పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/తాపసుని జీవయాత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-2-20-వ. )[మార్చు]

విను; మూఁఢుండు శబ్దమయవేదమార్గంబైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబుల నిచ్చగించుచు మాయామయ మార్గంబున వాసనా మూలంబున నిద్రించువాఁడు గలలుగను తెఱంగునం బరిభ్రమించుచు నిరవద్య సుఖలాభంబుం జెందఁడు; తన్నిమిత్తంబున విద్వాంసుండు నామ మాత్రసారంబు లగు భోగ్యంబులలోన నెంతట దేహనిర్వహణంబు సిద్ధించు, నంతియ కైకొనుచు నప్రమత్తుండై సంసారంబు సుఖం బని నిశ్చయింపక యొండు మార్గంబున సిద్ధి గల దని చూచి పరిభ్రమణంబు సేయుచుండు.

(తెభా-2-21-సీ. )[మార్చు]

'మనీయభూమిభాములు లేకున్నవే;
డియుండుటకు దూదిణుపు లేల?
హజంబులగు కరాంలులు లేకున్నవే;
భోజనభాజనపుంజ మేల?
ల్కలాజినకుశాళులు లేకున్నవే;
ట్ట దుకూల సంఘంబు లేల?
కొనకొని వసియింప గుహలు లేకున్నవే;
ప్రాసాదసౌధాది టల మేల?

(తెభా-2-21.1-తే. )[మార్చు]

లరసాదులు గురియవే పాదపములు;
స్వాదుజలముల నుండవే కల నదులు;
పొసఁగ బిక్షము వెట్టరే పుణ్యసతులు;
నమదాంధుల కొలువేల తాపసులకు?

(తెభా-2-22-క. )[మార్చు]

క్షకులు లేనివారల
క్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్
క్షింపు మనుచు నొక నరు
క్షము బ్రార్థింపనేల యాత్మజ్ఞులకున్?'

(తెభా-2-23-వ. )[మార్చు]

అని యిట్లు స్వతస్సిద్ధుండును, నాత్మయుఁ, బ్రియుండును, నిత్యుండును, సత్యుండును, భగవంతుండును నైన వాసుదేవుని భజించి తదీయ సేవానుభ వానందంబున సంసార హేతువగు నవిద్యవలన బుద్ధిమంతుండు విడువబడుం గావున.

(తెభా-2-24-మ. )[మార్చు]

రిఁ జింతింపక మత్తుఁడై విషయ చింతాయత్తుఁడై చిక్కి వా
ముల్ ద్రోసెడువాఁడు కింకరగదాసంతాడితోరస్కుఁడై
ణీశోత్తమ! దండభృన్నివసనద్వారోపకంఠోగ్ర వై
ణీవహ్నిశిఖాపరంపరలచే గ్ధుండు గాకుండునే?

(తెభా-2-25-క. )[మార్చు]

మొ త్తుదురు గదల, మంటల
కె త్తుదు రడ్డంబు, దేహమింతింతలుగా
నొ త్తుదు, రసిపత్రికలను
త్తుదురు కృతాంతభటులు రివిరహితులన్.

(తెభా-2-26-వ. )[మార్చు]

మఱియు హరి చరణ కమలగంధ రసాస్వాదనం బెఱుంగని వారలు నిజకర్మబంధంబుల దండధర మందిర ద్వార దేహళీ సమీప జాజ్వాల్యమాన వైతరణీ తరంగిణీ దహనదారుణ జ్వాలాజాల దందహ్యమాన దేహులం గూడి శిఖిశిఖావగాహంబుల నొందుచుండుదురు; మఱియు విజ్ఞానసంపన్నులై మను ప్రసన్నులు మాయాపన్నులు గాక విన్నాణంబునం దమతమ హృదయాంతరాళంబులం బ్రాదేశమాత్ర దివ్యదేహుండును, దిగిభరాజశుండాదండ సంకాశ దీర్ఘ చతుర్భాహుండును, కందర్పకోటి సమాన సుందరుండును, ధృతమందరుండును, రాకావిరాజమాన రాజమండల సన్నిభ వదనుండును, సౌభాగ్య సదనుండును, బ్రభాతకాల భాసమాన భాస్కరబింబ ప్రతిమానవిరాజిత పద్మరాగరత్న రాజీవి రాజమాన కిరీట కుండలుండును, శ్రీవత్సలక్షణ లక్షిత వక్షోమండలుండును, రమణీయ కౌస్తుభరత్నఖచిత కంఠికాలంకృత కంధరుండును, నిరంతరపరిమళమిళిత వనమాలికాబంధురుండును నానావిధ గంభీర హార కేయూర కటక కంకణ మేఖలాంగుళీయక విభూషణవ్రాత సముజ్జ్వలుండును, నిటలతట విలంబ మాన విమలస్నిగ్ధ నీలకుంచితకుంతలుండును, తరుణచంద్ర చంద్రికాధవళ మందహాసుండును, బరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత సుభగసంతతానుగ్రహలీలావిలాసుండును, మహాయోగిరాజ వికసిత హృదయకమలకర్ణికామధ్య సంస్థాపిత విలసిత చరణకిసలయుండును, సంతతానందమయుండును, సహస్రకోటి సూర్య సంఘాతసన్నిభుండును, విభుండునునైన పరమేశ్వరుని మనోధారణావశంబున నిలిపికొని తదీయ గుల్ఫ చరణ జాను జంఘాద్యవయవంబులం గ్రమంబున నొక్కొక్కటిని బ్రతిక్షణంబును ధ్యానంబు సేయుచు నెంతకాలంబునకుఁ బరిపూర్ణ నిశ్చలభక్తియోగంబు సిద్ధించు నంతకాలంబునుం దదీయ చింతా తత్పరులై యుందు" రని మఱియు నిట్లనియె.

(తెభా-2-27-సీ. )[మార్చు]

"సన్నమరణార్థి యైన తీశుండు;
కాల దేశములను గాచికొనఁడు
నువు విసర్జించు లఁపు జనించిన;
ద్రాసనస్థుఁడై ప్రాణపవను
నసుచేత జయించి మానసవేగంబు;
బుద్ధిచే భంగించి బుద్ధిఁ దెచ్చి
క్షేత్రజ్ఞుతోఁ గూర్చి క్షేత్రజ్ఞునాత్మలో;
లఁ జేర్చి యాత్మను బ్రహ్మ మందు

(తెభా-2-27.1-తే. )[మార్చు]

లిపి యొక్కటి గావించి గారవమున
శాంతితోడ నిరూఢుఁడై కలకార్య
నివహ మెల్లను దిగనాడి నిత్యసుఖము
లయు నని చూచు నటఁమీఁద సుమతీశ!

21-05-2016: :