పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/శ్రీహరి నిత్యవిభూతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-2-268-సీ. )[మార్చు]

ట్టి విరాడ్విగ్రహాంత రాకాశంబు;
లన నోజస్సహోలము లయ్యెఁ
బ్రాణంబు సూక్ష్మరూక్రియాశక్తిచే;
నియించి ముఖ్యాసు నఁగ బరఁగె
వెలువడి చను జీవి వెనుకొని ప్రాణముల్;
నుచుండు నిజనాథు నుసరించు
టుల చందంబునఁ బాటిల్లు క్షుత్తును;
భూరి తృష్ణయు మఱి ముఖమువలనఁ

(తెభా-2-268.1-తే. )[మార్చు]

దాలు జిహ్వాదికంబు లుద్భవము నొందె
నందు నుదయించె నానావిధైక రసము
లెనయ నవి యెల్ల జిహ్వచే నెఱుఁగఁబడును
మొనసి పలుక నపేక్షించు ముఖమువలన.

(తెభా-2-269-వ. )[మార్చు]

మఱియు వాగింద్రియంబు వుట్టె; దానికి దేవత యగ్ని, యారెంటి వలన భాషణంబు వొడమె; నా యగ్నికి మహాజల వ్యాప్తం బగు జగంబున నిరోధంబుగలుగటం జేసి యా జలంబె ప్రతిబంధకం బయ్యె; దోదూయమానంబైన మహావాయువువలన ఘ్రాణంబు పుట్టెం; గావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ సమర్థం బయ్యె; నిరాలోకం బగు నాత్మ నాత్మయందుఁ జూడం గోరి తేజంబువలన నాదిత్యదేవతాకంబై రూపగ్రాహకంబైన యక్షియుగళంబు వుట్టె; ఋషిగణంబులచేత బోధితుం డగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును నైన శ్రోత్రేంద్రియంబు వుట్టించె; సర్జనంబు సేయు పురుషునివలన మృదుత్వ కాఠిన్యంబులును లఘుత్వ గురుత్వంబులును నుష్ణత్వ శీతలత్వంబులునుం జేసెడు త్వగింద్రియాధిష్టానం బగు చర్మంబు వుట్టె; దానివలన రోమంబు లుదయించె వానికి మహీరుహంబు లధిదేవత లయ్యె; నందు నధిగత స్పర్శగుణుండును నంతర్భహిః ప్రదేశంబుల నావృతుండును నగు వాయువువలన బలవంతంబులును, నింద్రదేవతాకంబులును, నాదాన సమర్థంబులును, నానా కర్మకరణదక్షంబులును నగు హస్తంబు లుదయించె; స్వేచ్ఛావిషయగతి సమర్థుండగు నీశ్వరుని వలన విష్ణుదేవతాకంబు లగు పాదంబు లుదయించె; బ్రజానందామృతార్థి యగు భగవంతునివలన ప్రజాపతిదేవతాకంబై, స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు గార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు లుదయించె మిత్రుం డధిదైవతంబుగాఁ గలిగి భుక్తాన్నాద్యసారాంశ త్యాగోపయోగం బగు పాయు వనెడి గుదం బుద్భవించె; దాని కృత్యం బుభయ మలమోచనంబు; దేహంబుననుండి దేహాంతరంబుఁ జేరంగోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించె; నట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానం బనంబడుఁ; దద్బంధ విశ్లేషంబె మృత్యు వగు; నదియ యూర్థ్వాధోదేహభేదకం బనియును జెప్పంబడు; నన్నపానాది ధారణార్థంబుగ నాంత్రకుక్షి నాడీ నిచయంబులు గల్పింపంబడియె; వానికి నదులును సముద్రంబులును నధిదేవత లయ్యె; వానివలనఁ దుష్టిపుష్టులును నుదర భరణరస పరిణామంబులు గలిగియుండు; నాత్మీయ మాయా చింతనంబొనర్చు నపుడు కామసంకల్పాది స్థానం బగు హృదయంబు; గలిగె దాని వలన మనంబును జంద్రుండును గాముండును సంకల్పంబును నుదయించె; నంతమీఁద జగత్సర్జనంబు సేయు విరాడ్విగ్రహంబున సప్తధాతువులును, బృథివ్యప్తేజోమయంబు లయిన సప్తప్రాణంబులును, వ్యోమాంబువాయువులచే నుత్పన్నంబులై గుణాత్మకంబు లైన యింద్రియంబులును, నహంకార ప్రభవంబు లైన గుణంబులును, సర్వవికారస్వరూపం బగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియును బుట్టు; వివిధంబగు నిదియంతయు సర్వేశ్వరుని స్థూలవిగ్రహంబు; మఱియును.

(తెభా-2-270-క. )[మార్చు]

రుసఁ బృథివ్యాద్యష్టా
ణావృతమై సమగ్ర వైభవములఁ బం
రుహభవాండాతీత
స్ఫు ణం జెలువొందు నతివిభూతి దలిర్పన్.

