Jump to content

పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/దూర్వాసుని కృత్య కథ

వికీసోర్స్ నుండి

దూర్వాసుని కృత్య కథ

తెభా-9-100-వ.
అని ధర్మసందేహంబు పాపిన, నా రాజర్షిశ్రేష్ఠుండును మనంబున హరిం దలంచి నీరు పారణంబు చేసి, జలంబుల మునింగిన తపసి రాక కెదురుచూచుచున్న సమయంబున.
టీక:- అని = అని; ధర్మసందేహంబున్ = ఏది ధర్మము అనెడి శంక; పాపినన్ = పోగొట్టగా; ఆ = ఆ; రాజర్షి = రాజుగానున్న ఋషులలో; శ్రేష్ఠుండును = ఉత్తముడును; మనంబునన్ = మనసునందు; హరిన్ = నారాయణుని; తలంచి = ధ్యానించి; నీరున్ = నీటిని; పారణంబు = పారణము; చేసి = చేసి; జలంబులన్ = నీటిలో; మునింగిన = స్నానమునకెళ్ళిన; తపసి = ఋషి; రాక = తిరిగి వచ్చుట; కున్ = కు; ఎదురుచూచుచున్న = ప్రతీక్షించున్న; సమయంబున = సమయమునందు.
భావము:- అలా బ్రాహ్మణులు సందేహం తీర్చారు. అంబరీషుడు మనసులో విష్ణుమూర్తిని తలచుకుని కొద్దిగా నీళ్ళు తాగి, దూర్వాస మహర్షి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు....

తెభా-9-101-సీ.
మునలోఁ గృతకృత్యుఁడై వచ్చి రాజుచే-
సేవితుండై రాజుచేష్టితంబు
బుద్దిలో నూహించి బొమముడి మొగముతో-
దరెడి మేనితో నాగ్రహించి
రెట్టించి యాఁకలి గొట్టుమిట్టాడంగ-
  "నీ సంపదున్మత్తు నీ నృశంసు
నీ దురహంకారు నిందఱుఁ గంటిరే?-
విష్ణుభక్తుఁడు గాడు వీఁడు; నన్నుఁ

తెభా-9-101.1-తే.
గుడువ రమ్మని మునుముట్టఁ గుడిచినాఁడు
ర్మభంగంబు చేసి దుష్కర్ముఁ డయ్యె;
యిన నిప్పుడు చూపెద న్ని దిశల
నేను గోపింప మాన్చువాఁ డెవ్వఁ?" డనుచు.

టీక:- యమునన్ = యమునానది; లోన్ = అందు; కృతకృత్యుండు = పనిపూర్తిచేసుకొన్నవాడు; ఐ = అయ్యి; వచ్చి = తిరిగివచ్చి; రాజు = రాజు; చేన్ = చేత; సేవితుండు = మర్యాదలుపొందినవాడు; ఐ = అయ్యి; రాజు = రాజు; చేష్టితంబున్ = చేసినపనిని; బుద్ధి = మనసు; అందున్ = లో; ఊహించి = ఊహించి; బొమముడి = కనుబొములుముడిచిన; మొగము = ముఖము; తోన్ = తో; అదిరెడి = కంపించెడి; మేని = దేహము; తోన్ = తోటి; ఆగ్రహించి = కోపించి; రెట్టించి = (స్వరము) పెంచుతూ; ఆకలిన్ = ఆకలితో; కొట్టుమిట్టాడంగ = కరకరలాడుతుండ; ఈ = ఈ; సంపత్ = అధికమైనసంపదవలన; ఉన్మత్తునిన్ = పిచ్చిపట్టినవానిని; ఈ = ఈ; నృశంసున్ = రాజును; ఈ = ఈ; దురహంకారుని = చెడ్డఅహంకారముగలవాని; ఇందఱున్ = అంతమంది; కంటిరే = చూసారా; విష్ణు = నారాయణునికి; భక్తుడు = భక్తుడు; కాడు = కాడు; వీడు = ఇతను; నన్నున్ = నన్ను; కుడువన్ = భోజనముచేయుటకు.
రమ్మని = పిలిచి; మునుముట్ట = ముందుగానే; కుడిచినాడు = భుజించినాడు; ధర్మ = ధర్మమునకు; భంగంబున్ = విరుద్ధముగ; చేసి = చేసి; దుష్కర్ముడు = పాపి; అయ్యెన్ = అయిపోయినాడు; అయినన్ = అందుచేత; ఇప్పుడు = ఇప్పుడు; చూపెదన్ = నిరూపించెదను; అన్ని = సర్వ; దిశలన్ = దిక్కులందు; నేను = నేను; కోపింపన్ = కోపగించినచో; మాన్పువాడు = ఆపగలవాడు; ఎవ్వడు = ఎవడున్నాడు, లేడు; అనుచున్ = అంటూ.
భావము:- యమునానదికి వెళ్ళిన దూర్వాసుడు స్నానాదులు ముగించుకుని తిరిగి వచ్చాడు. రాజు చేసిన మర్యాదలు స్వీకరించి, రాజు నీరు త్రాగుట మనసున ఊహించాడు. కరకరలాడుతున్న ఆకలికి తోడుగా మునికి మిక్కిలి కోపం వచ్చింది. కనుబొమలు ముడిపడ్డాయి, దేహం కంపిస్తోంది. అప్పుడు ముని అమిత ఆగ్రహంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “ఈ రాజును చూడండి, మితిమీరిన సంపదలతో పిచ్చిపట్టింది. బహు చెడ్డ అహంకారి తప్ప ఇతడు అచ్చమైన హరిభక్తుడు కాడు. నన్ను భోజనానికి పిలిచి, ముందుగా తాను భుజించాడు. ధర్మం తప్పి పాపి అయ్యాడు. నేను కోపగిస్తే ఎక్కడా ఎవడు ఆప లేడని, ఇప్పుడు నిరూపిస్తాను చూడండి.” అంటూ....

తెభా-9-102-చ.
పెపెటఁ బండ్లు గీఁటుచును భీకరుఁడై కనుఁ గ్రేవ నిప్పుకల్
పొపొటరాల గండములుపొంగ మునీంద్రుఁడు హుంకరించుచున్
మొదలంటఁగాఁ బెఱికి క్కన దానన కృత్య నాయుధో
త్క వరశూల హస్తయుతఁగా నొనరించి కవించె రాజుపైన్.

టీక:- పెటపెట = పటపటమని; పండ్లు = పళ్ళు; గీటుచున్ = కొరుకుతూ; భీకరుడు = భయముగొల్పువాడు; ఐ = అయ్యి; కను = కళ్ళ; గ్రేవన్ = కొనలనుండి; నిప్పుకల్ = నిప్పుకణములు; పొటపొట = చిటపటమని; రాలన్ = రాలుతుండగ; గండములున్ = చెంపలు; ఉప్పొంగ = ఉబ్బునట్లు; ముని = మునులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; హుంకరించుచున్ = హుంకారముచేయుచు; జట = సిగలోనిజటను; మొదలంటన్ = సమూలముగ; పెఱికి = పీకి; చక్కన = చక్కగ; దానన = దానితోనే; కృత్యన్ = పిశాచమును {కృత్య - సంహారమునకై చేయబడినది}; ఆయుధ = ఆయుధముండుటచే; ఉత్కట = మదించినది; వర = శ్రేష్ఠమైన; శూల = శూలమును; హస్త = చేతిలో; యుతన్ = ధరించినదిగ; ఒనరించి = సృష్టించి; కవించెన్ = ప్రయోగించె, ప్రేరేపించె; రాజు = రాజు; పైన్ = మీదకు.
భావము:- పళ్ళు పటపట కొరుకుతూ, కళ్ళ నుండి నిప్పుకణాలు చిటపటమని రాలుస్తూ, చెంపలు ఉబ్బుతుండగా, దూర్వాసుడు అతి భీకరంగా హుంకారం చేసాడు. సిగలోని జట ఒకటి పెరికి నేలను కొట్టాడు. దానితో గొప్ప శూలాన్ని చేతబట్టి, మదించిన కృత్యను (పిశాచాన్ని) సృష్టించి, రాజు మీదకు ప్రయోగించాడు.

తెభా-9-103-వ.
అంత.
టీక:- అంతన్ = అంతట.
భావము:- అంతట.

తెభా-9-104-క.
కాలానల సన్నిభయై
శూలాయుధహస్త యగుచు సుఱసుఱ స్రుక్కన్
నేలఁ బదంబులఁ ద్రొక్కుచు
వాలి మహాకృత్య మనుజల్లభుఁ జేరెన్.

టీక:- కాలానల = ప్రళయాగ్ని; సన్నిభ = సమానమైనది; ఐ = అయ్యి; శూలాయుధ = శూలాయుధము; హస్త = చేతగలది; అగుచున్ = ఔతూ; సుఱసుఱ = చురచురమని; స్రుక్కన్ = కుంగిపోవునట్లు; నేలన్ = భూమిని; పదంబులన్ = కాళ్ళతో; త్రొక్కుచున్ = తొక్కుతు; వాలి = దూకి; మహా = గొప్ప; కృత్య = పిశాచము; మనుజవల్లభున్ = రాజును; చేరెన్ = దగ్గరకువెళ్ళెను.
భావము:- ఆ భీకరమైన కృత్య శూలం బట్టుకుని, ప్రళయాగ్నిలా చురచురమంటూ, భూమి కుంగిపోయేలా కాళ్ళతో తొక్కుతు, దూకుతూ రాజు దగ్గరకు వెళ్ళింది.

తెభా-9-105-ఆ.
ప్రకార మెఱిఁగి రి విశ్వరూపుండు
వెఱ్ఱి తపసి చేయు వేడబంబుఁ
క్కఁబెట్టు మనుచుఁ క్రంబుఁ బంచిన
చ్చె నదియుఁ బ్రళయహ్ని పగిది.

టీక:- ఆ = ఆ; ప్రకారమున్ = సంగతి; ఎఱిగి = తెలిసి; హరి = విష్ణుమూర్తి; విశ్వరూపుడు = విష్ణుమూర్తి {విశ్వరూపుడు - విశ్వమేతన రూపమైన వాడు, విష్ణువు}; వెఱ్ఱి = తిక్క; తపసి = ముని; చేయు = చేయుచున్న; వేడబంబున్ = వంచనను; చక్కబెట్టుము = సరిచేయుము; అనుచున్ = అంటూ; చక్రంబున్ = సుదర్శనచక్రమును; పంచినన్ = పంపించగా; వచ్చెన్ = వచ్చినది; అదియున్ = ఆదికూడ; ప్రళయవహ్ని = ప్రళయాగ్ని; పగిదిన్ = వలె.
భావము:- ఆ సంగతి తెలిసి విష్ణుమూర్తి ముని చేస్తున్న తిక్క వంచనను సరిచేయ మంటూ, సుదర్శనచక్రాన్నిపంపించాడు. ఆ చక్రం కూడ ప్రళయాగ్నిలా వచ్చి....

