పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వృషభాసుర వధ

వికీసోర్స్ నుండి

తెభా-10.1-1137-సీ.
వ్వని మూఁపుర మీక్షించి మేఘంబు-
ద్రిశృంగం బని యాశ్రయించు;
నెవ్వని ఱంకె కర్ణేంద్రియంబులు సోఁక-
ర్భపాతన మగు ర్భిణులకు;
నెవ్వని పదహతి నెగయు పరాగంబు-
లంధకారారాతి నావరించు;
నెవ్వఁడు కొమ్ముల నెదిరించి చిమ్మినఁ; -
బృథ్వీధరంబులు పెల్లగిల్లు;

తెభా-10.1-1137.1-తే.
ట్టి వృషభాసురేంద్రుఁ డహంకరించి
వాలలత నెత్తి పెనుఱంకె వైచి నేలఁ
గాలు ద్రవ్వుచు నిశితశృంములు చాఁచి
మంద బెగడంగఁ గవిసె నమంద గతిని.

టీక:- ఎవ్వని = ఎవని యొక్క; మూపురము = కకుదము {మూపురము - ఎద్దు యొక్క భుజశిఖరము, కకుదము}; ఈక్షించి = చూసి; మేఘంబులు = మేఘములు; అద్రి = కొండ; శృంగంబు = శిఖరము; అని = అని; ఆశ్రయించున్ = చేరును; ఎవ్వని = ఎవని యొక్క; ఱంకె = రంకెలు; కర్ణేంద్రియంబులున్ = చెవులందు; సోకన్ = తాకగా; గర్భపాతనము = గర్భస్రావము; అగున్ = అగునో; గర్భిణుల్ = గర్భవతుల; కున్ = కు; ఎవ్వని = ఎవని యొక్క; పద = కాలి; హతిన్ = తొక్కిడిచే; ఎగయున్ = రేగునో; పరాగంబులు = ధూళి; అంధకారారాతిన్ = సూర్యుని {అంధకారారాతి - చీకటికి శత్రువు, సూర్యుడు}; ఆవరించున్ = కప్పివేయునో; ఎవ్వండు = ఎవరు; కొమ్ములన్ = కొమ్ములతో; ఎదిరించి = ఎదురుతిరిగి; చిమ్మినన్ = ఎదజిమ్మినచో; పృధ్వీధరంబులు = కొండలు; పెకలింపబడున్ = పెళ్ళగిలి పడిపోవునో; అట్టి = అటువంటి.
వృషభ = వృషభుడు అనెడి; అసుర = రాక్షస; ఇంద్రుడు = ప్రభువు; అహంకరించి = గర్వించి; వాల = తోక అనెడి; లతన్ = తీగను; ఎత్తి = ఎత్తి; పెను = పెద్ద; ఱంకెన్ = రంకెను; వైచి = వేసి; నేలన్ = భూమిని; కాలున్ = కాలితో; తవ్వుచున్ = తవ్వుతూ; నిశిత = వాడి యైన; శృంగములు = కొమ్ములు; చాచి = చాచి; మంద = గోకులము; బెగడంగన్ = బెదురుతుండగా; కవిసెన్ = వ్యాపించెను; అమంద = తీవ్రమైన; గతిన్ = వేగముకలవాడై.
భావము:- వృషభాసురుడి మూపురం చూసి మేఘాలు పర్వత శిఖరం అని భ్రమించి పైన వాలుతాయి. వాడి రంకె చెవిన పడిదంటే చాలు గర్భవతులకు గర్భస్రావాలు అవుతాయి. వాడి కాలి త్రొక్కిడికి ఎగిరే దుమ్ము సూర్యుణ్ణి క్రమ్మేస్తుంది. వాడు కొమ్ములొడ్డి ఎగజిమ్మి కొండలను పెల్లగించేస్తాడు. అటువంటి వృషభాసురుడు సుధీర్ఘమైన తన తోక పైకెత్తి అహంకారంతో రంకెలు వేస్తూ, నేలను కాలితో త్రవ్వుతూ, కొమ్ములు సాచి, మంద గడగడలాడేలా మహా వేగంతో వచ్చి మీద పడ్డాడు.

