పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/భరతుని చరిత్ర
స్వరూపం
భరతుని చరిత్ర
| ←ముందరి అధ్యాయము | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/భరతుని చరిత్ర) రచయిత: పోతన |
[[ | తరువాతి అధ్యాయము ]]→ |
(భా-9-623-వ.)
[మార్చు]| ఇవ్విధంబున నమోఘవీర్యుండగు నా రాచపట్టి, దపసిరాచూలికిఁ | 1 | ||
| జూలు నెక్కొలిపి, మఱునాఁడు తన వీటికిం జనియె; న య్యింతియుఁ | 2 | ||
| గొంతకాలంబునకుఁ గొడుకుం గనినఁ గణ్వమునీంద్రుం డా రాచపట్టికి | 3 | ||
| జాతకర్మాది మంగళాచారంబు లొనర్చె నా డింభకుండును దినదినం | 4 | ||
| బునకు బాలచంద్రుఁడునుం బోలె నెదుగుచు. | 5 | ||
(భా-9-624-క.)
[మార్చు]| కుంఠితుఁడుగాక వాఁడు | 1 | ||
| త్కంఠం దన పిన్ననాఁడె కణ్వవనచర | 2 | ||
| త్కంఠీరవ ముఖ్యంబుల | 3 | ||
| కంఠములం బట్టి యడుచుఁ; గట్టున్; విడుచున్. | 4 | ||
(భా-9-625-వ.)
[మార్చు]| అంత నా కణ్వమునీంద్రుండు బాలకుం జూచి శకుంతల కిట్లనియె. | 1 | ||
(భా-9-626-ఉ.)
[మార్చు]| పట్టపురాజు నీ మగఁడు; పాపఁడు నన్నిట నెక్కు డంతకుం; | 1 | ||
| బట్టపుదేవివై గఱువ బాగున నుండక పాఱువారితో | 2 | ||
| గట్టువనంబులో నవయఁగాఁ బనిలే దిటఁ దర్లిపోఁగదే | 3 | ||
| పుట్టిన యిండ్ల మానినులు పోరచిగా ననిశంబు నుందురే? | 4 | ||
(భా-9-627-వ.)
[మార్చు]| అనిన నియ్యకొని. | 1 | ||
(భా-9-628-క.)
[మార్చు]| ఆ పినవాని నతుల | 1 | ||
| వ్యాపారు నుదారు వైష్ణవాంశోద్భవునిం | 2 | ||
| జూపెద నంచు శకుంతల | 3 | ||
| భూపాలునికడకు వచ్చెఁ బుత్రుని గొనుచున్. | 4 | ||
(భా-9-629-వ.)
[మార్చు]| వచ్చి దుష్యంతుండున్న సభామండపంబునకుం జని నిలిచి | 1 | ||
|}
(భా-9-630-మ.)
[మార్చు]| వల కేలన్ గురుచక్రరేఖయుఁ బదద్వంద్వంబునం బద్మరే | 1 | ||
| ఖలు నొప్పారఁగ నందు వచ్చిన రమాకాంతుండు నాఁ గాంతి న | 2 | ||
| గ్గలమై యున్న కుమారు మారసదృశాకారున్ విలోకించి తాఁ | 3 | ||
| బలుకం డయ్యె విభం డెఱింగి సతి విభ్రాంతాత్మ యై యుండగన్. | 4 | ||
(భా-9-631-వ.)
[మార్చు]| ఆ సమయంబున. | 1 | ||
(భా-9-632-మ.)
[మార్చు]| అదె నీ వల్లభ; వాఁడు నీ సుతుఁడు; భార్యాపుత్రులం బాత్రులన్ | 1 | ||
| వదలంగా; దలనాఁటి కణ్వవనికా వైవాహికారంభముల్ | 2 | ||
| మది నూహింపు; శకుంతలావచనముల్ మాన్యంబుగా భూవరేం | 3 | ||
| ద్ర! దయం జేకొను మంచుం మ్రోసెను వియద్వాణీవధూవాక్యముల్. | 4 | ||
(భా-9-633-వ.)
[మార్చు]| ఇ ట్లశరీరవాణి సర్వభూతంబులకుఁ దేటపడ భరింపు మని పలికిన, | 1 | ||
| నా కుమారుండు భరతుండయ్యె; నంత నా రాజు రాజవదన నంగీక | 2 | ||
| రించి తనూభవుం జేకొని కొంతకాలంబు రాజ్యంబు జేసి పరలోకం | 3 | ||
| బునకుం జనియె; తదనంతరంబ. | 4 | ||
(భా-9-634-క.)
[మార్చు]| రెండవహరి క్రియ ధరణీ | 1 | ||
| మండలభారంబు నిజసమంచితబాహా | 2 | ||
| దండమున నిలిపి తనకును | 3 | ||
| భండనమున నెదురులేక భరతుం డొప్పెన్. | 4 | ||
(భా-9-635-వ.)