తెభా-9-106-వ.
వచ్చి మునిపంచిన కృత్యను దహించి, తనివిచనక ముని వెంటం బడిన, మునియును మేరుగుహ జొచ్చిన నదియు నురగంబు వెనుకొను దవానలంబు చందంబునఁ దోన చొచ్చి మఱియును.
టీక:- వచ్చి = చేరి; ముని = ముని; పంచిన = పంపించిన; కృత్యను = కృత్యను; దహించి = కాల్చివేసి; తనివి = తృప్తి; చనక = చెందకుండ; ముని = మునిని; వెంటంబడినన్ = వెంటతగులగ; మునియున్ = ముని; మేరు = మేరుపర్వతపు; గుహన్ = గుహలోనికి; చొచ్చినన్ = దూరగా; అదియును = అదికూడ; ఉరగంబున్ = పామును; వెనుకొను = వెనుతగిలెడి; దవానలంబున్ = కార్చిచ్చు; చందంబునన్ = వలె; తోనన్ = కూడా; చొచ్చి = దూరి; మఱియును = ఇంకను.
భావము:- అంబరీషుని దరిచేరి, ముని ప్రయోగించిన కృత్యను కాల్చివేసి, తృప్తి చెందకుండ దూర్వాసుని వెంట తగులుకుంది. ఆ మునీశ్వరుడు మేరుపర్వతం గుహలోకి దూరాడు. అది కూడ పామును వెనుతగిలె కార్చిచ్చులా గుహలో దూరింది. ఇంక...

తెభా-9-107-మ.
భువిఁదూఱన్ భువిదూఱు; నబ్ధిఁ జొర నబ్ధుల్ జొచ్చు; నుద్వేగియై
దివిఁ బ్రాకన్ దివిఁ బ్రాకు; దిక్కులకుఁ బో దిగ్వీథులం బోవుఁ; జి
క్కి వెసం గ్రుంగినఁ గ్రుంగు; నిల్వ నిలుచుం; గ్రేడింపఁ గ్రేడించు; నొ
క్కడిన్ దాపసు వెంటనంటి హరిచక్రం బన్యదుర్వక్రమై.

టీక:- భువిన్ = భూమిలో; దూఱన్ = దూరితే; భువిన్ = భూమిలోకి; దూఱున్ = దూరును; అబ్ధిన్ = సముద్రములో; చొరన్ = దూరితే; అబ్ధుల్ = సముద్రములు; చొచ్చున్ = దూఱును; ఉద్వేగి = కలతచెందినవాడు; ఐ = అయ్యి; దివిన్ = ఆకాశమునకు; ప్రాకన్ = ఎగబ్రాకితే; దివిన్ = ఆకాశమునకు; ప్రాకున్ = ఎగబ్రాకును; దిక్కుల్ = దిశలవైపున; కున్ = కు; పోన్ = పోతే; దిక్ = దిక్కుల; వీథులన్ = దార్లన్నిటికి; పోవున్ = వెళ్ళును; చిక్కి = (ప్రయత్నము) మానివేసి; వెసన్ = విసిగి; క్రుంగినన్ = కుంగిపోతె; కుంగున్ = కుంగును; నిల్వన్ = నిలబడితే; నిలుచున్ = ఆగును; క్రేడింపన్ = పక్కకివెళితే; క్రేడించున్ = పక్కకివెళ్ళును; ఒక్కవడిన్ = ఏకాగ్రముగ; తాపసున్ = ముని; వెంటనంటి = వెనుదగిలి; హరిచక్రంబు = విష్ణుచక్రము; అన్య = ఇతరులచే; దుర్వక్రము = మరలింపరానిది; ఐ = అయ్యి.
భావము:- భూమిలో దూరితే భూమిలోకి దూరుతోంది, సముద్రంలోకి దూరితే సముద్రంలోకి దూరుతోంది. ముని కలతచెంది ఆకాశానికి ఎగబ్రాకితే అది కూడ ఆకాశానికి ఎగబ్రాకుతోంది. ఏ దిక్కుకి ఏ మూలకి పోయినా ఆ దార్లన్నిటిలో వెంట పడుతోంది. కుంగిపోయి విసిగి నిలబడిపోతే, ఆగుతుంది. పక్కకి వెళితే తనూ పక్కకి వెళ్తుంది. అలా విడువక ముని వెనుదగిలిన విష్ణుచక్రం ఇంకెవరు మరలింపరానిది అయింది.

తెభా-9-108-శా.
లోకంబున కైన వెంటఁబడి తోనేతెంచు చక్రానల
జ్వాలల్ మానుపువారు లేమిఁ జని దేజ్యేష్ఠు లోకేశు వాఁ
డాలోకించి "విధాత! విశ్వజననవ్యాపారపారీణరే
ఖాలీలేక్షణ! కావవే కరుఁణ జక్రంబున్ నివారింపవే."

టీక:- ఏ = ఎట్టి; లోకంబున్ = లోకమున; కి = కి; ఐనన్ = అయినను; వెంటబడి = వెనుగగిలి; తోన్ = కూడ; ఏతెంచున్ = వచ్చును; చక్ర = చక్రము అనెడి; అనల = అగ్ని; జ్వాలల్ = మంటలను; మానుపు = అపగలగిన; వారు = వారు; లేమిన్ = లేకపోవుటచేత; చని = వెళ్ళి; దేవజ్యేష్ఠున్ = బ్రహ్మదేవుని {దేవజ్యేష్ఠుడు - దేవతలలో పెద్దవాడు, బ్రహ్మ}; లోకేశున్ = బ్రహ్మదేవుని {లోకేశుడు - లోకములకుప్రభువు, బ్రహ్మ}; వాడు = అతను; ఆలోకించి = దర్శించి; విధాత = బ్రహ్మదేవా {విధాత - సర్వము సృజించువాడు, బ్రహ్మ}; విశ్వ = లోకములను; జనన = సృష్ఠించెడి; వ్యాపార = పనిలో; పారీణ = నేర్పు; రేఖా = తీర్పులతో; లీల = విలాసమైన; ఈక్షణ = దృష్టిగలవాడ; కావవే = కాపాడుము; కరుణన్ = దయతో; చక్రంబున్ = చక్రమును; నివారింపవే = ఆపుము.
భావము:- లోకానికి వెళ్ళినా వెనకాలే వస్తోంది. చక్రాఅగ్ని మంటలను అపగలగిన వారు లేకపోవుడంతో, దిక్కుతోచక, బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవునితో ఇలా మొరపెట్టుకున్నాడు. “విధాత! లోకాలను సృష్టించడంలో నేర్పరివి, నా యందు దయ ఉంచి చక్రాన్ని ఆపు. నన్ను కాపాడు.”

తెభా-9-109-వ.
అనిన బ్రహ్మ యిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంతట బ్రహ్మదేవుడు ఇలా పలికాడు.

తెభా-9-110-మ.
" మర్థిన్ ద్విపరార్థ సంజ్ఞ గల యీ కాలంబుఁ గాలాత్ముఁడై
సొరిదిన్ నిండఁగఁ జేసి లోకములు నా చోటున్ విభుం డెవ్వఁడో
రిపూర్తిన్ గనుఁ గ్రేవఁ గెంపుగదురన్ స్మంబుగాఁజేయు నా
రి చక్రానల కీల కన్యుఁ డొకరుం డ్డంబు గా నేర్చునే?

టీక:- కరము = మిక్కిలి; అర్థిన్ = ప్రీతితో; ద్విపరార్థ = ద్విపరార్థ {ద్విపరార్థ -రెండుపదార్థముల ప్రమాణముగలది, భూత భవిష్య లక్షణముగలది}; సంజ్ఞ = అనెడిపేరు; కల = ఉన్నట్టి; ఈ = ఈ; కాలంబున్ = కాలమును; కాలాత్ముడు = కాలస్వరూపుడు; ఐ = అయ్యి; సొరిదిన్ = క్రమముగ; నిండగన్ = పూర్తగునట్లు; చేసి = చేసి; లోకములున్ = లోకములు; ఆ = అవి ఉన్న; చోటున్ = ప్రదేశమును; విభుండు = ప్రభువు; ఎవడో = ఎవరైతే అతడు; పరిపూర్తిన్ = కాలమునిండాక; కను = కళ్ళ; గ్రేవన్ = కొనలందలి; కెంపున్ = ఎఱ్ఱదనము; కదురన్ = గద్దించగా; భస్మంబున్ = కాలిబూడిదైపోయెడిది; కాన్ = అగునట్లు; చేయున్ = చేసెడి; ఆ = ఆ; హరిచక్ర = విష్ణుచక్రము అనెడి; అగ్ని = నిప్పు; కీలల = మంటల; కున్ = కు; అన్యుడు = వేరేవాడు; ఒకరుండు = ఇంకొకడు; అడ్డంబున్ = అపెడివాడు; కాన్ = అగుటకు; నేర్చునే = చేయగలడా, లేడు.
భావము:- “ద్విపరార్థము అనబడెడి ఈ కాలాన్ని కాలస్వరూపుడు అయి, పూర్వార్థం పరార్థం రెంటిలోను కాలాన్ని నడిపి పిమ్మట కాలం తీరునట్లు చేసి లోకములుతో సహా అవి ఉన్న ప్రదేశం సర్వం విష్ణుచక్రాగ్ని కళ్ళు ఎఱ్ఱజేసి గద్దించగా కాలిబూడిదైపోతుంది. అట్టి విష్ణుచక్రాగ్నిని ఎవడూ ఆర్పలేడు.

తెభా-9-111-ఆ.
ను భవుఁడు దక్షుఁ డింద్రాదులును బ్రజా
తులు భృగుఁడు భూతతులు శిరము
లందుఁ దాల్తు మతని యాజ్ఞ జగద్ధితం
బంచు భూరికార్యతుల మగుచు.

టీక:- ఏను = నేను; భవుడున్ = పరమశివుడు; దక్షుడున్ = దక్షుడు; ఇంద్రుడున్ = ఇంద్రుడు; ఆదులునున్ = మున్నగువారు; ప్రజాపతులున్ = ప్రజాపతులు; భృగుడున్ = భృగుడు; భూతపతులున్ = భూతపతులు; శిరములు = తలల; అందున్ = మీద; తాల్తుము = ధరించెదము; అతని = అతనియొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; జగత్ = లోకములకు; హితంబు = మంచిది; అనుచున్ = అని తలచుచు; భూరి = గొప్ప {భూరి - అతి పెద్ద సంఖ్య 1 తరువాత 33 సున్నాలు ఉండునది, లక్షకోటికోటికోటికోట్లు}; కార్యమతులము = కార్యాచరణబుద్ధులము; అగుచున్ = ఔతూ.
భావము:- నేను, పరమశివుడు, దక్షుడు, ఇంద్రుడు, ప్రజాపతులు భృగుడు మున్నగువారు, భూతపతులు అతని ఆజ్ఞను శిరసావహిస్తాము. ఆ ఆజ్ఞకులోబడి ఉంటాము అదే లోకములకు మంచిది అని తలుస్తాము.