తెభా-10.1-1138-వ.
ఇట్లు వృషభాకారంబున నరిష్టుండు హరికి నరిష్టంబు చేయం దలంచి పై కుఱికిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వృషభ = ఎద్దు; ఆకారంబునన్ = రూపముతో; అరిష్టుండు = అరిష్టుడు; హరి = కృష్ణుని; కిన్ = కి; అరిష్టంబు = చెరుపు; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని; పైన్ = మీద; కిన్ = కి; ఉఱికినన్ = దూకగా.
భావము:- అలా వృషభాసుర రూపం ధరించిన అరిష్టుడు అనే ఆ రాక్షసుడు కృష్ణుడికి కీడు చేయ తలచి వచ్చి, తమ మీదకి దూకడంతో. . .

తెభా-10.1-1139-ఉ.
క్రేపులు పాఱె గోవులకుఁ; గ్రేపులు గోవులు గోవృషంబులం
బైడె; వత్స ధేను వృషభంబులు గోపకులందుఁ జొచ్చె; నా
గోకు లా వృషేంద్రములు గోవులు లేఁగలు విచ్చిపాఱఁగా
గోచమూవిభుండు గనె గోవృషదైత్యుఁడు వెంటనంటఁగన్.

టీక:- క్రేపులు = దూడలు; పాఱెన్ = పరుగెత్తను; గోవుల = ఆవుల; కున్ = కోసము; క్రేపులు = దూడలు; గోవులు = ఆవులు; గోవృషంబులన్ = ఆబోతులను; పైపడెన్ = చేరెను; వత్స = దూడలు; ధేను = ఆవులు; వృషభంబులు = ఎద్దులు; గోపకుల = గోపాలకుల; అందున్ = అండలోకి; చొచ్చెన్ = వెళ్ళినవి; ఆ = ఆ యొక్క; గోపకులు = గోపాలకుల; ఆ = ఆ యొక్క; వృషేంద్రములు = ఎద్దులులు; గోవులు = ఆవులు; లేగలు = దూడలు; విచ్చి = చెదిరిపోయి; పాఱగాన్ = పారిపోతుండగా; గోపచమూవిభుండు = కృష్ణుడు {గోపచమూవిభుడు - గోపకుల సేనకు అధిపతి, కృష్ణుడు}; కనెన్ = చూసెను; గోవృషదైత్యుడు = వృషభాసురుడు; వెంటనంటగన్ = తరుముతుండగా.
భావము:- ఎద్దు రూపం ధరించిన ఆ దనుజుడు వెంటపడగా దూడలు ఆవుల దగ్గరకు పరిగెత్తిపోయాయి. ఆవులు, దూడలు కలిసి ఎద్దుల వద్దకు వెళ్ళాయి. ఎద్దులు, ఆవులు, దూడలు ఏకమై గోపకుల దాపునకు చేరాయి. గొల్లలు, ఎద్దులు, ఆవులూ, దూడలూ బెదిరి చెల్లాచెదురు కాసాగాయి. అదంతా గోపనాయకు డైన గోవిందుడు కనుగొన్నాడు.

తెభా-10.1-1140-వ.
ఇట్లు భయభ్రాంతులై కాంతలుం దారును “గృష్ణ! కృష్ణ! రక్షింపు రక్షింపు” మని తన్ను వేఁడుకొనెడు గోపకులకు నడ్డంబువచ్చి దీనజనరక్షకుం డయిన పుండరీకాక్షుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; భయ = భయముచేత; భ్రాంతులు = తత్తరపాటు చెందినవారు; ఐ = అయ్యి; కాంతలున్ = స్త్రీలు; తారును = వారు; కృష్ణ = కృష్ణా; కృష్ణ = కృష్ణా; రక్షింపు = కాపాడుము; రక్షింపుము = కాపాడుము; అని = అని; తన్ను = అతనిని; వేడుకొనెడు = ప్రార్థించెడి; గోపకుల్ = గోపాలకుల; కున్ = కు; అడ్డంబువచ్చి = అడ్డముపడి; దీన = దీనులైన; జన = వారిని; రక్షకుండు = రక్షించువాడు; అయిన = ఐన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈవిధంగా భయంతో బెదిరిపోతున్న గోపాలకులు తమ కాంతలతో కలిసి “కృష్ణా! కృష్ణా! కాపాడు” అంటూ, కృష్ణుడి శరణుజొచ్చారు. దీనులను రక్షించువాడూ, తెల్లతామరల వంటి కన్నులు కలవాడూ అయిన కృష్ణుడు వారికి అడ్డం వెళ్ళి దైత్యుడితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1141-ఉ.
"బాలుర నింతులం బసులఁ బాఱఁగఁ దోలుట బంటుపంతమే
చాలు; వృషాసురేంద్ర! బలసంపదఁ జూపఁగ నెల్లఁబాడి గో
పాలురమందఁ గాదు; చను పైఁబడితేని ప్రచండ కృష్ణశా
ర్దూము నేడు నీ గళము ద్రుంపక చంపక పోవనిచ్చునే?"

