పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/ఉగ్రసేనుని రాజుగ చేయుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1398-చ.
"ఘ! యయాతి శాపమున యాదవ వీరులకున్ నరేశ్వరా
మున నుండరాదు; నృపత్తమ! రాజవు గమ్ము భూమికిన్;
నినుఁ గొలువంగ నిర్జరులు నీ కరిఁబెట్టుదు రన్య రాజులం
నిగొను టెంత; రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్కతోన్."

టీక:- అనఘ = పాపము లేనివాడ; యయాతి = యయాతి యొక్క; శాపమునన్ = శాపమువలన; యాదవ = గోపక; వీరుల్ = శూరుల; కున్ = కి; నరేశ్వరాసనమునన్ = సింహాసనముమీద {నరేశ్వరాసనము - రాజుకి ఐన పీఠము, సింహాసనము}; ఉండరాదు = కూర్చొనకూడదు; నృప = రాజులలో; సత్తమ = శ్రేష్ఠుడా; రాజవు = రాజువిగా; కమ్ము = అగుము; భూమికిన్ = రాజ్యమునకు; నినున్ = నిన్ను; కొలువంగన్ = సేవించుటకు; నిర్జరులు = దేవతలు {నిర్జరులు - జర (ముసలితనము) లేనివారు, దేవతలు}; నీ = నీ; కున్ = కు; అరిబెట్టుదురు = కప్పమిత్తురు; అన్య = ఇతర; రాజులన్ = రాజులను; పనిగొనుట = ఆజ్ఞాపించుట; ఎంత = ఎంతపని, చిన్నవిషయమే; రమ్ము = రా; జనపాలన = రాజ్యమేలుట; శీలివి = చేసెడివాడవు; కమ్ము = అగుము; వేడ్క = సంతోషము; తోన్ = తోటి.
భావము:- “ఓ పుణ్యాత్ముడా! ఉగ్రసేన రాజేంద్రా! యయాతి శాపం వలన ఎంతటి వీరులైనా యాదవులు రాజ్యపీఠం అధిష్టించడానికి వీలుకాదు. కాబట్టి, ఈ రాజ్యానికి నీవే రాజుగా ఉండు. మేము నిన్ను సేవిస్తూ ఉంటాము. దేవతలు సైతం నీకు కప్పం చెల్లిస్తారు. ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞ శిరసావహిస్తా రని వేరుగా చెప్పనక్కర లేదు కదా. సంతోషంగా ప్రజలను పాలించడానికి సిద్ధంకా.”

తెభా-10.1-1399-వ.
అని పలికి.
టీక:- అని = అని; పలికి = చెప్పి.
భావము:- అలా పలికి. . .

తెభా-10.1-1400-క.
న్నించి రాజుఁ జేసెను
వెన్నుఁడు సత్యావధాను విశ్రుతదానున్
న్నుతమానున్ గదన
చ్ఛిన్నాహితసేను నుగ్రసేనున్ దీనున్.

టీక:- మన్నించి = గౌరవించి; రాజున్ = రాజుగా; చేసెన్ = చేసెను; వెన్నుడు = కృష్ణుడు {విష్ణువు (ప్ర) - వెన్నుడు (వి)}; సత్యా = సత్యము నందు; అవధానుడు = ఎచ్చరిక కలవాడు; విశ్రుత = ప్రసిద్ధమైన; దానున్ = ఈవి కలవానిని; సన్నుత = పొగడబడిన; మానున్ = నడవడిక కలవానిని; కదన = యుద్ధము నందు; ఛిన్న = ఛేదింపడిన; అహిత = శత్రు; సేనున్ = సేనలు కలవానిని; ఉగ్రసేనున్ = ఉగ్రసేనుని; దీనున్ = దీనావస్థలో ఉన్నవానిని.
భావము:- సత్యనిష్ఠ కలవాడూ, దాతగా పేరుపొందిన వాడూ, అభిమానవంతు డని పొగడ్త కాంచినవాడూ, సమరంలో శత్రుసైన్యాలను సంహరించే వాడూ, గర్వం లేని వాడూ అయిన ఉగ్రసేనుడిని వాసుదేవుడు గౌరవించి మధురానగరానికి రాజుగా చేసాడు.

