పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/దితి గర్భంబు ధరించుట

వికీసోర్స్ నుండి


తెభా-3-470-క.
మునుకొని లజ్జావనత వ
యై ప్రాణేశు కొంగుఁ దాలిమి దూలం
బెనఁగొనియె వారకామిని
నువున వినిషిద్ధకర్మ మందభిముఖి యై.

టీక:- మునుకొని = పూనుకొని; లజ్జా = సిగ్గుచేత; అవనత = దింపబడిన; వదన = ముఖము కలది; ఐ = అయి; ఫ్రాణేశు = భర్త యొక్క {ప్రాణేశుడు - ప్రాణములకు ఈశుడు, భర్త}; కొంగు = కొంగు {కొంగు - వంటిమీది వస్త్రపు చివర}; తాలిమి = స్థానము నుండి; తూలన్ = తొలగిపోగా; పెనగొనియెన్ = కౌగలించుకొనెను; వారకామిని = వేశ్య యొక్క; అనువునన్ = ఒడుపుతో; వినిషిద్ధ = మిక్కిలి నిషేధింపబడిన; కర్మము = కార్యము; అందున్ = అందు; అభిముఖి = సిద్ధపడినామె; ఐ = అయి.
భావము:- దితి తన పట్టు వదలకుండా సిగ్గుతో తలవంచుకొని, ఇది తగనిపని అనికూడా చూడకుండా సహనం కోల్పోయి వారకాంతలాగ కామోత్కంఠతో పతిని కౌగలించు కున్నది.

తెభా-3-471-వ.
ఇట్లు సేసిన భార్యా నిర్బంధంబునకుం దొలంగ నేరక, యీశ్వరునకు నమస్కారం బొనరించి యేకాంతంబున నిజకాంతాసంగమంబు దీర్చి సంగమానంతరంబున వార్చి స్నాతుం డై ప్రాణాయామం బొనర్చి విరజంబును సనాతనంబును నైన బ్రహ్మగాయత్రి జపియించె నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగా; చేసిన = చేయగా; భార్యా = భార్య; నిర్భందంబున్ = చేసిన వత్తిడి; కున్ = కి; తొలగన్ = తప్పించుకొన; నేఱక = లేక; ఈశ్వరున్ = భగవంతుని; కున్ = కి; నమస్కారంబున్ = నమస్కారము; ఒనరించి = చేసి; ఏకాంతంబునన్ = ఒంటరి తావు నందు; నిజ = తన; కాంతా = భార్య యొక్క; సంగమంబు = కలయిక, సంభోగము; తీర్చి = పూర్తిచేసి; సంగమ = కలయిక, సంభోగము; అనంతరంబునన్ = తరువాత; వార్చి = ప్రక్షాళనము చేసికొని; స్నాతుండు = స్నానము చేసినవాడు; ఐ = అయి; ప్రాణాయామంబున్ = ప్రాణాయామము {ప్రాణాయామము - ప్రాణము (ముక్కుపుటముల యందు సంచరించెడి వాయువు) ద్వారా పంచప్రాణములను నియమించుట}; ఒనర్చి = చేసికొని; విరజంబునున్ = సాత్వికమైనదియును {విరజము - రజస్తమో గుణులు లేనిది, సాత్వికము}; సనాతనంబున్ = మిక్కిలి పురాతనమైనదియును; బ్రహ్మగాయత్రి = ఓంకారమును ఉచ్చరించుట {బ్రహ్మగాయత్రిన్ = ప్రణవమును అని మహాపండితులు బ్రహ్మశ్రీ విద్వాన్ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులువారి శ్రీమదాంధ్ర మహాభాగవతము నందలి టిప్పణి లో వ్రాసినది.}; జపియించెన్ = జపించెను; అంతన్ = అంతట;
భావము:- ఇలా చేస్తున్న ఇల్లాలు నిర్భందాన్ని వదిలించుకోలేక, కశ్యపప్రజాపతి ఈశ్వరునకు నమస్కారం చేసి ఏకాంతంగా తన కాంత కోరిక తీర్చాడు. వెంటనే కాళ్ళు చేతులు కడుగుకొని స్నానంచేసి ప్రాణాయామ పూర్వకంగా, శాశ్వతమూ, పరమ పవిత్రమైన బ్రహ్మ గాయత్రీ మంత్రాన్ని జపించాడు.

తెభా-3-472-క.
దితియును నిషిద్ధకర్మ
స్థితి కై మదిలోన సిగ్గు చిట్టాడఁగ నా
వదన యగుచు నా పశు
తివలని భయంబు గల్గి రమప్రీతిన్.

టీక:- దితియునున్ = దితికూడ; నిషిద్ధ = కూడని; కర్మ = పని; స్థితి = జరిగినదాని; కై = కోసము; మదిన్ = మనసు; లోనన్ = లోపల; సిగ్గ = లజ్జ; చిట్టాడగన్ = మెదులుతుండగా; ఆనత = వంచిన; వదన = ముఖము కలది; అగుచున్ = అవుతూ; ఆ = ఆ; పశుపతి = పరమశివుని {పశుపతి - పశు (పాశబద్దులు) లకు పతి (ప్రభువు), శంకరుడు}; వలని = వలన; భయంబున్ = భయము; కల్గి = పొంది; పరమ = మిక్కిలి; ప్రీతిన్ = ప్రేమగా.
భావము:- దితికూడా కూడనిపని చేసినందుకు మనస్సులో సిగ్గు అతిశయించగా తలవంచుకున్నది. పశుపతి యైన రుద్రుడు ఏమి చేస్తాడో అనే సంశయంతో, భయంతో, తన భర్త కశ్యపునితో ఎంతో ప్రియంగా ఇలా అన్నది