టీక:- బాలురన్ = పిల్లలను; ఇంతులన్ = స్త్రీలను; పసులన్ = పశువులను; పాఱగన్ = పారిపోవునట్లు; తోలుట = తరుముట; బంటు = శూరుని యొక్క; పంతమే = ఒక పౌరుషమా, కాదు; చాలు = ఇక చాలులే; వృష = వృషభరూప; అసుర = రాక్షస; ఇంద్ర = ప్రభువా; బలసంపద = మిక్కిలి బలము; చూపగన్ = చూపుటకు; ఎల్లన్ = అంతా, ఎంత మాత్రమూ; పాడి = తగినది; గోపాలుర = గోపాలకుల; మంద = సమూహము; కాదు = కాదు; చనున్ = తగినది; పైబడితేని = మీదపడ గలిగితే; ప్రచండ = మిక్కిలి భీకరమైన; కృష్ణ = కృష్ణుడు అనెడి; శార్దూలము = పెద్దపులి; నేడు = ఇవాళ; నీ = నీ యొక్క; గళమున్ = కంఠమును; త్రుంపకన్ = ఖండిపకుండ; చంపకన్ = చంపకుండా; పోవనిచ్చునే = వెళ్ళనిచ్చునా, వెళ్ళనివ్వదు.
భావము:- “ఓరీ! వృషభాసురా! పిల్లలను, ఆడవాళ్ళను పశువులను బెదరగొట్టడం పరాక్రమం కాదు. నీ ప్రతాపాలు ఇక చాలించు. నీ బలం చూపించి గోపగోపీజనాన్ని భయపెట్టడం పౌరుషం అనిపించుకోదు వెళ్ళిపో. లేదా చేతనైతే నా పైకి రా. వచ్చావా, ఈ కృష్ణుడనే భయంకరమైన బెబ్బులి నీ కంఠం ఖండించకుండా, నిన్ను చంపకుండా విడచిపెట్టదు సుమా!”

తెభా-10.1-1142-ఆ.
నుచు ధిక్కరించి స్తతలంబునఁ
ప్పుడించి నగుచు ఖునిమీఁదఁ
న్నగేంద్ర భయద బాహుదండము చాఁచి
దండి మెఱసి దనుజదండి నిలిచె.

టీక:- అనుచున్ = అని; ధిక్కరించి = ఆక్షేపించి; హస్తతలంబునన్ = అరచేతితో; చప్పుడించి = చరిచి; నగుచు = నవ్వుతు; సఖుని = స్నేహితుని; మీద = పైన; పన్నగ = సర్ప; ఇంద్ర = రాజువలె; భయద = భయంకరమైన; బాహుదండమున్ = చేతిని; చాచి = చాపి; దండి = ప్రతాపము; మెఱసి = బయల్పరచి; దనుజదండి = కృష్ణుడు {దనుజదండి - రాక్షసులను దండించువాడు, కృష్ణుడు}; నిలిచెన్ = నిలబడెను.
భావము:- ఇలా ఆ రాక్షసుడిని ధిక్కరించి, అసురవైరి కృష్ణుడు అరచేత్తో భుజము అప్పళించి, నవ్వుతూ నాగరాజులా భీతిగొలిపే తన హస్తాన్ని తన చెలికాని మీద చాచి ఉంచి, శౌర్యం దీపించేలా ఆ దానవుడి సమీపంలో నిలబడ్డాడు.

తెభా-10.1-1143-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- అప్పుడు . . .

తెభా-10.1-1144-చ.
ఖుముల నేలఁ ద్రవ్వుచు నకుంఠిత వాల సమీరణంబులన్
వివిరఁ బోయి మేఘములు విప్ప విషాణము లొడ్డికొంచు దు
స్తతర మూర్తియై వృషభదైత్యుఁడు కన్నుల నిప్పు లొల్కఁగాఁ
దుతుర వచ్చి తాఁకె రిపుదుర్మదమోచనుఁ బద్మలోచనున్.