తెభా-9-112-వ.
కావున సుదర్శనానల నివారణంబునకు నోప” నని విరించి పలికిన దుర్వాసుండు కైలాసంబునకుం జనుదెంచి, శర్వు నాలోకించి చక్రా నలంబు తెఱం గెఱింగించిన నమ్మహాదేవుం డిట్లనియె.
టీక:- కావునన్ = అందుచేత; సుదర్శన = విష్ణుచక్రపు; అనల = మంటలను; నివారణంబున్ = మాన్పుట; కున్ = కు; ఓపను = సమర్థుడనుకాను; అని = అని; విరించి = బ్రహ్మదేవుడు; పలికినన్ = చెప్పగా; దుర్వాసుండు = దుర్వాసుడు; కైలాసంబున్ = వెండికొండ {కైలాసము - శివుని స్థానము, కైలాసపర్వతము}; కున్ = కు; చనుదెంచి = వచ్చి; శర్వున్ = పరమశివుని {శర్వుడు - ప్రళయమున భూతములను హింసించువాడు, శంకరుడు}; ఆలోకించి = దర్శించి; చక్ర = విష్ణుచక్రపు; అనలంబు = మంటల; తెఱంగు = విధమును; ఎఱంగించినన్ = తెలుపగా; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అందుచేత, ఈ చక్రాగ్ని మాన్పుటకు నేను సమర్థుడను కాను.” అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి పరమశివుని దర్శించి విష్ణుచక్రాగ్ని విషయం చెప్పగానే, ఆ మహానుభావుడు ఇలా అన్నాడు.

తెభా-9-113-సీ.
"వినవయ్య! తండ్రి! ఈ విశ్వేశ్వరుని యందుఁ-
తురాస్య జీవకోములు పెక్కు
వేల సంఖ్యలు గూడి వేళతో నిబ్బంగి-
గుచుండుఁ జనుచుండు; దియుఁగాక
యెవ్వానిచే భ్రాంతి నేమందుచున్నార-
మేను దేవలుఁ డసురేంద్ర సుతుఁడు,
నారదుఁ డజుఁడు సత్కుమారుఁడు ధర్ముఁ-
డా కపిలుఁడు మరీచ్యాదు లన్య

తెభా-9-113.1-ఆ.
పారవిదులు సిద్ధతులు నెవ్వని మాయ
నెఱుఁగలేము దాన నింత పడుదు
ట్టి నిఖిలనాథు నాయుథశ్రేష్ఠంబుఁ
దొలఁగఁ జేయ మాకు దుర్లభంబు.

టీక:- వినవు = వినుము; అయ్య = బాబు; తండ్రి = నాయనా; ఈ = ఈ; విశ్వేశ్వరుని = నారాయణుని {విశ్వేశ్వరుడు - విశ్వమునకు ఈశ్వరుడు, విష్ణువు}; అందున్ = లో; చతురాస్యజీవకోశములు = బ్రహ్మాండములు {చతురాస్యజీవకోశము - చతురాస్య (బ్రహ్మ) జీవకోశము (అండము), బ్రహ్మాండము}; పెక్కు = అనేకమైనవి; వేల = వేలు {వేలు - వేయికి బహువచనము}; సంఖ్యలు = కొలది; కూడి = నిర్మింపబడి; వేళ = కాలము; తోను = తోపాటు; ఇబ్బంగిన్ = ఈ విధముగ; అగుచుండున్ = ఏర్పడుచుండును; చనుచుండున్ = లయమగుచుండును; అదియునున్ = అంతే; కాక = కాకుండ; ఎవ్వాని = ఏ ఒక్కని; చేన్ = చేత; భాంతిన్ = మాయను; నేము = మేము; అందుచున్నారము = చెందుచున్నామో; ఏను = నేను; దేవలుడు = పూజారి; అసురేంద్రసుతుడు = ప్రహ్లాదుడు; నారదుడు = నారదుడు; అజుడు = బ్రహ్మదేవుడు; సనత్కుమారుడు = సనత్కుమారుడు; ధర్ముడు = ధర్ముడు; ఆ = ఆ; కపిలుడు = కపిలుడు; మరీచి = మీచి; ఆదుల్ = మున్నగువారు; ఆపార = అంతులేని; విదులు = జ్ఞానము కలవారు.
సిద్ధ = సిద్ధులలో; పతులు = శ్రేష్ఠులు; ఎవ్వని = ఏ ఒక్కని; మాయన్ = మాయను; ఎఱుంగలేము = తెలియలేమో; దానన్ = దానివలన; ఇంతపడుదుము = చిన్నబోదుమో; అట్టి = అటువంటి; నిఖిలనాథు = సర్వేశ్వరుని; ఆయుధ = ఆయుధ; శ్రేష్ఠంబున్ = ఉత్తమును; తొలగజేయ = తప్పించుట; మా = మా; కున్ = కు; దుర్లభంబు = శక్యముకానిది.
భావము:- “వినుము. నాయనా! దుర్వాసా! నారాయణుని యందు వేలవేల బ్రహ్మాండాలు నిర్మింపబడి కాలంతోపాటు ఏర్పడుతూ లయమవుతూ ఉంటాయి. అంతే కాకుండ ఆయన మాయను మేము చెందుచున్నాం. నేను, ప్రహ్లాదుడు, నారదుడు, బ్రహ్మదేవుడు, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి, సిద్ధులు మున్నగు మహా జ్ఞానసంపన్నులం, సిద్ధ శ్రేష్ఠులం ఆయన మాయను తెలియలేం. అటువంటి మహాత్ముడు, సర్వేశ్వరుడు అయిన ఆయన ఆయుధాన్ని తప్పించుట మాకు సాధ్యం కాదు.

తెభా-9-114-వ.
మునీంద్ర! నీవు నమ్మహాత్ముని శరణంబు వేఁడుము; అతండు మేలు చేయంగలవా” డని పలికిన నీశ్వరునివలన నిరాశుండై దుర్వాసుండు వైకుంఠనగరంబునకుం జని.
టీక:- ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; నీవున్ = నీవు; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముని; శరణంబు = రక్షణ; వేడుము = కోరుము; అతండు = అతను; మేలు = మంచి; చేయంగలవాడు = చేయును; అని = అని; పలికినన్ = చెప్పగా; ఈశ్వరుని = పరమశివుని; వలన = వలన; నిరాశుండు = భంగపడినవాడు; ఐ = అయ్యి; దుర్వాసుండు = దుర్వాసుడు; వైకుంఠనగరంబున్ = వైకుంఠము {వైకుంఠము - విష్ణుమూర్తియొక్క లోకము}; కున్ = కు; చని = వెళ్లి.
భావము:- మునివరా! నీవు ఆ మహాత్మునే శరణు వేడు. అతను నీకు మంచి చేస్తాడు.” అని చెప్పాడు. అలా పరమశివుని వద్ద కూడ భంగపడ్డాక, దుర్వాసుడు వైకుంఠం వెళ్లి....

తెభా-9-115-శా.
వైకుంఠములోని భర్మ మణి సౌధాగ్రంబు పై లచ్చితోఁ
గ్రేవన్ మెల్లన నర్మభాషణములం గ్రీడించు పుణ్యున్ హరిన్
దేవాధీశ్వరుఁ గాంచి "యో వరద! యో దేవేశ! యో భక్తర
క్షావిద్యాపరతంత్ర! మానుపఁగదే క్రానలజ్వాలలన్,

టీక:- ఆ = ఆ; వైకుంఠము = వైంకుఠము; లోని = అందలి; భర్మ = బంగారు; మణి = రత్నాల; సౌధ = భవనము; అగ్రంబున్ = డాబా; పైన్ = మీద; లచ్చి = లక్ష్మీదేవి; తోన్ = తోటి; క్రేవన్ = పార్శ్వమునందు; మెల్లన = మెల్లిగ; నర్మభాషణములన్ = సరసపుమాటలతో; క్రీడించు = ఆడుతున్న; పుణ్యున్ = నారాయణుని {పుణ్యుడు - పుణ్యమేతానైనవాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని; దేవేశ్వరున్ = నారాయణుని {దేవేశ్వరుడు - దేవతలకుదేవుడు,విష్ణువు}; కాంచి = దర్శించి; ఓ = ఓ; వరద = వరములనిచ్చెడివాడ; ఓ = ఓ; దేవేశ = దేవతాప్రభు; ఓ = ఓ; భక్త = భక్తులను; రక్షా = రక్షించెడి; విద్యా = నేర్పునందు; పరతంత్ర = లగ్నమగువాడ; మానుపగదే = పోగొట్టుము; చక్ర = చక్రపు; అనల = అగ్ని; జ్వాలలన్ = మంటలను.
భావము:- అక్కడ వైంకుఠంలో బంగారు రత్నాల భవనం డాబా మీద లక్ష్మీదేవి తోటి సరసపుమాట లాడుతున్న విష్ణువును దర్శించి, ఇలా వేడుకున్నాడు. “ఓ వరద! ఓ దేవతాప్రభు! ఓ భక్తరక్షక! ఈ చక్రాగ్ని మంటలను పోగొట్టు.

తెభా-9-116-ఉ.
నీ హిమార్ణవంబు తుది నిక్కముగా నెఱుఁగంగ లేక నీ
ప్రేకు వచ్చు దాసునకుఁ గ్రించుతనంబున నెగ్గు చేసితిన్
నా ఱపున్ సహింపు మట నారకుఁడైన మనంబులో భవ
న్నాము చింత చేసిన ననంత సుఖస్థితి నొందకుండనే?"

టీక:- నీ = నీయొక్క; మహిమ = మహత్యము అనెడి; అర్ణవము = సముద్రమునకు; తుదిన్ = చివర; నిక్కము = తథ్యముగా; ఎఱుగంగ = తెలిసికొన; లేక = లేక; నీ = నీయొక్క; ప్రేమ = ప్రీతి; కున్ = కి; వచ్చు = పొందిన; దాసున్ = భక్తుని; కున్ = కి; క్రించుదనంబునన్ = అల్పత్వముతో; ఎగ్గు = అపరాధము; చేసితిన్ = చేసితిని; నా = నాయొక్క; మఱపున్ = అజ్ఞానమును; సహింపుము = క్షమించు; అట = అక్కడ; నారకుడు = నరకములోనుండువాడు; ఐనన్ = అయినను; మనంబున్ = మనసు; లోన్ = అందు; భవ = నీయొక్క; నామమున్ = పేరును; చింత = ధ్యానము; చేసినన్ = చేసినచో; అనంత = అంతులేని; సుఖస్థితిన్ = సౌఖ్యములను; అందకన్ = పొందకుండ; ఉండునా = ఉంటాడా, ఉండడు.
భావము:- నీ మహత్యం ఎంతటిదో తెలిసికొన లేని అల్పత్వంతో, నీ పరమ భక్తునికి అపరాధం చేసాను. నా అజ్ఞానాన్ని క్షమించు. నరకంలో ఎంతటి శిక్ష అనుభవిస్తున్న వాడైనా, మనసులో నీ పేరు ధ్యానిస్తే, అంతులేని సౌఖ్యాలను అందుకుంటాడు.”

