పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/దేవమనుష్యాదుల సృష్టి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-718-సీ.
నిన మునీంద్రుఁ డిట్లనియె "జీవాదృష్ట-
రుఁడు మాయాయుక్త పురుషవరుఁడుఁ
గాలాత్మకుఁడు నను కారణంబున నిర్వి-
కారుఁ డైనట్టి జన్నివాసుఁ
డాది జాతక్షోభుఁ య్యె నమ్మేటి వ-
నను గుణత్రయంబును జనించె
నా గుణత్రయము నం య్యె మహత్తత్త్వ-
ది రజోగుణహేతువైన దాని

తెభా-3-718.1-తే.
యం దహంకార మొగిఁ ద్రిగుణాత్మకమునఁ
బొడమె మఱి దానివలనఁ బ్రభూత మయ్యె
బంచతన్మాత్ర లందు సంవము నొందె
భూపంచక మీ సృష్టిహేతు వగుచు.

టీక:- అనిన = అనగా; ముని = మునులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; జీవ = జీవులచే; అదృష్ట = చూడబడక; పరుడు = పైన ఉండువాడు; మాయా = మాయతో; యుక్త = కూడిన; పురుష = పురుషులలో; వరుడు = శ్రేష్ఠుడు; కాల = కాలమే; ఆత్మకుడు = స్వరూపము ఐనవాడు; అను = అనెడి; కారణంబునన్ = కారణములవలన; నిర్వికారుడు = మార్పులు లేనివాడు, శాశ్వతుడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; జగన్నివాసుడు = భగవంతుడు {జగన్నివాసుడు - జగత్ (లోకములకు) నివాసుడు (నివాసము అయిన వాడు), విష్ణువు}; ఆదిన్ = మొదటగా; జాత = పుట్టిన; క్షోభుడు = కదలికలు కలవాడు; అయ్యెన్ = ఆయెను; ఆ = ఆ; మేటి = గొప్పవాని; వలనను = వలన; గుణ = గుణముల {గుణత్రయము - త్రిగుణములు - సత్త్వ రజస్ తమస్ అను మూడుగుణములు}; త్రయంబునున్ = మూడును; జనించెన్ = పుట్టినవి; ఆ = ఆ; గుణత్రయమున్ = త్రిగుణముల; అందున్ = లో; అయ్యెన్ = కలిగినది; మహత్తత్త్వము = మహత్తత్త్వము; అది = అది; రజోగుణ = రజోగుణము; హేతువు = కారణముగ కలది; ఐన = అయిన; దాని = దాని;
అందు = అందు; అహంకారము = అహంకారము; ఒగిన్ = క్రమముగ; త్రిగుణా = త్రిగుణములు; ఆత్మమున్ = కలదై; పొడమెన్ = పుట్టెను; మఱి = మరి; దాని = దాని; వలన = వలన; ప్రభూతము = పుట్టినవి; అయ్యెన్ = అయ్యెను; పంచతన్మాత్రలు = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి)}; అందున్ = వానిలో; సంభవమున్ = పుట్టుట; పొందెన్ = పొందెను; భూతపంచకము = పంచభూతములు {భూతపంచకము - పంచభూతములు, 1ఆకాశము 2 తేజస్సు 3వాయువు 4 జలము 5 పృథివి}; ఈ = ఈ; సృష్టి = సృష్టికి; హేతువు = కారణము; అగుచున్ = అవుతూ.
భావము:- ఆ విధంగా ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు “జీవులకు అగోచరుడూ, పురుషోత్తముడూ, యోగమాయా సమేతుడూ, కాలస్వరూపుడూ, నిర్వికారుడూ అయిన జగన్నివాసుడు ఆదికాలంలో సృష్టిని గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆ ఆలోచనా ఫలితంగా సత్త్వం, రజస్సు, తమం అనే మూడు గుణాలు పుట్టాయి. ఆ మూడు గుణాలలో రజోగుణం నుండి మహత్తత్త్వం పుట్టింది. ఆ మహత్తత్త్వం నుండి మూడు గుణాల అంశలు కల అహంకారం పుట్టింది. ఆ అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి సమస్త సృష్టికి మూలకారణాలైన పంచభూతాలు పుట్టాయి.

తెభా-3-719-వ.
అవియును దమలోనఁ బ్రత్యేకంబ భువననిర్మాణకర్మంబునకు సమర్థంబులు గాక యన్నిటి సంఘాతంబునఁ బాంచభౌతికం బైన హిరణ్మయాండంబు సృజియించె; నదియును జలాంతర్వర్తియై వృద్ధిఁ బొందుచుండె; నంత.
టీక:- అవియును = అవికూడ; తమ = తమ; లోనన్ = లోన; ప్రత్యేకంబ = ప్రత్యేకముగ; భువన = విశ్వ; నిర్మాణ = నిర్మించు; కర్మంబున్ = పని; కున్ = కి; సమర్థంబులు = సమర్థత కలవి; కాక = కాలేక; అన్నిటి = అన్నింటి; సంఘాతంబున్ = కలయిక వలన; పాంచభౌతికంబు = పంచభూతములచే తయారైనది; ఐన = అయినట్టి; హిరణ్మయాండంబు = హిరణ్మయాండమును {హిరణ్మ యాండము - హిరణ్య (బంగారము, గొప్పతనము) మయ (నిండిన) అండము (గుడ్డు)}; సృజియించెన్ = సృష్టించెను; అదియునున్ = అదికూడ; జల = నీటి; అంతర్ = లోపల; వర్తి = ఉండునది; ఐ = అయ్యి; వృద్ధిన్ = పెరుగుటను; పొందుచున్ = పొందుతూ; ఉండెన్ = ఉండెను; అంత = అంతట.
భావము:- ఆ పంచభూతాలలో ఏ ఒక్కదానికీ ప్రత్యేకంగా లోకాన్ని సృష్టించడం చేతకాక, అన్నీ ఒక గుంపుగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గ్రుడ్డును సృష్టించాయి. ఆ గ్రుడ్డు మహాజలాలలో తేలియాడుతూ వృద్ధి పొందుతూ ఉండగా...

తెభా-3-720-సీ.
నారాయణాఖ్య నున్నతి నొప్పు బ్రహ్మంబు-
సాహస్ర దివ్యవర్షంబులోలి
సియించి యుండె నా వాసుదేవుని నాభి-
యందు సహస్ర సూర్యప్రదీప్తిఁ
నరుచు సకలజీనికాయ యుత మగు-
పంకజాతంబు సంవము నొందెఁ
రఁగంగ నందులో గవదధిష్ఠితుం-
డై స్వరాట్టగు చతురాననుండు

తెభా-3-720.1-తే.
నన మొందెను దత్పద్మసంభవుండు
నామరూపగుణాది సంజ్ఞాసమేతుఁ
గుచు నిర్మాణ మొనరించె ఖిలజగము
నజజుండు నిజచ్ఛాయలన మఱియు.

టీక:- నారాయణ = నారాయణుడు {నారాయణుడు - నారములు (నీరు) అందు వసించువాడు, భగవంతుడు}; ఆఖ్యన్ = అను పేరుతో; ఉన్నతిన్ = అతిశయించి; ఒప్పు = ఒప్పెడి; బ్రహ్మంబు = బ్రహ్మము {బ్రహ్మము - పెద్దది అగు లక్షణము కలది}; సహస్ర = వెయ్యి (1000); దివ్యవర్షంబులున్ = దివ్యసంవత్సరములు; ఓలిన్ = వరుసగా; వసియించి = నివాసముగ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; వాసుదేవుని = భగవంతుడు {వాసుదేవుడు - వసించుదేవుడు, హరి}; నాభి = నాభి; అందున్ = అందు; సహస్ర = వెయ్యి (1000); సూర్య = సూర్యుల; ప్రదీప్తిన్ = ప్రకాశముతో; తనరుచున్ = అతిశయించి; సకల = సమస్తమైన; జీవ = ప్రాణుల; నికాయ = సమూహములతో; యుతము = కూడియున్నది; అగుచున్ = అవుతూ; పంకజాతంబున్ = పద్మము {పంకజాతము - పంక (నీటి)లో జాతము (పుట్టినది), పద్మము}; సంభవమున్ = ఏర్పడుట; ఒందెన్ = జరగెను; పరగగన్ = జరుగగా; అందు = దాని; లో = లో; భగవత్ = భగవంతునిచే; అధిష్టితుండు = స్థానము పొందినవాడు; ఐ = అయ్యి; స్వరాట్టు = తనకుతానే అధిపతి; ఐ = అయ్యి; చతురాననుండు = చతుర్ముఖ బ్రహ్మ {చతురాననుండు - చతుర (నాలుగు, 4) ఆననుండు (ముఖములు కలవాడు), బ్రహ్మదేవుడు};
జననము = జన్మమును; పొందెను = పొందెను; తత్ = ఆ; పద్మసంభవుండు = బ్రహ్మదేవుడు {పద్మసంభవుడు - పద్మమున సంభవించిన (పుట్టిన)వాడు, బ్రహ్మదేవుడు}; నామ = పేరు; రూప = రూపము; గుణ = గుణములు; ఆది = మొదలగు; సంజ్ఞ = గుర్తులతో; సమేతుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; నిర్మాణమున్ = నిర్మించుటను; ఒనరించెన్ = చేసెను; అఖిల = సమస్తమైన; జగమున్ = లోకమును; వనజజుండు = బ్రహ్మదేవుడు {వనజజుడు - వనజము (పద్మము)న జన్మించినవాడు, బ్రహ్మదేవుడు}; నిజ = తన; ఛాయ = నీడ; వలనన్ = వలన; మఱియున్ = ఇంకనూ.
భావము:- నారాయణుడనే పేరుతో ప్రసిద్ధి కెక్కే పరబ్రహ్మం వెయ్యి దివ్యసంవత్సరాలు ఆ అండాన్ని అధిష్టించి ఉన్నాడు. ఆ వాసుదేవుని బొడ్డునుండి వేయి సూర్యుల కాంతితో వెలుగుతూ, సమస్త ప్రాణిసమూహంతో కూడిన ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో నుండి భగవదంశతో చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. స్వయం ప్రకాశుడైన ఆ బ్రహ్మ నామ రూప గుణాలు అనే సంకేతాలు కలిగి సమస్త జగత్తులనూ సృష్టించాడు.

