Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/శివుని గరళ భక్షణకై వేడుట

వికీసోర్స్ నుండి

శివునిగరళభక్షణకైవేడుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-218-వ.
అప్పుడు
టీక:- అప్పుడు = ఆ సమయునందు.
భావము:- అలా హాలహలం వ్యాపిస్తున్న సమయంలో. . . .

తెభా-8-219-మ.
ని కైలాసముఁ జొచ్చి శంకరుని వాద్వారముం జేరి యీ
శుని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి "కుయ్యో! మొఱో!
విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు" మం చంబుజా
ముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.

టీక:- చని = వెళ్ళి; కైలాసమున్ = కైలాసమునందు; చొచ్చి = ప్రవేశించి; శంకరుని = పరమశివుని {శంకరుడు - సుఖమును కలుగజేయు వాడు}; వాస = నివాసపు; ద్వారమున్ = ప్రవేశమును; చేరి = సమీపించి; ఈశుని = పరమశివుని; దౌవారికులు = ద్వారపాలకులు; అడ్డపడన్ = అడ్డుపడగా; తలము = తొలగుము; అంచున్ = అనుచు; చొచ్చి = ప్రవేశించి; కుయ్యోమొఱో = అమ్మబాబోయ్; వినుము = వినుము; ఆలింపుము = ఆలకించుము; చిత్తగింపుము = తలచుము; దయన్ = దయతో; వీక్షింపుము = చూడుము; అంచున్ = అనుచు; అంబుజాసన = బ్రహ్మదేవుడు {అంబుజాసనుడు - అంబుజము (పద్మము)న ఆసనుడు (ఆసీనుడగువాడు), బ్రహ్మ}; ముఖ్యుల్ = మొదలగువారు; కనిరి = దర్శించిరి; ఆర్త = దుఃఖపడినవారిని; రక్షణ = కాపాడెడి; కళా = కళయందు; సంరంభుని = వేగిరిపాటుగలవానిని; శంభునిన్ = పరమశివుని.
భావము:- ఆ సమయంలో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తితో ఆశ్రయించిన వారిని కాపాడే వాడూ, సుఖప్రదాతా అయిన శంకరుని వేడుటకు కైలాసానికి వెళ్ళారు. పరమశివుని మందిరం ద్వారపాలకులు అడ్డుకున్నారు. కానీ వారిని తప్పుకోమని లోనికి ప్రవేశించి ఈశ్వరుని దర్శనం చేసుకుని “శరణు, శరణు చిత్తగించు దయతో చూడు, కాపాడు” అంటూ మొరపెట్టుకున్నారు.

తెభా-8-220-క.
వాలు దీనత వచ్చుటఁ
గూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురుఁ దానుం
బేరోలగమున నుండి ద
యాతుఁడై చంద్రచూడుఁ వసర మిచ్చెన్.

టీక:- వారలు = వారు; దీనతన్ = ఆర్తితో; వచ్చుటన్ = వచ్చుటను; కూరిమి = ప్రేమ; తోన్ = తోటి; ఎఱిగి = తెలిసికొని; దక్షుకూతురున్ = సతీదేవి {దక్షు కూతురు - దక్షుని కూతురు, సతి}; తానున్ = తను; పేరోలగమున = నిండుసభతీరి; ఉండి = ఉండి; దయా = కనికరించుట యందు; రతుడు = ప్రీతిగలవాడు; ఐ = అయ్యి; చంద్రచూడుడు = పరమశివుడు {చంద్రచూడుడు - చంద్రకళ చూడామణిగా కలవాడు, శివుడు}; అవసరమిచ్చెన్ = దర్శనమిచ్చెను.
భావము:- అలా దేవతలు దుఃఖంతో వచ్చుటను దయామయుడైన చంద్రరేఖను భూషణంగా ధరించే శంకరుడు చూసాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరోలగంలో ఉన్న శివుడు దేవతలకు దర్శనం ఇచ్చి ఆదరంగా చెప్పుకోండి మీ విన్నపం అన్నాడు.