తెభా-3-473-వ.
కశ్యపు గనుంగొని యిట్లనియె "సమస్తభూతపతి యైన పరమేశ్వరుండు నా చేసిన యపరాధంబు సహించి మద్గర్భ పరిపాలనంబు సేయుంగాక; రుద్రుండును, మహాత్ముండును, స్వయంప్రకాశుండును, నలఘ్యుండును, సకామజన ఫలప్రాపకుండును, దుష్టశిక్షకుండును, బరమాత్ముండును, జగదంతర్యామియు, నిర్గుణుడును, నిష్కాముండును, భక్తసులభుండును, భగవంతుండును నగు నప్పరమేశ్వరునకు నమస్కరించెద; మఱియు, షడ్గుణైశ్వర్య సంపన్నుండును, జగద్భర్తయు, మహానుగ్రహశీలుండును, నిర్దయాపరిపాల్యవధూ రక్షకుండును, సతీదేవిపతియు నైన యా పరమేశ్వరుండు నన్ను రక్షించుగాత"మని సన్నుతించి.
టీక:- కశ్యపున్ = కశ్యపుడిని; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను; సమస్త = సమస్తమైన; భూత = జీవులకు {సమస్తభూతపతి - సమస్తమైన భూత (జీవులకు) పతి (భర్త), శంకరుడు}; పతి = భర్త; ఐన = అయిన; పరమేశ్వరుండు = పరమశివుడు {పరమేశ్వరుడు - అత్యున్నతమైన ఈశ్వరుడు, శంకరుడు}; నాన్ = నేను; చేసిన = చేసినట్టి; అపరాధంబున్ = తప్పును; సహించి = ఓర్చి; మత్ = నా యొక్క; గర్భ = గర్భమును; పరిపాలనంబున్ = కాపాడుట; చేయుంగాక = చేయుగాక; రుద్రుండునున్ = పరమ శివుడు {రుద్రుడు - రౌద్రము స్వరూపముగా కలవాడు, శంకరుడు}; మహాత్ముండునున్ = పరమ శివుడు {మహాత్ముడు - గొప్ప ఆత్మ కలవాడు, గొప్పవాడు}; స్వయంప్రకాశుండు = పరమ శివుడు {స్వయంప్రకాశుడు - స్వయముగ (తనంతతాను) ప్రకాశము కలవాడు, శంకరుడు}; అలంఘ్యుండున్ = పరమ శివుడు {అలంఘ్యుడు - ఉల్లంఘించుటకు రానివాడు, శంకరుడు}; సకామజనఫలప్రాపకుండును = పరమ శివుడు {సకామజనఫలప్రాపకుడు - కోరికలుకల జనులకు ఫలితము పొందించువాడును, శంకరుడు}; దుష్టశిక్షకుండును = పరమ శివుడు {దుష్టశిక్షకుడు - దుష్టులను శిక్షించువాడును, శంకరుడు}; పరమాత్ముండును = పరమ శివుడు {పరమాత్ముడు - సమస్తమునకును పరము (పైన ఉండునది) ఆత్మ యైనవాడును, శంకరుడు}; జగదంతర్యామియు = పరమ శివుడు {జగదంతర్యామి - విశ్వము అందు అంతను వ్యాపించినవాడు, శంకరుడు}; నిర్గుణుడును = పరమ శివుడు {నిర్గుణుడు - త్రిగుణములు లేనివాడును, శివుడు}; నిష్కాముండునున్ = పరమ శివుడు {నిష్కాముడు – కామము లేనివాడు, శివుడు}; భక్తసులభుండును = పరమ శివుడు {భక్తసులభుడు - భక్తులకు సులువుగా లభించువాడు, శివుడు}; భగవంతుడునున్ = పరమ శివుడు {భగవంతుడు - మహిమ కలవాడు, శివుడు}; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరున్ = పరమ శివుడు {పరమేశ్వరుడు - అత్యున్నతమైన ఈశ్వరుడు, శంకరుడు}; కున్ = కి; నమస్కరించెదన్ = నమస్కారము చేసెదను; మఱియున్ = ఇంకనూ; షడ్గుణైశ్వర్యసంపన్నుండును = పరమ శివుడు {షడ్గుణైశ్వర్యసంపన్నుడు - షట్ (ఆరు) గుణములు అను ఐశ్వర్యము సంపద కలవాడు, శంకరుడు}; జగద్భర్తయున్ = పరమ శివుడు {జగద్భర్త - జగత్తు నకు భర్త (ప్రభువు), శంకరుడు}; మహానుగ్రహశీలుండునున్ = పరమ శివుడు {మహానుగ్రహశీలుడు - గొప్పగా అనుగ్రహించు శీలము (ప్రవర్తన) కలవాడు, శంకరుడు}; నిర్దయాపరిపాల్యవధూరక్షకుండును = పరమ శివుడు {నిర్దయాపరిపాల్యవధూరక్షకుడు - నిర్దయ (దయలేని) పరిపాల్య ( పరిపాలింపబడు) వధువులకు రక్షకుడు (రక్షించువాడు), శంకరుడు}; సతీదేవిపతియునున్ = పరమ శివుడును {సతీదేవిపతి - పార్వతీపతి, శంకరుడు}; ఐన = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = పరమ శివుడు; నన్నున్ = నన్ను; రక్షించు = కాపాడ; కాతము = వలసినది; అని = అని; సన్నుతించి = ప్రార్థించి.
భావము:- దితి అప్పుడు కశ్యపుణ్ణి చూసి ఇలా అన్నది “సర్వభూత సంరక్షకుడైన పరమేశ్వరుడు నేను చేసిన అపరాధాన్ని క్షమించి నా గర్భాన్ని రక్షించు గాక; రుద్రుడు దయాసముద్రుడు, మహానుభావుడు, స్వయంప్రకాశకుడు. ఆయన అనుజ్ఞ దాటరానిది. ఆయన కోరికలు కలవారికి కోరికలు తీరుస్తాడు. కోరికలు లేనివారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. దుండగులను దండిస్తాడు. ధర్మదండాన్ని ధరిస్తాడు. దుర్జన శిక్షకుడూ, పరమాత్ముడూ, సర్వవ్యాపకుడూ, నిర్గుణుడూ, నిష్కాముడూ, భక్తసులభుడూ, సంపన్నుడూ, జగన్నాధుడూ, అపార కృపామయ హృదయుడూ, అత్యంత చింతాక్రాంతలైన కాంతలను కటాక్షించేవాడూ, సతీదేవి వల్లభుడూ అయిన సర్వేశ్వరుడు నన్ను మన్నించు గాక” అని సన్నుతించింది.

తెభా-3-474-క.
ర్భకులు లేని దగుటను
ర్భము నిజనాథువలనఁ మలానన కా
విర్భూత మైనఁ గర్మవి
నిర్భరపరితోష మాత్మ నెలకొని యుండెన్.

