Jump to content

పోతన తెలుగు భాగవతము/చతుర్ధ స్కంధము/శివుం డనుగ్రహించుట

వికీసోర్స్ నుండి


తెభా-4-126-తే.
ఇంతయును మున్ను మనమున నెఱిఁగి యున్న
తన విశ్వాత్మకుండును మలలోచ
నుండు నన నొప్పు నారాయణుండు నజుఁడుఁ
జూడ రారైరి మున్ను దక్షుని మఖంబు.

టీక:- ఇంతయును = ఇదంతా; మున్ను = ముందే; మనమున్ = మనసులలో; ఎఱిగి = తెలిసి; ఉన్న = ఉన్నట్టి; కతన = కారణముచేత; విశ్వాత్మకుండును = విష్ణువు {విశ్వాత్మకుడు - విశ్వమే తన స్వరూపమైన వాడు, విష్ణువు}; కమలలోచనుండును = విష్ణువు {కమలలోచనుడు - కమలముల వంటి కన్నుల కలవాడు, విష్ణువు}; అనన్ = అనగా; ఒప్పు = ఒప్పెడి; నారాయణుండున్ = విష్ణువు {నారాయణుడు - నారములు (నీరు)యందు ఉండువాడు, విష్ణువు}; అజుడున్ = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములేనివాడు, బ్రహ్మదేవుడు}; చూడన్ = చూడటానికి; రారు = రానివారు; ఐరి = అయిరి; మున్ను = ముందటి; దక్షునిన్ = దక్షుని; మఖంబున్ = యాగమును.
భావము:- “ఇదంతా ముందే మనస్సులో తెలుసుకొని ఉండడం చేత విశ్వస్వరూపుడు, కమలాక్షుడు అయిన నారాయణుడు, బ్రహ్మదేవుడు దక్షుని యజ్ఞాన్ని చూడటానికి రాలేదు.”

తెభా-4-127-వ.
అని చెప్పి “సుర లిట్లు విన్నవించినఁ జతుర్ముఖుండు వారల కిట్లనియె.
టీక:- అని = అని; చెప్పి = చెప్పి; సురలు = దేవతలు; ఇట్లు = ఈ విధముగ; విన్నవించినన్ = చెప్పుకొనగ; చతుర్ముఖుండు = బ్రహ్మదేవుడు {చతుర్ముఖుడు - నాలుగు ముఖములు కలవాడు, బ్రహ్మదేవుడు}; వారల = వారి; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అని చెప్పి మైత్రేయుడు ఇంకా ఇలా అన్నాడు “దేవతలు ఈ విధంగా విన్నవించగా బ్రహ్మ వారితో ఇలా అన్నాడు.

తెభా-4-128-క.
"ఘ తేజోనిధి పురుషుం
యంబుఁ గృతాపరాధుఁ యినను దా మ
ల్ల ప్రతికారముఁ గావిం
చి జనులకు లోకమందు సేమము గలదే?"

టీక:- ఘన = గొప్ప; తేజస్ = తేజస్సునకు; నిధి = నిధివంటివాడు; పురుషుండు = పౌరుషవంతుడు; అనయంబున్ = అవశ్యము; కృత = చేసిన; అపరాధుడు = అపరాధము కలవాడు; అయినను = అయినప్పటికిని; తాము = తాము; అల్లన = మెల్లగ; ప్రతీకారమున్ = ప్రతీకారమును; కావించినన్ = చేసినట్టి; జనుల = జనముల; కున్ = కు; లోకము = ప్రపంచము; అందు = లో; సేమము = క్షేమము; కలదే = ఉన్నదా ఏమి.
భావము:- “మహాతేజస్సంపన్నుడైనవాడు అపరాధం చేసినా తిరిగి అతనికి అపకారం చేసేవారికి ఈ లోకంలో క్షేమం ఉంటుందా?”

తెభా-4-129-వ.
అని మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.

తెభా-4-130-క.
"క్రతుభాగార్హుం డగు పశు
తి నీశ్వరు నభవు శర్వు ర్గుని దూరీ
కృ యజ్ఞభాగుఁ జేసిన
తి దోషులు దుష్టమతులు గు మీ రింకన్.

టీక:- క్రతు = యాగములందు; భాగా = భాగమునకు; అర్హుండు = అర్హత కలవాడు; అగు = అయిన; పశుపతిన్ = శివుని {పశుపతి - పాశములచే కట్టబడినవారికి (జీవులకు) పతి, శివుడు}; ఈశ్వరున్ = శివుని {ఈశ్వరుడు - ప్రభువు, శివుడు}; అభవున్ = శివుని {అభవుడు - భవము (పుట్టుక)లేనివాడు, శివుడు}; శర్వున్ = శివుని; భర్గుని = శివుని; దూరీకృత = దూరము చేయబడిన; యజ్ఞ = యజ్ఞము నందలి; భాగున్ = భాగము కలవానిని; చేసిన = చేసినట్టి; అతి = మిక్కిలి; దోషులు = దోషము చేసినవారు; దుష్ట = చెడు; మతులు = బుద్ధులు కలవారు; అగు = అయిన; మీరు = మీరు; ఇంకన్ = ఇంక.
భావము:- యజ్ఞంలో హవిర్భాగం అందుకొనడానికి యోగ్యుడైన పశుపతి, ఈశ్వరుడు, అభవుడు, శర్వుడు, భర్గుడు అయిన పరమేశ్వరుణ్ణి యజ్ఞభాగానికి దూరం చేయడం అనే గొప్ప దోషాన్ని చేసిన దుష్టులు మీరు.

తెభా-4-131-సీ.
పూని యే దేవుని బొమముడి మాత్రన-
లోకపాలకులును లోకములును
నా మొందుదు; రట్టి యీశుండు ఘన దురు-
క్త్యస్త్ర నికాయ విద్ధాంతరంగుఁ
డును బ్రియా విరహితుండును నైనవాఁ డమ్మ-
హాత్మునిఁ ద్రిపుర సంహారకరుని
ఖపునస్సంధానతి నపేక్షించు మీ-
లు చేరి శుద్ధాంతరంగు లగుచు

తెభా-4-131.1-తే.
క్తినిష్ఠలఁ దత్పాద ద్మ యుగళ
న పరిగ్రహ పూర్వంబుగాఁగ నతని
రణ మొందుఁ డతండు ప్రన్నుఁ డయినఁ
దివిరి మీ కోర్కి సిద్ధించు దివిజులార!"

టీక:- పూని = పూనుకొని; ఏ = ఏ; దేవుని = దేవుని యొక్క; బొమముడి = కనుబొమలు ముడిపడిన; మాత్రన = మాత్రముచేతనే; లోకపాలకులును = లోకములను పాలించువారును; లోకములును = భువనములును; నాశనము = నాశనమును; ఒందుదురు = పొందుతారో; అట్టి = అటువంటి; ఈశుండు = శివుడు {ఈశుడు - ప్రభువు, శివుడు}; ఘన = గొప్ప; దురుక్తి = దుష్టపుమాటలు అనెడి; శస్త్ర = శస్త్రముల; నికాయ = సమూహములచేత; విద్ధ = దెబ్బతిన్న; అంతరంగుండును = మనసుకలవానిని; ప్రియా = ప్రియమైనభావన, భార్య; విరహితుండును = లేనివాడును; ఐనవాడు = అయినవాడు; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; త్రిపురసంహారకరుని = శివుని {త్రిపురసంహారకరుడు - త్రిపురములను నాశనముచేసినట్టివాడు, శివుడు}; మఖ = యజ్ఞమును; పునః = మరల; సంధాన = ఏర్పరచెడి; మతిన్ = విధమును; అపేక్షించు = కోరు; మీరలు = మీరు; చేరి = కూడి; శుద్ధా = పరిశుద్ధమైన; అంతరంగులు = మనసులు కలవారు; అగుచున్ = అవుతూ.
భక్తి = భక్తి; నిష్ఠలన్ = నిష్ఠలతో; తత్ = అతని; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మముల; యుగళ = జంటను; ఘన = గొప్పగా; పరిగ్రహ = పట్టుకొనుటతో; పూర్వకంబు = కూడినది; కాగ = అగునట్లు; అతనిన్ = అతనిని; శరణమున్ = శరణమును; ఒందుడు = పొందండి; అతండు = అతడు; ప్రసన్నుడు = సంతుష్టుడు; అయినన్ = అయినచో; తివిరి = కోరు; మీ = మీ; కోర్కి = కోరిక; సిద్ధించు = సఫలమగును; దివిజులార = దేవతలార.
భావము:- ఏ మహాదేవుడు కోపంతో కనుబొమలు ముడిస్తే లోకాలూ, లోకపాలకులూ నశిస్తారో ఆ మహనీయుని మనస్సు దక్షుని దురుక్తులు అనే బాణాలు గ్రుచ్చుకొని ఇదివరకే నొచ్చింది. ఇప్పుడు ఆ మహాత్మునికి భార్యావియోగం కూడా ప్రాప్తించింది. తిరిగి యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనే కోరిక మీకు ఉన్నట్లయితే త్రిపుర సంహారుడైన ఆ హరుని, ఆ మహాదేవుని, ఆ మహానుభావుని నిండుహృదయంతో, నిర్మల భక్తితో ఆశ్రయించండి. ఆయన పాదపద్మాలపై బడి శరణు వేడండి. ఆ దయామయుడు దయ దలిస్తే మీ కోరిక నెరవేరుతుంది. ”

తెభా-4-132-వ.
అని మఱియు నిట్లనియె;నద్దేవుని డాయం జన వెఱతు మని తలంపకుండు; యతనిఁ జేరు నుపాయం బెఱింగిపుమంటి రేని, నేను నింద్రుండును మునులును మీరలును మఱియు దేహధారు లెవ్వ రేని నమ్మహాత్ముని రూపంబు నతని బలపరాక్రమంబుల కొలఁదియు నెఱుంగజాల; మతండు స్వతంత్రుండు గావునఁ దదుపాయం బెఱింగింప నెవ్వఁడు సమర్థుం డగు; నయిన నిపుడు భక్తపరాధీనుండును శరణాగత రక్షకుండు నగు నీశునిఁ జేరం బోవుద;"మని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం గూడి కైలాసాభిముఖుఁ డై చనిచని.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఆ = ఆ; దేవుని = దేవుని; డాయన్ = దగ్గరకు; చనన్ = వెళ్ళుటకు; వెఱతుము = భయపడుతున్నాము; అని = అని; తలంపకుండు = అనుకొనకండి; అతనిన్ = అతనిని; చేరున్ = చేరెడి; ఉపాయంబున్ = ఉపాయములు; ఎఱిగింపుము = తెలుపుము; అంటిరేని = అంటే; నేనున్ = నేను; ఇంద్రుండును = ఇంద్రుడు; మునులును = మునులు; మీరలును = మీరు; మఱియున్ = ఇంక; దేహధారులు = శరీరము ధరించినవారు; ఎవ్వరేని = ఎవరైనాసరే; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; రూపంబున్ = స్వరూపము; అతనిన్ = అతని; బల = బలము; పరాక్రమంబుల = పరాక్రమములను; కొలదియున్ = కొంచమైనా, కొలతను; ఎఱుంగన్ = తెలిసికొనుటకు; చాలము = సరిపోము; అతండు = అతడు; స్వతంత్రుండు = స్వతంత్రుడు {స్వతంత్రుడు - తన సంకల్పముగా తను వర్తించువాడు}; కావునన్ = కనుక; తత్ = ఆ; ఉపాయంబున్ = ఉపాయములను; ఎఱింగిపన్ = తెలుపుటకు; ఎవ్వడు = ఎవడు; సమర్థుండు = సామర్థ్యము కలవాడు; అగు = అవును; అయినన్ = అయినప్పటికిని; ఇపుడు = ఇప్పుడు; భక్త = భక్తుల; పరాధీనుండును = ఎడల అధీనుడును; శరణు = శరణమునకు; ఆగత = వచ్చువానిని; రక్షకుండున్ = రక్షించువాడును; అగు = అయిన; ఈశునిన్ = శివుని; చేరన్ = దగ్గరకు; పోవుదము = వెళ్ళెదము; అని = అని; పలికి = చెప్పి; పద్మసంభవుండు = బ్రహ్మదేవుడు {పద్మసంభవుడు - పద్మమున సంభవించినవాడు, బ్రహ్మదేవుడు}; దేవ = దేవతలు; పితృగణ = పితృగణములు; ప్రజాపతులన్ = ప్రజాపతులను; కూడి = కలిసి; కైలాస = కైలాసము; అభిముఖుడు = వైపు వెళ్ళువాడు; ఐ = అయ్యి; చనిచని = వెళ్ళి.
భావము:- అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు “మేము ఆయనను సమీపించటానికి భయపడుతున్నాము అని భావించకండి. ఆయన దగ్గరకు పోయే ఉపాయం నన్ను చెప్పమంటారా? నేను, దేవేంద్రుడు, మునులు, మీరు, దేహధారులు ఎవరుకూడా ఆ మహాత్ముని స్వరూపాన్నీ, ఆయన బలపరాక్రమాల పరిమాణాన్నీ తెలుసుకోలేము. ఆయన సర్వస్వతంత్రుడు. కాబట్టి ఆయనను సమీపించే ఉపాయం చెప్పటానికి ఎవ్వరూ సమర్థులు కారు. అయినా ఆయన భక్తులకు అధీనుడు. శరణు జొచ్చిన వారిని రక్షించేవాడు. అందుచేత ఆయన వద్దకు మనం అందరం కలిసి వెళ్ళటం మంచిది” అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలను, పితృదేవతలను, ప్రజాపతులను వెంటబెట్టుకొని కైలాసానికి బయలుదేరి పోయి పోయి...

తెభా-4-133-ఉ.
భాసురలీలఁ గాంచిరి సుర్వులు భక్తజనైక మానసో
ల్లాముఁ గిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా
వాము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కై
లాముఁ గాంతి నిర్జిత కుక్షితిభృత్సుమహద్విభాసమున్.

