Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/దేవహూతి నిర్యాంణంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-1043-వ.
అట్లు కపిలుం డేఁగినఁ బిదప దేవహూతియుం బుత్రుండు సెప్పిన యోగమార్గంబున విజ్ఞానంబు గలిగి యుండియుం బెనిమిటి యైన కర్దమునిం దనయుం డైన కపిలునిం బాసి నష్టవత్స యగు గోవు చందంబునం దల్లడిల్లుచుఁ గపిలమహామునిం దలంచుచుం గర్దమ తపస్సామర్థ్యంబున నైనయట్టి.
టీక:- అట్లు = ఆ విధముగ; కపిలుండు = కపిలుడు; ఏగిన = వెళ్ళిన; పిదప = తరువాత; దేవహూతియున్ = దేవహూతికూడ; పుత్రుండు = పుత్రుడు; చెప్పిన = చెప్పిన; యోగమార్గంబునన్ = యోగమార్గమున; విజ్ఞానంబున్ = విజ్ఞానము; కలిగి = కలిగి; ఉండియున్ = ఉండియును; పెనిమిటి = భర్త; ఐన = అయిన; కర్దమునిన్ = కర్దమునికిని; తనయుండు = పుత్రుడు; ఐన = అయిన; కపిలునిన్ = కపిలునికిని; పాసి = దూరమై; నష్ట = పోయిన; వత్స = దూడ కలిగినది; అగు = అయిన; గోవున్ = ఆవు; చందంబునన్ = వలె; తల్లడిల్లుచు = తల్లడిల్లుపోవుతూ; కపిల = కపిలుడు అను; మహా = గొప్ప; మునిన్ = మునిని; తలంచుచున్ = గుర్తుచేసుకొంటూ; కర్దమ = కర్దముని; తపస్ = తపస్సు యొక్క; సామర్థ్యంబునన్ = శక్తివలన; ఐన = అయిన; అట్టి = అటువంటి.
భావము:- ఆవిధంగా కపిలుడు వెళ్ళిపోయిన తరువాత దేవహూతి తన పుత్రుని ఉపదేశం వల్ల జ్ఞానోదయం కలిగినదైనా భర్త అయిన కర్దముని, కుమారుడైన కపిలుని ఎడబాసి దూడను పోగొట్టుకొన్న గోవు వలె తల్లడిల్లుతూ కపిల మహామునిని తలచుకొంటూ, కర్దముని తపశ్శక్తితో కల్పించబడినట్టి (ఉద్యానవనాన్ని చూసింది)

తెభా-3-1044-ఉ.
మానిత సౌరభప్రసవ మంజుల పక్వ ఫలప్రవాళ భా
రాత చూతపోత విటపాగ్ర నికేతన రాజకీర స
మ్మాని సుఖానులాప పరిమండిత కర్దమ తాపసాశ్రమో
ద్యా వనప్రదేశ కమలాకర తీర నికుంజ పుంజముల్.

టీక:- మానిత = మంచి; సౌరభ = సువాసనలు కల; ప్రసవ = కలిగిస్తున్న; మంజుల = పొదరిళ్ళతోను; పక్వ = పండిన; ఫల = పండ్లయొక్క; ప్రవాళ = చిగుర్లుయొక్క; భారా = బరువుతో; నత = వంగిన; చూత = మామిడి; పోత = లేత; విటప = చెట్ల; అగ్ర = చిగుర్లు యందు; నికేతన = వసించుతున్న; రాజకీర = రామచిలుకలచే; సమ్మాని = చక్కని; సుఖ = సుఖకరమగ; అనులాప = పలుకులచే; పరిమండిత = చక్కగా అలంకరింప బడిన; కర్దమ = కర్దముడు అను; తాపస = తపసి యొక్క; ఆశ్రమ = ఆశ్రమము అందలి; ఉద్యానవన = ఉద్యానవనము యొక్క; ప్రదేశ = ప్రదేశ మందలి; కమలాకర = సరస్సుల {కమ లాకరము - కమలమలకు ఆకరము (వాసము), సరస్సు}; తీర = తీరమందలి; నికుంజ = పొదరిండ్ల; పుంజముల్ = సమూహములను.
భావము:- (ఆ ఉద్యానవనంలో) పరిమళాలు వెదజల్లే పూలగుత్తులతో, పండిన పండ్లతో, చెంగావి చిగుళ్ళతో, వంగిన కొమ్మలతో ఉన్న గున్నమామిళ్ళు కనువిందుగా ఉన్నాయి. ఆ మామిడి చెట్ల చిటారు కొమ్మలపై కూర్చున్న రామచిలుకలు వీనుల విందుగా పలుకుతున్నాయి. అక్కడి తామరకొలను చుట్టూ దట్టంగా అల్లుకున్న పొదరిండ్లు గోచరించాయి.