టీక:- అర్భకులు = పిల్లలు; లేనిది = లేనట్టిది; అగుటను = అగుట వలన; గర్భము = చూలు, కడుపు; నిజ = తన; నాథు = భర్త; వలనన్ = వలన; కమలానన = వనిత {కమలానన - పద్మములవంటి అననము (ముఖము) కలామె, స్త్రీ}; కున్ = కు; ఆవిర్భూతము = ఏర్పడినది; ఐనన్ = కాగా; కర్మ = పనికి; వినిర్భర = భరించలేనంత; పరితోషమున్ = సంతోషము; ఆత్మన్ = ఆత్మలో; నెలకొని = విలసిల్లి; ఉండెన్ = ఉండెను.
భావము:- పద్మాలలాంటి కన్నులు గల ఆ దితి సంతానము లేనిది కాబట్టి, తన వల్లభుని వల్ల తనకు గర్భం నిలిచినందుకు మనస్సులో ఎంతగానో సంతోషించింది.

తెభా-3-475-వ.
అంతఁ గశ్యపుండు దత్కాల సముచిత సంధ్యావందనంబులు దీర్చి.
టీక:- అంతన్ = అంతట; కశ్యపుండు = కశ్యపుడు; తత్ = ఆ; కాల = కాలమునకు; సముచిత = తగిన; సంధ్యావందనంబులున్ = సంధ్యావందనము; తీర్చి = చేసి.
భావము:- అంతట కశ్యపప్రజాపతి ఆ సమయానికి చేయవలసిన సంధ్యావందనం కార్యక్రమాలు ముగించుకున్నాడు.

తెభా-3-476-క.
చెలికి గర్భచిహ్నము
లేచినఁ బరితోషమాత్మ నేపారగ మా
రీచుండు నిజతలోదరిఁ
జూచి యకర్మమున కాత్మ స్రుక్కుచుఁ బలికెన్.

టీక:- ఆ = ఆ; చెలి = భార్య; కిన్ = కి; గర్భ = గర్భధారణ; చిహ్నములు = గుర్తులు; లేచిన = పొడచూపగా; పరితోషమున్ = సంతోషము; ఆత్మన్ = మనసులో; ఏపారగన్ = అతిశయించగా; మారీచుండు = కశ్యపుడు {మారీచుడు - మరీచి యొక్క కొడుకు, కశ్యపుడు}; నిజ = తన; తలోదరిన్ = భార్యను; చూచి = చూసి; అకర్మమున్ = కానిపని; కున్ = కు; ఆత్మన్ = ఆత్మలో; స్రుక్కుచున్ = బాధపడుతూ; పలికెన్ = పలికెను.
భావము:- తన భార్యకు గర్భం నిలిచినందుకు ఆ మరీచి పుత్రుడైన కశ్యపప్రజాపతి ఆనందం అతిశయించినా, చేయరాని పని చేసినందుకు మనస్సులో బాధపడుతూ, పల్చని ఉదరం గల సుందరి అయిన తన కాంతతో ఇలా అన్నాడు.

తెభా-3-477-మ.
"తి నీ వేగతి నిందకోడక మనోజాతేక్షు కోదండ ని
ర్గ నారాచపరంపరాహత వికీర్ణస్వాంతు వై పాపసం
తి లజ్జాభయ ధర్మముల్ విడిచి దుష్కాలంబు నందే రమిం
చితి బల్మిన్ వెలయాలి కైవడిని దుశ్శీలక్రియాలోలతన్.

టీక:- సతి = వనిత; నీవు = నీవు; ఏ = ఏ; గతిన్ = విధముగనూ; నింద = నింద; కున్ = కు; ఓడకన్ = జంకక; మనోజాత = మన్మథుని {మనోజాతుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; ఇక్షు = చెరకు; కోదండ = విల్లునుండి; నిర్గత = వెలువడిన; నారాచ = బాణముల; పరంపరా = గుంపులచే; హత = కొట్టబడి; వికీర్ణ = వికలమైన; స్వాంతువు = మనసు కలామెవు; ఐ = అయి; పాప = పాపము; సంగతిన్ = కలుగుటను; లజ్జా = సిగ్గు; భయ = భయము; ధర్మముల్ = ధర్మములను; విడిచి = విడిచిపెట్టి; దుష్కాలంబున్ = చెడ్డ సమయము; అందే = లోనే; రమించితి = సంభోగించితివి; బల్మిన్ = బలవంతముగా; వెలయాలి = వేశ్య {వెలయాలు - వెలయు (ఆవిధమగ నటించునది) ఆలు, వేశ్య}; కైవడిన్ = వలె; దుశ్శీల = చెడువర్తన; క్రియా = చేయు; లోలతన్ = చాంచల్యముతో.
భావము:- “ఇంతీ! దితి! నీవు మన్మథుని చెరుకువింటి నుంచి వెలువడిన పదునైన బాణ పరంపరల ధాటికి తట్టుకోలేక చెదరిన హృదయం కలదానివి అయి; లోకనిందకు జంకక; సిగ్గూ భయమూ విడిచిపెట్టి; ఆరాటంలో బలవంతంగా వెలయాలి వలే వ్యామోహానికి లొంగిపోయి సంగమించావు.

తెభా-3-478-వ.
అట్లగుటం జేసి.
టీక:- అట్లు = ఆ విధముగ; అగుటన్ = అవుట; చేసి = వలన.
భావము:- అలా జరుగుట వలన

తెభా-3-479-క.
తి విను భూతగణప్రే
రితులై రుద్రానుచరులు పృథుశక్తిసమ
న్వి లుగ్రకర్ము లతిశౌ
ర్యములు భద్రానుభద్రును నామములన్

టీక:- సతి = వనిత; విను = వినుము; భూతగణ = భూతగణములచే; ప్రేరితులు = ప్రేరేపింపబడినవారు; ఐ = అయి; రుద్ర = రుద్రుని; అనుచరులు = అనుచరులు; పృథు = మిక్కిలి; శక్తిన్ = శక్తితో; సమన్వితులు = కూడినవారు; ఉగ్ర = భయంకరమైన; కర్ములు = పనులు చేయువారు; అతి = మిక్కిలి; శౌర్యతములు = శౌర్యముఎక్కువగా ఉన్నవారు {శౌర్యము - శౌర్యతరము - శౌర్యతమము}; భద్ర = భద్రుడు; అనుభద్ర = అనుభద్రుడు; నామంబులన్ = పేర్లతో.
భావము:- భామా! నా మాట విను భూతగణాలచే ప్రేరేపించబడినవారై రుద్రుని అనుచరులు భద్రుడు, అనుభద్రుడు అనే వారిద్దరూ నీకు కుమారులై జన్మిస్తారు. వారు మిక్కిలి శక్తి సంపన్నులూ భయంకరమైన కార్యాలు చేసేవారు.