తెభా-3-721-సీ.
తామిస్రమును నంధతామిస్రమును దమ-
మును మోహమును మహామోహనంబు
ను పంచమోహరూపాత్మకమైన య-
విద్యఁబుట్టించి యవ్వేళఁ దనకు
ది తమోమయ దేహ ని ధాత రోసి త-
త్తనువు విసర్జించె ధాతృముక్త
దేహంబు సతత క్షుత్తృష్ణల కావాస-
మును రాత్రిమయము నయ్యెను దలంప

తెభా-3-721.1-తే.
నందులో యక్ష రక్షస్సు న జనింప
వారి కప్పుడు క్షుత్తృషల్ ఱలఁ గొంద
ఱా చతుర్ముఖు భక్షింతు నిరి కొంద
తని రక్షింతు మని తగవాడి రంత.

టీక:- తామిస్రమునున్ = చీకటిని {తామిశ్రము - చీకటి - ఏమియును తెలియని జంతుప్రాయము}; అంధతామిస్రము = గుడ్డిచీకటియును {అంధతామిశ్రము - గుడ్డిచీకటి - గుడ్డితనము వలె ఉన్నదని తెలియును కాని చూడలేని పరిస్థితి}; తమమును = తమోగుణమును {తమము - తమోగుణము వలె చూడగలిగినను తగువర్తన తెలియని పరిస్థితి}; మోహమును = మోహము {మోహము - ప్రజ్ఞను మరగుపరచునది - తగువర్తన తెలిసినను భౌతికములందు మిక్కిలి సంగము లేదా మమకారము}; మహామోహనంబును = మహామోహనము {మహామోహనము - అంతర్యామిత్వమును మరగుపరచునది - తగువర్తన తెలిసినను ఆత్మ తత్త్వము తెలియని పరిస్థితి}; అను = అనెడి; పంచ = ఐదు (5); మోహ = మోహముల; రూపాత్మకము = రూపముకలిగినది; ఐన = అయిన; అవిద్య = అవిద్యను; పుట్టించి = సృష్టించి; ఆ = ఆ; వేళన్ = సమయమున; కున్ = కు; అది = అది; తమస్ = తమోగుణము; మయ = నిండిన; దేహము = శరీరము; అని = అని; ధాత = బ్రహ్మదేవుడు; రోసి = అసహ్యించుకొని; తత్ = ఆ; తనువున్ = శరీరమును; విసర్జించెన్ = వదలివేసెను; ధాతృ = బ్రహ్మదేవునిచే; ముక్త = వదలబడిన; దేహంబున్ = శరీరమును; సతత = ఎల్లప్పుడును కలుగు; క్షుత్ = ఆకలి; తృష్ణముల్ = దాహముల; కున్ = కు; ఆవాసమునున్ = నివాసమును; రాత్రి = రాత్రి (చీకటి); మయమున్ = నిండినదియును; అయ్యెన్ = అయినది; తలంప = చూడగా; అందు = దాని; లోన్ = లో;
యక్ష = యక్షులు; రక్షస్సులు = రాక్షసులు; అనన్ = అనెడి వారు; జనింపన్ = పుట్టగ; వారి = వారి; కిన్ = కి; అప్పుడున్ = అప్పుడు; క్షుత్ = ఆకలి; తృషల్ = దప్పులు; వఱలన్ = వర్తింపగ; కొందఱు = కొంతమంది; ఆ = ఆ; చతుర్ముఖున్ = చతుర్ముఖబ్రహ్మను; భక్షింతుము = తినెదము; అనిరి = అన్నారు; కొందఱు = కొంతమంది; అతనిన్ = అతనిని; రక్షింతుము = కాపాడెదము; అని = అని; తగవాడిరి = దెబ్బలాడిరి; అంత = అంతట.
భావము:- బ్రహ్మదేవుడు తామిస్రం, అంధతామిస్రం, తమం, మోహం, మహామోహం అనే ఐదు విధాలైన మోహస్థితి కలిగిన అవిద్యను పుట్టించి, అది తనకు మోహమయమైన శరీరమని భావించి ఏవగించుకొని, ఆ దేహాన్ని వదిలివేశాడు. బ్రహ్మ వదిలిపెట్టిన ఆ దేహం ఆకలి దప్పులకు స్థానమై రాత్రమయ మయింది. దానిలో నుండి యక్షులూ, రక్షస్సులూ అనే ప్రాణులు పుట్టగా వారికి ఆకలి దప్పులు అధికం కాగా కొందరు బ్రహ్మను భక్షిద్దా మన్నారు, మరి కొందరు రక్షిద్దా మన్నారు.

తెభా-3-722-వ.
ఇట్లు పలుకుచు భక్షింతు మనువారలయి ధాత సన్నిధికిం జనిన; నతండు భయవిహ్వలుండై "యేను మీ జనకుండను మీరలు మత్పుత్రులరు నన్ను హింసింపకుం"డనుచు "మా మా జక్షత రక్షత"యను శబ్దంబులు పలుకం దన్నిమిత్తంబున వారలకుం గ్రమంబున యక్ష రక్షో నామంబులు ప్రకటం బయ్యె; వెండియుం బ్రభావిభాసితం బైన యొక్క కాయంబు ధరించి సత్త్వగుణగరిష్ఠులుం, ప్రభావంతులు నగు సుపర్వులం బ్రముఖులంగా సృజియించి; తత్ప్రభామయ గాత్రవిసర్జనంబుసేసిన; నది యహోరూపంబై దేవతావళికి నాశ్రయం బయ్యె; మఱియు జఘనంబు వలన నతి లోలుపులైన యసురులం బుట్టింప వార లతికాముకు లగుటం జేసి; యయ్యజునిం జేరి మిథున కర్మం బపేక్షించిన; విరించి నగుచు నిర్లజ్జు లయిన యసురులు దన వెంటదగులం; బఱచి ప్రపన్నార్తి హరుండును భక్తజనానురూప సందర్శనుండును నైన నారాయణుం జేరి తత్పాదంబులకుం బ్రణమిల్లి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఇలా; పలుకుచు = అంటూ; భక్షింతుము = తినెదము; అను = అనెడి; వారలు = వారు; ఐ = అయ్యి; ధాత = బ్రహ్మదేవుని; సన్నిధికిన్ = సమీపమునకు; చనిన = వెళ్ళగా; అతండు = అతడు; భయ = భయముచేత; విహ్వలుండు = అవయవస్వాధీనము తప్పినవాడు; ఐ = అయ్యి; ఏను = నేను; మీ = మీ యొక్క; జనకుండను = తండ్రిని; మీరలు = మీరు; మత్ = నా యొక్క; పుత్రులరు = పుత్రులు; నన్నున్ = నన్ను; హింసింపకుడు = బాధింపకుడు; అనుచున్ = అంటూ; మామాజక్షత = నన్ను హింసించకండి; రక్షత = రక్షించండి; అను = అనెడి; శబ్దంబులున్ = పలుకులను; పలుకన్ = పలుకగా; తత్ = వాని; నిమిత్తంబునన్ = కారణముచే; వారలు = వారల; కున్ = కి; క్రమంబునన్ = వరుసగా; యక్ష = యక్షులు; రక్ష = రాక్షసులు; నామంబులున్ = పేర్లు; ప్రకటంబున్ = ప్రసిద్ధములు; అయ్యెన్ = అయినవి; వెండియున్ = మరల; ప్రభా = తేజస్సుచే; విభాసితంబున్ = ప్రకాశించునది; ఐన = అయినట్టి; ఒక్క = ఒక; కాయంబున్ = శరీరమును; ధరించి = ధరించి; సత్త్వగుణ = సత్త్వగుణమున; గరిష్ఠులున్ = గొప్పవారును; ప్రభావంతులున్ = తేజోవంతులును; అగు = అయిన; సుపర్వులన్ = దేవతలను {సుపర్వులు - సు (చక్కగ) పర్వులు (వ్యాపించువారు), దేవతలు}; సృజియించి = సృష్టించి; తత్ = ఆ; ప్రభా = తేజస్సుచే; మయ = నిండిన; గాత్ర = శరీరమును; విసర్జనంబున్ = వదలివేయుట; చేసినన్ = చేయగా; అది = అది; అహో = పగలు, జ్ఞానము; రూపంబున్ = రూపము కలది; ఐ = అయ్యి; దేవతా = దేవతల; ఆవళిన్ = సమూహమున; కిన్ = కి; ఆశ్రయంబు = నివాసమును; అయ్యెన్ = అయినది; మఱియున్ = ఇంకనూ; జఘనంబు = పిరుదులు; వలనన్ = వలన; అతి = మిక్కిలి; లోలుపులు = లోలులు {లోలుపుడు - మిక్కిలి ఇచ్చకలవాడు, లోలుడు}; ఐనన్ = అయినట్టి; అసురులన్ = రాక్షసులను {అసురులు - సురలు కాని వారు, రాక్షసులు}; పుట్టింపన్ = సృష్టింపగా; వారలు = వారు; అతి = మిక్కిలి; కాముకులు = కామము కలవారు; అగుటన్ = అగుట; చేసి = వలన; ఆ = ఆ; అజునిన్ = బ్రహ్మదేవుని {అజుడు - జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు}; చేరి = దగ్గరకు చేరి; మిథునకర్మంబున్ = సంభోగమును {మిథునకర్మ - స్త్రీపురుష మిథునము కలసి చేయు పని, మైథునము}; అపేక్షించినన్ = కోరగా; విరించి = బ్రహ్మదేవుడు; నగుచు = నవ్వుతూ; నిర్లజ్జులు = సిగ్గులేనివారు; అయిన = అయినట్టి; అసురులున్ = రాక్షసులు; తన = తనకు; వెంటన్ = వెంట; తగులన్ = పడగా; పఱచి = పారిపోయి; ప్రపన్నార్తిహరుండును = భగవంతుడు {ప్రపన్నార్తి హరుడు - ప్రపన్నుల (శరణుకోరినవారి) ఆర్తిని (బాధలను) హరుండు (నాశనము చేయువాడు), విష్ణువు}; భక్తజనానురూపసందర్శనుండునున్ = భగవంతుడు {భక్త జనానురూప సందర్శనుడు - భక్తులు ఐన జనులకు అను(ధ్యానించిన)రూపమున సందర్శనుండు (చక్కగా కనిపించువాడు), విష్ణువు}; ఐన = అయిన; నారాయణున్ = హరి {నారాయణుడు - నారములందు వసించువాడు, విష్ణువు}; చేరి = దగ్గరకు చేరి; తత్ = అతని; పాదంబుల్ = పాదముల; కున్ = కి; ప్రణమిల్లి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా పలుకుతూ వారు బ్రహ్మ సమీపానికి వెళ్ళగా, బ్రహ్మ భయకంపితుడై “నేను మీ తండ్రిని. మీరు నా కుమారులు. నన్ను హింసించవద్దు” అంటూ “మా భక్షత... రక్షత” అనే శబ్దాలను ఉచ్చరించాడు. ఆ కారణంగా వారికి యక్షులు, రక్షస్సులు అనే పేర్లు వచ్చాయి. ఆ తరువాత బ్రహ్మ తేజోమయమైన మరొక దేహాన్ని ధరించి, సత్త్వగుణంతో కూడినవారూ, ప్రకాశవంతులూ అయిన దేవతలను ప్రముఖంగా సృష్టించి, ఆ తేజోమయమైన దేహాన్ని వదలివేయగా అది పగలుగా రూపొంది దేవతలందరికీ ఆశ్రయ మయింది. తరువాత బ్రహ్మ తన కటిప్రదేశం నుండి మిక్కిలి చంచలచిత్తులైన అసురులను సృష్టించాడు. వారు అతికాముకులు కావడం వల్ల ఆ బ్రహ్మదేవుణ్ణి చుట్టుముట్టి రతిక్రియను అపేక్షించి, సిగ్గు విడిచి వెంట పడగా బ్రహ్మ నవ్వుతూ పరుగులు తీసి, శరణాగతుల కష్టాలను తొలగించేవాడూ, భక్తులు కోరిన రూపంలో దర్శనం ఇచ్చేవాడూ అయిన నారాయణుని చేరి ఆయన పాదాలకు ప్రణమిల్లి ఇలా అన్నాడు.