తెభా-3-1045-వ.
వెండియు.
టీక:- వెండియున్ = మరియును.
భావము:- ఇంకా...

తెభా-3-1046-సీ.
అంచిత స్ఫటికమస్తంభ దీప్తిచేఁ-
గొమరారు మరకతకుడ్యములను
జ్జాతివజ్రాలజ్జాలరుచులచే-
భాసిల్లు నీలసోపానములును
దీపించు చంద్రకాంతోలవేదుల-
విద్రుమగేహళీవిలసితముల
హాటకరత్నకవాటశోభితముల-
లరిన సౌధశాలాంగణముల

తెభా-3-1046.1-తే.
ర పయఃపేనపటలపాండుర కరీంద్ర
దంతనిర్మిత ఖట్వాంగవళపట్ట
చిత శయ్యాళులును జతురంతయాన
నకపీఠాది వస్తుసంముల నెల్ల.

టీక:- అంచిత = అందమైన; స్పటిక = స్పటికములుతో; మయ = నిండిన; స్తంభ = స్తంభముల; దీప్తిన్ = ప్రకాశముచే; కొమరారు = మనోజ్ఞమగుతున్న; మరకత = పచ్చల; కుడ్యములను = గోడలను; సత్ = మంచి; జాతి = జాతికిచెందిన; వజ్రాల = వజ్రముల; సజ్జాల = సజ్జలు అను అలంకారముల; రుచుల్ = కాంతుల; చేన్ = చేత; భాసిల్లు = ప్రకాశించుతున్న; నీల = నీలముల; సోపానములును = మెట్లును; దీపించు = ప్రకాశించెడి; చంద్రకాంత = చంద్రకాంత చలువరాళ్ళ; ఉపలవేదులన్ = అరుగులును; విద్రుమ = పగడాల; గేహళీ = గడపలతో; విలసితముల = విలాసముల; హాటక = బంగారపు; రత్న = రత్నాల; కవాట = తలుపులచే; శోభితములన్ = సొగసులతోను; అలరిన = చక్కగా ఉన్న; సౌధ = మేడలు; శాల = చావళ్ళు; అంగణముల = ముంగిళ్ళ;
వర = శ్రేష్ఠమైన; పయస్ = నీటి; ఫేనపటల = నురగల వలె; పాండుర = తెల్లని; కరి = ఏనుగులలో; ఇంద్ర = శ్రేష్ఠమైన వాని; దంత = దంతములతో; నిర్మిత = చేసిన; ఖట్వ = మంచము; అంగ = కోళ్ళు; ధవళ = తెల్లని; పట్ట = బట్టలతో; రచిత = ఏర్పరచిన; శయ్య = పాన్పుల; ఆళులును = వరుసలును; చతురంతయాన = పల్లకీలు, {చతురంతయానము - పల్లకీ, చతుర్దోలము (తెలుగు పర్యాయపద నిఘంటువు, జిఎన్ రెడ్డి), నలుగురు మోయు ఉయ్యాలవంటి వాహనము (ఆంధ్ర శబ్దరత్నాకరము)}; కనక = బంగారపు; పీఠ = పీటలు; ఆది = మొదలైన; వస్తు = వస్తు; సంఘమున్ = సముదాయము; ఎల్లన్ = అంతటిని.
భావము:- ఆ ఉద్యావనం ప్రక్కనే స్ఫటిక స్తంభాలతో, పచ్చలు చెక్కిన గోడలతో, మేలుజాతి వజ్రాల గవాక్షాలతో, నిగనిగలాడే నీలకాంత మణి సోపానాలతో, పాలరాతి అరుగులతో, పగడాల గడపలతో, బంగారు తలుపులతో అలరారే సౌధం ఉంది. అందులో పాలనురుగు వంటి ఏనుగు దంతాలతో చేయబడిన పట్టెమంచాలపై తెల్లని పట్టుపరుపులు పరచి ఉన్నాయి. ఒక ప్రక్క ముత్ర్యాల పల్లకీలు, మరొక ప్రక్క బంగారు పీఠాలు పడి ఉన్నాయి. అటువంటి వైభవోపేతమైన వస్తు సంపదనంతా (దేవహూతి పరిత్యజించింది).

