Jump to content

పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/దక్షాదుల శ్రీహరి స్తవంబు

వికీసోర్స్ నుండి


తెభా-4-167-చ.
రుచి నట్లు వచ్చిన వికారవిదూరు ముకుందుఁ జూచి బో
నరవిందనందన పురందర చంద్రకళాధ రామృతా
ముఖు లర్థి లేచి యతి సంభ్రమ మొప్ప నమో నమో దయా
నిధయే యటంచు ననివారణ మ్రొక్కిరి భక్తియుక్తులై.

టీక:- ఘన = గొప్ప; రుచిన్ = కాంతితో; అట్లు = అలా; వచ్చిన = రాగా; వికారవిదూరున్ = నారాయణునిని {వికార విదూరుడు – వికారముల (మార్పుల)కు మిక్కిలి దూరముగ ఉండువాడు, విష్ణువు}; ముకుందున్ = నారాయణుని; చూచి = చూసి; బోరన = వేగముగ; అరవిందనందన = బ్రహ్మదేవుడు {అరవింద నందన - అరవిందము (పద్మము) నందనుడు (పుత్రుడు), బ్రహ్మదేవుడు}; పురందర = ఇంద్రుడు {పురందరుడు – శత్రువులను నశింపజేయు వాడు, వ్యు. పూర్ దౄ(ణిచ్) ఖచ్ – ముమ్ – నిపా, ఇంద్రుడు}; చంద్రకళాధర = శివుడు {చంద్ర కళా ధర - చంద్రవంకను ధరించినవాడు, శివుడు}; అమృతాశన = దేవతా {అమృతాశనులు - అమృతము అశన (తినువారు) దేవతలు}; ముఖులు = ప్రముఖులు; అర్థిన్ = కోరి; లేచి = నిలబడి; అతి = మిక్కిలి; సంభ్రమము = ఉత్సాహము; ఒప్పన్ = ఒప్పియుండగ; నమః = నమస్కారము; నమః = నమస్కారము; దయావననిధయే = కృపకు సముద్రమైనవాడ; అటంచున్ = అంటూ; అనివారణన్ = అడ్డులేని విధముగ; మ్రొక్కిరి = నమస్కరించిరి; భక్తి = భక్తితో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి.
భావము:- ఆ విధంగా వచ్చిన వికారదూరుడైన ముకుందుని చూచి బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలైన దేవతలు లేచి “దయాసముద్రునకు నమస్కారం! నమస్కారం” అని భక్తితో మ్రొక్కారు.

తెభా-4-168-వ.
అట్లు కృతప్రణాములైన యనంతరంబ.
టీక:- అట్లు = ఆ విధముగ; కృత = చేసిన; ప్రణాములు = నమస్కరించినవారు; ఐ = అయ్యి; అనంతరంబ = తరువాత.
భావము:- ఆ విధంగా ప్రణామాలు చేసిన తరువాత...

తెభా-4-169-ఉ.
ళినాయతాక్షుని యనంత పరాక్రమ దుర్నిరీక్ష్య తే
జో నిహతస్వదీప్తు లగుచున్నుతిసేయ నశక్తులై భయ
గ్లాని వహించి బాష్పములు గ్రమ్మఁగ గద్గదకంఠులై తనుల్
మ్రానుపడంగ నవ్విభుని న్ననఁ గైకొని యెట్టకేలకున్.

టీక:- ఆ = ఆ; నళినాయతాక్షుని = నారాయణునిని {నళినాయతాక్షుడు - నళిని (కమలముల) ఆయత (వలె విశాలమైన) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; అనంత = అనంతమైన; పరాక్రమ = పరాక్రమములు; దుర్నిరీక్ష్య = చూచుటకు వీలుకాని; తేజస్ = తేజస్సుచేత; నిహత = బాగా కొట్టబడిన; స్వ = తమ; దీప్తిలు = కాంతులు కలవారు; అగుచున్ = అవుతూ; నుతి = స్తుతుల; చేయన్ = చేయుటకు; అశక్తులు = శక్తిలేనివారు; ఐ = అయ్యి; భయ = భయము; గ్లాని = దౌర్భల్యములను; వహించి = చెంది; బాష్పములు = కన్నీరు; క్రమ్మగ = కమ్ముకొనగ; గద్గద = బొంగురుపోయిన; కంఠులు = కంఠములు కలవారు; ఐ = అయ్యి; తనుల్ = దేహములు; మ్రానుపడంగ = నిశ్చేష్టితములుకాగ; ఆ = ఆ; విభున్ = ప్రభువు; మన్ననన్ = అనుగ్రహములను; కైకొని = స్వీకరించి; ఎట్టకేలకున్ = చివరికి.
భావము:- ఆ విష్ణుమూర్తి అఖండమైన పరాక్రమం వల్ల, తేరిచూడరాని తేజస్సు వల్ల దేవతలు నిర్ఘాంతపోతూ ఆయనను స్తుతించడానికి అశక్తులైనారు. భయకంపితులై కన్నీరు కారుస్తూ డగ్గుత్తికతో నిశ్చేష్టులై నిలబడి ఎట్టకేలకు కమాలాక్షుని కటాక్షం పొంది...

తెభా-4-170-వ.
నిటలతట ఘటిత కరపుటులై యమ్మహాత్ముని యపార మహిమం బెఱిఁగి నుతియింప శక్తులుగాక యుండియుఁ, గృతానుగ్రహవిగ్రహుం డగుటం జేసి తమతమ మతులకు గోచరించిన కొలంది నుతియింపఁ దొడంగి; రందు గృహీతంబు లగు పూజాద్యుపచారంబులు గలిగి బ్రహ్మాదులకు జనకుండును, సునంద నందాది పరమభాగవతజన సేవితుండును, యజ్ఞేశ్వరుండును నగు భగవంతుని శరణ్యునింగాఁ దలంచి దక్షుం డిట్లనియె; “దేవా! నీవు స్వస్వరూపంబునం దున్న యప్పు డుపరతంబులుగాని రాగాద్యఖిలబుద్ధ్యవస్థలచే విముక్తుండవును, నద్వితీయుండవును, జిద్రూపకుండవును, భయరహితుండవును నై మాయం దిరస్కరించి మఱియు నా మాయ ననుసరించుచు లీలామానుషరూపంబుల నంగీకరించి స్వతంత్రుండ వయ్యును, మాయా పరతంత్రుడవై రాగాది యుక్తుండునుం బోలె రామకృష్ణాద్యవతారంబులఁ గానంబడుచుందువు; కావున నీ లోకంబులకు నీవ యీశ్వరుండవనియు నితరులైన బ్రహ్మరుద్రాదులు భవన్మాయా విభూతు లగుటం జేసి లోకంబులకు నీశ్వరులుగా రనియును భేదదృష్టి గల నన్ను రక్షింపుము; ఈ విశ్వకారణు లైన ఫాలలోచనుండును బ్రహ్మయు దిక్పాలురును సకల చరాచర జంతువులును నీవ; భవద్వ్యతిరిక్తంబు జగంబున లే"దని విన్నవించినం దదనంతరంబ ఋత్విగ్గణంబు లిట్లనిరి.
టీక:- నిటలతట = నుదిటిపై; ఘటిత = హత్తించిన; కరపుటులు = జోడించిన చేతులు కలవారు; ఐ = అయ్యి; ఆ = ఆ; మహాత్ముని = మహాత్ముని; అపార = అంతులేని; మహిమన్ = మహిమను; ఎఱిగి = తెలిసి; నుతియింప = స్తుతించుటకు; శక్తులు = సామర్థ్యముల కలవారు; కాక = కాకపోయి; ఉండియున్ = ఉండినప్పటికిని; కృత = చేసిన; అనుగ్రహ = అనుగ్రహముల; విగ్రహుండు = విస్తారముగ కలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; తమతమ = ఎవరికి వారు వారి; మతుల్ = మనసున; కున్ = కు; గోచరించిన = కనిపించిన; కొలంది = వరకు; నుతియింపన్ = స్తుతియింప; తొడగిరి = మొదలిడిరి; అందున్ = వారిలో; గృహీతంబులు = స్వీకరించిన; అగు = అయిన; పూజ = పూజ; ఆది = మొదలగు; ఉపచారంబులు = సేవలు; కలిగి = కలిగుండి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలైనవారి; కున్ = కి; జనకుండును = తండ్రి, సృష్టికారణుండు; సునంద = సునందుడు; నంద = నందుడు; ఆది = మొదలైన; పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులచే; సేవితుండును = సేవింపబడువాడు; యజ్ఞ = యజ్ఞములకు; ఈశ్వరుండు = ప్రభువును; అగు = అయిన; భగవంతుని = విష్ణుమూర్తిని; శరణ్యునిన్ = శరణు వేడదగినవాడు; కాన్ = అగునట్లు; తలంచి = అనుకొని; దక్షుండు = దక్షుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; దేవా = భగవంతుడా; నీవు = నీవు; స్వ = స్వంత; స్వరూపంబున్ = స్వరూపములో; ఉన్నయప్పుడు = ఉన్నప్పుడు; ఉపరతంబులు = ఉడిగినవి; కాని = కానట్టి; రాగ = రాగము; ఆది = మొదలైన; అఖిల = సమస్తమైన; బుద్ధి = బుద్ధి యొక్క; అవస్థల = స్థితులు; చే = చేతను; విముక్తుండవును = విడువబడినవాడవు; అద్వితీయుండవును = సాటి లేనివాడవు; చిద్రూపకుండవును = చైతన్య స్వరూపుడవు; భయ = భయము; విరహితుండవును = అసలు లేనివాడవు; ఐ = అయ్యి; మాయన్ = మాయను; తిరస్కరించి = తిరస్కరించి; మఱియును = ఇంకను; ఆ = ఆ; మాయను = మాయను; అనుసరించుచు = అనుసరిస్తూ; లీలా = లీలగా ధరించిన; మానుష = మానవుల; రూపంబులనన్ = రూపములను; అంగీకరించి = స్వీకరించి; స్వతంత్రుడవు = స్వతంత్రుడవు; అయ్యును = అయినప్పటికిని; మాయా = మయకు; పరతంత్రుడవు = లొంగినవాడవు; ఐ = అయ్యి; రాగ = రాగము; ఆది = మొదలైనవానితో; యుక్తుండవున్ = కూడినవాని; పోలెన్ = వలె; రామ = రాముడు; కృష్ణ = కృష్ణుడు; ఆది = మొదలగు; అవతారంబులన్ = వతారములలో; కానంబడుచున్ = కనబడుతూ; ఉందువు = ఉండెదవు; కావున = అందుచేత; ఈ = ఈ; లోకంబులు = లోకముల; కున్ = కు; నీవ = నీవే; ఈశ్వరుండవు = ప్రభువు; అనియు = అని; ఇతరులు = మిగతావారు; ఐన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆదులు = మొదలైనవారు; భవత్ = నీ యొక్క; మాయా = మాయ యొక్క; విభూతులు = వైభవములు, జనించినవారు; అగుటన్ = అగుట; చేసి = వలన; లోకంబుల్ = లోకముల; కున్ = కు; ఈశ్వరులు = ప్రభువులు; కారు = కారు; అనియును = అని; భేద = వైమనస్య; దృష్టి = దృక్పదము; కల = కల; నన్ను = నన్ను; రక్షింపుము = కాపాడుము; ఈ = ఈ; విశ్వ = విశ్వమునకు; కారణులు = హేతువులు; ఐన = అయిన; ఫాలలోచనుండును = శివుడు {ఫాలలోచనుడు - ఫాలము (నుదురు) యందు లోచనుండు (కన్ను కలవాడు), శివుడు}; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; దిక్పాలురును = దిక్పాలకులును {దిక్పాలకులు - అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు}; సకల = సమస్తమైన; చర = చలనము కల; అచర = చలనము లేని; జంతువులును = జీవులును; నీవ = నీవే; భవత్ = నీకంటె; వ్యతిరిక్తంబు = వేరైనది; జగంబునన్ = లోకమున; లేదు = లేదు; అని = అని; విన్నవించిన = మనవిచేసిన; తదనంతరంబ = తరువాత; ఋత్విక్ = ఋత్విక్కుల; గణంబులు = సమూహములు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- దేవతలు నుదుట చేతులు ఉంచుకొని ఆ మహాత్ముని మహిమను తెలుసుకొని స్తుతించటానికి అసమర్థులైనప్పటికీ ఆయన అనుగ్రహాన్ని పొంది, తమకు చేతనయినట్లు కొనియాడసాగారు. భక్తుల పూజలు పరిగ్రహించేవాడు, బ్రహ్మాదులకు జనకుడు, సునందుడు నందుడు మొదలైన పరమ భక్తులచేత సేవింపబడేవాడు, యజ్ఞేశ్వరుడు అయిన భగవంతుణ్ణి రక్షకుడుగా భావించి దక్షుడు ఇలా స్తుతించాడు. “దేవా! నీవు స్వరూపంతో ఉన్నప్పుడు రాగద్వేషాలు లేని అద్వితీయుడవు, చిద్రూపుడవు, నిర్భయుడవు. ఒకసారి మాయను నిరసిస్తావు. ఒక్కొకసారి దానిని అనుసరిస్తావు. లీలామానుష రూపాలను ధరిస్తావు. నీవు స్వతంత్రుడవు. అయినా మాయకు లొంగి రాగాదులు ఉన్నవాని వలె రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలను ధరించి దర్శనమిస్తావు. ఈ లోకానికి నీవే ప్రభుడవని, తక్కిన బ్రహ్మరుద్రాదులు నీ మాయా వైభవ మూర్తులని, అందువల్ల లోకాలకు ప్రభువులు కారని, భేదదృష్టితో ఉన్న నన్ను మన్నించు. ఈ విశ్వాసానికి హేతువులైన శివుడు, బ్రహ్మ, దిక్పాలకులు, సకల చరాచర జీవకోటి అన్నీ నీవే. నీకంటె వేరయినది ఈ విశ్వంలో లేదు” అని దక్షుడు విన్నవించిన తరువాత ఋత్విక్కులు ఇలా అన్నారు.