తెభా-3-723-క.
"రక్షింపుము రక్షింపు ము
పేక్షింపక వినుత నిఖిల బృందారక! వి
శ్వక్షేమంకర! విను మిటు
క్షత నీ యాజ్ఞ నేను లనిడి వరుసన్.

టీక:- రక్షింపుము = రక్షింపుము; రక్షింపుము = రక్షింపుము; ఉపేక్షింపక = ఆలస్యము చేయక; వినుతనిఖిలబృందారక = భగవంతుడా {వినుత నిఖిల బృందారకుడు - వినుత (స్తుతించుచున్న) నిఖిల (సమస్తమైన) బృందారకుడు ( దేవగణములు కలవాడు), విష్ణువు}; విశ్వక్షేమంకర = భగవంతుడా {విశ్వ క్షేమంకరుడు - విశ్వమునకు క్షేమము (శుభము)ను కరుడు (చేయువాడు) ,విష్ణువు}; వినుము = వినుము; ఇటు = ఇటుకేసి; దక్షతన్ = సామర్థ్యముతో; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఆనతిని; నేను = నేను; తలనిడి = శిరస్సున ధరించి; వరుసన్ = క్రమముగా.
భావము:- “సమస్త దేవతలచేత పొగడబడేవాడా! విశ్వానికి క్షేమాన్ని కలిగించేవాడా! రక్షించు! రక్షించు! ఉపేక్షించక నన్ను రక్షించు. నా మాటను ఆలకించు. నేను నీ ఆజ్ఞను తలదాల్చి క్రమంగా...

తెభా-3-724-తే.
ప్రజాసృష్టి కల్పనం బే నొనర్ప
నందుఁ బాపాత్ము లైన యీ సురు లిపుడు
ను రమింపఁగ డాయవచ్చినఁ గలంగి
యిటకు వచ్చితి ననుఁ గావు మిద్దచరిత!

టీక:- ఈ = ఈ; ప్రజా = ప్రజలను; సృష్టినిన్ = సృష్టిని; కల్పనంబున్ = ఏర్పరుచుట; ఏన్ = నేను; ఒనర్పన్ = చేయుచుండగ; అందున్ = దానిలోని; పాపాత్ములు = పాపులు; ఐన = అయినట్టి; ఈ = ఈ; అసురులున్ = రాక్షసులు; ఇపుడున్ = ఇప్పుడు; ననున్ = నన్ను; రమింపగన్ = సంభోగించుటకు; డాయన్ = సమీపమునకు; వచ్చినన్ = రాగా; కలంగి = కలత చెంది; ఇట = ఇక్కడ; కున్ = కు; వచ్చితిన్ = వచ్చితిని; ననున్ = నన్ను; కావుము = కాపాడుము; ఇద్ధచరిత = భగవంతుడా {ఇద్ధచరితుడు - ఇద్ధ (ప్రసిద్ధిచెందిన) చరిత (నడవడిక) కలవాడు, విష్ణువు}.
భావము:- ఈ ప్రజలను సృష్టించగా వారిలో పాపాత్ములైన ఈ రాక్షసులు నన్నే రమించాలని రాగా చింత చెంది ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్రా! నన్ను రక్షించు.

తెభా-3-725-వ.
అదియునుం గాక; లోకంబువారలకుం గ్లేశంబు లొనరింపం గ్లేశంబునం బొందిన వారల క్లేశంబు లపనయింపను నీవ కాక యితరులు గలరే?"యని స్తుతియించినఁ బద్మజు కార్పణ్యం బెఱుంగ నవధరించి వివిక్తాధ్యాత్మదర్శనుం డగుచుఁ "గమలసంభవ! భవద్ఘోరతనుత్యాగంబు సేయు"మని యానతిచ్చిన నతండు నట్ల చేసె;నంత నదియును.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; లోకంబు = లోకము; వారలు = వారి; కున్ = కి; క్లేశంబున్ = కష్టములను; ఒనరింపన్ = కలుగజేయగా; క్లేశంబున్ = కష్టములను; పొందిన = పొందిన; వారల = వారి యొక్క; క్లేశంబులన్ = కష్టములను; అపనయింపను = శాంతింపజేయుటకు; నీవ = నీవే; కాక = కాకుండగ; ఇతరులున్ = వేరొకరు; కలరే = కలరా ఏమి; అని = అని; స్తుతించినన్ = స్తోత్రము చేయగా; పద్మజు = బ్రహదేవుని {పద్మజుడు - పద్మమున జన్మంచినవాడు, బ్రహ్మదేవుడు}; కార్పణ్యంబున్ = దీనత్వమును; ఎఱుంగన్ = తెలియునట్లు; అవధరించి = విని; వివిక్త = ఏకాంత; ఆధ్యాత్మ = ఆధ్యాత్మిక {అధ్యాత్మికము - ఆత్మ యందు కలుగునది, పరమాత్మకు సంభంచినది}; దర్శనుండు = దర్శనము ఇచ్చువాడు; అగుచున్ = అవుతూ; కమలసంభవ = బ్రహ్మదేవుడా {కమల సంభవుడు - కమల (పద్మమున) సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; భవత్ = నీ యొక్క; ఘోర = ఘోరమైన; తనున్ = తనువును; త్యాగంబున్ = విడిచి; చేయుము = వేయుము; అని = అని; ఆనతిచ్చిన = చెప్పిన; అతండున్ = అతడు; అట్ల = ఆ విధముగ; చేసెన్ = చేసెను; అంతన్ = అంతట; అదియున్ = అది.
భావము:- అంతేకాక లోకంలో ఉండేవారికి కష్టాలను కలిగించడానికి, కష్టాలు పడేవారి కష్టాలను దూరం చేయడానికి నీకంటె సమర్థు లెవరున్నారు?” అని స్తోత్రం చేయగా, బ్రహ్మదేవుని దైన్యాన్ని తెలిసికొని నిస్సందేహంగా అందరి హృదయాలను దర్శించే శ్రీహరి “ఓ బ్రహ్మా! నీ ఈ ఘోరమైన శరీరాన్ని విడిచిపెట్టు” అని ఆజ్ఞాపించగా బ్రహ్మ ఆ దేహాన్ని త్యాగం చేసాడు.

