పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికలు విలపించుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-653-సీ.
"దురువచ్చినఁ జాల నెదురుగాఁ జనుదెంతు-
వెదురు వచ్చిన నే డదేల రావు?
చూచినఁ గృపతోడఁ జూచు చుందువు నీవు-
చూచినఁ గనువిచ్చి చూడ వేల?
డాసిన నఱలేక డాయంగ వత్తువు-
డాసిన నేటికి డాయ విచటఁ?
జీరిన "నో!"యని చెలరేగి పలుకుదు-
విది యేమి చీరిన నెఱుఁగకుంట?

తెభా-10.1-653.1-ఆ.
లఁపుఁ జేయునంతఁ లపోయుచుందువు
లఁపుఁ జేయ నేడు లఁప వకట;"
నుచు భక్తివివశు లాడెడి కైవడి
వ్రేత లెల్ల నాడి వివశ లైరి.

టీక:- ఎదురువచ్చినన్ = ఎదురైతే; చాలన్ = మిక్కిలిగా; ఎదురుగా = ముందుకు; చనుదెంతు = వచ్చెదవు; ఎదురు = ఎదురుగా; వచ్చినన్ = వచ్చినప్పటికి; నేడు = ఇవాళ; అది = అదే; ఏల = ఎందుకు; రావు = రావటం లేదు; చూచినన్ = నిన్నుచూసినచో; కృప = దయాదృష్ణి; తోడన్ = తోటి; చూచుచుందువు = చూసెదవు; నీవు = నీవు; చూచినన్ = ఎంతచూసినను; కను = కళ్ళు; విచ్చి = విప్పి; చూడవు = నీవుచూచుటలేదు; ఏల = ఎందుకు; డాసినన్ = నిన్నుచేరినచో; అఱలేక = అరమరికలేకుండ; డాయంగన్ = చేరుటకు; వత్తువు = వచ్చెదవు; డాసినన్ = మేమువచ్చిచేరినను; ఏటికిన్ = ఎందుకు; డాయవు = దగ్గరకురావు; ఇచటన్ = ఇక్కడ; చీరినన్ = పిలిచినచో; ఓ = ఓహో; అని = అని; చెలరేగి = విజృంభించి; పలుకుదువు = సమాధానమిచ్చెదవు; ఇది = ఇది; ఏమి = ఏమిటి; చీరినన్ = పిలిచినను; ఎఱుగకుంటన్ = తెలియకుండుట.
తలపుచేయున్ = తలచిన; అంత = అంతమాత్రముచేతనే; తలపోయుచున్ = పట్టించుకొనుచు; ఉందువు = ఉండెదవు; తలపుచేయన్ = తలచుకొంటున్నను; నేడు = ఇవాళ; తలపవు = పట్టించుకొనవు; అకట = అయ్యో; అనుచున్ = అనుచు; భక్తి = భక్తిచేత; వివశులు = పరవశులైనవారు; ఆడెడి = పలికెడి; కైవడిన్ = ప్రకారముగా; వ్రేతలు = గోపికలు; ఎల్లన్ = అందరు; ఆడి = పలికి; వివశలు = పరవశత్వం పొందినవారు; ఐరి = అయితిరి.
భావము:- “కృష్ణా! మేము ఎదురుగా వస్తే, ఎప్పుడు నీవు మాకు ఎదురుగా వచ్చేవాడివి. ఇవేళ మేము వచ్చినా నీవు రావేమి? మేము చూస్తే దయతో నీవు మమ్మల్ని చూసేవాడివి. ఇవేళ మేం చూసినా నీవు కళ్ళువిప్పి చూడవేమి? మేము నీ దగ్గరకు వస్తే నీవు మా దగ్గరకు వచ్చేవాడివి. మేం దగ్గరకి వచ్చినా నీవు ఇక్కడకి రావటంలేదేమి మేము “కృష్ణా!” అని పిలిస్తే “ఓ!” అని ఉత్సాహంగా పలికేవాడివి. ఇవేళ గొంతెత్తి పిలిచిన తెలియకుండా ఉన్నావేమి? మేము నిన్ను స్మరిస్తే చాలు మమ్మల్ని స్మరించే వాడివి. ఇవేళ మేము స్మరిస్తున్నా మమ్మల్ని తలవట్లేదేమి?” అంటు భక్తితో పరవశులైనవారి వలె పలుకుతు గోపికలు అందరు వివశులు అయ్యారు.