తెభా-4-171-సీ.
"వామదేవుని శాపశమునఁ జేసి క-
ర్మానువర్తులము మే మైన కతన
లసి వేదప్రతిపాద్య ధర్మోపల-
క్ష్యంబైన యట్టి మఖంబునందు
దీపింప నింద్రాది దేవతా కలిత రూ-
వ్యాజమునఁ బొంది రఁగ నిన్ను
జ్ఞస్వరూపుండ ని కాని కేవల-
నిర్గుణుండవు నిత్యనిర్మలుఁడవు

తెభా-4-171.1-తే.
రయ ననవద్యమూర్తివి యైన నీదు
లిత తత్త్వస్వరూపంబుఁ దెలియఁజాల
య్య మాధవ! గోవింద! రి! ముకుంద!
చిన్మయాకార! నిత్యలక్ష్మీవిహార!"

టీక:- వామదేవుని = నందీశ్వరుని; శాప = శాపమునకు; వశమునన్ = లొంగుట; చేసి = వలన; కర్మా = కర్మల; అనువర్తులము = అనుసరించువారము; మేము = మేము; ఐన = అయిన; కతన = కారణముచేత; బలసి = అతిశయించి; వేద = వేదమునందు; ప్రతిపాద్య = ప్రతిపాదింపబడిన; ధర్మ = ధర్మముచే; ఉపలక్ష్యంబు = గుర్తింపదగినది; ఐనట్టి = అయినటువంటి; మఖంబున్ = యజ్ఞము; అందున్ = లో; దీపింపన్ = ప్రకాశించగ; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలైన; దేవతా = దేవతలతో; కలిత = కూడిన; రూప = రూపముల; వ్యాజమునన్ = మిషతో; పొంది = పొంది; పరగ = ప్రవర్తిల్లు; నిన్ను = నిన్ను; యజ్ఞ = యజ్ఞముయొక్క; స్వరూపుండవు = స్వరూపుడవు; అని = అని; కాని = కాని; కేవల = కేవలము; నిర్గుణుండవు = త్రిగుణములునులేనివాడవు; నిత్యనిర్మలుడవు = శాశ్వతమువిమలమైనవాడవు; అరయన్ = తరచిచూసిన; అనవధ్యమూర్తివి = వంకపెట్టరానివాడవు.
ఐన = అయిన; నీదు = నీయొక్క; లలిత = చక్కటి; తత్త్వ = తత్త్వముయొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; తెలియజాలన్ = తెలిసికోలేను; అయ్య = తండ్రి; మాధవ = విష్ణుమూర్తి {మాధవ - మనసును రంజింపజేయువాడు, విష్ణువు}; గోవింద = విష్ణుమూర్తి {గోవింద - గో (ఆవులకు, జీవులకు) విందుడు, పాలించువాడు, విష్ణువు}; హరి = విష్ణుమూర్తి; ముకుంద = విష్ణుమూర్తి; చిన్మయాకార = విష్ణుమూర్తి {చిన్మయాకార - చిత్ (చైతన్యముతో) మయ (కూడిన) ఆకార (స్వరూపము కలవాడు), విష్ణువు}; నిత్యలక్ష్మీవిహార = విష్ణుమూర్తి {నిత్యలక్ష్మీవిహార - నిత్యమును లక్ష్మీ (లక్ష్మీదేవితో, సంపదలలో) విహరించువాడు, విష్ణువు}.
భావము:- “దేవా! మేము నందీశ్వరుని శాపం వల్ల యజ్ఞాది కర్మలయందు ఆసక్తుల మైనాము. వేదాలలో ప్రతిపాదింపబడిన ధర్మలక్షణాలు కలది యజ్ఞం. ఆ యజ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంతో నీవే సాక్షాత్కరిస్తుంటావు. నీవు యజ్ఞస్వరూపుడవు. నిష్కించనుడవు. నిర్మలుడవు. నిరవద్యుడవు. మాధవా! గోవిందా! హరీ! ముకుందా! చిన్మయమూర్తీ! నిత్యసౌభాగ్యశాలీ! నీ యథార్థ స్వరూపాన్ని మేము గ్రహింపలేము.”

తెభా-4-172-వ.
సదస్యు లిట్లనిరి.
టీక:- సదస్యులు = సభ్యులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- సదస్యులు ఇలా అన్నారు.

తెభా-4-173-సీ.
"శోదావాగ్ని శిఖాకులితంబు పృ-
థుక్లేశ ఘన దుర్గదుర్గమంబు
దండధరక్రూర కుండలిశ్లిష్టంబు-
పాపకర్మవ్యాఘ్ర రివృతంబు
గురు సుఖ దుఃఖ కాకోలపూరిత గర్త-
గుచు ననాశ్రయ మైన యట్టి
సంసార మార్గ సంచారులై మృగతృష్ణి-
లఁ బోలు విషయ సంము నహమ్మ

తెభా-4-173.1-తే.
మేతి హేతుక దేహ నికేతనములు
యి మహాభారవహు లైన ట్టి మూఢ
నము లేనాఁట మీ పదాబ్జములు గానఁ
జాలు వారలు? భక్తప్రన్న! దేవ!"

టీక:- శోక = దుఃఖము అనెడి; దావాగ్ని = కారుచిచ్చు; శిఖ = మంటల; ఆకులితంబున్ = చీకాకులుకలిగినది; పృథు = పెద్ద; క్లేశ = చిక్కులు అనెడి; ఘన = గొప్ప; దుర్గ = దుర్గములతో; దుర్గమంబు = దాటరానిది; దండధర = యముడు అనెడి; క్రూర = క్రూరమైన; కుండలి = సర్పములచే; శ్లిష్టంబు = చుట్టుముట్టబడినది; పాప = పాపపు; కర్మ = కర్మములు అనెడి; వ్యాఘ్ర = పెద్దపులులుచే; పరివృతంబు = ఆక్రమించబడినది; గురు = పెద్ద; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములు అనెడి; కాకోల = కాకోలవిషముతో; పూరిత = నిండిన; గర్తము = గొయ్యి; అగుచున్ = అవుతూ; అనాశ్రయము = ఆశ్రయములేనిది; ఐన = అయిన; అట్టి = అటువంటి; సంసార = సంసారపు; మార్గ = మార్గమున; సంచారులు = సంచరించువారు; ఐ = అయ్యి; మృగతృష్టికలన్ = ఎడమావులను; పోలు = పోలెడి; విషయ = ఇంద్రియలక్ష్యాంశముల; సంఘమున్ = సమూహమును; అహం = నేను; మమ = నాది; ఇతి = అనెడి; హేతుక = కారణములు కలిగిన.
దేహ = శరీరములు అనెడి; నికేతనములున్ = నివాసములు; అయి = అయ్యి; మహా = పెద్ద; భార = బరువులను; ఆవహులు = మోయువారు; ఐన = అయిన; అట్టి = అటువంటి; మూఢ = మూర్ఖులైన; జనములు = వారు; ఏనాట = ఏసమయమున; మీ = మీ యొక్క; పద = పాదములు అనెడి; అబ్జములు = పద్మములు; కానన్ = దర్శించుటకు; చాలువారలు = సమర్థులు; భక్తప్రసన్న = నారాయణ {భక్తప్రసన్న - భక్తులకు అనుగ్రహము కలవాడు, విష్ణువు}; దేవ = నారాయణ.
భావము:- “భక్తప్రసన్నుడవైన దేవా! సంసారమార్గం శోకమనే కార్చిచ్చు మంటలచే చీకాకైనది. కష్టాలు అనే గొప్ప కోటలతో దాటరానిది. యముడనే క్రూర సర్పంతో కూడినది. దుర్జనులనే పెద్ద పులులతో నిండినది. అంతులేని సుఖదుఃఖాలనే కాలకూట విషంతో నిండిన గుంట వంటిది. దిక్కు లేనిది. అటువంటి సంసార మార్గంలో సంచరిస్తూ ఎండమావులవంటి ఇంద్రియ వాంఛలలో పడి కొట్టుమిట్టాడుతూ ‘నేను, నాది’ అనే భావాలకు కారణాలయిన దేహం గేహం వంటి గొప్ప బరువును మోస్తూ ఉండే పరమమూర్ఖులైన మానవులు నీ పాదపద్మాలను ఎప్పుడూ చూడలేరు.”

తెభా-4-174-వ.
రుద్రుం డిట్లనియె.
టీక:- రుద్రుండు = శివుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- రుద్రుడు ఇలా అన్నాడు.

తెభా-4-175-చ.
"ద! నిరీహ యోగిజన ర్గసు పూజిత! నీ పదాబ్జముల్
నితము నంతరంగమున నిల్పి భవత్సదనుగ్రహాదిక
స్ఫుణఁ దనర్చు నన్ను నతిమూఢు లవిద్యులు మున్నమంగళా
ణుఁ డటంచుఁ బల్కిన భన్మతి నే గణియింప నచ్యుతా!"

టీక:- వరద = నారాయణ {వరదుడు - వరములను దుడు (ఇచ్చువాడు), విష్ణువు}; నిరీహయోగిజనవర్గసుపూజిత = కోరికలులేని {నిరీహ యోగి జన వర్గ సుపూజితుడు - నిర్ (లేని) ఈహ (కోరికలు కల) యోగి (యోగులైన) జన (వారి) వర్గ (సమూహము)చే పూజితుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అబ్జములు = పద్మములు; నిరతము = ఎల్లప్పుడు; అంతరంగమునన్ = హృదయమున; నిల్పి = ధరించి; భవత్ = నీ యొక్క; సత్ = మంచి; అనుగ్రహ = అనుగ్రహము; ఆదిక = మొదలగు వాని; స్ఫురణన్ = స్ఫురణతో; తనర్చు = అతిశయించు; నన్ను = నన్ను; అతి = మిక్కిలి; మూఢులు = మూర్ఖులు; అవిద్యులు = అవిద్య కలవారు; మున్న = ముందు; అమంగళ = అశుభమైనవి; ఆవరణుడు = ఆవరించి ఉన్నవాడు; అటంచున్ = అంటూ; పల్కిన = అంటుంటే; భవత్ = నిన్ను స్మరించెడి; మతిన్ = మనసుతో; నేన్ = నేను; గణియింపన్ = ఎంచను; అచ్యుత = నారాయణ {అచ్యుత - చ్యుతము (పతనము)లేనివాడు, విష్ణువు}.
భావము:- “వరదా! పరమయోగి పూజితుడవైన అచ్యుతా! నీ పాదపద్మాలను నిత్యం మనస్సులో నింపుకొని నీ సంపూర్ణ దయను పొందిన నన్ను చూచి బుద్ధిహీనులు ‘అమంగళమూర్తి’ అని నిందిస్తారు.అయినా ఆ నిందను నేను లెక్కచేయను.”

