పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/అమృతము పంచుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అమృతము పంచుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-310-క.)[మార్చు]

నా నేర్చుకొలది మీకును
మా నుగ విభజించి యిత్తు; మానుఁడు శంకన్
కా నిం డనవుడు నిచ్చిరి
దా వు లమృతంపుఁ గడవఁ రుణీమణికిన్.

(తెభా-8-311-క.)[మార్చు]

శాంతా లోకనములు
నా శీతల భాషణములు నా లాలితముల్
రా శి పరంపర లగుచుం
బా ములై వారి నోళ్ళు బంధించె నృపా!

(తెభా-8-312-వ.)[మార్చు]

ఇట్లు సుధాకలశంబు కేల నందికొని మందస్మిత భాషణంబుల సుందరీ రూపుఁ డగు ముకుందుండు "మేలుఁ గీ డనక నేనుఁ బంచియిచ్చిన తెఱంగున నంగీకరించుట కర్తవ్యం" బనవుడు "నగుంగాక" యని సురాసుర దైత్యదానవ సమూహం బుపవసించి కృతస్నానులై హోమంబు లాచరించి విప్రులకు గోభూహిరణ్యాది దానంబులు చేసి తదాశీః ప్రవచనంబులు గైకొని ధవళపరిధాను లై గంధమాల్య ధూపదీపాలంకృతం బగు కనకరత్నశాలా మధ్యంబునఁ బ్రాగగ్రకుశ పీఠంబులం బూర్వదిశాభిముఖులై పంక్తులుఁ గొని యున్న సమయంబున.

(తెభా-8-313-క.)[మార్చు]

శ్రో ణీభర కుచయుగ భర
వే ణీభరములను డస్సి వివిధాభరణ
క్వా యయి యువిద వచ్చెను
బా ణి సరోజమున నమృతభాండముఁ గొంచున్.

(తెభా-8-314-క.)[మార్చు]

భా సుర కుండల భాసిత
నా సాముఖ కర్ణ గండ యనాంచల యై
శ్రీ తి యగు సతిఁ గని దే
వా సుర యూధంబు మోహ మందె నరేంద్రా!

(తెభా-8-315-వ.)[మార్చు]

అప్పుడు

(తెభా-8-316-క.)[మార్చు]

సురుల కమృతము పోయుట
పొ గదు పాములకుఁ బాలు పోసిన మాడ్కిన్
దొ సఁగగు నంచును వేఱొక
దె సఁ గూర్చుండంగఁ బెట్టె దేవాహితులన్.

(తెభా-8-317-వ.)[మార్చు]

ఇట్లు రెండు పంక్తులుగా నేర్పరచి.

(తెభా-8-318-సీ.)[మార్చు]

వేగిర పడకుడీ వినుఁడు దానవులార! ;
డవు చేయక వత్తు దైత్యులార!
టు ప్రక్కఁ గూర్చుండుఁ ని కన్ను లల్లార్చి;
నుగవ పయ్యెద జాఱఁ దిగిచి
దినె మఱందుల వావులు కల్పించి;
ర్మంబు లెడలించి ఱుఁగు జేసి
మెల్లని నగవుల మేనులు మఱపించి;
డు జాణ మాటలఁ గాకు పఱచి

(తెభా-8-318.1-ఆ.)[మార్చు]

సుర వరుల నెల్ల డకించి సురలను
డవు జేయ వలదు; ద్రావుఁ డనుచు
చ్చు కొలఁది నమృతవారి విభాగించెఁ
రుణి దివిజు లెల్లఁ నిసి పొగడ.

(తెభా-8-319-వ.)[మార్చు]

అయ్యవసరంబున.

(తెభా-8-320-సీ.)[మార్చు]

నకు వేల్పులకును మందట లేకుండఁ;
బంచి పెట్టెద నని డఁతి పూనెఁ
దానేల తప్పును? ప్పదు తరళాక్షి;
గాక రమ్మనుచును డకఁ బిల్వ
ఱుమాట లాడదో ఱి చూడకుండునో;
ను గవఁ గప్పునో చాలు ననుచు
నొండాడఁ గలుగుచు నొక్కింత సొలయునో;
నయెడఁ గందునో గువ యనుచు

(తెభా-8-320.1-ఆ.)[మార్చు]

నెలతఁ చూడ్కి గముల నీరై కరంగుచుఁ
బ్రణయ భంగ భీతి ద్ధు లగుచు
నూరకుండ్రు గాని యువిద తే తెమ్మని
డుఁగ జాలరైరి సుర వరులు.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:47, 22 సెప్టెంబరు 2016 (UTC)