పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కాలయవనుడు వెంటజనుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1621-సీ.
టులవాలాభీల సైంహికేయుని భంగి-
లాలితేతర జటాతిక దూలఁ
బ్రళయావసర బృహద్భాను హేతిద్యుతిఁ-
రుషారుణ శ్మశ్రుటలి వ్రేలఁ
గాదంబినీఛన్న కాంచనగిరిభాతిఁ-
వచ సంవృత దీర్ఘకాయ మమర
ల్మీక సుప్త దుర్వారాహి కైవడిఁ-
గోశంబులో వాలు కొమరు మిగుల

తెభా-10.1-1621.1-ఆ.
నార్చి పేర్చి మించి శ్వంబుఁ గదలించి
మలసంభవాది నులకైనఁ
ట్టరాని ప్రోడఁ ట్టెద నని జగ
వనుఁ బట్టఁ గదిసె వనుఁ డధిప!

టీక:- చటుల = భయంకరమైన; వాల = తోకవలె; ఆభీల = భీకరమైనట్టి; సైంహికేయుని = రాహువు {సైంహిక - సింహిక, కొడుకు, రాహువు}{సింహిక - హిరణ్యకశిపుని కూతురు, కుమారుడు స్వర్భాను, ఇతను దొంగతనంగా అమృతం తాగుతుంటే విష్ణువు చక్రంతో తల నరికాడు ఆ రాహువు కేతువులుగా గ్రహాలు అయ్యారు, నీడను బట్టే ఆ సింహికను హనుమంతుడు సంహరించాడు}; భంగిన్ = వలె; లాలిత = మనోజ్ఞమైనది; ఇతర = కానట్టి; జటాలతిక = పిలక; తూలన్ = తూగుతుండగా; ప్రళయ = ప్రళయపు; అవసర = కాలము నందలి; బృహత్ = పెద్ద; భాను = సూర్యకిరణముల; హేతి = మంటలవంటి; ద్యుతిన్ = ప్రకాశముతో; పరుష = బిరుసైన; అరుణ = ఎఱ్ఱని; శ్మశ్రు = మీసముల; పటలి = సమూహము; వ్రేలన్ = వేళ్ళాడుతుండగా; కాదంబనీ = మేఘములపంక్తిచే; ఛన్న = కప్పబడిన; కాంచనగిరి = మేరుపర్వతము; భాతిన్ = వలె; కవచ = కవచముచే; సంవృత = కప్పబడిన; దీర్ఘ = ఉన్నతమైన; కాయము = శరీరము; అమరన్ = ఉండగా; వల్మీక = పుట్టలో; సుప్త = నిద్రిస్తున్న; దుర్వార = అడ్డగింపరాని; అహి = పాము; కైవడిన్ = వలె; కోశంబు = ఒర; లోన్ = లోపల; వాలు = కత్తి; కొమరుమిగులన్ = అందము అతిశయించగా; అర్చి = బిగ్గరగా అరచి.
పేర్చి = అతిశయించి; మించి = మీరి; అశ్వంబున్ = గుఱ్ఱమును; కదలించి = బయలుదేరదీసి; కమలసంభవ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; ఘనుల్ = గొప్పవారి; కైనన్ = కి అయినను; పట్టరాని = పట్టశక్యముకాని; ప్రోడన్ = శక్తిమంతుని; పట్టెదను = పట్టుకొనెదను; అని = అని; జగదవనున్ = లోకరక్షకుని, కృష్ణుని; పట్టన్ = పట్టుకొనుటకు; కదియెన్ = సమీపించెను; యవనుడు = యవనుడు; అధిప = రాజా.
భావము:- ఓ పరీక్షన్నరేంద్రా! బ్రహ్మదేవుడు మొదలైన దేవతా ప్రముఖులకు కూడా పట్టనలవికాని మహా నెఱజాణ, లోకరక్షకుడు అయిన శ్రీకృష్ణుడిని పట్టుకోడానికి కాలయవనుడు తన అశ్వాన్ని ఉఱికించి గర్జిస్తూ దరికి చేరబోయేడు. అలా గుఱ్ఱం ఎక్కి అతను వస్తుంటే మిక్కిలి భయంకొల్పుతున్న రాహువు తోక వలె కాలయవనుని తీగవంటి జడ కదులుతూ ఉంది; ప్రళయకాలంలో పెద్ద సుర్యగోళపు అగ్నిశిఖల వంటి కాంతితో అతని కఱుకైన ఎఱ్ఱని మీసాలు వ్రేలాడుతున్నాయి; మబ్బుల గుంపుచే కప్పబడిన మేరుపర్వతం లాగా అతని సమున్నతదేహం కవచంతో కప్పబడి ఉంది; పుట్టలో నిద్రిస్తున్న పాము లాగా అతని ఒరలో ఖడ్గం ప్రకాశిస్తోంది.