తెభా-4-176-వ.
భృగుం డిట్లనియె.
టీక:- భృగుండు = భృగువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- భృగుడు ఇలా అన్నాడు.

తెభా-4-177-మ.
"విందోదర! తావకీన ఘన మాయామోహితస్వాంతులై
మంబైన భవన్మహామహిమముం బాటించి కానంగ నో
రు బ్రహ్మాది శరీరు లజ్ఞులయి; యో ద్మాక్ష! భక్తార్తిసం
ణాలోకన! నన్నుఁ గావఁదగు నిత్యానందసంధాయివై."

టీక:- అరవిందోదర = నారాయణ {అరవిందోదర - అరవిందము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; తావకీన = నీ యొక్క; ఘన = గొప్ప; మాయ = మాయచే; మోహిత = మోహములో పడిన; స్వాంతులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; పరమంబు = గొప్పది; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; మహా = గొప్ప; మహిమమున్ = మహిమమును; పాటించి = విచారించియు; కానంగన్ = తెలిసికొన; ఓపరు = సమర్థులు కారు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; శరీరులు = దేహములు కలవారు; అజ్ఞులు = అజ్ఞానులు; అయి = అయ్యి; ఓ = ఓ; పద్మాక్ష = నారయణ {పద్మాక్ష - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; భక్తార్తిసంహరణాలోకన = నారాయణ {భక్తార్తి సంహర ణాలోకన - భక్తుల ఆర్తి (బాధలను) సంహరణ (నాశము) చేయుటకు ఆలోకన (చూసెడివాడు), విష్ణువు}; నన్ను = నన్ను; కావదగు = కాపాడుము; నిత్యానందసంధాయివి = నారాయణుడవు {నిత్యానంద సంధాయి - నిత్యమైన ఆనందమును కూర్చెడివాడు, విష్ణువు}; ఐ = అయ్యి.
భావము:- “పద్మనాభా! నీ మాయకు చిక్కి బ్రహ్మ మొదలైన శరీరధారులు కూడా నీ మహామహిమను గ్రహింపలేరు. కమలనయనా! భక్తుల బాధలను తొలగించే చూపులు కలవాడా! నాకు నిత్యానందాన్ని ప్రసాదించి నన్ను కాపాడు.”

తెభా-4-178-వ.
బ్రహ్మ యిట్లనియె.
టీక:- బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- బ్రహ్మ ఇలా అన్నాడు.

తెభా-4-179-సీ.
"విలి పదార్థభేగ్రాహకము లైన-
క్షురింద్రియముల రవిఁ జూడఁ
లుగు నీ రూపంబు డఁగి మాయామయం-
గు; నసద్వ్యతిరిక్త గుచు మఱియు
జ్ఞానార్థ కారణ త్త్వాది గుణముల-
కాశ్రయభూతమై లరుచున్న
నిరుపమాకారంబు నీకు విలక్షణ-
మై యుండు ననుచు నే నాత్మఁ దలఁతు

తెభా-4-179.1-తే.
నిర్వికార! నిరంజన! నిష్కళంక!
నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ!
విశ్వసంబోధ్య! నిరవద్య! వేదవేద్య!
ప్రవిమలానంద! సంసారయవిదూర!

టీక:- తవిలి = పూని; పదార్థ = పదార్థముల; భేద = భేదములను; గ్రాహకములు = గ్రహించగలవి; ఐన = అయిన; చక్షురింద్రియములు = కన్నులు; సరవిన్ = క్రమముగ; చూడగలుగు = చూడగలుగు; నీ = నీ యొక్క; రూపంబున్ = రూపమును; కడగి = పూని; మాయా = మాయతో; మయంబున్ = నిండినది; అసత్ = అసత్యమునకు; వ్యతిరేకము = కానిది; అగుచున్ = అవుతూ; మఱియున్ = ఇంకను; జ్ఞాన = జ్ఞానము యొక్క; అర్థ = ప్రయోజనములకు; కారణ = కారణమైన; సత్త్వాది = సత్త్వము మొదలు {సత్త్వాది - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు}; గుణముల్ = గుణముల; కున్ = కు; ఆశ్రయభూతము = ఆధారము; ఐ = అయ్యి; అలరుచున్న = విలసిల్లుతున్న; నిరుపమ = పోల్చదగినవి ఏమిలేని; ఆకారంబున్ = ఆకారము; నీకున్ = నీకు; విలక్షణము = ప్రత్యేకత; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అనుచున్ = అంటూ; నేను = నేను; ఆత్మన్ = మనసులో; తలతున్ = అనుకొనెదను.
నిర్వికార = నారాయణ {నిర్వికార - మార్పులు లేని వాడు, విష్ణువు}; నిరంజన = నారాయణ {నిరంజన - కంటికి పొరలులేనివాడు, విష్ణువు}; నిష్కళంక = నారాయణ {నిష్కళంక, కళంకములు లేనివాడు, విష్ణువు}; నిరతిశయ = నారాయణ {నిరతిశయ - మించినది లేనివాడు, విష్ణువు}; నిష్క్రియారంభ = నారాయణ {నిష్క్రియారంభ - క్రియలందు సంకల్పములు లేనివాడు, విష్ణువు}; నిర్మలాత్మ = నారాయణ {నిర్మలాత్మ - పరిశుద్దమైన ఆత్మ కలవాడు, విష్ణువు}; విశ్వసంబోధ్య = నారాయణ {విశ్వసంబోధ్య - విశ్వ (లోకమునకు) సంబోధ్య (మేల్కొలుపువాడు), విష్ణువు}; నిరవద్య = నారాయణ {నిరవద్య - వంకలు పెట్టుటకురానివాడు, విష్ణువు}; వేదవేద్య = నారాయణ {వేదవేద్య - వేదములచే వేద్య (తెలియువాడు), విష్ణువు}; ప్రవిమలానంద = నారాయణ {ప్రవిమలానంద - మిక్కిలి నిర్మలమైన ఆనందమైనవాడు, విష్ణువు}; సంసారభయవిదూర = నారాయణ {సంసారభయవిదూర - సంసారము యొక్క భయమును బాగా దూరముచేయువాడు, విష్ణువు}.
భావము:- “పదార్థ భేదాలను మాత్రమే గ్రహించే నేత్రాలనే ఇంద్రియాలతో పురుషుడు నీ మాయాస్వరూపాన్ని మాత్రమే చూడగలడు. సంపూర్ణమై, జ్ఞానార్థాలకు సత్త్వం మొదలైన గుణాలకు నెలవై అసత్తుల కంటె వేరై, సాటి లేనిదై, విలక్షణమైన నీ రూపాన్ని జీవులు చూడలేరు. నీవు నిర్వికారుడవు. నిరంజనుడవు. నిష్కళంకుడవు. సర్వేశ్వరుడవు. క్రియారహితుడవు. విమలాత్ముడవు. విశ్వవిధాతవు. నిరవద్యుడవు. వేదవేద్యుడవు. ఆనందస్వరూపుడవు. భవబంధాలను పటాపంచలు చేసేవాడవు.”

తెభా-4-180-వ.
ఇంద్రుఁ డిట్లనియె.
టీక:- ఇంద్రుడు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇంద్రుడు ఇలా అన్నాడు.

తెభా-4-181-మ.
"దితి సంతాన వినాశ సాధన సముద్దీప్తాష్ట బాహా సమ
న్విమై యోగిమనోనురాగ పదమై వెల్గొందు నీ దేహ మా
మైనట్టి ప్రపంచముం బలెను మిథ్యాభూతముం గామి శా
శ్వముంగా మదిలోఁ దలంతు హరి! దేవా! దైవచూడామణీ!"

టీక:- దితి = దితి యొక్క; సంతాన = సంతానమునకు; వినాశ = వినాశనము చేయుటకు; సాధన = సాధనములు, ఆయుధములతో; సమ = చక్కగా; ఉద్దీప్త = ప్రకాశిస్తున్న; అష్ట = ఎనిమిది (8); బాహా = చేతులతో; సమ = చక్కగా; ఆన్వితము = కూడినది; ఐ = అయ్యి; యోగి = యోగుల; మనసు = మనసు లందలి; అనురాగ = కూరిమికి; పదము = ఆస్థానము; ఐ = అయ్యి; వెల్గొందు = ప్రకాశించెడి; నీ = నీ యొక్క; దేహము = దేహము; ఆయతము = విస్తారము; ఐనట్టి = అయినట్టి; ప్రపంచమున్ = లోకము; వలెను = వలె; మిథ్యాభూతంబు = అసత్యమైనది; కామిన్ = కాపోవుట వలన; శాశ్వతమున్ = శాశ్వతమైనది; కాన్ = అగునట్లు; మది = మనసు; లోన్ = లో; తలంతున్ = అనుకొనెదను; హరి = నారాయణ; దేవా = నారాయణ; దైవచూడామణీ = నారాయణ {దైవ చూడామణీ - దైవములలో శిరోమణి వంటివాడు, విష్ణువు}.
భావము:- “రాక్షసులను సంహరించే ఆయుధాలతో దేదీప్యమానంగా ప్రకాశించే ఎనిమిది బాహువులతో కూడి, యోగుల అంతరంగాలకు ఆనందం కల్గించే నీ దేహం శాశ్వతమైనది. ఈ ప్రపంచం లాగా అశాశ్వతమైనది కాదు. హరీ! దేవా! దేవతాచక్రవర్తీ! అటువంటి నీ స్వరూపాన్ని నేను నా మనస్సులో భావిస్తున్నాను.”

తెభా-4-182-వ.
ఋత్విక్పత్ను లిట్లనిరి.
టీక:- ఋత్విక్ = ఋత్విక్కుల; పత్నులు = భార్యలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఋత్విక్కుల భార్యలు ఇలా అన్నారు.

తెభా-4-183-చ.
"డఁగి భవత్పదార్చనకుఁ గా నిటు దక్షునిచే రచింపఁగాఁ
డి శితికంఠరోషమున స్మము నొంది పరేతభూమియై
చెడి కడు శాంతమేధమునఁ జెన్నఱియున్న మఖంబుఁ జూడు మే
ర్ప జలజాభ నేత్రములఁ బావన మై విలసిల్లు నచ్యుతా!"

టీక:- కడగి = పూని; భవత్ = నీ యొక్క; పద = పాదముల; అర్చన = పూజ; కున్ = కు; కాన్ = అగునట్లు; ఇటు = ఈ విధముగ; దక్షుని = దక్షుని; చేన్ = చేత; రచింపగాబడి = ఏర్పరుపబడి; శితికంఠ = శివుని {శితికంఠుడు - శితి (నల్లని) కంఠుడు (కంఠముకలవాడు), శివుడు}; రోషమునన్ = క్రోధముచే; భస్మమున్ = కాలిబూడిద; ఒంది = అయ్యి; పరేత = శ్మశాన; భూమి = భూమి; ఐ = అయ్యి; చెడి = చెడిపోయి; కడు = మిక్కిలి; శాంత = ఆగిపోయిన; మేధమునన్ = బలులుతో; చెన్నఱి = కళా విహీనమై; ఉన్న = ఉన్నట్టి; మఖంబున్ = యజ్ఞమును; చూడుము = చూడుము; ఏర్పడ = ఏర్పడునట్లు; జలజ = పద్మముల; అభ = వంటి; నేత్రములన్ = కన్నులతో; పావనము = పవిత్రము; ఐ = అయ్యి; విలసిల్లున్ = విలసిల్లును; అచ్యుత = నారాయణ.
భావము:- “నీ పాదాలను ఆరాధించడంకోసం దక్షప్రజాపతి ప్రారంభించిన యజ్ఞం పరమశివుని ఆగ్రహంవల్ల భస్మీపటలం అయింది. యజ్ఞభూమి శ్మశానంగా మారి కళాహీనంగా కనిపిస్తున్నది. యజ్ఞవైభవమంతా నేల పాలయింది. అచ్యుతా! పద్మపత్రాల వంటి నీ నేత్రాలను విప్పి ఒక్కమాటు చూస్తే ఈ యజ్ఞం పవిత్రమై యథారూపాన్ని పొందుతుంది.”