తెభా-3-1047-వ.
మఱియు; వికచకమల కుముద సౌగంధిక బంధుర గంధానుబంధి గంధవహ శోభితంబును; యరవిందనిష్యంద కందళిత మరందరస పాన మదవదిందిందిర సందోహ ఝంకార సంకులంబునునై చెలువారు బావులు గలిగి; పురందరసుందరీ వందితం బైన కర్దమాశ్రమంబుఁ బరిత్యజించి కుటిలంబు లైన కుంతలంబులు జటిలంబులుగా ధరియించి సరస్వతీ బిందుసరోవరంబులం ద్రిషవణస్నానంబు గావించుచు; నుగ్ర తపోభారంబునం గృశీభూత శరీర యై; నిజ కుమారుండును బ్రసన్న వదనుండును గపిలనామధేయుండును నగు నారాయణుని సమస్త న్యస్తచింతలచే ధ్యానంబు సేయుచుఁ; బ్రవాహరూపంబైన భక్తి యోగంబునను నధికవైరాగ్యంబునను యుక్తానుష్ఠానజాతంబై బ్రహ్మత్వాపాదకం బగు జ్ఞానంబును విశుద్ధమనంబును గలిగి.
టీక:- మఱియున్ = ఇంకను; వికచ = వికసించిన; కమల = తామరలు; కుముద = కలువలు యొక్క; సౌగంధిక = సౌగంధిక పుష్పముల; బంధుర = నిండైన; గంధా = సువాసనలు; అనుబంధి = కలసిన; గంధవహ = గాలిచే; శోభితమున్ = ప్రకాశ మొందినదియును; అరవింద = పద్మముల నుండి; నిష్యంద = చిందుటచే; కందళిత = అంకురించిన; మరందరస = మకరంద రసమును; పాన = క్రోలుటచే; మదవత్ = మదించిన; ఇందిందిర = తుమ్మెదల{ఇందిందిరము - వ్యు. పద్మసంపదలతో కూడినది (విద్యార్థి కల్పతరువు)}; సందోహ = సమూహము యొక్క; ఝంకార = ఝం అను శబ్దము; సంకులంబునున్ = వ్యాపించినది; ఐ = అయ్యి; చెలువారు = సొగసు పొందిన; బావులు = నూతులు; కలిగి = కలిగి; పురందరసుందరీ = శచీదేవిచే {పురందరసుందరి - పురందరుడు (ఇంద్రుడు) యొక్క సుందరి (భార్య), శచీదేవి, తత్పురుషసమాసము}; వందితంబు = స్తుతింపబడినది; ఐన = అయిన; కర్దమ = కర్దముని; ఆశ్రమంబున్ = ఆశ్రమమును; పరిత్యజించి = వదలి; కుటిలంబులు = వంపు తిరిగినవి, లేదా ఉంగరాలు తిరిగినవి; ఐన = అయిన; కుంతలంబులు = కేశములు; జటిలంబులుగా = జటలు చుట్టబడినవిగా; ధరియించి = ధరించి; సరస్వతీ = సరస్వతీనదియును; బిందు = బిందు అనెడి; సరోవరంబులన్ = సరోవరము లలో; త్రిషవణ = మూడు పూటల; స్నానంబున్ = స్నానములు; కావించుచున్ = చేస్తూ; ఉగ్ర = భయంకరమైన; తపస్ = తపస్సు యొక్క; భారంబునన్ = భారము వలన; కృశీభూత = చిక్కిపోయిన; శరీర = దేహము గలది; ఐ = అయ్యి; నిజ = తన; కుమారుండును = పుత్రుడును; ప్రసన్న = ప్రసన్నమైన; వదనుండును = మోము కలవాడును; కపిల = కపిలుడు అను; నామధేయుండును = పేరు కలవాడును; అగు = అయిన; నారాయణుని = భగవంతుని {నారాయణుడు - నారములు (నీరు) అందు వసించువాడు, విష్ణువు}; సమస్త = సమస్తమందు; న్యస్త = ఉంచబడిన; చింతల్ = ఆలోచనల; చేన్ = చేత; ధ్యానంబున్ = ధ్యానమును; చేయుచున్ = చేస్తూ; ప్రవాహ = ప్రవాహ; రూపంబున్ = రూపము; ఐన = అయిన; భక్తియోగంబుననున్ = భక్తియోగము చేతను; అధిక = మిక్కిలి; వైరాగ్యంబుననున్ = వైరాగ్యముతోను; యుక్తా = యుక్తమైన; అనుష్ఠాన = అనుష్ఠానముల, దీక్షల; జాతంబున్ = సమూహము కలది; ఐ = అయ్యి; బ్రహ్మత్వ = బ్రహ్మత్వమును; ఆపాదకంబున్ = ప్రసాదించునది, కలిగించునది; అగు = అయిన; జ్ఞానంబుననున్ = జ్ఞానముతోను; విశుద్ధ = పరిశుద్ధమైన; మనంబునున్ = మనస్సును; కలిగి = కలిగి ఉండి.
భావము:- ఇంకా విచ్చిన తామరలు, కలువలు, సౌగంధిక పుష్పాలు సుగంధాలను వెదజల్లుతున్నాయి. పూచిన పద్మాలలో పొంగిపొరలే తియ్యని పూదేనెలు త్రాగి గండుతుమ్మెదలు ఝంకారాలు చేస్తున్నాయి. అటువంటి అందాలతో నిండి శచీదేవికి ఆనందాన్ని అందించే కర్దముని ఆశ్రమాన్ని వదలిపెట్టి దేవహూతి తపోదీక్ష వహించింది. ఆమె నొక్కుల చిక్కని శిరోజాలు జడలు గట్టాయి. సరస్వతీ నదిలోని బిందు సరస్సులో మూడుపూటలూ మంత్రపూర్వకం గా స్నానం చేయసాగింది. తపోనియమాల వల్ల ఆమె శరీరం కృశించిపోయింది. దేవహూతి కపిలుడనే పేరుతో తన కుమారుడుగా ప్రసన్నముఖంతో జన్మించిన నారాయణుని ఏకాగ్రచిత్తంతో అనేకవిధాలుగా ధ్యానం చేస్తూ, అఖండమైన ప్రవాహరూపాన్ని ధరించిన భక్తియోగంతో ఎదలో వైరాగ్యం కుదురుకొనగా పరిశుద్ధ మనస్కురాలై యోగ్యమైన అనుష్ఠానంతో బ్రహ్మజ్ఞానాన్ని పొంది...

