Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/మథురకు నారదుడు వచ్చుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-52-సీ.
కనాఁడు నారదుం డొయ్యన కంసుని-
యింటికిఁ జనుదెంచి యేకతమున
"మందలోపలనున్న నందాదులును, వారి-
భార్యలుఁ బుత్రులు బాంధవులును
దేవకి మొదలగు తెఱవలు వసుదేవుఁ-
డాదిగాఁగల సర్వ యాదవులును,
సులుగాని, నిజంబు రులు గా రని చెప్పి-
కంసుండ! నీవు రక్కసుడ వనియు

తెభా-10.1-52.1-ఆ.
దేవమయుడు చక్రి దేవకీదేవికిఁ
బుత్రుఁడై జనించి భూతలంబు
చెఱుపఁ బుట్టినట్టి చెనఁటి దైత్యుల నెల్లఁ
జంపు"ననుచుఁ జెప్పి నియె దివికి.

టీక:- ఒక = ఒకానొక; నాడు = దినమున; నారదుండు = నారదుడు; ఒయ్యన = చటుక్కున; కంసుని = కంసుని; ఇంటి = నివాసమున; కిన్ = కు; చనుదెంచి = వచ్చి; ఏకతమునన్ = ఏకాంతముగ; మంద = వ్రేపల్లె; లోపలన్ = అందు; ఉన్న = నివసించుచున్న; నంద = నందుడు; ఆదులును = మున్నగువారు; వారి = వారి యొక్క; భార్యలున్ = పెండ్లాములు; పుత్రులున్ = పిల్లలు; బాంధవులునున్ = చుట్టాలు; దేవకి = దేవకీదేవి; మొదలగు = మున్నగు; తెఱవలు = పడతులు; వసుదేవుడు = వసుదేవుడు; ఆదిగాన్ = మొదలుగా; కల = ఉన్నట్టి; సర్వ = అందరు; యాదవులునున్ = యదువంశస్థులు; సురులు = దేవతలు; కాని = తప్పించి; నిజంబున్ = నిజానికి; నరులు = మానవులు; కారు = కారు; అని = అని; చెప్పి = తెలియజెప్పి; కంసుండ = కంసుడా; నీవున్ = నీవు; రక్కసుడవు = రాక్షసుడవు; అనియున్ = అని.
దేవమయుడు = హరి {దేవమయుడు – సమస్త దేవతలు తానైనవాడు, విష్ణువు}; చక్రి = హరి {చక్రి – చక్రాయుధము కలవాడు, విష్ణువు}; దేవకీ = దేవకి అనెడి; దేవి = ఉత్తమురాలి; కిన్ = కి; పుత్రుడు = కుమారుడు; ఐ = అయ్యి; జనించి = పుట్టి; భూతలంబున్ = భూమండలమును; చెఱుపన్ = పాడుచేయుటకు; పుట్టిన = జన్మించిన; అట్టి = అటువంటి; చెనటి = తులువలైన; దైత్యులన్ = రాక్షసులను {దైత్యులు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; ఎల్లన్ = అందరను; చంపును = సంహరిచును; అనుచున్ = అనుచు; చెప్పి = చెప్పి; చనియెన్ = వెళ్ళిపోయెను; దివి = స్వర్గలోకమున; కిన్ = కు.
భావము:- ఒకనాడు నారదమహర్షి కంసుడి ఇంటికి విచ్చేసాడు. కంసుడితో ఏకాంతంగా “రాజాకంస! వ్రేపల్లెలో ఉన్న నందుడూ మొదలగువారూ, వారి భార్యలూ, బంధువులూ, దేవకి మొదలైన స్తీలూ, వసుదేవుడు మొదలగు యాదవులందరూ దేవతలే గాని కేవలం మానవమాతృలు కారు. నీవు రాక్షసుడవు. సర్వదేవతామయుడు అయిన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడుచేయడానికి పుట్టిన దుష్ట దైత్యులను అందరినీ సంహరిస్తాడు.” అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు.

తెభా-10.1-53-క.
నాదు మాటలు విని పె
ల్లారాటముఁ బొంది యదువు నిమిషు లనియున్
నారాయణకరఖడ్గవి
దారితుఁ డగు కాలనేమి దా ననియు మదిన్.

టీక:- నారదున్ = నారదుని యొక్క; మాటలు = పలుకులు; విని = విని; పెల్లు = అధికమైన; ఆరాటమున = పరితాపమును; పొంది = చెంది; యదువులు = యాదవులు; అనిమిషులు = దేవతలు {అనిమిషులు - నిమిషము (కనురెప్పపాటు)లు లేనివారు, దేవతలు}; అనియున్ = అని; నారాయణుని = విష్ణుని {నారాయణుడు - నారములు (నీటి) యందు ఉండువాడు, విష్ణువు}; కర = చేతియందలి; ఖడ్గ = కత్తి (నందకము) చేత; విదారితుడు = నరకబడినవాడు; అగు = ఐన; కాలనేమి = కాలనేమి అనెడివాడు; తాను = తనే; అనియున్ = అని; మదిన్ = మనసు నందు.
భావము:- నారదుని మాటలు విన్న కంసుడు, యాదవులు దేవతలని; శ్రీహరి చేతి కత్తికి బలై చనిపోయిన కాలనేమి తానే అని; తలచాడు. ఎంతో ఆరాటం పొంది, మనసులో....