తెభా-10.1-1622-క.
టు దన్నుఁ బట్టవచ్చినఁ
టుతర జవరేఖ మెఱసి ట్టుబడక ది
క్తము లదుర హరి పాఱెం
టులగతిన్ వాఁడు దోడఁ నుదేరంగన్.

టీక:- ఇటు = ఈ విధముగ; తన్నున్ = అతనిని; పట్టన్ = పట్టుకొనుటకు; వచ్చినన్ = రాగా; పటుతర = మిక్కిలి అధికమైన {పటువు - పటుతరము - పటుతమము}; జవ = వేగపు; రేఖ = రీతి; మెఱసి = ప్రకాశించి; పట్టుబడకన్ = దొరకకుండ; దిక్తటములు = దిగంతములు; అదురన్ = అదిరిపోవునట్లుగా; హరి = కృష్ణుడు; పాఱెన్ = పరుగెత్తెను; చటుల = తీవ్రమైన; గతిన్ = వేగముగ పోవుటచే; వాడు = అతను; తోడన్ = కూడా, వెంట; చనుదేరన్ = వచ్చుచుండగా.
భావము:- అలా యవనుడు తనను పట్టడానికి వస్తుంటే కృష్ణుడు పట్టుపడకుండా మిక్కిలి వేగంగా దిక్కులదరిలా పరుగెత్తాడు. కాలయవనుడు అతని వెంటపడ్డాడు.

తెభా-10.1-1623-వ.
అప్పుడు కాలయవనుం డిట్లనియె.
టీక:- అప్పుడు = ఆ సమయమునందు; కాలయవనుండు = కాలయవనుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అలా వెంటపడి తరుముకు వెళ్తున్న కాలయవనుడు పద్మాక్షుడితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1624-మ.
"దువంశోత్తమ! పోకుపోకు రణ మీ ర్హంబు; కంసాదులం
నక్షోణి జయించి తీ వని సమిత్కామంబునన్ వచ్చితిన్;
విదితఖ్యాతులు వీటిపోవ నరికిన్ వెన్నిచ్చి యిబ్భంగి నే
గుదురే రాజులు? రాజమాతృఁడవె? వైగుణ్యంబు వచ్చెంజుమీ?

టీక:- యదు = యాదవ; వంశ = వంశము నందలి; ఉత్తమ = శ్రేష్ఠుడా; పోకుపోకు = పారిపోకుము; రణమున్ = యుద్ధము; ఈన్ = నీతో చేయ నిచ్చుటకు; అర్హంబు = తగినవాడనే; కంస = కంసుడు; ఆదులన్ = మున్నగువారిని; కదనక్షోణిన్ = యుద్ధభూమిలో; జయించితి = గెలిచావు; ఈవు = నీవు; అని = అని; సమిత్ = పోరాడలనే; కామంబునన్ = కోరికతో; వచ్చితిన్ = వచ్చాను; విదిత = ప్రసిద్ధమైన; ఖ్యాతులు = కీర్తులు; వీటిపోవన్ = నష్టపోవునట్లుగా; అరికిన్ = శత్రువునకు; వెన్నిచ్చి = వీపుచూపి; ఇబ్భంగిన్ = ఈ విధముగ; ఏగుదురే = పారిపోదురా; రాజులు = క్షత్రియులు; రాజమాతృండవే = సామాన్యరాజువా నీవు; వైగుణ్యంబు = అపకీర్తి, గుణహీనత; వచ్చున్ = వస్తుంది; చుమీ = సుమా.
భావము:- “ఓ యదువంశ శ్రేష్ఠుడా! శ్రీకృష్ణా! ఆగు ఆగు. పారిపోకు. నాతో పోరాడు. నీవు యుద్ధరంగంలో కంసుడు మొదలైన వాళ్ళను జయించిన వీరుడవు అని విని, నీతో పోరుకోరి ఎంతో ఉత్సుకతతో వచ్చాను. గడించిన పేరుప్రఖ్యాతులు చెడిపోయేలాగ, నీవంటి రాజులు విరోధికి వెన్నుచూపి ఇలా పారిపోతారా? నీవేమీ సాధారణ రాజువు కూడా కాదు? నీకు అపఖ్యాతి వచ్చేస్తుంది సుమా!