తెభా-4-184-వ.
ఋషు లిట్లనిరి.
టీక:- ఋషులు = ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఋషులు ఇలా స్తుతించారు.

తెభా-4-185-మ.
"ఘా! మాధవ! నీవు మావలెనె కర్మారంభివై యుండియున్
విను తత్కర్మ ఫలంబు నొంద; వితరుల్ విశ్వంబునన్ భూతికై
యంబున్ భజియించు నిందిర గరం ర్థిన్ నినుం జేరఁ గై
కొ; వే మందుము నీ చరిత్రమునకున్ గోవింద! పద్మోదరా!"

టీక:- అనఘా = పుణ్యుడ; మాధవ = హరి; నీవు = నీవు; మా = మా; వలెనె = లానే; కర్మా = కర్మను; ఆరంభివి = సంకల్పించెడివాడవు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికిని; విను = వినుము; తత్ = ఆ; కర్మ = కర్మ యొక్క; ఫలంబున్ = ఫలితమును; ఒందవు = పొందవు; ఇతరుల్ = ఇతరులు; విశ్వంబునన్ = లోకమున; భూతి = ఐశ్వర్యము; కై = కోసము; అనయంబున్ = ఎల్లప్పుడు; భజియించు = పూజించు; ఇందిర = లక్ష్మీదేవి; కరంబున్ = మిక్కిలిగ; అర్థిన్ = కోరి; నినున్ = నిన్ను; చేరన్ = చేరగ; కైకొనవు = చేపట్టవు; ఏమి = ఏమి; అందుము = అనెదము; నీ = నీ యొక్క; చరిత్రమున్ = వర్తనమున; కున్ = కు; గోవింద = నారాయణ; పద్మోదర = నారాయణ.
భావము:- “పుణ్యాత్మా! మాధవా! నీవు మాలాగే కర్మలు చేసినా ఆ కర్మఫలం నీవు పొందవు. సంపదలకోసం లోకులు సేవించే లక్ష్మీదేవి ఎంతో ప్రీతితో నిన్ను వరించి దరి చేరినప్పటికీ ఆమెను ఆదరించవు. గోవిందా! కమలనాభా! నీ చరిత్రను వర్ణించడం మాకు సాధ్యమా?”

తెభా-4-186-వ.
సిద్ధు లిట్లనిరి.
టీక:- సిద్ధులు = సిద్ధులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- సిద్ధులు ఇలా అన్నారు.

తెభా-4-187-చ.
"రి! భవ దుఃఖ భీషణ దవానల దగ్ధతృషార్త మన్మనో
ద్విదము శోభితంబును బవిత్రము నైన భవత్కథా సుధా
రి దవగాహనంబునను సంసృతి తాపము వాసి క్రమ్మఱం
దిరుగదు బ్రహ్మముం గనిన ధీరుని భంగిఁ బయోరుహోదరా!"

టీక:- హరి = నారాయణ; భవ = సంసారము నందలి; దుఃఖ = దుఃఖము అనెడి; భీషణ = భయంకరమైన; దవానల = కార్చిచ్చుచే; దగ్ధ = కాలి; తృష = దప్పిక; ఆర్త = బాధపడిన; మత్ = నా యొక్క; మనస్ = మనసు అనెడి; ద్విరదము = ఏనుగు; శోభితంబున్ = శోభిల్లుతున్నది; పవిత్రమున్ = పవిత్రము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; కథా = కథలు అనెడి; సుధా = అమృతపు; సరిత్ = ప్రవాహములో; అవగాహనంబునను = స్నానము చేయుట వలన; సంసృతి = సంసార; తాపమున్ = బాధను; వాసి = పోగొట్టుకొని; క్రమ్మఱందిరుగదు = మరలిరాదు; బ్రహ్మమున్ = పరబ్రహ్మమును; కనిన = దర్శించిన; ధీరుని = విద్వాంసుని; భంగిన్ = వలెను; పయోరుహోదరా = నారాయణ {పయోరుహోదరుడు - పయోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}.
భావము:- “శ్రీహరీ! సంసార దుఃఖం అనే భయంకరమైన కార్చిచ్చుకు చిక్కి మా మనస్సు అనే ఏనుగు తపించి దప్పిగొన్నది. ఇప్పుడు నీ పవిత్ర గాథలనే అమృత స్రవంతిలో మునిగి తేలి సంసార తాపాన్ని పోగొట్టుకున్నది. పరబ్రహ్మతో ఐక్యాన్ని సంపాదించిన ధీరునివలె ఆ నదిలో నుండి తిరిగి బయటికి రావటం లేదు.”

తెభా-4-188-వ.
యజమాని యగు ప్రసూతి యిట్లనియె.
టీక:- యజమాని = యజమానుని భార్య; అగు = అయిన; ప్రసూతి = ప్రసూతి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- యజమానుని భార్య అయిన ప్రసూతి ఇలా అన్నది.

తెభా-4-189-చ.
" చరణాదికాంగములు ల్గియు మస్తము లేని మొండెముం
రువడి నొప్పకున్న గతిఁ బంకజలోచన! నీవు లేని య
ధ్వము ప్రయాజులం గలిగి ద్దయు నొప్పక యున్న దీ యెడన్
రి! యిటు నీదు రాక శుభ య్యె రమాధిప! మమ్ముఁ గావవే."

టీక:- కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆది = మొదలైన; అంగములు = అవయవములు; కల్గియు = ఉండియు; మస్తము = తల; లేని = లేని; మొండెమున్ = మొండెము; పరువడి = చక్కగా; ఒప్పకున్న = శోభిల్లకున్న; గతిన్ = విధముగ; పంకజలోచన = నారాయణ {పంకజలోచనుడు - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; నీవు = నీవు; లేని = లేని; అధ్వరము = యజ్ఞము; ప్రయాజులన్ = యఙ్ఙపరికరములను; కలిగి = కలిగి ఉన్నప్పటికిని; తద్దయున్ = మిక్కిలి; ఒప్పక = శోభలేక; ఉన్నది = ఉన్నది; ఈ = ఈ; ఎడన్ = సమయము నందు; హరి = నారాయణ; ఇటు = ఈ విధముగ; నీదు = నీ యొక్క; రాక = వచ్చుట; శుభము = మంచిది; అయ్యెన్ = అయినది; రమాధిప = నారాయణ {రమాధిప - రమ (లక్ష్మీదేవి) యొక్క అధిప (భర్త), విష్ణువు}; మమ్మున్ = మమ్ములను; కావవే = రక్షింపుము.
భావము:- “కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు అన్నీ ఉన్నా తలలేని మొండెము శోభిల్లదు. అలాగే ప్రయాజలు మొదలైన ఇతర అంగాలెన్ని ఉన్నా నీవు లేని యజ్ఞం శోభిల్లలేదు. ఇప్పటి నీ రాక శుభదాయకం. మాధవా! మమ్ము కాపాడు.”

తెభా-4-190-వ.
లోకపాలకు లిట్లనిరి.
టీక:- లోకపాలకులు = లోకపాలకులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- లోకపాలకులు ఇలా అన్నారు.

తెభా-4-191-సీ.
"దేవాదిదేవ! యీ దృశ్యరూపంబగు-
సుమహిత విశ్వంబుఁ జూచు ప్రత్య
గాత్మభూతుండ వై ట్టి నీవు నసత్ప్ర-
కాశ రూపంబులై లుగు మామ
కేంద్రియంబులచేత నీశ్వర! నీ మాయ-
నొందించి పంచభూతోపలక్షి
తంబగు దేహి విధంబునఁ గానంగఁ-
డుదువు గాని యేర్పడిన శుద్ధ

తెభా-4-191.1-తే.
త్త్వగుణ యుక్తమైన భాస్వత్స్వరూప
రుఁడవై కానఁబడవుగా? రమపురుష!
వ్యయానంద! గోవింద! ట్లు గాక
యెనయ మా జీవనము లింక నేమి కలవు?"

టీక:- దేవాధిదేవ = నారాయణ {దేవాధిదేవ - దేవతలకే అధిదేవత, విష్ణువు}; ఈ = ఈ; దృశ్య = కనబడెడి; రూపంబున్ = రూపము; అగు = అయినట్టి; సు = మంచి; మహిత = మహిమకలగిన; విశ్వంబున్ = జగమును; చూచు = చూసెడి; ప్రత్యగాత్మభూతుండవు = ప్రత్యగాత్మభూతుడవు; ఐనట్టి = అయినట్టి; నీవు = నీవు; అసత్ = సత్యముకాని; ప్రకాశ = ప్రకాశము యొక్క; రూపంబులు = రూపులము; ఐ = అయ్యి; కలుగు = ఉండెడి; మామక = మాయొక్క; ఇంద్రియంబుల = ఇంద్రియముల; చేతన్ = చేత; ఈశ్వర = నారాయణ; నీ = నీ; మాయన్ = మాయను; ఒందించి = చెంది; పంచభూత = పంచభూతములందు; ఉపలక్షితంబు = ప్రవర్తించునది; అగు = అయిన; దేహి = దేహముకలవాని; విధంబునన్ = విధముగ; కానంగబడుదువు = కనబడెదవు; కాని = కాని; ఏర్పడిన = సిద్ధించిన; శుద్ధ = పరిశుద్ధమైన.
సత్త్వగుణ = సత్త్వగుణముతో; యుక్తము = కూడినది; ఐన = అయినట్టి; భాస్వత్ = ప్రకాశవంతమైన; రూప = రూపము; ధరుడవు = ధరించినవాడవు; ఐ = అయ్యి; కానబడవుగా = కనబడవుకదా; పరమపురుష = నారాయణ {పరమపురుషుడు - సర్వమునకు పరమము (అతీతము) యైన పురుషుడు, విష్ణువు}; అవ్యయానంద = నారాయణ {అవ్యయానంద -అవ్యయము (తగ్గిపోని) ఆనందము కలవాడు వాడు, విష్ణువు}; గోవింద = నారాయణ {గోవింద - గోవులకు ఒడయుడు}; అట్లుగాన = అందుచేత; ఎనయన్ = పొందుటకు; మా = మా యొక్క; జీవనములన్ = జీవితములలో; ఇంక = ఇంకను; ఏమి = ఏమి; కలవు = ఉన్నది.
భావము:- “దేవాదిదేవా! ఈ కనిపించే విశ్వాన్ని నీవు వేరుగా ఉండి చూస్తావు. నీవు బహిర్ముఖాలైన మా ఇంద్రియాలకు పంచభూతోపలక్షితమైన జీవివలె కనిపిస్తావు. ఇదంతా నీ మాయా విలాసం. ఓ అవ్యయానందా! గోవిందా! పురుషోత్తమా! శుద్ధ సత్త్వ గుణంతో కూడిన నీ రూపాన్ని మాకు చూపించవు. ఏమి బ్రతుకులయ్యా మావి?”

తెభా-4-192-వ.
యోగీశ్వరు లిట్లనిరి.
టీక:- యోగీ = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- యోగీశ్వరులు ఇలా అన్నారు.

తెభా-4-193-సీ.
"విశ్వాత్మ! నీ యందు వేఱుగా జీవులఁ-
నఁ డెవ్వఁ; డటు వానికంటెఁ బ్రియుఁడు
నీకు లేఁ; డయినను నిఖిల విశ్వోద్భవ-
స్థితి విలయంబుల న దైవ
సంగతి నిర్భిన్న త్త్వాది గుణవిశి-
ష్టాత్మీయ మాయచే జ భవాది
వివిధ భేదము లొందుదువు స్వస్వరూపంబు-
నం దుండుదువు; వినిత విమోహి

తెభా-4-193.1-తే.
గుచు నుందువు గద; ని న్నన్యభక్తి
భృత్యభావంబుఁ దాల్చి సంప్రీతిఁ గొల్చు
మ్ము రక్షింపవే; కృపాయ! రమేశ!
పుండరీకాక్ష! సంతతభువనరక్ష!"

