పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/వరాహావతారంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-403-క.
వుడు నతనికి నతఁ డి
ట్లనియెన్ "భవదీయమైన యానతి యెట్ల
ట్లొరించెద నాకును నా
యులకు వసించి యుండఁ గు నెల వెందున్.

టీక:- అనవుడు = అనగా; అతనికిన్ = అతనికి; అతడు = అతడు; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = అనెను; భవదీయము = నీది అయిన; ఆనతి = ఆజ్ఞ; ఎట్ల = ఏలా అయితే; అట్ల = అలా; ఒనరించెదన్ = చేసెదను; నాకును = మరియు; నా = నా యొక్క; తనయుల = పుత్రుల; కున్ = కును; వసించి = నివసించి; ఉండన్ = ఉండుటకు; తగు = తగిన; నెలవు = తావు; ఎందున్ = ఎక్కడ.
భావము:- ఆ మాటలు విని స్వాయంభువుడు పద్మభవుడైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. తండ్రీ! నీ ఆజ్ఞ శిరసావహించి నీవు ఎలా చెప్తే అలా చేస్తాను. అయితే నాకూ నా కుమారులకూ, నివసించటానికి తగిన చోటు ఎక్కడా కనబడుట లేదు.

తెభా-3-404-తే.
రయ లేదు విధాత! యీ ఖిల జంతు
జాముల కెల్ల నాధారభూ మైన
రణి యిప్పుడు ఘనజలాంర్నిమగ్న
మైన కతమునఁ జోటు లేదంటి దండ్రి!

టీక:- అరయన్ = పరిశీలించి చూడగా; లేదు = లేదు; విధాత = బ్రహ్మదేవుడ {విధాత - విధిని నిర్ణయించువాడు, బ్రహ్మదేవుడు}; ఈ = ఈ; అఖిల = సమస్తమైన; జంతు = జీవ; జాతముల = సమూహముల; కున్ = కున్; ఎల్లన్ = అన్నిటికిని; ఆధార = ఆధారమై; భూతము = వెలసినది; ఐన = అయినట్టి; ధరణి = భూమి; ఇప్పుడు = ఇప్పుడు; ఘన = గొప్ప; జల = నీటి; అంతర్ = లోపల; నిమగ్నము = మునిగిపోయినది; ఐన = అయిన; కతమున = కారణముచేత; చోటు = స్థలము; లేదు = లేదు; అంటి = అంటిని; తండ్రి = తండ్రి.
భావము:- జగద్విధాతవు, బ్రహ్మదేవుడవు అయిన నా జనకుడా! ఈ సృష్టిలోని సమస్తమైన జంతుజాలానికి ఆధారభూతమైన భూమి ఇప్పుడు మహాసముద్ర మధ్యంలో మునిగి ఉంది. అందువల్ల మాకు ఉండటానికి చోటు కనిపించుట లేదు.

తెభా-3-405-క.
కావున భూమ్యుద్ధరణము
గావించు నుపాయ మిపుడు గైకొని నాకున్
దేవా నీ వెఱిఁగింపుము
నావుడుఁ బద్మజుఁడు దన మనంబునఁ దలఁచెన్.

టీక:- కావున = కనుక; భూమి = భూమిని; ఉద్ధరణము = ఉద్దరించుట; కావించున్ = చేసేటటువంటి; ఉపాయము = ఉపాయము; ఇపుడు = ఇప్పుడు; కైకొని = పూనుకొని; నాకున్ = నాకు; దేవా = బ్రహ్మదేవుడా; నీవు = నీవు; ఎఱింగింపుము = తెలుపుము; నావుడు = అనగా; పద్మజుడు = బ్రహ్మదేవుడు {పద్మజుడు - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; తన = తన యొక్క; మనంబునన్ = మనసులో; తలచెన్ = ఆలోచించెను.
భావము:- అందుచేత, ఓ బ్రహ్మ దేవా! ఇప్పుడు భూమిని ఉద్ధరించే ఉపాయం ఆలోచించి నన్ను అనుగ్రహించు” అని స్వాయంభువుడు పలుకగా బ్రహ్మదేవుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు.