తెభా-10.1-654-వ.
ఆ సమయంబున నంద యశోదాదులు హరిం జూచి యధికం బైన శోకంబున నిట్లనిరి.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; నంద = నందుడు; యశోద = యశోద; ఆదులు = మొదలగువారు; హరిన్ = కృష్ణుని; చూచి = చూసి; అధికంబు = పెరిగిపోయినది; ఐన = అయినట్టి; శోకంబునన్ = దుఃఖముతో; ఇట్లు = ఇలా; అనిరి = పలికిరి.
భావము:- అప్పుడు నందుడు యశోద మొదలైనవారు కృష్ణుడిని చూసి చాలా ఎక్కువ దుఃఖంతో ఇలా అన్నారు.

తెభా-10.1-655-క.
"వికుచయుగ యగు రక్కసి
వికుచదుగ్ధంబుఁ ద్రావి విషవిజయుఁడ వై
విరుహలోచన! యద్భుత
వియుండగు నీకు సర్పవిష మెక్కెఁ గదా!

టీక:- విష = విషము గల, దుష్టమైన; కుచ = చన్నుల; యుగ = జంట గలామె; అగు = ఐనట్టి; రక్కసి = రాక్షసి; విష = విషపూరిత; కుచ = చను; దుగ్ధంబున్ = పాలను; త్రావి = తాగి; విష = విషప్రభావముపై; విజయుడవు = జయించినవాడవు; ఐ = అయ్యి; విషరుహలోచన = కృష్ణా {విషరుహలోచనుడు - విషరుహ (నీటపుట్టు పద్మము)ల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; అద్భుత = ఆశ్చర్యకరమైన; విషయుండు = వృత్తాంతము కలవాడవు; అగు = ఐన; నీ = నీ; కున్ = కు; సర్ప = పాము యొక్క; విషము = విషము; ఎక్కెను = వంటికి పట్టినది; కదా = కదా.
భావము:- "ఓ కన్నయ్యా! విషపూరితమైన, దుష్టమైన స్తనాలతో వచ్చిన ఆ రాక్షసి పూతన విషపు స్తన్యం తాగి ఆ విషాన్ని జయించిన వాడవు నువ్వు; విషము (నీటి) యందు పుట్టు పద్మాలలాంటి కన్నులు కలవాడవు, అద్భుతమైన మూర్తిమంతుడవు. కమలాక్షా! అట్టి నీకు పాము విషం ఎక్కిందా? ఇదేంటయ్యా ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది?
విషమము అంటే దుష్టము అని అర్థం (సూర్యారాయాంధ్ర) కూడా ఉన్నది. అలా పూతన, కాళీయుల దుష్టత్వాన్ని స్ఫురింపజేస్తూ, యమకానుప్రాసతో అలంకారిస్తూ, “ష”కార దుర్గమప్రాసతో చెప్పిన పోతన పాటించిన సందర్భ శుద్ధి బహు రమ్యంగా ఉంది.

తెభా-10.1-656-క.
ట్టా! క్రూర భుజంగము
ట్టలుకన్ నిన్నుఁ గఱవఁ గంపించితివో?
తిట్టితివో పాపపు విధిఁ?
ట్టీ! మముఁ దలఁచి కాఁక లవించితివో?

టీక:- కట్టా = అయ్యో; క్రూర = క్రూరమైన; భుజంగము = పాము; కట్ట = గట్టి; అలుకన్ = కోపముతో; నిన్నున్ = నిన్ను; కఱవన్ = కరచుటచేత; కంపించితివో = వణికిపోతివేమో; తిట్టితివో = తిట్టనావేమో; పాపపు = పాపిష్టి; విధిన్ = దైవమును; పట్టీ = అబ్బాయీ; మమున్ = మమ్ము; తలచి = తలచుకొని; కాకన్ = పరితాపముతో; పలవించితివో = విలపించితివో.
భావము:- అయ్యయ్యో! క్రూరమైన ఆ పాము కోపంతో నిన్ను కాటువేస్తుంటే భయంతో ఎంత వణికిపోయావో? ఆ పాపిష్ఠి విధిని ఎంతగా తిట్టుకొన్నావో? మమ్మల్ని తలచుకొని బాధతో ఎంతగా పలవరించావో కదా!

