Jump to content

పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/జగదుత్పత్తి లక్షణంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-197-క.
జాక్షయోగమాయా
నితం బగు విశ్వజననసంస్థానవినా
ముల తెఱఁ గెఱిఁగించుచు
ఘా! విష్ణుని మహత్త్వ భివర్ణింతున్.

టీక:- వనజాక్ష = కృష్ణుని; యోగ = యోగము యొక్క; మాయా = మాయ వలన; జనితంబు = పుట్టినది; అగు = అయిన; విశ్వ = విశ్వము యొక్క; జనన = పుట్టుక; సంస్థాన = మనుగడ; వినాశముల = లయమందుటల; తెఱంగు = విధమును; ఎఱింగించుచు = తెలుపుతూ; అనఘా = పుణ్యాత్ముడా; విష్ణుని = విష్ణుని {విష్ణవు – ప్రకాశమే తానైనవాడు, హరి}; మహత్త్వమున్ = గొప్పదనమును; అభివర్ణింతున్ = కీర్తించెదను.
భావము:- ఓ పుణ్యాత్ముడా! విష్ణుదేవుని యోగమాయాప్రభావం వల్ల ప్రాదుర్భవించిన ఈ ప్రపంచం పుట్టుకనూ, అభివృద్ధినీ, వినాశాన్నీ తెల్పుతూ మహావిష్ణువు మహిమలను అభివర్ణిస్తాను. ఆలకించు.

తెభా-3-198-సీ.
కలజీవుల కెల్లఁ బ్రకట దేహము నాత్మ-
నాథుండుఁ బరుఁడు నానావిధైక
త్యుపలక్షణహితుండు నగు భగ-
వంతుండు సృష్టిపూర్వంబు నందు
నాత్మీయమాయ లయంబు నొందిన విశ్వ-
ర్భుఁడై తాన యొక్కటి వెలుంగు
రమాత్ముఁ డభవుం డుద్రష్ట యయ్యు వ-
స్త్వంతర పరిశూన్యుఁ గుటఁ జేసి

తెభా-3-198.1-తే.
ద్రష్ట గాకుండు మాయాప్రధానశక్తి
తుల చిచ్ఛక్తి గలవాఁడు గుచుఁ దన్ను
లేనివానిఁగఁ జిత్తంబులోనఁ దలఁచి
ద్రష్ట యగుఁ దన భువననిర్మాణవాంఛ.

టీక:- సకలజీవులకెల్లబ్రకటదేహమున్ = విష్ణుమూర్తీ {సకలజీవులకెల్లఁబ్రకటదేహము - సమస్త జీవులకన్నిటియందు వ్యక్తమగు రూపముకలవాడు, విష్ణువు}; ఆత్మనాథుండు = విష్ణుమూర్తీ {ఆత్మనాథుండు - ఆత్మ (నాయొక్క) నాథుడు (ప్రభువు), విష్ణువు}; పరుడు = విష్ణుమూర్తీ {పరుడు - పరాత్పరుడు, విష్ణువు}; నానావిధైకమత్యుపలక్షణమహితుండు = విష్ణుమూర్తీ {నానావిధైకమత్యుపలక్షణమహితుండు - నానావిధైక (అనేకవిధములైన) మతి (బుద్దులకు) ఉపలక్షణ (ఉపలక్ష్ణణమైన) మహితుడు (గొప్పవాడు), విష్ణువు}; అగు = అయిన; భగవంతుండు = విష్ణుమూర్తీ {భగవంతుడు - మహిమాన్వితుడు, విష్ణువు}; సృష్టి = సృష్టిజరుగుటకు; పూర్వంబున్ = పూర్వము; అందున్ = అందు; ఆత్మీయ = తన యొక్క; మాయన్ = మాయ; లయంబున్ = లయమును; ఒందినన్ = పొందగా; విశ్వగర్భుడు = విష్ణుమూర్తీ {విశ్వగర్భుడు - విశ్వములను గర్భమున ధరించినవాడు, విష్ణువు}; ఐ = అయ్యి; తాన = తాను; ఒక్కటిన్ = ఒక్కడే అయ్యి; వెలుంగు = ప్రకాశించును; పరమాత్ముడు = విష్ణుమూర్తి {పరమాత్ముడు - పరమమైన ఆత్మకలవాడు, విష్ణువు}; అభవుండు = విష్ణుమూర్తి {అభవుండు - పుట్టుకలేనివాడు, విష్ణువు}; ఉపద్రష్ట = విష్ణుమూర్తి {ఉపద్రష్ట - (సర్వ)సాక్షి, విష్ణువు}; అయ్యున్ = అయినప్పటికిని; వస్త్వంతరపరిశూన్యుఁడు = విష్ణుమూర్తి {వస్త్వంతరపరిశూన్యుఁడు - తనుకాని వస్తువుఏదియు (మరియొకటి) అసలు లేనివాడు, విష్ణువు}; అగుటన్ = అవుట; జేసి = వలన; షవీ ద్రష్ట = చూచువాడు; కాకుండు = కాకుండ ఉండును; మాయా = మాయ అను; ప్రథాన = ముఖ్యమైన; శక్తిన్ = శక్తిచే; అతుల = సాటిలేని; చిచ్ఛక్తి = చైతన్యశక్తి {చిత్ + శక్తి - చిత్ + ఛక్తి (ఛత్వసంధి), చిత్ + ఛక్తి - చిచ్ఛక్తి (శ్చుత్వసంధి)}; కలవాడు = కలవాడు; అగుచున్ = అవుతూ; తన్ను = తనను; లేనివానిగన్ = లేనివాడిగా; చిత్తంబు = మనసు; లోనన్ = లోపల; తలంచి = భావించి; ద్రష్ట = చూచువాడు; అగున్ = అవును; తన = తన; భువన = విశ్వముల; నిర్మాణ = నిర్మించవలె నను; వాంఛన్ = కోరిక.
భావము:- ఈ విశ్వంలోగల సమస్త జీవుల దేహాలూ భగవంతుని స్వరూపాలు. సమస్తమైన ఆత్మలూ ఆయనే. ఆయనే సర్వానికీ ప్రభువు. పరాత్పరుడు. అనేక విధాలయిన బుద్ధులకు ఉపలక్షణమైన మహానుభావుడు. అటువంటి భగవంతుడు తన మాయవల్ల తన లోనే లీనమైన ప్రపంచాన్ని. తన గర్భంలో ధరించి ఒక్కడుగా అద్వైతుడై వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ పుట్టుక లేనివాడు. సమస్తమూ పై నుండి చూచేవాడు అయినప్పటికీ, వేరే మరే వస్తువూ లేకుండా తానే సర్వమూ అయినప్పుడు ఇక ద్రష్ట కాడు. కాని-మాయాప్రధాన శక్తి కలవాడై ప్రపంచాన్ని నిర్మించే కోరికతో గొప్ప చిచ్ఛక్తి గల్గి తనను తాను లేనివాడుగా మనస్సులో భావించు కొంటాడు. సృష్టికి ఉపక్రమించిన పిమ్మట ద్రష్ట అవుతాడు.