తెభా-8-221-వ.
అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి.
టీక:- అప్పుడు = అప్పుడు; భోగిభూషణున్ = పరమశివుని {భోగిభూషణుడు - భోగి (పాము)లను భూషణుడు (అలంకారముగాగలవాడు), శివుడు}; కున్ = కి; సాష్టాంగదండప్రణామంబులు = సాగిలపడినమస్కారములు; కావించి = చేసి; ప్రజాపతి = బ్రహ్మదేవుడు; ముఖ్యుల్ = మున్నగువారు; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతించిరి = స్తోత్రముచేసిరి.
భావము:- అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు, బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు.

తెభా-8-222-సీ.
"భూతాత్మ! భూతేశ! భూత భావనరూప!-
దేవ! మహాదేవ! దేవవంద్య!
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ-
బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ;
యార్త శరణ్యుండ గు గురుండవు నిన్నుఁ-
గోరి భజింతురు కుశలమతులు;
కల సృష్టిస్థితిసంహారకర్తవై-
బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ రఁగు దీవ;

తెభా-8-222.1-ఆ.
రమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త
మంబు నీవ శక్తియుఁడ వీవ;
బ్దయోని వీవ; గదంతరాత్మవు
నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు.

టీక:- భూతాత్మ = పరమశివ {భూతాత్ముడు - పంచభూతములకు ఆత్మయైనవాడు, శివుడు}; భూతేశ = పరమశివ {భూతేశుడు - భూతములకు ఈశుడు (పతి), శివుడు}; భూతభావనరూప = పరమశివ {భూతభావనరూపుడు - జీవులకు కారణరూపమైనవాడు, శివుడు}; దేవ = పరమశివ; మహాదేవ = పరమశివ {మహాదేవుడు - మహా (గొప్ప) దేవుడు, శివుడు}; దేవవంద్య = పరమశివ {దేవవంద్యుడు - దేవతలచే వంద్యుడు (స్తుతింపబడువాడు), శివుడు}; ఈ = ఈ; లోకముల్ = లోకముల; ఎల్లన్ = అన్నిటికి; ఈశ్వరుండవు = భగవంతుడవు; నీవ = నీవే; బంధ = బంధములకు; మోక్షముల్ = ముక్తుల; కున్ = కు; ప్రభుడవు = విభుడవు; నీవ = నీవే; ఆర్త = దుఃఖించెడివారికి; శరణ్యుండవు = శరణము ఇచ్చువాడవు; అగు = అయిన; గురుండవు = గొప్పవాడవు; నిన్నున్ = నిన్ను; కోరి = కోరి; భజింతురు = సేవించెదరు; కుశలమతులు = జ్ఞానులు; సకల = సమస్తమైన; సృష్టి = సృష్టి; స్థితి = స్థితి; సంహార = లయ; కర్తవు = కారణుడవు; ఐ = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; విష్ణు = విష్ణుమూర్తి; శివ = పరమశివుడు; ఆఖ్యన్ = పేర్లతో; పరగుదు = ప్రకాశించెడివాడవు; ఈవ = నీవే.
పరమ = అత్యధికమైన; గుహ్యము = రహస్యము; అయిన = ఐన; బ్రహ్మంబు = బ్రహ్మము; సత్ = సత్తు; అసత్ = అసత్తులతో; తమంబు = కూడినవాడవు; నీవ = నీవే; శక్తిమయుడవు = శక్తియుక్తుడవు {శక్తి - 1సత్త్వ 2రజస్ 3తమస్సులు}; ఈవ = నీవే; శబ్దయోనివి = శబ్దమునకు జన్మస్థానమవు; జగత్ = లోకమంతటికి; ఆత్మవు = అంతరాత్మవు; నీవ = నీవే; ప్రాణము = జీవము; అరయ = తరచిచూసినచో; నిఖిలమున్ = సమస్తమున; కు = కు.
భావము:- “ఓ పరమేశ్వరా! పంచ భూతాలకూ ఆత్మ అయిన వాడా! సర్వ భూతాలకూ అధినాథా! జీవులకు కారణమైన రూపమైన దేవా! ఓ దైవమా! మహాదేవా! దేవతలకు వందనీయుడా! ఈ లోకాలు అన్నిటికి ప్రభువు నీవే; సంసారబంధాలలో పడుట, మోక్షమూ ఏది అనుగ్రహించాలన్నా నీవల్లనే సాధ్యం అవుతుంది; జ్ఞానులు ఆర్తులకు శరణు ఇచ్చేవాడూ, ఆదిగురువు అయిన నిన్ను కోరి ప్రార్థిస్తారు; సృష్టి, స్థితి, సంహార కార్యాలు సమస్తమునకు కారణ భూతుడవు అయి; బ్రహ్మ విష్ణు శివ పేర్లుతో విరాజిల్లుతుంటావు; భావానికి అందని పరబ్రహ్మవు; సదసద్రూప పరమాత్మవూ నీవే; శక్తి యుక్తుడవు నీవే; శబ్దానికి జన్మస్థానం అయిన శబ్దబ్రహ్మము నీవే; లోకానికి అంతరాత్మవు నీవే; సర్వ చరాచరాలకు ప్రాణము నీవే;

