Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/పరశురాముని కథ

వికీసోర్స్ నుండి

పరశురాముని కథ

తెభా-9-427-క.
పురుషోత్తము నంశంబున
జమదగ్నికి జనించి న్యుఁడు రాముం
డిరువదియొకపరి నృపతుల
శిములఁ జక్కడిచెఁ దనదు చేగొడ్డంటన్.

టీక:- పురుషోత్తమున్ = విష్ణుమూర్తి యొక్క; అంశంబునన్ = అంశతో; ధరన్ = భూలోకమున; జమదగ్ని = జమదగ్ని; కిన్ = కి; జనించి = పుట్టి; ధన్యుడు = ధన్యాత్ముడు; రాముండు = రాముడు; ఇరువదియొక = ఇరవైఒక్క (21); పరి = సార్లు; నృపతులన్ = రాజుల యొక్క {నృపతి - నరులకు భర్త, రాజు}; శిరములన్ = తలలను; చక్కడిచెన్ = నరికివేసెను; తనదు = తన యొక్క; చేగొడ్డంటన్ = గండ్రగొడ్డలితో.
భావము:- విష్ణుమూర్తి తన అంశతో పరశురాముడుగా జమదగ్ని ఇంట అవతరించాడు. పరశురాముడు తన యొక్క గండ్రగొడ్డలితో ఇరవైఒక్క సార్లు రాజులు అందరి తలలు నరికేసాడు.”

తెభా-9-428-వ.
అనిన విని భూవరుండు శుకున కిట్లనియె.
టీక:- అనినన్ = అని చెప్పగా; విని = విని; భూవరుండు = రాజు {భూవరుడు - భూమికిభర్త, రాజు}; శుకున్ = శుకుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- అని చెప్పిన శుకునితో రాజు పరీక్షిత్తు ఇలా అడిగాడు.

తెభా-9-429-ఉ.
"టికి జంపె రాముఁడ వనీశులఁ బల్వుర వారి యందు ద
ప్పేటికిఁ గల్గె విప్రుఁ డతఁ డేటికి రాజస తామసంబులన్
వాముఁ బొందె భూభరము వారిత మౌ టది యేవిధంబు నా
మాకు మౌనిచంద్ర! మఱుమాట ప్రకాశముగాఁగఁ జెప్పవే."

టీక:- ఏటికిన్ = ఎందుకు; చంపెన్ = సంహరించెను; రాముడు = పరశురాముడు; ఈశులన్ = రాజులను; పల్వురన్ = అనేకమందిని; వారి = వారి; అందున్ = ఎడల; తప్పు = తప్పు; ఏటికిన్ = ఏమిటి; కల్గెన్ = జరిగినది; విప్రుడు = బ్రాహ్మణుడు; ఏటికిన్ = ఎందుకు; రాజస = రజోగుణములు; తామసంబులన్ = తామసగుణములను; వాటమున్ = అనుకూలముగా; పొందెన్ = పొందెను; భూ = భూమి యొక్క; భరమున్ = భారము; వారితము = తగ్గినది; ఔట = అగుట; అది = అది; ఏవిధంబున్ = ఏవిధముగా; నా = నా; మాట = ప్రశ్న; కున్ = కు; మౌని = మునులలో; చంద్ర = చంద్రుని వంటివాడ; మఱుమాట = సమాధానమును; ప్రకాశము = విశదము; కాగన్ = అగునట్లు; చెప్పవే = చెప్పుము.
భావము:- ఓ మునీశ్వరా! పరశురాముడు రాజులు అందరిని ఎందుకు సంహరించాడు. వారు చేసిన తప్పు ఏమిటి? బ్రాహ్మణుడు అయి ఉండి ఇలా రజోగుణ, తామస గుణాలు ఎందుకు పొందాడు? దీని వలన భూభారం ఎలా తగ్గినట్లు అవుతుంది? వివరంగా చెప్పు.”

తెభా-9-430-వ.
అనిన విని శుకుం డిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అనగా విని శుకుడు పరీక్షిత్తునకు ఇలా చెప్పాడు.

తెభా-9-431-సీ.
"హైహయాధీశ్వరుం ర్జునుం డనువాఁడు-
రణీశ్వరులలోనఁ గినవాఁడు
పురుషోత్తమాంశాంశుఁ బుణ్యు దత్తాత్రేయు-
నారాధనముచేసి తనివలన
రపంథిజయమును బాహుసహస్రంబు-
ణిమాదిగుణములు శము బలము
యోగీశ్వరత్వంబు నోజయుఁ దేజంబుఁ-
జెడనియింద్రియములు సిరియుఁ బడసి"

తెభా-9-431.1-తే.
గాలికైవడి సకలలోకంబు లందుఁ
నకుఁ బోరాని రారాని తావులేక
యెట్టిచో నైనఁ దనయాజ్ఞ యేపు మిగుల
రణి వెలుఁగొందె వినువీథిఁ రణి మాడ్కి.

టీక:- హైహయ = హైహయవంశపు; అధీశ్వరుండు = రాజు; అర్జునుండు = అర్జునుడు; అను = అనెడి; వాడున్ = వాడు; ధరణీశ్వరుల = రాజుల; లోనన్ = లో; తగినవాడు = గొప్పవాడు; పురుషోత్తమ = విష్ణుమూర్తి యొక్క; అంశా = అంశ; అంశున్ = కలిగినవానిని; పుణ్యున్ = పుణ్యాత్ముని; దత్తాత్రేయునిన్ = దత్తాత్రేయుని; ఆరాధనము = పూజ; చేసి = చేసి; అతని = అతని; వలన = వలన; పరిపంథి = శత్రు; జయమును = జయమును; బాహు = చేతులు; సహస్రంబున్ = వెయ్యి (1000); అణిమాది = అష్ఠసిద్ధులు {అణిమాది - అష్టసిద్ధులు - 1అణిమ 2మహిమ 3గరిమ 4లఘిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7ఈశత్వము 8వశిత్వము}; గుణములున్ = సుగుణములు; యశము = కీర్తి; బలము = శక్తి; యోగీశ్వరత్వంబున్ = యోగియగుట; ఓజయున్ = ఓజస్సు; తేజంబున్ = తేజస్సు; చెడని = అఖండమైన; ఇంద్రియములు = ఇంద్రియ; సిరియున్ = పటుత్వము; పడసి = పొంది.
గాలి = వాయుదేవుని; కైవడిన్ = వలె; సకల = సమస్తమైన; లోకంబులు = లోకములు; అందున్ = లోను; తన = అతని; కున్ = కి; పోరాని = పోలేని; రారాని = రాలేని; తావు = చోటు; లేక = లేకుండగ; ఎట్టి = ఎటువంటి; చోన్ = చోటున; ఐనన్ = అయినను; తన = అతని; ఆజ్ఞ = అధికారము; ఏపుమిగులన్ = అతిశయించుతుండ; ధరణిన్ = భూలోకమున; వెలుగొందెన్ = ప్రకాశించెను; వినువీథి = ఆకాశమార్గములోని; తరణి = సూర్యుని {తరణి - చీకటిని తరింప (దాట)జేయువాడు, సూర్యుడు}; మాడ్కిన్ = వలె.
భావము:- కార్తవీర్యార్జునుడు హైహయవంశపు రాజు. చాలా గొప్పవాడు. విష్ణు అంశోద్భువుడు ఐన దత్తాత్రేయుని పూజించి, అతని వలన శత్రు జయం, వెయ్యి చేతులు, అష్ఠసిద్ధులు, యశస్సు, శక్తి, ఓజస్సు, తేజస్సు, అఖండమైన ఇంద్రియ పటుత్వం పొందాడు. అతనికి, గాలిలా సకల లోకాలలో ఎక్కడా అడ్డూ ఆపూ లేకుండా పోయింది. అతను ఆకాశంలో సూర్యుని తేజస్సులా భూలోకం అంతా ప్రకాశించసాగాడు.

తెభా-9-432-మ.
నాఁ డా మనుజేంద్రుఁ డంగనలతో నుద్దాముఁడై వీట నుం
రేవానది కేఁగి యందుఁ దెలినీటం జల్లుపోరాడి దీ
ర్ఘరాబ్జంబుల నా నదీజలములం ట్టెన్ వడిన్ నీరు మ్రో
కుఁ బెల్లుబ్బి రణాగతుండయిన యా లంకేశుపైఁ దొట్టఁగన్.

టీక:- ఒక = ఒకానొక; నాడు = దినమున; ఆ = ఆ; మనుజేంద్రుండు = రాజు; అంగనలు = స్త్రీలతో; ఉద్దాముడు = అడ్డులేనివాడు; ఐ = అయ్యి; వీటన్ = నగరిలో; ఉండకన్ = ఉండకుండ; రేవా = రేవా అనెడి; నది = నది; కిన్ = కి; ఏగి = వెళ్ళి; అందున్ = దానిలో; తెలి = స్వచ్ఛమైన; నీటన్ = నీటిలో; జల్లుపోరాడి = జలకాలాడి; దీర్ఘ = పొడవైన; కర = చేతులు అనెడి; అబ్జంబులన్ = పద్మములతో; ఆ = ఆ; నదీ = నది యొక్క; జలములన్ = నీటిప్రవాహమును; కట్టెన్ = ఆపివేసెను; వడిన్ = ఉరవడితో; నీరు = నీరు; మ్రోల = ముందర; కున్ = కు; పెల్లుబ్బి = పొంగి; రణ = కయ్యమునకు; ఆగతుండు = వచ్చినవాడు; అయిన = ఐనట్టి; ఆ = ఆ; లంకేశు = రావణుని {లంకేశుడు - లంకకు ప్రభువు, రావణుడు}; పైన్ = మీదకు; తొట్టగాన్ = ఎగదన్నునట్లుగ.
భావము:- ఒకనాడు ఆ రాజు గర్వితుడై స్త్రీలతో రేవా నదికి వెళ్ళి జలకాలు ఆడసాగాడు. పొడవైన తన చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపేసాడు. ఆ నీళ్ళు నది ఎగువవైపునకు పెల్లుబికి, అక్కడకు దిగ్విజయానికి వచ్చిన రావణుని మీదకు ఎగదన్నాయి.

తెభా-9-433-వ.
ఇట్లు దిగ్విజయార్థంబు వచ్చిన రావణుం డా రాజుచే కట్టందొట్టిన యేటినీటికి సహింపక రోషంబునం బోటరియుంబోలె నమ్మేటిమగని తోడి పోరాటకుం దొడరినఁ బాటింపకఁ దన బాహుపాటవంబున.
టీక:- ఇట్లు = ఇలా; దిగ్విజయ = దిగ్విజయము {దిగ్విజయము - అన్ని దిక్కులందలి భూమండలమును జయించుట}; అర్థంబున్ = కోసము; వచ్చిన = వచ్చినట్టి; రావణుండు = రావణుడు; ఆ = ఆ; రాజు = రాజు; చేన్ = వలన; తొట్టిన = అరికట్టబడిన; యేటి = నది యొక్క; నీటి = నీటిప్రవాహమున; కిన్ = కి; సహింపక = సహించలేక; రోషంబునన్ = కోపముచేత; పోటరియునున్ = పోటుగాని; పోలెన్ = వలె; ఆ = ఆ; మేటి = గొప్పవాడు; మగని = మగవాని; తోడి = తోటి; పోరాట = పోరాటమున; కున్ = కు; తోడరినన్ = దిగగా; పాటింపక = లెక్కజేయక; తన = తన యొక్క; బాహు = భుజ; పాటవంబునన్ = బలముతో.
భావము:- ఇలా దిగ్విజయానికి వచ్చిన రావణుడు, కార్తవీర్యార్జునుడు చేతులతో అడ్డుకోడంతో తనమీదకి ఎగదన్నిన నీటికి సహించలేక రోషంతో మహా పరాక్రమవంతుడు ఐన కార్తవీర్యుని మీదకు గొప్ప వీరుడిలా కయ్యానికి దిగాడు. అతను రావణుని ఏమాత్రం లెక్కజేయక తన భుజబలంతో.

తెభా-9-434-క.
వీఁమెయి నతఁడు రావణుఁ
గూఁటులగలించి పట్టికొని మోకాళ్ళం
దాఁకించి కోఁతికైవడి
నాఁకం బెట్టించెఁ గింకరావళిచేతన్.

