Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/భ్రమరగీతములు

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1456-చ.
ని యిటు గోపికల్ పలుక నం దొక గోపిక కృష్ణపాదచిం
మునఁ జొక్కి చేరువను దైవవశంబునఁ గాంచె నుజ్జ్వల
త్సునిశిత సద్వివేకముఁ బ్రసూనమరంద మదాతిరేకమున్
మృదునాద సంచలిత కాముక లోకముఁ జంచరీకమున్.

టీక:- అని = అని; ఇటు = ఈ విధముగ; గోపికల్ = గొల్లస్త్రీలు; పలుకన్ = అనుచుండగా; అందున్ = వారిలో; ఒక = ఒకానొక; గోపిక = గొల్లస్త్రీ; కృష్ణ = కృష్ణుని; పాద = పాదము లందు; చింతనమునన్ = తలచుకొనుట యందు; చొక్కి = పరవశురాలై; చేరువను = దగ్గరలో; దైవవశంబునన్ = దైవానిర్ణయానుసారము; కాంచెన్ = చూసెను; ఉజ్జ్వలత్ = ప్రకాశించుచున్న; సునిశిత = మిక్కిలి తీక్షణమైన; సత్ = మంచి; వివేకమున్ = తెలివి కలదానిని; ప్రసూన = పూల; మరంద = మకరందమువలని; మద = గర్వము యొక్క; అతిరేకమున్ = అతిశయము కలదానిని; ఘన = గొప్ప; మృదు = మంజులమైన; నాద = ధ్వనిచేత; సంచలిత = చలింప చేయబడిన; కాముక = కాముకుల; లోకమున్ = సమూహము కలదానిని; చంచరీకమున్ = తుమ్మెదను {చంచరీకము - పూలయందు చరించునది, తుమ్మెద}.
భావము:- అని ఈ విధంగా గొల్లపడుచులు పలుకుతుండగా వారిలో ఒక గోపిక శ్రీకృష్ణచరణధ్యానపరవశురాలు అయింది. ఆమె తన సమీపంలో విధివశాన ఒక తుమ్మెదను చూసింది. అది బహు చురుకైన తెలివితేటలు కలదీ, పూతేనెను గ్రోలి మత్తెక్కినదీ, తన మధుర మంజుల ఝుంకార స్వరంతో కాముకులను కలవరపెట్టునదీ. అయిన ఒక గండు తుమ్మెద.

తెభా-10.1-1457-వ.
కని హరి దన్నుం బ్రార్థింపఁ బుత్తెంచిన దూత యని కల్పించుకొని యుద్ధవునికి నన్యాపదేశంబై యెఱుకపడ నయ్యళికిం దొయ్య లిట్లనియె.
టీక:- కని = చూచి; హరి = కృష్ణుడు; తన్ను = ఆమెను; ప్రార్థింపన్ = వేడుకొనుటకు; పుత్తెంచిన = పంపించినట్టి; దూత = రాయబారి; అని = అని; కల్పించుకొని = భావించుకొని; ఉద్ధవుని = ఉద్ధవుని; కిన్ = కి; అన్యాపదేశంబు = వంకపెట్టి చెప్పునది {అన్యాపదేశము – అన్య వస్తు నెపనముగ చెప్పబడునది}; ఐ = అయి; ఎఱుకపడన్ = తెలియునట్లుగ; ఆ = ఆ యొక్క; అళి = తుమ్మెద; కిన్ = కి; తొయ్యలి = వనిత; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అలా తుమ్మెదను చూసిన ఆ గోపిక తనను వేడుకోవడం కోసం ప్రియుడు పంపిన దూతగా కల్పించుకుని, ఉద్ధవుడికి తెలిసేలా ఆ భ్రమరంతో అన్యాపదేశంగా ఇలా అనసాగింది.

తెభా-10.1-1458-మ.
"భ్రరా! దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రదాళీకుచకుంకుమాంకిత లసత్ప్రాణేశదామప్రసూ
రందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁగా
మున్నేఁపుచుఁ బౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్.