టీక:- భాసుర = ప్రకాశిస్తున్న; లీలన్ = విధమును; కాంచిరి = చూసిరి; సుపర్వులు = దేవతలు; భక్త = భక్తులైన; జన = జనుల; ఏక = ముఖ్యమైన; మనస్ = మనసునకు; ఉల్లాసమున్ = సంతోషమును కలిగించునది; కిన్నరీ = కిన్నరీ; జన = స్త్రీల; విలాసమున్ = విలాసముల నివాసము; నిత్య = శాశ్వతమైన; విభూతి = వైభవములకు; మంగళ = శుభములకు; ఆవాసము = నివాసము; సిద్ధ = సిద్ధులకు; గుహ్యక = గుహ్యకులకు; నివాసము = నివాసము; రాజత = వెండివంటి కాంతులను; భూ = పుట్టించి; వికాసి = వెలుగొందుచున్నది; కైలాసమున్ = కైలాసమును; కాంతి = కాంతిచేత; నిర్జిత = జయింపబడిన; కులక్షితిభృత్ = కులపర్వతముల యొక్క; సుమహత్ = చాలా గొప్ప; విభాసమున్ = ప్రకాశము గలది.
భావము:- ఆ విధంగా వెళ్ళిన దేవతలు భక్తుల మనస్సులకు అమితమైన ఆనందాన్ని కలిగించేదీ, కిన్నరస్త్రీలు విలాసంగా విహరించేదీ, శాశ్వతాలైన ఐశ్వర్యాలకూ శుభాలకూ స్థానమైనదీ, సిద్ధులూ యక్షులూ నివసించేదీ, వెండి వెలుగులతో నిండినదీ, తన అనంతకాంతులతో కులపర్వతాల శోభావైభవాన్ని పరాభూతం చేసేదీ అయిన కైలాస పర్వతాన్ని కనులపండువుగా దర్శించారు.

తెభా-4-134-సీ.
ధాతు విచిత్రితోదాత్త రత్నప్రభా-
సంగ తోజ్జ్వల తుంగ శృంగములును;
గిన్నర గంధర్వ కింపురుషాప్సరో-
న నికరాకీర్ణ సానువులును;
మానిత నిఖిల వైమానిక మిథున స-
ద్విహరణైక శుభ ప్రదేశములును;
మనీయ నవమల్లికా సుమనోవల్లి-
కా మతల్లీ లసత్కందరములు;

తెభా-4-134.1-తే.
మర సిద్ధాంగనా శోభితాశ్రమములు;
విబుధజన యోగ్య సంపన్నివేశములును
లిగి బహువిధ పుణ్యభోముల నొప్పు
వినుత సుకృతములకు దండ వెండికొండ.

టీక:- ధాతు = ధాతువులచే; విచిత్రిత = విచిత్రముగా చిత్రింపబడిన; ఉదాత్త = గొప్ప; రత్న = రత్నముల; ప్రభా = కాంతులతో; సంగత = కూడి; ఉజ్వలత్ = ప్రకాశిస్తున్న; తుంగ = ఎత్తైన; శృంగములును = శిఖరములును; కిన్నర = కిన్నర; గంధర్వ = గంధర్వ; కింపురుష = కింపురుష; అప్సరస = అప్సరస; జన = స్త్రీల; నికర = సమూహములతో; ఆకీర్ణ = నిండియున్నట్టి; సానువులును = చరియలును; మానిత = మన్నింపదగిన; నిఖిల = సమస్తమైన; వైమానిక = విమానములలో తిరుగు; మిథున = జంటల; సత్ = చక్కటి; విహరణ = విహరించుటలుకల; ఏక = కలిసి ఉన్న; శుభ = శోభకల; ప్రదేశములును = ప్రదేశములును; కమనీయ = చూడచక్కని; నవమల్లికా = తాజామల్లె; సుమనస్ = పూల; వల్లిక = తీగలఅల్లికలు; కామతల్ = కాడలతో; లీలన్ = లీలగా; లసత్ = ప్రకాశిస్తున్న; కందరములును = గుహలును; అమరన్ = అమరి యుండగ.
సిద్ధ = సిద్ధుల; అంగనా = స్త్రీలతో; శోభిత = శోభకలిగిన; ఆశ్రమములు = ఆశ్రమములు; విబుధ = దేవతా; జన = జనులకు; యోగ్య = తగిన; సంపత్ = సంపదలతో కూడిన; నివేశములును = గృహములును; కలిగి = కలిగినట్టి; బహువిధ = రకరకముల; పుణ్య = పవిత్ర; భోగములన్ = భోగములతోను; ఒప్పు = ఒప్పెడి; వినుత = ప్రసిద్ధమైన; సుకృతముల = పుణ్యముల; కున్ = కు; దండ = కూర్పులతో దండవంటిది; వెండికొండ = కైలాసపర్వతము.
భావము:- ధాతుద్రవాలతో పలురంగులు కలిగిన రతనాల కాంతులతో ఆ వెండికొండ ఎత్తైన శిఖరాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కొండచరియలు కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసలు మున్నగువారితో నిండి ఉన్నాయి. దేవతలు తమ భార్యలతో కూడి విమానాలపై ఆయా ప్రదేశాలలో విహరిస్తున్నారు. గుహలచుట్టూ చిక్కని విరజాజి పూలతీగలు అల్లుకొని ఉన్నాయి. అక్కడి ఆశ్రమాలలో దేవతాస్త్రీలు, సిద్ధస్త్రీలు ఉంటున్నారు. దేవతలు సంచరించటానికి అక్కడి చోట్లన్నీ తగి ఉన్నాయి. చేసిన పుణ్యాలకు పెక్కురకాల భోగాలను అక్కడ అనుభవిస్తున్నారు. ఆ వెండికొండ పుణ్యాల పూలదండగా ఉన్నది.

తెభా-4-135-వ.
అది మఱియును, మందార పారిజాత సరళ తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీ షార్జున చూత కదంబ నీప నాగ పున్నాగ చంపక పాట లాశోక వకుళ కుంద కురవక కన కామ్ర శతపత్ర కింశు కైలా లవంగ మాలతీ మధూక మల్లికా పనస మాధవీ కుట జోదుంబు రాశ్వత్థ ప్లక్ష వట హింగుళ భూర్జ పూగ జంబూ ఖర్జూ రామ్రాతక ప్రియాళు నారికే ళేంగుద వేణు కీచక ముఖర తరు శోభితంబును, కలకంఠ కాలకంఠ కలవింక రాజకీర మత్తమధుకర నానా విహంగ కోలాహల నినద బధిరీభూత రోదోంతరాళంబును, సింహ తరక్షు శల్య గవయ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్ర కుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్యసత్త్వ సమాశ్రయ విరాజితంబును, కదళీషండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతల లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జలవిహంగకుల కూజిత సంకులంబును, సలిలకేళీవిహరమాణ సతీరమణీ రమణీయ కుచమండల విలిప్త మృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగాతరంగణీ సమావృతంబును నైన కైలాసపర్వతంబు వొడగని, యరవిందసంభవ పురందరాది దేవగణంబు లత్యద్భుతానందంబులం బొంది ముందటఁ దార హీర హేమమయ విమాన సంకులంబును, పుణ్యజన మానినీ శోభితంబును నైన యలకాపురంబు గడచి; తత్పుర బాహ్యప్రదేశంబునం దీర్థపాదుండైన పుండరీకాక్షు పాదారవిందరజః పావనంబును, రతికేళీ వ్యాసంగ పరిశ్రమ నివారక సలిల కేళీవిలోల దేవకామినీ పీనవక్షోజ విలిప్త కుంకుమపంక సంగత పిశంగవర్ణ వారిపూర విలసితంబు నునై; నందాలకనందాభిధానంబులు గల నదీ ద్వితయంబు దాఁటి తత్పురోభాగంబున వనగజ సంఘృష్ట మలయజ పరిమిళిత మలయపవ నాస్వాదన ముహుర్ముహురు న్ముదిత మానస పుణ్యజనకామినీ కదంబంబును, వైదూర్య సోపాన సమంచిత కనకోత్పల వాపీ విభాసితంబును, గింపురుష సంచార యోగ్యంబును నగు సౌగంధిక వన సమీపంబు నందు.
టీక:- అది = అది; మఱియును = ఇంకను; మందార = మందారచెట్లు; పారిజాత = పారిజాతవృక్షములు; సరళ = తెల్లతెగడచెట్లు; తమాల = కానుగచెట్లు; సాల = మద్దిచెట్లు; తాల = తాడిచెట్లు; తక్కోల = తక్కోలచెట్లు; కోవిదార = ఎఱ్ఱకాంచనచెట్లు; శిరీష = శిరీషపూలచెట్లు; అర్జున = తెల్లమద్ధిచెట్లు; చూత = తియ్యమామిడిచెట్లు; కదంబ = కడిమిచెట్లు; నీప = మంకెన, కడిమి చెట్లు; నాగ = నాగమల్లి, సర్పగంధి చెట్లు; పున్నాగ = సురపొన్న చెట్లు; చంపక = సంపెంగ చెట్లు; పాటల = కలిగొట్టు చెట్లు; అశోక = అశోకవృక్షములు; వకుళ = పొగడచెట్లు; కుంద = మొల్ల; కురవక = ఎఱ్ఱగోరింట చెట్లు; కనకామ్ర = కనకాంబరము చెట్లు; శతపత్ర = తామర; కింశుక = మోదుగ చెట్లు; ఏలా = ఏలక్కాయ చెట్లు; లవంగ = లవంగచెట్లు; మాలతీ = జాజి; మధూక = ఇప్పచెట్లు; మల్లికా = మల్లెచెట్లు; పనస = పనసచెట్లు; మాధవీ = మాదీఫలచెట్లు, పూలగురివింద; కుటజ = కొండమల్లి; ఉదుంబర = అత్తి, మేడిచెట్టు; అశ్వత్థ = రావిచెట్టు; ప్లక్ష = జువ్విచెట్లు; వట = మఱ్ఱి చెట్లు; హింగుళ = ఇంగువ చెట్లు; భూర్జ = బూజపత్త్ర, కాగితపు చెట్లు; పూగ = పోకచెట్లు; జంబూ = నేరేడుచెట్లు; ఖర్జూర = ఖర్జూర, రాజపూగచెట్లు; ప్రియాళు = మోరటిచెట్లు; నారికేళ = కొబ్బరిచెట్లు; ఇంగుద = అందుగచెట్లు; వేణు = గారివెదురు; కీచక = బొంగువెదురుచెట్లు; ముఖర = మొదలైన; తరు = చెట్లతో; శోభితంబును = శోభిల్లుతున్నది; కలకంఠ = కోకిలలు; కాలకంఠ = నెమళ్ళు; కలవింక = పావురములు; రాజకీర = రామచిలుకలు; మత్తమధుకర = మదించిన తుమ్మెదలు; నానావిధ = రకరకముల; విహంగ = పక్షుల; కోలాహల = కోలాహలము; నినద = అరుపులతో; బధిరీ = చెవుడు; భూత = కలిగిస్తున్న; రోదస్ = ఆకాశ; అంతరాళంబును = అంతయును {అంతరాళము - ఎల్లదిక్కులకు నడిమి చోటు}; సింహ = సింహములు; తరక్షు = సివంగి; శల్య = ముళ్ళపందులు; గవయ = అడవిదున్నలు; శరభ = శరభమ-గములు; శాఖామృగ = కోతులు; వరాహ = అడవిపందులు; వ్యాఘ్ర = పెద్దపులులు; కుర్కుర = కుక్కలు; రురు = నల్లచారల దుప్పులు; మహిష = అడవిదున్నలు, ఎనుబోతులు; వృక = తోడేళ్ళు; సారంగ = లేళ్ళు; ప్రముఖ = మొదలైన ప్రసిద్ధమైన; వన్య = అడవి; సత్త్వ = జంతువులకు; సమ = చక్కటి; ఆశ్రయ = ఆశ్రయముగా; విరాజితంబును = విరాజిల్లుతున్నదియును; కదళీ = అరటి; షండ = తోపుల, సమూహములతో; మండిత = అలంకృతమైన; కమల = పద్మములు, తామరపూలు; కహ్లార = తెల్లకలువలు; కైరవ = ఎఱ్ఱకలువలు; కలిత = కూడిన; పులిన = ఇసుక; తల = ప్రదేశములు; లలిత = అందమైన; కమలాకర = సరోవరములు; విహరమాణ = ఎగురుతున్న; కలహంస = రాయంచ; కారండవ = కొక్కిరాలు; సారస = బెగ్గురుపక్షలు; చక్ర = చక్రవాకపక్షులు; బక = కొంగలు; జలకుక్కుట = నీటికోళ్ళు; ఆది = మొదలైన; జలవిహంగ = నీటిపక్షుల; కుల = సమూహముల; కూజిత = కూతలతో; సంకులంబును = కలగలపులుకలదియును; సలిల = జల; కేళీ = క్రీడలలో; విహరమాణ = విహరించుటచేత; సతీరమణీ = అందమైనస్త్రీల, సతీదేవి; రమణీయ = అందమైన; కుచమండల = స్థనప్రదేశముల; విలిప్త = చక్కగా అలదుకొన్న; మృగమద = కస్తూరి; మిళిత = కలిసిన; హరిచందన = గంధము; గంధ = సువాసనతో కూడిన; సుగంధి = పరిమళపు; జల = నీటితో; పూరిత = నిండిన; గంగా = గంగ అనెడి; తరంగిణీ = నదిచేత; సమ = చక్కగా; ఆవృతంబును = అవరింపబడినదియును; ఐన = అయిన; కైలాసపర్వతంబున్ = కైలాసపర్వతమును; పొడగని = గుర్తుపట్టి; అరవిందసంభవ = బ్రహ్మదేవుడు; పురందర = ఇంద్రుడు; ఆది = మొదలైన; దేవ = దేవతల; గణంబులు = సమూహములు; అతి = మిక్కిలి; అద్భుత = అద్భుతము; ఆనందంబులన్ = ఆనందములను; పొంది = పొంది; ముందటన్ = ఎదురుగ; తార = తారకలు; హీర = మంచు; హేమ = బంగారము; మయ = తోకూడిన; విమాన = విమానములతో; సంకులంబును = కలిగి యున్నదియును; పుణ్యజన = రాక్షస; మానినీ = స్త్రీలతో; శోభితంబును = శోభిల్లుతున్నది; ఐన = అయిన; అలకాపురంబున్ = అలకాపురమును; కడచి = దాటి; తత్ = ఆ; పుర = పట్టణము; బాహ్య = వెలుపలి; ప్రదేశంబునన్ = ప్రదేశములో; తీర్థపాదుండు = పాదములు అందు పుణ్యనది (గంగానది) కలవాడు; ఐన = అయిన; పుండరీకాక్షు = విష్ణుమూర్తి {పుండరీ కాక్షుడు - పుడరీకములు (పద్మములు) వంటి కన్నులు కలవాడు, నారాయణుడు}; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల యొక్క; రజస్ = ధూళిచేత; పావనంబును = పవిత్రమైనదియును; రతి = శృంగార; కేళీ = క్రీడలలో; వ్యాసంగ = మునిగితేలుట వలని; పరిశ్రమ = అలసటను; నివారక = పోగొట్టునట్టి; సలిల = జల; కేళీ = క్రీడలందు; విలోల = విహరిస్తున్న; దేవ = దేవతా; కామినీ = స్త్రీల; పీన = బలమైన; వక్షోజ = కుచములందు; విలిప్త = చక్కగ పులిమిన; కుంకుమ = కుంకుమ; పంక = ముద్ద; సంగత = కూడిన; పిశంగ = గోరోజనము; వర్ణ = రంగు; వారి = నీటితో; పూర = నిండి; విలసితంబును = విలసిల్లుతున్నవియును; ఐ = అయ్యి; నంద = నంద; అలకనంద = అలకనంద అనెడి; అభిధానంబులు = పేర్లు; కల = కలిగినట్టి; నదీ = నదుల; ద్వితయంబు = యుగళము, రెంటిని; దాటి = దాటి; తత్ = వాటి; పురః = ముందు; భాగంబున = భాగములో; వన = అడవి; గజ = ఏనుగులచే; సంఘృష్ట = మిక్కిలి ఒరసుకొనబడుట వలని; మలయజ = మంచిగంధము; పరిమిళిత = చక్కగా కలిసిన; మలయ = వీచు; పవన = గాలిని; ఆస్వాదన = ఆస్వాదించుటచే; ముహుర్ముహుర్ = మళ్ళీ మళ్ళీ; ముదిత = సంతోషిస్తున్న; మానస = మనసులు కలిగిన; పుణ్యజన = రాక్షస; కామినీ = స్త్రీల; కదంబంబును = గుంపులు కలిగినదియును; వైదూర్య = పచ్చలు పొదిగిన; సోపాన = మెట్లుతో; సమ = చక్కగ; అంచిత = అలంకరించబడిన; కనక = బంగారపురంగు; ఉత్పల = కలువపూలు కలిగిన; వాపీ = బావులతోను; విభాసితంబును = విలసిల్లుతున్నది; కిపురుష = కింపురుషులతో; సంచార = విహారమునకు; యోగ్యంబును = తగినది; అగు = అయిన; సౌగంధిక = సౌగంధికము అనెడి; వన = వనము; సమీపంబున్ = దగ్గర; అందు = లో.
భావము:- ఇంకా ఆ వెండికొండ మందారం, పారిజాతం, తెల్లతెగడ, కానుగు, మద్ది, తాడి, తక్కోలం, ఎఱ్ఱకాంచనం, దిరిసెనం, తెల్లమద్ది, తియ్యమామిడి, కడిమి, మంకెన, నాగవల్లి, సురపొన్న, సంపెంగ, కలిగొట్టు, అశోకం, పొగడ, మొల్ల, ఎఱ్ఱగోరింట, కనకాంబరం, తామర, మోదుగ, ఏలకి, లవంగం, జాజి, ఇప్ప, మల్లె, పనస, పూల గురివెంద, కొండమల్లె, మేడి, రావి, జువ్వి, మఱ్ఱి, ఇంగువ, బుజపత్తిరి, పోక, రాజపూగం, నేరేడు, ఖర్జూరం, ఆమ్రాతకం, మోరటి, కొబ్బరి, అందుగ, గారవెదురు, బొంగువెదురు మొదలైన చెట్లతో శోభిల్లుతున్నది. కోయిలలు, నెమళ్ళు, పావురములు, రామచిలుకలు, గండుతుమ్మెదలు, మొదలైన రకరకాల పక్షుల కలకలంతో భూమ్యాకాశాల మధ్యప్రదేశం ప్రతిధ్వనిస్తున్నది. సింహాలు, సివంగులు, ముళ్ళపందులు, అడవిదున్నలు, శరభమృగాలు, కోతులు, అడవిపందులు, పెద్దపులులు, కుక్కలు, నల్లచారల దుప్పులు, ఎనుబోతులు, తోడేళ్ళు, లేళ్ళు మొదలైన గొప్ప అడవి జంతువులకు ఆశ్రయంగా ఉన్నది. అరటితోపులతోను, తామరపూలతోను, తెల్లకలువలతోను, ఎఱ్ఱకలువలతోను కూడిన ఇసుక ప్రదేశాలతో అందంగా ఉన్న సరోవరాలలో విహరిస్తున్న రాజహంసలు, కొక్కిరాళ్ళు, బెగ్గురుపక్షులు, జక్కవలు, కొంగలు, నీటికోళ్ళు మొదలైన నీటిపక్షుల కూతలతో కలకలంగా ఉంది. జలక్రీడలతో విహరిస్తున్న అందమైన స్త్రీల చనుదోయికి అలదుకొన్న కస్తూరి కలిపిన మంచిగంధపు సువాసనలు కలిగిన గంగానది చేత ఆవరింపబడి ఉన్నది. అటువంటి కైలాసపర్వతాన్ని చూచి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొంది, ఎదురుగా అలకాపురాన్ని చూచారు. అది చుక్కలతో, మంచుతో, బంగారంతో కూడిన విమానాలతో, పుణ్యస్త్రీ సమూహంతో శోభిల్లుతున్నది. ఆ నగరం వెలుపల పూజ్యపాదుడైన విష్ణువు యొక్క పాదపద్మాల ధూళిచేత పవిత్రమై, రతికేళిచేత కలిగిన శ్రమను తొలగించే జలక్రీడలో మునిగిన దేవతాస్త్రీల ఎత్తైన స్తనాలకు అలదుకున్న కుంకుమతో కూడిన గోరోజనం రంగును పొందిన నంద, అలకనంద అనే రెండు నదులున్నాయి. వాటిని దాటి ఎదుట సౌగంధికవనాన్ని చూశారు. ఆ వనంలో ఏనుగులు రాచుకొనడం వల్ల మంచి గంధపుచెట్లనుండి వెలువడే సువాసనలతో కలిసిన గాలిని ఆస్వాదిస్తూ యక్షకన్యలు మాటిమాటికి సంతోషిస్తున్నారు. పచ్చలు పొదిగిన మెట్లు కల దిగుడు బావుల్లో బంగారు కలువలు ప్రకాశిస్తున్నాయి. కింపురుషులు సంచరించడానికి అనువైన ఆ సౌగంధికవనంలో...