తెభా-8-223-క.
నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీ యంద లయముఁ బొందును
నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!

టీక:- నీ = నీ; అంద = లోనే; సంభవించును = కలుగును; నీ = నీ; అంద = లోనే; వసించి = నివసించి; ఉండున్ = ఉండును; నిఖిల = సమస్తమైన; జగములున్ = లోకములును; నీ = నీ; అంద = లొనే; లయమున్ = కలిసిపోవుట; పొందును = పొందుతాయి; నీ = నీ యొక్క; ఉదరము = కడుపు; సర్వ = అఖిల; భూత = జీవజాలములకు; నిలయము = నివాసము; రుద్రా = పరమశివా.
భావము:- రుద్రదేవా! అన్నిలోకాలు నీలోనే పుడతాయి; నీలోనే నివసిస్తాయి; ప్రాణులు అన్ని నీలోనే లయమవుతాయి; నీ ఉదరం ప్రాణులు అన్నిటికి అలవాలం.

తెభా-8-224-సీ.
గ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ-
కాలంబు గతి; రత్నర్భ పదము;
శ్వసనంబు నీ యూర్పు; సన జలేశుండు-
దిశలుఁ గర్ణంబులు; దివము నాభి;
సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు-
ఠరంబు జలధులు; దలు శిరము;
ర్వౌషధులు రోమయములు; శల్యంబు-
ద్రులు; మానస మృతకరుఁడు;

తెభా-8-224.1-తే.
ఛందములు ధాతువులు; ధర్మమితి హృదయ;
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు;
యిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు.

