పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/అక్రూరుడు బలకృష్ణుల గనుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-1201-మ.
నె నక్రూరుఁడు పద్మనేత్రులను రంద్గాత్రులన్ ధేను దో
వాటీగతులన్ నలంకృతుల నుద్యద్భాసులం బీత నీ
వీనోజ్జ్వలవాసులం గుసుమమాలాధారులన్ ధీరులన్
నితాకాములఁ గృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములన్.

టీక:- కనెన్ = చూసెను; అక్రూరుండు = అక్రూరుడు; పద్మనేత్రులను = బలరామ కృష్ణులను {పద్మనేత్రులు - కమలములవంటి కన్నులు కలవారు, బలరాముడు మరియు కృష్ణుడు}; రంగత్ = కాంతివంతమైన; గాత్రులన్ = దేహము కలవారిని; ధేను = ఆవులను; దోహన = పితికెడి; వాటీ = శాల లందు; గతులన్ = ఉన్నవారిని; అలంకృతులన్ = శృంగారించుకొన్నవారిని; ఉద్యత్ = వృద్ధిచెందిన; భాసులన్ = ప్రకాశవంతులను; పీత = పసుపు పచ్చని; నీల = నల్లని; నవీన = కొత్త; ఉజ్వల = మెరుస్తున్న; వాసులన్ = బట్టలు కట్టుకొన్న వారిని; కుసుమ = పూల; మాలా = దండలు; ధారులన్ = ధరించినవారిని; ధీరులన్ = ధైర్యము కలవారిని; వనితా = స్త్రీలకు; కాములన్ = కోరబడువారిని; కృష్ణ = కృష్ణుడు; రాములన్ = బలరాములను; జగత్ = లోక మంతటికి; వంద్య = కొనియాడదగిన; క్రమ = మర్యాదచేత; ఉద్దాములన్ = గొప్పవారిని.
భావము:- పద్మముల వంటి కన్నులు కలవారు, చక్కటి వన్నెగల మేనులు కలవారు, వెల్లివిరిసే ప్రకాశము కలవారు, పచ్చని నల్లని క్రొంగొత్త వలువలు ధరించినవారు, పూలదండలు దాల్చినవారు, ధైర్యవంతులు, యువతుల పాలిటి నవమన్మథాకారులు, సకల జనులు మెచ్చుకొనే మర్యాదస్తులు అయిన శ్రీకృష్ణ బలరాములు అక్రూరుడు చేరే సరికి చక్కగా అలంకరించుకొని పాలు పితికే శాలలలో ఉన్నారు. అక్కడ వారిని అక్రూరుడు చూసాడు.

తెభా-10.1-1202-క.
ని వారల పాదములకు
వియంబున మ్రొక్కె భక్తి వివశుం డగుచుం
నువునఁ బులకాంకురములు
మొయఁగ నానందబాష్పములు జడిఁ గురియన్.

టీక:- కని = చూసి; వారలన్ = వారి; పాదముల్ = కాళ్ళ; కున్ = కు; వినయంబునన్ = అణకువతో; మ్రొక్కి = నమస్కరించి; భక్తిన్ = భక్తితో; వివశుండు = పరవశత్వం పొందినవాడు; అగుచున్ = అగుచు; తనువు = దేహము; పులకాంకురములు = గగుర్పాటులు; మొనయగన్ = కలుగగా; ఆనంద = ఆనందముతో కలిగిన; బాష్పములు = కన్నీరు; జడిన్ = జలజల; కురియన్ = వర్షించగా.
భావము:- అలా చూసిన అక్రూరుడు భక్తిపరవశుడు అయ్యాడు. దేహం పులకించింది. ఆనందాశ్రువుల జాలువారుతుండగా, ఆ రామకృష్ణుల పాదాలకు వినయంతో నమస్కరించాడు.

తెభా-10.1-1203-వ.
తదనంతరంబ.
టీక:- తదనంతరంబ = అటు పిమ్మట.
భావము:- అలా అక్రూరుడు వారికి నమస్కరించగా. . .

తెభా-10.1-1204-క.
క్రూరులైన జనుల న
క్రగతిం గాచు భక్తత్సలుఁ డంత
న్నక్రూరుఁ గౌఁగిలించెను
క్రాంకిత హస్తతలముఁ జాచి నరేంద్రా.