టీక:- భ్రమరా = తుమ్మెదా {భ్రమరము – భ్రమించుచు ఉండునది, తుమ్మెద, భ్రమింప చేయునది}; దుర్జన = చెడ్డవారికి; మిత్ర = స్నేహితుడైనవాడ; ముట్టకుము = తాకవద్దు; మా = మా యొక్క; పాద = పాదములు అనెడి; అబ్జముల్ = పద్మములను; నాగర = పట్టణపు; ప్రమద = స్త్రీల {ప్రమద - మిక్కిలి యౌవనమదము కలామె}; ఆళీ = సమూహముల యొక్క; కుచ = స్తనము లందలి; కుంకుమ = కుంకుమ; అంకిత = అంటినట్టి; లసత్ = చక్కటి; ప్రాణేశు = మనోనాయకుని; దామ = పూలదండలోని; ప్రసూన = పువ్వుల యొక్క; మరంద = మకరందముచేత; అరుణిత = ఎఱ్ఱనైన; ఆననుండవు = మోము కలవాడవు; అగుటన్ = అగుటచేత; నాథుండు = ప్రభువు; మన్నించుగాక = ఆదరించవచ్చుగాక; మమ్మున్ = మమ్ములను; ఏపుచున్ = తపింపజేయుచు; పౌర = పురములోని; కాంతల = స్త్రీల; శుభ = మేలైన; ఆగారంబులన్ = ఇండ్ల యందు; నిత్యమున్ = ప్రతిదినము.
భావము:- ధూర్తుల మిత్రుడ వైన ఓ మధుపమా! మా పాదపద్మాలు తాకకు; మా ప్రాణవల్లభుని పూమాలల యందలి మకరందం గ్రోలి, అక్కడ అంటిన మథురానగరపు కాంతల స్తనకుంకుమలుతో ఎఱ్ఱబారిన నీ మోము (అందాన్ని) చూసి అతడు మన్నిస్తాడేమో గాని; మమ్మల్ని విరహాలతో వేపుకుతింటు, అక్కడ నగర కాంతల శోభనగృహాలలో కులుకుతుండే నిన్ను మేము మాత్రం మన్నించము.

తెభా-10.1-1459-మ.
పువ్వందలి తేనెఁ ద్రావి మధుపా! యుత్సాహివై నీవు వే
ఱొటిం బొందెడి భంగి మ మ్మధరపియ్యూషంబునం దేల్చి మా
లం కోజ్జ్వల యౌవనంబు గొని యన్యాసక్తుఁ డయ్యెన్ విభుం
టా! యాతని కెట్లు దక్కె సిరి? మిధ్యాకీర్తి యయ్యెంజుమీ.

టీక:- ఒక = ఒకానొక; పువ్వు = పుష్పము; అందలి = లోని; తేనెన్ = మకరందమును; త్రావి = తాగి; మధుపా = తుమ్మెద {మధుపా - మధువు తాగునది, తుమ్మెద, కల్లు తాగుటచేత వలె మనసును కలతపెట్టునది}; ఉత్సాహివి = ఉత్సాహము కలవాడవు; ఐ = అయ్యి; నీవు = నీవు; వేఱు = ఇంక; ఒకటిన్ = ఒకదానిని; పొందెడి = చేరెడి; భంగిన్ = విధముగ; మమ్మున్ = మమ్ములను; అధరపియ్యూషంబున్ = అధరామృతములతో; తేల్చి = సంతృప్తులను చేసి; మా = మా యొక్క; అకలంక = స్వచ్ఛమైన; ఉజ్జ్వల = ప్రకాశవంతమైన; యౌవనంబున్ = యౌవనమును; కొని = గ్రహించి, అపహరించి; అన్య = ఇతరుల ఎడ; ఆసక్తుడు = ఆసక్తి కలవాడు; అయ్యన్ = అయ్యాడు; విభుండు = ప్రభువు; అకటా = అయ్యో; ఆతని = అతని; కిన్ = కి; ఎట్లు = ఏ విధముగా; దక్కెన్ = దొరికెను; సిరి = లక్ష్మి; మిధ్యా = అబద్ధపు; కీర్తి = కీర్తి; అయ్యెన్ = కలిగినది; సుమీ = సుమా.
భావము:- ఓ మధువులు పానీయం చేసే ఓ తుమ్మెదా! ఒక పువ్వులోని మకరందాన్ని పానం చేసి దానిని విడిచిపెట్టి ఉత్సాహంగా మరో పువ్వును నీవు ఆశ్రయించినట్లే, శ్రీకృష్ణుడు తన అధరసుధారసాన్ని మమ్మల్ని గ్రోలనిచ్చి, మా అచ్చమైన ఉజ్వలమైన యవ్వనం దొంగిలించాడు. పిమ్మట అన్యకాంతా ఆసక్తుడు అయ్యాడు. అయ్యయ్యో! ఇలాంటి చంచలచిత్తుడికి శ్రీమహాలక్ష్మి ఎలా కైవశం అయినదో? అతడి ఉత్తమశ్లోకుడన్న కీర్తి వట్టి బూటకం అయినది కదే.