(తెభా-2-271-క. )[మార్చు]

పొ లుపగు సకల విలక్షణ
ము లు గల యాద్యంత శూన్యమును నిత్యమునై
లి సూక్ష్మమై మనో వా
క్కు కుం దలపోయఁగా నగోచర మగుచున్.

(తెభా-2-272-సీ. )[మార్చు]

లఘు తేజోమయంబైన రూపం బిది;
క్షితినాథ! నాచేతఁ జెప్పఁబడియె;
మానిత స్థూల సూక్ష్మస్వరూపంబుల;
లన నొప్పెడు భగత్స్వరూప
మ్మహాత్మకుని మాయాబలంబునఁ జేసి;
దివ్యమునీంద్రులుఁ దెలియలేరు;
సుధేశ! వాచ్యమై వాచకంబై నామ ;
రూపముల్ క్రియలును రూఢిఁ దాల్చి

(తెభా-2-272.1-ఆ. )[మార్చు]

యుండు నట్టి యీశ్వరుండు నారాయణుం
ఖిలధృత జగన్నియంతయైన
చిన్మయాత్మకుండు సృజియించు నీ ప్రజా
తుల ఋషులఁ బితృ వితుల నెలమి.

(తెభా-2-273-వ. )[మార్చు]

మఱియును.

(తెభా-2-274-సీ. )[మార్చు]

సుర సిద్ద సాధ్య కిన్నర వర చారణ;
రుడ గంధర్వ రాక్షస పిశాచ
భూత వేతాళ కింపురుష కూశ్మాండ గు;
హ్యక డాకినీ యక్ష యాతుధాన
విద్యాధ రాప్సరో విషధర గ్రహ మాతృ;
ణ వృక హరి ఘృష్టి గ మృగాళి
ల్లూక రోహిత శు వృక్ష యోనుల;
వివిధ కర్మంబులు వెలయఁ బుట్టి

(తెభా-2-274.1-తే. )[మార్చు]

ల నభో భూ తలంబుల సంచరించు
జంతు చయముల సత్త్వరస్తమో గు
ములఁ దిర్యక్సురాసుర ర ధరాది
భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర!

(తెభా-2-275-మ. )[మార్చు]

వొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబుసు
స్థి తం జేసి, హరిస్వరూపుఁడయి రక్షించున్ సమస్తవ్రజో
త్క సంహారము సేయు నప్పుడు హరాంర్యామియై యింతయున్
రియించుం బవనుండు మేఘముల మాయం జేయు చందంబునన్.

(తెభా-2-276-క. )[మార్చు]

గిదిని విశ్వము సం
స్థా పించును మనుచు నడఁచు ర్మాత్మకుఁడై
దీ పిత తిర్యఙ్నర సుర
రూ పంబులు దాన తాల్చి రూఢి దలిర్పన్.

(తెభా-2-277-సీ. )[మార్చు]

రి యందు నాకాశ; మాకాశమున వాయు;
నిలంబువలన హుతాశనుండు;
వ్యవాహను నందు నంబువు; లుదకంబు;
లన వసుంధర లిగె; ధాత్రి
లన బహుప్రజాళి యుద్భవం బయ్యె;
నింతకు మూలమై యెసఁగునట్టి
నారాయణుఁడు చిదానంద స్వరూపకుం, ;
వ్యయుం, డజుఁడు, ననంతుఁ, డాఢ్యుఁ,

(తెభా-2-277.1-తే. )[మార్చు]

డాదిమధ్యాంతశూన్యుం, డనాదినిధనుఁ,
తని వలనను సంభూత మైన యట్టి
సృష్టి హేతు ప్రకార మీక్షించి తెలియఁ
జాల రెంతటి మునులైన నవరేణ్య!

(తెభా-2-278-వ. )[మార్చు]

అదియునుంగాక.

(తెభా-2-279-మ. )[మార్చు]

ణీశోత్తమ! భూత సృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
రి కర్తృత్వము నొల్ల కాత్మగత మాయారోపితం జేసి తా
ని వద్యుండు నిరంజనుండుఁ బరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్
ని పేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వముం బొందెడిన్.

(తెభా-2-280-వ. )[మార్చు]

బ్రహ్మసంబంధి యగు నీ కల్పప్రకారం బవాంతరకల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున నెఱింగిచింతి; నిట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్పప్రకారంబులును, దత్పరిమాణంబులును, కాలకల్పలక్షణంబులును, నవాంతరకల్ప మన్వంతరాది భేదవిభాగ స్వరూపంబును నతి విస్తారంబుగ నెఱిగింతు విను; మదియునుం బద్మకల్పం బనందగు" నని భగవంతుండైన శుకుండు బరీక్షిత్తునకుం జెప్పె" నని సూతుండు మహర్షులకు నెఱింగిచిన.

21-05-2016: :