తెభా-9-117-వ.
అని పలికి పాదకమలంబులకు మ్రొక్కి, లేవక యున్న దుర్వాసునిం గని హరి యి ట్లనియె.
టీక:- అని = అని; పలికి = పలికి; పాద = పాదములు అనెడి; కమలంబుల్ = పద్మముల; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; లేవక = పైకిలేవకుండ; ఉన్న = ఉన్నట్టి; దుర్వాసునిన్ = దుర్వాసుడిని; కని = చూసి; హరి = విష్ణుమూర్తి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని పలికి తన పాదపద్మాలకు మ్రొక్కి పైకిలేవకుండ ఉన్న దుర్వాసుడితో విష్ణుమూర్తి ఇలా చెప్పాడు.

తెభా-9-118-చ.
"మున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు రకిల్బిషభక్తిలతాచయంబులన్
నిలువఁగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్;
లకుఁ జిక్కి భక్తజన త్సలతం జనకుందుఁ దాపసా!

టీక:- చలమునన్ = పట్టుదలతో; బుద్ధిమంతులు = జ్ఞానముగలవారు; అగు = అయిన; సాధులు = మంచివారు; నా = నాయొక్క; హృదయంబున్ = మనసును; లీలన్ = సుళువుగా; దొంగిలికొనిపోవుచన్ = ఎత్తుకుపోతూ; ఉండుదురు = ఉంటారు; అకిల్బిష = నిర్మలమైన; భక్తి = భక్తి యనెడి; లత = తీగల; చయంబులన్ = సమూహములచే; నిలువగన్ = ఆగిపోవునట్లు; పట్టి = పట్టుపట్టి; కట్టుదురున్ = కట్టివేయుదురు; నేరుపు = నేర్పు; తోన్ = తోటి; మద = మదించిన; కుంభి = ఏనుగు {కుంభి - కుంభములుగలది, ఏనుగు}; కైవడిన్ = వలె; వలలన్ = వలలందు; చిక్కి = తగులుకొని; భక్త = భక్తులఎడ; వత్సలతన్ = వాత్సల్యము; కున్ = వలన; చనక = తప్పించుకుపోకుండ; ఉందున్ = ఉండెదను; అధిపా = గొప్పవాడా.
భావము:- “మహాత్మా! పట్టుదలతో జ్ఞానులు, మంచివారు నా మనసు సుళువుగా ఎత్తుకుపోతూ ఉంటారు. గొప్ప నేర్పుతో మదగజాన్ని బంధించినట్లు, వారి నిర్మల భక్తితీగలతో పట్టుపట్టి కట్టివేస్తారు. భక్తుల ఎడ వాత్సల్యతో తప్పించుకుపోకుండ ఉండిపోతాను.

తెభా-9-119-ఆ.
నాకు మేలు గోరు నా భక్తుఁ డగువాఁడు
క్తజనుల కేన రమగతియు;
క్తుఁడెందు జనినఁ ఱతెంతు వెనువెంట
గోవు వెంటఁ దగులు కోడె భంగి.

టీక:- నా = నా; కున్ = కు; మేలు = మంచి; కోరున్ = కోరుకొనును; నా = నా యెక్క; భక్తుడు = భక్తుడు; అగువాడు = ఐనవాడు; భక్త = భక్తులు; జనులు = అందరకు; ఏన = నేను; పరమ = అత్యుత్తమమైన; గతియున్ = దిక్కు; భక్తుడు = భక్తుడు; ఎందున్ = ఎక్కడకు; చనినన్ = వెళ్ళినను; పఱతెంతు = వెళ్ళెదను; వెనువెంట = కూడకూడ; గోవు = ఆవు; వెంటన్ = కూడా; తగులు = పడెడు; కోడె = మగ దూడ; భంగి = వలె.
భావము:- నా భక్తుడు, నా మంచినే కోరుకుంటాడు. భక్తులకు నేను సాటిలేని దిక్కును గనుక, భక్తుడు ఎక్కడకు వెళ్ళినా, ఆవు వెంట పోయే దూడ మాదిరి, నేను భక్తుని వెంట వెళ్తాను.

తెభా-9-120-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- అంతే కాకుండగ.

తెభా-9-121-ఆ.
నువు మనువు విడిచి, నయులఁ జుట్టాల
నాలి విడిచి, సంపదాలి విడిచి,
న్నకాని యన్య మెన్నఁడు నెఱుఁగని
వారి విడువ నెట్టివారి నైన.

టీక:- తనువున్ = దేహమును; మనువున్ = జీవితాన్ని; విడిచి = వదలి; తనయులన్ = పిల్లలను; చుట్టాలన్ = బంధువులను; ఆలిన్ = భార్యను; విడిచి = వదలివేసి; సంపద = సంపదలు; అలి = అన్నిటిని; విడిచి = వదిలేసి; నన్న = నన్నుమాత్రము; తప్పించి = తప్పించి; అన్యము = ఇతరము; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; వారిన్ = వారిని; విడువన్ = వదలిపెట్టను; ఎట్టి = ఎలాంటి; వారిన్ = వారు; ఐనన్ = అయినప్పటికిని.
భావము:- తమ దేహాన్ని, జీవితాన్ని, వదలి; భార్యాపిల్లలను, బంధువులను, సకల సంపదలను అన్నిటిని వదిలేసి కేవలం నన్ను తప్పించి ఇతరం ఏమి తెలియని వారిని, వారు ఎలాంటివారు అయినా సరే, వారిని నేను వదలిపెట్టను.

తెభా-9-122-క.
పంచేంద్రియముల తెరువుల
వంచించి మనంబునందు రమతులు ప్రతి
ష్టించి వహింతురు నన్నును
మంచివరుం బుణ్యసతులు రగిన భంగిన్.

టీక:- పంచేంద్రియముల = జ్ఞానేంద్రియములయొక్క {పంచేంద్రియములు - త్వక్చక్షుశ్శోత్రజిహ్వఘ్రాణులు యనెడి జ్ఞానేంద్రియములు}; తెరువులు = మార్గాలను; వంచించి = స్వాధీనపరచుకొని; మనంబున్ = మనసు; అందున్ = లోపల; వర = ఉత్తమమైన; మతులు = బుద్ధిమంతులు; ప్రతిష్ఠించి = నిలుపుకొని; వహింతురు = ధరింతురు; నన్నును = నన్ను; మంచి = మంచివాడైన; వరున్ = భర్తను; పుణ్య = పుణ్యాత్ములైన; సతులు = స్త్రీలు; మరిగిన = మోహించెడి; భంగిన్ = విధముగ.
భావము:- పతివ్రతలు భర్తను మంచివాడిగా మోహించి స్వాధీనం చేసుకుంటారు. అదే విధంగ, సత్పురుషులు పంచేంద్రియాలను స్వాధీనపరచుకొని మనసున నన్ను నిలుపుకుంటారు.

తెభా-9-123-క.
సాధుల హృదయము నాయది;
సాధుల హృదయంబు నేను; గముల నెల్లన్
సాధుల నేన యెఱుంగుదు
సాధు లెఱుంగుదురు నాదు రితము విప్రా!

టీక:- సాధుల = మంచివారి; హృదయము = హృదయము; నాయది = నాది; సాధుల = మంచివారి; హృదయంబున్ = హృదయమే; నేను = నేను; జగములన్ = లోకములు; ఎల్లన్ = అన్నిటిలోను; సాధులన్ = మంచివారిని; నేన = నేనే; ఎఱుంగుదున్ = ఎరుగుదును; సాధులు = మంచివారు; ఎఱుంగుదురు = తెలిసికొందురు; నాదు = నాయొక్క; చరితమున్ = చరిత్రను; విప్రా = బ్రాహ్మణుడా.
భావము:- బ్రాహ్మణుడా! దుర్వాసా! సాధువుల హృదయం నాది. సాధువుల హృదయమే నేను. సకల లోకాలలో ఉన్న సాధువులను నేను ఎరుగుదును. వారికి నా చరిత్ర తెలుసును.

తెభా-9-124-ఆ.
ధారుణీసురులకుఁ పము విద్యయు రెండు
ముక్తి చేయుచుండు ముదముతోడ;
దుర్వినీతులగుచు దుర్జనులగువారి
కివియుఁ గీడు జేయ కేల యుండు?

టీక:- ధారుణీసురుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; తపము = తపస్సు; విద్యయున్ = వేదజ్ఞానము; రెండున్ = రెండు (2); ముక్తి = మోక్షమును; చేయుచుండున్ = కలిగించును; ముదము = సంతోషము; తోడన్ = తోటి; దుర్వినీతులు = వినయము నీతిలేనివారు; అగుచున్ = ఔతూ; దుర్జనులు = చెడ్డవారు; అగు = ఐన; వారిన్ = వారి; కిన్ = కి; ఇవియున్ = ఇవే; కీడు = చెడు; చేయక = చేయకుండ; ఏల = ఎందుకు; ఉండు = ఉంటాయి.
భావము:- సద్బ్రాహ్మణులకు తపస్సు వేదజ్ఞానం రెండు (2) మోక్షాన్ని కలిగిస్తాయి. వినయము నీతి లేనివారు అయిన చెడ్డ విప్రులకు అవి చెడు చేయకుండ ఎందుకు ఉంటాయి?

తెభా-9-125-క.
నా తేజము సాధులలో
నాతమై యుండు వారి లఁచు జనులకున్
హేతి క్రియ భీతి నిచ్చుం
జేతోమోదంబుఁ జెఱచు సిద్ధము సుమ్మీ.

టీక:- నా = నాయొక్క; తేజమున్ = తేజస్సు; సాధుల = మంచివారి; లోన్ = లో; ఆతతము = విరివియైనది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; వారిన్ = వారిని; అలచు = కష్టపెట్టెడి; జనుల = వారి; కున్ = కి; హేతి = అగ్నిశిఖల; క్రియన్ = వలె; భీతిన్ = భయమును; ఇచ్చున్ = కలుగజేయును; చిత్ = మానసిక; మోదంబున్ = సంతోషమును; చెఱచున్ = పాడుచేయును; సిద్దము = తప్పకుండ; సుమ్మీ = సుమా.
భావము:- నా తేజస్సు సాధుపురుషులలో విరివిగా ఉంటుంది. వారిని కష్టపెట్టే వారికి అగ్నిశిఖల వలె భయాలను కలుగజేస్తుంది. వారికి తప్పకుండ మానసిక సంతోషం లేకుండా చేస్తుంది సుమా.

తెభా-9-126-క.
దె పో బ్రాహ్మణ! నీకును
యుఁడు నాభాగసుతుఁడు నవినుత గుణా
స్పదుఁ డిచ్చు నభయ మాతని
ది సంతసపఱచి వేఁడుమా శరణంబున్."