తెభా-10.1-1460-శా.
భృంగా! కృష్ణుఁడు మంచివాఁ డనుచు సంప్రీతిం బ్రశంసించె; దీ
సంగీతంబున నేము చొక్కుదుమె? తచ్చారిత్రముల్ వింతలే?
యంగీకారము గావు మాకుఁ; బురకాంతాగ్రప్రదేశంబులన్
సంగీతం బొనరింపు వారిడుదు రో న్నీకు నిష్ఠార్థముల్.

టీక:- భృంగా = ఓ తుమ్మెదా {భృంగము - నీలిమను వహించునది, తుమ్మెద}; కృష్ణుడు = కృష్ణుడు; మంచివాడు = మంచివాడు; అనుచు = అని; సంప్రీతిన్ = మిక్కిలి ప్రీతితో; ప్రశంసించెదు = కీర్తించెదవు; ఈ = ఈ యొక్క; సంగీతంబునన్ = పాటలు పాడుట యందు; ఏము = మేము; చొక్కుదుమె = పరవశింతుమా, కాము; తత్ = అతని; చారిత్రముల్ = నడవడికలు; వింతలె = కొత్తవా ఏమి, కాదు; అంగీకారము = అంగీకరమైనవి; కావు = కావు; మా = మా; కున్ = కు; పుర = పట్టణపు; కాంతా = స్త్రీల; అగ్రప్రదేశంబులన్ = ముందర; సంగీతంబున్ = పాటలు పాడుటను; ఒనరింపుము = చేయుము; వారు = వారు; ఇడుదురు = ఇచ్చెదరు; ఓజన్ = క్రమముగా; ఇష్టార్థముల్ = కోరినకోరికలను.
భావము:- ఓ తుమ్మెదా! నీలంగా ఉండే భృంగరాజువు కనుక రంగు సారూప్యం కొద్దీ శ్రీకృష్ణుడు మంచివాడని ఎంతో కీర్తిస్తున్నావు. నీ గానం విని మేము సొక్కిసోలిపోతాం అనుకున్నావేమో, అతని కథలు మాకు క్రొత్తవేమీ కాదులే. నీ సంగీతాలు మాకు అంగీకారం కాదు. ఆ మధురానగరి మగువల ముందుట నీ విద్య ప్రదర్శించు, వారు మెచ్చుకుని నీవు కోరేవి చక్కగా ఇస్తారు.

తెభా-10.1-1461-శా.
దాళీశ్వర! చూడు ముజ్జ్వలిత హాభ్రూవిజృంభంబులన్
ణీయుండగు శౌరిచేఁ గరఁగరే రామల్ త్రిలోకంబులం?
బ్రదారత్నము లక్ష్మి యాతని పదాబ్జాతంబు సేవించు ని
క్కము నే మెవ్వర మా కృపాజలధికిం గారుణ్యముం జేయఁగన్?