తెభా-3-726-సీ.
వ్యకాంచనరణన్మణినూపురారావ-
విలసిత పాదారవిందయుగళ
కాంచీకలాపసంలిత దుకూలవ-
స్త్రస్ఫారపులిన నితంబ బింబ
రాజితాన్యోన్యకర్కశపీనకరికుంభ-
పృథుకుచభారకంపిత వలగ్న
దిరారసాస్వాద దవిఘూర్ణిత చారు-
సిత నవవికచరాజీవనయన

తెభా-3-726.1-తే.
పరపక్షాష్టమీ శశాంకాభ నిటల
దవదలికులరుచిరోపమాన చికుర
లితచంపకకుసుమవిలాస నాస
హాసలీలావలోకన బ్జపాణి.

టీక:- నవ్య = కొత్త; కాంచన = బంగారపు; రణత్ = గజ్జలు {రణత్ -శబ్దముచేయుచున్న, గజ్జలు}; మణి = మణులు పొదిగిన; నూపుర = అందెల; ఆరావ = ధ్వనులచే; విలసిత = విలసిల్లుచున్న; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల; యుగళ = జంట కలదియును; కాంచీ = మొలనూలు యొక్క; కలాప = చక్కదనముతో; సంకలిత = కూడిన; దుకూల = జిలుగు; వస్త్ర = వస్త్రములచే; స్పార = స్పురిస్తున్న; పులిన = ఇసుకతిన్నెల వంటి; నితంబ = పిరుదుల; బింబ = భాగముకలదియును; రాజిత = విరాజిల్లుతున్; అన్యోన్య = ఒకదానికొకటి; కర్కశ = కఠినముగ; పీన = బలమైన; కరి = ఏనుగు; కుంభ = కుంభస్థలముల వలె; పృథు = పెద్దవైన; కుచ = స్తనముల యొక్క; భార = బరువు వలన; కంపిత = చలిస్తున్న; వలగ్న = నడుము కలదియును; మదిరా = మద్యమును; రసాస్వాద = తీసుకొనుటచే; మద = మత్తువలన; విఘూర్ణిత = మిక్కిలి తిరుగుతున్న; చారు = అందముగా; సిత = ప్రకాశిస్తున్న; నవ = లేతగా; వికచ = వికసించిన; రాజీవ = ఎఱ్ఱకలువల వంటి; నయన = కన్నులు కలదియును;
అపర = కృష్ణ; పక్ష = పక్షమునందలి; అష్టమీ = అష్టమినాటి; శశాంక = చంద్రుని; అభ = వంటి; నిటల = నుదురు కలదియును; మదవత్ = మత్తెక్కిన; అలి = తుమ్మెదల; కుల = గుంపు; రుచిర = అందముతో; ఉపమాన = పోల్చ తగ్గ; చికుర = ముంగురులు కలదియును; లలిత = అందమైన; చంపక = సంపెంగ; కుసుమ = పుష్పము యొక్క; విలాస = విలాసము కల; నాస = ముక్కు కలదియును; హాస = నవ్వుల; లీలా = లీలలతో కలసిన; అవలోకన = చూపులు కలదియును; అబ్జ = పద్మములవంటి; పాణి = అరచేతులు కలదియును.
భావము:- అప్పుడు ఆ దేహం నుండి మణులు పొదిగిన క్రొత్త బంగారు కాలి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగే పాదపద్మాలు కలది, మెత్తని పట్టుచీరపై మిలమిల మెరుస్తున్న మొలనూలుతో ఇసుకతిన్నెలవలె ఉన్న కటిప్రదేశం కలది, ఒకదానితో ఒకటి ఒరసికొంటున్న కుచకుంభాల బరువుకు నకనకలాడే నడుము కలది, మద్యపానం మత్తుతో చలిస్తున్న అప్పుడే వికసించిన పద్మాలవంటి కన్నులు కలది, కృష్ణపక్షపు అష్టమినాటి చంద్రుని పోలిన నుదురు కలది, మదించిన తుమ్మెదలకు సాటి వచ్చే శిరోజాలు కలది, అందమైన సంపంగి పువ్వు వలె సోగదేలిన ముక్కు కలది, చిరునవ్వులు చిందే చూపుల కలది, తామరపూలవంటి చేతులు కలది....

తెభా-3-727-క.
నఁదగి సంధ్యారూపం
బు లలనారత్న మపుడు పుట్టిన దానిం
నుఁగొని దానవు లుపగూ
మొగిఁ గావించి పలికి రందఱు దమలోన్.

టీక:- అనన్ = అనుటకు; తగి = తగిన; సంధ్యా = సంధ్య యొక్క {సంధ్య - పగలు రాత్రుల మధ్య కాలము సంధ్య అనబడును}; రూపంబునన్ = రూపముతో; లలనా = స్త్రీ లలో {లలన - లాలనము చేయతగ్గది, స్త్రీ}; రత్నము = ఉత్తమురాలు; అపుడు = అప్పుడు; పుట్టిన = జన్మించగ; దానిన్ = దానిని; కనుగొని = చూసి; దానవులు = రాక్షసులు; ఉపగూహనమున్ = కౌగలింతలు; ఒగిన్ = వరుసగా; కావించి = చేసి; పలికిరి = అనుకొనిరి; అందఱున్ = అందరు; తమలోనన్ = తమలోతాము.
భావము:- అబ్జపాణి అని పిలునదగిన ఆ సుందరి సంధ్యారూపంలో పుట్టగా, రాక్షసులు చూచి కౌగలించి, తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు.

తెభా-3-728-క.
“ఈ సౌకుమార్య మీ వయ
సీ సౌందర్యక్రమంబు నీ ధైర్యంబు
న్నీ సౌభాగ్యవిశేషము
నే తులకుఁ గలదు చూడనిది చిత్ర మగున్.”

టీక:- ఈ = ఈ; సౌకుమార్యమున్ = సుకుమారత్వమును; ఈ = ఈ; వయస్ = యౌవనము; ఈ = ఈ; సౌందర్యక్రమమున్ = సుందరత; ఈ = ఈ; ధైర్యంబున్ = ధైర్యమును; ఈ = ఈ; సౌభాగ్య = సౌభాగ్యము యొక్క; విశేషమున్ = ప్రత్యేకతయును; ఏ = ఏ; సతుల్ = స్త్రీల; కున్ = కి; కలదు = ఉన్నది; చూడన్ = చూస్తే; ఇది = ఇది; చిత్రము = విచిత్రము; అగున్ = అయు ఉన్నది.
భావము:- “ఈ సౌకుమార్యం, ఈ నవయౌవనం, ఈ సౌందర్యం, ఈ జాణతనం, ఈ సౌభాగ్యవిశేషం ఏ స్త్రీలకూ లేదు. ఇది చాల చిత్రంగా ఉంది”.

తెభా-3-729-చ.
ని వెఱగంది యద్దనుజు లందఱు నిట్లని "రీ తలోదరిం
ని మన మంతనుండియును గాముకవృత్తిఁ జరించుచుండగా
యెడ దీని చిత్తమున క్కువలేమికి నేమి హేతువో"
ని బహుభంగులం బలికి యా ప్రమదాకృతియైన సంధ్యతోన్.

టీక:- అని = అని; వెఱగున్ = ఆశ్చర్యమును; అంది = పొంది; ఆ = ఆ; దనుజుల్ = రాక్షసులు; అందఱున్ = అందరు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; ఈ = ఈ; తలోదరిన్ = స్త్రీని {తలోదరి - తలము (సన్నని) ఐన తరి (నడుము) కలది, స్త్రీ}; కని = చూసి; మనమున్ = మనము, మనసు; అంత = అందరము, మొత్తము అంత; ఉండియునున్ = ఉండికూడ, నుంచియును; కాముక = కామించు, కోరికల; వృత్తిన్ = ప్రవర్తనమున, నిండిపోయి; చరించుచున్ = వర్తిస్తుండగా; మన = మన; ఎడన్ = అందు; దీని = ఈమె; చిత్తమునన్ = మనసున; మక్కువ = ఇష్టము; లేమికిన్ = లేకపోవుటకు; ఏమి = ఏది; హేతువో = కారణమో; అని = అని; బహు = అనేక; భంగులన్ = విధములుగ; పలికి = అనుకొనుచూ; ఆ = ఆ; ప్రమద = స్త్రీ {ప్రమద - సుఖమును ఇచ్చునది, స్త్రీ}; ఆకృతి = రూపము; ఐన = అయ్యి ఉన్న; సంధ్య = సంధ్య; తోన్ = తోటి.
భావము:- అని ఆశ్చర్యపడి ఆ రాక్షసులు “మనమంతా ఈమెను చూచినప్పటినుండి కామోత్కంఠులమై ఉండగా ఈమె మాత్రం మన మీద ఏమాత్రం మక్కువ చూపకుండా ఉండటానికి కారణం ఏమిటి?” అని అనేక విధాలుగా అనుకొని, ఆ సంధ్యాసుందరితో....

తెభా-3-730-వ.
ఇట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇలా అన్నారు.

తెభా-3-731-క.
"ఓ దళీస్తంభోరువ!
యే కుల? మే జాడదాన? వెవ్వరి సుత? వి
ట్లేకాంతంబున నిచ్చట
నే కారణమునఁ జరించె? దెఱిఁగింపు తగన్.