టీక:- వీకమెయిన్ = పరాక్రమపూర్తిగా; అతడు = అతను; రావణున్ = రావణుని; కూకటులు = జుట్టు; అగలించి = ఒడిసి; పట్టికొని = పట్టుకొని; మోకాళ్ళన్ = మోకాళ్ళతో; తాకించి = పొడిచి; కోతి = కోతి; కైవడిన్ = వలె; ఆకన్ = చెరలో; పెట్టించెన్ = పెట్టించెను; కింకర = భటుల; ఆవళి = సమూహముల; చేతన్ = చేత;
భావము:- పరాక్రమించి కార్యవీర్యార్జునుడు రావణుని జుట్టు పట్టుకొని, మోకాళ్ళతో పొడిచి, తన భటులచేత కోతిని కట్టివేసినట్లు బంధించి చెరలో పెట్టించాడు.

తెభా-9-435-వ.
అంత నర్జునుండు మహిష్మతీపురంబున కేతెంచి.
టీక:- అంతన్ = అంతట; అర్జునుండు = అర్జునుడు; మహిష్మతీ = మహిష్మతి అనెడి; పురంబున్ = నగరమున; కున్ = కి; ఏతెంచి = వచ్చి.
భావము:- పిమ్మట కార్తవీర్యార్జునుడు తన మహిష్మతీ నగరానికి వచ్చి....

తెభా-9-436-క.
రాజేంద్రుఁడు రావణు
"నోరీ! యిటమీఁద నూరకుండుము; జగతిన్
వీరుఁడ ననకుము; కాచితిఁ
బోరా!" యని సిగ్గు పఱచి పుచ్చెన్ మరలన్.

టీక:- ఆ = ఆ; రాజ = రాజులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; రావణున్ = రావణుని; ఓరీ = ఒరేయ్; ఇట = ఇక; మీదన్ = పైన; ఊరకుండుము = ఊరకపడియుండు; జగతిన్ = లోకములో; వీరుడను = శూరుడను; అనకుము = అని చెప్పుకొనకు; కాచితిన్ = తప్పుకాసాను; పోరా = వెళ్ళిపోరా; అని = అని; సిగ్గు = అవమాన; పఱచి = పరచి; పుచ్చెన్ = పంపించెను; మరలన్ = వెనుకకు
భావము:- ఆ రాజశ్రేష్ఠుడు రావణుని. “ఒరేయ్! రావణా! ఇక పైన ఊరక పడి ఉండు. లోకంలో శూరుడను అని చెప్పుకోకు. ఈసారికి నీ తప్పుకాసాను వెళ్ళిపోరా.” అని అవమానించి పంపించాడు.

తెభా-9-437-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- ఆ పిమ్మట.

తెభా-9-438-సీ.
రణీశుఁ డొకనాఁడు దైవయోగంబున-
వేఁటకై కాంతారవీథి కేఁగి
తిరిగి యాఁకట శ్రాంతదేహుఁడై జమదగ్ని-
ముని యాశ్రమముఁజేరి మ్రొక్కి నిలువ
నా మునీంద్రుఁడు రాజు ర్థితోఁ బూజించి-
యా రాజునకు రాజునుచరులకుఁ
న హోమధేనువుఁ డయక రప్పించి-
యిష్టాన్నములు గురియింప నతఁడు

తెభా-9-438.1-తే.
గుడిచి కూర్చుండి మొదవుపై గోర్కిఁ జేసి
సంపద యదేల యీ యావు చాలుఁగాక
యిట్టి గోవుల నెన్నండు నెఱుఁగ మనుచుఁ
ట్టి తెండని తమ యొద్ది టులఁ బనిచె.

టీక:- ధరణీశుడు = రాజు; ఒక = ఒకానొక; నాడు = దినమున; దైవయోగమునన్ = దైవఘటనవలన; వేట = వేటాడుట; కై = కోసము; కాంతార = అటవీ; వీథి = మార్గమున; కిన్ = కు; ఏగి = వెళ్ళి; తిరిగి = సంచరించి; ఆకటన్ = ఆకలితో; శ్రాంత = అలసిన; దేహుడు = శరీరము కలవాడు; ఐ = అయ్యి; జమదగ్ని = జమదగ్ని అనెడి; ముని = ఋషి; ఆశ్రమమున్ = ఆశ్రమము; చేరి = దగ్గరకు వెళ్ళి; మ్రొక్కి = నమస్కరించి; నిలువన్ = నిలబడగా; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రుడు = ఉత్తముడు; రాజున్ = రాజును; అర్థి = ప్రీతి; తోన్ = తోటి; పూజించి = మర్యాదలుచేసి; ఆ = ఆ; రాజున్ = రాజున; కున్ = కు; రాజు = రాజు యొక్క; అనుచరుల్ = అనుచరుల; కున్ = కు; తన = తన యొక్క; హోమధేనువున్ = యాగపు ఆవును; తడయక = ఆలస్యము చేయక; రప్పించి = తీసుకొని వచ్చి; ఇష్టాన్నములున్ = చక్కటి భోజనములు; కురియింపన్ = సుష్టిగా పెట్టగా; అతడు = అతడు; కుడిచి = తిని ,
కూర్చుండి = కూచుని; మొదవు = ఆవు; పైన్ = మీద; కోర్కిజేసి = కోరిక కలిగి; సంపద = ఉన్న సంపదలు; అదేల = అవన్నీ ఎందుకు; ఈ = ఈ; ఆవు = గోవు; చాలుగాక = చాలునుగాక; ఇట్టి = ఇలాంటి; గోవులన్ = ఆవులను; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగము = తెలియము; అనుచున్ = అని; పట్టితెండి = పట్టుకొచ్చేయండి; అని = అని; తమ = వారి; ఒద్ది = దగ్గరున్న; భటులన్ = సేవకులను; పనిచె = పంపించెను.
భావము:- ఆ మహారాజు ఒకనాడు వేటకి అడవికి వెళ్ళాడు. తిరిగి తిరిగి అలసిపోయి, నకనకలాడే ఆకలితో దైవఘటన వలన జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి నిలబడ్డాడు. ఆ ఋషీశ్వరుడు రాజుకు ప్రీతితో మర్యాదలు చేసాడు. తన హోమధేనువును శీఘ్రమే రప్పించి ఆ రాజుకి అనుచరులకి చక్కటి విందు భోజనాలు పెట్టించాడు. తినికూచున్న కార్తవీర్యునికి ఆ కామధేనువు మీద కోరిక కలిగింది. ఇలాంటి గోవు ఒక్కటుంటే చాలు కదా అనుకున్నాడు. ఆ గోవును పట్టి తెమ్మని భటులను ఆజ్ఞాపించాడు.

తెభా-9-439-వ.
పంచిన వారలు దర్పంబునం జని.
టీక:- పంచినన్ = పంపించగా; వారలు = వారు; దర్పంబునన్ = గర్వముతో; చని = వెళ్ళి.
భావము:- అలా రాజు పంపించగా భటులు గర్వముతో వెళ్ళి....

తెభా-9-440-క.
"క్రేపుం బాపకుఁ" డంచును
"నాదలం బడితి" మనుచు "నంబా" యనుచుం
"జూపోవరు నృపు" లంచును
వాపోవన్ మొదవుఁ గొనుచు చ్చిరి పురికిన్.2

టీక:- క్రేపున్ = దూడను; పాపకుడు = దూరము చేయకండి; అంచున్ = అంటు; ఆపదలన్ = ఆపదలలో; పడితిమి = పడిపోయాము; అనుచున్ = అనుచు; అంబా = అంబా; అనుచున్ = అంటు; చూపోరు = చూచి ఓర్వలేరు; నృపులు = రాజులు; అంచునున్ = అనుచు; వాపోవన్ = ఏడ్చుచుండగ; మొదవున్ = గోవును; కొనుచున్ = తీసుకుపోతూ; వచ్చిరి = చేరిరి; పురికిన్ = నగరికి.
భావము:- నన్ను దూడకు దూరం చేయకండి.” అంటు, “ప్రమాదంలో పడ్డానే” అంటూ, “రాజులు ఓర్వలేరు” అంటూ అంబా రావాలు చేస్తూ ఏడుస్తున్న గోవును తమ మహిష్మతీ నగరానికి లాక్కుపోసాగారు.

తెభా-9-441-వ.
అంత నర్జునుండు మహిష్మతీపురంబునకు వచ్చునెడ రాముండా శ్రమంబున కేతెంచి, తద్వృత్తాంతం బంతయు విని.
టీక:- అంతన్ = అంతట; అర్జునుండు = కార్తవీర్యార్జునుడు; మహిష్మతీ = మహిష్మతి యను; పురంబున్ = పురమున; కున్ = కు; వచ్చున్ = వచ్చుచుండెడి; ఎడన్ = సమయమున; రాముండు = పరశురాముడు; ఆశ్రమంబున్ = ఆశ్రమమున; కున్ = కు; ఏతెంచి = వచ్చి; తత్ = ఆ; వృత్తాంతబున్ = జరిగిన విషయము; అంతయున్ = అంతటిని; విని = విని.
భావము:- అలా కార్తవీర్యార్జునుడు మహిష్మతిపురం చేరుతున్న సమయానికి పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం విని.....

తెభా-9-442-ఆ.
"ద్దిరయ్య! యింట న్నంబు గుడిచి మా
య్య వల దనంగ నాక్రమించి
క్రొవ్వి రాజు మొదవు గొనిపోయినాఁ డంట
యేను రాముఁ డౌట యెఱుఁగఁ డొక్కొ.
"

టీక:- అద్దిరయ్య = ఔరా; ఇంటన్ = మా ఇంటిలో; అన్నంబు = భోజనము; కుడిచి = తిని; మా = మా యొక్క; అయ్య = తండ్రి; వలదు = వద్దు; అనగన్ = అన్నప్పటికి; ఆక్రమించి = దౌర్జన్యముచేసి; క్రొవ్వి = కొవ్వెక్కి; రాజు = రాజు; మొదవున్ = పశువును; కొనిపోయినాడు = పట్టుకుపోయాడు; అంట = అట; ఏను = నేను; రాముడన్ = రాముడను శూరుడు; ఔట = అయ్యుండుట; ఎఱుగడొక్క = తెలియడేమో.
భావము:- “ఔరా మా ఇంట్లో తిండి తిని మా తండ్రి వద్దన్నా వినకుండా రాజు నని గర్వించి దౌర్జన్యంగా మా కామధేనువును పట్టుకుపోతాడా? ఈ రాముడి సంగతి తెలియడేమో.”

తెభా-9-443-వ.
అని పలికి.
టీక:- అని = అని; పలికి = పలికి .
భావము:- అని పలికి.

తెభా-9-444-మ.
ప్రయాగ్నిచ్ఛట భంగిఁ గుంభి విదళింపం బాఱు సింహాకృతిం
బెలుచన్ రాముఁ డిలేశు వెంట నడచెం బృథ్వీతలంబెల్ల నా
కుమై క్రుంగఁ గుఠారియై కవచియై కోదండియై కాండియై
లియై సాహసియై మృగాజినమనోజ్ఞశ్రోణియై తూణియై.

టీక:- ప్రళయాగ్ని = ప్రళయకాలపు అగ్ని; ఛట = జ్వాలలు; భంగిన్ = వలె; కుంభిన్ = ఏనుగును {కుంభి – కుంభములు కలది, కరి}; విదళింపన్ = సంహరించుటకు; పాఱు = పలిగెట్టుతున్న; సింహ = సింహపు; ఆకృతిన్ = వంటి; పెలుచన్ = ఆవేశముతో; రాముడు = పరశురాముడు; ఇలేశున్ = రాజు; వెంటనడచెన్ = వెంటపడెను; పృథ్వీతలంబు = భూమండలము; ఎల్లన్ = అంతా; ఆకులము = వ్యాకులపడినది; ఐ = అయ్యి; క్రుంగన్ = కుంగిపోవునట్లు; కుఠారి = గండ్రగొడ్డలి కలవాడు; ఐ = అయ్యి; కవచి = కవచము కలవాడు; ఐ = అయ్యి; కోదండి = విల్లు కలవాడు; ఐ = అయ్యి; కాండి = బాణములు కలవాడు; ఐ = అయ్యి; ఛలి = పెంకితనము కలవాడు; ఐ = అయ్యి; సాహసి = సాహసము కలవాడు; ఐ = అయ్యి; మృగ = జింక; అజిన = చర్మముతో; మనోజ్ఞ = చక్కగా నున్న; శ్రోణి = నడుము కలవాడు; ఐ = అయ్యి; తూణి = అమ్ములపొది కలవాడు; ఐ = అయ్యి.
భావము:- కవచం, విల్లంబులు ధరించాడు; అంబులపొది మూపున కట్టుకున్నాడు; నడుము కున్న జింక చర్మం బిగించుకున్నాడు; గండ్రగొడ్డలి చేతిలో పట్టుకున్నాడు; పెంకితనంతో, సాహసంతో; భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ బయలుదేరాడు; ప్రళయకాలాగ్ని జ్వాల వలె, ఏనుగును చంపడానికి పరిగెట్టుతున్న సింహం వలె, పరశురాముడు రాజు వెంటపడ్డాడు.

