పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గరళభక్షణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గరళభక్షణము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-232-వ.)[మార్చు]

అని మఱియు నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకల భూత సముండగు నద్దేవదేవుండుఁ దన ప్రియసతి కిట్లనియె.

(తెభా-8-233-క.)[మార్చు]

కం టే జగముల దుఃఖము;
విం టే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై
యుం కు నార్తుల యాపద
గెం టింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!

(తెభా-8-234-క.)[మార్చు]

ప్రా ణేచ్ఛ వచ్చి చొచ్చిన
ప్రా ణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం
బ్రా ణుల కిత్తురు సాధులు
బ్రా ణంబులు నిమిష భంగుము లని మగువా!

(తెభా-8-235-క.)[మార్చు]

హితము జేయ నెవ్వఁడు
మ హితుం డగును భూత వంచకమునకుం
హితమె పరమ ధర్మము
హితునకు నెదురులేదు ర్వేందుముఖీ!

(తెభా-8-236-క.)[మార్చు]

రి మది నానందించిన
రిణాక్షి! జగంబులెల్ల నానందించున్
రియును జగములు మెచ్చఁగ
ళము వారించు టొప్పుఁ మలదళాక్షీ!

(తెభా-8-237-క.)[మార్చు]

శి క్షింతు హాలహలమును
క్షింతును మధురసూక్ష్మ లరసము క్రియన్
క్షింతుఁ బ్రాణి కోట్లను
వీ క్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!

(తెభా-8-238-వ.)[మార్చు]

అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ "దేవా! దేవర చిత్తంబు కొలంది నవధరింతురు గాక!" యని పలికె" నని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.

(తెభా-8-239-మ.)[మార్చు]

రన్ లోకహితార్థమంచు నభవుం డౌఁ గాక యం చాడెఁ బో
రుల్ భీతిని మ్రింగవే యనిరి వో యంభోజగర్భాదులుం
ముఁ గావన్ హర! లెమ్ము లెమ్మనిరి వో తాఁ జూచి కన్గంట న
య్యు ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానలజ్వాలలన్.

(తెభా-8-240-వ.)[మార్చు]

అనిన శుకుం డిట్లనియె.

(తెభా-8-241-క.)[మార్చు]

మ్రిం గెడి వాఁడు విభుం డని
మ్రిం గెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రిం గు మనె సర్వమంగళ
మం ళసూత్రంబు నెంత ది నమ్మినదో!

(తెభా-8-242-మ.)[మార్చు]

చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
గంభీర రవంబుతో శివుఁడు లోద్రోహి! హుం! పోకు ర
మ్మ ని కెంగేలఁ దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
ని సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్.

(తెభా-8-243-వ.)[మార్చు]

అయ్యవిరళ మహాగరళదహన పాన సమయంబున.

(తెభా-8-244-మ.)[మార్చు]

లం బాఱవు పాఁప పేరు; లొడలన్ ర్మాంబుజాలంబు పు
ట్ట దు ; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;
నాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
దిలుండై కడి జేయుచోఁ దిగుచుచో క్షించుచో మ్రింగుచోన్.

(తెభా-8-245-క.)[మార్చు]

రము లోకంబులకును
నం బగు టెఱిఁగి శివుఁడు టుల విషాగ్నిం
గు దురుకొనఁ గంఠబిలమున
దిలంబుగ నిలిపె సూక్ష్మలరసము క్రియన్.

(తెభా-8-246-క.)[మార్చు]

మె చ్చిన మచ్చిక గలిగిన
ని చ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం
జి చ్చుఁ గడిగొనఁగ వచ్చునె
చి చ్చఱరూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్.

(తెభా-8-247-ఆ.)[మార్చు]

రుఁడు గళమునందు హాలహలము బెట్టఁ
ప్పుఁ గలిగి తొడవు రణి నొప్పె;
సాధురక్షణంబు జ్జనులకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!

(తెభా-8-248-వ.)[మార్చు]

తదనంతరంబ

(తెభా-8-249-క.)[మార్చు]

ళంబుఁ గంఠబిలమున
రుఁడు ధరించుటకు మెచ్చి యౌ నౌ ననుచున్
రియు విరించియు నుమయును
సు నాథుఁడుఁ బొగడి రంత సుస్థిరమతితోన్.

(తెభా-8-250-క.)[మార్చు]

హా లాహల భక్షణ కథ
హే లాగతి విన్న వ్రాయ నెలమిఁ బఠింపన్
వ్యా ళానల వృశ్చికముల
పా లై చెడ రెట్టిజనులు యవిరహితులై.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:28, 19 సెప్టెంబరు 2016 (UTC)