టీక:- ఓ = ఓ; కదళీ = అరటి; స్తంభ = స్తంభముల వంటి; ఊరువ = తొడలు కలదానా; ఏ = ఏ; కులము = వర్ణమునకు; ఏ = ఏ; జాడ = ప్రాంతమునకు; దానవున్ = చెందినదానవు; ఎవ్వారి = ఎవరి యొక్క; సుతవు = పుత్రికవు; ఇట్లు = ఈ విధముగ; ఏకాంతమున = ఒంటరిగ; ఇచటన్ = ఇక్కడ; ఏ = ఏ; కారణమునన్ = కారణముచేత; చరించెదవు = తిరుతుంటివి; ఎఱిగింపు = తెలుపుము; తగన్ = అవశ్యము.
భావము:- అరటి బోదెల లాంటి నున్నటి తొడలు గల సుందరీ! నీదే కులం? నీదే ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు నీవు ఇక్కడ వంటరిగా తిరుగుతున్నావు? మాకు తెలిసేలా చెప్పు.
సృష్టి ఆదిలో తను సృష్టించిన రాక్షసులబారి నుండి తప్పించుకోడానికి బ్రహ్మదేవుడు తన దేహాన్ని విడిచాడు. ఆ దేహంనుండి ఆ రాక్షసులను మోహంలో పడేసిన సంధ్యాసుందరి జనించింది. చిట్టిపొట్టి పదాలతో ఎంతటి గంభీర భక్తిభావాలైనా, సరస శృంగారమైనా పండించగల మేటి పోతన గారి ఆ సంధ్యాసుందరి వర్ణన యిది.

తెభా-3-732-క.
దీయ చారురూప
ద్రవిణలసత్పుణ్యభూమిఁ గు మోహమునం
విలిన దుర్భలులను మముఁ
యవు పుష్పాస్త్రుబాధ నమయ్యెఁ గదే!

టీక:- భవదీయ = నీ యొక్క; చారు = అందమైన; రూప = రూపము అను; ద్రవిణ = సంపదలచే; లసత్ = ప్రకాశిస్తున్న; పుణ్య = పవిత్ర; భూమిన్ = ప్రదేశమందు; తగు = మిక్కిలి; మోహమునన్ = మోహము అందు; తవిలిన = తగుల్కొనిన; దుర్భలులను = బలహీనులను; మమున్ = మమ్ములను; కవయవు = సంభోగించవు; పుష్పాస్త్రు = మన్మథ {పుష్ఫాస్త్రుడు -పుష్పములు అస్త్రములుగ కలవాడు, మన్మథుడు}; బాధ = బాధ; ఘనము = అధికము; అయ్యెన్ = అయినది; కదే = కదా.
భావము:- నీ సౌందర్య సంపదతో ఇంపైన ఈ పుణ్యభూమిలో మోహంతో నీవెంట పడిన దుర్బలులమైన మమ్మల్ని ఎందుకు చేరనివ్వవు? మన్మథుని బాధ మాకు ఎక్కువయింది కదా!”

తెభా-3-733-వ.
మఱియుఁ దదీయ సౌందర్యం బుగ్గడింప నలవిగాక చింతించుచు.
టీక:- మఱియున్ = ఇంకనూ; తదీయ = నీ యొక్క; సౌందర్యంబున్ = సౌందర్యమును; ఉగ్గడింపన్ = నొక్కివక్కాణించుటకు; అలవి = సాధ్యము; కాక = కాకపోవుటచే; చింతించుచున్ = బాధపడుతూ.
భావము:- అంటూ వాళ్ళు ఆమె సౌందర్యాన్ని వర్ణించడానికి అలవి కాక ఆలోచిస్తూ...

తెభా-3-734-సీ.
గురు కుచభార సంకుచితావలగ్నంబు-
నరారు నాకాశ లము గాఁగ
లిత పల్లవపాణిలమునఁ జెన్నొందు-
చెండు పతత్పతంగుండు గాఁగ
లలిత నీల పేల పృథు ధమ్మిల్ల-
బంధంబు ఘన తమఃటలి గాఁగ
ప్రవిమలతర కాంత భావవిలోకన-
జాలంబు దారకామితి గాఁగ

తెభా-3-734.1-తే.
డఁగి మైపూఁత సాంధ్యరాగంబు గాఁగఁ
నంగనాకృతి నొప్పు సంధ్యావధూటిఁ
దిసి మనముల మోహంబు డలుకొనఁగ
సురు లందఱు గూడి యిట్లనిరి మఱియు.

టీక:- గురు = పెద్ద; కుచ = స్తనముల; భార = భారమువలన; సంకుచితా = చిక్కిపోయిన; అవలగ్నము = నడుము; తనరారు = అతిశయించు; ఆకాశతలము = ఆకాశము అను ప్రదేశము; కాగ = అవుతుండగ; లలిత = సున్నితమైన; పల్లవ = లేతకొమ్మ వంటి; పాణితలమునన్ = అరచేతియందు; చెన్నొందు = ప్రకాశించు; చెండు = పూబంతి; పతత్ = అస్తమిస్తున్న; పతంగుడు = సూర్యుడు; కాగ = అవుతుండగ; సలలిత = సుకుమారమైన; నీల = నల్లని; పేశల = మెత్తని; పృథు = పెద్ద; ధమిల్ల = జుట్టు; బంధంబున్ = ముడి; ఘన = చిమ్మ; తమః = చీకటుల; పటలి = సమూహము; కాగ = అవుతుండగ; ప్రవిమలతర = అతినిర్మలమైన {ప్రవిమలము - ప్రవిమలతరము - ప్రవిమలతమము}; కాంత = మనోహర; భావ = భావములతో కూడిన; విలోకన = చక్కటి చూపు; జాలంబుల్ = సమూహములు; ఉదార = కాంతివంతమైన; తారకా = తారకల; సమితి = గుంపు; కాగ = అవుతుండగ; కడగి = పూని;
మై = మేని, వంటి; పూత = విలాసము; సాంధ్య = సంధ్యకాలము యొక్క; రాగంబున్ = ఎరుపు; కాగ = అవుతుండగ; అంగన = స్త్రీ {అంగన - చక్కటి అంగములు కలది, స్త్రీ}; ఆకృతిన్ = రూపమున; ఒప్పు = చక్కగా ఉన్న; సంధ్యా = సంధ్య అను; వధూటిన్ = స్త్రీని; కదిసి = సమీపించి; మనములన్ = మనసులలో; మోహంబున్ = మోహములు; కడలుకొనగ = కమ్ముకోగ; అసురులు = రాక్షసులు; అందఱున్ = అందరు; కూడి = కలసి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; మఱియున్ = ఇంకను.
భావము:- కుచకుంభాల బరువువల్ల జవజవలాడే నడుము ఆకాశం కాగా, అందమైన చిగురాకువంటి హస్తంలో ప్రకాశించే పూలచెండు అస్తమించే సూర్యబింబం కాగా, నల్లగా మెరుస్తూ విప్పారిన కొప్పుముడి చీకటి రేకలు కాగా, స్వచ్ఛమైన భావాలను వెల్లడిస్తూ మెరిసే చూపులు నక్షత్రాలు కాగా, శరీరానికి పూసుకున్న గంధపు పూత సంధ్యారాగం కాగా, స్త్రీరూపాన్ని ధరించిన ఆ సంధ్యాదేవిని అసురులు చుట్టుముట్టి, హృదయాలలో పెచ్చరిల్లిన మోహావేశంతో ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు.

తెభా-3-735-క.
"వెయఁగ బద్మం బేక
స్థముననే యొప్పుఁ గాని త్వత్పదపద్మం
బి బహుగతుల ననేక
స్థముల దనరారుఁ గాదె రుణాబ్జముఖీ!"

టీక:- వెలయఁగన్ = పూని; పద్మంబు = పద్మము; ఏక = ఒకే; స్థలముననే = స్థలమున మాత్రమే; ఒప్పున్ = ఒప్పి ఉండును; కాని = కాని; త్వత్ = నీ యొక్క; పద = పాదములు అను; పద్మంబున్ = పద్మములు; ఇలన్ = భూమిపైన; బహు = అనేక; గతులన్ = విధములుగ; అనేక = అనేకమైన; స్థలములన్ = స్థలములయందు; తనరారున్ = అతిశయించును; కాదె = కదా; తరుణ = లేత; అబ్జ = పద్మము వంటి {అబ్జము - అప్పు (నీటి) యందు పుట్టినది, పద్మము}; ముఖీ = మోము కలదాన.
భావము:- క్రొత్తగా వికసించిన తామరపువ్వు వంటి ముఖం కలదానా! పద్మం ఒకే స్థలంలో ఉంటుంది, కాని నీ పాదాలనే పద్మాలు అనేక స్థలాలలో అనేక ప్రకారాలుగా ప్రకాశిస్తున్నాయి కదా!”

తెభా-3-736-క.
ని దనుజులు దమ మనముల
నురాగము లుప్పతిల్ల నందఱు నా సం
ధ్యను బట్టికొనిరి వనజా
ను డప్పుడు హృదయ మందు సంతస మందెన్.

టీక:- అని = అనుచు; దనుజులు = రాక్షసులు; తమ = తమ యొక్క; మనములన్ = మనసులలో; అనురాగములు = ప్రేమలు; ఉప్పతిల్లన్ = అతిశయించగ; అందఱున్ = అందరు; ఆ = ఆ; సంధ్యను = సంధ్యను; పట్టికొనిరి = పట్టుకొనిరి; వనజాసనుడు = బ్రహ్మదేవుడు {వనజాసనుడు - వనజము (పద్మము)న ఆసనుడు (కూర్చున్నలాడు), బ్రహ్మదేవుడు}; అప్పుడు = అప్పుడు; హృదయము = హృదయము; అందున్ = లో; సంతసమున్ = సంతోషమును; అందెన్ = పొందెను.
భావము:- అని ఈ విధంగా ఆ రాక్షసులు పలుకుతూ తమ మనసులో తమకం అధికం కాగా ఆ సంధ్యాసుందరిని పట్టుకున్నారు. అది చూచి బ్రహ్మ తన మనస్సులో ఎంతో సంతోషించాడు.