టీక:- అదె = అందుకనే; పో = వెళ్ళుము; బ్రాహ్మణ = విప్రుడా; నీ = నీ; కునున్ = కుకూడ; సదయుడు = దయగలవాడు; నాభాగసుతుడు = అంబరీషుడు; జన = లోకులచే; వినుత = కీర్తింపబడు; గుణ = సుగుణములు; ఆస్పదుడు = నివాసమైనవాడు; ఇచ్చున్ = ఇచ్చును; అభయము = రక్షణను; ఆతనిన్ = అతనిని; మదిన్ = మనసును; సంతసపఱచి = సంతోషపెట్టి; వేడుమా = వేడుము; శరణంబున్ = శరణు.
భావము:- ఓ విప్రుడా! అందుచేత వెళ్ళు లోకులచే కీర్తింపబడే సుగుణాలు కల అంబరీషుడు దయగలవాడు, అతను నీకు రక్షణను ఇస్తాడు. అతని మనసును సంతోషపెట్టి శరణు వేడు.”

తెభా-9-127-మ.
ని శ్రీవల్లభుఁ డానతిచ్చిన మహోద్యచ్చక్రకీలావళీ
నితాయాసుఁడు నిర్వికాసుఁ డుదితశ్వాసుండు దుర్వాసుఁడ
ల్ల యేతెంచి సుభక్తిఁ గాంచెఁ గరుణాలావణ్య వేషున్ విదో
షు యోదారమనీషు మంజుమితభాషున్ నంబరీషున్ వెసన్.

టీక:- అని = అని; శ్రీవల్లభుడు = విష్ణుమూర్తి {శ్రీవల్లభుడు - శ్రీ (లక్ష్మీదేవి) వల్లభుడు (భర్త), విష్ణువు}; ఆనతిచ్చినన్ = ఆజ్ఞాపించగా; మహా = మిక్కిలి; ఉద్యత్ = ఎగసిపడెడి; చక్ర = విష్ణుచక్రముయొక్క; కీలా = మంటల; అవళీ = ఉపద్రవమువలన; జనిత = పొందిన; ఆయాసుడు = ఆయాసముకలవాడు; నిర్వికాసుడు = వికాసముతప్పినవాడు; ఉదితశ్వాసుడు = రొప్పుతున్నవాడు; దుర్వాసుడు = దుర్వాసుడు; అల్లన = తిన్నగా; ఏతెంచి = వచ్చి; సు = మంచి; భక్తిన్ = భక్తితోటి; కాంచెన్ = చూసెను; కరుణా = దయతో కూడిన; లావణ్య = చక్కని; వేషున్ = ధరించినవానిని; విదోషున్ = దోషములులేనివానిని; నయ = మిక్కిలి; ఉదార = త్యాగశీలమైన; మనీషున్ = మనసుగలవానిని; మంజు = హితవుగ; మిత = పరిమితముగ; భాషున్ = మాట్లాడువానిని; అంబరీషున్ = అంబరీషుని; వెసన్ = శ్రీఘ్రమే.
భావము:- అని లక్ష్మీపతి ఆజ్ఞాపించగా, ఎగసిపడె విష్ణుచక్రము మంటల ఉపద్రవంవలన పొందిన ఆయాసం కలవాడు, వికాసం తప్పి రొప్పుతున్నవాడు అయిన దూర్వాసుడు తిన్నగా దయామయుడు, నిర్దోషి, త్యాగశీలి, హితమితభాషి అయిన అంబరీషుని వద్దకు శ్రీఘ్రమే వచ్చి, మంచి భక్తితో దర్శించాడు.

తెభా-9-128-వ.
కని దుఃఖితుండయి, యమ్మహీవల్లభు పాదంబులు పట్టి విడువకున్న నా నరేంద్రచంద్రుండు చరణస్పర్శనంబునకు నోడుచుఁ గరుణారసభరిత హృదయుండయి, హరిచక్రంబు నిట్లని స్తుతియించె.
టీక:- కని = దర్శించి; దుఃఖితుడు = దుఃఖించెడివాడు; అయి = ఐ; ఆ = ఆ; మహీవల్లభు = రాజుయొక్క; పాదంబులున్ = కాళ్ళను; పట్టి = పట్టుకొని; విడువకున్నన్ = వదలకపోగా; ఆ = ఆ; నరేంద్రచంద్రుండు = మహారాజు {నరేంద్రచంద్రుడు - నరేంద్రులు (రాజులు) అనెడి తారలలో చంద్రునివంటివాడు, మహారాజు}; చరణస్పర్శంబున్ = కాళ్లుపట్టుకొనుటచేత; ఓడుచున్ = కరిగిపోతూ; కరుణా = కృపయనెడి; రస = రసముచే; భరిత = నిండిన; హృదయుండు = హృదయముగలవాడు; అయి = అయ్యి; హరిచక్రంబున్ = విష్ణుచక్రమును; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = కీర్తించెను.
భావము:- అలా దర్శించిన దూర్వాసుడు దుఃఖిస్తూ ఆ రాజు కాళ్ళను వదలకుండా పట్టుకొన్నాడు. ఆ కృపారసహృదయుడు అంబరీష మహారాజు కరిగిపోయి విష్ణుచక్రాన్ని ఈ విధంగ కీర్తించాడు.

తెభా-9-129-సీ.
"నీవ పావకుఁడవు; నీవ సూర్యుండవు-
నీవ చంద్రుండవు; నీవ జలము;
నీవ నేలయు; నింగి నీవ; సమీరంబు-
నీవ; భూతేంద్రియ నికర మీవ;
నీవ బ్రహ్మంబును; నీవ సత్యంబును-
నీవ యజ్ఞంబును; నీవ ఫలము;
నీవ లోకేశులు; నీవ సర్వాత్మయు-
నీవ కాలంబును; నీవ జగము;

తెభా-9-129.1-తే.
నీవ బహుయజ్ఞభోజివి; నీవ నిత్య
మూలతేజంబు; నీకు నే మ్రొక్కువాఁడ
నీరజాక్షుండు చాల మన్నించు నట్టి
స్త్రముఖ్యమ! కావవే చాలు మునిని.

టీక:- నీవ = నీవే; పావకుడవు = అగ్నివి; నీవ = నీవే; సూర్యుండవున్ = సూర్యుడవు; నీవ = నీవే; చంద్రుండవు = చంద్రుడవు; నీవ = నీవే; జలము = నీరు; నీవ = నీవే; నేలయున్ = భూమి; నింగి = ఆకాశము; నీవ = నీవే; సమీరంబు = గాలివి; నీవ = నీవే; భూత = ప్రాణులు; ఇంద్రియ = ఇంద్రియముల; నికరము = సమూహము; ఈవ = నీవే; నీవ = నీవే; బ్రహ్మంబును = సృష్టికర్తవు; నీవ = నీవే; సత్యంబును = సత్యము; నీవ = నీవే; యజ్ఞంబును = యజ్ఞము; నీవ = నీవే; ఫలము = యజ్ఞఫలితము; నీవ = నీవే; లోకేశులున్ = సర్వలోకాధిపతులు; నీవ = నీవే; సర్వ = అందరిలోను; ఆత్మయున్ = ఉండెడివాడవు; నీవ = నీవే; కాలంబును = కాలము; నీవ = నీవే; జగమున్ = భువనము.
నీవ = నీవే; బహు = అనేకములైనట్టి; యజ్ఞ = యజ్ఞఫలమును; భోజివి = పొందెడివాడవు; నీవ = నీవే; నిత్య = శాశ్వతమైన; మూల = ఆధారభూతమైన; తేజంబున్ = తేజస్సువి; నీవు = నీ; కున్ = కు; నేన్ = నేను; మ్రొక్కువాడన్ = నమస్కరించుచున్నాను; నీరజాక్షుండు = విష్ణుమూర్తి {నీరజాక్షుండు - నీరజ (పద్మము)లవంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; చాల = బాగ; మన్నించునట్టి = గౌరవించెడి; శస్త్ర = ఆయుధ; ముఖ్యమ = శ్రేష్ఠమ; కావవే = కాపాడుము; చాలు = ఇకచాలును; మునిని = ఋషిని.
భావము:- “శ్రీమహావిష్ణువు గౌరవించే ఆయుధ శ్రేష్ఠమ! నీవే అగ్నివి; నీవే సూర్యుడవు; నీవే చంద్రుడవు; నీవే నీరు; నీవే భూమి; ఆకాశము నీవే; గాలివి నీవే; సకల ప్రాణులు, ఇంద్రియాలు నీవే; సృష్టికర్తవు నీవే; సత్యం నీవే; యజ్ఞం నీవే; నీవే యజ్ఞఫలితం; సర్వలోకాధిపతులు నీవే; నీవే సర్వాత్మవు; నీవే కాలం; నీవే భువనము; నీవే యజ్ఞఫలమును పొందేవాడవు; నీవే నిత్య మూల తేజస్సువి; నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇకచాలును ఈ ఋషిని కాపాడు.

తెభా-9-130-మ.
రిచే నీవు విసృష్టమై చనఁగ మున్నాలించి నీ ధారలన్
ణిన్ వ్రాలుట నిక్కమంచు మునుపే దైత్యేశ్వరవ్రాతముల్
శిముల్ పాదములున్ భుజాయుగళముల్ చేతుల్ నిజాంగంబులం
దురులన్ బ్రాణసమీరముల్ వదలు నీ యుద్ధంబులం జక్రమా!

టీక:- హరి = విష్ణుమూర్తి; చేన్ = చేత; నీవున్ = నీవు; విసృష్టము = విసరబడినది; ఐ = అయ్యి; చనగన్ = వెళ్ళగా; మున్ను = ముందు; ఆలించి = పసిగట్టి; నీ = నీయొక్క; ధారలన్ = పదునులచే; ధరణిన్ = నేలమీద; వ్రాలుట = పడిపోవుట; నిక్కము = తప్పనిది; అనుచున్ = భావించుకొని; మునుపే = ముందుగానే; దైత్య = రాక్షస; ఈశ్వర = ప్రభువుల; వ్రాతముల్ = సమూహములు; శిరముల్ = తలలు; పాదములున్ = కాళ్ళు; భూజా = భుజముల; యుగళముల్ = జంటలు (2); చేతుల్ = చేతులు; నిజ = తమ; అంగంబులన్ = దేహములందు; దురలన్ = దురపిల్లగా, కలతనొందగా; ప్రాణసమీరముల్ = ప్రాణవాయువులను; వదలున్ = వదలెదరు; నీ = నీవుచేసెడి; యుద్ధంబులన్ = యుద్ధములలో; చక్రమా = ఓ చక్రమా.
భావము:- ఓ చక్రరాజమా! విష్ణుమూర్తి దుష్ట రాక్షస ప్రభువుల పైకి నిన్ను ప్రయోగించగా, వారు నీరాక ముందుగానే పసిగట్టి నీ అంచుల పదునులచే నేలపడుట తప్పదని, తలలు కాళ్ళు భుజాలు చేతులు తెగిపోతాయని గ్రహించి, కలతనొంది ప్రాణాలు వదలుతారు.

తెభా-9-131-ఆ.
లఁగి నిద్రపోవఁ లలోన వచ్చిన
నిన్నుఁ జూచి దీర్ఘనిద్ర పోదు
సురవరులు శయ్యలం దున్న సతులు ప్ర
భాతమందు లేచి లవరింప.