తెభా-3-480-క.
రఁగిన దర్పోద్ధతు లి
ద్దఱు గొడుకులు నీకుఁ బుట్టి రణికి వ్రేఁగై
నితము బుధజనపీడా
రులై వర్తింతు రాత్మ లగర్వమునన్.

టీక:- పరగినన్ = ప్రసిద్దిచెందిన; దర్ప = గర్వముతో; ఉద్దతులు = మిడిసిపడువారు; ఇద్దఱు = ఇద్దరు (2); కొడుకులున్ = పుత్రులు; నీకున్ = నీకు; పుట్టి = పుట్టి; ధరణి = భూమి; కిన్ = కి; వ్రేగు = భారము; ఐ = అయి; నిరతమున్ = ఎల్లప్పుడును; బుధ = జ్ఞానులగు; జన = జనులను; పీడా = పీడించుట యందు; పరులు = నిమగ్నులు; ఐ = అయి; వర్తింతురు = తిరుగుదురు; ఆత్మ = తమ; బల = బలము యొక్క; గర్వమునన్ = గర్వముతో.
భావము:- ఆ నీ కుమారులు మహా బలవంతులూ, అతి గర్విష్ఠులూ. వారిద్దరూ తమ పరాక్రమాటోపంతో నిరంతరమూ సజ్జనులను బాధిస్తూ భూమికి భారమైన వారు అవుతారు.

తెభా-3-481-తే.
ట్టి దుష్కర్ములకును మహాత్ము లలిగి
విశ్వవిదుఁ డైన హరికిని విన్నవింప
తఁడు కోపించి హరి కులిశాయుధమున
గిరుల నఱకినగతి వారిఁ ణి గూల్చు."

టీక:- అట్టి = అటువంటి; దుష్కర్ముల్ = చెడ్డ పనులు చేయువారి; కునున్ = కిని; మహాత్ములు = గొప్పవారు; అలిగి = కోపించి; విశ్వ = విశ్వమునకు; విదుడు = ఎరిగినవాడు; ఐన = అయిన; హరి = విష్ణుని; కిని = కి; విన్నవింపన్ = చెప్పుకొనగా; అతండు = అతడు; కోపించి = కోపించి; హరి = ఇంద్రుడు; కులిశాయుధమున = వజ్రాయుధముతో; గిరులన్ = కొండలను; నఱకిన = ఛేదించిన; గతిన్ = గతిన్; వారిన్ = వారిని; ధరణిన్ = నేల; కూల్చున్ = కూల్చును.
భావము:- అటువంటి దుష్కర్ముల, దుండగాలకు మహాత్ములు సహించలేకపోతారు. వారు సర్వజ్ఞుడైన విష్ణువుకు వీరి క్రూరకృత్యాలు, విన్నవించుకుంటారు. ఆయన ఆగ్రహించి ఇంద్రుడు వజ్రాయుధంతో కొండలను ఖండించినట్లు ఆ దుర్మార్గులను హతమారుస్తాడు. "

తెభా-3-482-క.
ని కశ్యపుఁ డెఱిఁగించిన
విని దితి భయ మంది చాల విహ్వలమతి యై
హృదయేశు ముఖాబ్జముఁ
నుగొని యిట్లనియె విగతకౌతుక యగుచున్.

టీక:- అని = అని; కశ్యపుడు = కశ్యపుడు; ఎఱిగించినన్ = తెలిపిన; విని = విని; దితి = దితి; భయమున్ = భయమును; అంది = పొంది; చాల = మిక్కిలి; విహ్వల = తల్లడిల్లిన; మతి = మనసు కలామె; ఐ = అయి; తన = తన; హృదయేశున్ = భర్త యొక్క {హృదయేశుడు - హృదయమునకు ప్రభువు, భర్త}; ముఖ = ముఖము అను; అబ్జమున్ = పద్మమును; కనుగొని = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియెన్ = పలికెను; విగత = పోయిన; కౌతుక = సంతోషము కలామె; అగుచున్ = అవుతూ.
భావము:- ఈవిధంగా తన పతి అయిన కశ్యపప్రజాపతి చెప్పగా విని దితి ఎంతో భయపడింది. చాలా ఆందోళన చెందింది. వెలవెలబోతున్న ముఖంతో భర్త ముఖము వైపు చూస్తూ ఇట్లా అన్నది.

తెభా-3-483-చ.
" సుజనాపరాధు లగు తామసచిత్తుల కెందు నాయువున్
సిరియు నశించిపోవు మృతి సేకుఱు శత్రులచేత నింత యౌ
యఁగ నిక్కువంబు భవదాత్మజు లార్యుల కెగ్గు సేసినం
రుణను వారు వారి మదిఁ గైకొని కావ ననుగ్రహింపరే."

