పోతన తెలుగు భాగవతము/నవమ స్కంధము/ఇక్ష్వాకుని వంశము

వికీసోర్స్ నుండి

ఇక్ష్వాకుని వంశము

తెభా-9-155-క.
నాఁడు మనువు దుమ్మిన
విలుఁడు గా కతని ఘ్రాణవివరము వెంటం
బ్రటయశుం డిక్ష్వాకుం
లంకుఁడు పుట్టె రవికులాధీశుండై.

టీక:- ఒక = ఒకానొక; నాడు = దినమున; మనువు = మనువు; తుమ్మినన్ = తుమ్మగా; వికలుడు = వైకల్యముకలవాడు; కాక = కానట్టివాడు; అతని = అతనియొక్క; ఘ్రాణవివరము = ముక్కురంధ్రము; వెంటన్ = నుండి; ప్రకట = ప్రసిద్ధమైన; యశుండు = కీర్తిగలవాడు; ఇక్ష్వాకుండు = ఇక్ష్వాకుడు; అకలంకుడు = నిష్కంళంకుడు; పుట్టెన్ = జనించెను; రవికుల = సూర్యవంశపు; అధీశుండు = రాజు; ఐ = అయ్యి.
భావము:- “ఒక నాడు మనువు తుమ్మగా ఆ వైకల్యరహితుని ముక్కురంధ్రం నుండి నిష్కంళంకుడు ఇక్ష్వాకుడు జనించాడు. అతను సూర్యవంశపు రాజులలో ముఖ్యుడు.

తెభా-9-156-సీ.
క్ష్వాకునకుఁ బుత్రు లెలమిఁ బుట్టిరి నూర్వు-
ర వికుక్షియు నిమియు దండ
కుండు నాతని పెద్దకొడుకులు మువ్వు రా-
ర్యావర్త మందు హిమాచలంబు
వింధ్యాద్రిమధ్య ముర్వీమండలము గొంత-
యేలిరి యిరువదియేవు రొక్క
పొందున నా తూర్పుభూమి పాలించిరి-
యందఱు పడమటి ధిపులైరి

తెభా-9-156.1-తే.
యున్ననలువది యేడ్వురు నుత్త రోర్వి
క్షిణోర్వియుఁ గాచిరి తండ్రి యంత
ష్టకాశ్రాద్ధ మొనరింతు నుచు నగ్ర
సుతు వికుక్షి నిరీక్షించి శుద్ధమైన
మాంసఖండంబు దెమ్మనె హితయశుఁడు.

టీక:- ఇక్ష్వాకున్ = ఇక్ష్వాకుని; కున్ = కి; పుత్రులు = కొడుకులు; ఎలమిన్ = వికాసముతోటి; పుట్టిరి = కలిగిరి; నూర్వురు = వందమంది; అమరన్ = క్రమముగావారు; వికుక్షియున్ = వికుక్షి; నిమియున్ = నిమి; దండకుండు = దండకుడు; ఆతని = అతనియొక్క; పెద్ద = పెద్ద; కొడుకులు = పుత్రులు; మువ్వురు = ముగ్గురు (3); ఆర్యావర్తము = ఆర్యావర్తము {ఆర్యావర్తము - ఆర్యులు తిరిగెడి ప్రదేశము, వింధ్య హిమాచలముల మధ్యప్రదేశము}; అందున్ = లోని; హిమాచలంబున్ = హిమాచలమునకున్; వింధ్యాద్రి = వింధ్యపర్వతముల; మధ్య = నడుమ; ఉర్వీమండలమున్ = భూభాగమును; కొంత = కొంతవరకు; ఏలిరి = పాలించిరి; ఇరువదియేవురు = ఇరవైఐదుమంది (25); ఒక్క = ఒక; పొందునన్ = కలిసికట్టుగా; ఆ = ఆ; తూర్పు = తూర్పువైపున్న; భూమిన్ = రాజ్యమును; పాలించిరి = పరిపాలించిరి; అందఱున్ = అంతేమంది; పడమటి = పశ్థిమమునకు; కిన్ = కి; అధిపులు = రాజులు; ఐరి = అయితిరి.
ఉన్న = మిగిలిన; నలువదియేడ్వురును = నలభై ఏడుమంది (47); ఉత్తర = ఉత్తరపువైపు; ఉర్విన్ = భూములను; దక్షిణ = దక్షిణదిశవైపు; ఉర్వియున్ = భూములను; కాచిరి = పాలించిరి; తండ్రి = తండ్రి; అంతన్ = అప్పుడు; అష్టకా = అష్టకయనెడి {అష్టకాశ్రాద్దము - వైశ్వదేవ సంబంధమైన సప్తపాక యజ్ఞములలో ఒకటి, మాఘబహుళ షష్టి సప్తమి అష్టమి మూడు తిథులందు పితృదేవతల గూర్చి చేయునది}; శ్రాద్ధమున్ = తద్దినమును; ఒనరింతున్ = చేసెదను; అనుచున్ = అంటు; అగ్ర = పెద్ద; సుతున్ = కొడుకును; వికుక్షిన్ = వికుక్షిని; నిరీక్షించి = ఉద్దేశించి; శుద్ధము = పరిశుద్దమ; ఐన = అయినట్టి; మాంస = మాంసపు; ఖండంబున్ = ముక్కను; తెమ్ము = తీసుకొనిరా; అనె = అనిచెప్పెను; మహిత = గొప్ప; యశుడు = కీర్తిమంతుడు.
భావము:- ఇక్ష్వాకునికి వందమంది కొడుకులు. వికుక్షి, నిమి, దండకుడు అతని పెద్ద పుత్రులు ముగ్గురు (3) ఆర్యావర్తంలోని హిమాచలమునకున్ వింధ్యపర్వతముల నడుమ భూభాగాన్ని పాలించారు. ఇరవైఐదుమంది (25) కలిసి తూర్పువైపు ఉన్న రాజ్యాన్ని పరిపాలించారు. ఇంకొక ఇరవైఐదుమంది (25) పశ్చిమానికి రాజులు అయ్యారు. మిగిలిన నలభై ఏడుమంది (47) ఉత్తర భూములను దక్షిణ భూములను పరిపాలించారు. అప్పుడు తండ్రి అష్టకాశ్రాద్దం చేస్తాను అంటు పెద్ద కొడుకు వికుక్షిని పరిశుద్దమైన మాంసము తీసుకొనిరమ్మని పంపాడు.