టీక:- సమద = మదముతో కూడిన; ఆళీ = తుమ్మెదల; ఈశ్వర = రాజా; చూడుము = ఆలోచించి చూడు; ఉజ్జ్వలిత = కాంతివంతమైన; హాస = చిరునవ్వులచేత; భ్రూ = కనుబొమల; విజృంభంబులన్ = కదలికలచేత; రమణీయుండు = మనోహరుడు; అగు = ఐన; శౌరి = కృష్ణుని; చేన్ = చేత; కరగరే = అనురక్తిని పొందరా, పొందుతారు; రామల్ = స్త్రీలు {రామ - రమింప చేయునామె, స్త్రీ }; త్రిలోకంబులన్ = ముల్లోకములలోను; ప్రమదారత్నము = లక్ష్మీదేవి {ప్రమదారత్నము - స్త్రీలలో శ్రేష్ఠురాలు, లక్ష్మి}; లక్ష్మి = లక్ష్మీదేవి; ఆతని = అతని యొక్క; పదా = పాదములు అనెడి; అబ్జాతంబున్ = పద్మమును {అబ్జాతము - అప్పునందు జాతమైనది, పద్మము}; సేవించున్ = కొలచును; నిక్కమున్ = నిజముగా; నేము = మేము; ఎవ్వరము = ఏపాటివారిమి; ఆ = ఆ యొక్క; కృపాజలధి = దయాసాగరుని; కిన్ = కి; కారుణ్యమున్ = దయచూపుటను; చేయగన్ = చేయుటకు.
భావము:- మకరందాలు మిక్కిలిగా త్రాగి మదించిన ఓ తుమ్మెదల రాయుడా! మనోహరుడగు శ్రీకృష్ణుడి మందహాస ప్రకాశములకూ, బొమముడి విలాసములకూ కరిగిపోని కాంతలు స్వర్గ మర్త్య పాతాళములనే ముల్లోకాలలో ఉండరు కదా! అన్నులమిన్న యైన ఆ కమలాదేవియే అతని చరణకమలాలను సేవిస్తూ ఉంటుంది కదా. నిజానికి ఆ దయాసాగరుడిని అనుగ్రహం పొందడానికి మేము ఏపాటివారములే!

తెభా-10.1-1462-శా.
రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్
చాలున్; మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్
లీలం బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ
మ్మేలా పాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే.

టీక:- రోలంబ = తుమ్మెదల{రోడ్బ అంటే ఉన్మాదం, అంబచ్ అంటే కలది కనుక మకరందాలు మిక్కిలిగా త్రాగి మదించేది తుమ్మెద రోలంబము.}; ఈశ్వర = రాజా; నీవు = నీ; కున్ = కు; దౌత్యము = రాయబారము చేయుట; మహా = మిక్కిలి; రూఢంబు = అలవాటున్నది; నీ = నీ యొక్క; నేరుపుల్ = చమత్కారములు; చాలున్ = ఇక చాలు; మత్ = మా యొక్క; చరణ = పాదములనెడి; అబ్జముల్ = పద్మములను; విడువుము = వదులు; అస్మత్ = మా యొక్క; నాథ = పెనిమిటి; పుత్ర = కొడుకులు; ఆదులన్ = మున్నగువారిని; లీలన్ = అలక్ష్యముగా; పాసి = విడిచి; పరంబున్ = పరలోక సద్గతిని; డించి = వదలి; తన = అతని; కున్ = కి; లీనత్వమున్ = ఐక్యమును; పొందు = చెందెడి; మమ్మున్ = మమ్ములను; ఏలా = ఎందుకు; పాసెన్ = దూరమయ్యెను; విభుండు = ప్రభువు; ధార్మికులు = ధర్మమున నిష్ఠ కలవారు; మున్ను = ఇంతకు పూర్వము; ఈ = ఈ; చందముల్ = విధములను; మెత్తురే = మెచ్చుదురా, మెచ్చరు.
భావము:- ఓ తుమ్మెదలరాయుడా! రాయబారం నడపటంలో నీవు చాల గడసరివేలే. నీ నేర్పులు ఇకచాలు. మా చరణపద్మాలను వదలిపెట్టు. మా భర్త, పుత్రాదులను చులకన చేసి పరిత్యజించి, సద్గతిమాట తలపెట్టక తనతో లీనమై ఉన్న మమ్మల్ని ప్రభువు ఎందుకు విడిచిపెట్టాడు? ఇలాంటి వర్తనలు ధర్మాత్ములు మెచ్చుకుంటారా?

