పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కంసుడు దుశ్శకునము ల్గనుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-1301-క.
పురికి రామకృష్ణులు
నుదెంచి నిజానుచరులఁ జంపుటయు మహా
నువుఁ గదిసి విఱుచుటయును
విని కంసుఁడు నిద్రలేక విహ్వలమతియై.

టీక:- తన = అతని యొక్క; పురి = పట్టణమున; కిన్ = కు; రామ = బలరామ; కృష్ణులు = శ్రీకృష్ణులు; చనుదెంచి = వచ్చి; నిజ = తన యొక్క; అనుచరులన్ = సేవకులను; చంపుటయున్ = సంహరించుటను; మహా = గొప్ప; ధనువున్ = విల్లును; కదిసి = చేరి; విఱుచుటయును = విరగగొట్టుట; విని =ఆలకించి; కంసుడు = కంసుడు; నిద్ర = నిద్ర; లేక = పట్టక; విహ్వలమతి = భయాదులచేత వశము తప్పిన మనసు కల వాడు, కలతబారిన మనసు కలవాడు; ఐ = అయ్యి.
భావము:- కంసుడు తన పట్టణానికి బలరామకృష్ణులు రావటమూ, తన అనుచరులను సంహరించడమూ, అంత గొప్ప ధనుస్సును విరిచివేయడమూ విన్నాడు. అతనికి నిద్రపట్టలేదు మనసు కలతబారింది.

తెభా-10.1-1302-సీ.
ర్ణరంధ్రములు చేఁ ప్పిన లోపలి-
ప్రాణ ఘోషము వినఁడక డిందెఁ
దోయాదికములందుఁ దొంగిచూచుచు నుండ-
ల గానరాదయ్యెఁ నువుమీఁదఁ
రశాఖ నాసికాగ్రంబుపై నిడి చూడ-
గ్రహతారకలు రెంటఁ గానబడియె
వెలుఁగున నిలుచుండి వీక్షింపఁగా మేని-
నీడ సరంధ్రమై నేలఁ దోఁచె

తెభా-10.1-1302.1-ఆ.
డుగుజాడ దృష్టమౌట లే దయ్యెను
రువులెల్ల హేమరువు లగుచు
మెఱయుచుండెఁ గాలమృత్యువు డగ్గఱ
బుద్ధి యెల్లఁ గలఁగె భోజపతికి.

టీక:- కర్ణ = చెవుల; రంధ్రములు = కన్నములు; చేన్ = చేతితో; కప్పినన్ = కప్పినచో; లోపలి = లోపలుండెడి; ప్రాణ = ప్రాణవాయు సంచారపు; ఘోషము = ధ్వని; వినబడక = వినిపించకుండగ; డిందెన్ = అణగిపోయెను; తోయ = నీళ్ళు; ఆదికముల = మున్నగువాని; అందున్ = లోకి; తొంగి = వంగి; చూచుచునుండన్ = చూస్తుంటే; తల = శిరస్సు; కానరాదు = కనబడకపోవుట; అయ్యెన్ = జరిగినది; తనువు = దేహము; మీదన్ = పైన; కరశాఖ = చేతివేలు; నాసిక = ముక్కు; అగ్రంబు = కొన; పైన్ = మీద; ఇడి = పెట్టి; చూడన్ = చూడగా; గ్రహ = గ్రహములు; తారకలు = నక్షత్రములు; రెంటన్ = రెండేసిగా; కానబడియెన్ = కనుపించెను; వెలుగునన్ = ఎండలో; నిలుచుండి = నిలబడి; వీక్షింపగా = చూడగా; మేని = దేహము యొక్క; నీడ = నీడ; సరంధ్రము = రంధ్రము కలది; ఐ = అయ్యి; నేలన్ = నేలపై, మట్టిలో; అడుగు = అడుగువేసిన; జాడ = ఆనమాలు.
దృష్టము = కనబడినది; ఔట = అగుట; లేదు = లేకపోవుట; అయ్యెనున్ = జరిగెను; తరువులు = చెట్లు; ఎల్లను = అన్ని; హేమ = బంగారపు; తరువులు = చెట్లు; అగుచున్ = ఔతున్నట్లు; మెఱయుచుండెన్ = ప్రకాశించుచుండెను; కాల = సమయము; మృత్యువు = చనిపోవుటకు; డగ్గఱన్ = సమీపించగా; బుద్ధి = మనసు; ఎల్లన్ = అంత; కలగెన్ = కలతచెందెను; భోజపతి = కంసున; కిన్ = కు.
భావము:- భోజరాజు కంసుడికి చేతులతో చెవిరంధ్రాలను మూసుకుంటే తన లోపలి ప్రాణవాయువు శబ్దం వినపడకుండా పోయింది. నీటిలోకానీ అద్దములోకానీ తొంగిచూస్తే శరీరము మీద శిరస్సు కన్పించడం లేదు. వ్రేలు ముక్కుకొనను ఉంచి చూస్తే సూర్యుడు మొదలైన గ్రహాలు అశ్విని మున్నగు నక్షత్రాలు ఒక్కక్కటీ రెండు రెండుగా కనిపించసాగాయి. వెలుతురులో నిలబడి చూస్తే తన దేహం నీడలో ఖాళీలు కనబడసాగాయి. నేల మీద తన అడుగుల గుర్తులు కనబడటం లేదు. చెట్లన్నీ బంగారు వన్నెతో భాసించాయి. కాలమృత్యువు సమీపించి అతని బుద్ధి కలత చెందింది.