తెభా-10.1-657-క.
న్నగము మమ్ముఁ గఱవక
నిన్నేటికిఁ గఱచెఁ గుఱ్ఱ! నెమ్మి గలిగి నీ
వున్నను మము రక్షింతువు;
ని న్నున్ రక్షింప నేము నేరము తండ్రీ!

టీక:- పన్నగము = పాము; మమ్మున్ = మమ్మలను; కఱవకన్ = కరవకుండ; నిన్నున్ = నిన్ను; ఏటికిన్ = ఎందుకు; కఱచెన్ = కరిచినది; కుఱ్ఱ = పిల్లవాడ; నెమ్మి = క్షేమము; కలిగి = ఉన్నవాడవు; నీవు = నీవు; ఉన్నను = ఉంటే చాలు; మమున్ = మమ్ములను; రక్షింతువు = కాపాడెదవు; నిన్నున్ = నిన్ను; రక్షింపన్ = కాపాడుటకు; ఏము = మేము; నేరము = శక్తులము కాము; తండ్రీ = అయ్యా.
భావము:- ఓ కన్నతండ్రీ! ఈ పాపిష్ఠి పాము మమ్మల్ని కరవకుండ నిన్నెందుకు కరచిందయ్యా? నువ్వు క్షేమంగా ఉంటే మమ్మల్ని రక్షిస్తావు. కాని నువ్వు ఆపదలో ఉంటే మేము నిన్ను రక్షించగల వారము కాదు కదయ్యా!

తెభా-10.1-658-ఉ.
చూ వదేమి గౌరవపుఁజూపుల మమ్ము; సఖాలితోడ మా
టా వదేమి? మర్మముగ నందెలు పాదములందు మ్రోయ నే
డా వదేమి నర్తనము? వ్వల మ్రోలను గోపికావళిం
గూ వదేమి నవ్వులను? గోపకుమారవరేణ్య! చెప్పుమా;

టీక:- చూడవు = చూడవు; ఏమి = ఎందుకు; గౌరవపు = గౌరవముతో కూడిన; చూపులన్ = చూపులతో; మమ్మున్ = మమ్ములను; సఖ = స్నేహితుల; ఆలి = సమూహము; తోడన్ = తోటి; మాటాడవు = మాట్లాడుటలేదు; ఏమి = ఎందుకు; మర్మముగన్ = కొంటెగా; అందెలు = కాలిగజ్జెలు; పాదముల = కాళ్ళ; అందున్ = అందు; మ్రోయన్ = మోగుతుండగ; నేడు = ఇవాళ; ఆడవు = ఆడుటలేదు; ఏమి = ఎందులకు; నర్తనముల్ = నాట్యములు; అవ్వల = తల్లుల; మ్రోలను = ఎదురుగా; గోపికా = గోపికా స్త్రీల; అవళిన్ = సమూహములను; కూడవు = కలియవు; అది = అదే; ఏమి = ఎందుకు; నవ్వులను = నవ్వులతో; గోప = గొల్ల; కుమార = పిల్లలలో; వరేణ్య = శ్రేష్ఠుడా; చెప్పుమా = చెప్పుము.
భావము:- మన గోకులంలోని బాలలందరిలోకి నీవే శ్రేష్ఠుడవు కదా. ఈరోజు తల్లిదండ్రులను మమ్మల్ని గౌరవంతో కూడిన చూపులతో చూడవేంటయ్యా? మిత్రులతో మాట్లాడవేంటయ్యా? అందగా కాళ్ళ గజ్జలు మోగేలా నాట్యాలు చేయవేమయ్యా? తల్లుల ఎదుట గోపికలతో హాస్యాలాడవేమయ్యా? చెప్పవయ్యా!