తెభా-4-136-సీ.
జ్జ్వలంబయి శతయోజనంబుల పొడ-
వునుఁ బంచసప్తతి యోజనముల
ఱపును గల్గి యే ట్టునఁ దఱుగని-
నీడ శోభిల్ల నిర్ణీత మగుచుఁ
ర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్య-
ములఁ బోలఁగల ఫలములఁ దనర్చి
మనీయ సిద్ధయోక్రియామయ మయి-
నఘ ముముక్షు జనాశ్రయంబు

తెభా-4-136.1-తే.
భూరిసంసార తాప నివాకంబు
గుచుఁ దరురాజ మనఁగఁ బెంగ్గలించి
క్తజనులకు నిచ్చలుఁ బ్రమద మెసఁగ
లయు సంపద లందు నాటము వటము.

టీక:- ఉజ్జ్వలంబు = ప్రకాశిస్తున్నది; అయి = అయ్యి; శత = వంద (100); యోజనంబుల = యోజనముల; పొడవును = పొడవు; పంచసప్తతి = డెబ్బై ఐదు (75); యోజనంబుల = యోజనముల; పఱపును = వెడల్పును; కల్గి = కలిగి ఉండి; ఏపట్టున = ఎక్కడైన; తఱుగని = తగ్గని; నీడ = నీడ; శోభిల్లన్ = శోభిల్లుట; నిర్ణీతము = నిశ్చయము; అగుచున్ = అవుతూ; పర్ణ = ఆకులతోను; శాఖా = కొమ్మలతోను; సమ = చక్కగా; ఆకీర్ణము = వ్యాపించినది; అగున్ = అవుతూ; మాణిక్యములన్ = మాణిక్యములను; పోలన్ = పోల్చుటకు; కల = తగిన; ఫలములన్ = పండ్లతో; తనర్చి = అతిశయించి; కమనీయ = మనోహరమైన; సిద్ధ = సిద్ధుల; యోగ = యోగమునకు చెందిన; క్రియా = క్రియలతో; మయ = కూడినట్టిది; అయి = అయిన; అనఘ = పుణ్యులైన; ముముక్షు = మోక్షముకోరెడి; జన = వారికి; ఆశ్రయంబును = ఆస్థానమైనదియును.
భూరి = అత్యధికమైన; సంసార = సంసారమునకు చెందిన; తాప = బాధలను; నివారకంబును = పోగొట్టునది; అగుచున్ = అవుతూ; తరు = వృక్షములలో; రాజము = శ్రేష్ఠమైనది, పెద్దది; అనగన్ = అనగా; పెంపగ్గలించి = అతిశయించి; భక్త = భక్తులైనట్టి; జనుల్ = వారి; కున్ = కి; నిచ్చలున్ = నిత్యము; ప్రమదము = సంతోషము; ఎసగ = అతిశయించుటకు; వలయు = కావలసిన; సంపదలన్ = సంపదలను; అందు = కలిగి ఉండుటలో, అందించుటకు; ఆవటము = నివాసము; వటము = మఱ్ఱిచెట్టు.
భావము:- వందయోజనాల పొడవు, డెబ్బైయైదు యోజనాల వెడల్పు కలిగిన ఒక మఱ్ఱిచెట్టును దేవతలు చూచారు. ఆ చెట్టు నీడ సందులేకుండా అంతటా నిండి ఉంది. ఆ చెట్టు ఆకులతో, కొమ్మలతో అలరారుతూ మాణిక్యాలకు సాటివచ్చే పండ్లతో నిండి ఉన్నది. అది సిద్ధయోగ క్రియలకు ఆలవాలమై దోషరహితమై మోక్షం కోరేవారికి ఆశ్రయమై అలరారుతున్నది. అది సంసారతాపాన్ని తొలగిస్తుంది. ఆ మేటిమ్రాను భక్తులకు ఆనందం కలిగించే ఐశ్వర్యాలకు పుట్టినిల్లు.

తెభా-4-137-వ.
ఆ వృక్షమూలతలంబున.
టీక:- ఆ = ఆ; వృక్ష = వృక్షము యొక్క; మూల = మొదలు దగ్గరి; తలంబున = ప్రదేశమునందు.
భావము:- ఆ మఱ్ఱిచెట్టు క్రింద...

తెభా-4-138-సీ.
ద్ధ సనందాది సిద్ధ సంసేవితు-
శాంతవిగ్రహుని వాత్సల్యగుణునిఁ
మనీయ లోకమంళదాయకుని శివు-
విశ్వబంధుని జగద్వినుత యశుని
గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కు-
బే సేవితుని దుర్వాబలుని
నుదిత విద్యాతపోయోగ యుక్తుని బాల-
చంద్రభూషణుని మునీంద్రనుతునిఁ

తెభా-4-138.1-తే.
దాపసాభీష్టకరు భస్మదండలింగ
నజటాజిన ధరుని భక్తప్రసన్ను
వితత సంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న
క్తవర్ణు సనాతను బ్రహ్మమయుని.