టీక:- విశ్వాత్మ = నారాయణ {విశ్వాత్మ - విశ్వమే ఆత్మ(స్వరూపము)గా కలవాడు, విష్ణువు}; నీ = నీ; అందు = నుండి; వేఱుగా = ఇతరము అగునట్లు; జీవులన్ = సమస్తజీవములను; కనడు = చూడడు; ఎవ్వడు = ఎవడో; అటువాని = అటువంటివాని; కంటెన్ = కంటె; ప్రియుండు = ఇష్టుడు; నీకున్ = నీకు; లేడు = లేడు; అయినను = అయినప్పటిటకిని; నిఖిల = సమస్తమైన; విశ్వ = భువన; ఉద్భవ = సృష్టి; స్థితి = స్థితి; విలయంబుల = లయముల; కతన = కోసము; దైవ = దైవత్వ; సంగతిన్ = కూడుటచేత; నిర్భిన్న = నశించని; సత్త్తాదిగుణ = త్రిగుణములతో {సత్త్వాది - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు}; విశిష్ట = ప్రత్యేకమైన; ఆత్మీయ = స్వంత; మాయన్ = మాయ; చేన్ = చేత; అజ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆది = మొదలైన; వివిధ = రకరకముల; భేదములన్ = భేదములుకల రూపములను; ఒందుదువు = పొందుతావు; స్వ = స్వంత; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = లోను; ఉండుదువు = ఉంటావు; వినిహత = బాగుగాపోగొట్టబడిన; విమోహివి = మోహము కలిగినవాడవు; అగుచున్ = అవుతూ; ఉందువు = ఉంటావు; కదా = కదా.
నిన్ను = నిన్ను; అనన్య = అనితరమైన; భక్తిన్ = భక్తితో; భృత్యు = సేవక; భావంబున్ = భావమును; తాల్చి = ధరించి; సంప్రీతిన్ = మిక్కిలిప్రీతితో; కొల్చు = సేవించు; మమ్మున్ = మమ్ములను; రక్షింపవే = కాపాడుము; కృపామయ = దయామయ; రమేశ = నారాయణ {రమేశ - రమ (లక్ష్మీదేవి) యొక్క ఈశ (భర్త), విష్ణువు}; పుండరీకాక్ష = నారాయణ {పుండరీకాక్ష - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సంతతభువనరక్ష = నారాయణ {సంతతభువనరక్ష - సంతత (ఎల్లప్పుడు) భువన (జగత్తును) రక్ష (రక్షించువాడు), విష్ణువు}.
భావము:- “ఓ విశ్వస్వరూపా! ఈ విశ్వంలోని జీవులను నీకంటె వేరుగా చూడనివాడు నీకు మిక్కిలి ఇష్టుడు. నీవు లోకాల సృష్టి, స్థితి, లయల కోసం బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన అనేక భేదాలను పొందుతావు. సత్త్వరజస్తమస్సులనే వేరు వేరు గుణాలతో కూడిన నీ మాయవల్ల ఇలా చేస్తూ స్వస్వరూపాన్ని ధరిస్తూ ఉంటావు. ఓ కరుణామయా! కమలాప్రియా! కమలనయనా! నిరంతర నిఖిల భువన రక్షా! భృత్యభావంతో, అత్యంతానురక్తితో అనన్య భక్తితో నిన్ను సేవించే మమ్ము కాపాడు.”

తెభా-4-194-వ.
శబ్దబ్రహ్మ యిట్లనియె.
టీక:- శబ్దబ్రహ్మ = శబ్దబ్రహ్మ {శబ్దబ్రహ్మ – ఆకాశ మనబడు దేవుడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడు నాలుగు వాక్కులుగ శబ్దబ్రహ్మ ఉచ్చరింపబడును}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- శబ్దబ్రహ్మ ఇలా అన్నారు.

తెభా-4-195-చ.
"రి! భవదీయ తత్త్వము సమంచితభక్తి నెఱుంగ నేను నా
సిజ సంభవాదులును జాలము; సత్త్వగుణాశ్రయుండవున్
రుఁడవు నిర్గుణుండవును బ్రహ్మమునై తగు నీకు నెప్డు నిం
ముఁ జతుర్విధార్థ ఫలదాయక! మ్రొక్కెద మాదరింపవే."

టీక:- హరి = నారాయణ; భవదీయ = నీ యొక్క; తత్త్వము = స్వరూపము; సమ = చక్కగా; అంచిత = ఒప్పుతున్న; భక్తిన్ = భక్తితో; ఎఱుంగన్ = తెలియుటకు; నేనున్ = నేను; ఆ = ఆ; సరసిజసంభవ = బ్రహ్మదేవుడు; ఆదులును = మొదలైనవారమును; చాలము = సమర్థులము కాము; సత్త్వగుణాశ్రయుండవున్ = నారాయణుడవు {సత్త్వ గుణాశ్రయుండు - సత్త్వగుణములను ఆశ్రయించి యుండువాడు, విష్ణువు}; పరుడవు = నారాయణుడవు {పరుడవు - సమస్తమునకు పరము (అతీతము) యైనవాడు, విష్ణువు}; నిర్గుణుండవును = నారాయణుడవు {నిర్గుణుడు - సత్త్వాది త్రిగుణములను లేనివాడు, విష్ణువు}; బ్రహ్మమున్ = నారాయణుడవు {బ్రహ్మము – పరబ్రహ్మ స్వరూపుడు, విష్ణువు}; ఐ = అయ్యి; తగు = తగిన; నీకున్ = నీకు; ఎప్డును = ఎప్పుడును; ఇందఱమును = మేమందఱము; చతుర్విధఫలప్రదాయక = నారాయణ {చతుర్విధ ఫల ప్రదాయక - చతుర్విధ (నాలుగు విధములైన) ఫల (పురుషార్థములను, 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములను) ప్రదాయక (చక్కగా నిచ్చువాడు), విష్ణువు}; మ్రొక్కెదము = నమస్కరించెదము; ఆదరింపవే = ఆదరింపుము.
భావము:- “హరీ! నీ అసలైన రహస్యాన్ని గ్రహించటానికి ఉత్తమ భక్తియుక్తులమైన నేనుగాని, బ్రహ్మ మొదలైనవారు గాని సమర్థులం కాదు. నీవు సత్త్వగుణానికి నిలయమైనవాడవు. పరాత్పరుడవు. నిర్గుణుడవు. పరబ్రహ్మ స్వరూపుడవు. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు విధాలైన పురుషార్థ ఫలాలను నీవు ప్రసాదిస్తావు. అటువంటి నీకు మేమంతా సంతతం నమస్కరిస్తున్నాము. మమ్ము ఆదరించు.”

తెభా-4-196-వ.
అగ్నిదేవుం డిట్లనియె.
టీక:- అగ్నిదేవుండు = అగ్నిదేవుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అగ్నిదేవుడు ఇలా అన్నాడు.

తెభా-4-197-మ.
"రక్షా చరణుండ వై నెగడు దీ; య్యగ్నిహోత్రాది పం
విధంబున్ మఱి మంత్రపంచక సుసృష్టంబై తగంబొల్చు నా
రూపం బగు నీకు మ్రొక్కెదను; నీ యాజ్ఞన్ భువిన్ హవ్యముల్
నవ్రాతములన్ వహింతు హరి! యుష్మత్తేజముం బూనుచున్."

టీక:- హవ = యజ్ఞమును; రక్షా = రక్షించుటను; ఆచరణుండవు = చేయవాడవు; ఐ = అయ్యి; నెగడుదువు = అతిశయించుదువు; ఈవ = నీవే; అగ్నిహోత్రాది = అగ్నిహోత్రది {అగ్నిహోత్రాది పంచకము- 1 అగ్నిహోత్రము 2 హవిస్సు 3 వేదిక 4నేయి 5 హోమము చేయువాడు}; పంచ = ఐదు (5); విధంబున్ = విధములును; మఱి = మరియు; మంత్రపంచక = ఐదు (5) మంత్రములుచే; సు = చక్కగా; సృష్టంబు = చేయబడినది; ఐ = అయ్యి; తగన్ = చక్కగా; పొల్చు = విలసిల్లు; ఆ = ఆ; హవ = యజ్ఞ; రూపంబు = స్వరూపము; అగు = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదను = నమస్కరించెదను; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞతో; భువిన్ = లోకమున; హవ్యముల్ = హవ్యము {హవ్యము - అగ్నుహోత్రమున వేల్చుటకు ఇగిర్చిన అన్నము,నేయి}; సవనవ్రాతములన్ = యజ్ఞమందలి స్తోత్రముల సమూహములు; వహింతు = నిర్వహింతును; హరి = నారాయణ; యుష్మత్ = నీ యొక్క; తేజమున్ = తేజమును; పూనుచున్ = ధరించి.
భావము:- “హరీ! నీవు యజ్ఞాలను రక్షిస్తావు. ఐదు అగ్నిహోత్రాలు, ఐదు మంత్రాలు గల యజ్ఞమూర్తివి నీవే. నీవు హోమస్వరూపుడవు. నీ తేజస్సును దాల్చి నీ ఆజ్ఞానుసారం నేను యజ్ఞాలలో హోమద్రవ్యాలైన హవ్యలను ధరిస్తున్నాను.”

తెభా-4-198-వ.
దేవత లిట్లనిరి.
టీక:- దేవతలు = దేవతలు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- దేవతలు ఇలా అన్నారు.

తెభా-4-199-మ.
"మును కల్పాంతమునందుఁ గుక్షి నఖిలంబున్ దాఁచి యేకాకివై
లోకోపరి లోకవాసులును యుష్మత్తత్త్వమార్గంబు చిం
ముం జేయఁ బయోధియందు నహిరాట్తల్పంబునం బవ్వళిం
చి నీ రూపము నేఁడు చూపితివి లక్ష్మీనాథ! దేవోత్తమా!"

టీక:- మును = పూర్వము; కల్పాంతము = కల్పము యొక్క అంతము; అందున్ = సమయము నందు; కుక్షిన్ = కడుపులో; అఖిలంబున్ = సమస్తమును; దాచి = దాచి; ఏకాకివి = ఉన్నవాడవు ఒక్కడవే; ఐ = అయ్యి; జనలోక = జనలోకము; ఉపరి = పైనున్న; లోక = లోకముల నుండు; వాసులును = వసించువారును; యుష్మత్ = నీ యొక్క; తత్త్వమార్గంబున్ = తత్త్వ విధానమును; చింతనమున్ = ఆలోచన; చేయన్ = చేయగా; పయోధి = సముద్రము; అందున్ = లో; అహిరాట్ = శేష {అహిరాట్టు - అహి (సర్పము) లందు రాట్టు (రాజు), ఆదిశేషుడు}; తల్పంబునన్ = శయ్య యందు; పవ్వళించిన = శయనించిన; నీ = నీ యొక్క; రూపమున్ = స్వరూపమును; నేడు = ఈవేళ; చూపితివి = చూపించితివి; లక్ష్మీనాథ = విష్ణుమూర్తి; దేవోత్తమా = దేవతలలో ఉత్తముడ.
భావము:- “శ్రీపతీ! దేవాధిదేవా! పూర్వం ప్రళయకాలంలో సర్వాన్ని కడుపులో దాచుకొని నీవు ఒంటరిగా ఉన్నప్పుడు జనలోకానికన్నా పైలోకాలలో ఉండే సిద్ధపురుషులు నీ సత్య స్వరూపాన్ని మనస్సులో మననం చేయగా ఆనాడు పాలసముద్రం మధ్యలో పన్నగరాజు తల్పంపై పవ్వళించి ఉన్న నీ దివ్య స్వరూపాన్ని ఈనాడు మళ్ళీ మాకు చూపించావు.”

తెభా-4-200-వ.
గంధర్వు లిట్లనిరి.
టీక:- గంధర్వులు = గంధర్వులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- గంధర్వులు ఇలా అన్నారు.

తెభా-4-201-మ.
" పంకేజభ వామరాదులు మరీచ్యాదిప్రజానాథు లో
విందాక్ష! రమాహృదీశ! భవదీయాంశాంశ సంభూతులై
రఁగం దావకలీలయై నెగడు నీ బ్రహ్మాండమున్; దేవ! యీ
శ్వ! నీ కే మతిభక్తి మ్రొక్కెదము దేవాధీశ! రక్షింపుమా."


