పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ఉచ్చైశ్రవావిర్భవము

వికీసోర్స్ నుండి

ఉచ్చైశ్రవావిర్భవము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-255-క.
చ్చంద్రపాండురంబై
యుచ్చైశ్రవ మనఁగఁ దురగ మొగి జనియించెం
బుచ్చి కొనియె బలి దైత్యుం
డిచ్చ గొనం డయ్యె నింద్రుఁ డీశ్వరశిక్షన్.

టీక:- సత్ = స్వచ్ఛమైన; చంద్ర = చంద్రుని వంటి; పాండురంబు = తెల్లదనముగలది; ఐ = అయ్యి; ఉచ్చైశ్రవము = ఉచ్చైశ్రవము; అనగా = అనబడెడి; తురగము = గుఱ్ఱము; ఒగిన్ = లెస్సగా; జనియించెన్ = పుట్టెను; పుచ్చుకొనియెన్ = తీసికొనెను; బలి = బలి యనెడి; దైత్యుండు = రాక్షసుడు; ఇచ్చన్ = కోరి; కొనండయ్యన్ = తీసుకొనుటలేదు; ఇంద్రుడు = ఇంద్రుడు; ఈశ్వర = నారాయణుని; శిక్షన్ = ప్రేరణవలన;
భావము:- చంద్రుడంత తెల్లగా ఉండే “ఉచ్ఛైశ్రవము” అనే గుఱ్ఱం పాలసముద్రం నుండి లెస్సగా పుట్టింది. విష్ణుమూర్తి సూచన మేరకు, దానిని ఇంద్రుడు తీసుకోలేదు. దానిని రాక్షసరాజు బలి కావాలని తీసుకున్నాడు.

తెభా-8-256-క.
పగు నురమును బిఱుఁదును
నెఱిఁ దోఁకయు ముఖముసిరియు నిర్మలఖురముల్
కుచచెవులుఁ దెలిఁగన్నులు
చగు కందంబుఁ జూడఁ గు నా హరికిన్.

టీక:- ఒఱపు = దృఢమైన; ఉరమునున్ = రొమ్ము; పిఱుదునున్ = పిరుదులు; నెఱిన్ = నిండైన; తోకయున్ = తోక; ముఖము = ముఖము; సిరియు = శోభ; నిర్మల = స్వచ్ఛమైన; ఖురములున్ = గిట్టలు; కుఱుచ = పొట్టి; చెవులున్ = చెవులు; తెలి = తెల్లని; కన్నులున్ = కళ్ళు; తఱచు = దళసరిదైన; అగు = అయినట్టి; కందంబునున్ = కంఠము; చూడన్ = చూచుటకు; తగున్ = తగిననట్టివి; ఆ = ఆ; హరి = గుఱ్ఱమున; కిన్ = కు.
భావము:- ఆ ఉచ్ఛైశ్రవము అనే ఆ హరి (గుఱ్ఱం) దృఢమైన రొమ్మూ, చిక్కని పిరుదునూ, చక్కటి తోకా, కాంతివంతంగా తళతళలాడే ముఖమూ, స్వచ్ఛమైన గిట్టలూ, పొట్టి చెవులు, శుభ్రమైన కన్నులూ, బలమైన మెడ కలిగి చూడముచ్చటగా ఉంది.

తెభా-8-257-వ.
అంత నా పాలకుప్ప యందు.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; పాలకుప్ప = పాలసముద్రము; అందున్ = లో.
భావము:- ఉచ్ఛైశ్రవం పుట్టిన తరువాత క్షీరసాగర మథనంలో . . . .