టీక:- ఇద్ధసనందాదిసిద్ధసంసేవితు = శివుని {ఇద్ధసనందాదిసిద్ధసంసేవితు - ఇద్ధ (ప్రసిద్ధులైన) సనంద (సనందుడు) ఆది (మొదలైన) సిద్ధ (సిద్ధులచే) సంసేవితు (చక్కగా సేవించబడుతున్నవాడు), శివుడు}; శాంతవిగ్రహుని = శివుని {శాంతవిగ్రహుని - శాంతమైన స్వరూపము కలవానిని, శివుని}; వాత్సల్యగుణునిఁ = శివుని {వాత్సల్యగుణుడు - వాత్యల్య(సంతానము యెడనుండు స్నేహభావము) పూరితమైన గుణములు కలవాని, శివుని}; కమనీయలోకమంగళదాయకుని = శివుని {కమనీయలోకమంగళదాయకుడు - కమనీయ (మనోహరమైన) లోక (విశ్వజనీన) మంగళ (శుభములను) దాయకుని (ఇచ్చువాని, శివుని}; శివు = శివుని; విశ్వబంధుని = శివుని {విశ్వబంధువు - లోకమునకు మంచి కోరువాడు, శివుడు}; జగద్వినుతయశుని = శివుని {జగద్వినుతయశుడు - విశ్వమున వినుత (ప్రసిద్ధమైన) యశస్సు కలవాడు, శివుడు}; గుహ్యకసాధ్యరక్షోయక్షనాథకుబేరసేవితుని = శివుని {గుహ్యకసాధ్యరక్షోయక్షనాథకుబేరసేవితుడు -గుహ్యకసాధ్యరక్షోయక్షలకునాయకుడైన కుబేరునిచే సేవింపబడువాడు, శివుడు}; దుర్వారబలుని = శివుని {దుర్వారబలుడు - వారింపశక్యముకాని బలము కలవాడు, శివుడు}; ఉదితవిద్యాతపోయోగయుక్తుని = శివుని {ఉదితవిద్యాతపోయోగయుక్తుడు - ఉద్భవించిన విద్యలు తపస్సు యోగములుతో కూడినవాడు, శివుడు}; బాలచంద్రభూషణుని = శివుని {బాలచంద్రభూషణుడు - బాలచంద్రుడు (చంద్రవంక) భూషణముగ కలవాడు, శివుడు}; మునీంద్రనుతుని = శివుని {మునీంద్రనుతుడు - మునులలోశ్రేష్ఠులచే నుతింపబడువాడు, శివుడు}; తాపసాభీష్టకరున్ = శివుని {తాపసాభీష్టకరు - తాపసుల అభీష్టము (కోరికలు) కరుడు (తీర్చువాడు), శివుడు};
భస్మదండలింగఘనజటాజినధరుని = శివుని {భస్మదండలింగఘనజటాజినధరుడు - భస్మము (విభూతి) దండము లింగము ఘన (గొప్ప)జటలు అజిన(లేడిచర్మము) ధరించినవాడు, శివుడు}; భక్తప్రసన్ను = శివుని {భక్తప్రసన్నుడు - భక్తుల యెడ ప్రసన్నముగ యుండువాడు, శివుడు}; వితతసంధ్యాభ్రరుచివిడంబితవినూత్నరక్తవర్ణు = శివుని {వితతసంధ్యాభ్రరుచివిడంబితవినూత్నరక్తవర్ణుడు - వితత (విస్తారమైన) సంధ్యాకాల అభ్ర (మేఘము) ని పోలిన వినూత్న (ప్రశస్తమైన) రక్త(ఎఱ్ఱని) వర్ణుడు (రంగువాడు), శివుడు}; సనాతను = శివుని {సనాతనుడు - శాశ్వతుడు, శివుని}; బ్రహ్మమయుని = శివుని {బ్రహ్మమయుడు - బ్రహ్మ స్వరూపుడు, శివుని}.
భావము:- ప్రసిద్ధులైన సనందుడు మొదలైన సిద్ధులచేత సేవింపబడేవాడు, శాంతమూర్తి, దయాగుణం కలవాడు, లోకాలకు శుభాలను కలిగించేవాడు, శివుడు, విశ్వానికి బంధువైనవాడు, లోకాలు పొగడే కీర్తి కలవాడు, గుహ్యకులూ సాధ్యులూ రాక్షసులూ యక్షులకు రాజైన కుబేరుడూ మున్నగువారిచే సేవింపబడేవాడు, ఎదురులేని బలం కలవాడు, విద్యతో తపస్సుతో యోగంతో కూడినవాడు, నెలవంకను అలంకరించుకున్నవాడు, మునీంద్రులచేత స్తుతింపబడేవాడు, తాపసుల కోరికలను తీర్చేవాడు, విభూతినీ దండాన్నీ జడలనూ గజచర్మాన్నీ ధరించినవాడు, భక్తులను అనుగ్రహించేవాడు, సంధ్యాకాలంలోని మేఘాల కాంతిని పోలిన క్రొత్త ఎఱ్ఱని కాంతులతో వెలిగేవాడు, శాశ్వతుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శివుణ్ణి చూశారు.

తెభా-4-139-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా...

తెభా-4-140-సీ.
అంచిత వామపాదాంభోరుహము దక్షి-
ణోరుతలంబున నొయ్య నునిచి
వ్యజానువుమీఁద వ్యబాహువు సాఁచి-
లపలి ముంజేత లలితాక్ష
మాలిక ధరియించి హనీయ తర్కము-
ద్రాయుక్తుఁ డగుచుఁ జిత్తంబులోన
వ్యయం బయిన బ్రహ్మానందకలిత స-
మాధి నిష్ఠుఁడు వీతత్సరుండు

తెభా-4-140.1-తే.
యోగపట్టాభిరాముఁడై యుచిత వృత్తి
రోషసంగతిఁ బాసి కూర్చున్న జముని
నువునను దర్భరచిత బ్రుస్యాసనమున
నున్న మునిముఖ్యు నంచిత యోగనిరతు.

టీక:- అంచిత = ఒప్పుతున్న; వామ = ఎడమ; పాద = పాదము అనెడి; అంభోరుహమున్ = పద్మమును {అఁబోరుహము - అంబువు (నీట) రుహము (పుట్టునది), పద్మము}; దక్షిణ = కుడి; ఊరు = తొడ; తలంబునన్ = ప్రదేశమునందు; ఒయ్యన = తీర్పుగ; ఉనిచి = ఉంచి; సవ్య = ఎడమ; జానువు = మోకాలి; మీద = పైన; భవ్య = శుభమైన; బాహువు = హస్తమును; సాచి = చాచి; వలపలి = కుడి; ముంజేత = మంజేతి యందు; సలలిత = అందమైన; అక్షమాలిక = జపమాల; ధరియించి = ధరించి; మహనీయ = గొప్ప; తర్కముద్రా = ధ్యానముద్రతో; యుక్తుడు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; చిత్తంబు = మనసు; లోనన్ = అందు; అవ్యయంబు = తరుగని; బ్రహ్మానంద = బ్రహ్మానందముతో; సంకలిత = కూడిన; సమాధి = సమాధి; నిష్ఠుడు = నిష్ఠకలవాడు; వీత = తొలగిన; మత్సరుండు = మాత్సర్యముకలవాడు.
యోగ = యోగము; పట్టాభిరాముడు = అందుఒప్పుతున్నవాడు; ఐ = అయ్యి; ఉచిత = తగిన; వృత్తి = విధముగ; రోష = రోషముఎడల; సంగతిన్ = సంగమునుండి; పాసి = దూరమై; కూర్చున్న = కూర్చుని ఉన్న; జముని = యముని; అనువునను = వలె; దర్భ = దర్భలతో; రచిత = కూర్చిన; బ్రుసి = వ్రతాభ్యాసమునకైన; ఆసనమున = ఆసనము; ఉన్న = ఉన్నట్టి; ముని = మునులలో; ముఖ్యు = ప్రముఖుని; అంచిత = పూజయనీయమైన; యోగ = యోగమునందు; నిరతున్ = నిష్ఠ కలవాని.
భావము:- ఆ మహేశ్వరుడు కుడితొడపై ఎడమకాలును మోపి, ఎడమ మోకాలిపై ఎడమచేతిని చాచి కూర్చున్నాడు. కుడి ముంజేతిలో జపమాలను ధరించాడు. మహనీయమైన ధ్యానముద్రను ధరించి బ్రహ్మానందంతో నిండిన మనస్సు కలవాడై సమాధి నిష్ఠలో ఉన్నాడు. అతడు మాత్సర్యం లేనివాడు. యోగపట్టంతో ఒప్పుతూ కోపం విడిచిపెట్టి కూర్చున్న యమునివలె దర్భాసనం మీద యోగనిమగ్నుడై ఉన్నాడు.

తెభా-4-141-క.
ఘుని నభవుని యోగీం
ద్రులు వినుచుండంగ నారదునితోఁ బ్రియ భా
లు జరుపుచున్న రుద్రుని
లిత పన్నగ విభూషు జ్జనపోషున్.

టీక:- అలఘుని = గొప్పవాని; అభవుని = శివుని; యోగ = యోగులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; వినుచున్ = వింటూ; ఉండగ = ఉండగా; నారదుని = నారదుని; తోన్ = తోటి; ప్రియ = ప్రియకరమైన; భాషలు = మాటలు; జరుపుతున్ = చేస్తూ; ఉన్న = ఉన్నట్టి; రుద్రునిన్ = శివుని; సలలిత = అందము కలిగిన; పన్నగ = నాగేంద్రునిచే; విభూషు = చక్కగా అలంకరితుని; సత్ = మంచి; జన = వారిని; పోషున్ = పోషించువానిని.
భావము:- ఆఢ్యుడు, అభవుడు, నాగభూషణుడు, సజ్జన పోషకుడు, యోగీంద్రులు వింటూ ఉండగా నారదునితో ఇష్టసంభాషణం చేస్తున్న ఆ శివుణ్ణి….

తెభా-4-142-క.
ని లోకపాలురును ముని
నులును సద్భక్తి నతని రణంబులకున్
వితు లయి, రప్పు డబ్జా
నుఁ గని యయ్యభవుఁ డధిక సంభ్రమ మొప్పన్.

టీక:- కని = చూసి; లోకపాలురును = లోకపాలకులును; ముని = ముని; జనులును = జనములును; సత్ = మంచి; భక్తిన్ = భక్తితో; అతని = అతని; చరణంబుల = పాదముల; కున్ = కి; వినతులు = నమస్కరించినవారు; అయిరి = అయ్యారు; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; అబ్జాసనుని = బ్రహ్మదేవుని {అబ్జాసనుడు - అబ్జము (పద్మము) ఆసనుడు (ఆసనముగ కలవాడు), బ్రహ్మదేవుడు}; కని = చూసి; ఆ = ఆ; అభవుడు = శివుడు; అధిక = మిక్కిలి; సంభ్రమము = సంతోషము; ఒప్పన్ = ఒప్పునట్లు.
భావము:- లోకపాలకులూ, మునులూ సద్భక్తితో అతని పాదాలకు నమస్కరించారు. అప్పుడు బ్రహ్మను చూచి ఆ శివుడు సంభ్రమంతో…

తెభా-4-143-క.
"అఘ! మహాత్ముం డగు వా
నుఁ డా కశ్యపునకొగి నస్కారము చే
సిగతి నజునకు నభివం
మొగిఁ గావించె హరుఁడు ద్దయుఁ బ్రీతిన్.

టీక:- అనఘ = పుణ్యుడు; మహాత్ముండు = మహాత్ముడు; అగు = అయిన; వామనుడు = వామనుడు; ఆ = ఆ; కశ్యపున్ = కశ్యపుని; కున్ = కి; ఒగిన్ = చక్కగ; నమస్కారము = నమస్కారము; చేసిన = చేసిన; గతిన్ = విధముగ; అజున్ = బ్రహ్మదేవునికిన్; అభివందనము = నమస్కారము; ఒగిన్ = చక్కగ; కావించెన్ = చేసెను; హరుడు = శివుడు; దద్ధయున్ = మిక్కిలి; ప్రీతిన్ = ప్రీతితో.
భావము:- పుణ్యాత్ముడవైన ఓ విదురా! మహాత్ముడైన వామనుడు కశ్యపునకు నమస్కరించినట్లుగా శివుడు బ్రహ్మకు ఎంతో ఇష్టంతో నమస్కారం చేసాడు.

తెభా-4-144-తే.
అంత రుద్రానువర్తు లైట్టి సిద్ధ
ణ మహర్షి జనంబులు ని పయోజ
ర్భునకు మ్రొక్కి; రంత నా మలభవుఁడు
ర్వుఁ గని పల్కె మందహాసంబుతోడ.

టీక:- అంత = అంతట; రుద్ర = రుద్రుని; అనువర్తులు = అనుచరులు; ఐనట్టి = అయినట్టి; సిద్ధ = సిద్ధుల; గణ = సమూహము; మహర్షి = మహర్షులైన; జనంబులు = వారు; కని = చూసి; పయోజగర్భున్ = బ్రహ్మదేవుని {పయోజగర్భుడు - పయోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కున్ = కి; మ్రొక్కిరి = నమస్కరించిరి; అంతన్ = అంతట; ఆ = ఆ; కమలభవుడు = బ్రహ్మదేవుడు {కమలభవుడు - కమలము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; శర్వున్ = శివుని; కని = చూసి; పల్కె = పలికెను; మందహాసంబు = చిరునవ్వు; తోడన్ = తోటి.
భావము:- అప్పుడు శివుని అనుచరులైన సిద్ధగణాలు, మునులు బ్రహ్మను చూచి నమస్కరించారు. ఆ తరువాత బ్రహ్మ శివుణ్ణి చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు.

తెభా-4-145-తే.
గములకు నెల్ల యోనిబీజంబు లైన
క్తి శివకారణుండవై గతి నిర్వి
కార బ్రహ్మంబ వగు నిన్నుఁ డఁగి విశ్వ
నాథుఁ గా నెఱిఁగెద నా మమున నభవ!

టీక:- జగముల్ = లోకముల; కున్ = కి; ఎల్లన్ = అన్నిటికిని; యోని = గర్భము; బీజంబులు = విత్తనములు; ఐన = అయిన; శక్తి = శక్తితత్త్వము; శివ = శివతత్త్వములకు; కారణుండవు = ప్రాప్తిస్థానమునవు; ఐ = అయ్యి; జగతిన్ = లోకముల; నిర్వికారబ్రహ్మంబవు = నిర్వికారబ్రహ్మవు; అగు = అయ్యెడి; నిన్నున్ = నిన్ను; విశ్వనాథున్ = విశ్వనాథుని; కాన్ = అగునట్లు; ఎఱిగెదన్ = తెలియుదును; నా = నా యొక్క; మనమునన్ = మనసులో.
భావము:- “ఓ పరమేశ్వరా! లోకాల కన్నింటికి ఉత్పత్తిస్థానం అయిన శక్తివి నీవే. జగత్తుల కన్నింటికీ బీజమైన శివుడు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తెలుసుకున్నాను.