తెభా-10.1-1463-శా.
వాలిం జంపెను వేటగాని పగిదిన్ వంచించి; దైత్యానుజన్
లోలం బట్టి విరూపిఁ జేసెను; బలిన్ లోభంబుతోఁగట్టి యీ
త్రైలోక్యంబు మొఱంగి పుచ్చుకొనియెన్; ర్మజ్ఞుఁడే మాధవుం?
డేలా షట్పద! యెగ్గు మా వలన నీ కెగ్గింపఁగా నేటికిన్.

టీక:- వాలిన్ = వాలిని; చంపెను = సంహరించెను; వేటగాని = బోయవాని; పగిదిన్ = వలె; వంచించి = మోసగించి; దైత్యానుజన్ = శూర్పణఖను {దైత్యానుజ - దైత్యుడు (రావణాసురుడు) యొక్క అనుజ (సోదరి), శూర్పణఖ}; లోలన్ = ఆసక్తి కలామెను; పట్టి = పట్టుకొని; విరూపిన్ = వికృతరూపిగా; చేసెను = చేసెను; బలిన్ = బలి (చక్రవర్తి)ని; లోభంబు = లుబ్ధత్వము; తోన్ = తోటి; కట్టి = బంధించి; ఈ = ఈ సమస్తమైన; త్రైలోక్యంబున్ = ముల్లోకముల రాజ్యమును; మొఱంగి = మోసగించి; పుచ్చుకొనియెన్ = తీసుకొనెను; ధర్మజ్ఞుడే = ధర్మాత్ముడేనా, కాదు; మాధవుండు = కృష్ణుడు; ఏలా = ఎందుకే; షట్పద = తుమ్మెద {షట్పద - ఆరు కాళ్ళు కలది, తుమ్మెద, అటునిటి పోవునది}; ఎగ్గు = అనాదరము, అపరాధనము; మా = మా; వలన = ఎడల; నీ = నీ; కున్ = కు; ఎగ్గింపగాన్ = హేళన చేయుట, దూషించుట; ఏటికిన్ = ఎందుకులే.
భావము:- ఓ తుమ్మెదా! నీవు ఆరు కాళ్ళున్న షట్పదానివేలే. తాను వేటకాడిలా వంచించి వానరరాజైన వాలిని వధించాడు. మరులుగొన్న రావణుని చెల్లెలు శూర్ఫణఖను ముక్కుచెవులు కోసి విరూపను కావించాడు. బలిచక్రవర్తిని పేరాశతో బంధించి మోసపుచ్చి ముల్లోకాలు పుచ్చుకున్నాడు. లక్ష్మీవల్లభుడగు ఆ శ్రీకృష్ణుడు ధర్మమెరిగినవాడా! నీవేమో అతనిని కొనియాడుతావు మావల్ల తప్పేమున్నది చెప్పు.

తెభా-10.1-1464-ఉ.
న్నుగ మింటిపై కెగసి పాఱు విహంగములైన వీనులం
న్నొక మాటు విన్న గృహ దార సుతాదులఁ బాసి విత్తసం
న్నత డించి సంసరణద్ధతిఁ బాపెడువాఁడు నిత్యకాం
క్ష న్నెఱి నున్న మా బ్రతుకు సైఁచునె యేల మధువ్రతోత్తమా!