[మార్చు]| మఱియునా దౌష్యంతి, యమునాతటంబున దీర్ఘతపుండు పురో | 1 | ||
| హితుండుగా డెబ్బదియెనిమిదియును, గంగాతీరంబున నేఁబది | 2 | ||
| యయిదును, నిట్లు నూటముప్పదిమూఁడశ్వమేధయాగంబులు | 3 | ||
| సదక్షిణంబులుగానొనర్చి; దేవేంద్రవిభవంబున నతిశయించి, పదు | 4 | ||
| మూఁడువేలునెనుబదినాలుగు కదుపుధేనువులుగలయది ద్వం | 5 | ||
| ద్వంబనం బరఁగు, నట్టి వేయి ద్వంద్వంబుల పాఁడిమొదవులఁగ్రేపు | 6 | ||
| లతోడ నలంకారసహితలం జేసి వేవురు బ్రాహ్మణుల కిచ్చి, మష్కార | 7 | ||
| తీర్థకూలంబున విప్రముఖ్యులకుఁ బుణ్యదినంబున గనక భూషణ | 8 | ||
| శోభితంబులయి ధవళదంతంబులు గల నల్లని యేనుంగులం బదు | 9 | ||
| నాలుగులక్షలనొసంగె; దిగ్విజయకాలంబున శక, శబర, బర్బర, కష, | 10 | ||
| కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశంబుల రాజులఁ బీచం బడంచి, రసాతలం | 11 | ||
| బున రాక్షస కారాగృహంబులందున్న వేల్పుల గరితలం బెక్కండ్ర | 12 | ||
| విడిపించి తెచ్చి, వారల వల్లభులం గూర్చె; త్రిపురదానవుల జయిం | 13 | ||
| చి, నిర్జరుల నిజమందిరంబుల నునిచె; నతని రాజ్యంబున గగన |
14 | ||
| ధరణీతలంబులు ప్రజలుగోరిన కోరిక లిచ్చుచుండె; ని వ్విధంబున. | 15 | ||
(భా-9-636-ఆ.)
[మార్చు]| సత్యచరితమందుఁ జలమందు బలమందు | 1 | ||
| భాగ్యమందు లోకపతులకంటె | 2 | ||
| నెక్కుడైన పేర్మి నిరువదియేడువే | 3 | ||
| లేండ్లు ధరణి భరతుఁ డేలె నధిప! | 4 | ||
(భా-9-637-క.)
[మార్చు]| అర్థపతికంటెఁ గలిమిఁ గృ | 1 | ||
| తార్థుండై యతుల శౌర్య మలవడియు నతం | 2 | ||
| డర్థములను బ్రాణములను | 3 | ||
| వ్యర్థము లని తలఁచి శాంతుఁ డయ్యె నరేంద్రా! | 4 | ||
(భా-9-638-క.)
[మార్చు]| భరతుని భార్యలు మువ్వురు | 1 | ||
| వరుసం బుత్రకులఁ గాంచి వల్లభుతోడన్ | 2 | ||
| సరిగారని తోడ్తోడను | 3 | ||
| శిరములు దునుమాడి రాత్మ శిశువుల నధిపా! | 4 | ||
(భా-9-639-వ.)
[మార్చు]| ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువులం జంపిన భరతుం డపుత్ర | 1 | ||
| కుండై మరుత్ స్తోమం బను యాగంబు పుత్రార్థి యై చేసి, దేవతల | 2 | ||
| మెప్పించెను; అ య్యవసరంబున. | 3 | ||
(భా-9-640-సీ.)
[మార్చు](భా-9-640.1-ఆ.)
[మార్చు]| అన్న యిల్లాలిఁ జూలాలిని మమతాఖ్యఁ | 1 | ||
| జూచి బృహస్పతి సురతమునకుఁ |
2 | ||
| దొరఁకొని పైబడ్డఁ దొల్లి గర్భంబున | 3 | ||
| నున్న బాలుఁడు భయం బొదవి వలదు |
4 | ||
| తగదని మొఱజేయఁదమకంబుతో వాని | 5 | ||
| నంధుండ వగుమన్న నలిగి వాఁడు |
6 | ||
| యోనిలోపలి వీర్య మూడఁ దన్నిన నేలఁ | 7 | ||
| బడి బిడ్డఁడై యున్నఁ బాయ లేక |
8 | ||
| నితని పెంపు; కొడుకు లిరువురు జన్మించి | 9 | ||
| రనుచు వెలయఁ జేయు మనిన మమతఁ | 10 | ||
| బెంపఁజాల; నీవ పెంపు; భరింపు; మీ | 11 | ||
| ద్వాజు ననుచుఁ జనియె దాని విడిచి. | 12 | ||
(భా-9-641-వ.)
[మార్చు]| ఇట్లు చథ్యుని భార్య యగు మమతయు బృహస్పతియు శిశు | 1 | ||
| వుం గని, ద్వాజుండైన వీని నీవ నీవ భరింపుమని, వదినె మఱఁ | 2 | ||
| దులు దమలో నొండొరువులం బలికిన కారణంబున వాఁడు భరద్వా | 3 | ||
| జుండయ్యె; గర్భస్థుండయిన వాఁడు బృహస్పతి శాపంబున దీర్ఘ | 4 | ||
| తముం డయ్యె; నంత నా బృహస్పతియు మమతయు నుదయిం | 5 | ||
| చిన వాని విడిచి నిజేచ్ఛం జనిన, మరుత్తులు వానిం బోషించి పుత్రా | 6 | ||
| ర్థి యయిన భరతున కిచ్చిరి; భరతుండు వానిం జేకొనియె; వితథం | 7 | ||
| బయిన భరతవంశంబునకు నా భరద్వాజుండు వంశకర్త యగుటం | 8 | ||
| జేసి వితథుండనం బరఁగె నా వితథునికి మన్యువు, మన్యువునకు | 9 | ||
| బృహత్క్షత్త్ర జయ మహావీర్య నర గర్గు లను వారేవురు సంభవించి; | 10 | ||
| రందు నరునికి సంకృతి, సంకృతికి గురుండు, రంతిదేవుం డన | 11 | ||
| నిరువురు జన్మించిరి; అందు. | 12 | ||