తెభా-9-445-వ.
చని మహిష్మతీపురద్వారంబుఁ జేరి నిలుచున్న సమయంబున.
టీక:- చని = వెళ్ళి; మహిష్మతీ = మహిష్మతి; పుర = పురము యొక్క; ద్వారంబున్ = ప్రవేశమార్గమును; చేరి = చేరి; నిలుచున్న = నిలబడినట్టి; సమయంబున = సమయమునందు .
భావము:- అలా రోషంగా వెళ్ళి మహిష్మతీపురం చేరి నిలబడే సరికి...

తెభా-9-446-మ.
నియెన్ ముందటఁ గార్తవీర్యుఁడు సమిత్కాముం బ్రకామున్ శరా
తూణీర కుఠార భీము నతిరోప్రోచ్చలద్భ్రూయుగా
నేత్రాంచల సీము నైణపట నానామాలికోద్దాము నూ
సంరంభ నరేంద్రదార శుభసూత్రక్షామునిన్ రామునిన్.

టీక:- కనియెన్ = కనుగొనెను; ముందటన్ = ఎదురుగా; కార్తవీర్యుడు = కార్తవీర్యార్జునుడు; సమిత్ = యుద్ధమును; కామున్ = కోరుచున్నవాడు; ప్రకామున్ = చెలరేగుతున్నవాని; శరాసన = విల్లు; తూణీర = అంబులపొది; కుఠార = గొడ్డలితో; భీమున్ = భీకరమైనవాని; అతి = మిక్కిలి; రోష = రోషముతో; ప్ర = మిక్కిలి; ఉచ్చలత్ = చలించుచున్న; భ్రూయుగ = భృకుటి; ఆనన = మోము; నేత్రాంచల = కడగంటిచూపులు; సీమున్ = కలవానిని; ఏణ = జింక {ఏణ - పెద్ద కన్నులు కల నల్ల ఇఱ్ఱి, జింక}; పట = చర్మముతో; నానా = రకరకముల; మాలిక = మాలలుతో; ఉద్దామున్ = పరాక్రమవంతుని; నూతన = నవ; సంరంభ = ఉత్సాహముకల; నరేంద్ర = రాజుల; దార = భార్యల యొక్క; శుభసూత్ర = మంగళసూత్రములు; క్షామున్ = తొలగించెడివానిని; రామునిన్ = పరశురాముని.
భావము:- విల్లంబులు, గండ్రగొడ్డలి ధరించి మిక్కిలి రోషంతో చెలరేగుతూ భీకరంగా ఉన్నవాడిని, రకరకాల మాలలు ధరించి వచ్చిన వాడిని, మిడిసిపడే రాజుభార్యల మంగళసూత్రాలు తొలగించు వాడిని, కయ్యానికి కోరి ఎదురుగా వచ్చిన పరశురాముడిని కార్తవీర్యార్జునుడు కనుగొన్నాడు.

తెభా-9-447-వ.
కని కోపించి.
టీక:- కని = చూసి; కోపించి = కోపగించుకొని .
భావము:- అలా కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి ఆగ్రహించి.

తెభా-9-448-ఉ.
"బాలుఁడు వెఱ్ఱి బ్రాహ్మణుఁడు బ్రాహ్మణుకైవడి నుంట మాని భూ
పాలురతోడ భూరిబలవ్యులతోడ భయంబు దక్కి క
య్యాకు వచ్చినాఁడు మన యందిఁకఁ బాపము లేదు లెండులెం
డే సహింప భూసురుని నేయుఁడు వ్రేయుఁడు గూల్పుఁ డిమ్మహిన్."

టీక:- బాలుడు = పిల్లాడు; వెఱ్ఱి = తెలివితక్కువ; బ్రాహ్మణుడు = విప్రుడు; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుని; కైవడిన్ = వలె; ఉంటన్ = ఉండుట; మాని = మానివేసి; భూపాలుర = రాజుల; తోడన్ = తోటి; భూరి = అత్యధికమైన; బల = బలముతో; భవ్యుల = గొప్పవారి; తోడన్ = తోటి; భయంబున్ = భీతి; తక్కి = లేకుండగ; కయ్యాలు = యుద్ధమున; కున్ = కు; వచ్చినాడు = వచ్చాడు; మన = మన; అందు = వద్ద; ఇంక = ఇక; పాపము = తప్పు; లేదు = లేదు; లెండులెండు = లేవండి; ఏలసహింప = సహింప నక్కర లేదు; భూసురుని = బ్రహ్మణుని; ఏయుడు = కొట్టండి; వ్రేయండి = నరకండి; గూల్పుడు = కూలగొట్టండి; ఈ = ఈ; మహిని = నేలమీద.
భావము:- “తెలివితక్కువ బ్రాహ్మణపిల్లాడు. బ్రాహ్మణుడిలా పడి ఉండక తనకేదో గొప్ప బలం ఉందని గర్విస్తున్నాడు. నదురు బెదురు లేకుండా బలశాలురమైన మా వంటి రాజులతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మన తప్పు లేకుండా వచ్చి రెచ్చిపోతున్నాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటారేమిటి. లేవండి. ఈ బ్రాహ్మణుణ్ణి నేలకూల్చండి.”

తెభా-9-449-వ.
అని కదలించి దండనాయకులఁ బురికొల్పిన, వారు రథ గజ తురగ పదాతి సమూహంబులతో లెక్కకుం బదియేడక్షౌహిణులతో నెదురునడచి శర చక్ర గదాఖడ్గ భిండిపాల శూల ప్రముఖ సాధనంబుల నొప్పించిన నవ్విప్రవరుండు గన్నులకొలకుల నిప్పులుగుప్పలు కొన రెట్టించిన కట్టల్క మిట్టిపడి, యజ్ఞోపవీతంబు చక్కనిడికొని కరాళించి బిట్టు దట్టించి కఠోరం బగు కుఠారంబు సారించి మూఁకల పై కుఱికి, తొలకరి మొగంబునం గ్రొచ్చెలికపట్టునం జెట్టులు గొట్టు కృషీవలుని తెఱంగునఁ బదంబులు ద్రెంచుచుఁ, ననటికంబంబులఁ దెగనడచు నారామకారుని పగిది మధ్యంబులఁ ద్రుంచుచుఁ, దాళఫలంబులు రాల్చు వృక్షారోహకునికైవడి శిరంబులు ద్రుంచుచు, మృగంబుల వండం దుండించు సూపకారుని భంగి నవయవంబులం జెక్కుచు, నంతటం దనివిజనక విలయకాలకీలి కేలిని మంట లుమియుచు, విల్లంది యెల్లడం బిడుగుల సోనలు గురియు బలుమొగిళ్ళువడువున నప్రమాణంబు లగు బాణంబుల బఱపి, సుభటసైన్యంబుల దైన్యంబు నొందించుచు, నడ్డంబులేని యార్భాటంబులు గల బాణవర్షఘృతంబులతో రాహుతులం గోపానలంబున కాహుతులుచేయుచు, తురంగంబుల నిరంగంబులఁ గావించుచు, రథంబుల విశ్లథంబులఁగా నొనర్చుచు ద్విరదంబుల నరదంబులపైఁ బఱవం ద్రోలుచు నివ్విధంబున సేనల నంపవానల ముంచి రూపుమాపిన.
టీక:- అని = అని; కదలించి = బయలుదేరదీసి; దండనాయకులన్ = సేనానాయకులను; పురికొల్పినన్ = పురికొల్పగా; వారు = వారు; రథ = రథములు; గజ = ఏనుగులు; తురగ = గుఱ్ఱములు; పదాతి = కాల్బలముల; సమూహంబులు = సమూహముల; తోన్ = తోటి; లెక్కకు = లెక్కించినచో; పదియేడు = పదిహేడు (17); అక్షౌహిణుల్ = అక్షౌహిణుల {అక్షౌహిణి - 21,870 రథములు 21,870 ఏనుగులు 65,610 గుఱ్ఱములు 1,09,350 కాల్బలము కల సేనా సమూహము}; తోన్ = తోటి; ఎదురునడచి = ఎదుర్కొని; శర = బాణములు; చక్ర = చక్రములు; గదా = గదలు; ఖడ్గ = కత్తులు; భిండిపాల = విడిచివాటు గుదియ; శూల = శూలములు; ప్రముఖ = మున్నగు; సాధనంబులన్ = ఆయుధములతో; నొప్పించిన్ = కొట్టగా; ఆ = ఆ; విప్ర = బ్రాహ్మణ; వరుండు = ఉత్తముడు; కన్నులకొలంకుల = కడగంటి చూపులలో; నిప్పులు = నిప్పులు; కుప్పలుగొన = అధికముగా రాలుస్తూ; రెట్టించిన్ = ద్విగుణీకృతమైన; కట్ట = కటువైన; అల్క = కోపముతో; మిట్టిపడి = విజృంభించి; యజ్ఞోపవీతమున్ = జంధ్యమును; చక్కనిడికొని = చక్కబరచుకొని; కరాళించి = బొబ్బలు పెట్టి; బిట్టు = బాగా; దట్టించి = అదల్చి; కఠోరంబు = కఠోరమైనది; అగు = ఐన; కుఠారంబున్ = గండ్రగొడ్డలిని; సారించి = సాచిపెట్టి; మూకల = గుంపుల; పై = మీది; కిన్ = కి; ఉఱికి = ఉరికి; తొలకరి = తొలకరి జల్లులు; మొగంబునన్ = మొదలుకాగానే; గ్రొచ్చలికన్ = గునపముతో పెళ్ళగించుట; పట్టునన్ = మొదలు పెట్టి; చెట్టులు = మొక్కలు,తుప్పలు; కొట్టు = కొట్టివేసెడి; కృషీవలుని = రైతు; తెఱంగునన్ = వలె; పదంబులున్ = కాళ్ళు; త్రెంచుచున్ = తెగ్గొడుతూ; అనటి = అరటి; కంబంబులన్ = స్తంభములను; తెగనడచు = నరికివేసెడి; ఆరామకారుని = తోటమాలి; పగిదిన్ = వలె; మధ్యంబులన్ = నడుములు; త్రుంచుచున్ = విరగ్గొడుతు; తాళఫలంబులు = తాటికాయలు; రాల్చు = రాల్చివేసెడి; వృక్షారోహకుని = చెట్లెక్కువాని; కైవడిన్ = వలె; శిరంబులున్ = తలలు; త్రుంచుచున్ = ఖండిచుచు; మృగంబులన్ = జంతువులను; వండన్ = వండుటకు; తుండించు = తరిగెడి; సూపకారుని = వంటవాని; భంగిన్ = వలె; అవయవంబులన్ = అవయవములను; చెక్కుచున్ = తునుమాడుచు; అంతటన్ = దానితో; తనివిజనక = తృప్తి చెందక; విలయ = ప్రళయ; కాల = సమయపు; కీలి = అగ్ని; కేలిని = వలె; మంటలు = మంటలను; ఉమియుచున్ = కక్కుచు; విల్లు = కోదండము; అంది = అందిపుచ్చుకొని; ఎల్లెడలన్ = అన్ని చోట్లా; బిడుగుల = బిడుగుల; సోనలు = జల్లులు; కురియు = వర్షించెడి; పలుమొగిళ్ళు = కారుమేఘముల; వడువునన్ = వలె; అప్రాణంబులు = లెక్కలేనన్నివి; అగు = అయిన; బాణంబులన్ = బాణములను; పఱపి = వేసి; సుభట = కాల్బలముల; సైన్యంబులన్ = సైనికులను; దైన్యంబు = దురవస్థల; ఒందించుచు = పాలుజేస్తూ; అడ్డంబు = ఎదురు; లేని = లేనట్టి; ఆర్భాటంబులు = ఆటోపములు; కల = కలిగిన; బాణ = బాణముల; వర్ష = వర్షము అనెడి; ఘృతంబుల్ = నేతుల; తోన్ = తోటి; రాహుతులన్ = గుఱ్ఱపురౌతులను; కోప = కోపము అనెడి; అనలంబున్ = అగ్ని; కిన్ = కి; ఆహుతులు = కాల్చివేయుట; చేయుచున్ = చేస్తూ; తురంగంబులన్ = గుఱ్ఱములను; నిరంగంబులన్ = అంగములు తెగినవిగ; కావించుచు = చేస్తూ; రథంబులన్ = రథములను; విశ్లదంబులన్ = బాగా శిథిలమైనవిగ; ఒనర్చుచున్ = చేస్తూ; ద్విరదంబులన్ = ఏనుగులను; అరదంబుల = రథముల; పైన్ = మీదికి; పఱవన్ = పరుగెట్టునట్లు; త్రోలుచున్ = తోలుతూ; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; సేనలన్ = సేనలను; అంప = బాణ; వానలన్ = వానలతో; ముంచి = ముంచేసి; రూపుమాపిన = నశింపజేయగా.
భావము:- అని కార్తవీర్యుడు దండనాయకులను పురికొల్పాడు. వారు పదిహేడు అక్షౌహిణుల చతురంగ బలాలతో ఎదుర్కొన్నారు. పరశురాముడిని బాణాలు, చక్రాలు, గదలు, కత్తులు, గుదియలు, శూలాలు లాంటి రకరకాల ఆయుధాలతో దాడిచేసారు. అతను కడగంట నిప్పులు రాలుస్తూ రెట్టించిన రోషంతో విజృంభించి జంధ్యం చక్కబరచుకొన్నాడు. బొబ్బలుపెడుతూ అదల్చి, కఠోరమై తన గండ్రగొడ్డలిని సాచిపెట్టి గుంపుల మీదికి ఉరికాడు. తొలకరిజల్లులు పడగానే గునపంతో తుప్పలు పెళ్ళగించే రైతులా, వారి కాళ్ళు తెగ్గొడుతూ, అరటి స్తంభాలను నరికే తోటమాలిలా, నడుములు విరగ్గొడుతూ, చెట్లెక్కి తాటికాయలు రాల్చే వాడిలా, తలలు నేలరాలుస్తూ, మాంసాలు తునిమే వంటవాడిలా, అవయవాలు తునుమాడ సాగాడు. అంతటితో తృప్తిచెందక ప్రళయ కాలాగ్నిలా మంటలు కక్కుతూ కోదండం పట్టి పిడుగుల జల్లులు వర్షించె కారుమేఘంలా లెక్కలేనన్ని బాణాలు వేసి, సైన్యాన్ని దురవస్థల పాలుజేశాడు. ఎదురులేని బాణ వర్షాలు కురిపించి గుఱ్ఱపురౌతులను ఆహుతి చేస్తూ, గుఱ్రాలను తునుమాడాడు. రథాలను కూల్చాడు. ఏనుగులను రథాల పైకి తోలాడు. ఈ విధముగ సేనలను బాణవర్షాలతో ముంచి రూపుమాపాడు.