టీక:- పన్నుగ = యుక్తిగ; మింటి = ఆకాశము; పైన్ = మీదకి; ఎగిసి = ఎగిరి; పాఱు = పోతుండెడి; విహంగములు = పక్షులు; ఐనన్ = అయినను; వీనులన్ = చెవులతో; తన్ను = అతనిని; ఒక = ఒకే ఒక్క; మాటు = సారి; విన్నన్ = వినిన పక్షమున; గృహ = నివాసము; దార = భార్య; సుత = పిల్లలు; ఆదులన్ = మున్నగువారిని; పాసి = విడిచిపెట్టి; విత్త = ధనము; సంపన్నతన్ = మిక్కిలి కలిగుండుటను; డించి = అణచివేసి; సంసరణ =సాంసారిక; పద్ధతిన్ = మార్గమును; పాపెడు = పోగొట్టెడు; వాడు = వాడు; నిత్య = ఎడతెగని; కాంక్షన్ = లాలసతో, అపేక్షతో; నెఱిన్ = నిండి; ఉన్న = ఉన్నట్టి; మా = మా యొక్క; బ్రతుకున్ = జీవితములను; సైచునే = ఓర్చునా; ఏల = ఏమిటి; మధువ్రత = తుమ్మెద {మధు వ్రతము - మకరందమే గ్రహించెడి వ్రతము కలది, తుమ్మెద, చక్కటి వర్తన కలది}; ఉత్తమా = శ్రేష్ఠుడా.
భావము:- స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షులు సైతం చెవులారా అతని పేరొక్కమాటు చెవులారా వింటే చాలు ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మున్నగువాటిని దూరం చేసి; విత్తాధిక్యతను వదలగొట్టి; సంసారమార్గం పోగొట్టే ఆ కృష్ణుడికి ఎడతెగని కాంక్షలతో తప్పకున్న మా బ్రతుకులు రుచిస్తాయా. చెప్పు మధుర మైనవే గ్రహించే వ్రతం పట్టిన ఓ చక్కని తుమ్మెదా!

తెభా-10.1-1465-మ.
నీయంబగు వేఁటకానిపలు కార్ణించి నిక్కంబుగాఁ
చిత్తంబులఁ జేర్చి చేరి హరిణుల్ ద్బాణ నిర్భిన్నలై
మితోగ్రవ్యధ నొందుభంగి హరిమాయాలాపముల్ నమ్మి దుః
ములం జెందితి మంగజాస్త్ర జనితోగ్రశ్రాంతి నిందిందిరా!

టీక:- కమనీయంబు = ఇంపైనది; అగు = ఐన; వేటకాని = వేగాడి; పలుకున్ = పిలుపులను; ఆకర్ణించి = విని; నిక్కంబుగాన్ = నిజమైనదిగా; తమ = వాటి యొక్క; చిత్తంబులన్ = మనసులందు; చేర్చి = గ్రహించి; చేరి = దగ్గరకుపోయి; హరిణుల్ = ఆడుజింకలు; తత్ = వాని; బాణ = బాణములచేత; నిర్భిన్నలు = భేదింపబడినవి; ఐ = అయ్యి; అమిత = మిక్కిలి; ఉగ్ర = భీకరమైన; వ్యధన్ = బాధను; ఒందు = చెందెడి; భంగిన్ = విధముగన్; హరి = కృష్ణుని; మాయా = మోసపు; ఆలాపముల్ = మాటలు; నమ్మి = నమ్మి; దుఃఖములన్ = దుఃఖములు; చెందితిమి = పొందాము; అంగజ = మన్మథ; అస్త్ర = బాణములచేత; జనిత = కలిగినది; ఉగ్ర = భయంకరమైన; శ్రాంతిన్ = శ్రమచేత; ఇందిందిరా = తుమ్మెదా {ఇందిందిరము - పద్మములతో కూడి యుండునది, తుమ్మెద, వ్యు. ఇంది = పరమైశ్వర్యే - ఇందతి ఇందిరయా; పద్మసంపదతో కూడినది, లక్ష్మీదేవి, తుమ్మెద. (ఆంధ్రశబ్దరత్నాకరము)}.
భావము:- ఓ తుమ్మెదా! ఆకర్షణీయమైన వేటగాడి పిలుపులు వినిన పారవశ్యంతో ఆడుజింకలు చెంతకుచేరి వాడి బాణాలకు గురై అతిదారుణమైన బాధను పొందుతాయి. శ్రీకృష్ణుడి మాయ మాటలు నమ్మి మన్మథ బాణాల తాకిడికి స్రుక్కి మేము దుఃఖాల పాలైయ్యాము.