తెభా-3-1048-సీ.
నయంబు నాత్మనాకుఁడును విశ్వతో-
ముఖుఁ డనంతుఁడు పరముఁడు నజుండు
తురుండు నిజపరిజ్ఞానదీపాంకుర-
హిమ నిరస్త సస్త భూరి
మాయాంధకారుఁ డమేయుఁ డీశ్వరుఁ డగు-
నా పరబ్రహ్మంబు నం దవిరత
ద్ధతత్త్వజ్ఞానరతచే నిర్ముక్త-
జీవభావమున విశిష్టయోగ<
/p>

తెభా-3-1048.1-తే.
వ్యసంప్రాప్త నిర్మల బ్రహ్మభావ
మును గలిగి సమాధిచే నెమిఁ దనరు
పునరావృత్త మగు త్రిగుప్రధాన
త్త్వముల నొప్పి సంతతోదార నియతి.

టీక:- అనయంబున్ = ఎల్లప్పుడును; ఆత్మ = తన; నాయకుడును = నాయకుడును; విశ్వతోముఖుడు = విశ్వతోముఖుడు {విశ్వతోముఖుడు - విశ్వము అంతటికిని ముఖ్యుడు}; అనంతుడు = అంతములేనివాడు; పరముడు = సర్వమునకు అతీతమైనవాడు; అజుండు = పుట్టుకలేనివాడు; చతురుండు = చతురమైన జ్ఞానము కలవాడు; నిజ = తన; పరిజ్ఞాన = విజ్ఞానము అనెడి; దీపాంకురము = దీపకాంతి {దీపాంకురము - దీపమునుండి అంకురించునది, దీపపుకాంతి, దీపకళిక}; అంకుర = వత్తి యొక్క; మహిమన్ = మహిమముచే; నిరస్త = తొలగింపబడిన; సమస్త = సమస్తమైన; భూరి = అత్యధికమైన; మాయా = మాయ అనెడి; అంధకారుడు = అంధకారము కలవాడు; అమేయుడు = కొలతలకు అతీతుడు; ఈశ్వరుడు = ప్రభువు; అగు = అయిన; ఆ = ఆ; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మము; అందు = లో; అవిరత = ఎడతెగని; బద్ధ = లగ్నముచేయబడిన; తత్త్వజ్ఞాన = తత్త్వజ్ఞానమునందలి; పరత = నిష్ఠ; చేన్ = చేత; నిర్ముక్త = చక్కగ తొలగిన; జీవ = జీవుడు అను; భావమున = భావమున; విశిష్ట = శ్రేష్ఠమైన; యోగ = యోగముచే;
భవ్య = శుభకరముగ; సంప్రాప్త = లభించిన; నిర్మల = స్వచ్ఛమైన; బ్రహ్మ = బ్రహ్మముగా; భావములను = భావములను; కలిగి = కలిగి; సమాధి = యోగసమాధి; చేన్ = వలన; ఎలమిన్ = వికాసముతో; తనరున్ = అతిశయించును; అపునరావృత్తము = మరలతిరిగిరానిది; అగు = అయిన; త్రిగుణ = త్రిగుణ; ప్రధాన = ప్రధానమైన; తత్త్వములన్ = తత్త్వములచే; ఒప్పి = ఒప్పినవాడై; సంతత = నిత్యమైన; ఉదార = పెద్ద; నియతిన్ = నియమములతో.
