పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/స్వాయంభువమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాయంభువమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-7-వ.)[మార్చు]

ప్రథమ మనువువైన స్వాయంభువునకు నాకూతి దేవహూతు లను నిరువురుఁ గూఁతులు గలరు; వారిఁకి గ్రమంబునఁ గపిల యజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు జేయుకొఱకు హరి పుత్రత్వంబు నొందె; నందుఁ గపిలుని చరిత్రంబు మున్నఁ జెప్పంబడియె; యజ్ఞుని చరిత్రంబు చెప్పెద వినుము.

(తెభా-8-8-మ.)[మార్చు]

రూపాపతి గామభోగ విరతిన్ సంత్యక్త భూ భారుఁడై
తియుం దానును గాన కేఁగి శతవర్షంబుల్ సునందానదిన్
వ్ర తియై యేక పదస్థుఁడై నియతుఁడై వాచంయమస్ఫూర్తితో
దోషుండు తపంబుజేసె భువనఖ్యాతంబుగా భూవరా.

(తెభా-8-9-వ.)[మార్చు]

ఇట్లు తపంబు జేయుచు స్వాయంభువ మనువు తన మనంబులోన.

(తెభా-8-10-సీ.)[మార్చు]

సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు? ;
సృష్టి యెవ్వని చేఁతచే జనించు?
గములు నిద్రింప జాగరూకత నొంది;
యెవ్వఁడు బ్రహ్మాండ మెఱుఁగుచుండు?
నాత్మ కాధారంబు ఖిలంబు నెవ్వఁడౌ? ;
నెవ్వని నిజధనం బింతవట్టుఁ
బొడగాన రాకుండఁ బొడఁగను? నెవ్వెడే;
నెవ్వని దృష్టికి నెదురులేదు

(తెభా-8-10.1-ఆ.)[మార్చు]

నన వృద్ధి విలయ సంగతిఁ జెందక
యెవ్వఁ డెడపకుండు నెల్ల యెడలఁ?
న మహత్త్వతత్త్వ సంజ్ఞ నెవ్వఁడు దాన
విశ్వరూపుఁ డనఁగ విస్తరిల్లు?

(తెభా-8-11-వ.)[మార్చు]

అని మఱియు "నిరహంకృతుండును నిర్గతబుద్ధుండును నిరాశియుఁ బరిపూర్ణుండును ననన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజమార్గ సంస్థితుండును నిఖిలధర్మ భావనుండును నైన పరమేశ్వరునకు నమస్కరించెద" నని యుపనిషదర్థంబులు పలుకుచున్న మనువుం గనుంగొని.

(తెభా-8-12-క.)[మార్చు]

క్కసులు దినఁగఁ గడఁగిన
వె క్కసముగ యజ్ఞనామ విష్ణుఁడు వారిం
క్కడిచెఁ జక్రధారల
మి క్కుటముగ వేల్పులెల్ల మేలని పొగడన్.

(తెభా-8-13-వ.)[మార్చు]

అది ప్రథమ మన్వంతరం బింక ద్వితీయ మన్వంతరంబు వినుము.

21-05-2016: :
గణనాధ్యాయి 16:30, 16 సెప్టెంబరు 2016 (UTC)