పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సురాసురలు స్నేహము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సురాసురలుస్నేహము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-178-క.)[మార్చు]

య్యంబు జేయ నొల్లక
'నె య్యంబున నతులు పెట్టి నిర్జర నికరం
బి య్యప్పనములు పెట్టుచుఁ
'ది య్యంబునఁ గొల్చె బలిని దేవద్వేషిన్.

(తెభా-8-179-క.)[మార్చు]

చెడి తనకును వశమై
'సు రముతో గొల్చుచున్న సురసంఘములన్
సిమసిఁగి చంపఁ బూనిన
' సురుల వారించె బలియు తినయయుక్తిన్.

(తెభా-8-180-వ.)[మార్చు]

అటు వారించి వైరోచని రాక్షస సముదయంబున కిట్లనియె.

(తెభా-8-181-క.)[మార్చు]

వారు శరణు చొచ్చిన
' తనములు నెఱపఁ దగునె గవారలకున్
గు సమయ మెఱుఁగ వలదే
' టిమిఁ బాటింప వల దర్త్యులతోడన్.

(తెభా-8-182-వ.)[మార్చు]

అని పలికి కొలువు కూటంబున నసుర నికర పరివృతుండై నిఖిల లోకరాజ్యలక్ష్మీ సహితుండై యఖిల విబుధ వీర విజయాహంకార నిజాలంకారుండై సుఖంబునం గొలువున్న విరోచన నందనుంగని శచీవిభుం డుత్తమ సచివుండునుం బోలె స్వాంతఁ వచనంబుల శాంతిం బొందించి పురుషోత్తమ శిక్షితంబైన నీతిమార్గంబున శంబరునికిం బ్రియంబు చెప్పి; యరిష్టనేమి ననునయించి త్రిపురవాసులగు దానవుల నొడంబఱచి; జంభుని సమ్మతంబు చేకొని; హయగ్రీవుని విగ్రహంబు మాన్చి; నముచి తారక బాణాదులతో సఖ్యంబు నెఱపి; విప్రచిత్తికిం బొత్తు హత్తించి; శకుని విరోచన ప్రహేతులకుఁ బోరామి చూపి మయ మాలి సుమాలి ప్రముఖులకు మైత్రి యెఱింగించి; కుంభ నికుంభులకు సౌజన్యంబుఁ గైకొలిపి; పౌలోమ కాలకేయ నివాత కవచాదుల యెడ బాంధవంబు ప్రకటించి; వజ్రదంష్ట్ర్రికి వశుండై; యితర దానవ దైత్య సమూహంబువలన నతిస్నేహంబు సంపాదించి; మనకు నక్క చెలియండ్ర బిడ్డలకు నొడ్డారంబు లేమిటికి? నేక కార్యపరత్వంబున నడ్డంబు లేక బ్రదుకుద; మన్యోన్య విరోధంబు లేల? తొల్లి యన్యోన్య విరోధంబున నలంగితి; మిది మొదలు దనుజ దివిజ సముదయంబులకు రాజు విరోచననందనుండ; మన మందఱ మతని పంపు చేయంగలవార; ముభయ కులంబును వర్ధిల్లు నట్టి యుపాయం బెఱింగింతు నని యమృతజలధిమథన ప్రారంభ కథనంబు దెలియం జెప్పె; నట్లు సురాసుర యూథంబులు బలారాతి బలిప్రముఖం బులై పరమోద్యోగంబున సుధాసంపాదనాయత్త చిత్తులై యైకమత్యంబు నొంది యమందగమనంబున మందరనగంబునకుం జని.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:56, 19 సెప్టెంబరు 2016 (UTC)