పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/శివుని గరళ భక్షణకై వేడుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శివునిగరళభక్షణకైవేడుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-219-మ.)[మార్చు]

ని కైలాసముఁ జొచ్చి శంకరుని వాద్వారముం జేరి యీ
శు ని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి కుయ్యో మొఱో
వి ను ; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు మం చంబుజా
ముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.

(తెభా-8-220-క.)[మార్చు]

వా లు దీనత వచ్చుటఁ
గూ రిమితో నెఱిఁగి దక్షుకూఁతురుఁ దానుం
బే రోలగమున నుండి ద
యా తుఁడై చంద్రచూడుఁ వసర మిచ్చెన్.

(తెభా-8-221-వ.)[మార్చు]

అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి.

(తెభా-8-222-సీ.)[మార్చు]

భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! ;
దేవ! మహాదేవ! దేవవంద్య!
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ;
బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ;
యార్త శరణ్యుండ గు గురుండవు నిన్నుఁ;
గోరి భజింతురు కుశలమతులు;
కల సృష్టిస్థితిసంహారకర్తవై;
బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ రఁగు దీవ;

(తెభా-8-222.1-ఆ.)[మార్చు]

రమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త
మంబు నీవ శక్తియుఁడ వీవ;
బ్దయోని వీవ; గదంతరాత్మవు
నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు.

(తెభా-8-223-క.)[మార్చు]

నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీ యంద లయముఁ బొందును
నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!

(తెభా-8-224-సీ.)[మార్చు]

గ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ;
కాలంబు గతి; రత్నర్భ పదము;
శ్వసనంబు నీ యూర్పు; సన జలేశుండు;
దిశలుఁ గర్ణంబులు; దివము నాభి;
సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు;
ఠరంబు జలధులు; దలు శిరము;
ర్వౌషధులు రోమయములు; శల్యంబు;
ద్రులు; మానస మృతకరుఁడు;

(తెభా-8-224.1-తే.)[మార్చు]

ఛందములు ధాతువులు; ధర్మమితి హృదయ;
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు;
యిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు.

(తెభా-8-225-క.)[మార్చు]

కొం ఱు గలఁ డందురు నినుఁ;
గొం ఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొం ఱు; గలఁ డని లేఁ డని
కొం ల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

(తెభా-8-226-సీ.)[మార్చు]

లఁపఁ బ్రాణేంద్రియ ద్రవ్యగుణస్వభా;
వుఁడవు; కాలక్రతువులును నీవ;
త్యంబు ధర్మ మక్షరము ఋతంబును;
నీవ ముఖ్యుండవు నిఖిలమునకు;
ఛందోమయుండవు త్త్వరజస్తమ;
శ్చక్షుండవై యుందు; ర్వరూప
కామ పురాధ్వర కాలగరాది భూ;
ద్రోహభయము చోద్యంబు గాదు;

(తెభా-8-226.1-తే.)[మార్చు]

లీలలోచనవహ్ని స్ఫులింగ శిఖల
నంతకాదులఁ గాల్చిన ట్టి నీకు
రాజఖండావతంస! పురాణ పురుష!
దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ!

(తెభా-8-227-ఆ.)[మార్చు]

మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు
మూఁడు కాలములకు మూల మగుచు
భేద మగుచుఁ దుది నభేదమై యొప్పారు
బ్రహ్మ మనఁగ నీవ ఫాలనయన!

(తెభా-8-228-క.)[మార్చు]

సత్తత్త్వ చరాచర
నం బగు నిన్నుఁ బొగడ లజభవాదుల్
పె వులుఁ గదలుప వెఱతురు
లక నినుఁ బొగడ నెంతవారము రుద్రా!

(తెభా-8-229-మత్త.)[మార్చు]

బా హుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లా లంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లా లంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దో మున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

(తెభా-8-230-క.)[మార్చు]

లం టము నివారింపను
సం దఁ గృపజేయ జయము సంపాదింపం
జం పెడివారి వధింపను
సొం పారఁగ నీక చెల్లు సోమార్ధధరా!

(తెభా-8-231-క.)[మార్చు]

నీ కంటె నొండెఱుంగము;
నీ కంటెం బరులు గావ నేరరు జగముల్;
నీ కంటె నొడయఁ డెవ్వఁడు
లో కంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:27, 19 సెప్టెంబరు 2016 (UTC)