టీక:- ధరన్ = భూమిమీద; సుజన = మంచివారి ఎడల; అపరాధులు = అపరాధము చేయువారు; అగు = అయిన; తామస = తామస గుణము కల; చిత్తులు = మనసు కలవారి; కున్ = కి; ఎందున్ = ఎక్కడైనా; ఆయువున్ = ఆయువుయును; సిరియున్ = సంపదయును; నశించి = నశించి; పోవు = పోవును; మృతిన్ = మరణము; చేకూఱున్ = సంభవించును; శత్రుల = శత్రువుల; చేతన్ = చేతిలో; ఇంతయున్ = ఇది అంతయును; ఔన్ = జరుగును; అరయగన్ = తరచి చూసిన; నిక్కువంబున్ = నిజముగా; భవత్ = నీ యొక్క; ఆత్మజులు = సంతానము; ఆర్యులు = సజ్జనుల; కున్ = కి; ఎగ్గు = అపకారము; చేసినన్ = చేసినప్పటికిని; కరుణన్ = కరుణతో; వారు = శ్రీమహావిష్ణువుల వారు; వారిన్ = తమ యొక్క; మదిన్ = మనసున; కైకొని = స్వీకరించి; కావన్ = కాపాడుటను; అనుగ్రహింపరే = ప్రసాదించరా ఏమి.
భావము:- “అవునండి. లోకంలో తామసగుణం మనసు నిండా ఉన్నవారు మంచివారికి అపరాధం చేస్తారు. వారు తమ ఆయుస్సు, సంపదలు నష్టపోయి శత్రువుల చేతిలో అకాల మరణం పొందుతారు. ఇది లోకసహజమే కానీ. నీ పుత్రులు సజ్జనులకు ఎంత అపకారాలు చేసినా కూడా, శ్రీమహావిష్ణువుల వారు దయార్థ్రహృదయులు కనుక దయతలచి వారిని కాపాడరా?”

తెభా-3-484-చ.
వుడుఁ గశ్యపుండు గమలానన కిట్లను "నింతి! నీవు చే
సి విపరీతకర్మమునఁ జేకుఱె నిట్టి యవస్థ దీనికిన్
మునఁ దాప మొందకుము మాధవుపాదసరోజయుగ్మచిం
మునఁ జేసియున్ నను ముదంబునఁ గొల్చుట జేసియుం దగన్.

టీక:- అనవుడు = అనగా; కశ్యపుండు = కశ్యపుడు; కమలానన = అందగత్తె {కమలానన - పద్మములవంటి అననము (ముఖము) కలామె, స్త్రీ}; కున్ = కి; ఇట్లు = ఈవిధముగా; అను = అనెను; ఇంతి = స్త్రీ; నీవు = నీవు; చేసిన = చేసిన; విపరీత = చేయరాని; కర్మమునన్ = పనివలన; చేకూఱెన్ = సంభవించినది; ఇట్టి = ఇటువంటి; అవస్థ = పరిస్థితి; దీనికిన్ = ఇందుకోసము; మనమునన్ = మనసులో; తాపమున్ = బాధ; ఒందకుము = పొందకుము; మాధవున్ = విష్ణుని {మాధవుడు - మాధవికి ధవుడు (భర్త), విష్ణువు}; పాద = పాదములు అను; సరోజ = పద్మముల; యుగ్మ = జంట యందలి; చింతనమునన్ = ధ్యానమును; చేసియున్ = చేయటం; ననున్ = నన్ను; ముదంబున్ = సంతోషముగా; కొల్చుటన్ = సేవించుట; చేసియున్ = చేయటం; తగన్ = అవశ్యము.
భావము:- ఇలా చెప్పిన దితితో కశ్యపప్రజాపతి ఇలా అన్నాడు “ఓ అందమైన దితీదేవీ! నీవు చేసిన ఈ తప్పు వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది. సరేకాని, దీనికి మనసులో బాధపడకు. శ్రీమహావిష్ణువు పాదపద్మాలను ధ్యానించటం, నన్ను సంతోషంగా సేవించటం తప్పక చెయ్యి.

తెభా-3-485-తే.
మణి! నా సుతు లందు హిణ్యకశిపు
లన నుదయించువారి లోల ముకుంద
దసరోజాత విన్యస్తభావుఁడైన
నయుఁ డుదయింపగలఁ డతిధార్మికుండు.

టీక:- రమణీ = వనిత; నా = నా; సుతులు = సంతానము; అందున్ = లో; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుని; వలనన్ = వలన; ఉదయించు = పుట్టు; వారిన్ = వారి; లోపల = లోపల; ముకుంద = విష్ణుని {ముకుందుడు - ముకుంద మాల ధరించువాడు, విష్ణువు}; పద = పాదములు అను; సరోజాత = పద్మముల యందు {సరోజాతము - సరసున జాతము (పుట్టునది), పద్మము}; విన్యస్త = అర్పణ చేయబడిన; భావుడు = భావములు కలవాడు; ఐన = అయినట్టి; తనయుడు = కొడుకు; ఉదయింపన్ = పుట్ట; కలడు = పోవుచున్నడు; అతి = మిక్కిలి; ధార్మికుడు = ధర్మవర్తన కలవాడు.
భావము:- బహు రమణీయమైన సుందరీమణీ! దితీ దేవి! నా కొడుకులలో హిరణ్యకశిపుడికి గొప్ప ధార్మికుడు, గొప్ప విష్ణుభక్తుడు అయిన కొడుకు పుడతాడు. అతను శ్రీహరి పాదాలపై అర్పించబడిన మనసు కలవాడు అవుతాడు.

తెభా-3-486-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకనూ.
భావము:- అంతేకాకుండా.

తెభా-3-487-క.
పుణ్యుఁడు నన్వయపా
నుఁ డగు నప్పుణ్యతముని రకీర్తిలతల్
జభవాండోదర మె
ల్లను నిండఁగ బర్వు బుధలలాముం డగుటన్.

టీక:- ఘన = గొప్ప; పుణ్యుడున్ = పుణ్యము చేసినవాడు; అన్వయ = వంశమును; పావనుండు = పావనము చేయువాడు; అగు = అయిన; ఆ = ఆ; పుణ్యతమునిన్ = మిక్కిలి పుణ్యుని {పుణ్యుడు - పుణ్యతరుడు - పుణ్యతముడు}; వర = శ్రేష్ఠమైన; కీర్తి = కీర్తి అను; లతల్ = లతలు; వనజభవాండ = బ్రహ్మాండము యైక్క {వనజభవాండము - వనజము (పద్మము)న పుట్టినవాడు (బ్రహ్మ) + అండము, బ్రహ్మాండము}; ఉదరము = లోప లంతా; నిండగన్ = వ్యాపించునట్లు; పర్వున్ = పాకును; బుధ = బుధులలో; లలాముండు = శ్రేష్ఠుడు; అగుటన్ = అగుటవలన.
భావము:- మహా పుణ్యాత్ముడూ, వంశ పావనుడూ, బుధజన శ్రేష్ఠుడూ కావటంవల్ల, ఆ మహామహుని కీర్తిలతలు బ్రహ్మాండభాండం అంతా వ్యాపిస్తాయి.