టీక:- అక్రూరులు = క్రూరత్వము లేనివారు; ఐన = అయిన; జనులన్ = ప్రజలను; అవక్రగతిన్ = అడ్డులేని విధముగా; కాచు = కాపాడెడి; భక్తవత్సలుడు = కృష్ణుడు {భక్తవత్సలుడు - భక్తుల యెడ వాత్సల్యము కలవాడు, కృష్ణుడు}; అంతన్ = అప్పుడు; అక్రూరున్ = అక్రూరుని; కౌఁగిలించెను = ఆలింగనము చేసెను; చక్రా = చక్రము గుర్తులచేత; అంకిత = అలంకరింపబడిన; హస్తతలము = అరిచేతులను; చాచి = చాచి; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ప్రభువు, రాజు}.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! సాధుస్వభావులను చక్కగా పాలించే భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు చక్రం గుర్తులు గల తన చేతులు చాపి అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.

తెభా-10.1-1205-వ.
మఱియు నక్రూరుఁడు బలభద్రునికిం బ్రణతుం డయినఁ నతండు గౌఁగిలించి చెట్టపట్టుకొని కృష్ణసహితుండై గృహంబునకుం గొనిపోయి మేలడిగి గద్దియనిడి పాదప్రక్షాళనంబు చేసి మధుపర్కంబు సమర్పించి గోవునిచ్చి యాదరంబున రసవదన్నంబు పెట్టించి తాంబూల గంధ మాల్యంబు లొసంగె; నయ్యవసరంబున నందుం డుపవిష్టుండైన యక్రూరుని సత్కరించి; యిట్లనియె.
టీక:- మఱియున్ = అటుపిమ్మట; అక్రూరుడు = అక్రూరుడు; బలభద్రుని = బలరాముని; కిన్ = కి; ప్రణతుండు = నమస్కరించినవాడు; అయినన్ = కాగా; అతండు = అతను; కౌఁగిలించి = ఆలింగనము చేసి; చెట్ట = చెయ్యి; పట్టుకొని = పట్టుకొని; కృష్ణ = కృష్ణునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; గృహంబున్ = ఇంటి; కున్ = కి; కొనిపోయి = తీసుకెళ్ళి; మేలు = క్షేమసమాచారములు; అడిగి = అడిగి; గద్దియన్ = సింహాసనము; ఇడి = ఇచ్చి; పాద = కాళ్ళను; ప్రక్షాళనంబు = కడుగుట; చేసి = చేసి; మధుపర్కంబు = పెరుగుతో కలిపిన తేనె; సమర్పించి = ఇచ్చి; గోవున్ = ఆవును; ఇచ్చి = ఇచ్చి; ఆదరంబున = మన్ననతో; రసవత్ = మంచి రసములు కలిగిన; అన్నంబున్ = ఆహారమును; పెట్టించి = తినుటకు ఇప్పించి; తాంబూల = తాంబూలము; గంధ = మంచిగంధము; మాల్యంబులున్ = పూలదండలు; ఒసంగెన్ = ఇచ్చెను; ఆ = ఆ యొక్క; అయ్యవసరంబునన్ = సమయము నందు; నందుండు = నందుడు; ఉపవిష్టుండు = కూర్చున్నవాడు; ఐన = అయినట్టి; అక్రూరుని = అక్రూరుడిని; సత్కరించి = గౌరవించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అటుపిమ్మట, అక్రూరుడు బలరాముడికి ప్రణమిల్లాడు. అతడు అక్రూరుని కౌఁగిలించుకున్నాడు. అతడి చెయ్యి పట్టుకుని కృష్ణునితో కూడ తమ గృహానికి తీసుకువెళ్ళాడు. కుశలప్రశ్నలు అడిగాడు. అరుగు మీద కూర్చుండబెట్టి కాళ్ళు కడిగాడు. మధుపర్కం సమర్పించాడు. ఆవుని దానం చేసాడు. సాదరంగా కమ్మని భోజనం పెట్టించాడు. తాంబూలం, చందనం, పూలదండలు ఇచ్చాడు. ఆ సమయంలో నందుడు అక్కడ కూర్చున్న అక్రూరుడిని ఆదరించి ఇలా అన్నాడు.