తెభా-3-406-మ.
మధ్యంబున లీనమొందిన ధరాక్రంబు నే నేర్పునన్
నిలుపన్ వచ్చును బూర్వ మందు జగముల్ నిర్మించు నాఁ డాది న
ప్పులఁబుట్టించిన మీఁద నవ్వసుమతిం బుట్టించితిం బుత్ర య
ప్పులోఁగ్రుంకి రసాతలాంతరమునం బొందెం గదా పృథ్వియున్

టీక:- జల = నీటి; మధ్యంబునన్ = మధ్యలో; లీనము = మునుగుట; ఒందిన = పొందిన; ధరా = భూమి అను; చక్రంబున్ = గోళమును, చక్రమును; ఏ = ఏలాటి; నేర్పునన్ = నేర్పుతో; నిలుపన్ = నిలుపుటకు; వచ్చును = వీలగును; పూర్వము = పూర్వకాలము; అందున్ = లో; జగముల్ = లోకములు; నిర్మించు = నిర్మించే; నాడు = సమయమున; ఆదిన్ = మొదటగ; అప్పులన్ = నీటిని; పుట్టించిన = పుట్టించిన; మీదన్ = తరువాత; ఆ = ఆ; వసుమతిన్ = భూమిని; పుట్టించితిన్ = పుట్టించితిని; పుత్ర = కొడుకా; అప్పుల = నీటి; లోనన్ = లోపల; క్రుంకి = మునిగి; రసాతలమునన్ = పాతాళలోకమును; పొందెన్ = పొందెను; కదా = కదా; పృథివియున్ = భూగోళమును.
భావము:- “నీళ్ళ నడుమ మునిగిపోయి ఉన్న భూమండలాన్ని పైకి తీసుకురావటం ఎలా? లోకాలను సృష్టించేటప్పుడు ముందు నీళ్లను పుట్టించాను. తర్వాత భూమిని సృష్టించాను. ఇప్పుడు ఆ భూమి జల మధ్యంలో మునిగి పాతాళం లోనికి చేరింది. దానిని ఏవిధంగా యథాస్థితికి తీసుకురావాలి.

తెభా-3-407-సీ.
ఖిల జగత్కల్పనాటోపములకుఁ బా-
ల్పడిన నాచేత నెబ్బంగి నిపుడు
గిలి విశ్వంభరోద్ధరణంబుఁ గావింప-
గు నని సర్వభూతాంతరాత్ముఁ
బురుషోత్తముని నవపుండరీకాక్షు ల-
క్ష్మీపతిఁ దన మనస్థితునిఁ జేసి
లపోయుచున్నఁ బద్మజు నాసికా వివ-
మ్మున యజ్ఞవరాహమూర్తి

తెభా-3-407.1-తే.
ర్థి నంగుష్ఠమాత్ర దేహంబుతోడ
నన మంది వియత్తల స్థాయి యగుచు
క్షణము లోపల భూరి గప్రమాణ
య్యె నచ్చటి జనముల ద్భుతముగ.