తెభా-10.1-1625-మ.
లిమిన్ మాధవ! నేఁడు నిన్ను భువనప్రఖ్యాతిగాఁ బట్టుదున్
ముల్ సొచ్చిన, భూమి క్రిందఁ జనినన్, శైలంబుపై నెక్కినన్,
లిదండన్ విలసించినన్, వికృతరూపంబుం బ్రవేశించినన్,
ధిన్ దాఁటిన, నగ్రజన్మ హలి కాశ్వాటాకృతుల్ దాల్చినన్.

టీక:- బలిమిన్ = బలవంతముగా; మాధవ = కృష్ణా; నేడు = ఇవాళ; నిన్ను = నిన్ను; భువన = లోక; ప్రఖ్యాతి = ప్రసిద్ధము; కాన్ = అగునట్లు; పట్టుదున్ = పట్టుకొనెదను; జలముల్ = నీటిలో; చొచ్చినన్ = (మత్స్యమువై) మునిగిన; భూమి = భూమి; క్రిందన్ = కిందికి వెళ్ళి; చనినన్ = (కూర్మమువై) దూరిన; శైలంబున్ = కొండలు; పైన్ = మీదికి; ఎక్కినన్ = (వరాహుడవై) ఎక్కినను; బలి = బలిచక్రవర్తి; దండన్ = సహాయముచేత; విలసించినన్ = (వామనుడవై)విలసిల్లిన; వికృత = వికారమైన; రూపంబున్ = (నరసింహ) వేషమును; ప్రవేశించినన్ = ధరించినను; జలధిన్ = సముద్రమును; దాటినన్ = (రాముడవై) దాటినను; అగ్రజన్మ = బ్రాహ్మణ (పరశురామ); హలిక = దున్నేవాని (బలరామ); అశ్వాట = గుఱ్ఱపురౌతు (కల్కి); ఆకృతుల్ = వేషములను(అవతారాలు); తాల్చిననన్ = ధరించినను.
భావము:- మాధవా! నీటిలో ప్రవేశించినా (మత్స్యావతారం) భూమి క్రింద దూరినా (కూర్మావతారం) కొండపైకి ఎక్కినా (వరాహావతారం) బలి సమీపాన చేరినా (వామనావతారం) వికారరూపం గైకొన్నా ( నృసింహావతారం) సాగరాన్ని దాటినా (రామావతారం) బ్రాహ్మణ, హాలిక, అశ్వాట రూపాలు ఏవి దాల్చినా (పరశురామ, బలరామ, కల్క్యావతారములు) సరే బలిమితో లోకప్రసిద్ధి పొందేలా నేడు నిన్ను తప్పక పట్టుకుంటాను.

తెభా-10.1-1626-వ.
అదియునుం గాక.
టీక:- అదియునన్ = అంతే; కాక = కాకుండ.
భావము:- ఇంకా. . .

తెభా-10.1-1627-మ.
ముల్ దూఱవు; మద్ధనుర్గుణలతాబ్దంబు లేతేర; వీ
రిరింఖోద్ధతిధూళి గప్ప; దకటా! హాస్యుండవై పాఱె; దు
ర్వపై నే క్రియఁ బోరితో కదిసి మున్ వాతాశితోఁ గేశితో
రితో మల్లురతో జరాతనయుతోఁ గంసావనీనాథుతోన్."