తెభా-3-737-క.
సిజభవుఁ డయ్యెడఁ దన
మాఘ్రాణింప నపుడు గంధర్వులు, న
ప్ససలుఁ బుట్టిరి ధాతయుఁ
రువడి నాత్మీయ తనువుఁ బాసిన నదియున్.

టీక:- సరసిజభవుడు = బ్రహ్మదేవుడు {సరసిజభవుడు - సరసిజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; ఆ = ఆ; ఎడన్ = సమయములో; తన = తన యొక్క; కరము = చేతిని; ఆఘ్రాణిపన్ = వాసన చూడగా; అపుడున్ = అప్పుడు; గంధర్వులున్ = గంధర్వులును; అప్సరసలున్ = అప్సరసలును; పుట్టిరి = పుట్టిరి; ధాతయున్ = బ్రహ్మదేవుడు; పరువడి = తరువాత; ఆత్మీయ = తన యొక్క; తనువున్ = శరీరమును; పాసినన్ = వదలగ; అదియునున్ = దానిని;
భావము:- అప్పుడు బ్రహ్మ తన చేతిని వాసన చూడగా గంధర్వులూ అప్సరసలూ పుట్టారు. బ్రహ్మ తన శరీరాన్ని వదలివేయగా అది...

తెభా-3-738-వ.
చంద్రికారూపం బైన దద్గాత్రంబు విశ్వావసు పురోగము లగు గంధర్వాప్సరో గణంబులు గైకొనిరి; వెండియుం గమలగర్భుండు తంద్రోన్మాద జృంభికానిద్రారూపం బైన శరీరంబు దాల్చి; పిశాచ గుహ్యక సిద్ధ భూత గణంబులం బుట్టించిన; వారలు దిగంబరులు ముక్తకేశులు నయినం జూచి; ధాత లోచనంబులు ముకుళించి తద్గాత్రంబు విసర్జనంబు గావించిన నది వారలు గైకొనిరి; వెండియు నజుండు దన్ను నన్నవంతునిగాఁ జింతించి యదృశ్య దేహుం డగుచుం బితృ సాధ్య గణంబులం బుట్టించిన; వారలు దమ్ముఁ బుట్టించిన యదృశ్య శరీరంబునకు గార్యం బగు దేవభాగంబు గైకొనినం దత్కారణంబునం బితృ సాధ్య గణంబుల నుద్దేశించి శ్రాద్ధంబుల హవ్యకవ్యంబు లాచరింతురు; మఱియును.
టీక:- చంద్రికా = వెన్నెల యొక్క; రూపంబున్ = స్వరూపముగ; ఐన = అయిన; తత్ = ఆ; గాత్రంబున్ = శరీరంబును; విశ్వావసు = విశ్వావసువునకు; పురోగములు = ముందునడచువారు; అగు = అయిన; గంధర్వ = గంధర్వులును; అప్సరస = అప్సరసల; గణంబులు = సమూహములు; కైకొనిరి = స్వీకరించిరి; వెండియున్ = ఇంకను; కమలగర్భుండు = బ్రహ్మదేవుడు {కమల గర్భుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; తంద్ర = కునికిపాట్లు; ఉన్మాద = పిచ్చి; జృంభికా = ఆవులింతలు; నిద్రా = నిద్రలతో కూడిన; రూపంబున్ = రూపము; ఐన = అయినట్టి; శరీరంబున్ = దేహమును; తాల్చి = ధరించి; పిశాచ = పిశాచములు; గుహ్యక = గుహ్యకులు; సిద్ద = సిద్ధులు; భూత = భూతముల; గణంబులన్ = సమూహములను; పుట్టించినన్ = పుట్టించగా; వారలు = వారు; దిగంబరులు = వస్త్రములను ధరించనివారును; ముక్త = వదలివేసిన; కేశులు = తలవెంట్రుకలు కలవారును; అయినన్ = అవ్వగా; చూచి = చూసి; ధాత = బ్రహ్మదేవుడు {ధాత - ధరించువాడు, బ్రహ్మదేవుడు}; లోచనంబులున్ = కన్నులను; ముకుళించి = చిట్లించి; తత్ = ఆ; గాత్రంబున్ = శరీరమును; విసర్జనంబున్ = వదలినదిగా; కావించినన్ = చేయగా; అది = దానిని; వారలు = వారు; కైకొనిరి = తీసుకొనిరి; వెండియున్ = తరవాత; అజుండు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములేనివాడు, బ్రహ్మదేవుడు}; తన్నున్ = తననుతాను; అన్నవంతుని = ఆహారము కలవానిని; కాన్ = అగునట్లు; చింతించి = అనుకొని; అదృశ్య = కనిపించని; దేహుండు = శరీరము కలవాడు; అగుచున్ = అవుతూ; పితృపితృ = పితృదేవతల; సాధ్య = సాధ్యుల; గణంబులన్ = సమూహములను; పుట్టించినన్ = పుట్టించగా; వారలు = వారు; తమ్ము = తమను; పుట్టించిన = పుట్టించినట్టి; అదృశ్య = కనిపించని; శరీరంబున్ = దేహమున; కున్ = కు; కార్యంబున్ = కార్యములు {కార్యము - కార్యకారణములలో అదృశ్య శరీరము కారణము అయిన దాని కార్యము}; అగు = అయినట్టి; దేవభాగంబులున్ = దేవభాగములను; కైకొనినన్ = తీసుకొనిన; కారణంబునన్ = కారణముచేత; పితృ= పితృదేవతల; సాధ్య = సాధ్యుల; గణంబులన్ = సమూహములు; ఉద్దేశించి = కొరకు; శ్రాద్దంబులన్ = శ్రాద్దములందు; హవ్య = హవ్యమును {హవ్యము - హోమమున దేవతలకు వ్రేల్చదగిన అన్నము మరియు నేయి}; కవ్యంబులున్ = కవ్యములను {కవ్యము - కవ్యములు ( పితృదేవతలకు సమర్పించు పిండములు (అన్నములు)}; ఆచరింతురు = ఆచరించెదరు; మఱియును = ఇంకను.
భావము:- వెన్నెల రూపాన్ని పొందగా, ఆ దేహాన్ని విశ్వావసువు ముందు నడుస్తున్న గంధర్వులూ అప్సరసలూ తీసుకున్నారు. మళ్ళీ బ్రహ్మ కునుకుపాటు, ఉన్మాదం,ఆవులింత, నిద్రలతో కూడిన శరీరాన్ని ధరించి పిశాచాలనూ, గుహ్యకులనూ, సిద్ధులనూ, భూతాలనూ పుట్టించగా వాళ్ళు దిగంబరులై వెండ్రుకలు విరబోసుకొని ఉండడం చూచి బ్రహ్మ కన్నులు మూసుకొని అప్పటి తన శరీరాన్ని వదలి వేయగా దానిని పిశాచులు గ్రహించారు. అనంతరం బ్రహ్మ తనను అన్నవంతునిగా భావించి అదృశ్య శరీరుడై పితృదేవతలనూ సాధ్యులనూ పుట్టించగా వారు తమను పుట్టించిన అదృశ్యదేహానికి కార్యమైన దేవభాగాన్ని అందుకొనగా ఆ కారణం వల్ల శ్రాద్ధ సమయాలలో పితృగణాలనూ సాధ్యగణాలనూ ఉద్దేశించి హవ్యకవ్యాలను సమర్పిస్తారు.

తెభా-3-739-సీ.
జ్జనస్తుత! విను తురతఁ బంకజా-
నుఁడు దిరోధానక్తివలన
ర సిద్ధ విబుధ కిన్నరలను బుట్టించి-
విలి వారికిఁ దిరోధాననామ
ధేయమై నట్టి యా దేహంబు నిచ్చెను-
వెండియు భారతీవిభుఁడు దనకుఁ
బ్రతిబింబ మగు శరీమునఁ గిన్నరులఁ గిం-
పురుషులఁ బుట్టింపఁ బూని వారు

తెభా-3-739.1-తే.
ధాత్రు ప్రతిబింబ దేహముల్ దాల్చి వరుస
నిద్దఱిద్దఱు గలగూడి యింపులొదవ
బ్రహ్మపరమైన గీతముల్ వాడుచుండి
రంతఁ బంకజసంభవుఁ డాత్మలోన.