తెభా-10.1-659-సీ.
శ్రవణరంధ్రంబులు ఫలతఁ బొందంగ-
నెలమి భాషించు వా రెవ్వ రింకఁ?
రచరణాదుల లిమి ధన్యత నొంద-
నెగిరి పైఁ బ్రాఁకు వా రెవ్వ రింక?
యనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగా-
వ్వులు చూపు వా రెవ్వ రింక?
జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటల-
యెడఁ బలికించు వా రెవ్వ రింక

తెభా-10.1-659.1-ఆ.
తండ్రి! నీవు సర్పష్టుండవై యున్న
నిచట మాకుఁ బ్రభువు లెవ్వ రింక?
రిగి పాయ లేము; మాకు నీ తోడిద
లోక మీవు లేని లోక మేల?"

టీక:- శ్రవణ = చెవి; రంధ్రంబులున్ = కన్నములు; సఫలతన్ = ధన్యము; పొందంగన్ = పొందునట్లు; ఎలమిన్ = ప్రీతితో; భాషించు = మాట్లాడెడి; వారు = వాళ్ళు; ఎవ్వరు = ఎవరు; ఇకన్ = ఇకపైన; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆదులన్ = మొదలగునవి; కలిమిన్ = కలుగుటచేత; ధన్యతన్ = కృతార్థత్వము; ఒందన్ = పొందగా; ఎగిరి = మీదికి దూకి; పైన్ = మామీదకు; ప్రాకు = పాకెడి; వారు = వారు; ఎవ్వరు = ఎవరు; ఇంక = ఇకమీద; నయన = కళ్ళ; యుగ్మంబులు = జంటలు; ఉన్నతిన్ = అతిశయముతో; కృతార్థములుగా = ధన్యమగునట్లు; నవ్వులు = నవ్వులను; చూపు = కనపరచువారు; వారు = వారు; ఎవ్వరు = ఎవరు; ఇంక = ఇకమీద; జిహ్వలు = నాలుకలు; గౌరవ = మన్నల; శ్రీన్ = సంపదలను; చేరన్ = చేరునట్లుగా; పాటల = పాటల; ఎడల = అందు; పరికించు = చూచెడివారు; వారు = వారలు; ఎవ్వరు = ఎవరు; ఇంకన్ = ఇకపైన.
తండ్రి = నాయనా; నీవు = నీవు; సర్ప = పాముచే; దష్టుండవు = కాటువేయబడినవాడవు; ఐ = అయ్యి; ఉన్నన్ = ఉండగా; ఇచటన్ = ఇక్కడ; మా = మా; కున్ = కు; ప్రభువులు = విభులు; ఎవ్వరు = ఎవరు; ఇంకన్ = ఇకపైన; మరిగి = మాలిమిగలవారమై; పాయలేము = ఎడబాయలేము; మా = మా; కున్ = కు; నీ = నీ; తోడిద = తోమాత్రమే; లోకము = లోకము; ఈవు = నీవు; లేని = లేనట్టి; లోకము = ప్రపంచము; ఏల = ఎందుకు.
భావము:- చిన్ని నా తండ్రీ! మా చెవులున్నందుకు సార్థకమయ్యేలా ఉత్సాహంగా ఇంక మాతో ఎవరు మాట్లాడతారు? కాళ్ళు చేతులు ఉన్నందుకు సార్థక మయ్యేలా మా మీదకి దూకి ఇంకెవరు ఎగబాకుతారు? మా కళ్ళు సార్థక మయ్యెలా ఇంక ఎవరు చిరునవ్వులు చిలుకుతారు? మా నాలుకలు కృతార్థత పొందేలా ఇంక మాచేత పాటలు ఎవరు పాడిస్తారు? నాయనా! నువ్విలా పాముకాటు పాల పడిపోతే, ఇక్కడ మమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉన్నారు? నీ ప్రేమ రుచి మరిగిన వాళ్ళం. నిన్ను విడిచి వెళ్ళి పోలేము. మాకు నీతోడిదే లోకం. నువ్వు లేని ఈ లోకం మా కెందుకు?”