తెభా-4-146-తే.
మత నది గాక తావకాంశంబు లైన
క్తి శివరూపములఁ గ్రీడ లుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!

టీక:- సమతన్ = చక్కగా; అది = అంతే; కాక = కాకుండగ; తావక = నీ యొక్క; అంశంబులు = అంశలు; ఐన = అయిన; శక్తి = శక్తి; శివ = శివ; రూపములన్ = రూపములతో; క్రీడన్ = ఆటలాగ; సలుపు = చేసెడి; తూర్ణనాభి = సాలీడు; గతిన్ = వలె; విశ్వ = జగము యొక్క; జనన = సృష్టి; వినాశ = లయ; వృద్ధిన్ = పోషణలకు; హేతుభూతుండవు = కారణమాతృడవు; అగుచున్ = అవుతూ; ఉందువు = ఉంటావు; ఈశ = శివుడ; రుద్ర = శివుడ.
భావము:- ఓ ఈశ్వరా! రుద్రా! నీవు నీ సమాంశాలైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికీ, వృద్ధికీ వినాశానికీ నీవే హేతువు అవుతుంటావు.

తెభా-4-147-సీ.
నఘ! లోకంబుల యందు వర్ణాశ్రమ-
సేతువు లనఁగఁ బ్రఖ్యాతి నొంది
లసి మహాజన రిగృహీతంబులై-
ఖిల ధర్మార్థదాకము లైన
వేదంబులను మఱి వృద్ధి నొందించుట-
కొఱకునై నీవ దక్షుని నిమిత్త
మాత్రునిఁ జేసి యమ్మఖముఁ గావించితి-
టుగాన శుభమూర్తివైన నీవు

తెభా-4-147.1-తే.
డఁగి జనముల మంగళర్ము లయిన
వారి ముక్తి, నమంగళాచారు లయిన
వారి నరకంబు, నొందింతు భూరిమహిమ
క్తజనపోష! రాజితణివిభూష!

టీక:- అనఘ = పుణ్యుడ; లోకంబుల = లోకములు; అందున్ = లో; వర్ణ = వర్ణ ధర్మములకు {వర్ణధర్మములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర అనెడి చతుర్వర్ణముల ధర్మములు}; ఆశ్రమ = ఆశ్రమ ధర్మములకు {ఆశ్రమధర్మములు - 1బ్రహ్మచర్య 2గార్హస్త్య 3వానప్రస్థ 4సన్యాస అనెడి చతురాశ్రమముల ధర్మములు}; సేతువులు = చెరువు కట్టలా కాపాడునవి; అనగన్ = అని; ప్రఖ్యాతిని = ప్రసిద్ధిని; ఒంది = పొంది; బలసి = వృద్ధిపొంది; మహా = గొప్ప; జన = వారిచే; పరిగృహీతంబులు = స్వీకరింపబడినవి; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; ధర్మ = ధర్మములు; అర్థ = సంపదలను; దాయకంబులు = ఇచ్చునవి; ఐన = అయిన; వేదంబులను = వేదములను; మఱి = ఇంకా; వృద్ధిన్ = అభివృద్ధిని; ఒందించుట = పొందించుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; నీవ = నీవే; దక్షుని = దక్షుని; నిమిత్తమాతృనిన్ = కారణమగుట మాత్రమైన వానిగా; చేసి = నియమించి; ఆ = ఆ; ముఖమున్ = పేరుతో; కావించితివి = చేసితివి; అటుగాన = అందుచేత; శుభమూర్తివి = శుభమేస్వరూపము; ఐన = అయిన; నీవు = నీవు; కడగి = పూని.
జనముల = జనులలో; మంగళ = శుభకరమైన; కర్ములు = పనులుచేసెడివారు; అయిన = అయినట్టి; వారిన్ = వారికి; ముక్తిన్ = ముక్తిని; అమంగళ = అశుభములను; ఆచారులకు = చేయువారు; అయిన = అయినట్టి; వారిన్ = వారికి; నరకంబున్ = నరకమును; ఒందింతు = పొందింతువు; భూరి = అత్యధికమైన; మహిమన్ = మహిమతో; భక్తజనపోష = శివ {భక్తజనపోషుడు - భక్తులయినవారిని కాపాడువాడ, శివుడు}; రాజితఫణివిభూష = శివ {రాజితఫణివిభూషణుడ - విరాజిల్లుతున్న నాగేశ్వరునితో చక్కగ అలంకరింపబడినవాడు, శివుడు}.
భావము:- ఓ భక్తజన పోషణా! పన్నగ భూషణా! లోకాలలో వర్ణాశ్రమాచారాలను వేదాలు నిర్ణయిస్తాయి. గొప్పవారు వేదాలను గౌరవిస్తారు. వేదాలు సర్వ ధర్మార్థాలను ప్రసాదిస్తాయి. ఆ వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్తమాతృనిగా చేసి ఆ యజ్ఞం చేయించావు. నీవు మంగళ స్వరూపుడవు. నీవు న్ మహిమచేత శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు.

తెభా-4-148-వ.
అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?"యని.
టీక:- అట్లు = ఆవిధముగ; అగుటన్ = అవుట; చేసి = వలన; తత్ = ఆ; కర్మంబులు = పనులు; ఒకానొకనికి = ఏవరో ఒకనికి; విపర్యాయంబు = వ్యత్యాసము; ఒందుట = కలుగుట; కున్ = కి; కారణంబున్ = హేతువు; ఎయ్యదియో = ఏదో; భవదీయ = నీ యొక్క; రోషంబు = కోపము; హేతువు = కారణము; అని = అని; తలంచితిన్ = అనుకొందము; ఏనిన్ = అంటే; త్వదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మములందు; నిహిత = లగ్నమైన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; సమస్త = సమస్తమైన; భూతంబుల = భూతముల; అందున్ = లోను; నినున్ = నిన్నే; కనుంగొనుచున్ = దర్శిస్తూ; భూతంబులన్ = భూతములను; ఆత్మ = తమ; అందున్ = లో; వేఱు = వేరు; కాన్ = అగునట్లు; చూడక = చూడకుండగ; వర్తించు = ప్రవర్తించు; మహాత్ముల = గొప్పవారి; అదున్ = లో; అజ్ఞులు = జ్ఞానము లేనివారు; ఐన = అయిన; వారిన్ = వారి; అందున్ = లో; పోలెన్ = వలె; రోషంబున్ = కోపము; తఱచు = తరచుగా; ఒరయదట = కలుగదట; నీకున్ = నీకు; క్రోధంబున్ = కోపము; కలదే = ఉందా ఏమి; అని = అని.
భావము:- అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తల్లక్రిందులుగా కావటానికి నీ కోపం కారణం అని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిల్పి సమస్త ప్రాణులలోను నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకంటే వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా! మహానుభావుడవైన నీకు కోపం ఎక్కడిది?

తెభా-4-149-సీ.
"ఱి భేదబుద్ధిఁ గర్మప్రవర్తనముల-
యుతు లయి దుష్టహృయు లగుచుఁ
రవిభవాసహ్య వ మనో వ్యాధులఁ-
గిలి మర్మాత్మ భేకము లయిన
హు దురుక్తుల చేతఁ రులఁ బీడించుచు-
నుండు మూఢులను దైవోపహతులఁ
గాఁ దలపోసి య క్కపటచిత్తులకు నీ-
వంటి సత్పురుషుఁ డేలన నైన

తెభా-4-149.1-తే.
హింసఁ గావింపకుండు సమిద్ధచరిత!
నీలోహిత! మహితగుణావాల!
లోపాలనకలిత! గంగాలాప!
ర! జగన్నుతచారిత్ర! దియుఁ గాక.

టీక:- మఱి = మరి; భేద = వైమనస్యమైన; బుద్ధిన్ = బుద్ధితో; కర్మ = కర్మలందు; ప్రవర్తనముల = నడచుటలలో; మద = మదముతో; యుతులు = కూడినవారు; ఐ = అయ్యి; దుష్ట = దుర్మార్గపు; హృదయులు = హృదయములు కలవారు; అగుచున్ = అవుతూ; పర = ఇతరుల; విభవ = వైభవములవలన; అసహ్య = సహించలేకపోవుటచే; భవ = కలిగిన; మనస్ = మానసిక; వ్యాధులన్ = వ్యాధులకు; తగిలి = తగుల్కొని; మర్మా = ప్రాణముల; ఆత్మ = మూలముల; భేదకములు = బద్దలుకొట్టునవి; అయిన = అయినట్టి; బహు = అనేకమైన; దురుక్తుల్ = చెడుమాటల; చేతన్ = తోటి; పరులన్ = ఇతరులను; పీడించుచున్ = బాధిస్తూ; ఉండు = ఉండెడి; మూఢులను = మూర్ఖులను; దైవోపహతులు = మాయోవిమోహితులు; కాన్ = అగనట్లు; తలపోసి = అనుకొని; ఆ = ఆ; కపట = మోసపూరిత; చిత్తులు = మనసులుకలవారి; కున్ = కి; నీ = నీ; వంటి = లాంటి; సత్ = మంచి; పురుషుడు = పురుషుడు; ఏవలనన్ = ఏవిధముగ; ఐన = అయిన.
హింస = హింసించుట; కావింపకుండు = చేయకుండును; సమ = చక్కటి; ఇద్ధ = ప్రసిధ్ధ; చరిత = వర్తనకలవాడ; నీలలోహిత = శివ {నీలలోహితుడు - నీలవర్ణము లోహితవర్ణములతో కూడినవాడు, శివుడు}; మహితగుణాలవాల = శివ {మహితగుణాలవాలుడు - మహిత (గొప్ప) గుణాల (గుణముల)అలవాల (పాదువంటివాడు), శివుడు}; లోకపాలనకలిత = శివ {లోకపాలనకలిత - లోకములను పాలించువాడు, శివుడు}; గంగాకలాప = శివ {గంగాకలాప - గంగ (గంగదేవి)ని కలాప (భూషణముగ కలవాడు), శివుడు}; హర = శివ {హరుడు - లయకారుడు, శివుడు}; జగన్నుతచారిత్ర = శివ {జగన్నుతచారిత్ర - జగత్ (లోకములచే) నుత (కీర్తింపబడు) చారిత్ర (చరిత్ర కల వాడు), శివుడు}; అదియున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:- ఓ భవ్యచరితా! నీలలోహితా! పావన గుణ భరితా! లోక పరిపాలా! గంగాధరా! హరా! సకల లోక స్తుత చరిత్రా! మూర్ఖులు మదించి, దుష్టచిత్తులై భేదబుద్ధితో ప్రవర్తిస్తారు. పరుల సంపదను చూచి ఓర్వలేరు. మనోవ్యాధితో క్రుంగిపోతారు. మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నీవు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఆ కపటాత్ములకు నీవంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస కావించడు.

తెభా-4-150-సీ.
మర సమస్త దేము లందు నఖిల కా-
ములందుఁ దలఁప దుర్లంఘ్య మహిముఁ
గు పద్మనాభు మాయా మోహితాత్మకు-
లై భేదదర్శను లైనవారి
లనను ద్రోహంబు లిగిన నైనను-
ది దైవకృత మని న్యదుఃఖ
ముల కోర్వలేక సత్పురుషుండు దయచేయు-
గాని హింసింపఁడు గాన నీవు

తెభా-4-150.1-తే.
చ్యుతుని మాయమోహము నందకుంటఁ
జేసి సర్వజ్ఞుఁడవు; మాయచేత మోహి
తాత్ములై కర్మవర్తను యినవారి
లన ద్రోహంబుగలిగిన లయుఁ బ్రోవ.

టీక:- అమరన్ = అమరునట్లు; సమస్త = సమస్తమైన; దేశములు = ప్రదేశములు; అందున్ = లోను; అఖిల = సమస్తమైన; కాలముల్ = కాలముల; అందున్ = లోను; తలంప = తలచిన; దుర్లంఘ్య = దాటరాని; మహిముడు = మహిమకలవాడు; అగు = అయిన; పద్మనాభు = విష్ణువు యొక్క {పద్మనాభుడు - పద్మము నాబి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; మాయా = మాయచేత; మోహిత = మోహింపబడిన; ఆత్మకులు = ఆత్మలు కలవారు; ఐ = అయ్యి; భేద = వైమనస్యముతో; దర్శనులు = చూసెడివారు; ఐన = అయినట్టి; వారి = వారి; వలనను = మూలమున; ద్రోహంబున్ = ద్రోహము; కలిగిన = కలిగినది; ఐనను = అయినప్పటికి; అది = అది; దైవకృతము = దేవునిచేత చేయబడినది; అని = అని; అన్య = ఇతరుల; దుఃఖములు = దుఃఖములు; కున్ = కు; ఓర్వ = ఓర్వ; లేక = లేక; సత్పురుషుండు = మంచివాడు; దయచేయు = వెళ్ళిపోవును; కాని = కాని; హింసింపడు = బాధించడు; కాన = కావున; నీవున్ = నీవు కూడ; అచ్యుతుని = విష్ణుదేవుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}.
మాయ = మాయచేత; మోహమునన్ = మోహమును; అందకుంట = చెందకుండుట; చేసి = వలన; సర్వజ్ఞుడవు = సర్వముతెలిసినవాడవు; మాయ = మాయ; చేతన్ = చేత; మోహిత = మోహింపబడిన; ఆత్ములు = ఆత్మలు కలవారు; ఐ = అయ్యి; కర్మ = కర్మలందు; వర్తనులు = తిరుగువారు; అయిన = అయిన; వారి = వారి; వలన = వలన; ద్రోహంబున్ = ద్రోహములు; కలిగినన్ = కలిగినప్పటికిని; వలయున్ = వలసినది; ప్రోవన్ = కాపాడగ.
భావము:- సమస్త దేశాలలోను, సర్వ కాలాలలోను ఉల్లంగించరాని మహిమ కల విష్ణువు యొక్క మాయకు చిక్కినవారు భేదదృష్టితో ప్రవర్తిస్తారు. వారు ద్రోహం చేసినట్లైతే సత్పురుషుడు అది దైవకృతంగా భావిస్తాడు. ఆ మహితాత్ముడు ఇతరుల దుఃఖం చూచి ఓర్చుకోలేడు. వారిమీద జాలి పడతాడు. అంతేకాని వారిని హింసింపడు. నీవు విష్ణుమాయకు అతీతుడవు. అందుచేత నీవు సర్వజ్ఞుడవు. విష్ణుమాయకు వశులై కర్మలు ఆచరించేవారు అపరాధం చేసినట్లైతే నీవు క్షమించి వారిని కాపాడాలి.