టీక:- అగ్ని = అగ్ని; ముఖంబున్ = ముఖము; పర = పరమాత్మ; అపర = జీవాత్మ; ఆత్మకము = కలయిక; ఆత్మ = ఆత్మ; కాలంబు = కాలము; గతి = నడక; రత్నగర్భ = సముద్రము {రత్నగర్భ - రత్నములు గర్భమునగలది, సముద్రము}; పదము = పాదము; శ్వసనంబు = వాయువు; నీ = నీ యొక్క; ఊర్పు = శ్వాస; రసన = నాలుక; జలేశుండు = వరుణుడు {జలేశుడు - నీటికి ప్రభువు, వరుణుడు}; దిశలున్ = దిక్కులు; కర్ణంబులు = చెవులు; దివము = పగలు; నాభి = బొడ్డు; సూర్యుండు = సూర్యుడు; కన్నులు = నేత్రములు; శుక్రంబు = వీర్యము; సలిలంబు = నీరు; జఠరంబు = గర్భము; జలధులు = సముద్రములు {జలధి - జలమునకు నిధి, సముద్రము}; చదలు = ఆకాశము; శిరము = తల; సర్వ = సమస్తమైన; ఓషధులు = ఓషధులు; రోమ = రోమముల; చయములు = సమూహములు; శల్యంబు = ఎముకలు; అద్రులు = పర్వతములు; మానసము = మనస్సు; అమృతకరుడు = చంద్రుడు {అమృతకరుడు - అమృతమయములైన కరములు (కిరణములు) కలవాడు, చంద్రుడు}.
ఛందములు = వేదములు; ధాతువులు = సప్తధాతువులు {సప్తధాతువులు - 1వస 2అసృక్కు 3మాంసము 4మేధస్సు 5అస్థి 6మజ్జ 7శుక్లములు పక్షాంతరమున 1రోమ 2త్వక్ 3మాంస 5అస్థి 6స్నాయు 6మజ్జా 7ప్రాణములు}; ధర్మ = శాస్త్రధర్మముల; సమితి = సమూహములు; హృదయము = హృదయము; ఆస్య = ముఖములు; పంచకము = ఐదును; ఉపనిషత్ = ఉపనిషత్తుల; ఆహ్వయంబున్ = పేర్లు; అయిన = ఐన; నీ = నీ యొక్క; రూపు = స్వరూపము; పరతత్త్వము = ఆత్మజ్ఞానరూపము; ఐ = అయ్యి; శివ = శివుడు యనెడి; ఆఖ్యము = పేరుగలది; ఐ = అయ్యి; స్వయంజ్యోతి = స్వయంప్రకాశకుడవు; ఐ = అయ్యి; ఒప్పున్ = తగును; ఆద్యము = సృష్ట్యాదినుండిగలది; అగుచున్ = అగుచు.
భావము:- అగ్ని నీ ముఖము; జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు; కాలం నీ నడక; భూమండలం నీ పాదం; వాయువు నీ శ్వాస; వరుణుడు నా నాలుక; దిక్కులు నీ చెవులు; స్వర్గం నీ నాభి; సూర్యుడు నీ దృష్టి; నీరు నీ వీర్యం; సముద్రాలు నీ గర్భం; ఆకాశం నీ శిరస్సు; ఓషదులు నీ రోమ సమూహాలు; పర్వతాలు నీ ఎముకలగూడు; చంద్రుడు నీ మనస్సు; వేదాలు నీ ధాతువు; ధర్మశాస్త్రాలు నీ హృదయం; ఉపనిషత్తులు నీ ముఖాలు; నీ రూపం పరతత్వం; నీవు స్వయంప్రకాశుడవు; శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు.

తెభా-8-225-క.
కొంఱు గలఁ డందురు నినుఁ;
గొంఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొంఱు; గలఁ డని లేఁ డని
కొంల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

టీక:- కొందఱు = కొంతమంది; కలడు = ఉన్నాడు; అందురు = అనెదరు; నినున్ = నిన్ను; కొందఱు = కొంతమంది; లేడు = లేడు; అందురు = అనెదరు; అతడు = అతడు; గుణిగాడు = సగుణుడవు; అనుచున్ = అనుచుండ; కొందఱు = కొంతమంది; కలడు = ఉన్నాడు; లేడు = లేడు; అని = అని; కొందలము = కలత; అందుదురు = చెందెదరు; నిన్నున్ = నిన్ను; గూర్చి = గురించి; మహేశా = పరమశివా {మహేశుడు - మహా ఈశుడు, శివుడు}.
భావము:- ఓ పరమేశ్వరా! మహాప్రభూ! కొందరు నీవు ఉన్నావు అంటారు. కొందరు నీవు లేవు అంటారు. ఇంకా కొందరు నీవు సగుణరూపుడవు అంటారు. మరికొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు.