తెభా-9-450-క.
త్తిల్లి భూతజాలము
చిత్తంబులఁ జొక్కి వేడ్కఁ జిందులుబాఱన్
జొత్తిల్లి సమిత్తలమున
నెత్తురు మేదంబు పలలనికరం బయ్యెన్.

టీక:- మత్తిల్లి = మత్తెక్కి; భూత = పిశాచ; జాలమున్ = గణములు; చిత్తంబులన్ = మనసులలో; చొక్కి = సోలి; వేడ్కన్ = సంతోషములతో; చిందుల = చిందులు; పాఱన్ = తొక్కగ; జొత్తిల్లి = ఎఱ్ఱబారిపోయి; సమిత్ = యుద్ధ; తలమునన్ = రంగము నందు; నెత్తురున్ = రక్తము; మేదంబు = మెదళ్ళు; పలల = మాంసముల; నికరంబున్ = నిండినది; అయ్యెన్ = అయినది.
భావము:- అప్పుడు, యుద్ధ రంగం రక్తంతో ఎఱ్ఱబారిపోయింది. మెదళ్ళు మాంసాల నిండింది. పిశాచాలు మత్తెక్కి ఆనందపారవశ్యంతో సోలి, సంతోషంతో చిందులు తొక్కాయి.

తెభా-9-451-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు .
భావము:- అలా పరశురాముడు తన సైన్యంతో సహా దండనాయకులను పరిమార్చినప్పుడు.

తెభా-9-452-క.
"మేలీ బ్రాహ్మణుఁ డొక్కఁడు
నేలం బడఁగూల్చె సైన్యనిచయము నెల్లన్
బాలార్ప నేల యీతనిఁ
దూలించెదఁగాక నాదు దోర్బలము వడిన్."

టీక:- మేలు = బాగు బాగు; ఈ = ఈ; బ్రాహ్మణుడు = విప్రుడు; ఒక్కడున్ = ఒక్కడే; నేలబడగూల్చెన్ = నేలకూల్చినాడు; సైన్య = సేనానాయకులను; నిచయమున్ = సమూహముల; ఎల్లన్ = అన్నిటిని; పాలార్పన్ = ఉపేక్ష చేయుట; ఏల = ఎందుకు; ఈతనిన్ = ఇతనిని; తూలించెదగాక = సంహరించెదను; నాదు = నా యొక్క; దోర్బలము = భుజబలము యొక్క; వడిన్ = శక్తి తోటి.
భావము:- కార్తవీర్యుడు “బాగు! బాగు! ఈ విప్రుడు ఒక్కడే ఇంత సేను నేలకూల్చాడు. ఇంక ఉపేక్ష చేయరాదు. నా భుజబలంతో ఇతగాడిని సంహరిస్తాను.”

తెభా-9-453-వ.
అని పలికి
టీక:- అని = అని; పలికి = అనుకొని .
భావము:- అని అనుకొన్నాడు ఆ రాజు.

తెభా-9-454-మ.
యేనూఱుకరంబులన్ ధనువు లత్యుల్లాసియై తాల్చి వే
ఱొ యేనూట గుణధ్వనుల్ నిగుడ శాతోగ్రాస్త్రముల్ గూర్చి "వి
ప్ర! కుఠారంబును నిన్నుఁ గూల్తు" ననుచున్ ర్జించి పుంఖానుపుం
ఠోరంబుగ నేసి యార్చె రయరేఖా ధామునిన్ రామునిన్.

టీక:- ఒక = ఒక; ఏనూఱు = ఐదువందల (500); కరంబులన్ = చేతులతో; ధనువులు = విల్లులను; అతి = మిక్కిలి; ఉల్లాసి = ఉత్సాహముకలవాడు; ఐ = అయ్యి; తాల్చి = ధరించి; వేఱొక = మరొక; ఏనూటన్ = ఐదువందలతో(500); గుణ = అల్లెతాళ్ల; ధ్వనుల్ = శబ్దములు; నిగుడన్ = వెలువడునట్లుగా; శాత = వాడియైన; ఉగ్ర = భీకరమైన; అస్త్రముల్ = బాణములు; కూర్చి = సంధించి; విప్ర = బ్రాహ్మణ; కుఠారంబున్ = గొడ్డలిని; నిన్నున్ = నిన్ను; కూల్చున్ = నేలకూల్చెదను; అనుచున్ = అంటూ; భర్జించి = బెదిరించి; పుంఖానుపుంఖ = ఎడతెరపిలేనిబాణాల {పుంఖాను పుంఖము - పుంఖము (బాణము వెనుక పంజె) తరువాత పుంఖముగ, ఎడతెరపిలేని బాణ ప్రయోగము}; కఠోరంబుగన్ = గట్టిగ; ఏసి = ప్రయోగించి; ఆర్చెన్ = గర్జించెను; రయరేఖాధామునిన్ = వడికి మారుపేరైనవాని; రామునిన్ = పరశురాముడిని.
భావము:- ఉత్సాహంతో ఐదువందల చేతులతో ఐదువందల ధనుస్సులు పట్టుకున్నాడు. మిగిలిన ఐదువందల చేతులతో అల్లెతాళ్ల టంకారాలు చేసాడు. అన్ని విల్లులకు వాడి బాణాలు సంధించాడు. “ఓ బ్రాహ్మణా! గొడ్డలిని నిన్ను నేలకూల్చేస్తాను.” అంటూ బెదిరించి, వడికి మారుపేరైన పరశురాముడి మీద ఎడతెరపి లేకండా బాణాలు వేసి గర్జించాడు.

తెభా-9-455-క.
డిఁదూపు లెగయ గుడుసులు
డి కార్ముకపంచశతము రగ విభుఁడు సొం
రెఁ బరివేషమండలి
డుమఁ గరద్యుతుల వెలయు ళినాప్తు క్రియన్.

టీక:- వడిన్ = వేగముగా; తూపులు = బాణములు; ఎగయన్ = ఏగురుగ; గుడుసులుపడి = చుట్టుముట్టబడి; కార్ముక = విల్లులు; పంచశతమున్ = ఐదువందలు (500); పరగన్ = వేయగా; విభుడు = గొప్పవాడు; సొంపు = చక్కదనము; అడరన్ = అతిశయించగ; పరివేషమండలి = గుడికట్టి; నడుమన్ = మధ్యనున్న; కర = కిరణముల; ద్యుతులన్ = కాంతులతో; వెలయు = ప్రకాశించెడి; నళినాప్తు = సూర్యుని {నళినాప్తుడు - పద్మములకు బంధువు, సూర్యుడు}; క్రియన్ = వలె .
భావము:- అతి వేగముగా ఐదువందల బాణములు గుత్తగుచ్చినట్లు అర్జునుడు వేసాడు. గుడికట్టి కిరణాలతో ప్రకాశించే సూర్యుడిలా, ఆ బ్రాహ్మణ బాలుడు గొప్పగా ప్రకాశించసాగాడు.

తెభా-9-456-వ.
ఇట్లర్జునుండు బాహువిలాసంబు చూపిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అర్జునుండు = కార్తవీర్యార్జునుడు; బాహు = చెయ్వుల; విలాసంబున్ = నేర్పును; చూపినన్ = చూపించగ .
భావము:- ఈ మాదిరి కార్తవీర్యార్జునుడు తన హస్తనైపుణ్యం చూపించగా....

తెభా-9-457-మ.
ణీదేవుఁడు రాముఁ డాఢ్యుఁడు జగద్ధానుష్కరత్నంబు దు
ష్క చాపం బొక టెక్కుపట్టి శరముల్ సంధించి పెల్లేసి భూ
రు కోదండము లొక్కచూడ్కిఁ దునిమెన్ వాఁడంతటం బోక వే
రువుల్ ఱువ్వఁ గుఠారధార నఱకెం ద్బాహుసందోహమున్.

టీక:- ధరణీదేవుడు = విప్రుడు; రాముడు = పరశురాముడు; ఆఢ్యుడు = శ్రేష్ఠుడు; జగత్ = లోకములోని; ధానుష్క = విలుకాళ్ళలో; రత్నంబు = మేటి; దుష్కర = భీకరమైన; చాపంబున్ = విల్లు; ఒకటిన్ = ఒకదానిని; ఎక్కుపెట్టి = ఎక్కుపెట్టి; శరముల్ = బాణములు; సంధించి = సంధించి; పెల్లు = గట్టిగా; ఏసి = ప్రయోగించి; భూవరు = రాజు యొక్క; కోదండములు = విల్లులను; ఒక్కచూడ్కిన్ = ఒక్కసారిగా; తునిమెన్ = తుత్తునియలుచేసెను; వాడు = అతడు; అంతటన్ = దానితో; పోక = పారిపోక; వేన్ = వేగముగా; తరువుల్ = చెట్లను; ఱువ్వన్ = విసరగా; కుఠార = గొడ్డలి; ధారన్ = అంచుతో; నఱకెన్ = నరికివేసెను; తత్ = అతని; బాహు = చేతుల; సందోహమున్ = సమస్తమును.
భావము:- విప్రశ్రేష్ఠుడు పరశురాముడు లోకభీకరమైన విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించి రాజు విల్లులు ఐదువందలూ ఒక్కసారిగా తునిమేసాడు. కార్తవీర్యుడు అంతటితో వదలక రాముడి మీదకు చెట్లు పెరికి విసరసాగాడు. రాముడు గొడ్డలితో అతని చేతులన్నీ నరికేసాడు.