టీక:- సత్ = మంచి; జన = వారిచే; స్తుత = స్తుతింపబడువాడ; విను = వినుము; చతరతన్ = చాతుర్యముతో; పంకజాసనుడు = బ్రహ్మదేవుడు {పంకజాసనుడు - పంకజము (పద్మమున) ఆసనుడు (కూర్చొనువాడు), బ్రహ్మదేవుడు}; తిరోధాన = అదృశ్యమగు, మరణించు; శక్తి = సామర్థ్యము; వలన = వలన; నర = నరులను; సిద్ద = సిద్ధులను; విబుధ = జ్ఞానులను; కిన్నరలన్ = కిన్నరలను; పుట్టించి = పుట్టించి; తవిలి = పూని; వారి = వారి; కిన్ = కి; తిరోధాన = అదృశ్యము అను; నామధేయము = పేరుకలదైన; ఐనట్టి = అయినట్టి; ఆ = ఆ; దేహంబున్ = శరీరమును; ఇచ్చెను = ఇచ్చెను; వెండియున్ = తరువాత; భారతీవిభుడు = బ్రహ్మదేవుడు {భారతీవిభుడు - భారతీదేవి యొక్క విభుడు (భర్త), బ్రహ్మదేవుడు}; తన = తన; కున్ = కు; ప్రతిబింబము = ప్రతిబింబము; అగు = అయినట్టి; శరీరమునన్ = దేహముతో; కిన్నరులన్ = కిన్నరులను; కింపురుషులన్ = కింపురుషులను; పుట్టింపన్ = పుట్టించగ; పూని = పూని; వారు = వారు;
ధాత్రు = బ్రహ్మదేవుని యొక్క {ధాత - ధరించువాడు, బ్రహ్మదేవుడు}; ప్రతిబింబ = ప్రతిబింబములు అయిన; దేహముల్ = దేహములను; తాల్చి = ధరించి; వరుసన్ = క్రమముగ; ఇద్దఱిద్దఱు = ఇద్దరేసి చొప్పున; కవగూడి = జంటగ కలిసి; ఇంపులు = చక్కదనములు; ఒదవన్ = కలుగగా; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పరము = చెందునట్లు; ఐన = అయినట్టి; గీతముల్ = పాటలు; వాడుచుండిరి = పాడుచుండిరి; అంతన్ = అంతట; పంకజసంభవుండు = బ్రహ్మదేవుడు {పంకజసంభవుడు - పంకజము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; ఆత్మ = మనసు; లోనన్ = లోపల;
భావము:- సజ్జనులు సంస్తుతించే ఓ పరీక్షిన్మహారాజా! విను. బ్రహ్మదేవుడు తిరోధానశక్తి వల్ల నరులను, సిద్ధులను,విద్యాధరులను పుట్టించి వారికి తిరోధానం అనే పేరుగల ఆ దేహాన్ని ఇచ్చాడు. తర్వాత బ్రహ్మ తనకు ప్రతిబింబంగా ఉన్న శరీరంనుండి కిన్నరులనూ, కింపురుషులనూ పుట్టించగా వారు ఆ బ్రహ్మదేవుని ప్రతిబింబాలైన శరీరాలను ధరించి ఇద్దరిద్దరు జతకూడి బ్రహ్మదేవునికి సంబంధించిన గీతాలను గానం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ తన మనస్సులో...

తెభా-3-740-క.
సృష్టి వృద్ధిలేమికిఁ
లుచు శయనించి చింతఁ ర చరణాదుల్
గొకొని కదలింపఁగ రా
లి రోమము లుగ్రకుండలివ్రజ మయ్యెన్.

టీక:- తన = తన యొక్క; సృష్టిన్ = సృష్టి యందు; వృద్ధి = వృద్ధిచెందుట; లేమికిన్ = లేకపోవుటకు; కనలుచున్ = దుఃఖించుచు; శయనించి = పండుకొని; చింతన్ = బాధతో; కరచరణాదుల్ = కాళ్ళుచేతులు; కొనకొని = విదలించి; కదలింపగన్ = కదిలించగా; రాలిన = రాలిపడినట్టి; రోమములు = వెంట్రుకలు; ఉగ్ర = భయంకరమైన; కుండలి = సర్పముల; వ్రజమున్ = సమూహము; అయ్యెన్ = అయ్యెను.
భావము:- తాను చేసిన సృష్టి అభివృద్ధి చెందకుండా ఉన్నందుకు బ్రహ్మ చింతించి, నిద్రించి, కాళ్ళూ చేతులూ విదిలించగా రాలిన రోమాలన్నీ పాములుగా మారాయి.

తెభా-3-741-క.
జజుఁడు దన్నుఁ గృతకృ
త్యునిఁగా భావించి యాత్మఁ దుష్టివహింపన్
మున నిఖిల జగత్పా
ను లగు మనులం ద్రిలోకరుల సృజించెన్.

టీక:- వనజజుడు = బ్రహ్మదేవుడు {వనజజుడు - వనజము (పద్మము)న పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; తన్నున్ = తనను; కృతకృత్యుని = అనుకొన్నపని పూర్తిచేసినవాని; కాన్ = అయినట్లు; భావించి = అనుకొని; ఆత్మన్ = ఆత్మలో; తుష్టి = సంతృప్తి; వహింపన్ = వహించగ; మనమునన్ = మనసులో; నిఖిల = సమస్తమైన; జగత్ = లోకములకును; పావనులు = పవిత్రము చేయువారు; అగు = అయిన; మనులన్ = మనువులను; త్రి = మూడు; లోక = లోకములకును; వరులన్ = శ్రేష్ఠులను; సృజించెన్ = సృష్టించెను.
భావము:- బ్రహ్మదేవుడు తాను పూనిన పని నెరవేరినట్లుగా భావించి తన అంతరాత్మ తృప్తిపడే విధంగా సమస్త జగత్తులో పవిత్రులూ, ముల్లోకాలలో శ్రేష్ఠులూ ఐన మనువులను సృష్టించాడు.

తెభా-3-742-సీ.
పుట్టించి వారికిఁ బురుషరూపం బైన-
న దేహ మిచ్చినఁ గిలి వారు
నుఁగొని మున్ను పుట్టివారిఁ గూడి యా-
నజసంభవున కిట్లనిరి "దేవ!
ఖిలజగత్స్రష్ట వైన నీ చేతఁ గా-
వింపంగఁబడిన యీ వితతసుకృత
మాశ్చర్యకరము యజ్ఞాదిక్రియాకాండ-
మీ మనుసర్గ మం దీడ్యమయ్యెఁ

తెభా-3-742.1-తే.
ద్ధవిర్భాగములు మాకుఁ విలి జిహ్వ
లందు నాస్వాదనములు సేయంగఁగలిగె"
నుచు మనముల హర్షంబు తిశయిల్ల
వినుతిసేసిరి భారతీవిభుని మఱియు.

టీక:- పుట్టించి = సృష్టించి; వారి = వారి; కిన్ = కి; పురుష = పురుషుల; రూపంబున్ = రూపము కలది; ఐన = అయినట్టి; తన = తన యొక్క; దేహంబున్ = శరీరమును; ఇచ్చినన్ = ఇవ్వగా; తగిలి = సంకల్పించి; వారున్ = వారును; కనుగొని = చూసి; మున్ను = పూర్వము; పుట్టిన = పుట్టిన; వారిన్ = వారిని; కూడి = కలిసి; ఆ = ఆ; వనజసంభవునన్ = బ్రహ్మదేవుని; కిన్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; దేవ = భగవంతుడ; అఖిల = సమస్తమైన; జగత్ = లోకములను; స్రష్టవు = సృష్టించినవాడవు; ఐన = అయిన; నీ = నీ; చేతన్ = చేత; కావింపగబడిన = చేయబడిన; ఈ = ఈ; వితత = విస్తారమైన; సుకృతము = చక్కగాచేయబడిన పని; ఆశ్చర్యకరము = ఆశ్చర్యకరమైనది; యజ్ఞ = యజ్ఞము; ఆది = మొదలగు; క్రియా = క్రియా; కాండము = విధానము; ఈ = ఈ; మను = మనువుల; సర్గము = సృష్టి; అందున్ = వానిలో; ఈఢ్యమున్ = స్తుతింపదగినది; అయ్యెన్ = అయినది; తత్ = ఆ; హవిస్ = హవిస్సులందలి {హవిర్భాగములు - హవిస్సులు (యజ్ఞకుండమున దేవతలకై వేల్చబడిన అన్నము నెయ్యి) అందలి దేవతల వారివారి భాగములు}; భాగములున్ = భాగములు;
మాకున్ = మాకు; తవిలి = పూని; జిహ్వలు = నాలుకలు; అందున్ = అందు; ఆస్వాదనములున్ = ఆరగించుట; చేయంగన్ = చేయగలుగుట; కలిగెన్ = అయినది; అనుచున్ = అంటూ; మనములన్ = మనసులలో; హర్షంబున్ = సంతోషములు; అతిశయిల్లన్ = పెంపొందగా; వినుతి = స్తోత్రము; చేసిరి = చేసిరి; భారతీవిభుని = బ్రహ్మదేవుని {భారతీవిభుడు - భారతీ (సరస్వతీదేవి) విభుడు (భర్త), బ్రహ్మదేవుడు}; మఱియున్ = ఇంకను.
భావము:- ఆ విధంగా పుట్టించి బ్రహ్మ వారికి పురుషరూపమైన తన దేహాన్ని ఇవ్వగా ఆ మనువులు తమకంటే ముందుగా సృష్టింపబడిన వారితో కలిసి బ్రహ్మతో ఇలా అన్నారు. “దేవా! సకల లోకాలకు సృష్టికర్తవైన నీవు చేసిన ఈ విస్తృతమైన సుకృతం ఆశ్చర్యకరమైనది. యజ్ఞాలు మొదలైన క్రియాకాండ అంతా ఈ మనువులను సృష్టించడం వల్ల ప్రశంసనీయమయింది. యజ్ఞాలలోని హవిర్భాగాలను మా నాలుకలతో ఆస్వాదించే అవకాశం మాకు లభించింది” అని అంతరంగాల్లో సంతోషం పెల్లుబుకుతూ ఉండగా బ్రహ్మదేవుని ప్రస్తుతించారు.