తెభా-8-226-సీ.
లఁపఁ బ్రాణేంద్రియ ద్రవ్యగుణస్వభా-
వుఁడవు; కాలక్రతువులును నీవ;
త్యంబు ధర్మ మక్షరము ఋతంబును-
నీవ ముఖ్యుండవు నిఖిలమునకు;
ఛందోమయుండవు త్త్వరజస్తమ-
శ్చక్షుండవై యుందు; ర్వరూప
కామ పురాధ్వర కాలగరాది భూ-
ద్రోహభయము చోద్యంబు గాదు;

తెభా-8-226.1-తే.
లీలలోచనవహ్ని స్ఫులింగ శిఖల
నంతకాదులఁ గాల్చిన ట్టి నీకు
రాజఖండావతంస! పురాణ పురుష!
దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ!

టీక:- తలపన్ = ఆలోచించిచూసినచో; ప్రాణ = జీవము; ఇంద్రియ = ఇంద్రియములు; ద్రవ్య = పదార్థములు; గుణ = గుణములు; స్వ = నిజ; భావుండవు = భావములే యైనవాడవు; కాల = కాలము; క్రతువులును = యజ్ఞములును; నీవ = నీవే; సత్యంబున్ = విహితమైన అంశము; ధర్మము = ధర్మము; అక్షరమున్ = ఓంకారము; ఋతంబును = అనిషిద్దమైన విషయము; నీవ = నీవే; ముఖ్యుండవు = ఆధారభూతుడవు; నిఖిలమున్ = సమస్తమున; కున్ = కు; ఛందోమయుండవు = వేదరూపుడవు; సత్త్వ = సత్త్వగుణము; రజస్ = గజోగుణము; తమస్ = తమోగుణము; చక్షుండవు = నేత్రములుగాగలవాడవు; ఐ = అయ్యి; ఉందు = ఉంటావు; సర్వ = సమస్తమైన; రూప = రూపములునైనవాడ; కామ = మన్మథుడు; పుర = త్రిపురాసురులు; అధ్వర = దక్ష యజ్ఞము; కాలగర = కాలకూటవిషము; ఆది = మున్నగువాని వలన; భూత = జీవ; ద్రోహ = హాని యనెడి; భయము = సంకోచము; చోద్యంబుగాదు = ఏమాత్రము లేదు.
లీలన్ = క్రీడగా; లోచన = కంటి; వహ్ని = మంటల; స్ఫులింగ = అగ్నికణముల; శిఖలన్ = సెగలచే; అంతక = యముడు; ఆదులన్ = మొదలగువారిని; కాల్చిన = కాల్చివేసిన; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; రాజ = చంద్ర; ఖండ = కళ; అవతంస = సిగబంతిగాగలవాడ; పురాణ = సృష్ట్యాదినుండిగల; పురుష = పురుషుడా; దీన = దీనులను; రక్షక = రక్షించువాడా; కరుణ = దయా; ఆత్మ = స్వరూప; దేవదేవ = దేవతలకేదేవుడా.
భావము:- చంద్ర కళను శిరసున ధరించు వాడా! పురాణ పురుషుడా! దీనులను రక్షించువాడా! దయామయా! దేవ దేవ! తరచి చూస్తే ప్రాణమూ, ఇంద్రియాలూ, ద్రవ్యమూ, గుణాలూ సర్వం నీ స్వభావసిద్ధాలు. కాలమూ యజ్ఞమూ నీవే; సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ నీవే; అన్నింటికి నీవే ఆధారం; వేదరూపుడవు నీవే; సత్త్వము, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలూ నీవు నేత్రాలుగా కలిగి ఉంటావు; సమస్తమైన రూపాలు నీవే; లీలగా చూసే నీ మూడోకన్ను చూపుల మంటలతో యమాదులను సైతం భస్మం చేస్తావు; మన్మథుడు, త్రిపురాసురులు, దక్షయజ్ఞం, కాలకూటవిషం మున్నగు సర్వ భాతాల వలన నీకు హాని కలుగుతుంది అని సంకోచం అన్నది లేకపోవటంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు.