తెభా-9-458-క.
ములు దునిసిన నతనికి
శి మొక్కటి చిక్క శైలశిఖరముభంగిం
శువున నదియుఁ ద్రుంచెను
సూదనుఁ డైన ఘనుఁడు భార్గవుఁడు వడిన్.

టీక:- కరములున్ = చేతులు; తునిసినన్ = తెగిపోయిన; అతని = అతని; కిన్ = కి; శిరము = తల; ఒక్కటి = ఒకటే; చిక్కన్ = మిగలగా; శైల = కొండ; శిఖరము = శిఖరము; భంగిన్ = వలె; పరశువన్ = గొడ్డలితో; అదియున్ = దానినికూడ; త్రుంచెను = నరికివేసెను; పర = శత్రువలను; సూదనుడు = నాశనము చేయువాడు; ఐన = అయినట్టి; ఘనుడు = గొప్పవాడు; భార్గవుడు = పరశురాముడు {భార్గవుడు - భృగుమహర్షి వంశపు వాడు, పరశురాముడు}; వడిన్ = శ్రీఘ్రమే.
భావము:- అర్జునుడు చేతులు తెగిపోయి కొండశిఖరంలా ఉండగా, మిగిలిన అతడి తల ఒక్కటే మిగిలిపోతే శత్రుసంహారకుడైన పరశురాముడు గొడ్డలితో దానిని కూడ నరికేసాడు.

తెభా-9-459-ఆ.
తండ్రి పడిన నతని నయులు పదివేలు
లఁగిపోయి రతనిఁ దాకలేక
రభయంకరుండు భార్గవుం డంత నా
గోవుఁ గ్రేపుతోడఁ గొనుచుఁ జనియె.

టీక:- తండ్రి = తండ్రి; పడినన్ = మరణించగా; అతని = అతని యొక్క; తనయులు = పుత్రులు; పదివేలు = పదివేలమంది (10,000); తలగిపోయిరి = తొలగిపోయిరి; అతని = అతని యొక్క; తాకలేక = ఎదిరించలేక; పర = శత్రువలకు; భయంకరుండు = భయముకలిగించువాడు; భార్గవుండు = పరశురాముడు; అంతన్ = అప్పుడు; ఆ = ఆ; గోవున్ = ఆవును; క్రేపు = దూడ; తోడన్ = తోబాటు; కొనుచున్ = తీసుకొని; చనియెన్ = పోయెను .
భావము:- తండ్రి మరణించగా అతని పుత్రులు పదివేలమంది అతనిని ఎదిరించలేక తలో దిక్కూ పారిపోయారు. శత్రుభయంకరుడు పరశురాముడు అప్పుడు తమ కామధేనువు దూడ తోబాటు ఆశ్రమానికి తీసుకొని పోయాడు.

తెభా-9-460-వ.
ఇట్లు హోమధేనువు మరలం దెచ్చియిచ్చి తన పరాక్రమంబు దండ్రి దోబుట్టువులకుం దెలియం జెప్పిన జమదగ్ని రామున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హోమధేనువున్ = యజ్ఞగోవును; మరలన్ = వెనుకకు; తెచ్చి = తీసుకువచ్చి; ఇచ్చి = ఇచ్చి; తన = తన యొక్క; పరాక్రమంబున్ = పరాక్రమమును; తండ్రి = తండ్రికి; తోబుట్టువుల్ = సోదరుల; కున్ = కు; తెలియచెప్పినన్ = వివరించగా; జమదగ్ని = జమదగ్ని; రామున్ = పరశురాముని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా యాగధేనువునును తిరిగి తెచ్చి ఇచ్చి తన పరాక్రమాన్ని తండ్రికి సోదరులకు వివరించగా, జమదగ్ని పరశురామునితో ఇలా అన్నాడు.

తెభా-9-461-క.
"కవేల్పు లెల్లఁ దమతమ
చెలువంబులు దెచ్చి రాజుఁ జేయుదు రకటా!
లువేల్పు రాజు వానిం
ముననిట్లేల పోయి చంపితి పుత్రా!

టీక:- కలవేల్పులు = ఉన్న అందరు దేవతలు; తమతమ = వారి వారి; చెలువంబులున్ = అంశములను; తెచ్చి = తీసుకొని వచ్చి; రాజున్ = రాజును; చేయుదురు = పుట్టించెదరు; అకట = అయ్యో; పలు = అనేక; వేల్పు = దేవతల స్వరూపి; రాజు = రాజు; వానిన్ = అట్టివానిని; చలమునన్ = పంతముపట్టి; ఇట్లు = ఇలా; ఏల = ఎందుకు; పోయి = వెళ్లి; చంపితి = చంపివేసితివి; పుత్రా = కుమారా.
భావము:- “అయ్యో! కుమారా! అందరు దేవతలు తమ అంశాలు తెచ్చి రాజును పుట్టిస్తారు. అలాంటి సర్వ దేవతాస్వరూపి రాజును పంతముపట్టి చంపేసావు కదా.

తెభా-9-462-క.
తాలిమి మనకును ధర్మము
తాలిమి మూలంబు మనకు న్యత్వమునం
దాలిమి గలదని యీశుం
డేలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్.

టీక:- తాలిమి = ఓర్పు; మన = మన; కును = కు; ధర్మము = విధించిన ధర్మము; తాలిమి = ఓర్పు; మూలంబునన్ = వలన; మన = మన; కున్ = కు; ధన్యత్వమున్ = పుణ్యవంతముతో; తాలిమి = ఓర్పు; కలదు = ఉన్నది; అని = అని; ఈశుండున్ = భగవంతుడు; ఏలించున్ = చెందనిచ్చును; బ్రహ్మపదమున్ = బ్రహ్మపదవిని; ఎల్లను = అంతటిని; మనలన్ = మనలను.
భావము:- మునులమైన మనకు విధించిన ధర్మం ఓర్పు, క్షమ. దాని వలన మనకు పుణ్యం వస్తుంది. క్షమ కలిగి ఉండుట చేతనే సర్వేశ్వరుడు మనకు బ్రహ్మపదంలో నిలుపుతాడు.

తెభా-9-463-క.
క్ష గలిగిన సిరి గలుగును
క్ష గలిగిన వాణి గలుగు సౌరప్రభయున్
క్ష గలుగఁ దోన కలుగును
క్ష గలిగిన మెచ్చు శౌరి దయుఁడు దండ్రీ!

టీక:- క్షమ = ఓరిమి; కలిగిన = ఉన్నచో; సిరి = సంపదలు; కలుగును = కలుగుతాయి; క్షమ = తాలిమి; కలిగిన = ఉన్నచో; వాణి = విద్య; కలుగున్ = అబ్బును; సౌర = సూర్యుడు అంతటి; ప్రభయున్ = ప్రకాశము; క్షమ = తాలిమి; కలుగన్ = ఉన్నచో; తోనన్ = దానితోపాటు; కలుగును = కలుగును; క్షమ = తాలిమి; కలిగిన = ఉన్నచో; మెచ్చు = సంతోషించును; శౌరి = విష్ణువు {శౌరి - శూరుని యొక్క మనుమడు, విష్ణువు}; సదయుండు = దయామయుడు; తండ్రి = నాయనా.
భావము:- నాయనా! ఓరిమి ఉంటేనే సంపదలు కలుగుతాయి. తాలిమి ఉంటేనే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటేనే సూర్యుడంతటి ప్రకాశం కలుగుతుంది. క్షమ కలిగి ఉంటే దయామయుడు విష్ణుమూర్తి సంతోషిస్తాడు.

తెభా-9-464-క.
ట్టపురాజును జంపుట
ట్టలుకన్ విప్రుఁ జంపు కంటెను బాపం
ట్టిట్టనకుము నీవీ
చెట్టజెడం దీర్థసేవచేయుము దనయా!"

టీక:- పట్టపు = అభిషిక్తుడైన; రాజును = రాజును; చంపుట = సంహరించుట; కట్ట = అతి; అలుకన్ = కోపముతో; విప్రున్ = బ్రాహ్మణుని; చంపు = సంహరించుట; కంటెను = కంటెకూడ; పాపంబు = పాపము; అట్టిట్టనకుము = మారు చెప్పకుము; నీవున్ = నీవు; ఈ = ఈ; చెట్టన్ = పాపము; చెడన్ = పోవునట్లుగ; తీర్థ = పుణ్యతీర్థములను; సేవన్ = సేవించుట; చేయుము = చేయుము; తనయా = కుమారా.
భావము:- కుమారా! అభిషిక్తుడైన రాజుని చంపడం, బ్రహ్మహత్యా పాతకం కంటె మహా పాపం. ఇంక మారుమాట్లాడకుండా. నీవు ఈ పాపం పోడానికి పుణ్యతీర్థాలు సేవించు.”

తెభా-9-465-క.
ని తన్నుఁ దండ్రి పనిచినఁ
నిపూని ప్రసాద మనుచు భార్గవుఁడు రయం
బు నొకయేఁడు ప్రయాణము
ని తీర్థము లెల్ల నాడి నుదెంచె నృపా!

టీక:- అని = అని; తన్నున్ = తనను; తండ్రి = తండ్రి; పనిచినన్ = ఆనతిచ్చిన; పనిపూని = భాద్యత వహించి; ప్రసాదము = అనుగ్రము; అనుచున్ = అనుచు; భార్గవుడు = పరశురాముడు; రయంబునన్ = వేగముగ; ఒక = ఒక (1); ఏడు = సంవత్సరము పాటు; ప్రయాణము = ప్రయాణములు; చని = వెళ్లి; తీర్థములున్ = పుణ్యతీర్థములు; ఎల్లన్ = అన్నిటను; ఆడి = సేవించి; చనుదెంచె = వచ్చెను; నృపా = రాజా.
భావము:- రాజా పరీక్షిత్తూ! అలా తండ్రి ఆజ్ఞాపించగా, పరశురాముడు మహాప్రసాదం అంటూ వేగంగా ప్రయాణిస్తూ ఒక ఏడాదిపాటు పుణ్యతీర్థాలు అన్ని సేవించి వచ్చాడు.

తెభా-9-466-ఉ.
యెడ నొక్కనాఁడు సలిలార్థము రేణుక గంగలోనికిం
బోయి ప్రవాహమధ్యమునఁ బొల్పుగ నచ్చరలేమపిండుతోఁ
దోవిహారముల్ సలుపు దుర్లభుఁ జిత్రరథున్ సరోజమా
లాయుతుఁ జూచుచుండెఁ బతి యాజ్ఞ దలంపక కొంత ప్రేమతోన్.

టీక:- ఆ = ఆ; ఎడన్ = సమయమునందు; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; సలిల = మంచినీటి; అర్థమున్ = కోసము; రేణుక = రేణుక; గంగ = గంగానది; లోని = లోపలి; కిన్ = కి; పోయి = వెళ్ళి; ప్రవాహము = నది; మధ్యమునన్ = నడుమ; పొల్పుగన్ = చక్కగ; అచ్చర = అప్సరస; లేమల = స్త్రీల; తోన్ = తోటి; తోయ = జల; విహారముల్ = క్రీడలు; సలుపు = చేయుచున్న; దుర్లభున్ = అందరానివాడు; చిత్రరథున్ = చిత్రరథుని; సరోజ = పద్మముల; మాలా = మాల; ఆయుతున్ = కలవానిని; చూచుచుండె = చూస్తూ ఉండిపోయెను; పతి = భర్త; ఆజ్ఞన్ = ఆనతిని; తలంపక = మరచిపోయి; కొంత = కొంచము; ప్రేమ = ప్రేమ; తోన్ = తోటి.
భావము:- పిమ్మట ఒకనాడు మంచినీటికి జమదగ్ని భార్య రేణుక గంగానదికి వెళ్ళింది. భర్త ఆనతిని మరచి, నదిలో తామరపూల మాల ధరించి అప్సరసలతో క్రీడిస్తున్న గంధర్వుడు చిత్రరథుని చూస్తూ ఉండిపోయింది.