తెభా-10.1-1401-వ.
తదనంతరంబ తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించు చున్న యదు, వృష్ణి, భోజ, మరు, దశార్హ, కకురాంధక ప్రముఖు లగు సకల జ్ఞాతి సంబంధులను రావించి చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారి వారి నివాసంబుల నుండ నియమించె; ని వ్విధంబున.
టీక:- తదనంతరంబ = అటు పిమ్మట; తొల్లి = ఇంతకు ముందు; కంస = కంసుని వలన; భీతులు = భయము చెందినవారు; ఐ = అయ్యి; విదేశంబులన్ = అన్య రాజ్యము లందు; కృశించి = అణగిపోయి; ఉన్న = ఉన్నట్టి; యదు = యాదవులు; వృష్ణి = వృష్ణికులు; భోజ = భోజులు; మరు = మరువులు; దశార్హ = దశార్హులు; కుకుర = కుకురులు; అంధక = అంధకులు; ప్రముఖులు = మొదలగువారు; అగు = ఐన; సకల = అయినట్టి; జ్ఞాతి = దాయాదులు; సంబంధులను = చుట్టములను; రావించి = రప్పించి; చిత్తంబులు = మనసులు; అలరన్ = సంతోషించునట్లు; విత్తంబులు = ధనములు; ఇచ్చి = ఇచ్చి; వారివారి = వారి యొక్క; నివాసంబులన్ = ఇండ్లలో; ఉండన్ = ఉండునట్లుగా; నియమించెన్ = ఆజ్ఞాపించెను; ఈ = ఈ; విధంబున = విధముగా.
భావము:- అటుపిమ్మట, శ్రీకృష్ణుడు ఇంతకు ముందు కంసుడి భయం వలన ఇతర దేశాలలో బాధలు పడుతున్న తన జ్ఞాతులూ చుట్టాలూ అయిన యదువులు, వృష్ణులు, భోజులు, మరువులు, దశార్హులు, కుకురులు, అంధకులు మొదలైన వారిని అందరినీ పిలిపించాడు. వారి మనసులు తృప్తిచెందేలా వారికి ధనాదికాలు బహూకరించి, వారి వారి గృహాలలో నివసించం డని నియోగించాడు. ఈ విధంగా. . .

తెభా-10.1-1402-క.
ధుసూదన సత్కరుణా
ధురాలోకన విముక్త మానస భయులై
ధురవచనములఁ దారును
థురానగరంబు ప్రజలు నిరి నరేంద్రా!

టీక:- మధుసూదన = కృష్ణుని యొక్క {మధుసూదన - మధు అనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; సత్ = మంచి; కరుణా = దయతో కూడిన; మధుర = మధురమైన; ఆలోకన = చూపులచేత; విముక్త = విడువబడిన; మానస = మనస్సు లందలి; భయులు = భయములు కలవారు; ఐ = అయ్యి; మధుర = తియ్యని; వచనములన్ = మాటలతో; తారును = వారు; మథురా = మథుర అనెడి; నగరంబు = పట్టణము; ప్రజలు = పౌరులు; మనిరి = బతికిరి; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుని వంటివాడు, రాజు}.
భావము:- మధుసూదనుడు కృష్ణుడి యొక్క మిక్కిలి కరుణాపూరితమైన మధురాతిమధురమైన కటాక్షవీక్షణాలతో మనసులోని భీతి తొలగినవారై తీయ తీయని సల్లాపాలతో వారూ మథురాపురి పురప్రజలు కలసి మెలసి జీవించారు.