 ఇది (గంధర్వు లిట్లనిరి క్రింద రెండవ పద్యంగా) ఒకానొక ప్రతిని జూపట్టెడి.. 

4-201.1/1-మ.

 దంశాంశజు లీ మరీచిముఖరుల్ బ్రహ్మామరేంద్రాదిజా
ముఖ్యుల్ దివిషద్గణంబుఁ బరమాత్మా! నీకు విశ్వంబు ను
త్సలీలాకరకందుకోపమము నాథా! వేదశాఖాశిఖా

స్తనీయాంఘ్రికి నీ కొనర్తుము నమస్కారంబు లశ్రాంతమున్.



టీక:- హర = శివుడు; పంకేజభవ = బ్రహ్మదేవుడు; అమర = దేవతలు; ఆదులు = మొదలగువారు; మరీచి = మరీచి; ఆది = మొదలగు; ప్రజానాథులు = ప్రజాపతులు; ఓ = ఓ; అరవిందాక్ష = విష్ణుమూర్తి; రమాహృదీశ = విష్ణుమూర్తి; భవదీయ = నీ యొక్క; అంశ = భాగములో; అంశ = భాగమున; సంభూతులు = జనించినవారు; పరగన్ = ప్రసిద్ధముగ; తావక = నీ యొక్క; లీల = లీలకొరకు; ఐ = అయ్యి; నెగడున్ = వర్థిల్లును; ఈ = ఈ; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; దేవ = హరి; ఈశ్వర = హరి; నీకున్ = నీకు; ఏము = మేము; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; మ్రొక్కెదము = నమస్కరించెదము; దేవాధీశా = హరీ {దేవాధీశుడు - దేవతలకు ప్రభువు, విష్ణువు}; రక్షింపుమా = కాపాడుము.
భావము:- “కమలలోచనా! లక్ష్మీహృదయేశ్వరా! దేవా! ఈశ్వరా! దేవతకు ప్రభువైన శ్రీహరీ! శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు, మరీచి మొదలైన ప్రజాపతులు నీ అంశాంశాలచేత జన్మించారు.ఈ బ్రహ్మాండం నీ క్రీడా మందిరం. నీకు పరమభక్తితో ప్రణమిల్లుతున్నాము. మమ్మల్ని పాలించు.”

తెభా-4-202-వ.
విద్యాధరు లిట్లనిరి.
టీక:- విద్యాధరులు = విద్యాధరులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- విద్యాధరులు ఇలా అన్నారు.

తెభా-4-203-సీ.
"ళినాక్ష! విను; భవన్మాయా వశంబున-
దేహంబుఁ దాల్చి తద్దేహమందు
నాత్మ నహమ్మ మేత్యభిమానమును బొంది-
పుత్ర జాయా గృహ క్షేత్ర బంధు
న పశు ముఖ వస్తుతుల సంయోగ వి-
యోగ దుఃఖంబుల నొందుచుండు
ధృతి విహీనుఁడు నసద్విషయాతిలాలసుఁ-
తి దుష్టమతియు నై ట్టివాఁడు

తెభా-4-203.1-తే.
విలి భవదీయ గుణ సత్కథా విలోలుఁ
య్యెనేనియు నాత్తమోహంబు వలనఁ
బాసి వర్తించు విజ్ఞానరత దగిలి
చిరదయాకార! యిందిరాచిత్తచోర!"

టీక:- నళినాక్ష = హరి {నళినాక్షుడు - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; విను = వినుము; భవత్ = నీ యొక్క; మాయన్ = మాయ; వశంబునన్ = లొంగుటచేత; దేహంబున్ = శరీరమును; దాల్చి = ధరించి; తత్ = ఆ; దేహము = శరీరము; అందున్ = లో; ఆత్మన్ = మనసులో; అహం = నేను; మమ = నాది; ఇతి = అని; అభిమానమును = గర్వమును; పొంది = పొంది; పుత్ర = పుత్రులు; జాయా = భార్య; గృహ = గృహములు; క్షేత్ర = భూములు; బంధు = బంధువులు; ధన = సంపదలు; పశు = పశువులు; ముఖ = మొదలగు; వస్తు = పదార్థముల; తతులు = సమూహముల; సంయోగ = సంయోగములు; వియోగ = వియోగములవలన; దుఃఖంబులన్ = దుఃఖములను; ఒందుచుండు = పొందుతుండును; ధృతి = ధైర్యము; విహీనుడు = లేనివాడు; అసత్ = అసత్యమైన; విషయా = విషయార్థములందు; అతి = మిక్కిలి; లాలసుడు = ఆసక్తిచెందువాడు; అతి = మిక్కిలి; దుష్టమతి = చెడ్డ; మతియున్ = హదయముకలవాడు; ఐనట్టి = అయినటువంటి; వాడు = వాడు;
తవిలి = పూని; భవదీయ = నీ యొక్క; గుణ = గుణములు; సత్ = మంచి; కథా = కథల యందు; విలోలుడు = మిక్కిలి వర్తించువాడు; అయ్యెనేనియున్ = అయినప్పటికి; ఆ = ఆ; తమో = తమస్సు; మోహంబు = మోహముల; వలన = వలన; పాసి = విడిచి; వర్తించు = వర్తించును; విజ్ఞాన = విజ్ఞానము యందు; పరతన్ = ఆసక్తి; తగిలి = లగ్నమై; చిరదయాకార = హరి {చిరదయాకార - చిర (మిక్కిలి) దయ (కృప)కి స్వరూపమైనవాడు, విష్ణువు}; ఇందిరాచిత్తచోర = హరి {ఇందిరాచిత్తచోర - ఇందిర (లక్ష్మీదేవి) చిత్తము (మనసు)ను చోరుడు (దొంగిలించినవాడు), విష్ణువు}.
భావము:- “కమలనయనా! విను. నీ మాయకు వశుడై మానవుడు దేహం ధరించి, ఆ దేహంపై ‘నేను, నాది’ అని ఆసక్తి పెంచుకుంటాడు. కొడుకు, భార్య, ఇల్లు, పొలము, చుట్టాలు, ధనం, పశువులు మొదలైన వాటి సంయోగ వియోగాల వల్ల దుఃఖిస్తాడు. దయామయా! లక్ష్మీప్రియా! అలాంటి ధైర్యహీనుడు, ఇంద్రియార్థాలలో మిక్కిలి ఆసక్తి కలవాడు, చెడ్డ మనస్సు కలవాడు కూడా నీ గుణాలకు సంబంధించిన సత్కథలను వింటే ఆ అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానం పొందుతాడు.

తెభా-4-204-వ.
బ్రాహ్మణజనంబు లిట్లనిరి "దేవా! యీ క్రతువును, హవ్యంబును, నగ్నియు, మంత్రంబులును, సమిద్దర్భాపాత్రంబులును, సదస్యులును, ఋత్విక్కులును, దంపతులును, దేవతలును, నగ్నిహోత్రంబులును, స్వధయు, సోమంబును, నాజ్యంబును, బశువును నీవ; నీవు దొల్లి వేదమయ సూకరాకారంబు ధరియించి దంష్ట్రాదండంబున వారణేంద్రంబు నళినంబు ధరియించు చందంబున రసాతలగత యైన భూమి నెత్తితి; వట్టి యోగిజనస్తుత్యుండవును, యజ్ఞక్రతురూపకుండవును నైన నీవు పరిభ్రష్టకర్ములమై యాకాంక్షించు మాకుం బ్రసన్నుండ వగుము; భవదీయ నామకీర్తనంబుల సకల యజ్ఞ విఘ్నంబులు నాశంబునొందు; నట్టి నీకు నమస్కరింతుము."
టీక:- బ్రాహ్మణ = బ్రాహ్మణులు యైన; జనులు = వారు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; దేవా = భగవంతుడ; ఈ = ఈ; క్రతువును = యజ్ఞమును; హవ్యంబును = హవ్యము; అగ్నియు = అగ్ని; మంత్రంబులును = మంత్రములు; సమ = చక్కటి; ఇద్ధ = ప్రసిద్దమైన; దర్భా = దర్భలు; పాత్రంబులును = పాత్రలును; సదస్యులును = సదస్యులును; ఋత్విక్కులును = ఋత్విక్కులు; దంపతులును = యజమాన దంపతులు; దేవతలును = దేవతలు; అగ్నిహోత్రంబులును = అగ్నిహోత్రములు; స్వధయు = స్వధ {స్వధ - తనను తాను ధరించి పోషించునది, పితృదేవతల ఆహారము}; సోమంబును = సోమరసము; ఆజ్యంబును = నెయ్యి; పశువును = బలిపశువు; నీవ = నీవే; నీవు = నీవు; తొల్లి = పూర్వము; వేద = వేదముతో; మయ = నిండిన; సూకర = వరాహ; ఆకారంబు = రూపము; ధరియించి = ధరించి; దంష్ట్రా = కోరలు అనెడి; దండంబునన్ = కోలతో; వారణ = ఏనుగులలో; ఇంద్రంబున్ = శ్రేష్ఠమైనది; నళినంబున్ = తామరపూలను; ధరియించు = ధరించు; చందంబునన్ = విధముగ; రసాతల = రసాతలము, పాతాళము నకు; గత = పోయినది; ఐన = అయిన; భూమిని = భూమిని; ఎత్తితివి = ఎత్తావు; అట్టి = అటువంటి; యోగి = యోగులైన; జన = వారిచేత; స్తుత్యుండవును = స్తుతింపబడువాడవు; యజ్ఞ = యజ్ఞము యందలి; క్రతు = కర్మముల; రూపుండవు = రూపము కలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; పరిభ్రష్ట = మిక్కిలి చెడ్డ; కర్ములము = పనులు చేయువారము; ఐ = అయ్యి; ఆకాంక్షించు = కోరుతున్న; మాకున్ = మాకు; ప్రసన్నుండవు = దయ కలవాడవు; అగుము = అగుము; భవదీయ = నీ యొక్క; నామ = నామములను; సంకీర్తనంబులన్ = చక్కగా కీర్తించుటవలన; సకల = సమస్తమైన; యజ్ఞ = యజ్ఞము యొక్క; విఘ్నంబులు = ఆటంకములు; నాశంబున్ = నాశనమును; ఒందున్ = పొందును; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; నమస్కరింతుము = నమస్కరించెదము.
భావము:- బ్రాహ్మణులు ఇలా అన్నారు. “దేవా! ఈ యజ్ఞం, ఇందులోని హవ్యం, అగ్ని, మంత్రాలు, సమిధలు, దర్భలు, పాత్రలు, సదస్యులు, ఋత్విక్కులు, దంపతులు, దేవతలు, అగ్నిహోత్రాలు, స్వధ, సోమరసం, నెయ్యి, యజ్ఞపశువు - అన్నీ నీవే. నీవు పూర్వం వేదస్వరూపమైన ఆదివరాహరూపం ధరించి, ఏనుగు తన దంతంతో పద్మాన్ని పైకి ఎత్తినట్లు నీ కోరకొనతో పాతాళంనుండి భూమిని పైకి లేవనెత్తావు. యోగులు నిన్ను స్తుతిస్తారు. నీవు యజ్ఞస్వరూపుడవు. వేదకర్మలు ఆచరింపక భ్రష్టులమైన మాపై దయ చూపు. నీ నామాన్ని సంస్తుతిస్తే యజ్ఞాలలో సంప్రాప్తించే సమస్త విఘ్నాలు సమసిపోతాయి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము.

తెభా-4-205-క.
ని తన్ను సకల జనములు
వినుతించిన హరి భవుండు విఘ్నము గావిం
చి యా దక్షుని యజ్ఞము
ముగఁ జెల్లించెఁ గొఱఁత గాకుండంగన్.

టీక:- అని = అని; తన్నున్ = తనను; సకల = సమస్తమైన; జనములున్ = వారు; వినుతించినన్ = స్తుతి చేయగ; హరి = నారాయణుడు; భవుండు = శివుడు; విఘ్నమున్ = అంతరాయము; కావించిన = కలిగించిన; ఆ = ఆ; దక్షుని = దక్షుని; యజ్ఞము = యాగమును; ఘనముగన్ = గొప్పగ; చెల్లించెన్ = పూర్తి చేయించెను; కొఱత = కొరత; కాకుండగన్ = లేకుండగా.
భావము:- అని ఈ విధంగా సమస్త జనులూ తనను స్తుతించగా విష్ణుమూర్తి ప్రసన్నుడై శివుడు ధ్వంసం చేసిన దక్షుని యజ్ఞాన్ని ఏ కొరత లేకుండ చక్కగా పూర్తి చేయించాడు.