టీక:- ఖురములన్ = గిట్టలతో, డెక్కలతో; నేలన్ = భూమిని; త్రవ్వుచున్ = కోరాడుచు; అకుంఠిత = అణపరాని; వాల = తోక విసురుటవలని; సమీరణంబులన్ = వాయువులచేత; విరవిరబోయి = చెదిరిపోయి; మేఘములు = మేఘములు; విప్పన్ = విడిపోగా; విషాణములు = కొమ్ములు; ఒడ్డికొనుచు = పూనుకొనుచు; దుస్తరతర = మిక్కిలి దాటరాని {దుస్తరము - దుస్తరతరము - దుస్తరతమము}; మూర్తి = స్వరూపము కలవాడు; ఐ = అయ్యి; వృషభదైత్యుడు = వృషభాసురుడు; కన్నులన్ = కళ్ళమ్మట; నిప్పులు = అగ్నికణములు; ఒల్కగాన్ = రాలుచుండగా; తురతుర = బిరబిర; వచ్చి = వచ్చి; తాకెన్ = తలపడెను; రిపు = శత్రువుల; దుర్మద = చెడ్డగర్వమును; మోచనున్ = పోగొట్టువానిని; పద్మలోచనున్ = శ్రీకృష్ణుని.
భావము:- ఆ వృషభాసురుడు గిట్టలతో నేల త్రవ్వుతూ, గిరగిర త్రిప్పుతున్న తన వాలం గాలికి మబ్బులు విరవిర విచ్చిపోగా, కొమ్ములొడ్డుతూ, నిరోధింపరాని స్వరూపంతో, కండ్ల నుంచి గుప్పుగుప్పున నిప్పులు రాలుతుండగా, శత్రువుల గర్వం అణిచేవాడూ తామర రేకుల వంటి కన్నులు కలవాడూ అయిన కృష్ణుణ్ణి రివ్వురివ్వున వచ్చి ఎదుర్కున్నాడు.

తెభా-10.1-1145-ఉ.
యావకుంజరుండు వృషభాసురు కొమ్ములు రెండుఁ బట్టి య
ష్టాశపాదమాత్రము గజంబు గజంబును ద్రొబ్బు కైవడిన్
భేదిల ద్రొబ్బ న య్యసుర పిమ్మిటి నొంది చెమర్చి మ్రొగ్గి దు
ర్మాముతోడ డీకొనెఁ బ్రత్తవిమర్దను నా జనార్దునున్.

టీక:- యాదవకుంజరుడు = శ్రీకృష్ణుడు {యాదవ కుంజరుడు - యదువంశపు శ్రేష్ఠుడు, కృష్ణుడు}; వృషభాసురు = వృషభాసురుని; కొమ్ములు = కొమ్ములు; రెండున్ = రెంటిని; పట్టి = పట్టుకొని; అష్టాదశ = పద్దెనిమిది; పాద = అడుగుల; మాత్రము = మేర; గజంబున్ = ఏనుగు; గజంబునున్ = ఏనుగును; ద్రొబ్బు = నెట్టెడి; కైవడిన్ = విధముగా; భేదిలన్ = సంధులు విరిగిపడునట్లు; ద్రొబ్బన్ = తోసివేయగా; ఆ = ఆ యొక్క; అసుర = రాక్షసుడు; పిమ్మిటినొంది = శక్తి క్షీణించి; చెమర్చి = చెమటలు కమ్మి; మ్రొగ్గి = వాలిపోయి; దుర్మాదము = చెడ్డ ఆవేశము; తోడ = తోటి; డీకొనెన్ = ఎదిరించెను; ప్రమత్త = మిక్కిలి మదించినవారిని; విమర్దనున్ = బాగా పీడించువానిని; ఆ = ఆ ప్రసిద్ధుడైన; జనార్దనున్ = శ్రీకృష్ణమూర్తిని {జనార్దనుడు - జనులను రక్షించువాడు, విష్ణువు}.
భావము:- యాదవులలో గొప్పవాడు అయిన కృష్ణుడు, వృషభాసురుడి రెండు కొమ్ములూ పట్టుకుని, ఏనుగు మరొక ఏనుగును పడద్రోసినట్లు, వాణ్ణి పద్దెనిమిది అడుగుల దూరం పడేలా త్రోసేశాడు. అప్పుడు రాక్షసుడు సొమ్మసిల్లి, దేహాన చెమటలు క్రమ్మగా, నేలవాలి, తెప్పరిల్లి మళ్ళీ దనుజమర్దనుడైన జనార్ధనుడిని దుర్మదంతో ఢీకొన్నాడు.

తెభా-10.1-1146-ఆ.
అంత గోపసింహుఁ సురఁ గొమ్ములు పట్టి
రణి ద్రొబ్బి త్రొక్కి దైత్యభటుల
కొమ్ము వీఁగ సురలకొమ్ము వర్ధిల వాని
కొమ్ము పెఱికి మొత్తి కూల్చె నధిప!