తెభా-4-151-వ.
అది గావున యజ్ఞభాగార్హుండ వయిన నీకు సవనభాగంబు సమర్పింపని కతన నీచేత విధ్వంస్తంబయి పరిసమాప్తి నొందని దక్షాధ్వరంబు మరల నుద్ధరించి దక్షునిఁ బునర్జీవితుం జేయుము; భగుని నేత్రంబులును, భృగుముని శ్మశ్రువులును, బూషుని దంతంబులును, గృపఁజేయుము; భగ్నాంగు లయిన దేవ ఋత్విఙ్నికాయంబులకు నారోగ్యంబు గావింపు; మీ మఖావశిష్టంబు యజ్ఞ పరిపూర్తి హేతుభూతం బయిన భవదీయభాగం బగుం గాక."
టీక:- అదిగావున = ఆకారణముచేత; యజ్ఞ = యజ్ఞములందలి హవ్యములలో; భాగ = భాగమునకు; అర్హుండవు = అర్హత కలవాడవు; అయిన = అయిన; నీకు = నీకు; సవన = యజ్ఞములందలి హవ్యములలో; భాగంబున్ = భాగమును; సమర్పింపని = ఇవ్వని; కతన = కారణమువలన; నీ = నీ; చేతన్ = చేత; విధ్వస్తంబు = విధ్వంసము చేయబడిన; పరిసమాప్తి = పూర్తి; ఒందని = పొందని; దక్ష = దక్షుని; అధ్వరంబున్ = యజ్ఞమును; మరలన్ = మళ్ళీ; ఉద్దరించి = ఉద్ధరించి; దక్షునిన్ = దక్షుని; పునర్జీవుతున్ = మరల జీవించువానిగ; చేయుము = చేయుము; భగుని = భగుని యొక్క; నేత్రంబులును = కన్నులు; భృగుముని = భృగుముని యొక్క; శ్మశ్రువులును = మీసములు; పూషుని = పూషుని; దంతంబులును = పండ్లు; కృపజేయుము = దయచేయుము; భగ్నాంగులు = విరిగిన అవయవములు కలవారు; అయిన = అయిన; దేవ = దేవతలు; ఋత్విక్ = ఋత్విక్కులు; నికాయంబుల = సమూహముల; కున్ = కు; ఆరోగ్యంబున్ = ఆరోగ్యమును; కావింపుము = కలిగించుము; ఈ = ఈ; మఖ = యజ్ఞము యొక్క; అవశిష్టంబు = మిగిలిన భాగము; యజ్ఞ = యజ్ఞము; పరిపూర్తి = సంపూర్తికి; హేతు = కారణ; భూతంబున్ = భూతము; అయిన = అయిన; భవదీయ = నీ యొక్క; భాగంబున్ = భాగము; అగుంగాక = అవుగాక.
భావము:- అందువల్ల యజ్ఞభాగానికి అర్హుడవైన నీకు యజ్ఞభాగాన్ని ఇవ్వకపోవడం వల్ల నీవు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. అది అసంపూర్ణంగా మధ్యలో ఆగిపోయింది. అటువంటి దక్షయజ్ఞాన్ని నీవు పునరుద్ధరించు. దక్షుని బ్రతికించు. భగునికి కన్నులను, భృగుమహర్షికి మీసాలను, పూషునికి దంతాలను అనుగ్రహించు. అవయవాలు తుత్తునియలైన దేవతలకు, ఋత్విక్కులకు ఆరోగ్యం ప్రసాదించు. మిగిలిన యజ్ఞకార్యం సమస్తం పూర్తి కావించి ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించు.”

తెభా-4-152-చ.
ని చతురాననుండు వినయంబున వేఁడిన నిందుమౌళి స
య్యనఁ బరితుష్టిఁ బొంది దరహాసము మోమునఁ దొంగలింప ని
ట్లను "హరిమాయచేత ననయంబును బామరు లైనవారు చే
సి యపరాధ దోషములు చిత్తములో గణియింప నెన్నఁడున్.

టీక:- అని = అని; చతురాననుండు = బ్రహ్మదేవుడు {చతురాననుడు - చతుర (నాలుగు, 4) ఆననుడు (ముఖములు కలవాడు), బ్రహ్మదేవుడు}; వినయంబునన్ = వినయముగ; వేడినన్ = వేడికొనగ; ఇందుమౌళి = శివుడు {ఇందు మౌళి - ఇందు (చంద్రుడు)ని మౌళి (సిగ)లో కలవాడు, శివుడు}; సయ్యన = గబుక్కున; పరితుష్టి = సంతుష్టి; పొంది = పొంది; దరహాసము = చిరునవ్వు; మోమున = ముఖమున; తొంగిలింపన్ = తొంగిచూడగ; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; హరి = విష్ణువు యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; అనయంబున్ = అవశ్యము; పామరులు = పామరులు; ఐన = అయిన; వారు = వారు; చేసిన = చేసిన; అపరాధ = తప్పులు; దోషములు = పాపములు; చిత్తము = మనసు; లోన్ = లో; గణియింపన్ = ఎంచను; ఎన్నడును = ఎప్పుడును.
భావము:- అని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకొనగా శివుడు వెంటనే తృప్తిపడి చిరునవ్వుతో దయతో ఇలా అన్నాడు. ‘విష్ణుమాయకు వశులై పామరులు చేసిన దోషాలను నేను మనస్సులో ఎప్పుడూ లెక్కచేయను.

తెభా-4-153-వ.
అట్లయ్యును.
టీక:- అట్లు = ఆవిధముగ; అయ్యును = అయినప్పటికిని.
భావము:- అయినా…

తెభా-4-154-క.
లియుర దండించుట దు
ర్భజన రక్షణము ధర్మద్ధతి యగుటం
లుషాత్ముల నపరాధము
కొలఁదిని దండించుచుందుఁ గొనకొని యేనున్."

టీక:- బలియురన్ = బలవంతులను; దండించుట = దండించుట; దుర్భల = దుర్భలులు అయిన; జన = వారిని; రక్షణము = రక్షించుట; ధర్మ = ధర్మబద్ధమైన; పద్ధతి = విధానము; అగుటన్ = అవుటచేత; కలుషాత్ములన్ = దుష్టులను; అపరాధము = తప్పుల; కొలదిని = ప్రకారము; దండించుచున్ = దండిస్తూ; ఉందున్ = ఉంటాను; కొనకొని = పూనుకొని; ఏనున్ = నేను.
భావము:- బలవంతులను శిక్షించడం, దుర్బలులను రక్షించడం ధర్మమార్గం కనుక నేను దుష్టులను వారు చేసిన దోషాలకు తగినట్లుగా శిక్షిస్తూ ఉంటాను.”

తెభా-4-155-వ.
అని "దగ్దశీర్షుం డయిన దక్షుం డజముఖుం డగు; భగుండు బర్హి స్సంబంధ భాగంబులు గలిగి మిత్రనామధేయ చక్షుస్సునం బొడగాంచు; పూషుండు పిష్టభుక్కగుచు యజమాన దంతంబులచే భక్షించు; దేవతలు యజ్ఞావశిష్టంబు నాకొసగుటంజేసి సర్వావయవ పూర్ణులై వర్తింతురు; ఖండితాంగులైన ఋత్విగాది జనంబు లశ్వనీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్ధబాహు హస్తులై జీవింతురు; భృగువు బస్తశ్మశ్రువులు గలిగి వర్తించు;"నని శివుండా నతిచ్చిన సమస్తభూతంబులును సంతుష్టాంతరంగంబులై “తండ్రీ లెస్సయ్యె” నని సాధువాదంబుల నభినందించిరి. నంతనా శంభుని యామంత్రణంబు వడసి సునాసీర ప్రముఖులగు దేవతలు ఋషులతోడం గూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని దక్షాధ్వర వాటంబుకుం జనియె; నంత.
టీక:- అని = అని; దగ్ధ = కాలిపోయిన; శీర్షుండు = తల కలవాడు; అయిన = అయిన; దక్షుండు = దక్షుడు; అజ = గొఱ్ఱె; ముఖుండు = తల కలవాడు; అగు = అగును; భగుండు = భగుడు; బర్హి = దర్భలకి; సంబంధ = సంబంధించిన; భాగములు = భాగములు; కలిగి = పొంది; మిత్ర = మిత్ర అనెడి; నామధేయ = పేరుగల; చక్షుస్సునన్ = చక్షుస్సులో; పొడగాంచు = పొందును; పూషుండు = పూషుడు; పిష్టభుక్కు = పిండములను తినువాడు; అగుచున్ = అవుతూ; యజమాన = యజమాని యొక్క; దంతంబులున్ = దంతములు; చేన్ = చేత; భక్షించు = తినును; దేవతలు = దేవతలు; యజ్ఞ = యజ్ఞము యొక్క; అవశిష్టంబు = మిగిలిన భాగము; నాకున్ = నాకు; ఒసగుటన్ = ఇచ్చుట; చేసి = వలన; సర్వ = సమస్తమైన; అవయవ = అవయవములు; పూర్ణులు = నిండుగ ఉన్నవారు; ఐ = అయ్యి; వర్తింతురు = నడచెదరు; ఖండితాంగులు = విరిగిన అవయవములు కలవారు; ఐన = అయిన; ఋత్విక్ = ఋత్విక్కులు; ఆది = మొదలైన; జనంబులు = వారు; అశ్వనీదేవతల = అశ్వనీదేవతల; బాహువుల = చేతుల; చేతను = చేతను; పూషుని = పూషుని; హస్తంబుల = అరిచేతుల; చేతను = చేతను; లబ్ధ = పొందిన; బాహుహస్తులు = బాహు హస్తములు కలవారు; ఐ = అయ్యి; జీవింతురు = జీవించెదరు; భృగువు = భృగువు; బస్త = మేక; శ్మశ్రువులు = మీసములు; కలిగి = పొంది; వర్తించు = నడచును; అని = అని; శివుండు = శివుడు; ఆనతిచ్చిన = అనుగ్రహించగ; సమస్త = సమస్తమైన; భూతంబులును = జీవులును; సంతుష్టాంతరంగులు = సంతుష్టి చెందిన మనసులు కలవారు; ఐ = అయ్యి; తండ్రీ = అయ్యా; లెస్స = సరిగ; అయ్యెన్ = అయినది; అని = అని; సాధువాదంబులన్ = మంచిది మంచిది అనెడి పలుకులతో; అభినందించిరి = అభినందించిరి; అంతన్ = అంతట; ఆ = ఆ; శంభుని = శివుని; ఆమంత్రణంబు = అనుమతి; పడసి = పొంది; సునాసీర = ఇంద్రుడు; ప్రముఖులు = మొదలగు ముఖ్యులు; అగు = అయిన; దేవతలు = దేవతలు; ఋషులన్ = ఋషులను; తోడన్ = తోటి; కూడి = కలిసి; రాన్ = రాగా; అజుండును = బ్రహ్మదేవుడును; రుద్రునిన్ = శివుని; పురస్కరించుకొని = ముందిడుకొని; దక్ష = దక్షుని; అధ్వర = యజ్ఞము యొక్క; వాటంబు = వాటిక; కున్ = కి; చనియె = వెళ్ళెను; అంత = అప్పుడు.
భావము:- అని చెప్పి “శిరస్సు దహింపబడిన దక్షుడు గొఱ్ఱెముఖం కలవాడు అవుతాడు. భగుడు దర్భలతో సంబంధించిన యజ్ఞభాగాన్ని పొంది మిత్రనామకమైన నేత్రాలతో చూస్తాడు. పూషుడు పిండములను యజమాని దంతాల ద్వారా భుజిస్తాడు. దేవతలు యజ్ఞశేషాన్ని నాకు సమర్పించడం వల్ల మునుపటి వలె అన్ని అవయవాలు కలిగి సంచరిస్తారు. అవయవాలు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలైనవారు అశ్వినీ దేవతల బాహువుల చేతను, పూషుని హస్తాల చేతను తమ తమ బాహువులను, హస్తాలను పొంది బ్రతుకుతారు. భృగువు చింబోతు మీసాలు, గడ్డాము పొందుతాడు” అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సమస్త ప్రాణులు సంతోషించి “తండ్రీ! బాగు బాగు” అని మెచ్చుకున్నారు. అప్పుడు ఆ శివుని దగ్గర సెలవు తీసుకొని ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులతో కూడి బయలుదేరారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ముందుంచుకొని దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు….

తెభా-4-156-క.
ర్వుని యోగక్రమమున
ర్వావయవములుఁ గలిగి న్ముని ఋత్వి
గ్గీర్వాణముఖ్య లొప్పిరి
పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్.