తెభా-4-206-క.
లాత్ముఁడు దా నగుటను
ల హవిర్భోక్త యయ్యు లజాక్షుండుం
బ్రటస్వభాగమున న
య్యళంకుఁడు తృప్తిఁ బొంది నె దక్షునితోన్.

టీక:- సకల = సమస్తమును; ఆత్ముడు = తానైనవాడు; తాన్ = తాను; అగుటను = అగుటచేత; సకల = సమస్త; హవిస్ = హవిస్సులకు; భోక్త = భుజించువాడు; అయ్యున్ = అయినప్పటికిని; జలజాక్షుండు = హరి {జలజాక్షుడు - జలజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; ప్రకటన్ = ప్రసిద్ధముగ; స్వ = తన; భాగమునను = భాగముతోనే; ఆ = ఆ; అకళంకుడు = మచ్చ లేనివాడు; తృప్తిన్ = సంతృప్తిని; పొంది = పొంది; అనె = అనెను; దక్షుని = దక్షుని; తోన్ = తోటి.
భావము:- తాను సకలాంతర్యామియై సకల హవిస్సులను భుజించేవాడై కూడ తన భాగమైన ‘త్రికపాల పురోడాశం’ మంత్రంతోనే తృప్తిపడి దక్షునితో ఇలా అన్నాడు.

తెభా-4-207-వ.
“అనఘా! యేనును బ్రహ్మయు శివుండు నీ జగంబులకుఁ గారణభూతులము; అందు నీశ్వరుఁడును, నుపద్రష్టయు స్వయంప్రకాశుండు నైన నేను గుణమయం బయిన యాత్మీయ మాయం బ్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతుభూతంబు లగు తత్తత్క్రియోచితంబు లయిన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందుచుండు; దట్టి యద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నా యందు నజ భవాదులను భూతగణంబులను మూఢుం డగువాడు వేఱుగాఁ జూచు; మనుజుండు శరీరంబునకుఁ గరచరణాదులు వేఱుగాఁ దలంపని చందంబున మద్భక్తుం డగువాఁడు నా యందు భూతజాలంబు భిన్నంబుగాఁ దలంపఁడు; కావున మా మువ్వుర నెవ్వండు వేఱు చేయకుండు వాఁడు కృతార్థుం"డని యానతిచ్చిన దక్షుండును.
టీక:- అనఘా = పుణ్యుడ; ఏనున్ = నేను; బ్రహ్మయు = బ్రహ్మదేవుడు; శివుండున్ = శివుడు; ఈ = ఈ; జగంబుల్ = లోకముల; కున్ = కు; కారణభూతులము = కారణము యైనవారము; అందున్ = అందులో; ఈశ్వరుండను = ప్రభువును; ఉపద్రష్టయు = పర్యవేక్షకుడను; స్వయంప్రకాశుండును = స్వంతమైన ప్రకాశము కలవాడను; ఐన = అయిన; నేను = నేను; గుణ = త్రిగుణ; మయంబున్ = కూడినది; అయిన = అయిన; ఆత్మీయ = నా యొక్క; మాయన్ = మాయను; ప్రవేశించి = చేరి; జనన = పుట్టుక; వృద్ధి = వృద్ధి; విలయంబుల = విలయముల; కున్ = కు; హేతుభూతంబులు = కారణము యైనవి; అగు = అయిన; తత్తత్ = అయా; క్రియా = పనులకు; ఉచితంబులు = తగునవి; అయిన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆది = మొదలగు; నామధేయంబులన్ = పేర్లను; ఒందుచున్ = పొందుతూ; ఉండుదు = ఉంటాను; అట్టి = అటువంటి; అద్వితీయ = రెండవది లేనట్టి, తిరుగులేని; బ్రహ్మ = పరబ్రహ్మ; రూపకుండను = రూపము కలవాడను; ఐన = అయిన; నా = నా; అందున్ = నుండి; అజ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆదులను = మొదలైనవారిని; భూత = జీవ; గణంబులను = జాలములను; మూఢుండు = తెలివిలేనివాడు; అగువాడు = అయినవాడు; వేఱుగా = వేరువేరుగా; చూచు = చూచును; మనుజుండు = మానవుడు; శరీరంబున్ = దేహమున; కున్ = కు; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆదులు = మొదలగునవి; వేఱుగా = వేరువేరుగా; తలంపని = తలచని; చందంబునన్ = వలెనే; మత్ = నా యొక్క; భక్తుండు = భక్తుడు; అగువాడు = అయినవాడు; నా = నా; అందున్ = ఎడల; భూత = జీవ; జాలంబున్ = గణములను; భిన్నంబు = వేరు; కాన్ = అగునట్లు; తలంపడు = అనుకొనడు; కావునన్ = అందుచేత; మా = మా; మువ్వురన్ = ముగ్గురను; ఎవ్వండు = ఎవరైతే; వేఱుచేయకుండు = వేరుగా చూడకుండునో; వాడు = వాడు; కృతార్థుండు = ప్రయోజనము తీర్చుకొన్నవాడు; అని = అని; ఆనతిచ్చిన = ఉపదేశించగా; దక్షుండును = దక్షుడును.
భావము:- “పుణ్యాత్ముడా! నేనూ, బ్రహ్మా, శివుడూ ఈ లోకాలకు కారణభూతులం. వారిలో నేను ఈశ్వరుడను, సాక్షిని, స్వయంప్రకాశుడను అయి త్రిగుణాత్మకమైన నా మాయలో ప్రవేశించి సృష్టి స్థితి లయ కార్యాలకు కారణాలైన ఆయా పనులకు బ్రహ్మ రుద్రుడు మొదలైన నామాలను పొందుతాను. నాకంటె వేరైన పరబ్రహ్మ రూపం లేదు. బ్రహ్మ శివుడు మొదలైనవారిని, జీవకోటిని బుద్ధిహీనుడు నాకంటె వేరుగా చూస్తాడు. మనుష్యుడు తన చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలను తన శరీరం కంటె వేరుగా చూడనట్లు నా భక్తుడు జీవులను నాకంటె వేరుగా భావింపడు. కనుక మా ముగ్గురిని ఎవడైతే వేరు వేరుగా చూడడో వాడే ధన్యుడు” అని ఉపదేశించగా దక్షుడు...

తెభా-4-208-క.
విని విష్ణు దేవతాకం
నఁగాఁ ద్రికపాలకలిత గు నా యాగం
బునఁ దగ నవ్విష్ణుని పద
జంబులు పూజ చేసి వారని భక్తిన్.

టీక:- విని = విని; విష్ణు = విష్ణువు; దేవతాకంబున్ = దేవతగా కలది; అనగాన్ = అన్నట్లుగా; త్రికపాల = మూడు కుండలు; కలితము = కలిగినది; అగు = అయిన; ఆ = ఆ; యాగంబునన్ = యజ్ఞములో; తగన్ = తగినట్లు; ఆ = ఆ; విష్ణుని = నారాయణుని; పద = పాదములు అనెడి; వనజంబులు = పద్మములు {వనజము - వనము (నీరు) యందు జము (పుట్టినది), పద్మము}; పూజ = పూజ; చేసి = చేసి; వారని = హద్దులేని; భక్తిన్ = భక్తితో.
భావము:- (విష్ణువు ఉపదేశాన్ని దక్షుడు) విని విష్ణుదేవతాకమైన త్రికపాల పురోడాశ మనే యజ్ఞాన్ని చేసి విష్ణుమూర్తి పాదపద్మాలను పరమభక్తితో పూజించాడు.

తెభా-4-209-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా...

తెభా-4-210-సీ.
అంగప్రధానక యాగంబులను జేసి-
మరుల రుద్రుని ర్థిఁ బూజ
చేసి విశిష్టేష్ట శిష్టభాగమున ను-
వసాన కర్మంబుఁ విలి తీర్చి
తాను ఋత్త్విక్కులుఁ గ సోమపులఁ గూడి-
వభృథ స్నానంబు లాచరించి
డఁక నవాప్త సల ఫలకాముఁడై-
నరు దక్షునిఁ జూచి ర్మబుద్ధి

తెభా-4-210.1-తే.
లిగి సుఖవృత్తి జీవింతుఁగాక యనుచుఁ
లికి దివిజులు మునులును బ్రాహ్మణులును
నిరి నిజమందిరముల; కా లజనయన
వులు వేంచేసి రాత్మీయ వనములకు.

టీక:- అంగ = భాగములతో కూడిన; ప్రధానక = ప్రధానమైనట్టి; యాగంబులను = యహ్ఞములు; చేసి = వలన; అమరుల = దేవతలను; రుద్రుని = శివుని; అర్థిన్ = కోరి; పూజ = పూజ; చేసి = చేసి; విశిష్ట = ప్రత్యేకమైన; ఇష్ట = యాగమును; శిష్ట = ప్రథాన; భాగమునను = భాగమున; ఉదవసాన = ఉద్వసానము అనెడి {ఉదవసానము - ఉత్ (నీరు) తో అవసానము (పూర్తి అగునప్పుడు చేయునట్టిది), ఉద్వాసనము}; కర్మంబున్ = కర్మములను; తవిలి = పూని; తీర్చి = పూర్తిచేసి; తాను = తాను; ఋత్విక్కులున్ = ఋత్విక్కులు; తగన్ = తగ్గట్లు; సోమపులన్ = సోమయాజులు {సోమపులు - యాగముచేసి అవశిష్టమైన సోమలతరసములు తాగినవారు, సోమయాజులు}; కూడి = కూడి; అవభృతస్నానము = యజ్ఞాంతస్నానము; ఆచరించి = చేసి; కడకన్ = పూనికతో; అవాప్త = ప్రాప్తించిన; సకల = సమస్తమైన; ఫల = ఫలించిన; కాముడు = కామములు కలవాడు; ఐ = అయ్యి; తనరు = అతిశయించిన; దక్షునిన్ = దక్షుని; చూచి = చూసి; ధర్మబుద్ధి = ధర్మబుద్ధి; కలిగిన = కలిగి.
సుఖ = సుఖమైన; వృత్తిన్ = విధముగ; జీవింతుగాక = జీవించెదవుగాక; అనుచున్ = అంటూ; పలికి = పలికి; దివిజులు = దేవతలు; మునులును = మునులు; బ్రాహ్మణులును = బ్రాహ్మణులు; చనిరి = వెళ్ళిరి; నిజ = తమ; మందిరముల్ = మందిరముల; కున్ = కు; ఆ = ఆ; జలజనయన = విష్ణువు; భవులు = శివుడు; వేంచేసి = వెళ్ళిరి; ఆత్మీయ = స్వంత; భవనముల్ = నివాసముల; కున్ = కు.
భావము:- దక్షుడు అంగప్రధానకాలైన యాగాలను చేసి, దేవతలను, శివుణ్ణి పూజించి, వారి వారి భాగాలను వారికి సమర్పించి, ఋత్విక్కులతోను సోమపానం చేసినవారితోను అవభృథ స్నానం చేసి, యజ్ఞఫలాన్ని సమగ్రంగా పొందాడు. దేవతలు, మునులు, బ్రాహ్మణులు దక్షుని చూచి “ధర్మబుద్ధి కలిగి సుఖంగా జీవింతువు గాక!” అని దీవించి తమ తమ గృహాలకు వెళ్ళారు. విష్ణువు, శివుడు తమ తమ మందిరాలకు వెళ్ళారు.