తెభా-10.1-1303-క.
ళముఁ దినుటయుఁ బ్రేతము
రిరంభించుటయు నగ్నభావుఁ డవుటయున్
శిమునఁ దైలము పడుటయు
పతి నెక్కుటయు నతఁడు లలోఁ గనియెన్.

టీక:- గరళము = విషము; తినుటయున్ = తిన్నట్లుగను; ప్రేతమున్ = శవముతో; పరిరంభించుటయున్ = ఆలింగనము చేసికొన్నట్లు; నగ్నభావుడు = దిగంబరుడు; అవుటయున్ = అగుట; శిరమునన్ = తలపై; తైలము = నూనె; పడుటయున్ = పడినట్లు; ఖరపతిన్ = పెద్దగాడిదను; ఎక్కుటయున్ = ఎక్కినట్లు; అతడు = అతను; కల = స్వప్నము; లోన్ = అందు; కనియెన్ = చూసెను.
భావము:- కంసుడికి కలలో విషం తిన్నట్లు; చనిపోయిన వారిని కౌఁగిలించుకొన్నట్లు; దిగంబరంగా ఉన్నట్లు; తల మీద నూనె పడినట్లు; గాడిద మీద ఎక్కినట్లు అనిపించింది.

తెభా-10.1-1304-వ.
మఱియు రక్త కుసుమమాలికాధరుండై యొక్కరుండును నెక్కడేనియుం జనుచున్నవాఁడ నని కలఁ గాంచి మరణహేతుక భీతిం జింతాక్రాంతుండై నిద్రఁజెందక వేగించుచున్న సమయంబున.
టీక:- మఱియున్ = అంతే కాక; రక్త = ఎఱ్ఱని; కుసుమ = పూల; మాలికా = మాలలను; ధరుండు = ధరించినవాడు; ఐ = అయ్యి; ఒక్కరుండును = ఒంటరిగా; ఎక్కడేనియున్ = ఎక్కడకో; చనుచున్నవాడను = పోవుతున్నాను; అని = అని; కలన్ = స్వప్నములో; కాంచి = చూసి; మరణ = చావును; హేతుక = కారణపు; భీతిన్ = భయముతో; చింతా = విచారముతో; ఆక్రాంతుండు = ఆక్రమింపబడినవాడు; ఐ = అయ్యి; నిద్రన్ = నిద్ర; చెందకన్ = పోలేక; వేగించుచున్న = జాగరము చేస్తున్న; సమయంబున = సమయము నందు.
భావము:- అంతేకాకుండా, ఎఱ్ఱని పూలదండలు ధరించి ఒంటరిగా ఎక్కడికో వెళుతున్నట్లు అతడు కలగన్నాడు, మరణ భయంతో దుఃఖక్రాంతుడై నిదురపోకుండా ఆ రాత్రి ఎలాగో తపిస్తూ జాగరము చేస్తూ ఉండగా. . . .

తెభా-10.1-1305-క.
రుణ హరినఖర విదళిత
గురుతిమిరేభేంద్రకుంభకూట వినిర్ము
క్త రుధిరమౌక్తికముల క్రియ
సుపతిదిశఁ గెంపుతోడఁ జుక్కలు మెఱసెన్.

టీక:- అరుణ = ఉదయభానుడు అనెడి; హరి = సింహము యొక్క; నఖర = గోళ్ళచేత; విదళిత = చీల్చబడిన; గురు = గొప్ప; తిమిర = చీకటి అనెడి; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠము యొక్క; కుంభ = కుంభస్థలము అనెడి; కూట = శిఖరముల యందుండి; వినిర్ముక్త = రాలుతున్న; రుధిర = నెత్తురోడుతున్న; మౌక్తికముల = ముత్యాల; క్రియన్ = వలె; సురపతిదిశన్ = తూర్పుదిక్కువైపు; కెంపు = ఎరుపు; తోడన్ = తోటి; చుక్కలు = నక్షత్రములు; మెఱసెన్ = ప్రకాశించినవి.
భావము:- అరుణుడు అనే సింహం గోళ్ళతో చీల్చిన చీకటి అనే గజేంద్రుడి కుంభస్థలం నుండి వెలువడిన నెత్తుటితో కలిసిన ముత్యాల వలె తూర్పుదిక్కున ఎఱ్ఱదనంతో నక్షత్రాలు మెరిశాయి.