టీక:- శర్వు = శివుని; నియోగ = నియమించిన; క్రమమున = ప్రకారము; సర్వ = సమస్తమైన; అవయవములున్ = అవయవములును; కలిగి = పొంది; సత్ = మంచి; ముని = మునులు; ఋత్విక్ = ఋత్విక్కులు; గీర్వాణ = దేవతల; ముఖ్యులు = ప్రముఖులు; ఒప్పిరి = చక్కగ ఉండిరి; పూర్వ = పూర్వపు; తను = దేహ; శ్రీలన్ = సంపదలతో; ఆర్యభూషణా = విదురా, గొప్పవారిచే మన్నిపబడేవాడ; అంతన్ = అంతట.
భావము:- ఓ విదురా! గొప్పవారిచే మన్నిపబడేవాడ! శివుని ఆజ్ఞానుసారంగా మునులు, ఋత్విక్కులు, దేవతలు మొదలైన వారంతా తమ తమ పూర్వశరీరాలను పొంది చక్కగా ప్రకాశించారు. అప్పుడు…

తెభా-4-157-క.
విను దక్షు నంత మేషము
ఖునిఁ జేసిన నిద్ర మేలుకొని లేచిన పో
ల్కిని నిలిచె దక్షుఁ, డభవుఁడు
నుఁగొనుచుండంగ నాత్మఁ గౌతుక మొప్పన్.

టీక:- విను = వినుము; దక్షున్ = దక్షుని; అంత = అప్పుడు; మేష = గొఱ్ఱె; ముఖునిన్ = తల కలవానిగ; చేసినన్ = చేయగా; నిద్రన్ = నిద్రనుండి; మేలుకొని = మేల్కొని; లేచిన = లేచిన; పోల్కిని = విధముగ; నిలిచెన్ = నిలబడెను; దక్షుడు = దక్షుడు; అభవుడు = బ్రహ్మదేవుడు; కనుగొనుచుండగన్ = చూస్తుండగా; ఆత్మన్ = మనసున; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = ఒప్పగ.
భావము:- విదురా! విను. శివుడు దక్షుని గొఱ్ఱెతల కలవానిగా చేసి చూస్తుండగా అతడు నిద్రనుండి మేలుకొన్న విధంగా సంతోషంగా లేచాడు.

తెభా-4-158-వ.
ఇట్లు లేచి నిలిచి ముందఱ నున్న శివునిం గనుంగొనిన మాత్రన శరత్కాలంబున నకల్మషంబైన సరస్సునుంబోలెఁ బూర్వ రుద్రవిద్వేష జనితంబు లైన కల్మషంబులం బాసి నిర్మలుండై యభవుని నుతియింపం దొడంగి మృతిఁ బొందిన సతీ తనయం దలంచి యనురా గోత్కంఠ బాష్పపూరిత లోచనుండును, గద్గదకంఠుండునునై పలుకం జాలక యెట్టకేలకు దుఃఖంబు సంస్తంభించుకొని ప్రేమాతిరేక విహ్వలుం డగుచు సర్వేశ్వరుం డగు హరున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; లేచి = లేచి; నిలిచి = నిలబడి; ముందఱ = ఎదుట; ఉన్న = ఉన్నట్టి; శివునిన్ = శివుని; కనుగొనిన = చూసి; మాత్రన = మాత్రముచేతనే; శరత్కాలంబునన్ = శరత్కాలమునందు; అకల్మషంబున్ = నిర్మలము; ఐన = అయిన; సరస్సునున్ = సరోవరము; పోలెన్ = వలె; పూర్వ = పాతకాలపు; రుద్ర = శివ; విద్వేష = ద్వేషించుటచేత; జనితంబులు = పుట్టినవి; ఐన = అయిన; కల్మషంబులన్ = దోషములను; పాసి = తొలగి; నిర్మలుండు = అమలినుడు; ఐ = అయ్యి; అభవుని = శివుని; నుతియింపన్ = స్తోత్రముచేయ; తొడగి = మొదలు పెట్టి; మృతి = మరణము; పొందిన = పొందిన; సతీ = సతి అనెడి; తనయన్ = పుత్రికను; తలంచి = తలచుకొని; అనురాగ = ప్రేమ; ఉత్కంఠలన్ = వేగిరిపాటులవలన; బాష్ప = కన్నీటితో; పూరిత = నిండిన; లోచనుండును = కన్నులు కలవాడును; గద్గద = గద్గదమైన; కంఠుండును = కంఠము కలవాడును; ఐ = అయ్యి; పలుకన్ = పలుక; చాలక = లేక; ఎట్టకేలకు = ఆఖరికి; దుఃఖంబున్ = దుఃఖమును; సంస్తంభించుకొని = చక్కగ ఆపుకొని; ప్రేమా = ప్రేమ; అతిరేక = అతిశయముచే; విహ్వలుడు = విహ్వలుడు; అగచున్ = అవుతూ; సర్వేశ్వరుండు = సమస్తమునకు ప్రభువు; అగు = అయిన; హరున్ = శివుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అలా లేచి నిలిచిన దక్షుడు శివుని చూచినంత మాత్రాన శరత్కాలంలో బురద లేని సరస్సు వలె పూర్వం రుద్రుని ద్వేషించడం వలన కలిగిన దోషాలను పోగొట్టుకొని నిర్మలుడై ఆ శివుణ్ణి స్తుతించాలకున్నాడు. కాని మరణించిన తన కూతురును తలచుకొని ప్రేమతో, తహతహపాటుతో కన్నులలో నీరు నిండగా, డగ్గుత్తిక పడిన కంఠంతో మాట్లాడలేక, ఎట్టకేలకు దుఃఖాన్ని దిగమ్రింగుకొని ప్రేమాతిరేకంతో ఒడలు మరచి ఆ శివునితో ఇలా అన్నాడు.

తెభా-4-159-క.
"విను; నీ కపరాధుఁడ నగు
ను దండించు టది దండము గాదు మది
న్నను రక్షించుటగా మన
మునఁ దలఁతును దేవ! యభవ! పురహర! రుద్రా!

టీక:- విను = వినుము; నీకున్ = నీ ఎడల; అపరాధుడను = అపరాధము చేసినవాడను; అగు = అయిన; నను = నన్ను; దండించుట = శిక్షించుట; అది = అది; దండనము = దండనము; కాదు = కాదు; మదిన్ = అది; నను = నన్ను; రక్షించుట = రక్షించుట; కాన్ = అగునట్లు; మనమునన్ = మనసులో; తలంతును = తలుస్తాను; దేవ = దేవుడ {దేవ - దేవుడు, శివుడు}; అభవ = శివుడ {అభవ - పుట్టుకలేనివాడు, శివుడు}; పురహర = శివుడ {పుర హర - త్రిపురములను హరించినవాడు, శివుడు}; రుద్రా = శివుడ {రుద్రుడు - రౌద్రము కలవాడు, శివుడు}.
భావము:- “దేవా! అభవా! పురాంతకా! రుద్రా! విను. నీకు అపరాధం చేసిన నన్ను నీవు శిక్షించడం నాకు అది శిక్ష కాదు. అది నన్ను రక్షించడంగానే భావిస్తాను.

తెభా-4-160-సీ.
నఘాత్మ! తగ నీవు బ్జనాభుండును-
రికింపఁ బ్రాహ్మణాభాసు లయిన
వారల యెడల నెవ్వలన నుపేక్షింప-
రఁట! దృఢవ్రతచర్యు లైనవారి
యె నీకుపేక్ష యెక్కడిది? సర్గాదిని-
నామ్నాయ సంప్రదాప్రవర్త
ము నెఱింగించుట మర విద్యాతపో-
వ్రత పరాయణులైన బ్రాహ్మణులను

తెభా-4-160.1-తే.
రుసఁ బుట్టించితివి; కాన వారి నెపుడుఁ
గే దండంబుఁ బూని గోపాకుండు
లసి గోవుల రక్షించు గిది నీవు
రసి రక్షించుచుందు గయ్య రుద్ర!

టీక:- అనఘాత్మ = పుణ్యాత్మ; తగన్ = తగ; నీవున్ = నీవును; అబ్జనాభుండును = విష్ణువు {అబ్జనాభుడు - అబ్జము (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు}; పరికింప = సరిగచూసిన; బ్రాహ్మణ = బ్రహ్మణులలో; అభాసులు = బ్రష్టులు; అయిన = అయిన; వారల = వారి; ఎడ = అందు; ఎవ్వలనను = ఏవిధముగ; ఉపేక్షింపరట = నిర్లక్ష్యముచేయరట; దృఢ = గట్టి; వ్రతచర్యులు = విధముగ చరించువారు; ఐన = అయిన; వారి = వారి; ఎడ = అందు; నీకున్ = నీకు; ఉపేక్ష = అశ్రద్ధ; ఎక్కడిది = ఎక్కడిది; సర్గ = సృష్టి; ఆదిని = మొదటిలో; ఆమ్నాయ = వేదముల; సంప్రదాయమున్ = సంప్రదాయమును; ప్రవర్తనమున్ = విధానమును; ఎఱింగించుట = తెలుపుట; కున్ = కు; అమర = దేవతలను; విద్యా = విద్య; తపస్ = తపస్సు; వ్రత = వ్రతములందు; పరాయణులు = నిష్ఠకలవారు; ఐన = అయిన; బ్రాహ్మణులను = బ్రహ్మణులను.
వరుసన్ = వరుసగా; పుట్టించితివి = పుట్టించితివి; కాన = కావున; వారినిన్ = వారిని; ఎపుడున్ = ఎప్పుడును; కేలన్ = చేతితో; దండంబున్ = కఱ్ఱ; పూని = ధరించి; గోపాలకుండు = గోవులుకాచెడివాడు; బలిసి = అతిశయించి; గోవులన్ = ఆవులను; రక్షించు = కాపాడు; పగిది = విధముగ; నీవున్ = నీవును; అరసి = చక్కగచూసి; రక్షించుచుందు = కాపాడుతుంటావు; కదు = కదా; అయ్య = తండ్రి; రుద్రా = శివ.
భావము:- పుణ్యాత్మా! నీవు, విష్ణువు కపట బ్రాహ్మణులను క్షమింపరు. దృఢమైన వ్రతం కల బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేయరు. సృష్టి ఆరంభంలో వేదసంప్రదాయాలను ప్రవర్తింపజేయడానికి నీవు బ్రాహ్మణులను సృజించావు. విద్య, తపస్సు, వ్రతం బ్రాహ్మణుల ధర్మాలు. కాబట్టి కఱ్ఱ చేత పట్టుకొని గోపాలుడు గోవులను కాపాడే విధంగా నీవు బ్రాహ్మణులను నిత్యం శ్రద్ధగా కాపాడుతూ ఉంటావు.

తెభా-4-161-సీ.
లపోయ నవిదిత త్త్వవిజ్ఞానుండ-
నైన నాచేత సభాంతరమున
తి దురుక్త్యంబక క్షతుఁడ వయ్యును మత్కృ-
తాపరాధము హృదయంబు నందుఁ
లఁపక సుజన నిందాదోషమున నధో-
తిఁ బొందుచున్న దుష్కర్ము నన్నుఁ
రుణఁ గాచిన నీకుఁ డఁగి ప్రత్యుపకార-
మెఱిఁగి కావింప నే నెంతవాఁడ?

తెభా-4-161.1-తే.
నుతచరిత్ర! భవత్పరానుగ్రహాను
రూప కార్యంబుచేత నిరూఢమైన
తుష్టి నీ చిత్తమందు నొందుదువు గాక;
క్షుద్రసంహార! కరుణాసముద్ర! రుద్ర!"

టీక:- తలపోయన్ = ఆలోచించినచో; అవిదిత = తెలియని; తత్త్వవిజ్ఞానుండను = తత్త్వవిజ్ఞానము కలవాడను; ఐన = అయిన; నా = నా; చేతన్ = చేత; సభా = సభ; అంతరమున = లోన; అతి = మిక్కిలి; దుర్యుక్త = దుష్టవాక్యములు అనెడి; అంబక = బాణములవలన; క్షతుండవు = గాయపడినవాడవు; అయ్యును = అయినప్పటికిని; మత్ = నాచేత; కృత = చేయబడిన; అపరాధమున్ = తప్పును; హృదయంబున్ = మనసు; అందున్ = లోన; తలపక = తలచక; సు = మంచి; జన = వారిని; నిందా = నిందించిన; దొషమున = పాపమువలన; అధోగతి = దిగజారుటను; పొందుచున్న = పొందుతున్న; దుష్క్రర్మున్ = పాపిని; నన్నున్ = నన్ను; కరుణన్ = దయతో; కాచిన = కాపాడిన; నీకున్ = నీకు; కడగి = పూని; ప్రత్యుపకారము = ప్రత్యుపకారము; ఎఱిగి = తెలిసి; కావింపన్ = చేయుటకు; నేను = నేను; ఎంతవాడ = ఎంతవాడను.
నుతచరిత్ర = స్తుతింపబడిన వర్తన కలవాడ; భవత్ = నీ యొక్క; పర = ఇతరులను; అనుగ్రహ = అనుగ్రహిచుంట; అను = అనెడి; రూపంబు = రూపముకల; కార్యంబు = పనుల; చేతన్ = చేత; నిరూఢమైన = ప్రసిద్ధమైన; తుష్టిన్ = సంతుష్టిని; నీ = నీ యొక్క; చిత్తము = మనసు; అందున్ = లో; అందుదువుగాక = పొందుదువుగాక; క్షుద్రసంహార = శివ {క్షుద్రసంహార - క్షుద్రులను సంహరించువాడు, శివుడు}; కరుణాసముద్ర = శివ {కరుణాసముద్ర - సముద్రము అంత దయ కలవాడ, శివుడు}; రుద్రా = శివ.
భావము:- క్షుద్రులను సంహరించే రుద్రా! దయా సముద్రా! నేను తత్త్వజ్ఞానం తెలియని మూర్ఖుడను. మహాసభలో నేను పలికిన చెడ్డ పలుకులు అనే ములుకులచేత నీవు గాయపడ్డావు. అయినా నేను చేసిన నేరాన్ని నీవు మనస్సులో పెట్టుకోలేదు. మహానుభావుణ్ణి నిందించిన పాపంచేత అధోగతికి పోవలసిన పాపాత్ముణ్ణి నన్ను దయతో కాపాడావు. నీకు తిరిగి ఉపకారం చేయటానికి నే నెంతవాణ్ణి? ఓ సచ్చరిత్రా! త్రినేత్రా! ఇతరులను అనుగ్రహించే కార్యాల మూలంగా కలిగే ఆనందాన్ని నీవు పొందుదువు గాక!”