టీక:- అఖిల = సమస్తమైన; జగత్ = లోకములను; కల్పన = సృష్టించు; ఆటోపములు = సన్నాహముల; కున్ = కి; పాల్పడిన = పూనుకొన్న; నాచేత = నాచేత; ఎబ్బంగిన్ = ఏవిధముగా; ఇపుడు = ఇప్పుడు; తగిలి = పూని; విశ్వంభర = భూమిని; ఉద్ధరణంబున్ = ఉద్ధరణము; కావింపన్ = చేయుట; అగును = అగును; అని = అని; సర్వభూతాంతరాత్మున్ = భగవంతుని {సర్వభూతాంతరాత్ముడు - సమస్తమైన జీవుల అంతరాత్మ అయినవాడు, విష్ణువు}; పురుషోత్తముని = భగవంతుని {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; నవపుండరీకాక్షు = భగవంతుని {నవపుండరీకాక్షుడు - కొత్త (తాజా) పుండరీకము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; లక్ష్మీపతిన్ = భగవంతుని {లక్ష్మీపతి - లక్ష్మీ యొక్క పతి, విష్ణువు}; తన = తన యొక్క; మనస్ = మనసున; స్థితునిన్ = ఉన్నవానిగా; చేసి = చేసి; తలపోయుచున్ = ఆలోచించుతూ; ఉన్న = ఉన్నట్టి; పద్మజున్ = బ్రహ్మదేవుని; నాసికా = ముక్కు యొక్క; వివరమ్మునన్ = రంధ్రమునుండి; యజ్ఞవరాహమూర్తి = విష్ణుమూర్తి {యజ్ఞవరాహమూర్తి - యజ్ఞమే తానైన వరాహ స్వరూపము కలవాడు, విష్ణువు}; అర్థిన్ = కోరి; అంగుష్ట = బొటకనవేలు; మాత్ర = అంత; దేహంబున్ = శరీరము; తోడన్ = తో; జననము = అవతారము; అంది = ధరించి; వియత్తల = ఆకాశమున; స్థాయి = ఉన్నవాడు; అగుచున్ = అవుతూ; క్షణము = క్షణము; లోపలన్ = లోపలనే; భూరి = అత్యంతపెద్దది ఐన; గజ = ఏనుగు; ప్రమాణము = అంత సైజు; అయ్యెన్ = ఆయెను; అచటి = అక్కడి; జనులున్ = వారి; కున్ = కి; అద్భుతము = ఆశ్చర్యకరము; కన్ = అగునట్లు;
భావము:- లోకాలన్నిటినీ సృష్టించాలనే ఆతృతతో సన్నాహాలకు ఎంతో ప్రయాసపడుతున్నాను. కాని ఈ భూమిని ఉద్ధరించడం ఎలా? నాచేత ఈ పని ఎలా జరుగుతుంది?” అని బ్రహ్మ తన మనస్సులో తలపోసి సకల భూతాలలోనూ అంతర్యామిగా ఉండే సర్వాంతర్యామీ, పురుషోత్తముడూ, పద్మాక్షుడు, లక్ష్మీదేవి భర్తా అయిన శ్రీమహావిష్ణువును తలచాడు. వెంటనే ఆ పద్మభవుడు అయిన బ్రహ్మ ముక్కు నుండి యజ్ఞవరాహమూర్తి బొటనవ్రేలంత పరిమాణంతో జన్మించి, ఆకాశానికి ఎగిరి, ఒక్క క్షణంలోనే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యేలా పెద్ద ఏనుగంత అయ్యాడు.

తెభా-3-408-సీ.
అంతఁ బ్రజాసర్గ మందు నియుక్తులై-
ట్టి మరీచ్యాదు లైన మునులు
నుకుమారకులు నమ్మను సహితంబుగ-
జ్ఞవరాహంబు ర్థిఁ జూచి
"యిట్టి యాశ్చర్య మెట్లెందేని గలదె నా-
సారంధ్రనిర్గత స్తబ్ధరోమ
తోకంబు మనము విలోకింప నంగుష్ఠ-
మాత్రమై యీ క్షణమాత్రలోన

తెభా-3-408.1-తే.
హిమ దీపింప దంతి ప్రమాణమున మ
హోన్నతంబైన గండశైలోపమంబు
య్యె"ననుచు వితర్కించి బ్జభవుఁడు
ర్ష మిగులొత్త నిట్లని పుడు దలఁచె.