టీక:- శరముల్ = బాణములేవీ; దూఱవు = నాటుకొనలేదు; మత్ = నా యొక్క; ధనుః = వింటి; గుణ = నారి, అల్లెతాడు; శబ్దంబులు = ధ్వనులేవీ; ఏతేరవు = రానేలేదు; ఆ = ఆ యొక్క; హరి = గుఱ్ఱము; రింఖా = డెక్కల, గిట్టల; ఉద్ధతిన్ = విజృంభణమువలని; ధూళిన్ = దుమ్మైనా; కప్పదు = ఆవరించలేదు; అకటా = అయ్యో; హాస్యుండవు = ఎగతాళి చేయబడెడి వాడవు; ఐ = అయ్యి; పాఱెదు = పారిపోతున్నావు; ఉర్వర = భూమి; పైన్ = మీద; ఏ = ఏ; క్రియన్ = విధముగా; పోరితో = యుద్ధము చేసితివో; కదిసి = చేరి; మున్ = ఇంతకుముందు; వాతాశి = అఘాసురుని {వాతాశి - వాయుభక్షకుడు, సర్పము, అఘాసురుడు}; తోన్ = తోటి; కేశి = కేశి అను ఘోటకాసురుని {కేశి - కంసుని వద్ద ఉన్న కేశి అను పేరు గల గుఱ్ఱము రూపు రాక్షసుడు}; తోన్ = తోటి; కరి = కువలయాపీడము {కువలయాపీడము - కువలయ (భూమండలమునకు) పీడము (పీడగా నున్నది), కంసుని వద్ద ఏనుగు}; తోన్ = తోటి; మల్లుర = చాణూర ముష్టికులాదుల {చాణూర ముష్టికాదులు - కంసుని వద్ద మల్లుల్లరు}; తోన్ = తోటి; జరాతనయు = జరాసంధుని {జరాతనయుడు - జర అను రాక్షసి చేత పుట్టినప్పుడు 2 ఖండములుగ నున్న దేహము కలుపుటచేత బతికిన వాడు, మగధదేశాధీశుడు, జరాసంధుడు}; తోన్ = తోటి; కంస = కంసుడు అను; అవనీనాథు = రాజు {అవనీనాథుడు - అవని (రాజ్యమున)కు నాథుడు, రాజు}; తోన్ = తోటి.
భావము:- ఇంకా, నా గుఱ్ఱాల కాలిడెక్కల ధూళి నిన్ను కప్పేయ లేదు. నా వింటి అల్లెత్రాటి మ్రోతలు వినిపించనే లేదు. నీ శరీరంలో నా బాణాలు నాటనే లేదు. అయ్యయ్యో అప్పుడే పారిపోతున్నా వేమిటి. మునుపు కాళీయుడితో, కేశితో, కువలయాపీడంతో, మల్లుజెట్టిలతో, జరాసంధుడితో, కంసడితో ఏలా పోరాడావో ఏమిటో?

తెభా-10.1-1628-వ.
అని పలుకుచుఁ గాలయవనుండు వెంట నరుగుదేర సరకుచేయక మందహాసంబు ముఖారవిందంబునకు సౌందర్యంబు నొసంగ “వేగిరపడకు; రమ్ము ర” మ్మనుచు హరియును.
టీక:- అని = అని; పలుకుచున్ = చెప్పుతు; కాలయవనుండు = కాలయవనుడు; వెంటన్ = వెంటపడి; అరుగుదేర = వస్తుండగా; సరకుచేయక = లక్ష్యపెట్టకుండ; మందహాసంబు = చిరునవ్వు; ముఖ = ముఖము అను; అరవిందంబున్ = పద్మమున; కున్ = కు; సౌందర్యంబున్ = అందమును; ఒసంగన్ = కలిగించుచుండగా; వేగిర = తొందర; పడకు = పడ వద్దు; రమ్మురమ్ము = వచ్చెయ్యి; అనుచున్ = అని చెప్పుతు; హరియును = కృష్ణుడు.
భావము:- ఇలా అంటూ తనను వెంబడిస్తున్న కాలయవనుడి మాటలను లెక్కచేయకుండా శ్రీకృష్ణుడు చిరునవ్వు అలంకరించిన మోముతో “తొందరపడకు. రమ్ము రమ్ము” అంటూ....

తెభా-10.1-1629-సీ.
దె యిదె లోఁబడె ని పట్టవచ్చినఁ-
గుప్పించి లంఘించుఁ గొంతతడవు
ట్టరా; దీతని రు వగ్గలం బని-
భావింపఁ దన సమీమున నిలుచు
డరి పార్శ్వంబుల డ్డంబు వచ్చినఁ-
గేడించి యిట్టట్టు గికురుపెట్టు;
ల్మీక తరు సరోరము లడ్డంబైన-
వ్యాపసవ్య సంరతఁ జూపుఁ;

తెభా-10.1-1629.1-తే.
ల్లముల డాఁగు; దిబ్బల యలుపడును;
నీడలకుఁ బోవు; నిఱుముల నిగిడి తాఱు
"న్నుఁ బట్టిన నీవు మావుఁడ"వనుచు
వనుఁ డెగువంగ బహుజగవనుఁ డధిప!

