పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వైవశ్వతమనువు చరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

7వైవశ్వతమనువు చరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-411-తే.)[మార్చు]

రవరాధీశ! యిప్పుడు డచుచున్న
వాఁడు సప్తమ మనువు వైస్వతుండు;
శ్రాద్ధదేవుం డనందగు నవరేణ్య!
దురు నందను లతనికిఁ బ్రకట బలులు.

(తెభా-8-412-వ.)[మార్చు]

వారలిక్ష్వాకుండును, నభంగుండును, ధృష్టుండును, శర్యాతియు, నరిష్యంతుండును, నాభాగుండును, దిష్టుండును, గరూశకుండును, బృషద్ధ్రుం డును, వసుమంతుండును ననువారు పదుగురు రాజులు; పురందరుండను వా డింద్రుం; డాదిత్య మరుదశ్వి వసు రుద్ర సంజ్ఞలుఁ గలవారు దేవతలు; గౌతమ కశ్య పాత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వసిష్ఠు లనువారు సప్తర్షులయి యున్నవారు; అందుఁ గశ్యపున కదితి గర్భంబున విష్ణుండు వామనరూపుండై జనియించి యింద్రావరజుం డయ్యె; ఇప్పు డేడు మన్వంతరంబులు చెప్పంబడియె; రాఁగల మన్వంతరంబులును శ్రీహరి పరాక్రమంబునుం జెప్పెద దత్తావధానుండవై విను" మని శుకుం డిట్లనియె.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:13, 22 సెప్టెంబరు 2016 (UTC)