టీక:- కలగినిద్రపోవన్ = కలతనిద్రపోతుండగ; కల = స్వప్నము; లోనన్ = అందు; వచ్చిన = కనిపించిన; నిన్నున్ = నిన్ను; చూచి = చూసి; దీర్ధనిద్రపోదురు = చనిపోతారు; అసుర = రాక్షస; వరులు = శ్రేష్ఠులు; శయ్యలు = పక్కల; అందున్ = అందు; ఉన్న = ఉన్నట్టి; సతులు = భార్యలు; ప్రభాతము = ఉదయపు; అందున్ = సమయమున; లేచి = నిద్రలేచి; పలవరింపన్ = గొల్లుమనగ.
భావము:- కలతనిద్ర పోతుండగా వచ్చిన స్వప్నంలో నీవు కనిపిస్తే చాలు, ఎంతటి రాక్షసులు అయినా నిద్రలోనే మరణిస్తారు. ప్రక్కనే నిద్రిస్తున్న భార్యలు ఉదయం నిద్రలేచి గొల్లుమంటారు.

తెభా-9-132-ఉ.
చీఁటిఁ బాపుచున్ వెలుఁగు జేయుచు సజ్జనకోటినెల్ల స
శ్రీను జేయు నీరుచులు చెల్వుగ ధర్మసమేతలై నినున్
వాకున నిట్టి దట్టిదని ర్ణన చేయ విధాత నేరఁ డ
స్తోము నీదు రూపు గలదుం దుది లేదు పరాత్పరాద్యమై.

టీక:- చీకటిన్ = చీకటిని; పాపుచున్ = పారద్రోలుచు; వెలుగున్ = కాంతిని; చేయుచున్ = పుట్టిస్తూ; సజ్జన = మంచివారి; కోటిన్ = సమూహములు; ఎల్లన్ = అన్నిటిని; సశ్రీకనున్ = సుసంపన్నము; చేయున్ = చేయును; నీ = నీయొక్క; రుచులు = కాంతులు; చెల్వుగ = చక్కగా; ధర్మసమేతలు = ధర్మముగలవారు; ఐ = అయ్యి; నినున్ = నిన్ను; వాకున = నోటితో; ఇట్టిదట్టిది = వివరముగ; అని = పలికి; వర్ణనచేయన్ = కీర్తించుటకు; విధాత = బ్రహ్మదేవుడు; నేరడు = సరిపోడు; అస్తోకము = మహోన్నతము; నీదు = నీయొక్క; రూపున్ = స్వరూపము; కలదు = ఉన్నది; అందున్ = దానిలో; తుది = అంతము; లేదు = లేదు; పరాత్పర = విష్ణుమూర్తితో; ఆద్యము = మొదలైనది; ఐ = అయ్యి.
భావము:- ధర్మమైన నీ కాంతులు చీకటిని పారద్రోలుతూ సజ్జనులను, ధర్మాత్ములను సుసంపన్నం చేస్తాయి. నిన్ను కీర్తించుటకు బ్రహ్మదేవుడికే సాధ్యం కాదు. నీది మహోన్నతమై, అనంతమై పరాత్పర స్వరూపం.

తెభా-9-133-ఆ.
మలలోచనుండు లుల శిక్షింపంగఁ
బాలు చేయ నీవు పాలు పడితి
వైన నింకఁజాలు నాపన్నుఁడై యున్న
పసిఁ గావు మీవు ర్మవృత్తి."

టీక:- కమలలోచనుండు = నారాయణుడు {కమలలోచనుడు - కమలములవంటి కన్నులుగలవాడు, విష్ణువు}; ఖలులన్ = దుష్టులను; శిక్షింపంగన్ = శిక్షించుటకై; పాలుచేయ = పంపించగా; నీవున్ = నీవు; పాలుపడితివి = పూనుకొంటివి; ఐనన్ = అయినను; ఇంకజాలున్ = ఇకచాలును; ఆపన్నుడు = ఆపదలోచిక్కినవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; తపసిన్ = మునిని; కావుము = కాపాడుము; ఈవున్ = నీవు; ధర్మవృత్తి = పుణ్యవంతమైనవిధముగ.
భావము:- విష్ణుమూర్తి దుష్టులను శిక్షించుటానికి నిన్ను పంపించాడు. నీవు ఈ పనికి పూనుకున్నావు. సరే, ఇక చాలు ఆపదలో చిక్కిన ఈ ఋషిని ధర్మవృత్తితో కాపాడు.”

తెభా-9-134-వ.
అని వినుతించి కేలుఁ దమ్మిదోయి నొసలం బొసంగించి యిట్లనియె.
టీక:- అని = అని; వినుతించి = కీర్తించి; కేలు = చేయి అనెడి; దమ్మి = పద్మముల; దోయి = జంటను (2); నొసల్ = నొసటిపైన; పొసగించి = పొందుపరచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని కీర్తించి అంబరీషుడు చేతులను నొసటిపై జోడించి ఇలా అన్నాడు.

తెభా-9-135-ఆ.
" నమస్కరింతు నింద్రశాత్రవ ధూమ
కేతువునకు ధర్మ సేతువునకు
విమల రూపమునకు విశ్వదీపమునకుఁ
క్రమునకు గుప్త క్రమునకు."

టీక:- ఏన్ = నేను; నమస్కరింతున్ = నమస్కరించుచున్నాను; ఇంద్ర = ఇంద్రును; శాత్రవ = శత్రువులను; ధూమకేతువున్ = దహించివేయుదాని {ధూమకేతువు - ధూమము (పొగ)ను కేతువు (గుర్తుగాగలది), అగ్ని, తోకచుక్క}; కున్ = కి; ధర్మ = ధర్మమును; సేతువున్ = కాపాడునది(సేతువువలె); కున్ = కి; విమల = స్వచ్ఛమైన; రూపమున్ = స్వరూపమున; కున్ = కి; విశ్వ = భువనములకు; దీపమున్ = వెలుగునిచ్చెడిదాని; కున్ = కి; చక్రమున్ = విష్ణుచక్రమున; కున్ = కు; గుప్త = కాపాడబడిన; శక్రమున్ = ఇంద్రుడుకలదాని {శక్రుడు - దుష్టులను శిక్షించుటందు శక్తిగల వాడు, ఇంద్రుడు}; కున్ = కి.
భావము:- “ఇంద్రుడి శత్రువులను దహించివేసేది, ధర్మాన్ని కాపాడు సేతువు, పరిశుద్ధ స్వరూపం, సతల భువనదీపం, ఇంద్రుని కాపాడెడి చక్రం అయిన సుదర్శన చక్రానికి నేను నమస్కారం చేస్తున్నాను.”

తెభా-9-136-వ.
అని మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని స్తుతించి ఇకా ఇలా పలికాడు.

తెభా-9-137-ఆ.
"విహిత ధర్మమందు విహరింతు నేనియు
నిష్టమైన ద్రవ్యమిత్తునేని
రణిసురుఁడు మాకు దైవతం బగునేని
విప్రునకు శుభంబు వెలయుఁగాక.

టీక:- విహిత = విధాయకమైన; ధర్మము = ధర్మమార్గము; అందున్ = లోనే; విహరింతున్ = నడచుచుంటిని; ఏనియున్ = అయినచో; ఇష్టము = కోరబడినది; ఐనన్ = అయినట్టి; ద్రవ్యమున్ = ధనమును; ఇత్తును = ఇచ్చుచుంటిని; ఏని = అయినచో; ధరణిసురుడు = విప్రుడు {ధరణిసురుడు - ధరణి (భూమిమీది) సురుడు (దేవత), బ్రాహ్మణుడు}; మా = మా; కున్ = కు; దైవతంబున్ = దైవస్వరూపుడు; అగునేని = అయినట్లయితే; విప్రున్ = బ్రాహ్మణున; కున్ = కు; శుభంబు = శుభము; వెలయుగాక = కలుగునుగాక.
భావము:- “నేనే కనుక ధర్మమార్గ విధాయకంగ నడచే వాడిని అయితే, విప్రులు కోరిన ధనాన్ని దానం చేసేవాడను అయితే, విప్రుడు మాకు దైవస్వరూపుడు అయితే, ఈ బ్రాహ్మణుడు దుర్వాసునకు శుభం కలుగు గాక.

తెభా-9-138-క.
ఖిల గుణాశ్రయుఁ డగు హరి
సుఖియై నా కొలువు వలనఁ జొక్కెడి నేనిన్
నిఖిలాత్మమయుం డగుటకు
సుమందుం గాక భూమిసురుఁ డివ్వేళన్."

టీక:- అఖిల = సర్వ; గుణ = గుణములందును; ఆశ్రయుడు = చేరియుండువాడు; హరి = విష్ణువు; సుఖి = సంతోషించినవాడు; ఐ = అయ్యి; నా = నాయొక్క; కొలువు = సేవ, ఆరాధన; వలన = వలన; చొక్కెడిని = తృప్తిచెందెను; ఏనిన్ = అయినచో; నిఖిల = సర్వా; ఆత్మన్ = ఆత్మలయందున్; మయుండు = నిండియుండువాడు; అగుటకు = ఐనట్లునిదర్శనముగా; సుఖమున్ = సుఖమును; అందుగాక = పొందుగాక; భూమిసురుడు = బ్రాహ్మణుడు {భూమిసురుడు - భూమికిదేవత, విప్రుడు}; ఈ = ఈ; వేళన్ = సమయమున.
భావము:- నా సేవ, ఆరాధనలకు సర్వగుణాత్మకుడు, సర్వాత్మకుడు అయిన శ్రీమహావిష్ణువు సంతోషించి తృప్తిచెందినట్లయితే, నిదర్శనంగా ఈ మునీశ్వరుడు ఇప్పుడే శాంతిని పొందుగాక.”

తెభా-9-139-వ.
అని యివ్విధంబునం బొగడు పుడమిఱేనివలన మన్నించి, తపసిని దాహంబు నొందింపక, రక్కసులగొంగచక్రంబు తిరిగి చనియె; నంత దుర్వాసుండు శాంతిం బొంది మెల్లని మేలి మాటల నా రాజుం దీవించి, యిట్లనియె.
టీక:- అని = అని; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; పొగడు = స్తుతించెడి; పుడమిఱేని = రాజు; వలన = ఎడల; మన్నించి = క్షమించి; తపసిని = మునిని; దాహంబున్ = తాపమును; ఒందింపకన్ = చెందించకుండ; రక్కసులగొంగ చక్రంబు = విష్ణుచక్రము {రక్కసులగొంగచక్రము - రాక్షసుల శత్రువు (విష్ణువు) యొక్క చక్రము}; తిరిగిచనియె = వెనుదిరిగెను; అంతన్ = అప్పుడు; దుర్వాసుండు = దుర్వాసుడు; శాంతిన్ = ప్రశాంతతను; పొంది = పొందిన; మెల్లని = సున్నితమైన; మేలి = మంచి; మాటలన్ = మాటలతో; ఆ = ఆ; రాజును = రాజును; దీవించి = ఆశీర్వదించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని రాజు ఈ విధంగా స్తుతించగా, మునిని క్షమించి, ఇక తాపం చెందించకుండ విష్ణుచక్రం వెనుదిరిగి తరలి పోయింది. అప్పుడు దుర్వాసుడు ప్రశాంతతను పొంది చల్లని మంచి మాటలతో ఆ రాజును ఆశీర్వదించి ఇలా పలికాడు.