తెభా-3-743-వ.
వరతపోయోగవిద్యాసమాధి యుక్తుం డగుచు ఋషివేషధరుండును హృషీకాత్ముండును నై ఋషిగణంబులం బుట్టించి సమాధి యోగైశ్వర్య తపోవిద్యా విరక్తి యుక్తం బగు నాత్మీయ శరీరాంశంబు వారికిం గ్రమంబున నొక్కొక్కనికి నిచ్చె"నని మైత్రేయుండు సెప్పిన విని విదురుండు పరమానందంబునం బొంది గోవిందచరణారవిందంబులు డెందంబునం దలంచి వెండియు మైత్రేయునిం జూచి యిట్లనియె.
టీక:- వర = శ్రేష్ఠమైన; తపస్ = తపస్సు; యోగ = యోగము; విద్యా = జ్ఞానము; సమాధి = సమాధి అను వానితో; యుక్తుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; ఋషి = ఋషి యొక్క; వేష = వేషమును; ధరుండున్ = ధరించినవాడును; హృషీక = ఇంద్రియములు; ఆత్ముండును = కలిగినవాడును; ఐ = అయ్యి; ఋషి = ఋషుల; గణంబులన్ = సమూహములను; పుట్టించి = సృష్టించి; సమాధి = సమాధి; యోగ = యోగము; ఐశ్వర్య = ఐశ్వర్యము; తపస్ = తపస్సు; విద్యా = జ్ఞానము; విరక్తి = వైరాగ్యము లతో; యుక్తంబున్ = కూడినది; అగున్ = అయిన; ఆత్మీయ = తన; శరీర = శరీరము యొక్క; అంశంబున్ = అంశను, భాగమును; వారి = వారి; కిన్ = కి; క్రమంబునన్ = వరుసగా; ఒక్కొక్కని = ఒక్కొక్కరి; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; విదురుండు = విదురుడు; పరమ = అత్యధికమైన; ఆనందంబునన్ = ఆనందమును; పొంది = పొంది; గోవింద = నారాయణుని {గోవిందుడు - గో (జీవుల)కు ఒడయుడు, విష్ణువు}; చరణ = పాదములు అనెడి; అరవిందంబులున్ = పద్మములను; డెందంబునన్ = మనసులో; తలంచి = తలచుకొని; వెండియున్ = మరల; మైత్రేయునిన్ = మైత్రేయుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- బ్రహ్మ శ్రేష్ఠమైన తపస్సు, యోగం, విద్య, సమాధి వీటితో కూడినవాడై ఋషివేషాన్ని ధరించి, ఇంద్రియాలతో కలిసిన ఆత్మస్వరూపుడై ఋషిగణాలను సృష్టించి, వారికి తన శరీరాంశాలైన సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వైరాగ్యం అనే వాటిని క్రమంగా ఒక్కొక్కరికి సంక్రమింపచేసాడు” అని మైత్రేయుడు తెలియజేయగా విని విదురుడు మహానందం పొంది గోవిందుని పాదారవిందాలను తన మనస్సులో స్మరించి, మళ్ళీ మైత్రేయునితో ఈ విధంగా అన్నాడు.

తెభా-3-744-సీ.
"రగుణ స్వాయంభుమనువంశం బిలఁ-
రమ సమ్మతము దప్పదు తలంపఁ
గొనకొని తద్వంశమున మిథునక్రియఁ-
జేసి ప్రజావృద్ధిఁ జెప్పితీవు
దియునుగాక స్వాయంభువ మనువుకుఁ-
బూని ప్రియవ్రతోత్తాపాదు
ను నందనులు గలరంటివి వారు స-
ప్తద్వీపవతి యైన ధాత్రినెల్ల

తెభా-3-744.1-తే.
ర్మమార్గంబు లేదియుఁ ప్పకుండ
నఘులై యెట్లు పాలించి య్య! వారి
రిత మెల్లను సత్కృపా నితబుద్ధి
నెఱుఁగ వినిపింపు నాకు మునీంద్రచంద్ర!

టీక:- వర = శ్రేష్ఠమైన; గుణ = గుణములు కలవాడ; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మను = మనువు యొక్క; వంశంబున్ = వంశము; ఇలన్ = భూమిమీద; పరమ = మికిలి; సమ్మతము = ఒప్పియున్నది; తప్పదు = తప్పదు; తలపన్ = తలచుకొన; గొనకొని = పూని; తత్ = అతని; వంశమునన్ = వంశమున; మిధునక్రియన్ = సంభోగము {మిధునక్రియ - భార్యాభర్తల విధానము, సంభోగము}; చేసి = వలన; ప్రజా = సంతానము; వృద్ధిన్ = వృద్ధిపొందుటను; చెప్పితివి = చెప్పితివి; ఈవు = నీవు; అదియునన్ = అంతే; కాక = కాకుండగ; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మనువున్ = మనువున; కున్ = కు; పూని = పూని; ప్రియవ్రత = ప్రియవ్రతుడును; ఉత్తానపాదులు = ఉత్తానపాదుడును; అను = అనెడి; నందనులు = పుత్రులు; కలరు = ఉన్నారు; అంటివి = అన్నావు; వారు = వారు; సప్త = ఏడు (7); ద్వీపవతి = ద్వీపములు కలది; ఐన = అయినట్టి; ధాత్రిన్ = భూమిని; ఎల్లన్ = అంతను;
ధర్మ = ధర్మబద్ధమైన; మార్గంబులున్ = విధానములు; ఏదియున్ = ఏ ఒక్కటియును; తప్పకుండన్ = తప్పకుండగ; అనఘులు = పాపములు లేనివారు; ఐ = అయ్యి; ఎట్లు = ఏవిధముగ; పాలించిరి = పరిపాలించిరి; అయ్య = తండ్రి; వారి = వారి యొక్క; చరితమున్ = వర్తనములు; ఎల్లను = సమస్తమును; సత్ = మంచి; కృపా = దయతోకూడిన; నిరత = మిక్కిలి ఆసక్తికొన్న; బుద్ధిన్ = బుద్ధితో; ఎఱుగన్ = తెలియునట్లు; వినిపింపు = వినిపించుము; నాకున్ = నాకు; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠమైనవారిలో; చంద్ర = చక్కనివాడ.
భావము:- ఉత్తమ గుణాలు కల మైత్రేయా! భూమిమీద స్వాయంభువ మనువు వంశం ధర్మసమ్మతమనీ, ఆ వంశంలో స్త్రీపురుష యోగం వల్ల ప్రజావృద్ధి జరిగిందనీ నీవు చెప్పావు. అంతేకాక ఆ స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారనీ అన్నావు. వారు ఏడు దీవులతో కూడిన భూమండలమంతా ధర్మమార్గం ఎంతమాత్రం తప్పకుండా పుణ్యాత్ములై ఎట్లా పాలించారు? ఓ మునివరా! వారి చరిత్ర అంతా నాకు దయార్ద్రబుద్ధితో వివరించు.

తెభా-3-745-వ.
అదియునుగాక; తన్మనుపుత్రియు యోగలక్షణసమేతయు నగు దేవహూతి యను కన్యకారత్నంబును స్వాయంభువుండు గర్దమునకు నే విధంబునం బెండ్లిచేసె; నా దేవహూతి యందు మహాయోగి యయిన కర్దముండు ప్రజల నేలాగునం బుట్టించె; నదియునుం గాక కర్దముండు రుచి యను కన్యను దక్షప్రజాతికి నిచ్చె నని చెప్పితి; వవి యన్నియుఁ దెలియ నానతీయవలయు"నని యడిగిన విదురు నకు మైత్రేయుం డిట్లనియె.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; తత్ = ఆ; మను = మనువు యొక్క; పుత్రియు = పుత్రికయును; యోగ = యోగాభ్యాసుల; లక్షణ = లక్షణములుతో; సమేతయున్ = కూడినదియును; అగు = అయిన; దేవహూతి = దేవహూతి; అను = అనెడి; కన్యకా = కన్యలలో; రత్నంబును = గొప్పామెను; స్వాయంభువుండు = స్వాయంభువుడు; కర్దమున్ = కర్దమున; కున్ = కు; ఏ = ఏ; విధంబునన్ = విధముగ; పెండ్లి = వివాహము; చేసెన్ = చేసెను; ఆ = ఆ; దేవహూతి = దేవహూతి; అందున్ = అందు; మహా = గొప్ప; యోగి = యోగి; అయిన = అయినట్టి; కర్దముండు = కర్దముడు; ప్రజలన్ = సంతానమును; ఏలాగునన్ = ఏవిధముగ; పుట్టించెన్ = పుట్టించెను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; కర్దముండు = కర్దముడు; రుచి = రుచి; అను = అనెడి; కన్యను = కన్యను; దక్ష = దక్షుడు అను; ప్రజాపతి = ప్రజాపతి; కిన్ = కి; ఇచ్చెను = ఇచ్చెను; అని = అని; చెప్పితివి = చెప్పినావు; అవి = అవి; అన్నియున్ = అన్నిటిని; తెలియన్ = తెలియునట్లు; ఆనతీయవలయును = చెప్పుము; అని = అని; అడిగినన్ = అడుగగా; విదురునన్ = విదురుని; కున్ = కి; మైత్రేయుండు = మైత్రేయుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అంతేకాక ఆ స్వయంభువ మనువు యోగలక్షణ సంపన్నురాలైన తన కుమార్తె దేవహూతి అనే కన్యారత్నాన్ని ఏ విధంగా కర్దముడనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసాడు? ఆ దేవహూతి యందు మహాయోగీశ్వరుడైన కర్దముడు ఏ విధంగా సంతానాన్ని కన్నాడు? అంతేకాక ఆ కర్దమ ప్రజాపతి తన కూతురైన రుచి అనే కన్యను దక్షప్రజాపతికి ఇచ్చాడని నీవు చెప్పావు. ఆ రుచి యందు దక్షప్రజాపతి ప్రజలను ఎట్లా సృష్టించాడు? ఇవన్నీ వివరంగా నాకు చెప్పు” అని అడుగగా మైతేయుడు ఇలా అన్నాడు.