Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఉద్ధవుడు గోపికల నూరార్చుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1468-వ.
అని మఱియు నిట్లనేక విధంబులఁ గృష్ణసందర్శన లాలసలై పలుకుచున్న గోపికల వచనంబులు విని యుద్ధవుండు మధురాలాపంబుల నూరార్చుచు, యిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనేక = పెక్కు; విధంబులన్ = రకములుగా; కృష్ణ = కృష్ణుని; సందర్శన = చూడట యందు; లాలసలు = అధికాసక్తి కలవారు; ఐ = అయ్యి; పలుకుచున్న = మాట్లాడుతున్న; గోపికల = గొల్లస్త్రీల యొక్క; వచనంబులు = మాటలు; విని = విని; ఉద్ధవుండు = ఉద్ధవుడు; మధుర = తీయని; ఆలాపంబులన్ = మాటలతో; ఊరార్చుచున్ = ఊరడింప జేయుచు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగానూ, ఇంకా అనేక రకాలుగానూ కృష్ణసందర్శన మందు ఆశ కలవారై మాట్లాడుతున్న గొల్లవధువుల మాటలు వినిన ఉద్ధవుడు, తీయటి పలుకులతో వారిని ఊరడిస్తూ ఇలా అన్నాడు.

తెభా-10.1-1469-మ.
"దానవ్రత హోమ సంయమ తపస్స్వాధ్యాయ ముఖ్యంబులన్
నిపుణుల్ గోరియు నే విభున్ మనములన్ నిల్పంగలే రట్టి స
ద్విపులాకారునిపై మహామహిముపై విశ్వేశుపై మీ కజ
స్ర టుధ్యానము లిట్లు నిల్చునె? భవచ్చారిత్రముల్ చిత్రముల్.

టీక:- జప = మంత్రము జపించుటలు; దాన = దాన మిచ్చుటలు; వ్రత = వ్రతము లాచరించుటలు; హోమ = యజ్ఞములు చేయుటలు; సంయమ = హింసాదులను విడుచుట; తపస్ = తపస్సులు చేయుట; స్వాధ్యాయ = వేదములను చదువుట; ముఖ్యంబులన్ = మున్నగువానివలన; నిపుణుల్ = నేర్పరులైనవారు; కోరియున్ = ఎంత కోరుకొనుచున్నను; ఏ = ఏ; విభున్ = భగవంతుని; మనములన్ = మనసు లందు; నిల్పంగలేరు = నిలుపజాలరు; అట్టి = అటువంటి; సత్ = సత్యమైన, శాశ్వతమైన; విపుల = మిక్కిలి విస్తారమైన; ఆకారుని = స్వరూపము కలవాని; పై = మీద; మహా = గొప్ప; మహిము = మహిమ కలవాని; పైన్ = మీద; విశ్వేశు = కృష్ణుని {విశ్వేశుడు - లోకములను నియమించువాడు, విష్ణువు}; పైన్ = మీద; మీ = మీ; కున్ = కు; అజస్ర = నిత్యమైన, ఎడతెగని; పటు = దృఢమైన; ధ్యానములు = ధ్యానములు; ఇట్లు = ఇలా; నిల్చునె = ఉండునా; భవత్ = మీ యొక్క; చారిత్రంబుల్ = చరిత్రలు; చిత్రముల్ = అద్భుతమైనవి.
భావము:- “జపము, దానము, వ్రతము, హోమము, ఆత్మనిగ్రహము, తపము, వేదాధ్యయనం మొదలగువాటి యందు మిక్కిలి నేర్పరులైనవారు కూడ ఏ భగవంతుడిని తమ మనస్సులలో ఎంత ప్రయత్నించినా నిలుపుకొనలేరో, అలాంటి బాగా గొప్పవాడూ, మహా మహిమోపేతుడూ, జగదధీశ్వరుడూ అయిన శ్రీకృష్ణునిపై మీకు నిరంతరం ధృఢమైన ధ్యానం ఈ విధంగా నెలకొని ఉన్నది కదా ఔరా! మీ చరిత్రలు బహు అద్భుత మైనవి.

తెభా-10.1-1470-క.
ను మీకడకుం గృష్ణుఁడు
నిపంపెడు వేళఁ బిలిచి లికిన పలుకుల్
వినుఁ; డన్నియు వివరించెద
జేక్షణలార! మీరు గవకుఁ డింకన్."