తెభా-4-211-వ.
అంత దాక్షాయణి యయిన సతీదేవి పూర్వకళేబరంబు విడిచి హిమవంతునకు మేనక యందు జనియించి విలయకాలంబునం బ్రసుప్తం బయిన శక్తి సృష్టికాలంబున నీశ్వరునిఁ బొందు చందంబునఁ బూర్వదయితుండగు రుద్రుని వరించె నని దక్షాధ్వర ధ్వంసకుం డగు రుద్రుని చరిత్రంబు బృహస్పతి శిష్యుండైన యుద్ధవునకు నెఱింగించె; నతండు నాకుం జెప్పె; నేను నీకుం జెప్పి;"తని మైత్రేయుండు వెండియు విదురున కిట్లనియె.
టీక:- అంత = అంతట; దాక్షాయణి = దక్షుని పుత్రిక; అయిన = అయిన; సతీదేవి = సతీదేవి; పూర్వ = పాత; కళేబరంబున్ = శరీరమును; విడిచి = వదలి; హిమవంతునకు = హిమవంతునకు; మేనక = మేనక; అందున్ = అందు; జనియించి = పుట్టి; విలయ = ప్రళయ; కాలంబునన్ = సమయము నందు; ప్రసుప్తంబు = బాగుగ నిద్రించినది; అయిన = అయిన; శక్తి = శక్తి; సృష్టికాలంబునన్ = సృష్టికాలమున; ఈశ్వరుని = శివుని; పొందు = చెందు; చందంబునన్ = విధముగ; పూర్వ = పూర్వపు; దయితుండు = ప్రియుడు; అగు = అయిన; రుద్రుని = శివుని; వరించెన్ = వరించెను; అని = అని; దక్ష = దక్షుని; అధ్వర = యాగమును; ధ్వంసకుడు = ధ్వంసము చేసినవాడు; అగు = అయిన; రుద్రుని = శివుని; చరితంబున్ = వర్తనమును; బృహస్పతి = బృహస్పతి; శిష్యుండు = శిష్యుడు; ఐన = అయిన; ఉద్ధవున్ = ఉద్ధవుని; కున్ = కి; ఎఱింగించె = తెలిపెను; అతండు = అతడు; నాకున్ = నాకు; చెప్పెన్ = చెప్పెను; నేను = నేను; నీకున్ = నీకు; చెప్పితిన్ = చెప్పాను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; వెండియున్ = మరల; విదురున్ = విదురున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఆ తరువాత దక్షుని కూతురైన సతీదేవి పూర్వ శరీరాన్ని విడిచి, హిమవంతునకు, మేనకకు కుమార్తెగా జన్మించి, ప్రళయకాలంలో ప్రస్తుప్తమైన శక్తి సృష్టికాలంలో ఈశ్వరుని పొందిన విధంగా తన పూర్వభర్త అయిన రుద్రుని వరించింది” అని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన రుద్రుని చరిత్రను బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవునకు చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు చెప్పాడు. నేను నీకు చెప్పాను” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-212-క.
"ఈ యాఖ్యానముఁ జదివిన
ధీయుతులకు వినినయట్టి ధీరుల కైశ్వ
ర్యాయుః కీర్తులు గలుగును;
బాయును దురితములు; దొలఁగు వబంధంబుల్."

టీక:- ఈ = ఈ; ఆఖ్యానమున్ = కథను; చదివిన = చదివిన; ధీ = బుద్ధిబలముతో; యుతులకు = కూడినవారికి; వినిన = విన్న; అట్టి = అటువంటి; ధీరుల్ = బుద్ధిబలము కలవారి; కిన్ = కి; ఐశ్వర్య = ఐశ్వర్యము; ఆయుస్ = జీవితకాలము; కీర్తులున్ = కీర్తి; కలుగును = కలుగును; పాయును = దూరమగును; దురితములున్ = పాపములు; తొలగున్ = తొలగిపోవును; భవబంధంబుల్ = సంసారబంధములు.
భావము:- “ఈ కథను చదివిన బుద్ధిమంతులకు, విన్న ధీరులకు ఐశ్వర్యం, ఆయువు, కీర్తి లభిస్తాయి. పాపాలు, భవబంధాలు తొలగిపోతాయి.”

తెభా-4-213-వ.
అని వెండియు నిట్లనియె.
టీక:- అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అని ఇంకా ఇలా అన్నాడు.

తెభా-4-214-క.
"విను సనకాదులు నారదుఁ
డును హంసుఁడు నరుణియు ఋభుఁడు యతియుఁ గమలా
జులు నైష్ఠికు లనికే
ను లగుటన్ సాగవయ్యెఁ ద్వంశంబుల్.

టీక:- విను = వినుము; సనక = సనకుడు; ఆదులు = మొగలగువారు; నారదుడును = నారదుడు; హంసుడున్ = హంసుడు; అరుణియు = అరుణి; ఋభుడు = ఋభుడు; యతియున్ = యతియును; కమలాసనజులు = బ్రహ్మపుత్రులు {కమలాసనుజులు - కమలాసనుడు (పద్మమున ఆసీనుడు, బ్రహ్మదేవుడు)కి జులు (పుట్టినవారు), బ్రహ్మపుత్రులు}; నైష్ఠికులు = నిష్ఠకలవారికి; అనికేతనులు = సన్యాసులు {అనికేతనులు - నికేతనములు (నివాసములను) విడిచినవారు, సన్యాసులు}; అగుటన్ = అగుటవలన; సాగవు = సాగనివి; అయ్యెన్ = అయ్యెను; తత్ = వారి; వంశంబుల్ = వంశములు.
భావము:- “విదురా! విను. సనకుడు మొదలైనవారు, నారదుడు, హంసుడు, అరుణి, ఋభుడు, యతి అనే బ్రహ్మ కుమారులందరూ నైష్ఠికులై గృహస్థులు కాకపోవటం వల్ల వారి వంశాలు కొనసాగలేదు.

తెభా-4-215-వ.

అధర్మ శాఖలు


మఱియు నధర్మునకు ‘మృష’ యను భార్య యందు ‘దంభుండు’ను, ‘మాయ’ యను నంగనయుం బుట్టిరి; అధర్మ సంతానం బగుట వారిరువురును మిథునం బైరి; వారిని సంతాన హీనుండగు నిరృతి గైకొనియె; వారలకు ‘లోభుండును’ ‘నికృతి’ యను సతియునుం గలిగి మిథునం బైరి; ఆ మిథునంబునకుఁ ’గ్రోధుండు’ ‘హింస’ యను నంగనయుం బుట్టి మిథునం బైరి; ఆ మిథునంబునకుఁ ’గలి’యు ‘దురుక్తి’ యను నతివయుం జన్మించి దాంపత్యంబు గయికొనిరి; ఆ దంపతులకు ‘భయ’ ‘మృత్యువు’ లను మిథునంబు గలిగె; దాని వలన ‘యాతన’యు ‘నిరయంబు’ను బుట్టిరి; వీరలు సంసార హేతువగు నధర్మ తరుశాఖ లయి నెగడిరి; వీని శ్రేయస్కాముండగు జనుం డీషణ్మాత్రంబు ననువర్తింపం జన; దివ్విధంబునంబ్రతిసర్గంబును సంగ్రహంబున వినిపించితి; నిప్పుణ్యకథ నెవ్వండేని ముమ్మాఱు వినిన నతండు ముమ్మాటికి నిష్పాపుం డగును;"నని చెప్పి; మఱియు నిట్లనియె.

టీక:- మఱియును = ఇంకను; అధర్మున్ = అధర్ముని; కున్ = కి; మృష = మృష {మృష - అసత్యము}; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; దంభుండును = దంభుడు {దంభుడు - దబాయింపు}; మాయ = మాయ; అను = అనెడి; అంగనయున్ = స్త్రీ; పుట్టిరి = జనించిరి; అధర్మ = అధర్మ; సంతానంబు = సంతానము; అగుటన్ = అగుటచేత; వారు = వారు; ఇరువురును = ఇద్దరును; మిధునంబున్ = భార్యాభర్తలు; ఐరి = అయిరి; వారిని = వారిని; సంతాన = సంతానము; హీనుండు = లేనివాడు; అగు = అయిన; నిరృతి = నిరృతి {నిరృతి - అభాగ్యము, ఋతము (సత్యమైనది) లేనివాడు}; కైకొనియెన్ = తీసుకొనెను; వారలకు = వారికి; లోభుండును = లోభుడు {లోభుడు - పిసినారి}; నికృతి = నికృతి {నికృతి - వంచన, తిరస్కారము}; అను = అనెడి; సతియునున్ = స్త్రీ; కలిగి = జనించి; మిథునంబున్ = భార్యాభర్తలు; ఐరి = అయిరి; ఆ = ఆ; మిథునంబున్ = భార్యాభర్తలు; కున్ = కి; క్రోధుండు = క్రోధుడు {క్రోధుడు - కోపము}; హింస = హింస {హింస - బాధించుట}; అను = అనెడి; అంగనయున్ = స్త్రీ; పుట్టి = జనించి; మిథునంబున్ = భార్యాభర్తలు; ఐరి = అయిరి; ఆ = ఆ; మిథునంబున్ = భార్యాభర్తలు; కున్ = కు; కలియు = కలి {కలి - జగడము}; దురుక్తి = దురుక్తి {దురుక్తి - నింద}; అను = అనెడి; యువతియున్ = స్త్రీ; జన్మించి = పుట్టి; దాంపత్యంబున్ = దాంపత్యమును; కైకొనిరి = చేపట్టిరి; ఆ = ఆ; దంపతుల్ = దంపతుల; కున్ = కి; భయ = భయము {భయము - జరగబోవుదాని గురించి ఆందోళన}; మృత్యువులు = మృత్యువులు {మృత్యువు - మరణము}; అను = అనెడి; మిథునంబున్ = భార్యాభర్తలు; కలిగెన్ = అయిరి; దాని = ఆ మిథునము; వలన = వలన; యాతనయు = యాతన {యాతన - తీవ్రవేదన}; నిరయంబును = నిరయంబు {నిరయంబు - నరకము}; పుట్టిరి = పుట్టిరి; వీరలు = వీరు; సంసార = సంసారమునకు; హేతువు = కారణము; అగు = అయిన; అధర్మ = అధర్మమము అనెడి; తరు = వృక్షమునకు; శాఖలు = కొమ్మలు; అయి = అయ్యి; నెగడిరి = వర్థిల్లిరి; వీనిన్ = వీటిని; శ్రేయస్ = శుభములను; కాముండు = కోరువాడు; అగు = అయిన; జనుండు = వాడు; ఈషణ్మాత్రంబునను = కొంచముకూడ; అనువర్తింపను = అనుసరించి నడచుట; చనదు = తగినదికాదు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ప్రతిసర్గంబును = మన్వాదిసృష్టి; సంగ్రహంబున = సంగ్రహముగ; వినిపించితి = చెప్పితిని; ఈ = ఈ; పుణ్య = పుణ్య; కథను = కథను; ఎవ్వండేని = ఎవడైనను; ముమ్మాఱు = మూడు (3) మారులు; వినిన్ = వినినచో; అతండు = అతడు; ముమ్మాటికి = తప్పకుండగ; నిష్పాపుండు = పాపము లేనివాడు; అని = అని; చెప్పి = చెప్పి; మఱియును = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఇంకా అధర్మునకు మృష అనే భార్యయందు దంభుడు అనే కుమారుడు, మాయ అనే కుమార్తె జన్మించారు. అధర్మ సంతానం కనుక వారిద్దరూ దంపతులయ్యారు. వారిద్దరినీ సంతానం లేని నిరృతి దత్తు చేసుకున్నాడు. ఆ దంపతులకు లోభుడు అనే కుమారుడు, నికృతి అనే కుమార్తె కలిగి వాళ్ళు దంపతులయ్యారు. వారికి క్రోధుడు అనే కొడుకు, హింస అనే కూతురు పుట్టి భార్యాభర్తలయ్యారు. ఆ జంటకు కలి అనే కుమారుడు, దురుక్తి అనే కుమార్తె జన్మించి దంపతులయ్యారు. ఆ దంపతులకు భయం అనే పురుషుడు, మృత్యువు అనే స్త్రీ జన్మించి దంపతులయ్యారు. వారికి యాతన, నిరయం అనే జంట జన్మించి దంపతులయ్యారు. వీరు సంసార హేతువైన అధర్మం అనే వృక్షానికి కొమ్మలై వ్యాపించారు. తన మేలు కోరే మానవు డెవ్వడూ ఏమాత్రం వారిని అనుసరించకూడదు. ఈ విధంగా ప్రతిసర్గాన్ని నీకు సంగ్రహంగా వినిపించాను. ఈ పుణ్యకథను మూడుసార్లు చదివినవాడు పుణ్యాత్ముడౌతాడు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.