టీక:- అంతన్ = అంతట; ప్రజా = ప్రజలను; సర్గము = సృష్టించుట; అందున్ = అందు; నియుక్తులు = నియమింపబడినవారు; ఐనట్టి = అయినట్టి; మరీచి = మరీచి; ఆదులు = మొదలగువారు; ఐన = అయినట్టి; మునులున్ = మునులును; మనుకుమారులున్ = మనువు యొక్క కుమారులును; ఆ = ఆ; మను = మనువుతో; సహితంబుగన్ = కూడినవారై; యజ్ఞవరాహంబున్ = యజ్ఞవరాహమూర్తిని; అర్థిన్ = కోరి; చూచి = చూసి; ఇట్టి = ఇటువంటి; ఆశ్చర్యము = అద్భుతము; ఎట్లు = ఏవిధముగా; ఎందున్ = ఎక్కడ; ఏని = అయినా; కలదె = ఉందా ఏమి; నాసా = ముక్కు యొక్క; రంధ్ర = కన్నము నుండి; నిర్గత = వెలువడిన; స్తబ్ధరోమము = పంది, వరాహము {స్తబ్ధ రోమము - వ్యు. స్తబ్ధాని రోమాణి - అవ్య., బ.వ్రీ,, నిక్కబొడిచిన రోమములు కలది, పంది.}; తోకము = పిల్ల; మనమున్ = మనము; విలోకింపన్ = చూస్తుండగా; అంగుష్ట = బొటకనవేలు; మాత్రము = అంత మాత్రమే; ఐ = అయిన; ఈ = ఈ; క్షణ = క్షణము; మాత్ర = మాత్రపు సమయము; లోనన్ = లోపల; మహిమ = మహిమ; దీపింపన్ = ప్రకాశమగునట్లు; దంతి = ఏనుగు; ప్రమాణమునన్ = అంత పరిమాణమున; మహా = మిక్కిలి; ఉన్నతంబు = ఎత్తైనది; ఐనన్ = అయిన; గండ = పెద్ద; శైల = పర్వతమును; ఉపమంబున్ = పోలునది; అయ్యెన్ = ఆయెను; అనుచు = అని; వితర్కించిరి = మిక్కిలి తర్కించిరి; అబ్జభవుడు = బ్రహ్మదేవుడు; హర్షము = సంతోషము; ఇగురొత్తన్ = చిగురించగా; ఇట్లు = ఈవిధముగా; అని = అని; అపుడు = అప్పుడు; తలంచెన్ = తలచెను.
భావము:- అప్పుడు, ప్రజల్ని సృష్టించడంకోసం నియమించబడిన మరీచి మొదలైన మునులూ, మనువూ, మనువు కుమారులూ, యజ్ఞవరాహాన్ని చూశారు. “ఎంత ఆశ్చర్యం ముక్కురంధ్రంనుండి, వెలువడ్డ వేలంత బాలవరాహం క్షణంలోనే, పెద్ద ఏనుగంత అయి మహాపర్వతం అంత అయింది. ఇలాంటి విచిత్రం ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా.” అని తమలో తాము తర్కించుకున్నారు. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషంతో ఇలా అనుకున్నాడు.

తెభా-3-409-క.
"నా నమునఁ గల దుఃఖవి
రాము గావించుకొఱకు రాజీవాక్షుం
డీమేర యజ్ఞపోత్రి
శ్రీమూర్తి వహించె నిది విచిత్రము దలఁపన్."

టీక:- నా = నా యొక్క; మనంబునన్ = మనసులో; కల = కలిగిన; దుఃఖ = దుఖమును; విరామము = పోవునట్లు; కావించున్ = చేయుట; కొఱకున్ = కోసము; రాజీవాక్షుండు = విష్ణుమూర్తి {రాజీవాక్షుడు - రాజీవముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; ఈ = ఈ; మేర = పరిమాణము కల; యజ్ఞ = యాగపు; పోత్రి = వరాహము యొక్క; శ్రీ = శుభకరమైన; మూర్తిన్ = స్వరూపమును; వహించెన్ = ధరించెను; ఇది = ఇది; విచిత్రము = విచిత్రమైనది; తలపన్ = ఆలోచించుటకైనా.
భావము:- “నా మనస్సులోగల, దుఃఖభారాన్ని, దూరం చేయటంకోసం, దేవాధిదేవుడైన రాజీవముల వంటి కన్నులు గల శ్రీహరి, ఈ విధంగా యజ్ఞవరాహరూపం ధరించాడు. ఎంతో వింత అయిన విషయం ఇది.”

తెభా-3-410-వ.
అని వితర్కించు సమయంబున సూకరాకారుండైన భగవంతుండు.
టీక:- అని = అని; వితర్కించు = అనుకొనుచున్న; సమయంబునన్ = సమయములో; సూకరా = వరాహము యొక్క; ఆకారుండు = స్వరూపము కలవాడు; ఐన = అయిన; భగవంతుడు = విష్ణుమూర్తి.
భావము:- బ్రహ్మదేవుడు ఈవిధంగా భావిస్తూ వుండగా, యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు.

తెభా-3-411-తే.
ప్రళయజీమూతసంఘాత యద భూరి
ర్జనాటోపభిన్న దిగ్ఘన గభీర
రా మడరింప నపుడు రాజీభవుఁడు
మునులు నానందమును బొంది ఘచరిత!