టీక:- ననున్ = నన్ను; మీ = మీ; కడ = వద్ద; కున్ = కు; కృష్ణుడు = కృష్ణుడు; పనిపంపెడు = కార్యార్థము పంపించెడి; వేళన్ = సమయము నందు; పిలిచి = పిలిచి; పలికిన = చెప్పిన; పలుకుల్ = మాటలను; వినుడు = వినండి; అన్నియున్ = అన్నిటిని; వివరించెద = వివరముగా తెలిపెదను; వనజేక్షణలారా = ఓ ఇంతులు {వనజేక్షణ - వనజ (పద్మములవంటి) ఈక్షణ (కన్నులు కలామె), సుందరి}; మీరు = మీరు; వగవకుండు = విచారించకండి; ఇంకన్ = ఇక.
భావము:- కలువ కన్నుల గోపికా కన్నెలారా! శ్రీకృష్ణుడు నన్ను మీ దగ్గరకు పంపే పని అప్పజెప్పుతూ నాతో చెప్పిన మాటలన్నీ మీకు వివరింగా చెప్తాను. వగపు మాని సావధానంగా వినండి.”

తెభా-10.1-1471-వ.
అని హరివచనంబులుగా నిట్లనియె.
టీక:- అని = అని; హరి = కృష్ణుని; వచనంబులున్ = మాటలు; కాన్ = అగునట్లు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని ఉద్ధవుడు కృష్ణుడు చెప్పిన మాటలు అన్నీ ఇలా వినిపించాడు

తెభా-10.1-1472-సీ.
"ల్లకార్యములకు నేను ప్రధానకా-
ణము గావున, మీకు మణులార!
లుగదు మద్వియోము, చరాచరరూప-
ములలో మహాభూతములు వసించు
రణి నుండుదు సర్వతుఁడనై నే మనః-
ప్రాణ బుద్ధి గుణేంద్రి యాశ్రయుండ
నాత్మయం దాత్మచే నాత్మఁ బుట్టింతు ర-
క్షింతును ద్రుంతు హృషీకభూత

తెభా-10.1-1472.1-తే.
గుణగణాకార మాత్మలోఁ గొమరుమిగుల
నిబిడ మాయానుభవమున నిత్యశుద్ధ
మాత్మవిజ్ఞానమయము నై మరు గుణము
ప్రకృతికార్యమనోవృత్తిఁ ట్టి పొందు.

టీక:- ఎల్ల = సర్వ; కార్యముల్ = కార్యముల; కున్ = కు; నేను = నేను; ప్రధాన = ముఖ్య; కారణము = హేతువును; కావునన్ = కనుక; మీ = మీ; కున్ = కు; రమణులారా = ఓ మగువలు {రమణులు - రమింపజేయువారు, స్త్రీలు}; కలుగదు = కలుగనేరదు; మత్ = నా యొక్క; వియోగము = ఎడబాటు; చర = జంగమ; అచర = స్థావర; రూపముల = జీవుల; లోన్ = అందును; మహాభూతములు = పంచమహాభూతములు {పంచమహాభూతములు (అంశము) - 1భూమి (చర్మము) 2జలము (రక్తము) 3అగ్ని (జఠరాగ్ని) 4వాయువు (ప్రాణాదులు) 5ఆకాశము (లోని అవకాశము)}; వసించు = ఉండెడి; కరణిన్ = విధముగ; ఉండుదు = ఉండెదను; సర్వ = సమస్తమునందును; గతుడను = ఉండువాడను; ఐ = అయ్యి; నేన్ = నేను; మనః = మనసుకి {మనస్సు - సంకల్పరూపమైనది}; ప్రాణ = ప్రాణమునకు {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; బుద్ధి = బుద్ధికి {బుద్ధి - నిశ్చయరూపమైనది}; గుణ = త్రిగుణములకు, ప్రకృతికి {త్రిగుణములు - సత్వరజోస్తమ గుణములు}; ఇంద్రియ = చతుర్దశేంద్రియములకు {చతుర్దశేంద్రియములు - పంచజ్ఞానేంద్రియములు (5) పంచకర్మేంద్రియములు (5) అంతఃకరణచతుష్కము (4)}; ఆశ్రయుండను = ఆశ్రయమైనుండువాడను {ఆశ్రయము - పుట్టుట నిలుచుట వృద్ధి పొందుట క్షీణుంచుట నశించుటలకు ఆధారముగ ఉండుట}; ఆత్మ = జీవుల, నా; అందున్ = నుండి; ఆత్మ = జీవుల, నా; చేన్ = చేత; ఆత్మన్ = జీవులను, నన్నే; పుట్టింతున్ = జనింపజేసెదను; రక్షింతున్ = పోషించెదను; త్రుంతున్ = నశింపజేసెదను; హృషీక = పద్నాలుగింద్రియములు {చతుర్దశేంద్రియములు - పంచజ్ఞానేంద్రియములు (5) పంచకర్మేంద్రియములు (5) అంతఃకరణచతుష్కము (4)}; భూత = పంచమహాభూతములు.
గుణ = గుణత్రయము; గణ = సమూహముల యొక్క; ఆకారము = రూపములలో, వృత్తులలో; కొమరుమిగులన్ = చక్కదనము అతిశయించ; నిబిడ = దట్టమైన; మాయా = ప్రకృతి; అనుభవమునన్ = అభ్యాసముచేత; నిత్య = నిత్యము {నిత్యశుద్ధము - నిత్యము (భూత భవిష్య వర్తమానములందు చెడనిది) శుద్ధము (పంచమలములైన ఆణవ కార్మిక మాయిక మాయేయ తిరోధానములు లేనిది)}; శుద్ధము = నిర్మలమునైనది; ఆత్మ = పరమాత్మ; విజ్ఞానమయమున్ = అపరోక్షజ్ఞానస్వరూపము; ఐ = అయ్యి; అమరు = ఉండెడి; గుణము = గుణము; ప్రకృతి = మాయ యొక్క; కార్య = కార్యమైన; మనః = అంతఃకరణ; వృత్తిన్ = వ్యాపారమును; పట్టి = అనుసరించి; పొందు = పొందును.
భావము:- “ఓ రమణీమణులారా! నేను సమస్త కార్యములకు ముఖ్యకారణమై ఉన్నాను. నా యెడబాటు మీకు కలుగదు స్థావరజంగమాత్మకము లైన సకల ప్రాణులలో పృథివ్యాపస్తేజోవాయ్వాకాశము లనే పంచ మహాభూతాలు ఉండే విధంగా; నేను మనస్సునకు, పంచప్రాణాలకు, బుద్ధికి, ఇంద్రియ వృత్తులైన శబ్ద స్పర్స రూప రస గంధాలకు, జ్ఞానకర్మేంద్రియాలకు, ఆధారభూతుడను అయి ఉన్నాను. నా యందే నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మరూపమున అణిగి యున్న చరాచర ప్రపంచాన్ని స్థూలరూపంతో సృజిస్తాను; రక్షిస్తాను; నశింపజేస్తాను. స్వరూపము చేత నిర్మలుడు జ్ఞానస్వరూపుడు అయిన జీవునకు ప్రపంచ స్వరూపం సత్త్వాదిగుణములు లేదా భూతేంద్రియ గుణాలతో కలుగుతున్నది మాయాకార్యము లైన జాగ్రత్స్వప్నసుషుప్తు లనే మనోవృత్తు లందు అతడు దేవమనుష్యాదిరూపాలతో తోచుచున్నాడు.

