పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/స్వాయంభువు వంశ విస్తారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా- 4-3-సీ.
)
[మార్చు]

"జననాథ! విను విదురునకును మైత్రేయ;
మునినాథచంద్రుఁ డిట్లనియె "మరల
స్వాయంభువున కర్థి తరూపవలనను;
గూఁతులు మువ్వు రాకూతి దేవ
హూతి ప్రసూతులు నొనరఁ బ్రియవ్రతో;
త్తానపాదులు నను నయయుగము
నియింప నం దగ్రసంభవ యైన యా;
కూతిని సుమహిత భ్రాతృమతినిఁ

(తెభా- 4-3.1-తే.
)
[మార్చు]

నకు సంతాన విస్తరార్థంబు గాఁగఁ
బుత్రికాధర్మ మొంది యా పువ్వుఁబోఁడిఁ
బ్రకటమూర్తి రుచిప్రజాతికి నిచ్చె
నువు ముదమొంది శతరూప నుమతింప.

(తెభా- 4-4-వ.
)
[మార్చు]

అట్లు వివాహంబైన రుచిప్రజాపతి బ్రహ్మవర్చస్వియుఁ బరిపూర్ణగుణుండును గావునఁ జిత్తైకాగ్రతంజేసి యాకూతియందు శ్రీవిష్ణుండు యజ్ఞరూపధరుం డగు పురుషుండుగను జగదీశ్వరి యగు నాదిలక్ష్మి యమ్మహాత్మునకు నిత్యానపాయిని గావునఁ దదంశంబున దక్షిణ యను కన్యకారత్నంబుగను మిథునంబు సంభవించె; అందు స్వాయంభువుండు సంతుష్టాంతరంగుం డగుచుఁ బుత్రికాపుత్రుండును, వితతతేజోధనుండును, శ్రీవిష్ణుమూర్తి రూపుండును నగు యజ్ఞునిఁ దన గృహంబునకుఁ దెచ్చి యునిచె; రుచియుఁ గామగమన యైన దక్షిణ యను కన్యకాలలామంబును దన యొద్దన నిలిపె; అంత సకలమంత్రాధిదేవత యగు శ్రీయజ్ఞుండు దనుఁ బతిఁగంగోరెడు దక్షిణ యను కన్యకం బరిణయం బయ్యె; వార లాదిమిథునంబు గావున నది నిషిద్ధంబు గాకుండె" నని చెప్పి మైత్రేయుండు వెండియు నిట్లనియె.

(తెభా- 4-5-క.
)
[మార్చు]

"ధీ హిత! యంత వారల
యా మాఖ్యలు గలుగు దేవతావళి గడఁకన్
వే ఱు నభినందించుచు
నా మిథునమువలనఁ బుట్టె తి బలయుతమై.

(తెభా- 4-6-వ.
)
[మార్చు]

<a href="http://telugubhagavatam.org/?Details&Branch=anuyuktaalu&Fruit=Yamaa_ane_devathlu_12">వారు తోషుండును బ్రతోషుండును సంతోషుండును భద్రుండును శాంతియు నిడస్పతియు నిధ్ముండును గవియు విభుండును వహ్నియు సుదేవుండును రోచనుండును ననం బన్నిద్దఱు సంభవించిరి; (యజ్ఞుడు-దక్షిణల పుత్రులు); వారలు స్వాయంభువాంతరంబునం దుషితు లను దేవగణంబులై వెలసిరి; మఱియు మరీచి ప్రముఖులైన మునీశ్వరులును యజ్ఞుండును దేవేంద్రుండును మహాతేజస్సంపన్ను లయిన ప్రియవ్రతోత్తాన పాదులునుం గలిగి పుత్రపౌత్ర నప్తృవంశంబులచే వ్యాప్తంబయి యా మన్వంతరంబు పాలితంబగుచు వర్తిల్లె; మనువు ద్వితీయపుత్రి యైన దేవహూతిం గర్దమున కిచ్చి తద్వంశ విస్తారంబు గావించె నని మున్న యెఱింగించితి; వెండియు నమ్మనువు మూఁడవచూలైన ప్రసూతి యను కన్యకను బ్రహ్మపుత్రుం డగు దక్షప్రజాపతికి నిచ్చె; ఆ దక్షునకుఁ బ్రసూతివలన నుదయించిన ప్రజాపరంపరల చేత ముల్లోకంబులు విస్తృతంబు లయ్యె; మఱియుఁ గర్దమపుత్రికా సముదయంబు బ్రహ్మర్షిభార్య లగుటం జేసి వారివలనం గలిగిన సంతాన పరంపరల వివరించెద.</a>

21-05-2016: :