తెభా-9-140-మ.
"నాథోత్తమ! మేలు చేసితి కదా! నా తప్పు మన్నించి శ్రీ
రి పాదాబ్జము లింత ముట్టఁగొలుతే? యాశ్చర్యమౌనెన్నుచో
రుదండ్రే నినుబోఁటి సాధునకుఁ దానై యిచ్చుటల్ గాచుటల్
సొరిదిన్ నైజగుణంబులై సరస వచ్చుం గాదె మిత్రాకృతిన్.

టీక:- నరనాథోత్తమ = మహారాజ {నరనాథోత్తముడు - నరనాథు (రాజు)లలో ఉత్తముడు, మహారాజు}; మేలు = ఉపకారము; చేసితి = చేసావు; కదా = సుమా; నా = నాయొక్క; తప్పున్ = పొరపాటును; మన్నించి = క్షమించి; శ్రీహరి = విష్ణుని; పాదములున్ = పాదములను; ఇంత = చాలా ఎక్కువగా; ముట్టన్ = గాఢముగా; కొలుతే = సేవించితివి; ఆశ్చర్యము = ఆశ్చర్యకరము; ఔన్ = ఐనది; ఎన్నుచో = తరచిచూసినచో; అరుదు = అపూర్వమైనది; అండ్రే = అంటారా, అనరు; నినున్ = నిన్ను; పోటి = వంటి; సాదున్ = మంచివాని; కున్ = కి; తానై = తనంతతానే; ఇచ్చుటల్ = దానముచేయుటలు; కాచుటల్ = కాపాడుటలు; సొరిదిని = మామూలుగా; నైజ = సహజ; గుణంబులు = గుణములు; ఐ = అయ్యి; సరసన్ = సుళువుగా; వచ్చున్ = సంప్రాప్తించును; కాదే = కదా; మిత్ర = మిత్రుని; ఆకృతిన్ = వలె.
భావము:- “నా పొరపాటును క్షమించి ఉపకారం చేసావు సుమా అంబరీష! విష్ణుపాదాలను ఎంత గాఢంగా సేవించావు. ఇలా నీవు నన్ను కాపాడుట ఆశ్చర్యకరము కాదు అపూర్వము కాదు. ఎందుకంటే నీ వంటి మంచివానికి దానాలు చేయుట, కాపాడుటలు అతి సహజ గుణాలు. ఆ సుగుణాలు సూర్యభగవానునికి వలె నీవంటి వారికి సుళువుగా సంప్రాప్తిస్తాయి కదా.

తెభా-9-141-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- అంతే కాకుండ.

తెభా-9-142-మ.
మాటెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోకిఁనన్
లాఘంబులు పల్లటిల్లి తొలఁగున్ సంభ్రాంతితో నట్టి స
త్సురున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశుని
న్నలంకస్థితిఁ గొల్చు భక్తులకు లే డ్డంబు రాజాగ్రణీ!

టీక:- ఒక = ఒక్క; మాటు = సారి; ఎవ్వని = ఎవనియొక్క; పేరు = నామము; కర్ణముల = చెవుల; లోనన్ = అందు; ఒయ్యారము = విలాసముగా; ఐ = అయ్యి; సోకినన్ = స్పర్శించినను; సకల = సమస్తమైన; అఘంబులున్ = పాపములు; పల్లటిల్లి = పటాపంచలై, చలించి; తొలగున్ = పోవును; సంభ్రాంతి = భయభ్రాంతుల; తోన్ = తోటి; అట్టి = అటువంటి; సత్సుకరున్ = నారాయణుని {సత్సుకరుడు - సత్ (మంచి) సుకరుడు (మేలు) కరుడు (కలిగించువాడు), విష్ణువు}; మంగళతీర్థపాదున్ = నారాయణుని {మంగళతీర్థపాదుడు - శుభకరమైన తీర్థము పాదములవద్ద కలవాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; దేవదేవేశునిన్ = నారాయణును; అకలంక = నిష్కళంకమైన; స్థితిన్ = విధముగా; కొల్చు = సేవించెడి; భక్తులు = భక్తుల; కున్ = కు; లేదు = లేదు; అడ్డంబు = సాధ్యముగానిది; రాజ = రాజులలో; అగ్రణీ = గొప్పవాడ.
భావము:- రాజశేఖరా! సత్సుకరుడు, మంగళతీర్థపాదుడు, అయిన మహా విష్ణువు నామాన్ని ఒక్క సారి చెవులారా స్పర్శించిన మాత్రంచేతనే సమస్త పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి ఆ నారాయణుని నిష్కళంక భక్తులైన నీవంటి వారికి సాధ్యం కానిది లేదు.

తెభా-9-143-మత్త.
ప్పు లోఁగొని చక్రపావక దాహముం బెడఁబాపి తౌ
నొప్పునొప్పు భవద్ధయారస మో నరేశ్వర! ప్రాణముల్
చెప్ప మున్నును పోయి క్రమ్మఱఁ జేరె ధన్యుఁడ నైతి నీ
కెప్పుడున్ శుభ మేను గోరెద నింకఁ బోయెద భూవరా!"

టీక:- తప్పున్ = తప్పిదమును; లోగొని = మన్నించి; చక్ర = సుదర్శనచక్రము; పావక = మంటల; దాహమున్ = మాడిపోవుటను; ఎడబాపితి = తప్పించితివి; ఔన్ = గొప్పది; ఒప్పునొప్పు = చాలాసరియైనదది; భవత్ = నీయొక్క; దయారసము = కృపాదృష్టి; ఔన్ = గొప్పది; నరేశ్వర = రాజ; ప్రాణముల్ = ప్రాణవాయువులు; చెప్పన్ = చెప్పవలెనంటే; మున్నును = ముందు; పోయి = పోయి; క్రమ్మఱన్ = తిరిగి; చేరెన్ = వచ్చినవి; ధన్యుడను = ధన్యుడిని; ఐతిన్ = అయ్యాను; నీ = నీ; కున్ = కు; ఎప్పుడును = ఎల్లప్పుడు; శుభము = శుభముజరగవలెనని; ఏను = నేను; కోరెదన్ = కోరుకుంటాను; ఇంక = ఇక; పోయెదన్ = వెళ్లెదను; భూవరా = రాజా {భూవరుడు - భూమికిభర్త, రాజు}.
భావము:- ఓ రాజా! నా తప్పిదాన్ని మన్నించి సుదర్శనచక్రం మంటల్లో మాడిపోకుండా కాపాడావు. నీ కృపాదృష్టి చాలా గొప్పది. చెప్పాలంటే నా ప్రాణాలు పోయి తిరిగి వచ్చాయి. ధన్యుడిని అయ్యాను. నీకు సదా శుభాలు జరగాలని కోరుతున్నాను. ఇక సెలవు.”

తెభా-9-144-క.
నిన విని రాజముఖ్యుఁడు
మునివల్లభు పాదములకు మ్రొక్కి కడున్ మ
న్నచేసి యిష్ట భోజన
నువుగఁ బెట్టించెఁ దృప్తుఁ య్యె నతండున్.

టీక:- అనినన్ = అనగా; విని = విని; రాజముఖ్యుడు = మహారాజు; ముని = మునులలో; వల్లభు = శ్రేష్ఠుని; పాదముల్ = పాదముల; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; కడున్ = మిక్కిలి; మన్నన = మర్యాద; చేసి = చేసి; ఇష్ట = ఇష్టపడెడి; భోజనమున్ = భోజనమును; అనువుగన్ = చక్కగా; పెట్టించెన్ = పెట్టించెను; తృప్తుడు = తృప్తిచెందినవాడు; అయ్యెన్ = అయ్యెను; అతండున్ = అతడు;
భావము:- అనగా విని మహారాజు మునిశ్రేష్ఠుని పాదాలకు నమస్కరించి గొప్ప మర్యాదలు చేసాడు. ఇష్టమైన భోజనం పెట్టించాడు. అతడు తృప్తిచెందాడు.

తెభా-9-145-వ.
మఱియు నమ్మునీంద్రుం డిట్లనియె.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంకను ఆ మునిశ్రేష్ఠుడు ఈ విధంగ అన్నాడు.

తెభా-9-146-శా.
"కంటిన్ నేఁటికి నిన్ను నీ వచనముల్ ర్ణద్వయిం బ్రీతిగా
వింటిన్నన్నముఁ గొంటి నీ గృహమునన్ వేడ్కన్ ఫలం బందె నే
మంటిం బోయెద; నీ చరిత్ర మమరుల్ ర్త్యుల్ సుఖాసీనులై
మింటన్ మేదిని సన్నుతింపఁగల రీమీఁదన్ నరేంద్రాగ్రణీ!"

టీక:- కంటిన్ = చూసితిని; నేటికిన్ = ఇప్పటికి; నిన్నున్ = నిన్ను; నీ = నీయొక్క; వచనముల్ = మాటలను; కర్ణ = చెవులు; ద్వయంబున్ = రెంటి (2); ప్రీతిగా = ఇష్టపూర్వకముగా; వింటిన్ = విన్నాను; అన్నమున్ = ఆహారము; కొంటిన్ = తీసుకొన్నాను; నీ = నీయొక్క; గృహమునన్ = ఇంటిలో; వేడ్కన్ = సంతోషముతో; ఫలంబు = ఫలితము; అందెన్ = దక్కినది; ఏన్ = నేను; మంటిన్ = బతికితిని; పోయెదన్ = వెళ్లిపోయెదను; నీ = నీయొక్క; చరిత్రమున్ = కథను; అమరుల్ = దేవతలు; మర్త్యుల్ = మానవులు; సుఖ = సుఖముగా; ఆసీనులు = కుర్చొన్నవారు; ఐ = అయ్యి; మింటన్ = స్వర్గమునందు; మేదినిన్ = భూమ్మీద; సన్నుతింపగలరు = కీర్తించెదరు; ఈమీదన్ = ఇకపైన; నరేంద్రాగ్రణీ = మహారాజా {నరేంద్రాగ్రణి - నరేంద్రు (రాజు)లలో అగ్రణి (అదికుడు), మహారాజు}.
భావము:- “అంబరీష మహారాజా! నేటికి నిన్ను కళ్ళారా చూసాను. ఇప్పటికి నీ మాటలను చెవులారా విన్నాను. నీ ఇంటిలో తృప్తిగా భోజనం చేసాను. ఫలితం దక్కింది. నేను బతికిపోయాను. ఇక సెలవు వెళ్తాను. నీ కథను దేవతలు మానవులు స్వర్గంలో భూమ్మీద కీర్తిస్తారు.”