తెభా-8-227-ఆ.
మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు
మూఁడు కాలములకు మూల మగుచు
భేద మగుచుఁ దుది నభేదమై యొప్పారు
బ్రహ్మ మనఁగ నీవ ఫాలనయన!

టీక:- మూడుమూర్తుల్ = త్రిమూర్తుల {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరులు}; కును = కు; మూడులోకముల్ = ముల్లోకముల {ముల్లోకములు - 1భూః 2భువః 3సువః పక్షాంతరమున 1భూలోకము 2మర్త్యలోకము 3పాతాళలోకములు}; కును = కు; మూడుకాలముల్ = కాలత్రయమున {కాలత్రయము - 1భూత 2భవిష్య 3వర్తమానకాలములు}; కున్ = కు; మూలము = ఆధారభూతుడవు; అగుచున్ = అగుచు; భేదము = ద్వైతము; అగుచున్ = అగుచును; తుదిని = చివరకు; అభేదము = అద్వైతము; ఐ = అయ్యి; ఒప్పారు = ఒప్పుతున్న; బ్రహ్మము = పరబ్రహ్మము; అనగన్ = అంటే; నీవ = నీవే; ఫాలనయన = ఆదిశంకర {ఫాలనయనుడు - ఫాల (నుదుట) నయనుడు (కన్నుగలవాడు), శివుడు}.
భావము:- నుదుట కన్ను గల ముక్కంటి! శంకరా! ముగ్గురు మూర్తులకూ, మూడులోకాలకూ, మూడు కాలాలకూ నీవే మూలం. మొదట భేదంతో కనిపించినా, చివరకి అభేద స్వరూపంతో ఒప్పారుతుండే పరబ్రహ్మవు నీవే.

తెభా-8-228-క.
సత్తత్త్వ చరాచర
నం బగు నిన్నుఁ బొగడ లజభవాదుల్
పెవులుఁ గదలుప వెఱతురు
లక నినుఁ బొగడ నెంతవారము రుద్రా!

టీక:- సదసత్తత్త్వ = సదసద్రూపమైన; చరాచర = చరాచర ప్రపంచమునకు; సదనంబు = మూలాధారము; అగు = ఐన; నిన్నున్ = నిన్ను; పొగడన్ = కీర్తించుటకు; జలజభవ = బ్రహ్మదేవుడు {జలజభవుడు - జలజము (పద్మము)న భవుడు (జనించినవాడు), బ్రహ్మ}; ఆదుల్ = మున్నగువారు; పెదవులున్ = పెదవులను; కదలుపన్ = కదల్చుటకు; వెఱతురు = భయపడెదరు; వదలకు = పట్టుదలగా; నినున్ = నిన్ను; పొగడన్ = స్తుతించుటకు; ఎంతవారము = మేమెంతవారము; రుద్రా = శంకరా.
భావము:- దేవా! శంకరా! సదసద్రూపమైన ఈ చరాచర జగత్తునకు మూలాధారం నీవు. బ్రహ్మాదులు సైతం నిన్ను ప్రస్తుతించడానికి భయపడి పెదవులు కదల్చలేరు. అంతటి నిన్ను స్తుతించడానికి మేము ఏమాత్రం సరిపోము కదా!