టీక:- అదె = అదిగో; ఇదె = ఇదిగో; లోబడెన్ = చిక్కెను; అని = అని; పట్టన్ = పట్టుకొనుటకు; వచ్చినన్ = రాగా; కుప్పించి = గెంతి; లంఘించున్ = దాటును; కొంత = కొంత; తడవు = సేపు; పట్టరాదు = పట్టుకొనశక్యముగాదు; ఈతని = ఇతని యొక్క; పరువు = పరుగు; అగ్గలంబు = అధికమైనది; అని = అని; భావింపన్ = తలచినచో; తన = అతని; సమీపమునన్ = దగ్గరలోనే; నిలుచున్ = ఆగును; అడరి = విజృంభించి; పార్శ్వంబులన్ = పక్కల; కున్ = కు; అడ్డంబున్ = అడ్డముగా; వచ్చినన్ = వచ్చినచో; కేడించి = తప్పుకొని; ఇట్టట్టు = ఇటు నటు; కికురుపెట్టు = వంచించిపోవును; వల్మీక = పుట్టలు; తరు = చెట్లు; సరోవరములు = చెట్లు; అడ్డంబున్ = అడ్డముగావచ్చుట; ఐనన్ = జరిగినచో; సవ్య = ఎడమవైపునకకు; అపసవ్య = కుడివైపునకు; సంచరతన్ = తిరుగుటను; చూపున్ = కనబరచును; పల్లములన్ = గోతులలో.
డాగు = దాగుకొనును; దిబ్బల = గుట్టల మీదకి; బయలుపడును = కనబడును; నీడల్ = నీడలలోని; కున్ = కి; పోవున్ = వెళ్ళును; ఇఱుముల = మఱుగులందు, చాటు ప్రదేశము లందు; నిగిడి = నిక్కి; తాఱున్ = మరుగుపడును; నన్నున్ = నన్ను; పట్టినన్ = పట్టుకొనినచో; నీవు = నీవు; మానవుడవు = అభిమానము కలవాడవు; అనుచున్ = అని పలుకుచు; యవనుడు = కాలయవనుడు; ఎగువంగన్ = తరుముచుండగా; బహుజగదవనుడు = కృష్ణుడు {బహుజగదవనుడు - అనేక లోకములను రక్షించువాడు, విష్ణువు}; అపుడు = ఆ సమయంలో.
భావము:- “ఇదిగో దొరికేసాడు. అదిగో చిక్కిపోయాడు” అని అనుకుంటూ కాలయవనుడు పట్టుకొనుటకు రాగా కృష్ణుడు కుప్పించి దుముకుతాడు. “ఇతని వేగం చాలా ఎక్కువగా ఉంది. వీణ్ణి పట్టుకోలేను” అని కాలయవనుడు భావించి నప్పుడు దగ్గరగా వచ్చి నిలబడతాడు. అతడు బంధించడానికి ప్రక్కకి వచ్చినపుడు శ్రీహరి వాని కనుగప్పి తప్పించుకుని వెడతాడు. పుట్టలు, చెట్లు, తటాకాలు అడ్డం వచ్చినప్పుడు గోవిందుడు కుడి ఎడమ వైపులకు మళ్ళి పరుగులు తీస్తాడు. పల్లపు నేలలో దాగుకుంటాడు. మిట్టలెక్కి బయట పడతాడు. నీడలలోకి వెడతాడు. మారుమూలలో తారాట్లాడుతాడు. “నన్ను పట్టుకుంటేనే నీవు మగాడివి” అంటూ లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు తనను తరుముతున్న కాలయవనుడిని ముప్పతిప్పలు పెట్టాడు.

తెభా-10.1-1630-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా......