తెభా-3-488-తే.
వామలోచన! వినుము, దుర్వర్ణహేమ
గ్నిపుటమునఁ బరిశుద్ధమై వెలుంగు
ట్లు దుష్టాత్మసంభవుఁ య్యు వంశ
పావనుం డగు హరిపాదక్తుఁ డగుట.

టీక:- వామ = చక్కటి; లోచన = కన్నులు ఉన్నదాన; వినుము = వినుము; దుర్వర్ణ = చెడు వన్నె, రంగు తగ్గిన; హేమము = బంగారము; అగ్నిన్ = నిప్పులలో; పుటమునన్ = పుటము పెట్టుట వలన; పరిశుద్ధము = బాగుగ శుభ్రపడినది; ఐ = అయి; వెలుంగున్ = ప్రకాశించిన; అట్లు = విధముగా; దుష్ట = చెడ్డ వాని; ఆత్మసంభవుడు = సంతానము; అయ్యున్ = అయినప్పటికిని; వంశ = వంశమును; పావనుండు = పవిత్రము చేయువాడు; అగున్ = అగును; హరి = విష్ణుని {హరి - సర్వ రక్షకుడు, విష్ణువు}; పాద = పాదములు అందు; భక్తుడు = భక్తి కలవాడు; అగుటన్ = అగుట వలన.
భావము:- వాలుకన్నులు గల అందగత్తెవి అయిన ఓ దితీ! అతడు దుర్మార్గుడైన హిరణ్యకశిపుని పుత్రుడే అయినప్పటికీ, శ్రీహరి పాద భక్తుడు కావటంవల్ల, మాసి రంగు తగ్గిన బంగారం అగ్నితో పరిశుద్ధమైనట్లు, వంశాని కంతా పరమ పవిత్రు డౌతాడు.

తెభా-3-489-తే.
అంచి తాష్టాంగయోగక్రియాకలాపు
లైన యోగీశ్వరులు నమ్మహానుభావు
తులశీలస్వభావవిజ్ఞానసరణిఁ
దాముఁ జరియింప నాత్మలఁ లతు రెపుడు.

టీక:- అంచిత = పూజనీయమైన; అష్టాంగయోగ = అష్టాంగయోగమును {అష్టాంగయోగ మార్గములు - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి అని ఎనిమిది (8)}; క్రియా = ఆచరించుట యందు; కలాపులు = నిమగ్నమైనవారు; ఐన = అయినట్టి; యోగీ = యోగులలో; ఈశ్వరులున్ = శ్రేష్ఠులు; ఆ = ఆ; మహానుభావున్ = గొప్పవానిని; అతుల = సాటిలేని; శీల = శీలము; స్వభావ = స్వభావము; విజ్ఞాన = విజ్ఞానము; సరణిన్ = ఒప్పు విధముగ; తాము = తాము; చరియింపన్ = వర్తించవలెనని; ఆత్మలన్ = మనసులలో; తలతురు = యత్నించెదరు; ఎపుడున్ = ఎల్లప్పుడును;
భావము:- శ్రేష్ఠమైన అష్టాంగ యోగక్రియలలో ఆరితేరిన మహా యోగీశ్వరులు సైతం ఆ మహానుభావుని సత్ప్రవర్తనకూ, సాధు శీలానికి మురిసిపోయి ఆయన అడుగుజాడలలో తాము కూడా నడవాలని తమ మనస్సులలో నిత్యమూ కోరుకుంటారు.

తెభా-3-490-ఉ.
హితాత్మకుండు సుగుణాంబుధి భాగవతోత్తముండు ల
క్ష్మీహిళాధినాథుఁ దులసీదళదాముఁ బరేశు నాత్మహృ
త్తారసంబు నందుఁ బ్రమదంబున నిల్పి తదన్యవస్తువుం
దా దిలో హసించు హరిదాస్యవిహారవినిశ్చితాత్ముఁడై.

టీక:- ఆ = ఆ; మహిత = గొప్ప; ఆత్మకుండు = ఆత్మ కలవాడు; సుగుణ = సుగుణములకు; అంబుధి = సముద్రము వంటివాడు; భాగవత = భాగవతులలో; ఉత్తముండు = శ్రేష్ఠుడు; లక్ష్మీమహిళాథినాథున్ = భగవంతుని {లక్ష్మీమహిళాథినాథుడు - లక్ష్మీ మహిళ (దేవి) అథినాథుడు (పతి), విష్ణువు}; తులసీదళదామున్ = భగవంతుని {తులసీదళదాముడు - తలసీ దళముల దామము (దండను) ధరించువాడు, విష్ణువు}; పరేశున్ = భగవంతుని {పరేశుడు - పర (పరము) నకు ఈశుడు (అధిపతి), విష్ణువు}; ఆత్మ = తన; హృత్ = హృదయము అను; తామరసంబు = పద్మము; అందున్ = లో; ప్రమదంబునన్ = సంతోషముతో; నిల్పి = స్థిరముగ ఉంచుకొని; తత్ = అతనికి, విష్ణునికి; అన్య = ఇతరమైన; వస్తువున్ = వస్తువులను గురించి చెప్పినను; తాన్ = తన; మది = మనసు; లోన్ = లోపల; హసించున్ = నవ్వుకొనును; హరి = విష్ణుని; దాస్య = సేవించుచు; విహార = తిరుగుట యందు; వినిశ్చిత = గట్టిగా నిర్ణయించుకొన్న; ఆత్ముడు = ఆత్మ కలవాడు; ఐ = అయి.
భావము:- అతను పరమ భగవద్భక్తులలో అగ్రగణ్యుడూ, సద్గుణాలకు సముద్రంవంటి వాడూ, మహితాత్ముడూ. ఆ మహానుభావుడు తన హృదయకమలంలో లక్ష్మిదేవి భర్తా, తులసి మాల ధరించువాడూ, పరాత్పరుడూ అయిన విష్ణువును సంతోషంగా నిరంతరం నిలుపుకొని ఆ హరిసేవా మార్గంలోనే జీవితమంతా నడవాలని నిశ్చయించుకున్నవాడు అయి లౌకికములైన వస్తువులను చులకనగా చూస్తాడు.