భావము:- దేవహూతి అనుక్షణమూ ఆత్మలకు అధీశ్వరుడూ, సర్వాంతర్యామీ, అనంతుడూ, అద్వితీయుడూ, అజుడూ, లీలావినోదీ, విజ్ఞానదీపకాంతుల మహిమతో అజ్ఞాంధకారాన్ని పారద్రోలేవాడూ, అమేయుడూ, అఖిలేశ్వరుడూ అయిన పరబ్రహ్మమందు మనస్సు లగ్నం చేసింది. నిరంతరమైన నిష్ఠతో ఆమెకు నిర్మలమైన తత్త్వజ్ఞానం అలవడింది. జీవభావం తొలగింది. దైవభావం కలిగింది. పరబ్రహ్మతో సమాధి సిద్ధించింది. పునరావృత్తి లేనట్టి ప్రవృత్తి ఏర్పడింది.

తెభా-3-1049-తే.
లనఁ దోఁచిన వస్తుసంముల మేలు
కొని కనుంగొనలేని మనుజులపోల్కిఁ
బొలతి దనయాత్మ మఱచి యిమ్ముల నధూమ
మైన పావకుగతి నుండె నంతలోన.

టీక:- కలనన్ = కలలో; తోచిన = కనిపించిన; వస్తు = వస్తువుల; సంఘములన్ = సముదాయములను; మేలుకొని = మెలుకువ వచ్చిన తరువాత; కనుంగొన = చూడ; లేని = లేని; మనుజుల = మానవుల; పోల్కి = వలె; పొలతి = స్త్రీ; తన = తన; ఆత్మను = ఆత్మను; మఱచి = మరచి; ఇమ్ములన్ = మనోజ్ఞముగ; అధూమము = పొగలేనిది; ఐన = అయినట్టి; పావకున్ = అగ్నిహోత్రుని; గతిన్ = వలె; ఉండెన్ = ఉండెను; అంతలోన = అంతలో.
భావము:- కలలో చూచిన వస్తువులను మేలుకొన్న తరువాత చూడలేని మానవునివలె దేవహూతి తన అస్తిత్వాన్ని మరచిపోయింది. పొగలేని అగ్నిలాగా ప్రకాశించింది.

తెభా-3-1050-క.
గురు యోగశక్తిచే నం
తలమున కెగసి సత్కృపామయుఁ డగు నా
వాసుదేవు చరణాం
బురుహయుగన్యస్త చిత్తమును గల దగుచున్.

టీక:- గురు = గొప్ప; యోగశక్తి = యోగశక్తి; చేన్ = చేత; అంబర = ఆకాశ; తలమున = మండలమున; కున్ = కు; ఎగసి = ఎగిరి; సత్ = మంచి; కృపా = దయతో; మయుండు = కూడినవాడు; అగున్ = అయినట్టి; ఆ = ఆ; వర = శ్రేష్ఠమైన; వాసుదేవ = భగవంతుని; చరణ = పాదములు అనెడి; అంబురుహ = పద్మముల; యుగ = జంట యందు; న్యస్త = ఉంచబడినట్టి; చిత్తమునున్ = చిత్తమును; కలది = కలామె; అగుచున్ = అవుతూ.
భావము:- అఖండమైన యోగప్రభావం వల్ల ఆమె మనస్సు ఆకాశానికి ఎగసి పరమ కరుణామయుడైన పరవాసుదేవుని పాదపద్మాలలో విలీనమయింది.