తెభా-10.1-1631-సీ.
కలభూతవ్రాత సంవాసుఁ డయ్యును-
నములు నగములు రుస దాఁటు;
లోకోన్నతుండును లోకచక్షుఁడు నయ్యు-
మాటిమాటికి నిక్కి గిడి చూచుఁ;
క్ష విపక్ష సంబంధ శూన్యుం డయ్యుఁ-
నుఁ విపక్షుఁడు వెంటఁ గుల నిగుడు;
విజయాపజయభావ విరహితుం డయ్యుఁ దా-
పజయంబునుఁ జెందిట్లు తోఁచు;

తెభా-10.1-1631.1-ఆ.
భయ భయ విహీనుఁ య్యు భీతుని మాడ్కిఁ
గానఁబడును సర్వకాలరూపుఁ
య్యుఁ గాలచకితుఁడైన కైవడి వన
మాలి పఱచు వెఱపుమాలి యధిప!

టీక:- సకల = సమస్తమైన; భూత = స్థావరజంగమజీవుల; వ్రాత = సమూహములకు; సంవాసుడు = ఉనికిపట్టయినవాడు; అయ్యును = అయినప్పటికి; వనములు = అడవులను; నగములున్ = కొండలను; వరుసన్ = క్రమముగా; దాటున్ = దాటును; లోకోన్నతుండును = లోకముకంటెఅధికుడు {లోకోన్నతుడు - అణోరణీయాన్ మహతో మహియాన్ (శ్రుతి) కనుక లోకముకంటె ఉన్నతుడు సూక్ష్ముడు, విష్ణువు}; లోకచక్షుడు = జగత్తంతనుచూచువాడు; అయ్యున్ = అయినప్పటికి; మాటిమాటికి = అస్తమాను; నిక్కి = నిగిడి; మగిడి = వెనుదిరిగి; చూచున్ = చూస్తుండెను; పక్ష = స్వపక్షమువారు; విపక్ష = విపక్షమువారు వంటి; సంబంధ = సంబంధములు; శూన్యుండు = లేనివాడు; అయ్యున్ = అయినప్పటికి; తనున్ = అతనిని; విపక్షుడు = శత్రువు; వెంటదగులన్ = వెంటపడగా; నిగుడున్ = పారిపోవును; విజయ = గెలుపు; అపజయ = ఓటములు వంటి; భావ = భావములు; విరహితుండ = లేనవాడు; అయ్యున్ = అయినప్పటికి; తాన్ = అతను; అపజయంబునున్ = ఓటమి; చెందినట్లు = పొందినవిధముగ; తోచున్ = కనబడును; అభయ = భయములేకపోవుట.
భయ = భయము ఉండుట; విహీనుడు = లేనివాడు; అయ్యున్ = అయినప్పటికి; భీతుని = బెదిరిపోయినవాని; మాడ్కిన్ = వలె; కానబడును = కనిపించును; సర్వకాల = సమస్తమైన కాలములు {సర్వకాలములు - నిమేషమాది మహాప్రళయాంతము వరకు కల సమస్తమైన కాలములు, సమస్తమైన కాలములు}; రూపుడు = తనరూపమే ఐనవాడు; అయ్యున్ = అయినప్పటికి; కాలచకితుడు = కాలముచేత వెరచువాడు {కాలచకితుడు - కాల ప్రభావమున కలుగు మరణాదులకు భయపడువాడు, కాలముచేత వెరచువాడు}; ఐన = అయిన; కైవడిన్ = విధముగా; వనమాలి = కృష్ణుడు {వనమాలి - వనమాలలు ధరించువాడు, కృష్ణుడు}; పఱచున్ = పరుగెట్టును; వెఱపు = భయము; మాలి = లేనివాడయ్యి; అధిప = రాజా.
భావము:- ఓ పరీక్షన్నరేంద్రా! వనమాల ధరించేవాడైన ఆ శ్రీకృష్ణుడు, (యవనుడు తనను వెంటబడుతుంటే) బెఱుకు వీడి పరుగెడుతున్నాడు. నిఖిల భూతములలో నివసించు వాడు అయినా, అడవులు కొండలు వరుసగా దాటుతున్నాడు; లోకాలకే అధికుడు లోకాలకు కన్నువంటి వాడు అయినా, సారెసారెకూ నిక్కినిక్కి చూస్తున్నాడు; తన వారు పైవారు అన్న భేదం లేనివాడు అయినా, తాను ఓటమి చెందినట్లు గోచరిస్తున్నాడు; భయ నిర్భయాలు లేనివాడు అయినా, భయపడ్డవాని వలె కనిపిస్తున్నాడు; కాలస్వరూపుడు అయినా కాలానికి (కాలయవనుడు) కలతపడ్డవాడిలా కనపడుతున్నాడు.