తెభా-10.1-660-వ.
అని యొండొరులం బట్టుకొని విలపించుచుఁ “గృష్ణునితోడన మడుఁగుఁ జొత్తము చత్త” మనుచుఁ గృష్ణవిరహ వేదనానల భార తప్తులై మడుఁగు చొరఁబాఱుచున్న వారలం గనుంగొని భగవంతుండైన బలభధ్రుండు “మీరు మీఁ దెఱుఁగరు; ధైర్యంబు విడుచుట కార్యంబు గాదు సహించి చూడుం” డనుచు వారిని వారించె.
టీక:- అని = అని; ఒండొరులన్ = ఒకరినొకరు; పట్టుకొని = పట్టుకొని; విలపించుచున్ = దుఃఖించుచు; కృష్ణుని = కృష్ణుని; తోడన = తోబాటే; మడుగున్ = మడుగు నందు; చొత్తము = పడెదము; చత్తము = చనిపోయెదము; అనుచున్ = అనుచు; కృష్ణ = కృష్ణుని; విరహ = ఎడబాటువలని; వేదన = బాధ అనెడి; అనల = అగ్నిచే; భార = బరువెక్కిన మనసులతో; తప్తులు = తపించెడివారు; ఐ = అయ్యి; మడుగున్ = మడుగు నందు; చొరన్ = పడుటకు; పాఱుచున్న = పరుగెడుతున్న; వారలన్ = వారిని; కనుంగొని = చూసి; భగవంతుండు = భగవత్స్వరూపుడు; ఐన = అయినట్టి; బలభద్రుండు = బలరాముడు; మీరు = మీరు; మీదన్ = భవిష్యత్తులో జరుగ నున్నది; ఎఱుగరు = తెలియరు; ధైర్యంబున్ = స్థైర్యమును; విడుచుట = వదలుట; కార్యంబు = తగినపని; కాదు = కాదు; సహించి = ఓర్పువహించి; చూడుండు = జరుగబోవునది చూడండి; అనుచున్ = అనుచు; వారిని = గోపజనులను; వారించెన్ = ఆపెను.
భావము:- ఇలా విలపిస్తు ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు; “కృష్ణుడితోపాటు మనం కూడ ఈ మడుగులో పడి చచ్చిపోదాం” అంటు కృష్ణ విరహాగ్ని భరించలేక తపించిపోతూ మడుగులో పడబోతున్నారు; వారిని చూసి మహిమాన్వితు డైన బలరాముడు “మీరు ముందు జరగబోయేది తెలుసుకోలేకుండా ఉన్నారు; ధైర్యం వదలి పెట్టడం సరైన పని కాదు; ఓర్పుపట్టి ఏం జరుగు తుందో చూస్తు ఉండండి;” అని చెప్పి వారిని ఆపాడు.

తెభా-10.1-661-క.
నుఁ గూర్చి యివ్విధంబున
నితలు బిడ్డలును దారు వాపోయెడి ఘో
నివాసులఁ గని కృష్ణుఁడు
నుజుని క్రియ నొక ముహూర్తమాత్రము జరపెన్.

టీక:- తన్నున్ = అతనిని; కూర్చి = గురించి; ఈ = ఈ; విధంబునన్ = రీతిని; వనితలు = స్త్రీలు; బిడ్డలును = పిల్లలు; తారు = వారు; వాపోయెడి = ఏడ్చుచున్న; ఘోష = పల్లె; నివాసులన్ = ప్రజలను; కని = చూసి; కృష్ణుడు = కృష్ణుడు; మనుజుని = మానవుని; క్రియన్ = వలె; ఒక = ఒకేఒక్క; ముహూర్త = ముహూర్తము కాలము; మాత్రము = మాత్రమే; జరపెన్ = గడిపెను.
భావము:- ఇలా తన గురించి పెళ్ళాం పిల్లలుతో పాటు తాము కూడా విలపిస్తున్న గోకులంలో నివసించే వాళ్ళందరిని చూసాడు. సామాన్య మానవుడు లాగ కొంచెంసేపు మౌనం వహించి ఊరకున్నాడు.