తెభా-3-491-వ.
అట్టి నీ పౌత్రుండు.
టీక:- అట్టి = అటువంటి; నీ = నీయొక్క; పౌత్రుండు = మనుమడు {పౌత్రుడు - పుత్రుని పుత్రుడు, మనవడు}.
భావము:- అటువంటి వాడు నీ మనుమడు

తెభా-3-492-సీ.
హిత దేహాద్యభిమానంబు దిగనాడి-
చిరతరాలంపటశీలుఁ డగుచుఁ
రసమృద్ధికి నాత్మఁ రితోష మందుచుఁ-
ర దుఃఖమునకుఁ దామును బొందు
నీ విశ్వ మంతయు నే విభుమయ మని-
యెవ్వని కరుణచే నెఱుఁగ నయ్యె
ట్టి యీశ్వరునిఁ దా నాత్మసాక్షిగ మోద-
డరంగఁ జూచు నన్యదృష్టి

తెభా-3-492.1-తే.
తి నిదాఘోగ్ర సమయంబు నందు నిఖిల
జంతు సంతాప మడఁగించు చంద్రుమాడ్కి
ఖిల జగముల దుఃఖంబు పనయించు
రూఢి నాతఁ డజాతవిరోధి యగుచు.

టీక:- మహిత = గొప్పదైన; దేహ = దేహము; ఆది = మొదలగు వాని ఎడల; అభిమానంబున్ = ఆసక్తిని; దిగనాడి = వదిలివేసి; చిరతర = ఎల్లప్పుడును; అలంపట = తగులుకొనని; శీలుండు = ప్రవర్తన కలవాడు; అగుచున్ = అవుతూ; పర = ఇతరుల; సమృద్ధి = అబివృద్ధి; కిన్ = కి; ఆత్మన్ = మనసులో; పరితోషమున్ = సంతోషమును; అందుచున్ = పొందుచూ; పర = ఇతరుల; దుఃఖమునన్ = దుఃఖమున; కున్ = కు; తాపమున్ = బాధను; పొందున్ = పొందును; ఈ = ఈ; విశ్వము = భువనము; అంతయున్ = అంతా; ఏ = ఏ; విభుని = ప్రభువు; మయము = తోనిండియున్నది; అని = అని; ఎవ్వని = ఎవని; కరుణన్ = కరుణ; చేన్ = చేత; ఎఱుగన్ = తెలియుట; అయ్యెన్ = జరిగెను; అట్టి = అటువంటి; ఈశ్వరునిన్ = భగవంతుని; తాన్ = తాను; ఆత్మసాక్షిగన్ = ఆత్మసాక్షిగా; మోదము = సంతోషము; అడరంగ = అతిశయించగా; చూచుచు = చూస్తూ; అనన్య = అన్యము అన్నది లేని; దృష్టిన్ = దృష్టితో; అతి = మిక్కిలి; నిదాఘ = భయంకరమైన; ఉగ్ర = వేసవికాలపు; సమయంబు = సమయము; అందున్ = లో;
నిఖిల = సమస్తమైన; జంతు = జంతువుల; సంతాపము = బాధ; అడగించు = అణగించు; చంద్రున్ = చంద్రుని; మాడ్కిన్ = వలె; అఖిల = సమస్తమైన; జగముల = లోకముల; దుఃఖంబులన్ = దుఃఖములను; అపనియించున్ = పొగొట్టును; రూఢిన్ = తప్పక; అతడు = అతడు; అజాత = పుట్టని; విరోధి = శత్రువుకలవాడు; అగుచున్ = అవుతూ.
భావము:- నీ మనుమడు శరీరాదులపై అభిమానం లేనివాడై వైరాగ్యంతో కూడిన స్వభావం కలవాడై ఇతరుల అభివృద్ధికి సంతోషిస్తూ, అలాగే ఇతరుల దుఃఖానికి, సంతాపం చెందుతూ ఉంటాడు. ఈ విశ్వం సమస్తమూ, భగవన్మయమని భావిస్తాడు. అటువంటి భావన భగవంతుని దయ వల్లనే కలిగిందని విశ్వసిస్తాడు. అటువంటి భగవంతుణ్ణి సంతోషంతో ఏకాగ్ర దృష్టితో, ఆత్మసాక్షిగా దర్శిస్తాడు. భయంకరమైన ఎండాకాలంలో సర్వజీవులకు తాపాన్ని పోగొట్టే చంద్రునిలా, సమస్త జీవుల సంతాపాన్ని పోగొడతాడు. ఆయనకు శత్రువు అనే వాడు ఉండనే ఉండడు.

తెభా-3-493-వ.
మఱియు, హరిధ్యాననిష్ఠాగరిష్ఠుం డగు నమ్మహాభాగవతాగ్రగణ్యుండు.
టీక:- మఱియున్ = ఇంకనూ; హరి = విష్ణుని; ధ్యాన = ధ్యానము యొక్క; నిష్ఠా = నిష్ఠలో; గరిష్ఠుడు = ఉన్నతమైనవాడు; అగు = అయిన; ఆ = ఆ; మహా = గొప్ప; భాగవత = భాగవతులలో; అగ్రగణ్యుడు = ముందు లెక్కింప వలసినవాడు;
భావము:- అంతేకాకుండా, ఆ హిరణ్యకశిపుని కుమారుడు శ్రీహరి ధ్యానంలో అత్యంతమైన నిష్ఠ కలవాడై పరమ భాగవతులలో అగ్రగణ్యుడు అవుతాడు.

తెభా-3-494-క.
విలాంతరంగ బహిరం
ములను స్వేచ్ఛానురూపలితుం డగు నా
లాధీశ్వరు కుండల
ణీయ ముఖంబుఁ జూచుఁ బ్రమదం బెసఁగన్.