తెభా-9-147-వ.
అని చెప్పి దుర్వాసుం డంబరీషుని దీవించి కీర్తించి మింటి తెరువున బ్రహ్మలోకంబునకుం జనియె, మునీశ్వరుండు వచ్చి మగుడం జనువేళకు నొక్కవత్సరంబు నిండి వ్రతంబు పరిపూర్ణం బైన.
టీక:- అని = అని; చెప్పి = చెప్పి; దుర్వాసుండు = దుర్వాసుండు; అంబరీషుని = అంబరీషుని; దీవించి = ఆశీర్వదించి; కీర్తించి = పొగిడి; మింటి = ఆకాశ; తెరువునన్ = మార్గములో; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; ముని = మునులలో; ఈశ్వరుండు = ఉత్తముడు; వచ్చి = వచ్చి; మగుడన్ = తిరిగి; చను = వెళ్ళెడి; వేళ = సమయమున; కున్ = కు; వత్సరంబున్ = సంవత్సరము; నిండి = పూర్తయిపోయి; వ్రతంబు = వ్రతము; పరిపూర్ణంబు = సంపూర్ణము; ఐనన్ = కాగా.
భావము:- అని చెప్పి దుర్వాసుండు అంబరీషుని ఆశీర్వదించి, పొగిడి, ఆకాశమార్గాన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. మునీశ్వరుడు వచ్చి తిరిగి వెళ్ళిన సమయానికి సంవత్సరం పూర్తయిపోయి వ్రతం సంపూర్ణము అయింది. కనుక....

తెభా-9-148-ఆ.
వనిసురుఁడు గుడువ తి పవిత్రంబైన
వంటకంబు భూమిరుఁడు గుడిచెఁ
పసి నెగులు మాన్పఁ దానెంత వాఁడను
రి కృపామహత్వ నుచుఁ దలఁచి.

టీక:- అవనిసురుండు = బ్రాహ్మణుడు {అవనిసురుడు - అవని (బూమికి) సురుడు (దేవత), విప్రుడు}; కుడువన్ = తినుటచేత; అతి = మిక్కిలి; పవిత్రంబు = పవిత్రమైనది; ఐనన్ = అయినట్టి; వంటకంబున్ = భోజనపదార్థమును; భూమివరుడు = రాజు {భూమివరుడు - భూమికి భర్త, రాజు}; కుడిచెన్ = తినెను; తపసి = మునియొక్క; నెగులున్ = కష్టమును; మాన్పన్ = పోగొట్టుటకు; తాన్ = తను; ఎంతవాఁడను = అంతసమర్థుడను కాను; హరి = విష్ణుని; కృపా = దయయొక్క; మహత్వము = గొప్పదనము, ప్రభావము; అనుచున్ = అంటు; తలచి = భావించి.
భావము:- బ్రాహ్మణుడు దుర్వాసుడు భుజించాక రాజు భోజనం చేసాడు. ముని కష్టం పోగొట్టింది విష్ణుదేవుని దయాప్రభావం తప్ప నేను అంతటి సమర్థుడను కాను అని అంబరీషుడు భావించాడు.

తెభా-9-149-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకను.

తెభా-9-150-క.
రి గొల్చుచుండువారికిఁ
మేష్ఠిపదంబు మొదలు దభోగంబుల్
కసమము లను తలఁపున
ణీ రాజ్యంబుతోడి గులము మానెన్.

టీక:- హరిన్ = విష్ణుమూర్తిని; కొల్చుచుండు = సేవించెడి; వారి = వైరల; కిన్ = కు; పరమేష్ఠి = బ్రహ్మదేవుని; పదంబున్ = పదవి, పీఠము; మొదలు = మొదలైన; పద = పదవీ; భోగంబుల్ = భోగములు; నరక = నరకముతో; సమములు = సమానమైనవి; అను = అనెడి; తలపునన్ = భావముతో; ధరణీ = భూమండలమంతటి; రాజ్యంబున = రాజ్యాధికారము; తోడి = తోటి; తగులము = మోహమును; మానెన్ = వదలివేసెను.
భావము:- విష్ణుమూర్తిని సేవించె వారికి బ్రహ్మపదవి మొదలైన పదవీ భోగాలు నరకంతో సమానం అనెడి తలంపుతో, అంత గొప్ప రాజ్యాధికారం ఎడల మోహం వదలివేసాడు.

తెభా-9-151-వ.
ఇట్లు విరక్తుండై.
టీక:- ఇట్లు = ఈ విధముగ; విరక్తుండు = కామాది జయించినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఈ విధంగ కామాది షట్కాన్ని జయించి.....

తెభా-9-152-ఆ.
నకు సదృశులైన నయుల రావించి
రణి భరము వారిఁ దాల్పఁ బంచి
కాననంబు చొచ్చెఁ గామాది విజయుఁడై
రవిభుండు హరిసనాథుఁ డగుచు.

టీక:- తన = తన; కున్ = కు; సదృశులు = సాటివచ్చెడివారు; ఐనన్ = అయినట్టి; తనయుల్ = పుత్రులను; రావించి = పిలిపించి; ధరణిభరమున్ = భూభారమును; వారిన్ = వారికి; తాల్పన్ = భరించమని; పంచి = ఆజ్ఞాపించి; కాననంబు = అడవికి; చొచ్చెన్ = వెళ్లిపోయెను; కామాది = అరిషడ్వర్గములను {కామాది - 1కామ 2క్రోధ 3లోభ 4మద 5మోహ 6మాత్సర్య అనెడి వర్గ శత్రులు, అరిషడ్వర్గములు}; విజయుడు = జయించినవాడు; ఐ = అయ్యి; నరవిభుండు = రాజు {నరవిభుడు - మానవులప్రభువు, రాజు}; హరి = విష్ణుమూర్తిని; సనాథుడు = అండగాగలవాడు; అగుచున్ = ఐ ఉండి.
భావము:- అలా అరిషడ్వర్గాలను జయించిన అంబరీషుడు, తనకు సాటివచ్చె పుత్రులను పిలిపించి రాజ్యభారం వారికి అప్పజెప్పి. విష్ణుమూర్తిని అండగాగొని అడవికి వెళ్లిపోయాడు.

తెభా-9-153-క.
యంబరీషు చరితముఁ
దీయంబున విన్నఁ జదువ ధీసంపన్నుం
డై యుండును భోగపరుం
డై యుండును నరుఁడు పుణ్యుఁడై యుండు నృపా!

టీక:- ఈ = ఈయొక్క; అంబరీషున్ = అంబరీషుని; చరితమున్ = కథను; తీయంబునన్ = ఆసక్తితో; విన్నన్ = వినినను; చదువన్ = చదివినను; ధీ = జ్ఞానము; సంపన్నుండు = అదికముగాగలవాడు; ఐ = అయ్యి; ఉండును = ఉండును; భోగపరుండు = వైభోగములుగలవాడు; ఐ = అయ్యి; ఉండును = ఉండును; నరుడు = మానవుడు; పుణ్యుడు = పుణ్యాత్ముడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; నృపా = రాజా {నృపా - నరులను పాలించువాడు, రాజు}.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! ఈ అంబరీషుని కథను ఆసక్తితో విన్న వాడు, చదివిన వాడు గొప్ప జ్ఞానవైభోగాలు పొంది పుణ్యాత్ములు అవుతారు.

తెభా-9-154-వ.
విను మయ్యంబరీషునకు విరూపుండును, గేతుమంతుండును, శంభుండును ననువారు మువ్వురు గొడుకు; లందుఁ గేతుమంతుడును శంభుండును హరింగూర్చి తపంబు చేయువారై వనంబునకుం జనిరి; విరూపునికిఁ బృషదశ్వుండును, బృషదశ్వునకు రథీతరుండును గలిగి; రమ్మహాత్మునికి సంతతి లేకున్ననంగిరసుఁ డను మునీంద్రుం డతని భార్యయందు బ్రహ్మతేజోనిధు లయిన కొడుకులం గలిగించె వారలు రథీతరగోత్రులు నాంగిరసులను బ్రాహ్మణులునై యితరు లందు ముఖ్యులయి ప్రవర్తిల్లి' రని చెప్పి శుకుం డిట్లనియె.
టీక:- వినుము = వినుము; ఆ = ఆ; అంబరీషున్ = అంబరీషున; కున్ = కు; విరూపుండును = విరూపుడు; కేతుమంతుడును = కేతుమంతుడు; శంభుండును = శంభుడు; అనువారు = అనెడివారు; మువ్వురు = ముగ్గురు (3); కొడుకులు = పుత్రులు; అందు = వారిలో; కేతుమంతుడును = కేతుమంతుడు; శంభుండును = శంభుడు; హరిన్ = విష్ణుని; గూర్చి = గురించి; తపంబున్ = తపస్సు; చేయువారు = చేసెడివారు; ఐ = అయ్యి; వనంబున్ = అడవికి; చనిరి = వెళ్ళిపోయిరి; విరూపున్ = విరూపుని; కిన్ = కి; పృషదశ్వుండును = పృషదశ్వుడు; పృషదశ్వున్ = పృషదశ్వుని; కిన్ = కి; రథీతరుండును = రథీతరుడు; కలిగిరి = పుట్టిరి; ఆ = ఆ; మహాత్మున్ = గొప్పవాని; కిన్ = కి; సంతతి = పిల్లలు; లేకున్న = లేకపోవుటచేత; అంగిరసుడు = అంగిరసుడు; అను = అనెడి; ముని = మునులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; అతని = అతనియొక్క; భార్య = రాణి; అందున్ = అందు; బ్రహ్మతేజస్సు = బ్రాహ్మణతేజస్సు; నిధులు = అధికముగ కలవారు; అయిన = ఐన; కొడుకులన్ = పుత్రులను; కలిగించెన్ = పుట్టించెను; వారలు = వారు; రథీతర = రథీతర అనెడి; గోత్రులు = గోత్రమున పుట్టినవారు; అంగిరసులు = అంగిరసులు; అను = అనెడి; బ్రాహ్మణులున్ = బ్రాహ్మణులు; ఐ = అయ్యి; ఇతరులు = మిగతావారి; అందు = లో; ముఖ్యులు = ప్రసిద్ధిచెందినవారు; అయి = ఐ; ప్రవర్తిల్లిరి = వర్తించిరి; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- వినుము. ఆ అంబరీషునకు విరూపుడు కేతుమంతుడు శంభుడు అని ముగ్గురు (3) పుత్రులు. వారిలో కేతుమంతుడు శంభుడు ఇద్దరు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయారు. విరూపునికి పృషదశ్వుడు. పృషదశ్వుడికి రథీతరుడు పుట్టారు. అతనికి పిల్లలు లేకపోవుటచేత అంగిరసుడు అనెడి మునిముఖ్యుడు అతని రాణి అందు బ్రాహ్మణ తేజస్సు పుత్రులను పుట్టించాడు. వారు రథీతర అను గోత్రంతో పుట్టిన అంగిరసులు అనె బ్రాహ్మణులుగా ప్రసిద్ధి చెందారు.” అని చెప్పి శుకుడు ఇలా అన్నాడు.