తెభా-10.1-1466-ఉ.
బంధుల బిడ్డలన్ మగల భ్రాతలఁ దల్లులఁ దండ్రులన్ మనో
జాంతఁ జేసి డించి తను మ్మిన మమ్ము వియోగదుర్దశా
సింధువులోనఁ ద్రోచి యిటు చేరక పోవుట పాడిగాదు; పు
ష్పంయ! మీ యధీశునకుఁ బాదములంబడి యొత్తి చెప్పవే.

టీక:- బంధులన్ = బంధువులను; బిడ్డలన్ = పిల్లలను; మగలన్ = భర్తలను; భ్రాతలన్ = తోబుట్టువులను; తల్లులన్ = తల్లులను; తండ్రులన్ = తండ్రులను; మనోజ = మన్మథ వేదనవలని; అంధతన్ = గుడ్డితనము; చేసి = చేత; డించి = విడిచి; తనున్ = అతనిని; నమ్మిన = నమ్మినట్టి; మమ్మున్ = మమ్ములను; వియోగ = ఎడబాటు వలని; దుర్దశా = దుఃఖము నెడి; సింధువు = సముద్రములో; త్రోచి = పడతోసి; ఇటు = ఈ పక్కకి; చేరకపోవుట = రాకపోవుట; పాడి = న్యాయము; కాదు = కాదు; పుష్పంధయ = తుమ్మెద {పుష్పంధయము - పువ్వులలోని మధువునుం గ్రోలునది, తుమ్మెద}; మీ = మీ యొక్క; అధీశున్ = ప్రభువు; కున్ = కి; పాదములన్ = కాళ్ళమీద; పడి = పడి; ఒత్తి = నొక్కి; చెప్పవే = చెప్పుము.
భావము:- ఓ తుమ్మెదా! (పుష్పాలలోని మధువు గ్రోలే దానవు. పూల వలె మృదువైన దానివి.) చుట్టాలనూ, సుతులనూ, భర్తలనూ, అన్నదమ్ములనూ, తలితండ్రులనూ మనసును మథిస్తున్న ఈ అంధత్వముచే వదలిపెట్టి, తన్నే శరణు జొచ్చాము. అలాంటి మమ్ముల్ని కాదని, విరహాగ్ని కడలిలో త్రోసివైచి, ఈలాగున మా వంక చేరకుండుట న్యాయము కాదని ప్రభువు శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడి గట్టిగా నొక్కి చెప్పు.

తెభా-10.1-1467-సీ.
కాంచనరత్నసంటిత సౌధంబులే-
మా కుటీరంబులు మాధవునకు?
వివిధ నరేంద్రసేవిత రాజధానియే-
మా పల్లె యదువంశమండనునకు?
సురభిపాదప లతాశోభితారామమే-
మా యరణ్యము సింహధ్యమునకుఁ?
మనీయ లక్షణ జ తురంగంబులే; -
మా ధేనువులు కంసర్దనునకు?

తెభా-10.1-1467.1-తే.
రూప విభ్రమ నైపుణ్య రూఢలైన
గువలమె మేము మన్మథన్మథునకు?
నేల చింతించు మముఁ? గృష్ణుఁ డేల తలఁచుఁ?
బృథివి నధిపులు నూతన ప్రియులు గారె. ?