తెభా-10.1-1632-వ.
ఇ వ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- అలా అలా....

తెభా-10.1-1633-క.
దారిత శాత్రవ భవను న
పా మహావేగ విజిత వనున్ యవనున్
దూరఁము గొనిచని కృష్ణుఁడు
ఘోరంబగు నొక్క శైలగుహ వడిఁ జొచ్చెన్.

టీక:- దారిత = భేదింపబడిన; శాత్రవ = శత్రువుల యొక్క; భవనునన్ = భవనములు కలవానిని; అపార = అమితమైన; మహా = గొప్ప; వేగ = వేగముతో; విజిత = గెలువబడిన; పవనున్ = వాయువు కలవానిని; యవనున్ = కాలయవనుని; దూరమున్ = మిక్కిలి దూరముగా; కొనిచని = తీసుకొనిపోయి; కృష్ణుడు = కృష్ణుడు; ఘోరంబు = భయంకరమైనది; అగు = ఐన; ఒక్క = ఒకానొక; శైల = కొండ; గుహన్ = గుహలోనికి; వడిన్ = వేగముగా; చొచ్చెన్ = ప్రవేశించెను.
భావము:- శ్రీకృష్ణుడు, శత్రువుల మందిరాలను భేదించినవాడూ, అంతులేని గొప్పవేగంతో గాలినైనా ఓడించువాడూ అయిన యవనుడిని దూరంగా తీసుకుపోయి భయంకరమైన ఒక కొండగుహలో చటుక్కున దూరాడు.

తెభా-10.1-1634-క.
దె లోఁబడె నిదె లోఁబడె
దె యిదె పట్టెద నటంచు నాశావశుఁడై
దుసింహుని పదపద్ధతి
లక గిరిగహ్వరంబు వాఁడుం జొచ్చెన్.

టీక:- అదె = అదిగో; లోబడెన్ = దొరికెను; ఇదె = ఇదిగో; లోబడెన్ = దొరికును; అదె = అదిగో; ఇదె = ఇదిగో; పట్టెదన్ = పట్టుకొనదను; అటంచన్ = అని; ఆశావశుడు = ఆశకు లోబడినవాడు; ఐ = అయ్యి; యదుసింహుని = కృష్ణుని {యదు సింహుడు - యాదవులలో సింహము వంటి వాడు, కృష్ణుడు}; పదపద్దతిన్ = అడుగు జాడలను; వదలక = విడువకుండ; గిరి = కొండ; గహ్వరంబున్ = గుహను; వాడున్ = అతను కూడ; చొచ్చెన్ = ప్రవేశించెను.
భావము:- “అదిగో దొరికేసాడు, ఇదిగో దొరికేసాడు, అదిగో పట్టుకుంటున్నాను, ఇదిగో పట్టేసుకుంటాను” అనే ఆశకు లోబడి, ఆ యదువంశపు సింహం అడుగులజాడలమ్మట పట్టుదలగా కాలయవనుడు తాను కూడా ఆ పర్వతగుహలోకి వెళ్ళాడు.

తెభా-10.1-1635-వ.
ఇట్లు చొచ్చి మూఢహృదయంబునుం బోలెఁ దమఃపూర్ణంబయిన గుహాంతరాళంబున దీర్ఘతల్పనిద్రితుండయి గుఱక లిడుచున్న యొక్క మహాపురుషునిం గని శ్రీహరిగాఁ దలంచి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చొచ్చి = ప్రవేశించి; మూఢ = మూఢుని; హృదయంబున్ = మనసు; బోలెన్ = వలె; తమః = చీకటి అను అజ్ఞానముతో; పూర్ణంబు = నిండినది; ఐన = అగు; గుహ = గుహ; అంతరాళంబునన్ = లోపలిభాగము నందు; దీర్ఘ = విశాలమైన; తల్ప = పక్కపై, మంచముపై; నిద్రితుండు = నిద్రపోతున్నవాడు; అయి = ఐ; గుఱకలిడుచున్న = గురక పెడుతున్న; ఒక్క = ఒకానొక; మహా = గొప్ప, పెద్ద; పురుషునిన్ = మానవుడిని; కని = చూసి; శ్రీహరి = కృష్ణుని; కాన్ = అయినట్లు; తలంచి = ఎంచికొని.
భావము:- అజ్ఞానంతో నిండిన మూఢుని హృదయం మాదిరి చీకటితో నిండిన ఆ గుహలోపలకి యవనుడు ఈలాగ చొరపడి, అక్కడ పెద్ద పాన్పుమీద నిద్రలో మునిగి గురకపెడుతున్న ఒక మహాపురుషుడిని చూసి అతడే శ్రీకృష్ణుడని అనుకుని.....