తెభా-9-467-వ.
ఇట్లు గంధర్వవల్లభునిం జూచు కారణంబున దడసి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; గంధర్వ = గంధర్వుల; వల్లభున్ = రాజును; చూచు = చూసిన; కారణంబునన్ = కారణముచేత; తడసి = ఆలస్యముఅయ్యి .
భావము:- ఈ విధంగ గంధర్వరాజును చూసిన కారణంచేత ఆలస్యం అయింది.

తెభా-9-468-ఉ.
"క్కట వచ్చి పెద్దతడ య్యెను; హోమమువేళ దప్పె; నే
నిక్కడనేల యుంటి; ముని యేమనునో"యని భీతచిత్త యై
గ్రక్కునఁ దోయకుంభము శిస్థలమందిడి తెచ్చియిచ్చి వే
మ్రొక్కి కరంబు మోడ్చి పతి ముందట నల్లన నిల్చె నల్కుచున్.

టీక:- అక్కట = అయ్యో; వచ్చి = ఇక్కడకువచ్చి; పెద్ద = చాలా; తడవు = సమయము; అయ్యెను = గడచిపోయినది; హోమము = హోమము చేసెడి; వేళ = సమయము; తప్పెన్ = దాటిపోయినది; నేన్ = నేను; ఇక్కడ = ఇక్కడ; ఏలన్ = ఎందుకు; ఉంటిన్ = ఉండిపోతిని; ముని = ఋషి; ఏమి = ఏమి; అనునో = దెబ్బలాడునో; అని = అని; భీత = భయము చెందిన; చిత్త = మనసు కలామె; ఐ = అయ్యి; క్రక్కునన్ = గబుక్కున; తోయ = నీటి; కుంభమున్ = కుండను; శిరస్థలము = తలపై; ఇడి = ఉంచి; తెచ్చి = తీసుకొని వచ్చి; ఇచ్చి = ఇచ్చి; వే = వేగముగ; మ్రొక్కి = నమస్కరించి; కరంబున్ = చేతులు; మోడ్చి = జోడించి; పతి = భర్త; ముందటన్ = ఎదురుగ; నల్లన = మెల్లిగ; నిల్చెన్ = నిలబడెను; అల్కుచున్ = బెదురుతూ.
భావము:- “అయ్యో! ఇక్కడకు వచ్చి చాలాసేపు అయింది. హోమం చేసే సమయం దాటిపోయింది. నేను ఎందుకిలా ఉండిపోయాను. ఋషి ఏమంటాడో?” అని రేణుక భయపడింది. వెంటనే నీటికుండ నెత్తికెత్తుకు వచ్చింది. భర్త ఎదురుగ చేతులు జోడించి బెదురుతూ నిలబడింది.

తెభా-9-469-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు .
భావము:- అలా నీటికుండను తెచ్చి రేణుక బెదురుతూ నిలబడునప్పుడు.

తెభా-9-470-క.
చిత్తమున భార్య దడసిన
వృత్తాంతం బెఱిఁగి తపసి వేకని సుతులన్
"మత్తం దీనిం జావఁగ
మొత్తుం"డన మొత్తరైరి మునుకుచు వారల్.

టీక:- చిత్తమునన్ = మనసు నందు; భార్య = పెండ్లాము; తడసిన్ = జాగుచేసిన; వృత్తాంతంబున్ = సంగతిని; ఎఱిగి = తెలిసికొని; తపసి = ముని; వేన్ = శీఘ్మముగా; కని = చూసి; సుతులన్ = పుత్రులను; మత్తన్ = మదించిన; దీనిన్ = ఈమెను; చావగన్ = చచ్చేటట్టు; మొత్తుండు = కొట్టండి; అనన్ = అనగా; మొత్తరు = చంపకుండని వారు; ఐరి = అయ్యిరి; మునుకుచున్ = బాధపడిపోతూ; వారల్ = వారు.
భావము:- ముని భార్య జాగుచేసిన సంగతి గ్రహించాడు. జమదగ్ని కొడుకులతో “మదించిన ఈమెను చావగొట్టండి.” అన్నాడు. వారు దుఃఖిస్తూ తల్లిని చంపలేకపోయారు.

తెభా-9-471-క.
కొడుకులు పెండ్లముఁ జంపమిఁ
గొడుకులఁ బెండ్లాముఁ జంప గురు డానతి యీ
డుగులకు నెఱిఁగి రాముం
డుగిడకుండంగఁ ద్రుంచె న్నలఁ దల్లిన్.

టీక:- కొడుకులున్ = కుమారులు; పెండ్లామున్ = భార్యను; చంపమిన్ = చంపక పోవుటచేత; కొడుకులన్ = పుత్రులను; పెండ్లామున్ = భార్యను; చంపన్ = సంహరించమని; గురుడు = తండ్రి {గురువు - 1ఉపాధ్యాయుడు 2బృహస్పతి 3కులముపెద్ద 4తండ్రి 5తండ్రితోడబుట్టినవాడు 6తాత 7అన్న 8పిల్లనిచ్చిన మామ 9మేనమామ 10 రాజు 11కాపాడువాడు}; ఆనతి = ఆజ్ఞ; ఈన్ = ఇవ్వగా; అడుగుల్ = కాళ్ళ; కున్ = కు; ఎఱిగి = మొక్కి; రాముండు = పరశురాముడు; అడుగిడకుండగన్ = వెనుదీయక; త్రుంచెన్ = చంపెను; అన్నలన్ = అన్నలను; తల్లిన్ = తల్లిని;
భావము:- పుత్రులు భార్యను చంపకపోవడంతో, పుత్రులను భార్యను సంహరించమని తండ్రి ఆజ్ఞాపించగా, కాళ్ళకు మ్రొక్కి రాముడు వెనకాడక అన్నలను తల్లిని ఖండించాడు.

తెభా-9-472-శా.
ల్లిన్ భ్రాతల నెల్లఁ జంపు మనుచోఁ దాఁ జంపి రాకున్నఁ బెం
పెల్లంబోవ శపించుఁ దండ్రి తన పంపేఁ జేయుడున్ మెచ్చి దా
ల్లిన్ భ్రాతల నిచ్చు నిక్కము తపోన్యాత్మకుం డంచు వే
ల్లిన్ భ్రాతలఁ జంపె భార్గవుఁడు లేదా చంపఁ జేయాడునే?

టీక:- తల్లిన్ = తల్లిని; భ్రాతలన్ = సోదరులను; ఎల్లన్ = అందరను; చంపుము = సంహరించుము; అనుచో = అన్నప్పుడు; చంపి = సంహరించి; రాకున్నా = రాకపోతే; పెంపు =వృద్ధి; ఎల్లన్ = అంతా; పోవన్ = పోవునట్లు; శపించున్ = శాపము పెట్టును; తండ్రి = తండ్రి; తన = అతను; పంపే = చెప్పినట్లే; చేయుడున్ = చేయుటవలన; మెచ్చి = మెచ్చుకొని; తాన్ = అతనే; తల్లిన్ = తల్లని; భ్రాతలన్ = సోదరులను; ఇచ్చున్ = తిరిగి ఇచ్చును; నిక్కము = ఇది తథ్యము; తపస్ = తపస్సుచేత; ధన్యాత్మకుండు = పుణ్యాత్ముడు; అంచున్ = అనుకొని; వేన్ = వెంటనే; తల్లిన్ = తల్లిని; భ్రాతలన్ = సోదరులను; చంపెన్ = సంహరించెను; భార్గవుడు = పరశురాముడు; లేదా = అలాకాకపోతే; చంపన్ = సంహరించుటకు; చేయాడునే = చెయ్యి వస్తుందా.
భావము:- తల్లిని సోదరులను సంహరించు అని ఆజ్ఞాపించినప్పుడు వినకపోతే తండ్రి శపిస్తాడు. ఆయన చెప్పినట్లే చేస్తే మెచ్చుకొని, మహా తపశ్శాలి అయిన ఆయనే తల్లిని సోదరులను తిరిగి తప్పక బ్రతికిస్తాడు. అనుకొని పరశురాముడు తల్లిని అన్నలను సంహరించాడు తప్ప, లేకపోతే చంపడానికి చెయ్యి వస్తుందా?

తెభా-9-473-వ.
ఇవ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ .
భావము:- ఈ విధంగా.

తెభా-9-474-క.
డ్డము జెప్పక కడపటి
బిడ్డఁడు రాముండు సుతులఁ బెండ్లము నచటన్
గొడ్డంటం దెగ నడచిన
డ్డనఁ దలయూఁచి మెచ్చె మదగ్ని మదిన్.

టీక:- అడ్డము = అడ్డము; చెప్పక = చెప్పకుండగ; కడపటి = ఆఖరి; బిడ్డడున్ = పిల్లవాడు; రాముండు = పరశురాముడు; సుతులన్ = కుమారులను; పెండ్లామున్ = భార్యను; అచటన్ = అప్పుడు; గొడ్డంటన్ = గొడ్డలితో; తెగనడచినన్ = తెగనరకగా; జడ్డన్ = గబుక్కున; తల = శిరస్సు; ఊచి = ఊపి; మెచ్చెన్ = మెచ్చుకొనెను; జమదగ్ని = జమదగ్ని; మదిన్ = మనసునందు .
భావము:- అడ్డము చెప్పకుండా, కడగొట్టు పిల్లవాడు పరశురాముడు భార్యను కొడుకులను గొడ్డలితో నరకగా చూసి తలూపి జమదగ్ని మెచ్చుకున్నాడు.

తెభా-9-475-క.
మెచ్చిన తండ్రిని గనుఁగొని
చెచ్చెర "నీ పడినవారి జీవంబులు నీ
విచ్చితి"నను మని మ్రొక్కిన
నిచ్చెన్ వారలును లేచి రెప్పటి భంగిన్.

టీక:- మెచ్చిన = మెచ్చుకున్న; తండ్రిని = తండ్రిని; కనుగొని = చూసి; చెచ్చెరన్ = వెంటనే; ఈ = ఈ; పడిన = చనిపోయిన; వారి = వారి యొక్క; జీవంబులున్ = ప్రాణములు; నీవున్ = నీవు; ఇచ్చితిని = ఇచ్చాను; అనుము = అనవలసినది; అని = అని; మ్రొక్కినన్ = ప్రార్థించగా; ఇచ్చెన్ = తిరిగి ఇచ్చివేసెను; వారలునున్ = వారును; లేచిరి = లేచి నిలబడిరి; ఎప్పటి = ఎప్పటి; భంగిన్ = లాగనే.
భావము:- అలా మెచ్చుకొన్న తండ్రి జమదగ్నిని రాముడు, “ఇలా చనిపోయిన వీరి ప్రాణాలు ప్రసాదించు.” అని ప్రార్థించాడు. ఆయన వారి ప్రాణాలు తిరిగి అనుగ్రహించాడు. వారు ఎప్పటిలా లేచి నిలిచారు.

తెభా-9-476-ఆ.
డినవారి మరల బ్రతికింప నోపును
నకుఁ డనుచుఁ జంపె జామదగ్న్యుఁ
తఁడు చంపె ననుచు న్నలఁ దల్లిని
నకునాజ్ఞ యైనఁ జంపఁ దగదు.


 9-476/1-వ. 
అంత.

- తంజనగరము తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి



టీక:- పడిన = చచ్చిన; వారిన్ = వారిని; మరలన్ = తిరిగి; బ్రతికింపన్ = బతికించుటకు; ఓపును = సమర్థుడు; జనకుడు = తండ్రి; అనుచున్ = అని; చంపెన్ = సంహరించెను; జామదగ్న్యుడు = పరశురాముడు {జామదగ్న్యుడు - జమదగ్ని పుత్రుడు, పరశురాముడు}; అతడున్ = అతను; చంపెన్ = సంహరిచెను; అనుచున్ = అనుకొని; అన్నలన్ = సోదరులను; తల్లిన్ = తల్లిని; జనకున్ = తండ్రి; ఆజ్ఞ = ఆజ్ఞాపించుట; ఐనన్ = జరిగినను; చంపన్ = చంపుట; తగదు = చేయరాదు.
భావము:- తన తండ్రి చచ్చిన వారిని తిరిగి బతికించ గల సమర్థుడు అని, తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని అన్నలను పరశురాముడు సంహరించాడు. కనుక అతను సంహరిచాడు కదా అని సోదరులను, తల్లిని ఎవరూ చంపరాదు.