టీక:- అంత = అప్పుడు; గోపసింహుడు = కృష్ణుడు {గోపసింహుడు - గోపకులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; అసుర = రాక్షసుని; కొమ్ములు = కొమ్ములను; పట్టి = పట్టుకొని; ధరణిన్ = నేలపై; ద్రొబ్బి = పడగొట్టి; త్రొక్కి = కాలితో తొక్కిపెట్టి; దైత్య = రాక్షస; భటుల = సైన్యముల; కొమ్ము = పక్షము; వీగన్ = నీరసించిపోగా; సురల = దేవతల; కొమ్ము = పక్షము; వర్ధిలన్ = వృద్ధిచెందగ; వాని = అతడి; కొమ్ము = కొమ్మును; పెఱికి = ఊడబీకి; మొత్తి = బలముగ కొట్టి; కూల్చెన్ = కూలదోసెను; అధిప = రాజా.
భావము:- రాజా! విను. అంతట యదుసింహుడైన కృష్ణుడు ఆ దానవుడి కొమ్ములు పట్టి నేలపై పడదోసి, కాలితో తొక్కిపట్టాడు. రాక్షసవీరుల ఉత్సాహం అణగారిపోయేలా, దేవతల ఉల్లాసం ఉరకలు వేసేలా వాడి కొమ్ములు పెరికి వాటి తోనే వాణ్ణి చావబాదాడు.

తెభా-10.1-1147-క.
క్కుచెడి రోఁజి నెత్తురు
ముక్కున వాతను స్రవింప మూత్ర శకృత్తుల్
మిక్కిలి విడుచుచుఁ బసరపు
క్కసుఁ డని సమసెఁ బ్రజకు రాగము లమరన్.

టీక:- ఉక్కుచెడి = శక్తినశించి; రోజి = నిట్టూర్పు విడిచి; నెత్తురు = రక్తము; ముక్కునన్ = ముక్కునుండి; వాతను = నోటినుండి; స్రవింపన్ = కారగా; మూత్ర = పంచితము, ఉచ్చ; శకృత్తుల్ = పేడలు; మిక్కిలి = అధికముగా; విడుచుచున్ = వేస్తూ; పసరపురక్కసుడు = వృషభాసురుడు; అనిన్ = యుద్ధము నందు; సమసెన్ = చనిపోయెను; ప్రజ = జనుల; కున్ = కు; రాగములు = అనురాగములు; అమరెన్ = కలిగినవి.
భావము:- అలా కృష్ణుడు చావబాదగా బల ముడిగి, రొప్పుతూ, రోజుతూ, ముక్కుతూ, ముక్కమ్మటా నోటమ్మటా నెత్తురు క్రక్కుతూ, మలమూత్రాలు వదుల్తూ, అసురుడు ప్రాణాలు వదిలాడు. ప్రజలకు ప్రమోదం కలిగింది

తెభా-10.1-1148-వ.
ఇట్లు వృషభాసురుం జంపిన నిలింపులు గుంపులుగొని విరులు వర్షింప గోపకులు హర్షింప గోపసతు లుత్కర్షింప బలభద్రుండును దానును గోవిందుండును బరమానందంబున మందకుం జని; రంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వృషభాసురున్ = వృషభాసురుని; చంపినన్ = సంహరించగా; నిలింపులు = దేవతలు; గుంపులుగొని = గుంపులుకట్టి; విరులన్ = పూలను; వర్షింపన్ = కురిపించగా; గోపకులు = గోపాలకులు; హర్షింపన్ = సంతోషించగా; గోపసతులు = గోపికాస్త్రీలు; ఉత్కర్షింపన్ = స్తుతించగా; బలభద్రుండును = బలరాముడు; తానును = అతను; గోవిందుండును = కృష్ణుడు; పరమ = మిక్కిలి; ఆనందంబునన్ = సంతోషముతో; మంద = గొల్లపల్లె; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి.
భావము:- ఈవిధంగా వృషభాసురుడిని సంహరించగానే దేవతలు గుంపులు కట్టి గోపాలునిపై పూలు వర్షించారు. గోపకులు హర్షించారు. గోపాంగనలు ఉప్పొంగి పోయారు. గోవిందుడు బలరాముడితో కూడి మిక్కిలి ఆనందిస్తూ మందకు మరలి వెళ్ళిపోయాడు.