తెభా-10.1-1636-ఉ.
ము చేయలేక పురుషాధమ! దుర్లభ కంటకద్రుమా
భీ మహాశిలా సహిత భీకర కుంజర ఖడ్గ సింహ శా
ర్దూ తరక్షు సంకలిత దుర్గపథంబునఁ బాఱుతెంచి యీ
శైగుహన్ సనిద్రుక్రియఁ జాఁగి నటించినఁ బోవనిత్తునే?

టీక:- ఆలమున్ = పోరు; చేయలేక = సలుపజాలక; పురుషాధమ = అల్పుడా {పురుషాధముడు - మగవారిలో తక్కువవాడు, అల్పుడు}; దుర్లభ = కష్టసాధ్యమైన; కంటక = ముళ్ళు; ద్రుమ = చెట్లతో; ఆభీల = భయంకరమైనట్టి; మహాశిలా = బండరాళ్ళతో; సహిత = కూడుకొన్న; భీకర = భయంకరమైన; కుంజర = ఏనుగులు; ఖడ్గ = ఖడ్గమృగముల; సింహ = సింహములు; శార్దూల = పెద్దపులులు; తరక్షు = సివంగులుతో; సంకలిత = కూడుకొన్న; దుర్గ = చొరరాని; పథంబునన్ = దారిలో; పాఱుతెంచి = పరుగెత్తుకు వచ్చి; ఈ = ఈ యొక్క; శైల = కొండ; గుహన్ = గుహలో; సనిద్రున్ = నిద్రపోతున్నవాని; క్రియన్ = వలె; చాగి = సాచి, ప్రవర్తించి; నటించినన్ = వేషాలు వేసినంతమత్రాన; పోవనిత్తునే = వదిలిపెట్టను.
భావము:- “ఓరీ! పురుషాధమా! నాతో యుద్ధం చేయలేక ముళ్ళ చెట్లు, బండ రాళ్ళు, ఏనుగులు, ఖడ్గమృగాలు, సింహములు, శార్దూలములు, సివంగులు మొదలైన జంతువులతో భీతికొల్పుతూ నడవడానికి వీలుకాని దారిలోపడి పరుగెత్తుకుని వచ్చి ఈ కొండగుహలో దూరి నిద్రిస్తున్న వాడి వలె నటిస్తున్నావా? నిన్ను వదుల్తాను అనుకుంటున్నావా?

తెభా-10.1-1637-క.
క్కడ నెవ్వారలకును
జిక్క వనుచు నారదుండు చెప్పెను; నాకుం
జిక్కి తి వెక్కడఁ బోయెదు?
నిక్కముగా నిద్రపుత్తు ని న్నీ కొండన్.”

టీక:- ఎక్కడన్ = ఎక్కడ; ఎవ్వారల = ఎవరి; కును = కి; చిక్కవు = దొరకవు; అనుచున్ = అని; నారదుండు = నారదుడు; చెప్పెను = చెప్పెను; నా = నా; కున్ = కు; చిక్కితివి = దొరికిపోయావు; ఎక్కడన్ = ఇక ఎక్కడకి; పోయెదు = పోగలవు; నిక్కముగా = తప్పకుండా; నిద్రపుత్తు = చంపెదను; నిన్నున్ = నిన్ను; ఈ = ఈ యొక్క; కొండన్ = కొండవద్ద.
భావము:- నీవు ఎక్కడా ఎవరికీ చిక్కవని నారదుడు చెప్పాడు. ఇదిగో ఇక్కడ నాకు చిక్కావు. ఇంకెక్కడకి వెడతావు నిద్రనటిస్తున్న నిన్ను నిజంగా ఈ కొండగుహలోనే దీర్ఘనిద్రలోకి పంపుతానులే.”