తెభా-9-477-సీ.
రశురాముని కోడి రుగులు పెట్టిన-
ర్జునుపుత్రకు లాత్మ యందుఁ
దండ్రి మ్రగ్గుటకు సంప్తులై పొగలుచు-
నింతట నంతట నెడరు వేచి
తిరిగి యాడుచు నొక్క దివసమం దా రాముఁ-
డవి కన్నలతోడ రుగఁ బిదప
గఁదీర్పఁ దఱి యని ఱతెంచి హోమాల-
యంబున సర్వేశు నాత్మ నిలిపి

తెభా-9-477.1-తే.
నిరుపమధ్యానసుఖవృత్తి నిలిచియున్న
పుణ్యు జమదగ్నినందఱు బొదివి పట్టి
కుదులకుండంగఁ దలఁ ద్రెంచి కొనుచుఁ జనిరి
డ్డ మేతెంచి రేణుక డచికొనఁగ.

టీక:- పరశురామున్ = పరశురాముని; కిన్ = కి; ఓడి = ఓడిపోయి; పరుగులుపెట్టిన = పారిపోయిన; అర్జును = కార్తవీర్యార్జునుని; పుత్రకులు = కుమారులు; ఆత్మ = మనసుల; అందున్ = లో; తండ్రి = తండ్రి; మ్రగ్గుట = మరణమున; కున్ = కు; సంతప్తులు = బాధపడినవారు; ఐ = అయ్యి; పొగలుచున్ = దుఃఖించుచు; ఇంతటనంతటన్ = అక్కడనిక్కడ; ఎడరు = అదనుకోసము; వేచి = ఎదురుచూసి; తిరిగి = వర్తిల్లుచు; ఆడుచున్ = కనిపెట్టుకొనియుండి; ఒక్క = ఒకానొక; దివసము = దినము; అందున్ = అందు; ఆ = ఆ; రాముడు = పరశురాముడు; అడవి = అడవి; కిన్ = కి; అన్నల = సోదరుల; తోడన్ = తోటి; అరుగన్ = వెళ్ళిన; పిదపన్ = తరువాత; పగతీర్పన్ = పగతీర్చుకొనుటకు; తఱి = తగిన సంయము; అని = అని; పఱతెంచి = వచ్చి; హోమాలయంబునన్ = యాగశాలలో; సర్వేశున్ = భగవంతుని; ఆత్మన్ = మనసులో; నిలిపి = ధారణచేసి .
నిరుపమ = సాటిలేని; ధ్యాన = ధ్యానమునందలి; సుఖ = ఆనందపు; వృత్తిని = స్థితిలో; నిలిచి = స్థిరముగ; ఉన్న = ఉన్నట్టి; ఫుణ్యున్ = పుణ్యుని; జమదగ్నిన్ = జమదగ్నిని; అందఱున్ = అందరుకలిసి; పొదివిపట్టి = పొదవిపట్టుకొని; కుదులకుండంగ = చలించక, లెక్కచేయక; తలన్ = శిరస్సును; త్రెంచికొనుచు = తెగగొట్టి; చనిరి = వెళ్ళిపోయిరి; అడ్డము = ఆపుటకు; ఏతెంచి = వచ్చి; రేణుక = రేణుక; అడచికొనగన్ = మొత్తుకొనగా .
భావము:- పరశురామునికి ఓడి పారిపోయిన కార్తవీర్యార్జునుని కుమారులు తండ్రి మరణానికి బాధపడి, దుఃఖిస్తూ అదనుకోసం కనిపెట్టుకొని ఉన్నాకు. ఒకనాడు పరశురాముడు సోదరులతో అడవికి వెళ్ళగా, పగతీర్చుకోడానికి తగిన సమయం అని వచ్చి, రేణుక మొత్తుకున్నా వినకుండా, యాగశాలలో ధ్యానంలో ఉన్న జమదగ్నిని అందరు కలిసి తల నరికి వెళ్ళిపోయారు.

తెభా-9-478-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకా .
భావము:- అలా కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్నిమహర్షి తల నరికి పోయిన పిమ్మట.

తెభా-9-479-మ.
"కుం జంపిన వైరముం దలఁచి రాన్యాత్మజుల్ నేఁడు మీ
కుం జంపిరి రామ! రామ! రిపులన్ శాసింతు ర"మ్మంచు న
మ్మునిపైవ్రాలి లతాంగి మోఁదికొనియెన్ ముయ్యేడుమాఱుల్రయం
బు రాముం డరుదెంచి యెన్నికొన నాపూర్ణాపదాక్రాంతయై.

టీక:- జనకున్ = తండ్రిని; చంపిన = చంపినట్టి; వైరమున్ = శత్రుత్వము; తలచి = మనసున పెట్టుకొని; రాజన్య = రాజు యొక్క; ఆత్మజుల్ = పుత్రులు; నేడు = ఇవాళ; మీ = మీ యొక్క; జనకున్ = తండ్రిని; చంపిరి = సంహరించిరి; రామ = రామా; రామ = రామా; రిపులన్ = శత్రువులను; శాసింతు = శిక్షించెదవు; రమ్ము = రా; అంచున్ = అనుచు; ఆ = ఆ; ముని = ఋషి; పైన్ = మీద; వ్రాలి = పడి; లతాంగి = సుందరి {లతాంగి - లతవంటి దేహము కలామె, స్త్రీ}; మోదికొనియెన్ = మొత్తుకొనెను; ముయ్యేడు = ఇరవైఒక్క (21) {ముయ్యెడు - మూడు ఏడులు, ఇరవైఒకటి}; మాఱుల్ = సార్లు; రయంబునన్ = వేగముగ; రాముండు = రాముడు; అరుదెంచి = వచ్చి; ఎన్నికొనన్ = లెక్కించగా; ఆపూర్ణ = పూర్తిగా; ఆపద = ఆపదకు; ఆక్రాంత = చిక్కినామె; ఐ = అయ్యి.
భావము:- “రామా! తండ్రిని చంపిన పగతో కార్తవీర్యుని కొడుకులు వచ్చి ఇవాళ మీ తండ్రిని సంహరించారు, శత్రువులను శిక్షిద్దువు వేగంగా రా.” అంటూ రాముడు వచ్చి లెక్కపెడుతుండగా ఆపదకు చిక్కిన రేణుక జమదగ్ని మీద పడి ఇరవై ఒక్క సార్లు ఆక్రోశించింది.

తెభా-9-480-వ.
అప్పుఁడుఁ దల్లి మొఱ విని, జమదగ్ని కుమారులు వచ్చి యిట్లని విలపించిరి.
టీక:- అప్పుడు = అప్పుడు; తల్లి = తల్లి; మొఱ = మొత్తుకొనుట; విని = విని; జమదగ్ని = జమదగ్ని; కుమారులు = పుత్రులు; వచ్చి = వచ్చి; ఇట్లు = ఈ విధముగ; అని = అనుచు; విలపించిరి = ఏడ్చిరి .
భావము:- అప్పుడు తల్లి మొఱ విని, జమదగ్ని పుత్రులు వచ్చి ఈ విధంగ అనుచు దుఃఖించారు.

తెభా-9-481-క.
"వాకిలివెడలవు కొడుకులు
రాకుండఁగ నట్టి నీవు రాజసుతులచేఁ
జీకాకు నొంది పోవఁగ
నీకా ళ్లెట్లాడెఁ దండ్రి! నిర్జరపురికిన్."

టీక:- వాకిలిన్ = గుమ్మము; వెడలవు = దాటి వెళ్లవు; కొడుకులు = పుత్రులు; రాకుండన్ = రాకుండగా; అట్టి = అటువంటి; నీవు = నీవు; రాజసుతుల = రాకుమారుల; చేన్ = వలన; చీకాకున్ = చీకాకులు; ఒంది = పడి; పోవగన్ = పోవుటకు; నీ = నీకు; కాళ్ళు = కాళ్ళు; ఎట్లు = ఎలా; ఆడెన్ = కదిలినవి; తండ్రి = తండ్రి; నిర్జరపురి = స్వర్గమున; కిన్ = కు.
భావము:- “తండ్రీ! కొడుకులం మేం తోడు రాకుండా గుమ్మం దాటి వెళ్లవు. అటువంటి నీవు రాకుమారుల వలన చీకాకులు పడి స్వర్గానికి పోడానికి నీకు కాళ్ళు ఎలా వచ్చాయి.”

తెభా-9-482-వ.
అని విలపించుచున్న యన్నలఁ జూచి రాముం డిట్లనియె.
టీక:- అని = అని; విలపించుచున్న = ఏడుస్తున్న; అన్నలన్ = సోదరులను; చూచి = ఉద్దేశించి; రాముండు = పరశురాముడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .
భావము:- అని ఏడుస్తున్న అన్నలతో పరశురాముడు ఇలా అన్నాడు.

తెభా-9-483-ఉ.
"డువనేల తండ్రి తను వేమఱకుండుఁడు తోడులార! నే
సూడిదె తీర్తు"నంచుఁ బరశుద్యుతిభీముఁడు రాముఁ డుగ్రుఁడై
యోక యర్జునాత్మభవులున్నపురంబున కేఁగి చొచ్చి గో
డాడఁగఁ బట్టి చంపె వడి ర్జునజాతుల బ్రహ్మఘాతులన్.

టీక:- ఏడువన్ = ఏడవటం; ఏలన్ = ఎందుకు; తండ్రి = తండ్రి యొక్క; తనువున్ = శరీరమును; ఏమఱకకుండుడు = జాగర్తగ చూస్తూ ఉండండి; తోడులారా = సోదరులారా; నేన్ = నేను; సూడు = పగ; ఇదె = ఇదిగో ఇప్పుడే; తీర్తున్ = తీర్చుకొనెదను; అంచున్ = అనుచు; పరశు = గొడ్డలి; ద్యూతి = పదునుగల; భీముడు = భయంకరుడు; రాముడు = పరశురాముడు; ఉగ్రుడు = కోపముగలవాడు; ఐ = అయ్యి; ఓడక = వెనుదీయక; అర్జును = కార్తవీర్యర్జునుని; ఆత్మభవులు = పుత్రులు {ఆత్మభవులు - తనకు పుట్టినవారి, పుత్రులు}; ఉన్న = ఉన్నట్టి; పురంబున్ = నగరమున; కున్ = కు; ఏగి = వెళ్లి; చొచ్చి = ప్రవేశించి; గోడాడగన్ = గోలచేయుచుండగ; పట్టి = పట్టుకొని; చంపెన్ = సంహరించెను; వడిన్ = వేగముగా; అర్జును = కార్తవీర్యర్జునుని; జాతులన్ = పుత్రులను; బ్రహ్మఘాతులన్ = బ్రహ్మహత్యాపాతకులను.
భావము:- “అన్నలారా! ఎందుకు ఏడుస్తారు. తండ్రి శరీరాన్ని జాగ్రత్తగా చూస్తుండండి. ఇదిగో ఇప్పుడే పోయి నేను పగ తీర్చుకుంటాను” అంటూ పరశువు (గొడ్డలి) పట్టుకుని పరశురాముడు కోపంతో బ్రహ్మహత్యాపాతకులైన కార్తవీర్యర్జునుని కొడుకులు ఉన్న నగరానికి వెళ్లాడు. వాళ్ళు గోలపెట్టసాగారు. రాముడు వారిని పట్టుకొని సంహరించాడు.

తెభా-9-484-క.
ఖండించి రిపుల శిరములు
గొంలుగాఁ బ్రోగు లిడియె గురురక్తనదుల్
నిండికొని పాఱ నుబ్బుచు
భంనమున విప్రరిపులు యమంద నృపా!

టీక:- ఖండించి = చంపి; రిపుల = శత్రువుల; శిరములున్ = తలలు; కొండలుగన్ = గుట్టలు గుట్టలుగ; ప్రోగులు = పోగులు; ఇడియెన్ = పెట్టెను; గురు = అధికమైన; రక్త = రక్తపు; నదుల్ = నదులు; నిండికొని = నిండిపోయి; పాఱన్ = ప్రవహించునట్లు; ఉబ్బుచున్ = పొంగిపొర్లిపోతూ; భండనమునన్ = యుద్ధము నందు; విప్ర = బ్రాహ్మణుల; రిపులు = శత్రువులు; భయము = భయమును; అందన్ = పొందగా; నృపా = రాజా.
భావము:- ఓ రాజా! బ్రాహ్మణ శత్రువుల గుండెలు అదిరేలా పరశు రాముడు యుద్ధంలో రక్తపుటేరులు పారేలా శత్రువుల తలలు నరికి పోగులు పెట్టాడు.