టీక:- ప్రళయ = ప్రళయకాల మందలి; జీమూత = మేఘముల; సంఘాత = ఘర్షణ వలన పుట్టిన; భయద = భయంకరమైన; భూరి = అత్యంత బిగ్గరగా ఉండు; గర్జనా = గర్ఝనల; ఆటోప = సన్నాహములను; భిన్న = ఓడిస్తున్న; దిక్ = దిక్కులు దద్దరిల్లు; ఘన = పెద్ద; గభీర = గంభీర; రావము = ధ్వని; అడరింపన్ = చేయగా; అపుడు = అప్పుడు; రాజీవభవుడు = బ్రహ్మదేవుడు {రాజీవభవుడు - రాజీవము (ఎఱ్ఱకలువ) యందు భవ (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు}; మునులున్ = మునులును; ఆనందమును = సంతోషమును; పొందిరి = పొందిరి; అనఘచరిత = పుణ్యవర్తనుడా.
భావము:- వరహావతారుడు అయిన హరి ప్రళయకాలంలోని మేఘాల సమూహాలు భయంకరంగా గర్జించినట్లు విజృంభించి దిక్కులు పిక్కటిల్లేలా గంభీరంగా ఘుర్ ఘుర్ అని గర్జించాడు (వరాహం అరుపు ఘుర్). నాయనా పుణ్యవర్తనుడవైన విదురా! ఆ ఘన గంభీర ధ్వని విని బ్రహ్మదేవుడూ, మునులూ అపారమైన ఆనందాన్ని పొందారు.

తెభా-3-412-వ.
అంత మాయామయ వరాహ ఘుర్ఘురారావంబు బ్రహ్మాండ కోటరపరి స్ఫోటనంబుఁ గావింప విని జనస్తప సత్యలోక నివాసు లయిన మునులు ఋగ్యజుస్సామ మంత్రంబుల వినుతించిరి; యజ్ఞవరాహ రూపధరుండ యిన సర్వేశ్వరుండు సత్పురుషపాలనదయాపరుఁడు గావున దిగ్గజేంద్ర లీలావిలోలుండై.
టీక:- అంత = అంతట; మాయా = మాయతో; మయ = కూడిన; వరాహ = వరాహము యొక్క; ఘుర్ఘురా = ఘుర్ ఘుర్ అను; రావంబున్ = ధ్వని; బ్రహ్మాండ = బ్రహ్మాండము యైక్క; కోటర = సరిహద్దులు; పరిస్ఫోటనము = చీల్చునట్లు; కావింపన్ = చేయగా; విని = విని; జనః = జనలోకము; తప = తపోలోకము; సత్య = సత్యలోకము లందు; నివాసులు = వసించువారు; అయిన = అయిన; మునులున్ = మునులును; ఋక్ = ఋగ్వేద; యజుర్ = యజుర్వేద; సామ = సామవేదముల; మంత్రంబులన్ = మంత్రములతో; వినుతించిరి = కీర్తించిరి; యజ్ఞవరాహ = యజ్ఞవరాహము; రూప = రూపమును; ధరుండున్ = ధరించినవాడు; అయిన = అయిన; సర్వేశ్వరుండు = భగవంతుడు {సర్వేశ్వరుడు - సర్వమునకును ఈశ్వరుడు, విష్ణువు}; సత్ = మంచి; పురుష = మానవులను; పాలన = పాలించు; దయా = దయ యందు; పరుడు = నిమగ్నుడు; కావున = కనుక; దిగ్గజేంద్ర = దిగ్గజముల; లీలా = వలె; విలోలుండు = విలసిల్లువాడు; ఐ = అయి.
భావము:- అప్పుడు, ఆ కపట వరాహమూర్తి కావించిన ఘుర్ఝురావానికి, బ్రహ్మాండభాండం అంతా దధ్దరిల్లిపోయింది. ఆ శబ్దం విని జనలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో ఉండే మునులు ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలలోని మంత్రాలతో, ఆ యజ్ఞవరాహమూర్తిని కీర్తించారు. యజ్ఞవరాహరూపాన్ని ధరించిన పరాత్పరుడు, సజ్జనులను చక్కగా పరిపాలించే, పరమ దయామయుడు కాబట్టి ఒక మహా దిగ్గజంలా క్రీడించాలని వేడుకపడ్డాడు.