టీక:- విమల = నిర్మల; అంతరంగ = మనసు నందును; బహిరంగములను = బాహ్య ప్రపంచములోను; స్వేచ్ఛా = స్వతంత్రతను; అనురూప = అనుగుణమును; కలితుండు = కలిగినవాడు; అగును = అగును; ఆ = ఆ; కమలాధీశ్వరు = విష్ణుని {కమలాధీశ్వరుడు - కమల (లక్ష్మీదేవి) అధీశ్వరుడు (భర్త), విష్ణువు}; కుండల = కుండలములతో; రమణీయ = సుందరమైన; ముఖంబున్ = ముఖమును; చూచున్ = చూచును; ప్రమదంబున్ = ప్రమోదము; ఎసగన్ = అతిశయించగా.
భావము:- నిర్మలమైన తన లోపలా వెలుపలా, సృష్టి అంతటా సర్వ రూపాలు తనవే అయిన, రమావల్లభుడూ అయిన విష్ణువు యొక్క మకరకుండలాలతో మనోహరమైన ముఖాన్ని సంతోషంగా సందర్శిస్తాడు.

తెభా-3-495-తే.
ఱియు నీ విశ్వ మా హరియము గాఁగ
నములోపలఁ దలచు నమ్మనునిభుండు
ను మహాత్ములలోన నీ నుమఁ డధికుఁ
నఁగ నుతికెక్కు"నంచుఁ గశ్యపుఁడు పలుక

టీక:- మఱియున్ = ఇంకనూ; ఈ = ఈ; విశ్వమున్ = జగత్తును; ఆ = ఆ; హరి = విష్ణునితో; మయమున్ = నిండినది; కాగన్ = అవ్వగా; మనమున్ = మనసు; లోపలన్ = లోపల; తలచున్ = అనుకొనును; ఆ = ఆ; మను = మనువులకు; నిభుండు = సాటియైనవాడు; మనున్ = చిరకాలము జీవించును; మహాత్ముల = గొప్పవారి; లోనన్ = అందు; నీ = నీ యొక్క; మనుమడు = మనవడు; అధికుడు = గొప్పవాడు; అనగన్ = అని; నుతి = ప్రసిద్ధి; కిన్ = కి; ఎక్కున్ = ఎక్కును; అంచున్ = అంటూ; కశ్యపుడు = కశ్యపుడు; పలుకన్ = పలుకగా;
భావము:- నీ మనుమడు మనువుతో సమానుడైన వాడు. మహానుభావులలో కెల్లా మహనీయునిగా కీర్తింపబడతాడు. తన మనస్సులో ఈ ప్రపంచమంతా హరిమయంగా తలంచుతాడు. మరియు మహాత్ము లందరిలో నీ మనుమడు మహనీయుడై కీర్తి పొందుతాడు” అని కశ్యపుడు చెప్పాడు.

తెభా-3-496-క.
విని తన తనయులు మధుసూ
నుచే హతు లగుదు రనుచుఁ న మనుమఁడు స
జ్జనుత భాగవతుం డగు
నుచు మదిం జాల దుఃఖ ర్షము లొదవన్.

టీక:- విని = విని; తన = తన; తనయులు = పుత్రులు; మధుసూదనున్ = విష్ణుని {మధుసూదనుడు - మధు అను రాక్షసుని సంహరించిన వాడు, విష్ణువు, విష్ణుసహస్రనామములలో 73వ నామం}; చేన్ = చేత; హతులు = మరణించినవారు; అగుదురు = అవుతారు; అనుచున్ = అని; తన = తన; మనుమడు = మనవడు; సత్ = మంచి; జన = వారిచే; నుత = కీర్తింపబడు; భాగవతుండు = భాగవతుడు {భాగవతుడు - భాగవత సంప్రదాయానుసారము వర్తించు వాడు}; అగున్ = అగును; అనుచున్ = అని; మదిన్ = మనసులో; చాలన్ = మిక్కిలి; దుఃఖ = దుఃఖము; హర్షములున్ = సంతోషములు; ఒదవన్ = కలుగగా.
భావము:- కశ్యపప్రజాపతి పలుకులు విన్న దితి తన కొడుకులు విష్ణువు చేతిలో మరణిస్తారన్న మాటకు విచారించింది. తన మనుమడు పరమ భాగవతుడై సజ్జనులచే గౌరవించబడువాడు అవుతాడన్న మాటకు ఎంతో సంతోషించింది.

తెభా-3-497-వ.
ఉండు నంత; నా దితియుఁ గశ్యపవీర్యసంభృతం బైన గర్భంబు దుర్భర తేజోభిరామంబును నన్య తేజోవిరామంబును దినదిన ప్రవర్థమానంబును నై నివ్వటిల్ల నిజోదరస్థితు లైన కుమారులమరదమను లై వర్తింపఁ గలరని చింతించుచు గర్భంబు శతవర్షంబులు ధరియించి యున్న యనంతరంబ.
టీక:- ఉండున్ = ఉండును; అంతన్ = అంతట; ఆ = ఆ; దితియున్ = దితికూడ; కశ్యప = కశ్యపుని; వీర్య = వీర్యముచే; సంభృతంబు = ధరింపబడినది; ఐన = అయిన; గర్భంబున్ = గర్భము; దుర్భర = భరింపరాని; తేజస్ = తేజస్సుత; అభిరామంబునున్ = ఒప్పుతున్నదియును; అన్య = ఇతర; తేజస్ = తేజస్సులకు; విరామంబునున్ = అంతము చేయునదియును; దినదిన = రోజురోజుకి; ప్రవర్థమానంబునున్ = పెరుగుతున్నదియును; ఐ = అయి; నివ్వటిల్ల = అతిశయించగా; నిజ = తన; ఉదర = కడుపులో; స్థితులు = ఉన్నవారు; ఐన = అయిన; కుమారులు = కొడుకులు; అమర = దేవతలను; దమనులు = హింసించువారు; ఐ = అయి; వర్తింపన్ = నడవ; కలరు = కలరు; అని = అని; చింతించుచున్ = బాధపడుతూ; గర్భంబున్ = గర్భమును; శత = వంద (100); వత్సరంబులు = సంవత్సరములు; ధరియించి = ధరించి; ఉన్న = ఉన్న; అనంతరంబున్ = తరువాత.
భావము:- ఇలా దితి దుఃఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉండగా, కశ్యపుని వీర్యంతో నిండిన దితి గర్భం భరింపరాని తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ, అన్య తేజస్సులను అతిశయిస్తూ, దినదినాభివృద్ధి పొందుతూ ఉంది.