పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/విశ్వగర్భుని ఆవిర్భావము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విశ్వగర్భుని ఆవిర్భావము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-158-వ.)[మార్చు]

అని యిట్లు దేవగణసమేతుండై యనేక విధంబులం గీర్తించుచు నున్న పరమేష్ఠి యందుఁ గరుణించి దయాగరిష్ఠుండగు విశ్వగర్భుం డావిర్భవించె.

(తెభా-8-159-మ.)[మార్చు]

వేయర్కులు గూడిగట్టి కదుపై యుద్యత్ప్రభాభూతితో
నొ రూపై చనుదెంచుమాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్
వి లాలోకనులై; విషణ్ణమతులై; విభ్రాంతులై మ్రోలఁ గా
శంకించిరి కొంత ప్రొద్దు; విభుఁ గానం బోలునే వారికిన్.

(తెభా-8-160-వ.)[మార్చు]

అప్పుడు.

(తెభా-8-161-సీ.)[మార్చు]

హార కిరీట కేయూర కుండల పాద;
టక కాంచీలతా కంకణాది
కౌస్తుభోపేతంబుఁ గౌమోదకీ శంఖ;
క్ర శరాసన సంయుతంబు
రకతశ్యామంబు రసిజ నేత్రంబుఁ;
ర్ణాభరణ కాంతి గండ యుగముఁ
లిత కాంచనవర్ణ కౌశేయవస్త్రంబు;
శ్రీ వన మాలికా సేవితంబు

(తెభా-8-161.1-ఆ.)[మార్చు]

నై మనోహరంబునై దివ్యసౌభాగ్య
మైన యతని రూపు ర్ష మెసఁగ
జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును
బొంగి నమ్రుఁ డగుచుఁ బొగడఁ దొడఁగె.

(తెభా-8-162-క.)[మార్చు]

నస్థితిలయ దూరుని
ము నినుతు నిర్వాణసుఖ సముద్రుని సుగుణుం
నుతనునిఁ బృథుల పృథులుని
ఘాత్ము మహానుభావు భినందింతున్.

(తెభా-8-163-క.)[మార్చు]

పు రుషోత్తమ! నీ రూపము
మశ్రేయంబు భువన పంక్తుల కెల్లన్
స్థి వైదిక యోగంబున
రుసను మీ యంద కానచ్చెను మాకున్.

(తెభా-8-164-క.)[మార్చు]

మొ లును నీలోఁ దోఁచెను;
దు దియును నటఁ దోఁచె; నడుమ దోఁచెను; నీవే
మొ లు నడుమ దుది సృష్టికిఁ
దియఁగ ఘటమునకు మన్ను తి యగు మాడ్కిన్.

(తెభా-8-165-క.)[మార్చు]

నీ మాయ చేత విశ్వము
వే మాఱు సృజింతు వనుచు విష్ణుఁడ వనుచున్
ధీ మంతులు గుణపద విని
నే మంబున సగుణుఁడైన నినుఁ గాంతు రొగిన్.

(తెభా-8-166-ఆ.)[మార్చు]

న్న మవని యందు మృతంబు గోవుల
యందు వహ్ని సమిధలందు నమర
యోగవశతఁ బొందు నోజను బుద్ధిచే
గుణు నిన్నుఁ గాంతు రాత్మవిదులు.

(తెభా-8-167-మత్త.)[మార్చు]

ట్టులేక బహుప్రకార విన్న చిత్తులమైతి; మే
మె ట్టకేలకు నిన్నుఁ గంటి మభీప్సితార్థము వచ్చుఁ; బె
న్వె ట్టయైన దవానలంబున వేఁగు నేనుఁగు మొత్తముల్
ని ట్టవేర్చిన గంగలోపల నీరు గాంచిన చాడ్పునన్.

(తెభా-8-168-మత్త.)[మార్చు]

నీ కు నే మని విన్నవింతుము నీవు సర్వమయుండవై
లో మెల్లను నిండి యుండగ లోకలోచన! నీ పదా
లో నంబు శుభంబు మాకును లోకపాలకు లేను నీ
నా వాసులు నీవ వహ్నిఁ దర్చు కేతుతతిక్రియన్.

(తెభా-8-169-వ.)[మార్చు]

అని కమలసంభవ ప్రముఖులు వినుతి చేసి రని" చెప్పి నరేంద్రునకు శుకుం డిట్లనియె.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:50, 19 సెప్టెంబరు 2016 (UTC)