పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/రాహువు వృత్తాంతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాహువువృత్తాంతము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-321-వ.)[మార్చు]

అప్పుడు

(తెభా-8-322-మ.)[మార్చు]

రవ్రాతములోన జొచ్చి దివిజుండై రాహు పీయూష పా
ము జేయం గని చంద్రభాస్కరులు సన్నల్ చేయ నారాయణుం
రారాతిశిరంబు చక్రహతిఁ దున్మాడెన్ సుధాసిక్త మై
రత్వంబును జెందె మూర్ధముఁ దదన్యాంగంబు నేలం బడెన్.

(తెభా-8-323-ఆ.)[మార్చు]

జుఁడు వాని శిరము నంబరవీథిని
గ్రహము జేసి పెట్టి గారవించె;
వాఁడు పర్వములను వైరంబు దప్పక
భానుచంద్రములను ట్టు చుండు.

(తెభా-8-324-క.)[మార్చు]

బొట్టుఁ జిక్క కుండఁగ
ల సుధారసము నమర సంఘంబులకుం
బ్ర టించి పోసి హరి దన
సు రాకృతిఁ దాల్చె నసుర శూరులు బెగడన్.

(తెభా-8-325-మ.)[మార్చు]

రుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థా భిమానంబులన్
ములై లబ్దవికల్పు లైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర
య్య రారుల్; బహుదుఃఖముల్ గనిరి తా త్యంత దోర్గర్వులై;
లాక్షున్ శరణంబు వేఁడని జనుల్ ల్యాణ సంయుక్తులే.

(తెభా-8-326-క.)[మార్చు]

దా వు లమృతము ద్రావం
బూ ని పయోరాశిఁ ద్రచ్చి పొగిలిన మాడ్కిన్
శ్రీ నాథ పరాఙ్ముఖులగు
హీ నులు పొందంగఁజాల రిష్టార్థంబుల్.

(తెభా-8-327-క.)[మార్చు]

శో ధించి జలధి నమృతము
సా ధించి నిలింపవైరి క్షుర్గతులన్
రో ధించి సురల కిడి హరి
బో ధించి ఖగేంద్రు నెక్కి పోయె నరేంద్రా!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:49, 22 సెప్టెంబరు 2016 (UTC)