టీక:- కాంచన = బంగారము; రత్న = మణులతో; సంఘటిత = కూర్చబడిన; సౌధంబులే = భవనములా; మా = మా యొక్క; కుటీరంబులు = పాకలు, గుడిసెలు; మాధవున్ = కృష్ణుని {మాధవుడు - యదుపుత్రుడైన మధువు వంశము వాడు, కృష్ణుడు}; కున్ = కి; వివిధ = అనేకమైన; నరేంద్ర = రాజులచే; సేవిత = కొలువబడెడి; రాజధాని = ముఖ్యపట్టణమా ఏమి {రాజధాని - రాజుండెడిపట్టణము, ముఖ్యపట్టణము}; మా = మా యొక్క; పల్లె = పల్లెటూరు; యదువంశమండను = కృష్ణుని {యదువంశమండనుడు - యాదవ వంశమునకు అలంకారమైన వాడు, కృష్ణుడు}; కున్ = కి; సురభి = మనోహరమైనవి యైన; పాదప = చెట్లతోను; లతా = తీవెలతోను; శోభిత = అందమైన; ఆరామమే = ఉద్యానవనమా; మా = మా యొక్క; అరణ్యము = అడవి; సింహమధ్యమున్ = కృష్ణుని {సింహమధ్యముడు - సింహము వంటి నడుము కలవాడు, కృష్ణుడు}; కున్ = కి; కమనీయ = మనోజ్ఞమైన; లక్షణ = శుభలక్షములు కల; గజ = ఏనుగులు; తురంగంబులు = గుఱ్ఱములునా; మా = మా యొక్క; ధేనువులు = ఆవులు; కంసమర్దనున్ = కృష్ణుని {కంసమర్దనుడు - కంసుని శిక్షించినవాడు, కృష్ణుడు}; కున్ = కి.
రూప = చక్కటిస్వరూపముచేత; విభ్రమ = విలాసములచేత; నైపుణ్య = నేర్పరితనములచేత; రూఢలు = ప్రసిద్ధవహించినవారు; ఐన = అయిన; మగువలమే = స్త్రీలమా; మేము = మేము; మన్మథమన్మథున్ = కృష్ణుని {మన్మథమన్మథుడు - మన్మథునికే మోహము పుట్టించువాడు, కృష్ణుడు}; కున్ = కి; ఏలన్ = ఎందుకు; చింతించున్ = తలచును; మమున్ = మమ్ములను; కృష్ణుడు = కృష్ణుడు; ఏలన్ = ఎందుకు; తలచున్ = తలచుకొనును; పృథివిన్ = భూలోకమందు; అధిపులు = రాజులు; నూతన = కొత్తవాని యెడల; ప్రియులున్ = ప్రీతి కలవారు; కారె = కాదా, అవును.
భావము:- లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణుడికి బంగారమణులతో నిర్మింపబడిన మేడలు తప్ప మా పూరిగుడిసెలు కనబడతాయా? యదుకులమునకు అలంకారమైన యశోదానందనుడికి ఆనడానికి మా పల్లెటూరు ఏమైనా ఎందరో రాజులచే సేవింపబడు ముఖ్యపట్టణమా? సింహము నడుము వంటి నడుము గల శ్రీహరికి కనడానికి మా అడవి, సువాసనలీను చెట్లతో పూతీగలతో చెలువారు ఉద్యానవనమా? కంస విధ్వంసి అయిన కృష్ణుడికి మా గోవులు, సర్వ శుభలక్షితము లైన ఏనుగులా? గుఱ్ఱములా? మన్మథునికి మన్మథుడైన ఆ వన్నెకాడికి గొల్లపడచుల మైన మేము రూప విభ్రమ విలాసములతో వినుతికెక్కిన విలాసినులమా ఏమి? కనుక ఆ శ్రీకృష్ణుడు మమ్ము గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకు మమ్మల్ని స్మరిస్తాడు? లోకంలో ప్రభువులు నవ్యత్వ ప్రియులు కదా!”