తెభా-4-162-వ.
అని యిట్లు రుద్రక్షమాపణంబు గావించి పద్మసంభవుచేత ననుజ్ఞాతుండై దక్షుం డుపాధ్యాయ ఋత్విగ్గణ సమేతుం డగుచుఁ గ్రతుకర్మంబు నిర్వర్తించు సమయంబున, బ్రాహ్మణజనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై సాగుటకుఁ బ్రమథాది వీర సంసర్గ కృత దోష నివృత్త్యర్థంబుగా విష్ణుదేవతాకంబును ద్రికపాలపురోడాశ ద్రవ్యకంబును నైన కర్మంబుఁ గావింప నధ్వర్యుకృత్య ప్రవిష్టుం డగు భృగువు తోడం గూడి నిర్మలాంతఃకరణుం డగుచు దక్షుఁడు ద్రవ్యత్యాగంబుఁ గావింపఁ బ్రసన్నుండై సర్వేశ్వరుండు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; రుద్ర = రుద్రునికి; క్షమాపణ = క్షమాపణకోరుట; కావించి = చేసి; పద్మసంభవు = బ్రహ్మదేవుని; చేతన్ = చేత; అనుజ్ఞాతుండు = అనుజ్ఞ పొందినవాడు; ఐ = అయ్యి; దక్షుండు = దక్షుడు; ఉపాధ్యాయ = గురువులు; ఋత్విక్ = ఋత్విక్కుల; గణ = సమూహముతో; సమేతుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; క్రతు = యజ్ఞ; కర్మంబున్ = కర్మలను; నిర్వర్తించు = చేసెడి; సమయంబున = సమయములో; బ్రాహ్మణ = బ్రాహ్మణ; జనంబులు = జనులు; యజ్ఞంబులు = యజ్ఞములు; నిర్విఘ్నంబులు = ఆటంకములులేనివి; ఐ = అయ్యి; సాగుట = జరుగుట; కున్ = కు; ప్రమథ = ప్రమథగణములు; ఆది = మొదలైన; వీర = వీరత్వముగల; సంసర్గ = గుంపులు; కృత = చేసిన; దోష = దోషముల; నివృత్తి = పోగొట్టుట; అర్థంబుగా = కోసము; విష్ణు = విష్ణువు; దేవతాకంబును = దేవతగా కలది; త్రికపాల = మూడు గిన్నెల; పురోడాశ = యజ్ఞార్థమైన ఆపూపములకైన {పురోడాశము - యాగార్థమైన అపూపము (పిండితో చేసిన పిడచలు లేదా ముద్దలు)}; ద్రవ్యకంబును = పదార్థముతో కూడినది; ఐన = అయిన; కర్మంబున్ = యజ్ఞకర్మమును; కావింపన్ = చేయుటకు; అధ్వర్వు = అధ్వర్వ్యుడు అనెడి {అధ్వర్వ్యుడు - యజ్ఞమునందు అధర్వణవేదతంత్రము నడపువాడు}; కృత్య = చేయుట; ప్రవిష్టుండు = ప్రవేశము కలవాడు; అగు = అయిన; భృగువు = భృగువు; తోడన్ = తోటి; కూడి = కలిసి; నిర్మల = పరిశుద్ధమైన; అంతఃకరణుండు = అంతఃకరణము కలవాడు; అగుచున్ = అవుతూ; దక్షుడు = దక్షుడు; ద్రవ్య = ద్రవ్యములను; త్యాగంబున్ = త్యజించుట; కావింపన్ = చేయగా; ప్రసన్నుండు = ప్రసన్నుడు; ఐ = అయ్యి; సర్వేశ్వరుండు = విష్ణుమూర్తి {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}.
భావము:- అని ఈ విధంగా దక్షుడు క్షమింపుమని రుద్రుణ్ణి వేడుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా ఉపాధ్యాయులతోను, ఋత్విక్కులతోను కూడి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. అప్పుడు బ్రాహ్మణులు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి, ప్రమథ వీరుల సంబంధంవల్ల కలిగిన దోషం నివారించడానికి విష్ణుమూర్తి దేవతగా కలిగినదీ, పురోడాశ ద్రవ్యం కలిగినదీ అయిన కర్మను నిర్వర్తించారు. అధ్వర్యుకార్యాన్ని స్వీకరించిన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సు కలవాడై దక్షుడు ద్రవ్యత్యాగం చేసాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి (సాక్షాత్కరించాడు).

తెభా-4-163-సీ.
మానిత శ్యామాయమాన శరీర దీ-
ధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ
గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ-
శేయ చేలద్యుతుల్ చెలిమి చేయ
క్ష్మీసమాయుక్త లిత వక్షంబున-
వైజయంతీ ప్రభల్ న్నెచూప
హాకరత్న కిరీ కోటిప్రభల్-
బాలార్క రుచులతో మేమాడ

తెభా-4-163.1-తే.
లితనీలాభ్రరుచిఁ గుంతములు దనరఁ
బ్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ
వ భవామర ముఖ్యుల ప్రభలు మాప
ఖిలలోకైక గురుఁడు నారాయణుండు.

టీక:- మానిత = మన్నింపదగు; శ్యామాయమాన = నల్లనిదైన; శరీర = దేహ; దీధితులు = కాంతులు; నల్దిక్కులన్ = నాలుగు (4) దిక్కులను {నాలుగు దిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పశ్చిమము 4ఉత్తరము}; దీటుకొనగ = పరచుకొనగ; కాంచన = బంగారపు; మేఖలా = మొలనూలు యొక్క; కాంతుల = ప్రకాశముల; తోడన్ = తోటి; కౌశేయచేల = పట్టుబట్ట; ద్యుతుల్ = మెరుపులు; చెలిమి = స్నేహము; చేయన్ = చేస్తుండగ; లక్ష్మీ = లక్ష్మీదేవితో; సమాయుక్త = కూడిఉన్న; లలిత = అందమైన; వక్షంబున = వక్షస్థలమున; వైజయంతీ = వైజయంతిమాల; ప్రభల్ = కాంతులు; వన్నెచూప = ప్రకాశిస్తుండగ; హాటక = బంగారపు; రత్న = రత్నములు తాపిన; కిరీట = కిరీటము యొక్క; కోటి = అతిశయిస్తున్న; ప్రభల్ = కాంతులు; బాల = ఉదయిస్తున్న; అర్క = సూర్యుని; రుచుల = కాంతుల; తోన్ = తో; మేలమాడ = పరిహాసమాడ.
లలిత = అందమైన; నీల = నల్లని; అభ్ర = మేఘముల; రుచిన్ = కాంతులతో; కుంతలములు = ముంగురులు; తనరన్ = అతిశయించ; ప్రవిమల = మిక్కిలినిర్మలమైన; ఆత్మీయ = స్వంత; దేహజ = శరీరమునుండి జనించు; ప్రభ = కాంతి; సరోజభవ = బ్రహ్మదేవుడు {సరోజభవ - సరోజము (పద్మము)న భవ (జనించినవాడు), బ్రహ్మదేవుడు}; భవా = శివుడు మొదలగు; అమర = దేవ; ముఖ్యుల = ప్రముఖుల; ప్రభలు = కాంతులు; మాపన్ = తగ్గింపజేయగ; అఖిలలోకైకగురుడు = విష్ణువు {అఖిలలోకైకగురుడు - సమస్తమైన లోకములకు ఒకడేయైన పెద్ద, హరి}; నారయణుండు = విష్ణువు {నారాయణుడు - నారములు (నీటి) యందు వసించువాడు, హరి}.
భావము:- నల్లని మేని కాంతులు నాలుగు దిక్కుల్లో వ్యాపిస్తుండగా, బంగారు మొలత్రాడు కాంతులతో పట్టుబట్టల కాంతులు కలిసిపోగా, లక్ష్మికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీమాల కాంతులను ప్రసరిస్తుండగా, రత్నాలు పొదిగిన బంగారు కిరీటం కాంతులు బాలసూర్యుని వెలుగులతో అతిశయించగా, శిరోజాలు నీలమేఘ కాంతులతో ఒప్పుతుండగా, తన దేహంనుండి వెలువడే దివ్యకాంతులు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతాశ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తూ సమస్త లోకాలకు గురువైన నారాయణుడు (సాక్షాత్కరించాడు).

తెభా-4-164-చ.
లిత శంఖ చక్ర జలజాత గదా శర చాప ఖడ్గ ని
ర్మ రుచులున్ సువర్ణ రుచిన్మణి కంకణ ముద్రికా ప్రభా
ళులును దేజరిల్లు భుజర్గ మనర్గళ కాంతియుక్తమై
విసిత కర్ణికార పృథివీరుహముం బురుడింపఁ బిట్టుగన్.

టీక:- సలలిత = అందమైన; శంఖ = శంఖము; చక్ర = చక్రము; జలజాత = పద్మము; గదా = గద; శర = విల్లు; చాప = బాణము; ఖడ్గ = ఖడ్గముల యొక్క; నిర్మల = నిర్మలమైన; రుచులున్ = కాంతులు; సువర్ణ = బంగారు; రుచిమత్ = ప్రకాశవంతమైన; మణి = రత్నములు తాపిన; కంకణ = చేతికి ధరించు కంకణములు; ముద్రికా = ఉంగరముల; ప్రభా = కాంతుల; ఆవళులును = పుంజములు; తేజరిల్లు = విలసిల్లు; భుజ = భుజముల; వర్గము = సమూహము; అనర్గళ = సాటిలేని; కాంతి = కాంతులతో; యుక్తము = కూడినది; ఐ = అయ్యి; విలసిత = అందమగు, పుష్పించిన; కర్ణికార = కొండగోగు; పృథివీరుహమున్ = చెట్టును; పురుడింపన్ = పోలియుండెను; బిట్టుగన్ = అధికముగ.
భావము:- అందమైన శంఖం, చక్రం, పద్మం, గద, విల్లమ్ములు, ఖడ్గం మొదలైనవాటి నిర్మల కాంతులతోను, మణులు పొదిగిన బంగారు కంకణం, ఉంగరాల కాంతులతోను ప్రకాశించే భుజసమూహంతో తన శరీరం పూచిన కొండగోగుచెట్టు వలె అలరారుతుండగా (విష్ణువు సాక్షాత్కరించాడు).

తెభా-4-165-క.
సోదార సమంచిత
హాస విలోకనములఁ గ లోకములం
రితోషము నొందించుచుఁ
మోత్సవ మొప్ప విశ్వబంధుం డగుచున్.

టీక:- సరస = సరసమైన; ఉదార = ఔదార్యముతో; సమంచిత = చక్కగకూడిన; దరహాస = చిరునవ్వుల; విలోకనములన్ = చూపులు; తగన్ = తగి; లోకములన్ = లోకములను; పరితోషమున్ = సంతోషమును; ఒందించుచున్ = కలిగిస్తూ; పరమ = అత్యధికమైన; ఉత్సవము = వైభవము; ఒప్పన్ = ఒప్పియుండగ; విశ్వబంధుండు = విశ్వమునకు బంధువు; అగుచున్ = అవుతూ.
భావము:- సరసమైన ఔదార్యంతో కూడిన చిరునవ్వుతో, చూపులతో లోకాలకు సంతోషాన్ని కలిగిస్తూ కన్నుల పండుగగా లోకబంధువౌతూ (విష్ణువు సాక్షాత్కరించాడు).

తెభా-4-166-చ.
ఱియును రాజహంస రుచిద్భ్రమణీకృత తాలవృంత చా
ములు వీవఁగా దివిజమానిను లచ్చసుధామరీచి వి
స్ఫుణ సితాతపత్ర రుచిపుంజము దిక్కులఁ బిక్కటిల్లఁగాఁ
రివరదుండు వచ్చె సుభస్తుతి వర్ణ సుపర్ణయానుఁడై.

టీక:- మఱియును = ఇంకనూ; రాజహంస = రాజహంస వలె; రుచిమత్ = మెరుస్తూ; భ్రమణీకృత = తిరుగుతున్న; తాలవృంత = తాటియాకు; చామరములు = విసనకఱ్ఱలు; వీవగా = వీస్తుండగ; దివిజ = దేవతా; మానినులు = స్త్రీలు; అచ్చ = స్వచ్ఛమైన; సుధా = చంద్రుని; మరీచి = వెన్నెలలా; విస్ఫురణన్ = మెరుస్తున్న; సిత = తెల్లని; అతపత్ర = గొడుగు; రుచి = కాంతుల; పుంజము = సమూహము; దిక్కులన్ = దిక్కులమ్మట; పిక్కటిల్లగ = నిండగ; కరివరదుండు = విష్ణుమూర్తి {కరివరదుడు - కరి (గజేంద్రుని)కి వరదుడు (వరము ప్రసాదించినవాడు), హరి}; వచ్చెన్ = వచ్చెను; సుభగ = సౌభాగ్యకరమైన; స్తుతి = స్తుతుల, చక్కటి; వర్ణ = వర్ణింపబడు, రంగుకల; సుపర్ణ = గరుత్మంతునిపై {సుపర్ణుడు - సు (మంచి) పర్ణుడు (రెక్కలుకలవాడు) గరుత్మంతుడు}; యానుడు = విహరించువాడు; ఐ = అయ్యి.
భావము:- ఇంకా దేవతాస్త్రీలు రాజహంసలవలె తెల్లనైన విసనకఱ్ఱలతో, వింజామరలతో వీస్తూ ఉండగా, పున్నమనాటి చంద్రబింబం వంటి తెల్లని గొడుగు కాంతులు దిక్కులందు వ్యాపించగా కరివరదుడైన హరి గరుడవాహన మెక్కి అక్కడికి వచ్చాడు.