తెభా-8-229-మత్త.
బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోమున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

టీక:- బాహు = భుజ; శక్తిన్ = బలముతో; సుర = దేవతలు; అసురుల్ = రాక్షసులు; చని = వెళ్ళి; పాలవెల్లిన్ = పాలసముద్రమును; మథింపన్ = చిలుకగా; హాలాహలంబున్ = హాలాహలవిషము; జనించెన్ = పుట్టెను; ఏరికిన్ = ఎవరికిని; అలంఘ్యము = దాటరానిది; ఐ = అయ్యి; భువనంబున్ = లోకములను; కోలాహలంబుగన్ = లబలబలాడునదిగా; చేసి = చేసి; చిచ్చును = అగ్నితాపము; లాగమున్ = లాఘవముగా; కొని = స్వీకరించి; ప్రాణి = జీవ; సందోహమున్ = జాలమును; బ్రతికింపవే = కాపాడుము; దయ = దయ; తొంగలింపన్ = అతిశయించు, ప్రకాశించు, వికసించు, వర్ధిల్లు, స్రవించగా; ఈశ్వరా = శంకరుడా.
భావము:- ఓ పరమేశ్వరా! దేవతలూ రాక్షసులూ కలిసి భుజబలాలు వాడి పాల సముద్రాన్ని మథించారు. దానిలోనుంచి హాలాహలం అనే మహా విషం పుట్టింది. లోకాలను క్షోభ పెడుతోంది. అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. అతిశయించిన దయ జాలువారగా ప్రాణికోటిని అనుగ్రహించు. ఆ హాలాహల విషాన్ని పరిగ్రహించు.
'శివా! నీ దయ అతిశయించునట్లు, వికసించునట్లు ప్రకాశింప జేయవయ్యా అలా దయాసాగరా నీ దయ వర్షించకపోతే లోకాలు ఈ హాలాహల విషాగ్నికి కాగిపోతాయయ్యా.' ఇంతటి చిక్కనైన భావాన్ని 'దయదొంగలింపన్' (దయ + తొంగలింపగా) కాపాడవయా అనే భావ ప్రకటనతో అలవోకగా చెప్పిన పోతనామాత్యులకు ప్రణామములు.

తెభా-8-230-క.
లంటము నివారింపను
సందఁ గృపజేయ జయము సంపాదింపం
జంపెడివారి వధింపను
సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా!

టీక:- లంపటము = ఆపదను, తగులమును; నివారింపను = తొలగించుట; సంపదన్ = సంపదలను; కృపజేయ = ప్రసాదించుట; జయము = జయయును; సంపాదింపన్ = సంపాదించుట; చంపెడివారిన్ = క్రూరులను; వధింపను = సంహరించుట; సొంపారగన్ = చక్కగా చేయుట; నీక = నీకుమాత్రమే; చెల్లున్ = తగినది; సోమార్ధధరా = శంకరుడా {సోమార్ధధరుడు - సోమ (చంద్ర) అర్ధ (ఖండమును) ధర (ధరించినవాడు), శివుడు}.
భావము:- అర్థచంద్రుని అలంకారంగా ధరించిన మహా ప్రభూ! పరమేశ్వరా! ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికీ, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడవు.

తెభా-8-231-క.
నీకంటె నొండెఱుంగము;
నీకంటెం బరులు గావ నేరరు జగముల్;
నీకంటె నొడయఁ డెవ్వఁడు
లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!"

టీక:- నీకున్ = నీకు; కంటెన్ = కంటె; ఒండు = మరొకరిని; ఎఱుంగము = తెలియము; నీకున్ = నీకు; కంటెన్ = కంటెను; పరులు = ఇతరులు; కావన్ = కాపాడుటకు; నేరరు = సమర్థులుకారు; జగముల్ = లోకములను; నీకున్ = నీకు; కంటెన్ = కంటె; ఒడయడు = నాథుడు; ఎవ్వడు = ఎవరు కలరు; లోకంబుల్ = లోకముల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికి; నిఖిల = సమస్తమైన; లోక = లోకములచేత; స్తుత్యా = కీర్తింపబడువాడా.
భావము:- సమస్తలోకాల యందూ కీర్తింపబడు స్వామీ! శివా! నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరినీ ఆశ్రయింపము. నీవు తప్ప మరెవ్వరూ లోకాలను కాపాడలేరు. నిన్ను మించిన గొప్పవాడు మరెవ్వరూ లేరు.