తెభా-10.1-1473-చ.
లఁగని లేచి మున్నుఁ గలఁ న్న సమస్తవిధంబు గల్ల గాఁ
లఁచిన భంగి మానసపదార్థముచే నిఖిలేంద్రియార్థముల్
మునఁ గట్టి తద్జ్ఞుఁడు ప్రపంచము లేదనుఁ దన్మనంబుఁ దా
యక గట్టుడున్ బుధుల వ్వల నొండొక భేదమున్నదే?

టీక:- కల = స్వప్నమును; కని = చూసి; లేచి = నిద్రలేచి; మున్ను = ఇంతకుముందు; కలన్ = స్వప్నములో; కన్న = చూసిన; సమస్త = సర్వ; విధంబున్ = విషయములను; కల్ల = అసత్యములు; కాన్ = ఐనట్లు; తలచిన్ = ఎంచిన; భంగిన్ = విధముగ; మానస = మనస్సు అనెడి; పదార్థము = వస్తువు; చేన్ = చేత; నిఖిల = ఎల్ల; ఇంద్రియార్థముల్ = విషయములు; బలమునన్ = బలముగా; కట్టి = అణచి; తద్జ్ఞుడు = తత్వవేత్త; ప్రపంచము = తన కితరమైన లోకము; లేదు = లేదు; అనున్ = అనును; తత్ = ఆ యొక్క; మనంబున్ = మనస్సును; తారు = వారు; అలయక = విసుగు చెందకుండ; కట్టుడున్ = నిలిపిన యెడల; బుధుల్ = తత్వజ్ఞాని; కిన్ = కి; అవ్వల = అటుపిమ్మట; ఒండొక = వేరొక; భేదము = భేదము; ఉన్నదే = కలదా, లేదు.
భావము:- నిద్ర నుండి మేల్కొన్నవాడు, తాను స్వప్నంలో చూచినది అంతా అసత్యమని తలచినట్లు, తత్త్వవేత్త మనసనే పదార్ధంతో శబ్దస్పర్శాది సకల విషయాలను దృఢంగా నిరోధించి తన కన్నా భిన్నంగా ప్రపంచం లేదని చెబుతాడు. ఆ మనస్సును పండితులు విసుగు చెందకుండా అరికట్టడంతో అటుపై భేదభావం అన్నది ఉండదు.