తెభా-3-199-తే.
బుద్ధిఁ దోచిన నమ్మహాపురుషవరుఁడు
కార్యకారణరూపమై నతకెక్కి
భూరిమాయాభిధాన విస్ఫురతశక్తి
వినుతికెక్కిన యట్టి యవిద్య యందు.

టీక:- బుద్ధిన్ = మనసున; తోచిన = కలిగిన; ఆ = ఆ; మహా = గొప్ప; పురుష = పురుషులలో; వరుడు = శ్రేష్ఠుడు; కార్య = కార్యములు; కారణ = కారణములు అను; రూపము = రూపము; ఐ = అయి; ఘనతన్ = గొప్పదనమున; కున్ = కు; ఎక్కి = చెంది; భూరి = అతివిస్తారమైన; మాయ = మాయ అను; అభిదాన = పేరున; విస్ఫురిత = వ్యక్తమగు; శక్తిన్ = శక్తిగ; వినుతి = ప్రసిద్ధి; కిన్ = కి; ఎక్కిన = ఎక్కిన; అట్టి = అటువంటి; అవిద్య = అవిద్య; అందున్ = లోపల.
భావము:- ఇలా భగవంతునికి సృష్టి చేయాలనే సంకల్పం కలగగానే కార్యకారణాల రూపమై ఘనత వహించినదై మహత్తరమైన మాయశక్తిగా ప్రకాశించే అవిద్య రూపొందుతుంది. అందు....

తెభా-3-200-క.
పురుషాకృతి నాత్మాంశ
స్ఫుణము గల శక్తి నిలిపి పురుషోత్తముఁ డీ
శ్వరుఁ డభవుం డజుఁడు నిజో
సంస్థిత విశ్వ మపుడుఁ గఁ బుట్టించెన్.

టీక:- పురుషా = పురుషుని; ఆకృతిన్ = రూపమున; ఆత్మ = తన; అంశ = అంశ; స్ఫురణము = తెలియుట; కల = కలిగిన; శక్తిన్ = శక్తిని; నిలిపి = ఉంచి; పురుషోత్తముడు = విష్ణువు {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; ఈశ్వరుడు = విష్ణువు {ఈశ్వరుడు - ప్రభావము కలవాడు, విష్ణువు}; అభవుడు = విష్ణువు {అభవుడు – పుట్టుక లేనివాడు, విష్ణువు}; అజుడు = విష్ణువు {అజుడు – జన్మము లేనివాడు, విష్ణువు}; నిజ = తన; ఉదర = కడుపులో; సంస్థిత = చక్కగా ఉండిన; విశ్వమున్ = విశ్వమును; అపుడున్ = అప్పుడు; తగన్ = తగినట్లుగ; పుట్టించెన్ = పుట్టించెను;
భావము:- తన అంశనుండి ఆవిర్భవించిన మాయను తన శక్తిగా ప్రతిష్ఠించి, పుట్టుక లేనివాడూ పురుషోత్తముడూ ఐన ఈశ్వరుడు తన కడుపులో ఉన్న విశ్వాన్ని ఉద్భవింపజేశాడు.