తెభా-9-485-వ.
మఱియు నంతటఁ బోక.
టీక:- మఱియున్ = ఇంకను; అంతటన్ = దానితో; పోక = విడువకుండగ .
భావము:- ఇంకా అంతటితో విడువకుండగా.

తెభా-9-486-ఆ.
య్య పగకు రాముఁ లయక రాజుల
నిరువదొక్కమాఱు సి చంపె;
గతిమీఁద రాజబ్దంబు లేకుండ
సూడు దీర్పలేని సుతుఁడు సుతుఁడె?

టీక:- అయ్య = తండ్రి; పగ = పగ; కున్ = కోసము; రాముడు = పరశురాముడు; అలయక = విసుగు లేకుండ; రాజులన్ = రాజులను; ఇరువదొక్క = ఇరవైఒక్క (21); మాఱున్ = సార్లు; అరసి = వెతికి; చంపెన్ = సంహరించెను; జగతి = భూమి; మీద = మీద; రాజ = రాజు అనెడి; శబ్దంబున్ = పలుకే; లేకుండన్ = లేకుండ పోవునట్లుగ; సూడు = పగ; తీర్చలేని = తీర్చలేనట్టి; సుతుడు = పుత్రుడు; సుతుడె = పుత్రుడా, కాదు.
భావము:- తండ్రి పగ కోసం భూమి మీద క్షత్రియుడు అనే శబ్దం వినబడనీయకుండా, పరశురాముడు విసుగు విరామం లేకుండా ఇరవైఒక్క సార్లు రాజులను వెతికి మరీ సంహరించాడు. తండ్రి పగ తీర్చలేని కొడుకూ కొడుకేనా.

తెభా-9-487-వ.
మఱియు నా రాముండు శమంతపంచకంబున రాజరక్తంబులం దొమ్మిది మడుఁగులు గావించి తండ్రిశిరంబు దెచ్చి, శరీరంబుతో సంధించి, సర్వదేవమయుండగు దేవుండు దాన కావునఁ దన్నునుద్దేశించి యాగంబుంజేసి, హోతకుం దూర్పును, బ్రహ్మకు దక్షిణ భాగంబును, నధ్వరునకుఁ బడమటి దిక్కును, నుద్గాతృనకునుత్తర దిశయు, నున్నవారల కవాంతరదిశలును, గశ్యపునకు మధ్యదేశంబును, నుపద్రష్టకు నార్యావర్తంబును, సదస్యులకుం దక్కిన యెడలును గలయనిచ్చి బ్రహ్మనది యైన సరస్వతియం దవబృథస్నానంబు చేసి, కల్మషంబులం బాసి, మేఘవిముక్తుండయిన సూర్యుండునుం బోలె నొప్పుచుండె; నంత.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రాముండు = పరశురాముడు; శమంతపంచకంబునన్ = శమంతపంచకమున; రాజ = క్షత్రియ; రక్తంబులన్ = రక్తములతో; తొమ్మిది = తొమ్మిది (9); మడుగులున్ = చెరువులను; కావించి = చేసి; తండ్రి = తండ్రి యొక్క; శిరంబున్ = తలను; తెచ్చి = తీసుకువచ్చి; శరీరంబు = మొండెము; తోన్ = తోటి; సంధించి = చేర్చి; సర్వదేవ = సమస్త దేవతలు; మయుండు = తానైనవాడు; అగు = ఐన; దేవుండు = దేవుడు; తాన = తనే; కావునన్ = కనుక; తన్నున్ = తనను; ఉద్దేశించి = గురించి; యాగంబున్ = యజ్ఞము; చేసి = చేసి; హోత = ఋత్విక్కున; కున్ = కు; తూర్పునున్ = తూర్పుభాగము; బ్రహ్మ = బ్రహ్మ; కున్ = కు; దక్షిణ = దక్షిణపు; భాగంబునున్ = భాగమును; అద్వరున్ = అధ్వరున; కున్ = కు; పడమటి = పశ్చిమ; దిక్కునున్ = వైపు భాగమును; ఉద్గాతృన్ = ఉద్గాత; కున్ = కు; ఉత్తర = ఉత్తర; దిశన్ = వైపు భాగమును; ఉన్న = మిగిలిన; వారలు = వారి; కిన్ = కి; అవాంతరదిశలునున్ = మూలల భాగములు; కశ్యపున్ = కశ్యపున; కున్ = కు; మధ్య = నడిమి; ప్రదేశంబున్ = స్థలములను; ఉపద్రష్ట = ఉపద్రష్ట; కున్ = కు; ఆర్యావర్తంబును = ఆర్యావర్తము; సదస్యుల్ = సభ్యుల; కున్ = కు; తక్కిన = మిగిలిన; ఎడలున్ = ప్రదేశములు; కలయన్ = ఉన్నదంతా; ఇచ్చి = ఇచ్చేసి; బ్రహ్మ = పరమపవిత్రమైనట్టి; నది = నది; ఐన = అయిన; సరస్వతి = సరస్వతీనది; అందున్ = లో; అవబృథస్నానంబున్ = అవబృథస్నానము {అవబృథము - యఙ్ఙము కడపట న్యూనాతిరిక్తదోష పరిహారార్థము చేసెడి కర్మము}; చేసి = చేసి; కల్మషంబులన్ = పాపములను; పాసి = పోగొట్టుకొని; మేఘ = మబ్బుల నుండి; విముక్తుండు = విడివడినవాడు; అయిన = ఐన; సూర్యుండునున్ = సూర్యుని; పోలెన్ = వలె; ఒప్పుచుండెను = చక్కగ నుండెను; అంత = అంతట.
భావము:- ఇంకా. ఆ పరశురాముడు శమంత పంచకం వద్ద క్షత్రియ రక్తాలతో తొమ్మిది మడుగులు చేసాడు. తండ్రి తలను తీసుకొని వచ్చి శరీరంతో చేర్చి సర్వదేవమయుడు ఐన దేవుడు తనే కనుక తన గురించి తనే యాగం చేసాడు. హోతకు తూర్పుదిక్కు, బ్రహ్మకు దక్షిణపు దిక్కు, అధ్వరునికి పశ్చిమ దిక్కు, ఉద్గాతకు ఉత్తర దిక్కు మిగిలిన వారికి మూలలను, కశ్యపునకు మధ్యదేశాన్ని, ఉపద్రష్టకు ఆర్యావర్తం, సదస్యులకు మిగిలిన ప్రదేశాలు ఇచ్చాడు. పిమ్మట సరస్వతీనదిలో అవబృథస్నానం చేసి పాపాలను పోగొట్టుకొని మబ్బులనుండి విడిచిన సూర్యునిలా ప్రకాశించాడు. అంతట...

తెభా-9-488-క.
ప్తుఁడగు పుత్రువలనను
బ్రాప్తతనుం డగుచుఁ దపము లిమిని మింటన్
ప్తర్షిమండలంబున
ప్తముఁడై వెలుఁగుచుండె మదగ్ని నృపా!

టీక:- ఆప్తుడు = నిజమైన; పుత్రు = కుమారుని; వలనను = వలన; ప్రాప్త = పొందిన; తనుండు = సంకల్ప శరీరము కలవాడు; అగుచున్ = అయ్యి; తపము = తపస్సు యొక్క; బలిమిని = శక్తివలన; మింటన్ = ఆకాశము నందు; సప్తర్షిమండలంబునన్ = సప్తర్షిమండలమున {సప్తర్షి మండలము - సప్తర్షులు నక్షత్రముల రూపముననుండెడి మండలము,}; సప్తముడు = ఏడవవాడు {సప్తర్షులు - 1కశ్యపుడు 2అత్రి 3భరద్వాజుడు 4విశ్వామిత్రుడు 5గౌతముడు 6వసిష్టుడు 7జమదగ్ని}; ఐన = అయ్యి; వెలుగుచుండెన్ = ప్రకాశించుచుండెను; జమదగ్ని = జమదగ్ని; నృపా = రాజా.
భావము:- “పరీక్షిన్మహారాజా! వంశోద్ధారకుడు అయిన కుమారుని వలన సంకల్ప శరీరం పొంది జమదగ్ని తన తపో శక్తివలన ఆకాశంలో సప్తర్షిమండలంలో ఏడవ ఋషిగా ప్రకాశిస్తున్నాడు.

తెభా-9-489-క.
మదగ్నితనూజుఁడు
రాజీవాక్షుండు ఘనుఁడు రాముఁ డధికుఁడై
యోను సప్తర్షులలో
రాజిల్లెడు మీఁది మనువు రా నవ్వేళన్.

టీక:- ఆ = ఆ; జమదగ్ని = జమదగ్ని; తనూజుడు = కొడుకు; రాజీవాక్షుండు = పద్మనేత్రుడు; ఘనుడు = గొప్పవాడు; రాముడు = పరశురాముడు; అధికుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; ఓజను = ఓజస్సుతో; సప్తర్షులు = సప్తర్షులలో; రాజిల్లెడున్ = విలసిల్లును; మీది = రాబోవు; మనువు = మనువు; రాన్ = వచ్చెడి; ఆ = ఆ; వేళన్ = కాలమునందు.
భావము:- రాబోయే మన్వంతరంలో ఆ జమదగ్ని కొడుకు, పద్మనేత్రుడు, మహానుభావుడు, పరశురాముడు సప్తర్షులలో ఒకడిగా ప్రకాశిస్తాడు.

తెభా-9-490-ఆ.
శాంతచిత్తుఁ డగుచు సంగవిముక్తుఁడై
వ్యుఁడై మహేంద్రర్వతమున
నున్నవాఁడు రాముఁ డోజతో గంధర్వ
సిద్ధవరులు నుతులు చేయుచుండ.

టీక:- శాంతచిత్తుండు = శాంతి చెందిన; చిత్తుడు = మనసు గలవాడు; అగుచున్ = అగుచు; సంగ = ఐహిక బంధముల నుండి; విముక్తుడు = విడివడినవాడు; ఐ = అయ్యి; భవ్యుడు = దివ్యమైనవాడు; ఐ = అయ్యి; మహేంద్ర = మహేంద్ర; పర్వతమున = పర్వతముపైన; ఉన్నవాడు = ఉన్నాడు; రాముడు = పరశురాముడు; ఓజస్ = ఓజస్సు; తోన్ = తోటి; గంధర్వ = గంధర్వులు; సిద్ధ = సిద్ధులలో; వరులు = ఉత్తములు; నుతులు = స్తోత్రములు; చేయుచుండ = చేస్తుండగా.
భావము:- గంధర్వులు సిద్ధులు తన పవిత్ర చరిత్ర స్తుతిస్తూ ఉండగా, పరశురాముడు శాంతచిత్తుడై, ఐహికబంధాల నుండి విడివడి, తేజోవంతుడై తపస్సు చేసుకుంటూ ఈనాటికి మహేంద్ర పర్వతంపై ఉన్నాడు.

తెభా-9-491-క.
వంతుఁడు హరి యీ క్రియ
భృగుకులమునఁ బుట్టి యెల్ల పృథివీపతులన్
తీభారము వాయఁగఁ
గొని పలుమాఱుఁ జంపె వరమున నృపా!

టీక:- భగవంతుడు = విష్ణువు; హరి = విష్ణువు; ఈ = ఈ; క్రియన్ = విధముగ; భృగుకులమునన్ = భృగు వంశము నందు; పుట్టి = అవతరించి; ఎల్ల = అందరు; పృథవీపతులను = రాజులను {పృథివీపతి - భూమికి భర్త, రాజు}; జగతీభారమున్ = భూభారమును; వాయగన్ = తొలగించుటకు; పగగొని = పగబట్టి; పలుమాఱున్ = అనేకసార్లు; చంపెన్ = పరిమార్చెను; బవరమునన్ = యుద్ధము నందు; నృపా = రాజా.
భావము:- పరీక్షిత్తూ! ఈ విధంగ విష్ణుమూర్తి భృగువంశంలో భూభారం తొలగించుటకు అవతరించి యుద్ధంలో రాజులు అందరిని పగబట్టి అనేకసార్లు పరిమార్చాడు.