పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సురభి ఆవిర్భావము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సురభి ఆవిర్భావము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-251-వ.)[మార్చు]

మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ.

(తెభా-8-252-క.)[మార్చు]

తె ల్లని మేనును నమృతము
జి ల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం
బె ల్లుగ నర్థుల కోర్కులు
వె ల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్.

(తెభా-8-253-ఆ.)[మార్చు]

గ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ
మునులు పుచ్చికొనిరి మున్నెఱింగి
విబుధ సంఘములకు వెరవుతో నధ్వర
వులు పెట్టుకొఱకు వనినాథ!

(తెభా-8-254-వ.)[మార్చు]

మఱియు నా జలరాశి యందు.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:30, 19 సెప్టెంబరు 2016 (UTC)