తెభా-10.1-1474-ఆ.
సాంఖ్య యోగ నిగమ త్య తపో దమ
ములు మనోనిరోధమును గడపల
గాఁగ నుందు జలధి డపలగాఁ గల
దుల భంగి నళినయనలార!

టీక:- సాంఖ్య = ఆత్మానాత్మవివేకము {సాంఖ్యము - బ్రహ్మజ్ఞానమును ఎంచి లెక్కించి తరచి తరచి చూసెడి మార్గమున అభ్యసించుట, చూ. అనుయుక్తముల దస్త్రము}; యోగ = చతుర్విధయోగాభ్యాసములు {చతుర్విధయోగాభ్యాసములు - మంత్ర లయ హఠ రాజ యోగాభ్యాసములు}; నిగమ = వేదాధ్యయనవిధానము {వేదాధ్యయనము - చతుర్వేదములు షష్టాంగకములు ఆదులను అధ్యయనము చేయుట}; సత్య = సత్యశోధన {సత్యము - నిత్యము అనంతము అనితరము అవిభక్తము అవిభాజ్యము ఐనది సత్యము అదే పరబ్రహ్మము అని విచారించుట సత్యశోధన}; తపస్ = తపస్సు {తపస్సు - స్వధర్మమును నడపుట, కాయికవాచికమానసికములనెడి త్రివిధనిష్ఠ}; దమములు = ఇంద్రియనిగ్రహములు {దమము - జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను వశపరచుకొనుట}; మనోనిరోధమును = మనోనిగ్రహము {మనోనిరోధము - మనస్సును విషయాసక్తము కానీకుండ లోబరచుకొనుట}; కడపల = మేర, అంతముగా కలది; కాగన్ = అగునట్లు; ఉందున్ = ఉండెదను; జలధి = సముద్రము; కడపల = మేర, అంతముగా కలది; కాన్ = అగునట్లు; కల = ఉన్నట్టి; నదుల = నదుల; భంగిన్ = వలె; నళిననయనలారా = ఓ గోపికలు {నళిననయనలు - పద్మముల వంటి కన్నులు కలవారు, గోపికలు}.
భావము:- కలువ కన్నులుకల కన్నెలారా! నదులన్నీ కదలి పోయి పోయి కడకు కడలిని చేరినట్లు, ఆత్మా నాత్మా విచార రూప మైన సాంఖ్యము; యమ నియమాదిక మైన అష్టాంగయోగము; వేదము; సత్యము; తపము; ఇంద్రియనిగ్రహ మైన దమము; మనోనిగ్రహమూ పొలిమేరగా కలిగి ఉంటాను.

తెభా-10.1-1475-మ.
చెలువల్ దవ్వుల నున్న వల్లభులపైఁ జిత్తంబులం గూర్తు రు
త్కలికం జేరువవారికంటె నదియుంగా దెప్పుడున్ నన్ను మీ
లు చింతించుచు నుండఁగోరి యిటు దూస్థత్వముం బొందితిం
కం బోలదు నన్నుఁ బొందెదరు నిత్యధ్యానపారీణులై."

టీక:- చెలువల్ = స్త్రీలు {చెలువలు - చెలువ (అందము) వ (కలామె), అందగత్తె}; దవ్వులన్ = దూరముగా; ఉన్న = ఉన్నట్టి; వల్లభుల = ప్రియుల; పైన్ = మీద; చిత్తంబులన్ = మనసులతో; కూర్తురు = ప్రేమ కలవారై ఉందురు; ఉత్కలికన్ = తహతహలచేత; చేరువన్ = దగ్గరలో ఉన్న; వారి = వారి; కంటెన్ = కంటె; అదియున్ = అంతమాత్రమే; కాదు = కాదు; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; నన్నున్ = నన్ను; మీరలు = మీరు; చింతించుచున్ = తలచుకొనుచు; ఉండన్ = ఉండుటను; కోరి = అపేక్షించి; ఇటు = ఈ విధముగ; దూరస్థత్వము = దూరముగా ఉండుటను; పొందితిన్ = పొందినాను; తలకన్ = కలతపడు; పోలదు = తగినదికాదు; నన్నున్ = నన్ను; పొందెదరు = పొందగలరు; నిత్య = ఎడతెగని; ధ్యాన = ధ్యానము నందు; పారీణులు = నేర్పరులైనవారు; ఐ = అయ్యి.
భావము:- స్త్రీ లు సమీపంలో ఉన్నవారి కన్నా దూరంలో ఉన్న ప్రియుల పట్ల తహతహపాటుతో చిత్తము లందు అనురక్తి కలవారై ఉంటారు. అంతేకాక, మీరెల్లపుడు నన్నే స్మరిస్తూ ఉండాలి అని మీకు దూరంలో ఉన్నాను భయపడకండి. నిరంతర ధ్యానపారంగతలై మీరు నన్నే పొందగలరు.