుమతికి సన్నతిమంతుడు; సన్నతిమంతునికి కృతి పుట్టారు. ఆ కృతి హిరణ్యనాభుని నుండి యోగమార్గం తెలిసికొని శోకమోహాలను వదలివేసి తూర్పు దేశాలలో సామవేదభాగాన్ని చదువుకున్నాడు. అతనికి ఉగ్రాయుధుడు; ఉగ్రాయుధునకు క్షేముడు; క్షేమునకు సువీరుడు; సువీరునకు పురంజయుడు; పురంజయునకు బహురథుడు పుట్టారు. హస్తి పుత్రుడు పురుమీఢునికి సంతతి కలుగలేదు. అజమీఢునికి భార్య నళిని అందు నీలుడు; నీలునికి శాంతి; శాంతికి సుశాంతి; సుశాంతికి పురుజుడు; పురుజునికి అర్కుడు; అర్కునికి భర్మ్మాశ్వుడు; భర్మ్యాశ్వునకు ముద్గల, అవీనర, బృహదిషుడు, కాంపిల్యుడు, సృంజయుడు అనే ఐదుగురు కొడుకుల జన్మించారు.

తెభా-9-656-క.
మించిన భర్మ్యాశ్వుఁడు సుత
పంకమును జూచి విషయపంచకమును వ
ర్జించితిఁ దల మని పల్కినఁ
బాంచాలురు నాఁగ సుతులు రఁగిరి ధరణిన్.

టీక:- మించిన = అతిశయించిన; భర్మ్యశ్వుడు = భర్మ్యశ్వుడు; సుత = కొడకులు; పంచకమునున్ = ఐదుగురుని (5); చూచి = చూసి; విషయ = రాజ్యములను; పంచకమునున్ = ఐదింటిని (5); వర్జింతిన్ = ఇచ్చితిని; తలము = వర్ధిల్లండి; అని = అని; పల్కినన్ = చెప్పగా; పాంచాలురు = పాంచాలురు; నాగన్ = లాగ, అని పిలువబడి; సుతులు = కొడుకులు; పరగిరి = ప్రసిద్ధులైరి; ధరణిన్ = భూలోకము నందు.
భావము:- అతిశయి సంపన్నుడైన భర్మ్యశ్వుడు కొడకులు ఐదుగురుకి ఐదు రాజ్యభాగాలు ఇచ్చాను పదండి ఏలుకోండి అని చెప్పాడు. వారు లోకంలో అలా పాంచాలురు అని ప్రసిద్ధులు అయ్యారు.

తెభా-9-657-వ.
అంత ముద్గలునినుండి బ్రాహ్మణకులంబై, ముద్గల గోత్రంబు నా నెగడె; భర్మ్యాశ్వపుత్రుండైన యా ముద్గలునికి దివోదాసుండు, నహల్యయను కన్యకయునుం బుట్టి; రా యహల్య యందు గౌతమునికి శతానందుండు పుట్టె; శతానందునికి ధనుర్వేద విశారదుండయిన సత్యధృతి పుట్టె; నతం డొకనాఁడు వనంబున నూర్వశిం గనిన నతనికి రేతఃపాతంబై, తద్వీర్యంబు శరస్తంబంబునం బడి మిథునం బయ్యె; నా సమయంబున.
టీక:- అంతన్ = అంతట; ముద్గలుని = ముద్గలుని; నుండి = తో మొదలై; బ్రాహ్మణ = విప్ర; కులంబున్ = వంశము; ఐ = ఏర్పడి; ముద్గలగోత్రంబున్ = ముద్గలగోత్రంబున్; నాన్ = అనబడి; నెగడెన్ = అతిశయించెను; భర్మ్యాశ్వ = భర్మ్యాశ్వుని; పుత్రుండు = కొడుకు; ఐన = అయినట్టి; ఆ = ఆ; ముద్గలుని = ముద్గలుని; కిన్ = కి; దివోదాసుండున్ = దివోదాసుడు; అహల్య = అహల్య; అను = అనెడి; కన్యకయునున్ = ఆడపిల్ల; పుట్టిరి = జనించిరి; ఆ = ఆ; అహల్య = అహల్య; అందున్ = వలన; గౌతముని = గౌతముని; కిన్ = కి; శతానందుండున్ = శతానందుడు; పుట్టెన్ = జనించెను; శతానందుని = శతానందుని; కిన్ = కి; ధనుర్వేద = విలువిద్య, యజుర్వేదానికి ఉపవేదము; విశారదుండు = పండితుడు; అయిన = ఐన; సత్యధృతి = సత్యధృతి; పుట్టెన్ = జన్మించెను; అతండు = అతడు; ఒక = ఒకానొక; నాడు = దినమున; వనంబున్ = అడవియందు; ఊర్వశిన్ = ఊర్వశిని; కనినన్ = చూడగా; అతని = అతని; కిన్ = కి; రేతః = ఇంద్రియ; పాతంబు = స్ఖలనము; ఐ = అయ్యి; తత్ = ఆ; వీర్యంబు = ఇంద్రియము; శరస్తంబంబునన్ = రెల్లుగడ్డిపైన; పడి = పడి; మిథునంబున్ = కవలులుగా; అయ్యెన్ = అయినది; ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- అంతట ముద్గలుడి వంశం బ్రాహ్మణ కులం ఏర్పడి ముద్గలగోత్రంతో ప్రసిద్ధం అయింది. భర్మ్యాశ్వుని కొడుకు అయిన ఆ ముద్గలునికి దివోదాసుడు అనే కొడుకు, అహల్య అనే కూతురు పుట్టారు. ఆ అహల్య వలన గౌతమునికి శతానందుడు పుట్టాడు. శతానందునికి ప్రముఖ విలువిద్యా నిపుణుడు సత్యధృతి పుట్టాడు. అతడు ఒకనాడు అడవిలో ఊర్వశిని చూడగా అతనికి ఇంద్రియ స్ఖలనం అయింది. ఆ ఇంద్రియం రెల్లుగడ్డిపై పడి కవల బిడ్డలుగా అయ్యారు. ఆ సమయంలో.

తెభా-9-658-క.
లరతి శంతనుం డను
నృవరుఁ డడవికిని వేఁట నెపమునఁ జనుచుం
గృతో శిశుయుగముం గని
కృపియుఁ గృపుం డనుచుఁ దెచ్చి గృహమునఁ బెంచెన్.

టీక:- చపల = చపలతతోకూడిన {చపలత - రాగద్వేషాదులచే పనుల యందు కలుగు తబ్బిబ్బు}; రతి = కోరికలు కలవాడు; శంతనుడునున్ = శంతనుడు; నృప = రాజులలో; వరుడు = ఉత్తముడు; అడవి = అడవి; కిని = కి; వేట = వేటాడుట యనెడి; నెపమునన్ = సాకుతో; చనుచున్ = వెళ్తు; కృప = కరుణ; తోన్ = తోటి; శిశు = శిశువులను; యుగమున్ = కవలపిల్లలను; కని = కనిగొని; కృపియున్ = కృపి; కృపుండు = కృపుడు; అనుచున్ = అని పేర్లుపెట్టి; తెచ్చి = తీసుకొని వచ్చి; గృహమునన్ = ఇంటియందు; పెంచెన్ = పెంచెను.
భావము:- చంచలమైన కోరికలు కల శంతన మహారాజు అడవికి వేట కోసం వెళ్తూ, కరుణతో ఆ కవలశిశువులను చూసి తీసుకొని వచ్చి కృపి, కృపుడు అని పేర్లు పెట్టి తన ఇంటిలో పెంచుకున్నాడు.